Sunday, 5 August 2018

యువత - భవిత - బాధ్యత - 1నుండి 5 వరకుష


యువత - భవిత - బాధ్యత

https://cherukuramamohan.blogspot.com/2018/08/blog-post.html

ఈ వ్యాసము యొక్క ప్రారంభమే ఒక విచిత్రము మరియు జుగుప్సాకరమైన విషయముతో 

ప్రారంభించుచున్నాను. ఈ ఆస్య గ్రంధిలో 'సాన్నిహిత్య అభ్యర్థనలు (Friendship 

Requests)' ఒక రెండు సంవత్సరముల క్రితము కొంతమంది స్వలింగ సంపర్కముపై 

మక్కువ ఎక్కువగా కలిగిన  యువకులు, వయసుమీరిన వారుకూడా  అభ్యర్థనలు 

పంపేవారు . వారి అభ్యర్ధన మన్నించే విషయములో నాదయిన శైలిలో స్పందించి 

మొక్కలోనే త్రుంచివేసే వాడిని. ఇంచుమించు ఒక 100 అభ్యర్థనలు ఆవిధమైనవి నాకు 

వచ్చి వుంటాయి. నేను ఒక నాలుగయిదుకు మించి పొరబాటు పడలేదు. అవికూడా ఒక 

56రోజులలోనే తెలిసిపోతుంది కాబట్టి వానిని విసర్జించటం జరిగి పోయింది. ఈ 

అభ్యర్థనలో భాగముగా ఒక కాలేజీ ప్రొఫెసర్ గా తన పరిచయ వాక్యములను ఆస్య 

గ్రంధిలో వ్రాసుకొన్న వ్యక్తి తన అభ్యర్థనను నాకు పంపినాడు. అతని ఛాయాచిత్రము 

కాలరేఖ పై లేదు. నేనతని పిచ్చాపాటి బల్ల(Chatting Board) పై, అంత చదివికూడా, 

ఛాయాచిత్రమును పెట్టే సభ్యత లేదా అని నిర్మొహమాటముగా అడిగినాను. దానికి ఉత్తర 

ప్రత్యుత్తరాలలో అతను తాను స్వలింగ సంపర్కమునకు అలవాటు పడిన వ్యక్తినని

అందువల్ల తాను ఛాయాచిత్రమును పెట్టలేదనితాను ఆ దురలవాటునకు దాసుడగు 

కాలములో నావంటివారు తటస్తపడలేదనిఆవిషయమును అశ్రునయనాలతో 

చెబుతున్నానని చెబుతూ తాను నా సహవాసమునకు తగనని తన అభ్యర్ధన వెనుకకు 

తీసుకొన్నాడు. ఇక్కడ నేను చెప్పదలచినది నా గొప్పదనమును గూర్చిగాదు. తన పెద్దలచే 

అంత సంస్కారము అందకపోయినాతన నైసర్గికములో అటువంటి ఉపదేశములు 

పొందకపోయినాఅంతర్లీనముగా  అతనిలోని పూర్వజన్మ వాసన అతని బుద్ధిని 

జాగృతము చేయగలిగింది. ఒక 7,8నెలలు జరిగిన తరువాత తనకు నాకు మధ్యన 

జరిగిన సంభాషణను గుర్తుచేస్తూ తాను దానిని సంపూర్ణముగా విడిచిపెట్టినట్లు నాకు 

ధన్యవాదములు తెలుపుతూ తన అభ్యర్థనను అంగీకరించమన్నాడు. ఇక్కడ మనము 

చేసిందెల్లా అతని ఆంతర్యము లోని పూర్వజన్మవాసనాను జాగృతము చేయడమే! 

అందరూ ఇట్లే ఉండకపోయినా 'అనగననగ రాగామతిశయిల్లుచు నుండు.....అని 

అంటారు కదా పెద్దలు. కావున వయసులో పెద్దలమైన మనము మన బాధ్యత నిర్వర్తించితే 

వారి బాధ్యతను వారికి గుర్తుచేసినవారమౌతాము. అందరిదీ ఒకేవిధమగు మనస్తత్వము 

ఉండదు. అరటిబత్తాయి పనస మూడూ ఎంతో రుచికరమగు ఫలితములను 

అందిస్తాయి. కానీ దానిని వేలికితీయుటకు  ఒకే మార్గము అనుసరించుట కుదరదు. 

వ్యక్తిని బట్టి సలహా వుండవలె. అంతే కాకుండా ఆ ఫలము కూడా పక్వత 

గాంచియుండవలె దానిని బోధకుడు కూడా గ్రహించి యుండవలె. లేకుంటే 'ఉభయ 

భ్రష్టుత్వము ఉపరి సన్యాసముఅన్నట్లవుతుంది.

ఒక వ్యక్తి సంఘమునకు ఉపయోగకారిగా ఎదగాలంటే దానికి ముఖ్య హేతువు అతని 

జనన ప్రస్థానములు. పేదరికమునకు సంస్కారమునకు సంబంధము లేదన్నది మనకు 

తెలిసినదే! సంస్కారమును బట్టి మాత్రమే ఒక వ్యక్తి ఆదర్శవంతుడౌతాడు,  అందుకే కదా 

జగద్గురువు శంకరాచార్యులవారు 'చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ

అన్నారు. బాలుడు అటువంటి ఒక సంస్కారమును మొదట పొందవలసినది తలిదండ్రుల 

ద్వారానే! ఒక 3 సంవత్సరముల వయసులో బాలుడు తన తల్లి జారిణి అని 

గమనించినాడనుకొందాముఆ వయసులో మనోవికారము ఏర్పడదుగానీ ఆ దృశ్యము 

అతని స్మృతిపథమునుండి దూరము కాదు. యుక్తవయస్కుడయిన తరువాత బాల్యములో 

నాట బడిన బీజము అప్పటికి వృక్షమై వుంటుంది. 'విత్తొకటి వేస్తే చెట్టొకటి 

మొలవదుకదా!ఆ తల్లి ఆ యువకుని చెడుగునకు కారణము తానేనని తెలిసి 

కుమిలిపోవలసిందే కానీ ఆతనికి ఉపదేశమునిచ్చే యోగ్యతకు దూరమైనది. తండ్రి 

విషయములో కూడా అంతే.  పిల్లలు సూక్ష్మగ్రాహులు. మనపనిలో మనముండి వారి 

ఉనికిని మరచిపోతే ఆతరువాత వారి విషయములో 'చేతులు కాలిన పిదప  ఆకులు 

పట్టుకునుటయే ఔతుంది.
ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతాను. ఒక రాజుకు తన పట్టపు రాణి ద్వారా కలిగిన ఇద్దరు కొడుకులు వుండేవారు. రెండవవాడు జన్మించగానే రాణి కాలమైంది. రాజు వ్యసనాలకు బానిసయైపోయినాడు. రాజ్యానికంటే మిన్నగా మగువమదిరలకు దాసోహమైనాడు. వసతులన్నీ రాకుమారులకు తగినట్లు వున్నా సరియైన సంరక్షణ లేని పిల్లలిరువురూ తండ్రిని గమనించుతూనే వున్నారు. తండ్రికి వృద్ధాప్యము పుత్రులకు యౌవ్వనము రావటం జరిగింది. రాజు తాను ఎక్కువకాలము బ్రతకడని తెలిసిపోయింది. వేరువేరు అంతఃపురములలోనున్న పుత్రులను పరీక్షించి యోగ్యుని ఎన్నమని రాజు తన ముఖ్యమంత్రికి ఆదేశమిచ్చినాడు. 
మంత్రి రాజుగారి ఆనతి మేరకు మొదటి కుమారుని అంతఃపురమునకు పోయి చూస్తే అతడు అన్నివిషయములలోనూ  రాజును అనుకరించుచున్నట్లు అర్థము చేసుకొని ఆ రాకుమారుని ఇట్లు అడిగినాడు "యువరాజా మీ తండ్రి మీకు పట్టము కట్టవలెనని చూస్తూవుంటే మీరేమి ఈవిధముగా తయారయినారే!" అందుకు ఆ రాకుమారుడు " తప్పేముంది. తండ్రిని మించిన తనయుడను కావలెనన్న తపనతో నేను ఆయన అడుగుజాడలోనే నడచి ఆయనను అధిగమించవలెనని అనుకొంటున్నాను." అని అన్నాడు.
హతాశుడైన మంత్రి మార్గాంతరములేక రెండవ రాకుమారుని అంతఃపురమునకు పోయినాడు. అచ్చటి వాతావరణమును చూసి విస్మితుడైనాడు. ప్రతి పని సక్రమముగా జరుగుతూ వుండి. నియమ పాలనబాధ్యత ఇత్యాది విషయములలో ఎంతో జాగరూకుడై మసలుచున్నాడు రాకుమారుడు. ఆయన పరివారము కూడా సుశిక్షితులై బాధ్యతనెరిగి పనిచేయుచున్నారు. మంత్రివర్యుడు ఆయన వద్దకు వెళ్లి" యువరాజా మీరు ఇంత క్రమశిక్షణ ఎట్లు అలవరచుకొన్నారు?" అని అడిగినాడు. అందుకు రాకుమారుడు"మాతండిగారినిచూసే! ఆయన నుండి, అతి జాగ్రత్తగా పరిశీలించి, ఏవేవి చేయకూడదో నేర్చుకొన్నాను" ఇక ఎవరు రాజయి వుంటారు అన్నది మీ విచక్షణకే వదలిపెడుతున్నాను. ఈ కథను బట్టి మనకు తెలియవచ్చేది ఏమిటంటే .......
(మిగిలనది తరువాత చదువుదాం)

యువత - భవిత - బాధ్యత-2
మనమున్న వాతావరణములో విషయములను ఎంతోఓర్పుతో గ్రహించి ఎంతోనేర్పుతో చేయవలసినవి తగురీతిగా ఆచరించవలసి యుంటుంది.
ఈ కాలము పూర్వము వలె కాదు. ఏపనీ తొందరే! అందువల్ల విచక్షణ కొరవడుతుంది. కావున తల్లిదండ్రులు తగినవిధముగా పిల్లల విషయములో జాగరూకత వహించి ఒక విషయము యొక్క గుణ దోషముల గూర్చి చెప్పకపోతే పర్యవసానము ఏమయినా కావచ్చు. 
ఈ కథలోకూడా పెద్దకుమారుడు తండ్రివలె పతనమై రాజ్యాధికారాన్ని పోగొట్టుకొన్నాడు. మరి చిన్నవాడు రాజయితే అయినాడుకానీ మంచివానిగా మసలుకొని ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోన్నాడో లేదో! స్వార్థముచేత తాను రాజయిన పిదపబాల్యములో మమతానురాగాములకు నోచుకోలేదు కాబట్టి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోలేక పోయినాడేమో!
కావున పిల్లల పెంపకము పై తల్లిదండ్రుల శ్రద్ధ మిక్కిలి అవసరము. అనురాగముఆప్యాయతఆత్మీయతఅంతఃకరణఆరక్షణ కలిగియుంటేనే అది సుఖవంతమైన సంసారమౌతుంది. నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ వుంది.
రాజవత్ పంచావర్షాణి దశ వర్షాణి తాడవత్l
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ll
5 సంవత్సరములవరకు శిశువును రాజు/రాణి లాగా చూచుకోనవలెనట. తరువాత 10 సంవత్సరములు కొట్టి తిట్టి ఎట్లయినా సరే దారిలో పిల్లలను ఉంచాలట. 16 వ సంవత్సరమునుండి స్నేహితునిగా చూసుకొనవలెనట. మరి మనమట్లు చేస్తున్నామామనకంత సమయము చేతిలో ఉందా! అన్నది మన ఆత్మ విమర్శకు సంబంధించిన విషయము. తల్లిదండ్రి పిల్లలు కలిసి ఒకసారిగా భోజనము ఎంతమంది ఇళ్ళలో జరుగుతూవుందో నేటి కాలములో? WEEK END అని ఏ హోటలుకో పోయేదానికంటే ఇంట్లో ఆరోజు తల్లి చేసిపెడితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో. క్రింద కూర్చుని తట్టలో అన్నము అనుపానమును చేతితో కలుపుకొని తినుట ఎంతో ఆరోగ్యకరమని ఇంతకాలానికి science కూడా తెలియజేస్తూవుంది. మరి మనమెందుకు పాటించుట లేదు. ప్రొద్దుటే అంటే కనీసము ఒక 5.30 కన్నా లేచి కాలకృత్యములు స్నానాదులు ముగింపజేయించి దేవునికి చేతులు జోడించి పిల్లలచే ప్రతిదినమూ నమస్కరింపజేసే తల్లిదండ్రులు ఎంతమందిఅసలు తెల్లవారుఝాము, ఇంచుమించు 4.30 గం.ల సమయాన్ని బ్రాహ్మీ ముహుర్తమంటారు. 5, 5.30 సమయాన్ని గోవుషస్కాలమంటారు. ఉదయము 7 లోపు స్నానము చేయవలెనన్నది పెద్దల మాట. తరువాత చేసేదానిని రాక్షస స్నానమంటారట. మరి ఎంతో ప్రశస్తమైన సమయమును పెద్దలు మనకు నిర్దేశించితే ఆ సమయమునకు తల్లిదండ్రులే లేచుట లేదు మరి పిల్లలు లేచుటను గూర్చి ఎట్లు ఆలోచించగలము.

చేతులారంగ శివుని పూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని

కలుగనేటికి తల్లుల కడుపుచేటు  (భాగవతము)

ఇది భాగవత వాక్యము. వ్యాసులవారు, పోతన వంటి పరమాత్మ స్వరూపులు చెప్పిన మాట. 

మనమెందుకు పాటించ కూడదు.

కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతిl

కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనంll

అన్న శ్లోకమును పిల్లలకు చెప్పించి కుడి అరచేతిని చూచుకొనే అలవాటును ఎందుకు 

చేయించకూడదు. ఋగ్వేదములోని శాంతి మంత్రములలో ప్రముఖమైనది ఈ విధంగా 

చెబుతుంది. అసలు ఈ శ్లోకానికి ఒక గమ్మత్తయిన మరియు స్వాభావికమైన అర్థము 

చెబుతాను. కరాగ్రము అంటే చేతి వ్రేళ్ళు.ఏ పనిని పట్టుకోదలచినా చేతివ్రేళ్ళు ఉండవలసిందే. 

పట్టుదలతో పని పూర్తి చేస్తే ఫలితము దానంతకదే చేతికి వస్తుంది. అదే నీకు ప్రాప్తించిన 

సిరి సంపద. దాని అధిదేవతయే లక్ష్మి. అదీ కరాగ్రే వస్తే లక్ష్మి అంటే. అసలు డబ్కబును

 అందుకోనేది సాధారణముగా కుడిచేతి వ్రేళ్ళతోనే కదా! ఇక 'కరమధ్యే సరస్వతి'. 

అంటే పుస్తకమును అరచేత్తోనే పట్టుకొంటాము. మనకు విజ్ఞానదాయకమగు 

పుస్తకములను కరమధ్యమున ధరించుటచే చదువుపైన శ్రద్ధ కలిగి, మనఃపూర్వకముగా 

చదువుటచే జ్ఞాపకము ఉంచుకొని విజ్ఞానవంతులమౌతాము. 'కరమూలె స్థితా గౌరీ' అంటే 

ఆ కరమూలముననే మన శక్తి కేంద్రీకృతమై వుంటుంది, మంచికయినా, చెడ్డకయినా! అట్టి 

కరమూలమే మూలము. మనము ఈ కరమూలమును  మంచికి వాడితే శక్తి

 స్వరూపిణియగు గౌరీదేవి ఆశీస్సు మనపై వుంటుంది. చెడుపునకు కూడా ఆమె

 సహకారము ఉంటుంది, అడి క్షణిక్యము. మిమ్మత ఆ దుష్కర్మ ఫలము తప్పక అనుభవించి

 తీరుతాము.  అందుకే ఉదయముననే ఆ  మూడుతల్లుల నిలయమైన అరచేతిని మనము 

చూచుకొనవలెను. ఇక పిల్లలకు ఈ శ్లోకమును బాల్యమునుండి నేర్పించి కంఠస్తము 

చేయించుట మంచిది.

ఆనోభాద్రాః క్రతవోయంతు విశ్వతః తదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃl

దేవా నోయథా సదమిద్ వృధే అసన్నప్రాయువో రక్షితారో దివే దివేll

దశదిశలనుండి మంగళమయమగు మాటలే మా చెవులను సోకుగాక! అవి ఏ విధమగు 

వత్తిడికి, ఎటువంటి  అడ్డంకులకూ లోనుగాక ఎన్నో అజ్ఞాత విషయములను

మాకందించుగాక! మాగతి ప్రగతి వైపునకు మరలించి మమ్ము రక్షించే 

దేవతలు కలకాలమూ మా వృద్ధినే కాంక్షించెదరు గాక!

ఎంత గొప్ప మాటనో చూడండి. హరిహర సుభాషితము పిల్లలగూర్చి ఏమంటున్నదో 

గమనించండి.
అనిచ్ఛంతో పి వినయం విద్యాభ్యాసేన బాలకాః |
భేషజేనేవ నైరుజ్యం ప్రాపణీయాః ప్రయత్నతః || హరిహర సుభాషితము
ఇష్టమున్నా లేకున్నా పిల్లలకు  విద్యావినయములను ప్రాప్తింప జేయవలసిందే. ఆ బాధ్యత తల్లిదండ్రులదే. ఔషధముు యొక్క ప్రశస్తి దాని చేదుతనమునకు తెలియదు కదా!
ఇక భర్తృహరి సుభాషితము ఏమి చెబుతూ వుందో గమనించండి.
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు

గౌరవమొసంగు జనులకు గలుషమడచు

కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు

సాదు సంగంబు సకలార్థ సాధకంబు

సత్యము, పలుకుట నేర్పించుతుందట, బుద్ధిమాన్ద్యమును మాన్పుతుందట, పరస్పర 

గౌరవమును గూర్చి తెలుపుతుందట, మనలోని చెడును తుడిచివేస్తుందట, కీర్తిని 

వ్యాపింపజేస్తుందట, మనోవికాసమునకు మందుగా పనిచేస్తుందట, ఇంతటి బహుళార్థ 

ప్రయోజనకారి ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యము.

తెలుగు, సంఈ స్కృతము పిల్లలకు బాల్యములో ఆంగ్లముతో బాటూ నేర్పించండి. సంస్కృతము 

ప్రారంభించు టకుముందుగా అమరము నేర్పించండి. అది ఒక నిఘంటువు. దానిని వ్రాసిన

 మహానీయుడగు అమరసింహుడు బౌద్ధుడు. ఆ కాలములో బౌద్ధ హైందవ ద్వేషము

 విపరీతముగా ఉండేది. అయినా క్రీస్తుకు పూర్వము రచించబడిన  'అమరము' అమరమై

 విరాజిల్లుచున్నది. దానివల్ల ఎంత క్లిష్టమయిన పదాలను కూడా చక్కగా పలికే తీరు 

అలవడుతుంది. వీలయినంతవరకూ  ఇంటిలోనే, తల్లి వద్దే లేకుంటే ఇంటి పెద్దల వద్ద. 

ప్రాణాలు, మహా ప్రాణాలు, ద్విత్వాక్షరములు, సంయుక్తాక్షరాలు, శ ష స ల వ్యత్యాసాలు  

స్పుటముగా పలికించుటకు నేర్పించండి. . ఆ సమయయములో వారి మేధస్సు ఎంతో 

పదును గానూ ఖాళీగానూ వుంటుంది కాబట్టి మంచితో దానిని ఎంత ఎక్కువగా వీలయితే 

అంత ఎక్కువగా నింపండి. నేటి దంపతులకు ముఖ్యమయిన విన్నపము.: మీ తల్లిదండ్రులను 

వృద్ధాశ్రమమునుకు పంపించుట వృధా శ్రమ అని తెలుసుకొండి. మీరు మీ ఉద్యోగాలకు 

పోయినా ఎంతో లాలనతో మంచి బుద్ధి మంచి మాట మంచి చదువుకు వారు నాంది 

యౌతారు. దానితో సంఘమే మంచివాయిపునకు అడుగు వేస్తుంది. 

ముఖ్యముగా అమరము ఆంధ్రనామ సంగ్రహము, పెద్దబాలశిక్ష ఈ మూడు పుస్తకములు 

ఇంటిలో తప్పక వుంచండి. పెద్దబాలశిక్ష అయితే అత్యంత అవసరము. అసలిది పెద్దలకు 

బాలలకు శిక్షణా, లేక బాలలకు ఆవయసులో ఇవ్వవలసిన పెద్ద శిక్షణా, లేక పెద్దలకిది 

బాలశిక్షణా, అసలు ఇది ఒకే పదము కాదుఅసలు పెద్ద+బాల సంధి లేక సమాసము 

కుదరదని నా తలంపు. ఈ విషయమును వయ్యాకరుణులకు వదలిపెడతాను. కానీ ఈ 

పుస్తకములోని పద్యములను, శ్లోకములను, రామాయణ భారత ఇతిహాసములను, పౌరాణిక 

గాధలను, చారిత్రిక సామాజిక విషయములను, గణితమును, అసలు అవి ఇవి అననేలా 

నేటి తరానికి కావలసిన ఆంగ్లమును కంప్యూటరును గూర్చి కూడా తెలుపుతుంది. ఇది 

తెలుగువారికి సరస్వతీ దేవి ఇచ్చిన వరము. ఇకనైనా ఉపయోగించుకొండి.

ఇక నేటి కాలములో పిల్లల పీడ వదలించుకొనుటకుగాను Creche, Convent అని 

పంపుచున్నారు కదా!   Creche అనే మాటకు Cambridge Dictionary లో ఈ 

అర్థములను చూడ వచ్చు.........

తరువాత చూద్దాము............  
యువత - భవిత - బాధ్యత- 3
Creche అనే మాటకు Cambridge Dictionary లో ఈ అర్థములను చూడ వచ్చు.........
UK: a place where young children are cared for during the day while their parents do something else, especially work, study, or shop:
us uk crib a model of the people and animals present at the birth of Jesus, used as a decoration at Christmas
అదేవిధముగా Convent అంటే  Cambridge Dictionary లో a building in which nuns (= members of a female religious order) live అన్న అర్థమును చూడవచ్చు. ఇక Convent School అంటే  Dictionary  ఈ విధముగా చెబుతుంది. A convent school is a school where many of the teachers are nuns. ఇప్పుడు అసలు మీరు పంపేది Convent కాదు లేక Convent School కూడా కాదు. అక్కడ అంటే ఈ కాలపు Convent Schools లో ఉండే ఉపాధ్యాయినులు సత్ప్రవర్తన కలిగియున్నారా, వారికి పిల్లలకు నేరిపించే విధానము తెలుసునా! పుస్తకములలో వుండే విషయములను వల్లెవేయించుట తప్ప. చిన్న పిల్లలలో జిజ్ఞాస ఎక్కువ. ఒక ప్లాస్టిక్ బొమ్మ చిన్న పాపాయి చేతికిస్తే తాను దానిని అటు పీకి ఇటు పీకి నేలకేసి కొడుతుంది. కారణము ఏమిటంటే లోపల ఏముందో చూడవలెనన్న జిజ్ఞాస. మనము అరచి ఆపనిని ఆపితే ఇక ఆ పాపాయి ఏడుపే చూడగలము. ఆ స్వతంత్రము వాళ్లకు ఆ వయసులో ఎంతో అవసరము. ఒకవేళ భార్యా భర్తలు ఉద్యోగాలకు పోయినా పెద్దలు ఇంటిపట్టున వుంటే ఎన్నో విషయములను లాలించి పాలించి నేర్పించగలుగుతారు. వయసుతో బాటు పదాలు నేర్పించే తీరు తెన్నూ కూడా మారుతూ వుంటుంది. కొట్టుట, కోపగించుకొనుట, బుజ్జగించుట అన్నీ వారయితే మనసారా చేస్తారు. కోప పడినా కొట్టినా వెంటనే చేరదీసి బుజ్జగించుతారు. ఎంతయినా రక్త సంబంధము కదా! నేను వ్రాసిన పద్యము ఇచట సందర్భోచితమని తలుస్తాను.

ధగ ధగ నగ చేయించగ
శెగ, సమ్మెట, చేవ యున్న, చెప్పిన రీతిన్
నగ చేయగల్గ వచ్చును
దిగులన్నది కల్గబోక ధీమణి రామా!
19, 20 శతాబ్దులకు చెందిన మన దేశపు శాస్త్రజ్ఞులు మరియు సాంకేతిక నిపుణులు అగు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, C.V. రామన్, వెంకట్రామన్ రాధాకృష్ణన్, S.చంద్రశేఖర్, మేఘనాథ్ సహా, సత్యేంద్రనాథ్ బోస్, జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్, మొదలగువారు Creche, Convent లలో చదువలేదు. ఇక మన పురాతన శాస్త్రజ్ఞులగు బోధాయన, బ్రహ్మగుప్త, కణాద, చరక, శుశ్రుత, ఆర్యభట్ట, వరాహమిహిర, పింగళ, భాస్కర, నాగార్జున ఇత్యాదులకు ఎవ్వరికీ అసలు ఆంగ్లమంటే ఏమో తెలియదు. ఇక Creche, Convent ల మాట అసలు వారి విషయములో రానే రాదు కదా! వారి ఆవిష్కరణలను తమ పేరుతో  నమోదు చేసుకొన్న పాశ్చాత్య సైంటిస్టులను మనము మహాపురుషులుగా భావించి పూజించు చున్నాము. మరి మన పిల్లలకు మాతృభాషనే పణముగా పెట్టి ఆంగ్లము అభ్యసింప జేయుట అవసరమా! మన తెలుగు ప్రాశస్త్యము ప్రాధాన్యత ముందే వివరణాత్మకముగా మనవి చేసుకొన్నాను.
 మాత, గోమాతక్షీరములు సమీకృత ఆహారములు అయినపుడు  ఇక హార్లిక్సులు, బోర్న్విటాలు, కాంప్లానులు మొదలగునవి పిల్లలకు అవసరమా! ఈ కృత్రిమ ఆహారముల శక్తి కేవలము కాగితములో అంటే ప్రకటనలలో మాత్రమే వుంటుంది. ఆ కృత్రిమ ఆహారములలో కాదు. పాలు యథాతథముగా త్రాగాలేనివారికి ఒక చిన్న పలుకు పచ్చకర్పూరముగానీ నాలుగు లేక ఐదు ఏలక గింజలుగానీ కొట్టివేస్తే ఎంతో రుచికరముగా వుంటాయి కావున ఇబ్బంది పడకుండా త్రాగివేస్తారు. తినగలిగే వయసు వచ్చినపుడు పిల్లలకు సేనగ, పెసర, అలసంద (బబ్బర్లు) బియ్యము, జొన్న, సొజ్జ మొదలగు పలువిధపు ధాన్యముల పిండ్లతో ఎన్నో తీపి మరియు కారపు పదార్థములు పిల్లకు చేసి పెట్టవచ్చును. మీకు చేత కాకుంటే చేయించి పెట్టండి. వాళ్ళ ఆరోగ్యమును మీరు కాపాడితే దేశ భవితను కాపాడినవారవుతారు. కృత్రిమపు ప్రేమతో పస లేని ఆహారము మెసవనీయకండి. Kill the junk it's not to drink. That shows hell and will never go well. 

ఇక మీరు ఎంతో మోజు పడే English Rhymes ను గూర్చి ఒక మాట చెబుతాను. 
ఈ విషయము తరువాత ప్రస్తావించుకొందాము.........
యువత - భవిత - బాధ్యత - 4
ఈ Rhyme తీసుకోండి:
Rain, rain go away 
 Rain, rain go away
Come again another day
Little Johnny wants to play
Rain, rain go away 
ఇది ఎలిజబెత్-1 (1533-1603) రాణి పాలించే రోజుల్లో వ్రాసినది.  ఇంగ్లిషు వారు స్పానిష్ ఆర్మడాపై యుద్ధం చేస్తున్నప్పుడు తుఫానులో చిక్కుకున్న సైనికులు భయంతో వర్షాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మంటూ పాడుకున్న పాట ఇది. తరువాతి కాలములో వారు తమ పిల్లలకు నేర్పించ దొడగినారు. వారిని చూచి మనము కూడా ఎన్నో నీతి శతకములను విస్మరించి పిల్లలకు ఈ rhymesనేర్పించుచున్నాము. చిన్న పిల్లలకు ఇది ఇప్పుడు అవసరమా ! 'వానా వానా వల్లప్ప చేతులు దాచు చెల్లప్ప' అని వానలో ఆడుకొంటూ వానను ఆహ్వానించుట ఎట్లున్నది, Rain, rain go away  అనుట ఎట్లున్నది. 'Johnny Johnny yes papa' అన్న rhyme పిల్లలకు అబద్ధాలు నేర్చుకోండి అన్న సందేశమిస్తుంది. ‘మాటకు ప్రాణము సత్యము’ ‘చేత వెన్నముద్ద’ ‘ఉప్పు కప్పురంబు’ మొదలగు నీతి పద్యములు బాల్యములో నేర్పించితే వారవి తమ అనుభవమునకు తెచ్చుకోనూ గల్గుతారు, తరువాతి తరమునకు అందజేయనూగలుగుతారు. సంస్కారము లేని చదువు Toilet Room లో ఎదమచేయ్యే!
ఇక యువతనుగూర్చి వారి విధి బాధ్యత కర్తవ్యములను గూర్చి కాస్త మాట్లాడుకొందాము. 
అన్నా విను సంస్కారము
అన్నది గౌరవము గూర్చు ఆలోచింపన్  
ఎన్నెన్నొ విద్యలెరిగియు     
సన్నుతి తా పొందగలుగ సాధ్యంబౌనే  


నేను ముందుగానే పైన చెప్పినాను ‘ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్’ అని. ఇది ఏముందిలె అని తాత్సారము చేయవద్దు. మీరు మీ పిల్లలతో ఆ వయసులో కనుక స్నేహితులవలె సంచరించితే వారి మనసును తెలుసుకొనే అవకాశము వుంటుంది. అది తెలిస్తే చాలు వారు దారి తప్పకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ దారి తప్పినా ఒక స్నేహితునిగా లేక స్నేహితురాలిగా తగిన సలహా ఇచ్చి తమ దారికి తెచ్చుకోనవచ్చు. అసలు ఆవయసులోనే పిల్లలకు స్వతంత్రభావాలు మొదలౌతాయి. తాము తప్ప లోకమంతా, ముఖ్యముగా తల్లిదండ్రులకు ఆలోచించే పరిజ్ఞానము లేదు అని తలచే వయసది. సాన్నిహిత్యము ఎంతో అవసరము.

 యౌవ్వనములో ప్రవేశించబోయే బాలునికి అనుసరణీయమైన అలవాట్లు ఏవిధముగా ఉండవలెను అన్న విషయాన్ని విమర్శ చేయుటకు గానూ భారతములోని ఒక కథ తెలియజేస్తాను. ఇది ఎఱ్ఱాప్రగ్గడ పూర్తిచేసిన అరణ్య పర్వము లోని శేష భాగములో వస్తుంది. ఇందులో ధుంధుమారుడు అన్న ఒక యువరాజు ఒక సారి వేటకు రాజధానికి దగ్గరగా వున్న అడవికి పోతాడు. అతనికి కొలనిలో నీరు తాగే శబ్దము వినిపించుతుంది. అతడు ఆ శబ్దమును ఓకే జంతువుడిగా భ్రమించుతాడు. ఆదిశగా బాణము వదులుతాడు. మనిషి అరచిన శబ్దము వచ్చుటతో ఆ చోటునకు పరుగెత్తి తక్షణము చేరుకొంటాడు. కదలికలేని ఒక బ్రాహ్మణ బాలకుని జూచి మరణించినాడని తలచి వ్యాకులచిత్తుడై రాజధానికి వెళ్లి అంతఃపురము ప్రవేశించి  తలిదండ్రులతో జరిగినది చెప్పి తన పశ్చాత్తాపమును ప్రకటించుకొంటాడు. అప్పుడు తండ్రి నీవు చేసినది తప్పు. ఆదర్శప్రాయుడైన రాజు తప్పుచేసి చెప్పుకోనుటకు వెనుకాడకూడదు అని చెప్పి పుత్రుని పిలుచుకొని ఆ ఉదంతము జరిగిన స్థలమునకు వెళ్లి చూడగా బాలుడు కనిపించడు.
ఇరువురూ ఆ బాలుని అంతర్దానమునకు ఆశ్చర్యమునొంది చుట్టూ ప్రక్కల ఏవయినా ఆశ్రమములు వున్నాయేమో, ఆ బాలుడు ఆ ఆశ్రమాలకు చెందినవాడేమోనని వెదకుతూ బయలుదేరుతారు. చివరకు ఒక పర్ణశాల చేరుతారు. అది ఒక చిన్నపాటి గురుకులము. ఆ గురువు పేరు తార్క్ష్యుడు.
ఆయనకు జరిగిన ఉదంతమును సవినయముగా మనవి చేయగా ఆయన మా గురుకులములో ఎవరూ మరణించలేదంటూ తన ఛాత్రులను వారిముందుంచుతాడు. అప్పుడు యువరాజు ఆ బాలకుని గుర్తించి గురువుకు తెలిపితే, నీబాణానికి ఆ బాలుడు మూర్ఛపోయి తేరుకొని ఆశ్రమము చేరినాడని గురువు చెప్పుటతో దిగ్భ్రాంతికి గురియై యువరాజు ఆ బాలుడు మరణించకుండుట తన కోల లో దోషమా లేక తన ధనుర్విద్యలో లోపమా అని సంశయాత్మకముగా అడిగినాడు.  అప్పుడు ఆ మునిపుంగవుడు యువరాజుతో నాయనా నా శిష్యులు ఋజువర్తనము కలిగినవారు. వారు ఎప్పటికీ అకాలమరణమునకు ఆహుతి కారు అని చెబుతాడు. అట్లు కాకుండుటకు కావలసిన నియమనిష్ఠలగూర్చి యువరాజు అడుగగా మునీశ్వరుడు ఈ విధముగా చెబుతాడు:
విద్యార్థి దశలో ప్రతియోక్కరూ ఈ నియమములను పాటించవలెను. అట్టివారు అకాలమృత్యువు వాత పడరు అని తెలుపుతూ ఈ క్రింది సూత్రములను తెలుపుతాడు.
1.     పని  తలపెట్టిన పిదప ఆలస్యము చేయకూడదు.
2.    శుభ్రమైన ఆహారము తినాలి.
3.    ఏ రోజు పని ఆ రోజే పూర్తిచేయాలి.
4.    ఇంటిఇకకి వచ్చినవారికి సగౌరవముగా అతిథి మర్యాద చేయాలి.
5.    కలకాలము సత్యవ్రతమును పాటించాలి.
6.    ఎప్పుడూ శాంతిని అవలంబించి యుండాలి.
7.    అత్యంత ముఖ్యమయినది బ్రహ్మచర్యమును పాటించాలి.
రాజు, యువరాజు గురువుగారికి నమస్కరించి రాజధానికి తరలినారు.
ఈ కథలో చెప్పిన అతి ముఖ్యమయిన ఈ 7 సూత్రములనూ ఎంతమంది పెద్దలు తమ యౌవ్వనములో పాటించినారు, ఎంత మంది తమ పిల్లల చేత పాటింప జేయించినారు, చేయించుతూ వున్నారు. ఈ ఏడు సూత్రాలనూ విశ్లేషించుతూ పోతే ఈ వ్యాసము చాలా పెద్దదవుతుంది. పైగా వీనిని మీ స్వానుభావాలతో అన్వయించుకొంటే చక్కని ఫలితము మీకుమీకే లభించుతుంది.
ఈ విషయము ఒకసారి చూడండి. ఆంగ్లములో A B C D E అన్న వరుసాక్షరాలు A తో మొదలవుతాయి . వారి మతములో, మత గ్రంధములో, ఆత్మ లేదు కాబట్టి దానిని అంటే ATMA ను యథాతథముగా తీసుకొందాము.  ఇక B అంటే BIRTH, C అంటే CHOICE, D అంటే DEATH, E అంటే ETERNITY. పాండవులలో అర్జునుడు పాండు మధ్యముడు. శ్రీకృష్ణుని సఖుడు మరియు భారత యుద్ధ విజయ కారకుడు. అది గుర్తుంచుకొని మొదట A ను గూర్చి తెలుసుకొందాము. ఆత్మకు చావులేదు. ఇది భగవద్గీత చదివిన, ఆకళింపుచేసుకొన్న, కనీసము విన్న వారందరికీ తెలిసిన విషయమే. ఈ ఆత్మ తల్లి గర్భమున ప్రవేశించితే BIRTH, అంటే పుట్టుక ఏర్పడుతుంది. ఇప్పుడు 3 వ అక్షరమును దాటవేసి 4వ అక్షరమునకు వస్తాము. D అంటే DEATH అంటే ఆత్మ కట్టె నుండి విడిపడింది. అది శాశ్వతత్వము చేరాలి. మరి వెంటనే చేరుతుందో, పిత్రులోకములో విడిది చేస్తుందో మన ఊహకు అందనిది. కర్మ బంధములను తెన్చుకొంటే మాత్రము పరమాత్మను చేరుకొంటుంది అంటే దాని గమ్యము, లక్ష్యము పరమాత్మ. ఆ గమ్యము లక్ష్యమును సాధించవలేనంటే అది తప్పక C మీద అంటే CHOICE అంటే నీవు ఎన్నుకొనే మార్గము మీద ఆధారపడివుంటుంది. చూచినారా ఈ C కి  ఎంత ప్రాధాన్యత వుందో!
స్థూలముగా ఈ CHOICE అంటే ఇచ్ఛ, ఇష్టము, కోరిక రెండే రెండు విషయములపై ఆధార పడుతుంది. 1. మంచి 2. చెడు. అదే విధముగా మనలో రెండు తెగలు. 1. నేను 2. వాడు (అతడు). పై రెండు ఈ రెంటికి సంధించితే పౌనఃపున్య క్రమము (Permutations and Combinations) ప్రకారము 4 అగుతాయి. అవి 1. మంచి మంచి 2. చెడ్డ మంచి 3. మంచి చెడ్డ 4. చెడ్డ చెడ్డ .
ఇపుడు మంచి మంచి యన్న మొదటి వర్గమును తీసుకొందాము.
మొదటి వర్గములో అంతా మంచే! వానికీ మంచే నాకూ మంచే. ఆ వర్గము లోని వ్యక్తులకు పైన తెలిపిన 7 సూత్రములూ యథాతథముగా వర్తిస్తాయి. వారికి ఆయుస్సు, ఆరోగ్యము ఆనందమునకు కొదవ ఉండదు.
నీవు చేసే ప్రతి పనివల్లా నీకు మంచి జరుగుతుంది. వానికీ మంచి జరుగుతుంది. అంటే నీవు పైన చెప్పిన 7 గుణములనూ తూచ తప్పకపాటించేవానివన్న మాట. దీనిని ఆంగ్లములో WIN-WIN SITUATION అంటారు. ఎవరికీ ఎటువంటి చెడుపు లేదు. ఈ మార్గము ఎంతో శ్రేయో దాయకము.
 ఇక రెండవది: చెడ్డ-మంచి, అంటే నీకు చెడుపు, లేక ఇబ్బంది కలుగుచున్నా ఎదుటివానికి సాయపడే ఆలోచన. ఒక ఎల్లలను కాపాడే భారతీయ సిపాయికి ఎంత జీతము ఇచ్చినా ఆయన ప్రాణము పోగొట్టుకొనుటచే తనకు ఒరిగినది ఏమీలేదు. నిండు జీవితాన్ని దేశానికి బలి ఇచ్చినాడు. ఒకవేళ ఆయన ఇంటివారికి ఎదో ధనసహాయము లభించుతుంది అన్నాకూడా ఆయన ప్రాణము తిరిగి రాదు కదా! ఒక మంటలో చిక్కుకొన్న పసిబాలుని రక్షించుటకు ఒక యువకుడు తన ప్రాణమును లెక్కచేయక ఆ బాలుని కాపాడినాడు అనుకొందాము. ఆపనిలో అతని వంటికి ప్రమాదము కొంత వాటిల్లినది అనుకొంటే, ఆయన చేసిన పని మాత్రం స్వార్థ రహితమైనది కదా! ఇక పురాణాలలోకూడా ఇటువంటి ఉదాహరణ మనము దధీచి మహర్షి విషయములో చూడవచ్చు. ఆయనను స్వయంగా ఇంద్రుడు వచ్చి మహర్షీ తమరు ప్రాణత్యాగము చేస్తే మీవెన్నెముకతో తయారుచేసిన ఆయుధముతోనే అత్యంత దుర్మార్గుడగు వృత్రాసురుడు సంహరింపబడుతాడు అంటే, ఇంద్రుడు చేసిన ప్రార్థన మన్నించి దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయి లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం  చేసి తన వెన్నెముకతో వజ్రాయుధాన్ని చేయించుకొనే అవకాశమును కలిగించి లోకభీకరుడైన వృత్ర సంహారానికి దోహదపడుతాడు. మహనీయులకు దేహము తృణప్రాయము. ఇటువంటి త్యాగధనులు అజరామరులు. అసలు మన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరాం బోస్ ఇంకా ఎందఱో, ఎందరెందరో ! దీనిని Lose-Win SITUATION అంటారు. మనము వారి బాటలో నడవకున్నా వారిని ఆదర్శముగా పెట్టుకొని మనలను మనము కాపాడుకొంటూ కూడా ఒక ఉత్తమ పౌరునిగా జీవించవచ్చును. చక్కని జీవితము కోరుకొనే వారికి ఒకటవది అతి చక్కని మార్గము. దేశ శ్రేయస్సుకు, దేశ పురోభివృద్ధికి కూడా అది ఎంతో దోహదకారి. కానీ రెండవది ఆదర్శ ప్రాయము. కానీ ఇందులో ఎదుటివాని పాత్రతనెరిగి మసలుకోవలసి వుంటుంది.
ఇప్పుడు మూడవ వర్గమును గూర్చి చర్చించుదాము. వీడు తాను బాగుంటే చాలు  వాడేమయిపోయినా ఫరవాలేదనుకోనేవాడు. అంటే ఎప్పుడూ 'చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష'  అని తలచుతాడు. అవసరమైతే 'వాని' కింద గోతులు త్రవ్వుటకు వెనుకాడడు. 'పయోముఖ విషకుంభము గాను' 'గోముఖ వ్యాఘ్రముగాను' ఉంటూ 'గోరీవద్ద గుంటనక్క వలె' అవకాశము కొరకు అర్రులు సాచుతూ ఉంటాడు. ఆ క్షణానికి కోరిన ఫలితము వచ్చినా చేసిన పాపానికి ఫలితము మాత్రము తర్వాత నయినా అనుభవించి తీరవలసి వస్తుందన్న ఆలోచన లేనివాడు. ఇది ప్రముఖులైన మన రాజకీయ నాయకులలోనూ సినిమా నటులలోనూ జాగ్రత్తగా గమనించితే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. ఒక కథ చెబుతాను, ఒక విధముగా ఇది వాస్తవమే! ఒక పంచర్లువేసే దుకాణాదారుడు తన షాపునకు ఎదురుగా వున్న రోడ్డుపై అటు అర కిలోమీటరు ఇటు అర కిలోమీటరు వద్ద 4,5 మేకులు చల్లి ఉంచేవాడు. అటువైపు నుండి ఇటువైపు నుండి తమ ప్రమేయము లేని తప్పుకు శిక్షను అనుభవించుతూ, పంచరు వేయించుకొనుటకు బండ్లను తీసుకొని అతని వద్దకు వచ్చేవారు. అతడు పంచర్లతోనే డబ్బు గడించినాడు. అయ్యో వాళ్ళు ఎంత ముఖ్యమయిన పనిమీద పోతున్నారో అన్న ఆలోచన అతనికి ఎ రోజూ వచ్చింది కాదు. ఒకనాడు అతనికి తన ఇంటివద్దనుండి Cell Phone లో తన అమ్మకు serious గా వుందని ఎవరో తెలిపినారు. ముందు వెనుక ఆలోచించకుండా వద్దనున్న సైకిల్ మోటార్ లో బయలు దేరిన వ్యక్తి తన పరధ్యానము కారణంగా ఎదురుగా వచ్చే లారీని ఢీకొని అక్కడికక్కడే అసువులు బాసినాడు. కావున మన కర్మకు వెంటనే కాకపోయినా ఫలితము మాత్రము అనుభవింపక తప్పదు. కావున ‘ చెరపకురా చెడేవు’ అన్న నీతి వాక్యమును ‘చీకట్లో అగ్గిపెట్టె చెంతనుంచుకొన్నట్లు ఏపని చేసే సమయముననైనా ‘ఈ వాక్యమును’ మనసులో ఉంచుకొనుట ఎంతో మంచిది.
ఇక 4 వ వర్గమును గూర్చి కాస్త చర్చించుదాము. ఇది Lose—Lose Situation అంటే అమ్మాపెట్టదు అడుక్కోనీ తిననివ్వదు అన్నట్లు. తాను బాగు పడదు ఇతరులను బాగుపరచడు. ఈ కథను ఒకసారి గమనించుదాము.
మిగిలినది మరోమారు.......




Tuesday, 17 July 2018

కార్య శూరత (Management Science)


కార్య శూరత (Management Science)
https://cherukuramamohan.blogspot.com/2018/07/management-science-humandevelopment-man.html
నేడు పుట్టగొడుగులుగా మన మధ్యకొస్తున్న అనేకానేకములగు మానవ వనరుల మరియు మానవ సంబంధముల సంస్థలను(Human Development, Man Management Organisations) మనమెన్నో చూస్తున్నాము. ఎన్నో విషయాలలో వారు తమ మేదోవర్గపు సలహాలతో ఆచరణలో ఉంచిన నియమావళి సత్ఫలితములనివ్వక, అమెరికానే ఆర్ధిక సంక్షోభములో అతలాకుతలమై పోయింది. మన వేద శాస్త్రములను ఆకళింపు చేసుకొన్న శ్రీల ప్రభుపాదులవారు మన ఇంధనశక్తి (positive Energy = శక్తి సంకలనము) ని ఏవిధముగా పెంపొందించగలుగవచ్చునో ఎంత పరిశీలనాత్మకముగా చెబుతున్నారో చూడండి.

ఈ శ్లోకమును అభయ చరణారవింద భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామీ వారిది అని పైనే తెలియబరచినాను.

उत्साहन् निश्चयत धैर्यात
तत् तत् कर्म प्रवर्तनात
संगत्यागत सतोवृत्तिः
षड्भिर् भक्तिः प्रसिद्यते

ఉత్సాహాన్ నిశ్చయత్ ధైర్యాత్
తత్తత్ కర్మ ప్రవర్తనాత్
సంగత్యాగాత్ సతోవృత్తిః
షడ్భిర్ భక్తిః ప్రసిద్యతే

1. ఉత్సాహము 2. పట్టుదల 3. ధైర్యము 4. కర్మానుసార సమయస్ఫూర్తి 5. అయోగ్యుని విడుచుట 6. యోగ్యుని అనుసరించుట అన్న ఈ ఆరు గుణములను పుణికి పుచ్చుకొంటే ఎపనినయినా సాధించ వచ్చును. పని మంచిదయితే ఫలితము భగవంతుడు కూరుస్తాడు అన్న నమ్మకముతో మనము పని చేయవలసి వుంటుంది.

ఇప్పుడు ఈ ఆరు విషయాలను గూర్చి కొద్దిగా విశ్లేషించుకొందాము.
1. ఉత్సాహము : ఏదయినా ఒక పనినిని తలపెట్టితే ప్రోత్సాహమిచ్చేదే ఉత్సాహము.దానినే ఆంగ్లములో Motivation అంటారు.అందుకే మన పెద్దలు 'మనసుంటే మార్గముంటుంది' అంటారు.
2. పట్టుదల: పట్టుదల వున్నవాడు తాననుకొన్నది సాధించుటకు ఎంతయినా కృషి చేస్తాడు. అందుకే 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్నారు. 'సాధనతోనే ధరన పనులు సమకూరుతాయి.
3. ధైర్యము: ఒక రాజు ఎదో తప్పిదము చేయుటతో అష్ట లక్ష్ములు ఆతనిని విడిచి పెట్టి పోతూవుంటే ఆతను పట్టించుకోడు. ఒక ధైర్య లక్ష్మి పోతూవుంటే మాత్రము ఆ తల్లి చేయి పట్టుకొని మాతా! నీవు ఒక్కదానివి నాతో వుంటే చాలు. నీవులేకపోతే ఇక నేను లేను అంటాడు. అంతే కదా! ధైర్యము లేకపోవుట అంటే భయమునకు మనిషి ఆలవాలమైనట్లే! బీరువు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే కదా భర్తృహరి కూడా 'ఆరంభింపరు నీచమానవులు..' అని అంటూ ' ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్దార్థము ఉజ్జగించరు' అన్నాడు. కావున ఎవరికయినా తలపెట్టిన పనిని పూర్తి చేయాలంటే అత్యంత అవసరము ధైర్యము. ధైర్యమును గూర్చి వ్రాసిన ఈ క్రింది పది వాక్యములలో మొదటిది తప్ప మిగతావి నేను వ్రాసినవి. ఒక్కసారి గమనించండి.
1. ధైర్యే సాహసే లక్ష్మి
2. ఆపదలోసాహాసం అత్యుత్తమ సహవాసం
3. ఎదలో ధైర్యము వుంటే అదురెక్కడ బెదురెక్కడ
4. ధైర్యము లేకుంటే దయనీయమే!
5. మానవత్వమున ధైర్యము మణి పొదిగిన ఆభరణము
6. ధైర్యమొక్కటున్న నీవు ధరణినేలగలవన్నా
7. ధైర్యమున్న చాలునులే దుఃఖమంత దూరములే
8. పట్టు విడకు నీ సాధన ఫలియించును శుభ కామన
9. ధైర్యమున్న బాహుబలి లేకుంటే విధికి బలి
10. ధైర్యము ధనువైతే నిశితబుద్ధి నీ శరము
కావున కార్యార్థికి ధైర్యము యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో దీనిని బట్టి అర్థము చేసుకొన వచ్చు.

4. కర్మానుసార సమయస్ఫూర్తి : సమయస్ఫూర్తి లేకుంటే మనము లేము మనుగడ లేదు.ఒక మరచీలను కోయా నుండి విడదీయాలంటే Screwdriver కావాలన్నది అందరికీ తెలిసిన విషయమే! అవసరమేర్పనపుడు Screwdriver లేదని ఊరకుండిపోము కదా! ఎదో ఒక రేకును తీసుకొని దానిని వూడదీయ ప్రయత్నమూ చేస్తాము. రాయల ఆస్థానమునకు పోతూ ద్వారపాలకుడు తిమ్మయ్య కప్పుకొన్న శాలువను తీసుకోనవలెనని అష్ట దిగ్గజములలో నలువురు అనుకొంటారు. మొదటి ముగ్గురు ఎవరయినా నాలుగవ వాడు తెనాలి రామలింగడు. మొదటి ముగ్గురూ తిమ్మప్పను గూర్చి చెప్పిన మూడు పాదములు ఆతనికి తమ ఉద్దేశ్యము తెలియజేయలేక పోయినాయి. రామలింగడు మాత్రము 'నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!' అని తన సమయస్పూర్తిని ప్రకటించి శాలువా పొందినాడు. ఇక్కడ రామలింగని సమయస్పూర్తి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి ఆ నలుగురిలో తానూ చివరిగా నిలువడం. ఎందుకంటే పద్యమునకు నాలుగు పాదములు కదా! నీశాలువ నాకీ అని మొదటి ముగ్గురూ అనలేరు అంటే తరువాతి వారు పద్యాన్ని పూర్తి చేయరు. ఇక నాకెందుకులే అనుకొంటారు. అదీ విషయము. కావున మన మాట సూటిగానూ సున్నితము గానూ ఉంటూ సమయస్ఫూర్తి కలిగి ఉండవలెను.

5.అయోగ్యుని వదలుట : కుక్క తోక పట్టుకొని గోదావరినీదుట సాధ్యమా! కావున నీ కార్యాచరణలో అయోగ్యుని వుంచుకొనుటచే పని పూర్తికాక పోవుటయేగాక చేతగానివాడన్న పేరు ఆ కార్యాచరణ దళపతి కూడా మూటకట్టుకోనవలసి వస్తుంది. కావున ఇక్కడ పని పూర్తియగుట మాత్రమే ముఖ్యము. ఇది ధనుర్విద్యా ప్రదర్శనలో అర్జనుని గురివంటిది, కావున nee దృష్టి నుండి అతనిని తొలగించుకొనుట తప్ప వేరొక మార్గము వేడుక వీలు లేదు. తస్మాత్ జాగ్రత.

6. యోగ్యుని అనుసరించు: చిత్తశుద్ధితో యోగ్యుని అనుసరించినా అనుకరించినా నీ కార్యము నెరవేరినట్లే! యుద్ధము చేయను అని ఖండితముగా కృష్ణుడు చెప్పినా, తమసైనికబలగము 7:11 నిష్పత్తిలో వున్నా కృష్ణుని కోరుకొని అర్జనుడు మహాభారత యుద్ధమే గెలిచినాడు. ఈ ఉదాహరణ చాలదా కార్యశూరునికి!
మన ధర్మములో లేని మర్మము లేదు. ఆ కాలమునకు పాశ్యాత్య జాతులలో నాగరికత లేదు కావున వారు ఇంతటి జీవన శైలిని , నీతి నియమములను పాటించలేక పోయినారు. ఈ నాడు వారిదే మేధస్సని, వారిదే నాగరికత యని గంగను వదలి మురికి గుంటలో ఈదులాడు చున్నాము. మీలో ఎవరయినా నన్ను ఈ మాట అడుగవచ్చు. వారిది (1896 - 1977) 20వ శతాబ్దమే కదా అప్పటికి పాశ్చాత్యులు ఎంతో నాగరికులైయున్నారు కావున వీరు వారి నుండియే నేర్చుకొని యుండవచ్చుకదా యని. కానీ వారు 1950 లోనే సన్యాస దీక్ష తీసుకొని జీవితమును వేదాధ్యయనము భక్తితత్వ ప్రచారములోనే జీవితమును గడిపినారు. వారి ధీజలధి లో ప్రభవించిన ఒక స్వర్ణ కమలమే ఈ శ్లోకము.
 మన దేశ, శాస్త్ర, ఋషిగణ, మహిమాన్వితులను గుర్తించి అట్టి మహనీయుల బాటలో నడవండి.
స్వస్తి

Sunday, 15 July 2018

వాస్తవము --THE FACT


వాస్తవము --THE FACT
 విస్సన్న చెప్పింది వేదం జేమ్సు చెప్పింది చరిత్ర అన్న నానుడి వాడుకలో వుంది. బహుశ ఒక వాస్తవికతనే ఆమాదిరి చెప్పినారేమో! మన వేదాలు, వేదాంగాలు, పురాణాలు ఇతిహాసాలు భారతీయులు వ్రాసిన చరిత్ర గ్రంధాలు పక్కన పెట్టి, కాదు పక్కకు నెట్టి, తమదైన శైలిలో ఆంగ్లేయులు వ్రాయించి మనము త్రాగే తేట నీటిని ఎండమావిగా మార్చి వారి చేతులు మరియు మూతులు గడిగిన నీరు మనచేత తాపిస్తున్నారనేది ఒక తిరుగులేని వాస్తవము.
ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుదాము. ఇటు క్రైస్తవులు అటు ముసల్మానులు తమ తమ ప్రవక్తల మాటలే సత్యము, మన ఋషి మునులు ద్రష్టలు చాణక్యునివంటి ఎందరో విద్యావేత్తలు చెప్పిన మాటలు పథ్యము .
 వాళ్ళ గ్రంథములలోని మాటల ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని తమ మతానువర్తులే ప్రశ్నిచినా మతపెద్దలు తగిన జవాబు చెప్పగలరా ! 2011 Census ప్రకారము 14.2% ముస్లీములు, క్రైస్తవులు 2.3% వున్నారు. హిందూమతము అవలంబించువారు 1951 లో 84.1% వుంటే ఇప్పుడు, 2౦11 నాటికి 79.8% వున్నారు.  . వారి జనాభా ఇప్పుడు ముస్లిం జనాభా 13.80 కోట్ల పై మాటే, క్రైస్తవుల జనాభా 2.41 కోట్లగా వున్నది కానీ, అట్లు వున్నారనుకొన్నా ఇందులో ప్రచ్చన్న క్రైస్తవులెందరన్నది గవిలో మాయ. ( గవిలో మాయ అంటే గవి లోపలికి వెళ్ళిన పిదప అక్కడ వుండె పాములు తేళ్ళేమి చేస్తాయో ,దయ్యాలు భూతాలే వుంటాయో, ఆ దారి ఎక్కడ తేలుతుందో తెలుసుకొనుట అసాధ్యము.)  . వారి సిద్ధాంతములు, నిబంధనలు, లేక పిడివాదములను ఎదిరిస్తేవారి మతానువర్తియైన సగటు మనిషి నరకము చవిచూడవలసి వస్తుంది. అందుకే యదార్థమునకు, వాస్తవమునకు , సత్యమునకు దగ్గరిగా వుండే మన సనాతన ధర్మము పై భ్రమలు కలుగజేసి తమ పబ్బము గడుపుకొంటూ వస్తున్నారు.
వారి జనాభా తగ్గాలంటే 'వారిజనాభా' నీవే దిక్కు!

For centuries Christianity and Islam have violently enforced their version of “the only truth” and demanded unquestionable respect. How can they allow their dogmas to be questioned? They managed to hold on to them for so long. They managed to get altogether over three billion people into their fold. How can they admit that dogmatic religions generally do not make human beings better, but on many occasions worse? They managed to successfully demean those traditions that are closer to the truth, especially India’s tradition. How can they let all this go waste?” – Maria Wirth
(Maria Wirth is a German psychologist and columnist who has lived in India for decades.)

Monday, 9 July 2018

గురు శిష్య సంబంధం


గురు శిష్య సంబంధం

https://cherukuramamohan.blogspot.com/2018/07/blog-post.html

'గురువు' అన్నమాటకు అర్థము ఆంగ్లమున Teacher అన్న పదము వలె సంకుచితమగు అర్థము కలిగినది కాదు. చెప్పే చదువు కానీ, చేసే పనికానీ, నడచుకొనే నడవడికగానీ, తన వర్ణాశ్రమ ధర్మమును పాటించుటయందుగానీ, వివాహాది నిర్ణయములందుగానీ, అది ఇది అననేల జీవితమున ఎదురగు ప్రతి సందేహమును తీర్చి చకని సలహాలిచ్చే వ్యక్తి గురువు.

తల్లి,దండ్రి, భార్య, భర్త, అన్న, తమ్ముడు, స్నేహితుడు, ఈ విధముగా వీరంతా ఏదో ఒక రూపములో మనకు గురువులే! వీరేకాదు పశుపక్షి జలచారాదులను చూసికూడా చూసి నేర్చుకోనవలసినది ఉంటుంది. అందుచేత దేనినీ తృణీకార భావముతో చూడరాదు. సద్విషయమును దేనినుండి అయినా గ్రహించుట ఒక సద్వర్తనుని బాధ్యత.

గురువు నేర్పు విద్య గుమ్మటమ్మున వెల్గు

గురువు లేని విద్య గుడ్డి విద్య

గురువు లేనివాడు గురిలేని బాణమే

రామమోహనుక్తి రమ్యసూక్తి

సనాతన ధర్మము విశిష్ఠమైనది విలక్ష్నమైనది కూడా! ఇందు తెలియజేయని లౌకిక పారలౌకిక విషయములు వాని విశ్లేషణ వివరణాత్మక నిరూపణ వేరు ఎక్కడ కూడా చూడము అది ఏ ధర్మమైనా సరే ఏ మతమైనా సరే! ఈ ధర్మమునకంటే సనాతనమై కూడా అధునాతన జీవన విధానమునకు అనుగుణముగా తానూ పరివర్తన చెందుతూ తన అనుయాయులను ఋుజుమార్గములో  నడిపించుటకు అనుక్షణము తానూ సంసిద్ధముగా వుంది. బాధ అంతా ఆచరణ లేక అనుసరణ లోనే! మనకు మనమే ఎన్నో అవరోధాలు, అనుమానాలు సృష్టించుకొని ఆదినుండి విశ్వవ్యాప్తమగు ఈ ధర్మమును, ఈ ధర్మమునకు పునాది యగు వేదమును నిరసించి దూషించి ద్వేషించున్నాము. ఎందుకంటే వేదము యొక్క ఔన్నత్యమే మనము మరచిపోయినాము.

మనం మరిచిపోయింది వేదాలను కాదు, ఒక మహా జాతి వైభావాన్ని. వేదాలు సమస్తం జ్ఞానానికి మూలము  విదేశీయులు చెప్తున్నారు. తమ విజ్ఞానమునకు వేదమే పునాది అని ఎందఱో ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య సైంటిస్టులు చెప్పుకొన్నారు. వారిలో ఐన్ స్టీన్ కూడా ఒకడు. కొందరిని మాత్రమే ఉదహరిస్తూవున్నాను.

1. Albert Einstein, American scientist: "We owe a lot to the Indians, who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made."

2. Schopenhauer, "From every sentence (of the Upanishads) deep, original and sublime thoughts arise, and the whole is pervaded by a high and holy and earnest spirit...."In the whole world there is no study so beneficial and so elevating as that of the Upanishads. They are destined sooner or later to become the faith of the people."

Schopenhauer, who was in the habit, before going to bed, of performing his devotions from the pages of the Upanishads, regarded them as:

“It has been the solace of my life -- it will be the solace of my death."


3. Lord Warren Hastings (1754-1826), was the first governor general of British India:

He wrote with a prophetic and resounding pronouncement on the whole body of Indian writings: "The writers of the Indian philosophies will survive, when the British dominion in India shall long have ceased to exist, and when the sources which it yielded of wealth and power are lost to remembrances." 

3. Lord Warren Hastings (1754-1826), was the first governor general of British India:

He wrote with a prophetic and resounding pronouncement on the whole body of Indian writings: "The writers of the Indian philosophies will survive, when the British dominion in India shall long have ceased to exist, and when the sources which it yielded of wealth and power are lost to remembrances."

4. Repelled by the increasing materialism of the West, Emerson turned to India for solace: "The Indian teaching, through its clouds of legends, has yet a simple and grand religion, like a queenly countenance seen through a rich veil. It teaches to speak truth, love others, and to dispose trifles. The East is grand - and makes Europe appear the land of trifles. ...all is soul and the soul is Vishnu

5. Wilhelm von Humboldt (1767- 1835) Prussian minister of education, said about Bhagavatgita that " this episode of the Mahabharata was the most beautiful, perhaps the only true philosophical song existing in any known tongue ....perhaps the deepest and loftiest thing the world has to show."

ఈవిధంగా పైన తెలిపినవారే కాకుండా ఈ దేశమును, వేదములను, భగవద్గీతను తమ తమ గురువులుగానెంచి పొగడినవాళ్ళు అనేకానేకులు వున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధములోని అక్ష రాజ్యములలోని ప్రధాన రాజ్యమయిన జర్మనీ నియంత, మిత్ర పక్షాలలో ప్రధానమయిన బ్రిటనుకు పరాధీనయై  పనిచేయుచున్న భారత దేశ వేదసంపదను గుర్తెరింగి ఇచ్చటి ఒక మహా వేదపండితుని తన గూఢచారుల సహాయముతో జర్మనీకి రప్పించుకొని  ఏవిధముగా తన అణ్వస్త్ర సంపదను అభివృద్ధి చేసుకొన్నాడో అచటి పార్లమెంట్ The German Bundestag భవనము మనకు చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ మనకు చెబుతుంది.

హిట్లరంతటి వాడు గురుత్వముంచిన ఆ  మహానుభావుని పేరే బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు.

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖములుగా, నాలుగు రూపములలో అవగతమవుతుంది అని పెద్దలు చెబుతారు. వాటిని ఆపోశనము పట్టినవాడు ఈ మహానుభావుడు. అంతటి సమున్నత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయనను జర్మనీకి రప్పించుకొన్నారు.

మిగిలినది రేపు.........

గురు శిష్య సంబంధం - 2

 

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన ఈ దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి ఇప్పుడు తెలుసుకొందాము. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయములను దర్శింప జేయుచుండగా ఓ చోట ఒక సనాతన భారతీయ విప్రవర్యుని ఛాయా చిత్ర పటము కనిపించింది. విస్మితుడైన ఆరాయబారి ఆయన ఎవరు అని జర్మనీ అధికారులను అడుగుటతో  వారు అతనికి బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారిని గూర్చి విపులముగా చెప్పవలసి వచ్చినది.

తొలి ప్రపంచ యుద్ధం అణగారి పోవుటజర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమగుట, ప్రపంచమంతా ఆర్థికమాంద్యము నెలకొనుట మనకు ఎరుకపడిన అంశాలే! ఆ యుద్ధమునందు  బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానమును దిగమింగుకోలేక, ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్న తన విశ్వాసమును పుష్టి చేయదలచి, తమ జాతి ఆధిపత్యమును నిరూపించదలచి ఆయన నాజీ పార్టీ స్థాపించి, వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించినారు. అదే రీతిలో కొత్త కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించినారు. సంస్కృతము తమ జాతి మూలభాష అని తాను నమ్మి సంస్కృత భాషాధ్యాయనము పట్ల జర్మన్లకు  ఆసక్తి పెంపొందించినారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయములలో  మారణాయుధముల రహస్యములు దాగియున్నవని ఆయన గ్రహించి,

 సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేసినారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాజ్ఞ్మయము నుండి జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టిచర్యలు  తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాజ్ఞ్మయము నుండి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చినారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ గుప్తచరులు ఆయన కోసం భారత దేశములో అన్వేషణ ప్రారంభించినారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు తమ ఇంటికి వచ్చేవారితో నిత్యం శాస్త్ర విషయాలపై చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కారు. ఒకానొక దినమున ఆయన విశాఖపట్టణపు  సమీపానవున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. ఆ కాలములో బస్సుల వసతి తక్కువ. వ్యక్తులలో దార్ఢ్యము ఎక్కువ. అందువల్ల ఊళ్ళు వెళ్ళుటకు కాలినడకను ఉపయోగించేవారు. ఆ విధంగా వారు వెళుతూవున్న సమయంలో హిట్లర్‌ గూఢచారులు ఆయనను సమీపించి ప్రతిఘటనకు తావులేని రీతిలో  ఆయనను అక్కడినుండి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు ఆపైన జర్మనీకి తరలించినారు. ప్రతిఘటన వుండినదా లేదా అన్నది నాకు తెలియని విషయము. దండిభట్ల గారు  జర్మనీ చేరుకొన్న సమయానికి రెండో ప్రపంచ యుద్ధానికి (1939-1945) రంగం సిద్ధమయి వుంది.

బాంబులు మిక్కుటముగా తయారుచేస్తున్నారు కానీ నిలువ చేయుటలో  ఏర్పడు వత్తిడికి అవి ప్రేలిపోతూవుండుటతో విపరీతమైన ధన జన అస్త్ర నష్టము సంభవించేది. తమ దీన స్థితిని వివరించి వేదములనుండి తగిన ఉపాయమును సూచించమని అర్థించినారు. హిట్లరు గుణగణములు తెలియని శాస్త్రిగారు ఆర్త రక్షకుడై  యజుర్వేదం నుండి ఆ సమస్యకు పరిష్కారం సూచించినారు. వారి సలహా ఫలించింది. సైనిక దళపతులు దానితో ఆయనకు బ్రహ్మరథము పట్టినారు. అప్పటినుండి ఆయన వారికి పరమ పూజనీయులైనారు.

తన వేదపాండితీ ప్రకర్షచే జర్మనులకు తనవంతు సహకారం అందించి జర్మనీ పురోభివృద్ధికి ఇతోదికముగా పాటుబడినారు. కానీ వారు తర్వాత కాలములో తిరిగీ  భారతదేశమునకు రాలేక పోయినారు. కారణములు నేను చదివిన మేరకు పెద్దలద్వారా విన్నమేరకు తెలిసిరాలేదు.

దండిభట్ల వారు జర్మనీకి పోయినప్పటి నుండి వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందేదని వినికిడి. ఆయన మరణం తర్వాత కుటుంబ

భృతిగా తొంభై రూపాయల వంతున వారి శ్రీమతికి అందేదట. ఆ తరువాత ఎప్పుడు ఆగిపోయింది అన్నది మనకు ఊహకు అందని విషయము.

వేదమూర్తులగు దండిభట్ల వారు దేశానికి దూరమైనా, తర్వాత కాలములో దేశ స్వాతంత్ర్యము వచ్చినా, అటు దేశము, ఇటు రాష్ట్రము కూడా ఆయనను వెనుకకు తెప్పించే ఆలోచన చేయలేదు. అసలు అటువంటి ఒక మహనీయుడు ఆంధ్రుడై రాజమహేంద్రి లో నివసించినాడు అన్న విషయమునే పట్టించుకొని వుండరు. కానీ జర్మనులు మాత్రం ఆయనను  తమవానిగా, మాననీయునిగా, మహనీయునిగా ఇప్పటికి జర్మనీలో  పార్లమెంట్ లోని విదేశాంగ శాఖ కార్యలయంలో,దండిభట్ల వారి చిత్ర పటమును ఉంచుకొనుట వారి కృతజ్ఞతా హృదయమునకు, వారి పై గురుత్వమునకు వేదము పై భారత దేశము పై గౌరవ భావమునకు మనము ధన్యవాదములు చెప్పవలసి వుంటుంది.

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనము కూడా వారి నికృష్ట కార్యములకు మన మూఢ జ్ఞానమును జోడిచి మన సంస్కృతిని, మన వేదములను, మన సంస్కృతమును అవహేళన చేస్తూ అవనత శిరస్కులమై అవమానముల ఊబిలో కూరుకొని యుండుటకే ఇచ్చగించుచున్నాము. గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే  భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి, మనము పాలు త్రాగిన రొమ్మునే గుద్దుతూ వున్నా, ఆతల్లిని ఆదరించే సంస్కారవంతులు విదేశాలలో వుండుటయేగాక అంకిత భావముతో ఆ తల్లి బిడ్డలపై గురుత్వముతో, సేవ చేస్తున్నారు. గురుత్వమును గురించి దాని ప్రయోజనమును గురించి చెబుతూ ఈ మహనీయుని తలపోయుట జరిగినది. ఇక తిరిగీ అసలు విషయమునకు వస్తాము.

మిగిలినది మరొకమారు .........

గురు శిష్య సంబంధం - 3

మన సాంప్రదాయములో విడాకులు (Divorce) అన్న మాట లేదు. సంసారము అన్నది మోక్షసాధనకు ఆలంబన గా గుర్తింపబడినది. భార్యకు భర్తకు నిర్దుష్ఠమైన బాధ్యతలు నిర్దేశించబడినవి. పిల్లల పెంపకమును గూర్చి చెప్పబడినది. దశల వారీగా వారి దిశలు నిర్దేసించబడినవి. అవే బాల్య యౌవ్వన కౌమార వార్ధక్యములు. ఈ విమర్శ, ఈ వివరణమతములు అని చలామణి అగుచున్న వేరు ఎందునూ కానరాదు. అనాది నుండి పునాది కల్గిన ఈ ధర్మము యొక్క పటిష్ఠత వానిలో లేదు.

మన మను ధర్మ శాస్త్ర ప్రకారము ముందు తల్లి, తరువాత వరుసగా తండ్రి గురువు దైవము వస్తారు. ఆ మాటకొస్తే మొదటి ముగ్గురూ గురువులే! తల్లి గురువై పరిసరాలను చూపుతుంది. పెద్దలపై గౌరవము, దేవునిపై భక్తి కలిగింపజేస్తుంది.  తండ్రి గురువై లోకజ్ఞానాన్ని, సంఘాన్ని, సాంప్రదాయాలను, పరిచయం చేస్తాడు. లౌకిక విద్యకు తానాదిగురువై నిలుస్తాడు. కావున వీరిరువురు గురుతుల్యులుగా భావింపబడితే ఇక అసలు గురువు జీవితములో ప్రవేశిస్తాడు. సక్రమమైన గురువు వద్ద ప్రవేశపెట్టే బాధ్యత తండ్రిదే. నేడు తల్లిదండ్రులు ఉభయులూ చదువుకొన్న వారే కాబట్టి ఆ బాధ్యత ఇరువురూ తీసుకొంటున్నారు. అట్టి గురువును తొలుదొలుత తలచుకోవలసిన బాధ్యత మనకెెంతయో వుంది. అందుకే పాఠశాలలో దినచర్య గురువందనముతో ప్రారంభించవలసి వుంటుంది. విద్య నేర్చుకునేటంత కాలమూ, ఆపైన జీవితాంతము గురువును తలచుకోవలసినదే! ఆ గురువందనమునకు ఊతకర్రయే ఈ శ్లోకము.

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః

ఇక్కడ ‘బ్రహ్మా’ అన్న పదము శ్లోకమునకు మొదట ‘బ్రహ్మ’ అన్న పదము శ్లోకమునకు చివర అంటే శ్లోకములో రెండు పర్యాయములు వస్తూ వున్నాయి. మొదటిదయిన బ్రహ్మ కు దీర్ఘము వుండాలి ఆయన ఈ ప్రపంచమును సృష్టించిన బ్రహ్మ. రెండవ బ్రహ్మ కు దీర్ఘము ఉండకూడదు. ఈ బ్రహ్మ ‘ఆ బ్రహ్మావిష్ణుమహేశ్వరులసృష్టికర్త’ దేవుడు ఒక్కడే అంటారు కదా! ఆయనే ఈయన. కావున వేదాలు ప్రతిపాదించినది ఒకదేవునే. కానీ ఆయనను ఏ రూపములోనైనా పూజించి అనుగ్రహము పొందే వెసలుబాటు ఈ వైదిక ధర్మమునకు మాత్రమే వుంది. ఒక మునిసిపల్ కార్యాలయము వుంది అనుకొందాము. మన పని జరుగుటకు నేరుగా మునిసిపల్ కమీషనరు వద్దకు పోము. అంచలంచలుగా పోతాము. ఈ అంచలంచలే మనకు ఇష్టమైన దేవుళ్ళు. దేవునికి రూపమును ఏర్పరచి మనకు ఇష్టమగు రూపమును పూజించుతాము. ఇతరమతములలో దైవమంటే వెలుగు. అది వారు స్వంతముగా చెప్పినదికాదు. అది వేదం వాక్యమే. సామాన్యునికి అర్థమగుటకు పరమాత్మ సూర్య మండల స్థితుడై వున్నాడు అని చెప్పినారు. మన బాగోగులన్నీ ఆయనవే. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అన్నది మన శాస్త్రము. అందుకే రోజూ ఉదయాన సూర్యుని వైపు తిరిగి శ్రద్ధ కలిగినవారు గురువు మూలముగా నేర్చుకొని సూర్య నమస్కారాలు చేస్తారు. ‘cooling lenses’ లేకుండా సూర్యుని చూడగలమా! ఆయన వేడి భరించగలమా! మనకు కనిపించేది సూర్య మండలమే! దానినే సూర్యుడు అంటున్నాము. కొందరు అదేమన్నా దేవుడా అoటూవుంటారు. అందులో వసించువాడు పరమాత్మ. ఆయన ‘సవిత’ అన్న కాంతి శక్తిని మనకు ప్రదానము చేస్తున్నాడు. కాబట్టి సర్వాంతర్యామి, ఆయన మనకు కనిపించే దైవము. ఈ మాటనే ’ఎందెందు వెదకి చూచిన అందందే కలడు’ అన్న భాగవత పద్యము పుష్టి చేస్తుంది. అందుకే ఈ సర్వాంతర్యామిని ఆయనను గూర్చి మరియు అనేకములైన లౌకిక విషయములను గూర్చి చెప్పే గురువునకు మనసా వాచా కర్మణః నమస్కరించమంటుంది వేదము.

వేదము: తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్ఛతి

         తత్ వాచా వదతి తత్ కర్మణా కరోతి

కానీ నేడు ఈ హైందవ సమాజములో ఎక్కువగా జడత్వము నిండియున్నది. మంచి చెడ్డల విచక్షణ లేదు, మనము చేసే పని సమాజమునకు ఉపయోగపడుతుందా అని యోచించే తీరుబాటు లేదు. 10 రూపాయలు పెట్టుబడి పెడదామా 10 లక్షలు సంపాదిద్దామా అన్న ఆలోచన తప్ప. వీరికి మార్గము ముఖ్యము కాదు ధ్యేయము ముఖ్యము. అందువల్ల ఎవరైనా చెబితే వినే ఓపిక సన్నగిల్లి పోయింది.

మారోజులలో ఎక్కువమందికి తల్లిదండ్రులపై మమకారము మరియు గౌరవము, పెద్దలముందు వినయము విధేయత, గురువుల ఎడ నమ్రత, బందుజనులపై ఆదరము ఆప్యాయత, అతిథులముందు అణిగి మణిగి యుండుట, మొదలగు సత్వగుణములు అనేకములు. దానికి తోడు నాటి చందమామలు, బాలమిత్రలు, చెడు పై మంచి జయించే అనేక పౌరాణిక జానపద చలన చిత్రములు మొదలగునవెన్నో కారణములు. నేటి సమాజమునకు ఆ శక్తి లేదు, ఆసక్తీ లేదు.

చిత్రమయిన విషయము ఏమిటంటే ఒక 2౦౦౦ వెల సంవత్సరములకు పూర్వమే ఈ పరిస్థితి మహానుభావుడు భర్తృహరి అనుభవము లోనికొచ్చింది. అందుకే ఆయన ఈ విధముగా అన్నాడు.

మిగిలినది మరొకమారు……


గురు శిష్య సంబంధం4

బోద్ధారో మత్సరఃగ్రస్తా

ప్రభవః సమయ దూషితః

అభోదోపహతాశ్చాన్యే

జీర్ణమంగే సుభాషితం

ఏమన్నాడంటే, విద్వాంసులకు చెబుదాము వారయితే కష్టము లేకుండా తెలుకొంటారు అనుకొంటే మాకన్నీ తెలుసు నీవు చెప్పనక్కరలేదు అని పొగరుగా సమాధానము ఇస్తారు. రాజులు, ధనవంతులు, వ్యాపారవేత్త(Industrialists)లకు చెబుదామంటే తమ సమయము అమూల్యమంటూ దానికి లెక్కలు కట్టి ఈ ఉపన్యాసాలు వింటూ కూర్చుంటే ఇంత నష్టపోవలసి వస్తుందని, ఆ చెప్పవచ్చినవాడిని అక్కడి నుండి అట్లే అయ్యగారు లేరు అన్న జవాబాబుతో అంపివేస్తారు. మరి సాధారణ జనగణమునకు చెబుదామంటే వారేమో చెప్పించుకొని అంతావిన్న తరువాత మీరు చెప్పింది బాగుంది కానీ ఏమి చెప్పినదీ అర్థము కాలేదంటారు.

ఇక్కడ ఒక చిన్న కథ చెబుతాను. ఒక 1౦౦ సంవత్సరముల క్రితము ఇద్దరు గొర్రెల కాపరులు వుండేవారు. సూర్యోదయమునకు గోర్రెెలను తోలుకొని కొండకు పోతే  తిరిగీ చీకటి పొద్దుకు ఇల్లు చేరేవారు. వీరికి చేతిలో పొడవాటి కర్ర వీపుమీద కంబళి ఆభరణములు. ఒకరోజు ఇద్దరూ చీకటి పడుతూ వుండగా ఇల్లు చేరినారు. ముచ్చట్లు స్నానము భోజనము ముగించి పక్క పక్క ఇండ్లే కాబట్టి బయట వేసియున్న మంచాలపై పక్కలను పరచి పండుకొన్నారు. ఒకడేమో నిదురబోయినాడు. రెండవానికి నిదుర పట్టలేదు. కొంత దూరములో ఎవరో ఉపన్యాసము ఇస్తున్నట్లు గ్రహించినాడు ఆ రెండవ వాడు. ఎటూ నిద్ర పట్టలేదుకదా అని కంబళి వీపు మీద వేసుకొని చేతిలో ఊతకు కర్ర పుచ్చుకొని బయలుదేరినాడు ఉపన్యాసము చెప్పే చోటుకు. జనముతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. వారిని వీరిని అడిగి తెలుసుకొన్నాడు అక్కడ రామాయణ కథా కాలక్షేపము జరుగుతూ వుందని. సరే తాను ముందు వరసలలో కూరుచునే అవకాశము లేదు కాబట్టి అన్ని వరసలకూ వెనకాల ఒకచోట నిలబడి తన కంబళి వీపుపైన కప్పుకొని కర్ర ఊదపొడుచుకొని , కర్ర మీదికివంగి నిలబడినాడు. రావణుడు సీతమ్మను చెరపట్టి అశోకవాటికలో పెట్టినాడు. శ్రోతల గుండెలు బరువెక్కి కంట తడి పెట్టుకొనే సమయములో కథలో లీనమై వింటున్న మనవాని వీపుపై దబ్బుమన్న శబ్దముతో బరువెక్క సాగింది. ఒక క్షణము ఆలోచించి తిరిగీ వినుటలో లీనమైపోయినాడు. కథ ముగిసింది. తెల్లవార వచ్చింది. మనవాడు ఇంటికి వస్తూనే అప్పుడే నిద్ర లేచిన మిత్రుడు “సరిగా తెలావారనేలేదే, అప్పుడే ఎక్కడికి పోయి వస్తూవున్నా”వని అడిగినాడు. “రామాయణ కాలక్షేపము అదో అక్కడ జరుగుతూవుంటే పోయివుంటిని”. “ అయ్యవారు బాగా చెప్పినాడా” అని ఆడినాడు మిత్రుడు. అందుకు మనవాడు “ఆయన బాగా చెప్పినాడా లేదా అన్నది నేను చెప్పలేనుగానీ నావీపు మీద మాత్రము ఎదో బరువుగా వుండినది” అన్నాడు.

అసలు జరిగింది ఏమిటంటే అతడు వంగి నిలచినప్పుడు జానపద చిత్రములో NTR(Senior) గుఱ్ఱము మీదికి లంఘించినట్లు ఒక పిల్లవాడు అతని వీపుపై లాఘవముగా దుమికి కూర్చున్నాడు, కథలో రావణుడు సీతమ్మను చేరపడుతున్న సమయములో! అందుకే అందరికీ గుండె బరువేక్కితే అతనికి వీపు బరువెక్కింది.

ఇదంతా ఎందుకు చెప్పవచ్చినానంటే వినేవానికి తగినంత జ్ఞానము లేకుంటే చెప్పేవానికి చెమటలు కారవలసినదేగానీ చేయగలిగినది ఏమీ ఉండదు. కాబట్టి చెప్పేవాడు కేవలము పాత్రత కలిగిన వారికి చెబితే ఫలితము వుంటుంది. ‘చెవిటి వాని చెవిలో  శంఖము ఊదితే ఏమిరా ఎంక అంటే ఎముక కోరుకుతున్నావే’ అన్నాడట.

ఈ విధముగా నేను చెప్పదలచుకొన్న సుభాషితములు, పండితులు వినరు, ధనవంతులకు సమయముండదు, సామాన్యులకు అర్థము కాదు కావున ఇవి కలకాలమూ నాలోనే వుండిపోవలసినదేనా అని బాధతో నిర్ధారించుకొన్నాడట. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన మెరిసింది. అందుకే వారు ఏ కోవకు చెందినవారయినా తమకు అవసరమైనపుడు తామిష్టపడినపుడు వారే వచ్చి చదువుతారని తన సుభాషితములను నీతి, శృంగార, వైరాగ్య శతకములుగా విభజించి గ్రంధస్థము చేసియుంచివేసినాడు. సాదు వర్తనకు సంఘ సౌభాగ్యమునకు, సాటిమనిషికి సహకారమందించుటకు, ఒక్క మాటలో, సదాచార సంపన్నతకు భర్తృహరి సుభాషితములు కాళరాత్రిలో కరదీపికలు.

ఒక విద్యార్థి ఏ విధముగా ఉండాలో చెప్పే ఈ సుభాషితమును గమనించండి.

వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతిః గురౌ నమ్రతా

విద్యాయాం వ్యసనం స్వయోషతి రతి ర్లోకాపవాదాద్భయం

భక్తిశ్శూలిని శక్తిరాత్మ దమనే సంసర్గ ముక్తిః ఖలైః

ఏతే ఏషు వసంతి నిర్మల గుణాః తేభ్యో మహాభ్యో నమః

దీని భావము ఈ ప్రకారముగా వున్నది. సజ్జనులతో సహవాసము చేయవలెనను కోరిక. ఇతరులకు వున్న మంచి గుణములను తానూ నేర్చుకొనవలెనను తపన, చదువు అంటే జ్ఞానము సంపాదించవలెనను విషయముపై ఆసక్తి, తన భార్య పైననే ప్రేమ, లోకాపవాదము పై భయము, శివుని మీద భక్తి, మనోనిగ్రహ శక్తి, దుష్టునికి దూరముగా ఉండుట – ఈ విధములగు సద్గుణములు కల్గిన సత్పురుషులకు నమస్కరించుచున్నాను.

ఇప్పుడు ఈ విషయముల గూర్చి కొంత విశ్లేషణ చేసుకొందాము. మొదటిదే సజ్జన సాంగత్యము. విద్యార్థులకు తరగతిలో సహాధ్యాయులతో పరిచయము ఏర్పడుతుంది. అదే రాను రాను స్నేహితముగా మారుతుంది. తెలియని వయసు. ఒక ధనవంతుడయిన తండ్రి కుమారుడు రోజూ రూ. 5౦౦ తెచ్చి తరగతిలో పిల్లలకు ఖర్చు పెట్టేవాడు. వారి తరగతిలో పాఠము చెప్పుటకు వచ్చే టీచరుకు సిగరెట్ తాగే అలవాటుండేది. కానీ పాఠము బాగా చెప్పేవాడు. ఈ ధనవంతుని బిడ్డకు సిగరెట్ తాగితే ఎట్లుంటుందో అనిపించింది. అంతే ఒక గొప్ప బ్రాండ్ పాకెట్ తెచ్చి తన స్నేహితులను ఆహ్వానించి కాల్చటం మొదలు పెట్టినాడు. అంటే ఒక దురలవాటు పిల్లలు నేర్చుకొనే దానికి వెనుక ఎవరో ముఖ్యమయిన వ్యక్తిదే హస్తముంటుంది. ఆ టీచరు యొక్క పాఠము చెప్పే తీరును ఆ విద్యార్థి అనుకరించి ఉండవచ్చును కానీ చెడ్డ చెవులకు, కంటికి చాలా తొందరగా ఎక్కుతుంది. ఆ బాలుడు తాను చెడి పోవుట కాకుండా పది మందిని చేడిచినాడు. కారణము ఆ టీచరు. మరి అతనైనా కోరి చెెడిచినాడా లేదు. అనుకరణ, అనుసరణ. పూర్వపు సినిమాలలో మన NTR ANR R.నాగేశ్వర రావు గార్లు సిగరెట్ ఎట్లా వ్రేళ్ళ మధ్యన పట్టుకొంటారో ఎంత STYLE గా నోట పెట్టుకొంటారో, ఎంత హుషారుగా పొగను రింగులు రింగులుగా వదులుతారో చూసి ఎక్కువగా నేర్చుకొనేవారు. తప్పు ఎవరిది? నటులదా! దర్శకునిదా! కథకునిదా! నిర్మాతదా! సినిమా సెన్సారు బోర్డుదా! లేక సినిమాకు పిలుచుకు పోయిన తలిదండ్రులదా! జవాబు లేదు. చెడినది ఒకడే! రేపు వాడే వందమందిని చెడుస్తాడు. అంటే పిల్లవాని మనసు శ్రీగంధపు వనము లాంటిది. చల్లటి గాలి వీచిందా పరిసరాలకు పరిమళాన్ని పంచుతుంది. నిప్పు అంటుకొందా వనము ఆనవాలే లేకుండా అంతరించి పోతుంది. మరి వనమును కాపాడు బాధ్యత వనమాలిదా, యజమానిదా, నిప్పుదా లేక దానికి తోడయిన గాలిదా! నిప్పు లేనంత వరకు గాలి తన పరిసరాలకు ఎంతో హాయినిచ్చింది. కానీ అగ్గిని చూస్తూనే అన్నీ మరచిపోయింది. కాబట్టి చెడుగును ఊహించి తగిన విధముగా అందుకు బాధ్యత గలుగబోవు వారంతా జాగరూకతతో ఆ వనమును కాలకాలము కాపాడి ఆ వనము యొక్క పరిమళము తరతరాలకూ అందించాలి. కాబట్టి సజ్జన సహవాసము ఏర్పరచితే చాలు అదే కల్పవృక్షమై కాపాడుతుంది తనను ఆశ్రయించినవారిని.

మిగిలినది మరొకమారు..........

గురు శిష్య సంబంధం  5

ఇక మంచి గుణములను ఇతరులను జూసి నేర్చుకొనుట. మంచి ఎవరినైనా చూసి నేర్చుకొనవచ్చును. అందుకే జగద్గురువు శంకరులవారు ‘చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ’ అంటే ‘చెప్పదగినవాడు చండాలుడైనా నాకు గురువే’ అన్నాడు. పూలమాలలో పూలతో కలిసి వున్న అదృష్టానికి, దారానికి కూడా సువాసన అబ్బుతుందికదా! బొంగరము త్రిప్పే జాలిక లేక జాటి చిరిగిన బట్ట పెలికలతో పెనేవారు. బొంగరము మాత్రము కొయ్యతో తయారుచేసి అమ్మే వారు. బొంగరపు ములికి ఒక ఇనప మేకు. కలయిక మూడు వస్తువులది అయినా చూసేవారు బొంగరము ఎంత బాగా తిరుగుతూ వుంది అంటారు. పేరు ములికికి గానీ జాటీకి గానీ రావు. తమకు పేరు రాలేదని బొంగరమును త్రిప్పుటకు మొరాయించవు. ఈ దృష్టితో చూస్తే ఆ మూడింటిని చూసి ఎంత మంచి నేర్చుకొనవచ్చునో గమనించండి. కాబట్టి మంచి గొప్పవారినుండియే కాకుండా సాధారణ వస్తువుల నుండి కూడా నేర్చుకొన వచ్చును. కత్తి కాయనూ కొస్తుంది, కాయాన్నీ కోస్తుంది. వాడకములోనే తేడా! అంటే మన పరిశీలనలోనే తేడా వేరేమీ కాదు.

దత్తాత్రేయులవారికి 24 మంది గురువులట. ఈవిషయాన్ని మనము ఉద్ధవ గీతలో     శ్రీకృష్ణుడు దత్తాత్రేయుని యొక్క ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొంటాడు. ఆగురువులు: భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. ఇవి ఏవిధముగా గురువులు అని చెప్పుటకు సమయము చాలదు. దీనివల్ల మీరు అర్థము చేసుకోవలసినది ఏమిటంటే అల్పము అన్న ఆలోచనకు తావివ్వక  లోతయిన పరిశీలన, నిరంతర అన్వేషణ అన్న రెంటినీ పుణికిపుచ్చుకొని  మీరు మీ పరిధిలో ఆలోచించినారంటే ఎంతో గొప్పవారు కావచ్చు. అసలు ఒక మంచిగురువు తన శిష్యునితో కలిసి భగవంతుని ఈ విధముగా ప్రార్థించుతాడు.

ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహైః

తేజస్వినా వదీత మస్తుమా విద్విషావహైః II ఓం శాంతి శాంతి శాంతిఃII (కేనోపనిషత్తు)

మన ఉభయులను భగవానుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక. మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక.

నేటి పాఠశాలలకు గురుశిష్య సంబంధ సందేశ సంకేతము కాదా! ఇందులో ఏదేవునిపెరూ లేదు. ఆ నిరంజన నిరాకారుడగు పరమాత్మను ఉభయులూ ప్రార్థించుచున్నారు.

మరి నేటి విద్యా బోధన ఇంత ఉదాత్తముగా ఇంత గొప్పగా ఉందా! జవాబు ఎవరికి వారు చెప్పుకొంటే చాలు. నేటి విద్యా బోధనకు ఒక ఉదాహరణము కథ రూపములో చెబుతాను. నాకు తెలుసు మీరు తప్పక నవ్వుతారని. బాగా నవ్విన తరువాత నేను చెప్పబోయే కథ లోని వాస్తవాన్ని మాత్రము మనసు పెట్టి యోచించండి.

మిగిలినది మరొకమారు........

గురు శిష్య సంబంధం  6

శివ ధనుర్భంగము

ఇది ఒక 7,8 దశాబ్దాల క్రిందటిమాట .

అనగనగా ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠములు వుండవలసినదే కదా. తెలుగు

పాఠమూ ఉండవలసిందే. ఆ పాఠశాలకు ప్రధాన అధ్యాపకుడూ ఉండవలసిందే. ఆయన క్రింద అధ్యాపకులూ ఉండవలసిందే. ప్రదానాధ్యాపకునిపైన జిల్లా విధ్యాధికారీ(D E O) ఉండవలసిందే.

ఈ పాఠశాలలో మాత్రము, తెలుగు పండితుడు లేనందువల్లనూ, D E O వచ్చుచున్నందువల్లనూ కార్యము గడుపుటకు అటెండరుకు తెలుగుపండితుని వేషమువేసి, ఆ విషయము D E O వచ్చినపుడు ఆయనకు చెప్పవద్దని విద్యార్థులకు చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకొన్నాడు ఆ ప్రధానోపాధ్యాయుడు . తరగతి నుండీ పోతూ పోతూ పాఠ్యాంశము 'శివ ధనుర్భంగము' అని నల్ల బల్ల (BOARD)పై వ్రాసి పోయినాడాయన, ఆ పాఠము ఆ తరగతి వారికుందని తెలుసు కాబట్టి . తన భయం తనకున్నా, తాను DEO వెంట వుండి Manage చేసుకోగాలనన్న నమ్మకముతో!

అదృష్టమో దురదృష్టమో D E O, ప్రదానాధ్యాపకుడు లేకుండానే,ఆ తరగతికే వచ్చినాడు . BOARD పై వ్రాత చూసి ఈ పాఠమైనదా అని పండిత వేషాధారినడిగినాడు. తల వూపినాడపండితుడు. అంతట

D E O చివరి వరుస మూలాన కూర్చున్న బాలుని లేపి శివుని విల్లు ఎవరు విరిచినారు?

అన్నాడు . అబ్బాయి ఉలుకు పలుకు లేక నిలబడినాడు. అధికారి సహనము చచ్చుపడిన తరువాత వేరొక బాలుని లేపి అడిగినాడు .  ఆ బాలుడు తనకు తెలియదన్నాడు . వేరొక బాలుడు చూడలేదన్నాడు . ఇంకొకడు శబ్దము వినిపించింది కానీ తానూ చూడలేదన్నాడు . ఇలా అందరినీ అడిగి వేసారిన అధికారి అసహనంగా అపండితుడైన ఆ పండితుని అడిగినాడు . అతను 'సార్ నేను Head Master గారు పిలిస్తే వెళ్ళినా నన్నాడు . D E O గారికి వళ్ళు మండి "శివధనుస్సు ఎవరు విరిచినారు" అంటే ఒక్కరూ సమాధానము చెప్పరే అని చాలా హెచ్చు స్వరములో అడిగినారు. ప్రధానాధ్యాపకుడు తరగతి గదిలోనికి ప్రవేశించుతూ వున్నపుడు "ఎవరు విరిచినారు" అని D E O గారు అనటం మాత్రము వినిపించింది. ఆయన ఆలోచించకుండా ఆకస్మికాపన్నివారణ మంత్రము ప్రయోగించినాడు . అంటే ఆయన ఈ మాట చెప్పినాడు ."ఎవరు విరిస్తే ఏముంది లెండి తలా ఇంత వేసుకొని తయారు చేయిస్తా"మన్నాడు . D E O స్పృహతప్పి పడిపోయినాడు.

ఇదీ మరొక విధమైన గురుశిష్య సంబంధమే!

‘స్వయోషతిరతిః’ అంటే భార్యాభర్తలు అనుపమాన అసమాన పరస్పర అభిమానము కలిగి వుండాలి. తన భార్య/భర్త పైననే ప్రేమ అన్న అంశము ఇక్కడ చర్చించతగదు. A Certificate సినిమా చూచుటకు 18 సంవత్సరాల వయసు దాటాలి కదా! సరే దాటిన వారికి చెబుదామా అంటే వారంతా అప్పటికే ముదిరిపోయి వుంటారు, వారికి అవసరము లేదు. కానీ అసలు భార్యాభర్తల బాధ్యతలను ఎంత క్రమబద్ధమైన ( Systematic Way) రీతిలో చెప్పినారో ఒక్కసారి గమనించండి.

భార్యా భర్తల అనుబంధం

మూడు ముళ్ళకెపుడు ముసలితనము రాదు

పెరుగుచుండు ప్రేమ తరుగ బోదు

పెనము దోశపిండి ప్రేమతత్వము చూడు

రామమోహనుక్తి రమ్య సూక్తి

భార్య భర్తల అనుబంధము పెనము దోశపిండికి ఉన్న సంబంధము వంటిది. ఎన్ని వందల సంవత్సరములు గడిచినా, పెనము ఎంత వేడెక్కినా పెనమునకు పిండికి వున్న అనుబంధము తీరదు.

వయసు అందుకు ప్రతిబంధకము కాదు.

అసలు స్త్రీ యొక్క బాధ్యతలు లేక గుణములు, లేక చేయవలసిన కర్మలు ఏవిధముగా వుండాలో ఈ శ్లోకము తెలుపుతుంది.

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,

భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా సహ ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ  లాగా, మంచి ఆలోచన ఇచ్చేసమయమున మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మలతో ఉండేది ధర్మపత్ని, లేక ఈ షడ్ ధర్మములను పాటించేది ధర్మ పత్ని.

అటులనే సహా ధర్మపత్నిగా స్త్రీ ఏవిధముగా వుండవలెననేకాదు, పురుషుడు ఏవిధంగా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది, కానీ ఎందుకోఈ శ్లోకము అంతగా జనబాహుళ్యం లో లేదు.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,

సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు

ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి

 కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి. ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి. భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా కొనియాడబడతాడు.

మిగిలినది మరొకమారు........ 

గురు శిష్య సంబంధం  7 (చివరి భాగము)

భార్యా భర్తలకు ఇంతటి నిర్డుష్టమయిన నిర్వచనమును వేరే మతములందు చూడగలమా! అందుకే దీనిని ధర్మము అన్నారు. మతము అనలేదు.

లోకాపవాదము పై భయము అన్న అంశమునకు శ్రీరామ చంద్రుడు మనకు నిలువుటద్దము.

ఈ సుభాషితమును ఒక పర్యాయము చూడండి.

కే దస్యవః సన్తి కువాసనాఖ్యాః కః శోభతే యః సదసి ప్రవిద్యః ।

దొంగలు అంటే ఎవరు? – దుష్టవాసనలు. వాసనలు అంటే సంస్కారాలు అని అర్థం.

సభలలో శోభిల్లేదెవరు? – గొప్ప పండితుడు. పండితుడు అనగా శాస్త్ర జ్ఞానము కలిగిన వాడు.

మాతేవ కా యా సుఖదా సువిద్యా కిమేధతే దాన వశాత్సువిద్యా ॥

తల్లిలా మనలను ఆదరించేది, పోషించేది, ఆనందాన్ని ఇచ్చేది ఏది? – మంచి విద్య.

ఏ సంపద దానం చేస్తూ ఉంటే పెరుగుతుంది? – మంచి విద్యయే దానం వల్ల పెరుగుతుంది.

విద్యలు తెలిసి కూడా ఎవరైతే నేర్పడో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు.

కుతో హి భీతిః సతతం విధేయా లోకాపవాదాద్భవ కాననాచ్చ ।

దేని గురించి భయపడాలి? – లోకాపవాదమను బీజముచే ఏర్పడిన అరణ్యమును తలచుకొని భయపడాలి.

కో వాస్తి బన్ధుః పితరౌ చ కౌ వా విపత్సహాయః పరిపాలకౌ యౌ!!

గొప్ప బంధువు ఎవరు? – ఆపదలో సహాయపడే వాడే గొప్ప బంధువు.

తండ్రి అని ఎవరిని అనాలి? – కన్నతండ్రి కాకుండా మనలను పోషించే వాడు, పాలించే వాడు తండ్రియే.

బుద్ధ్యా న బోధ్యం పరిశిష్యతే కిం శివ ప్రసాదం సుఖ బోధ రూపమ్ ।

దేనిని తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసి ఉండదు? – శివుని అనుగ్రహం చేత ఆనంద స్వరూపము, చిద్రూపము అయిన బ్రహ్మము గురించి తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరం లేదు. అంటే సంపూర్ణమగు భక్తితో పరమాత్ముని ఆరాధించుట అని ప్రస్తుతానికి అనుకొందాము. అదే శివునిపై భక్తి అనేది. శివం అంటేనే సుఖము, శుభము కళ్యాణము,ఆనందము అన్న పలురఖములగు అర్థాలు వస్తాయి. ఇట్టి నీతులను కలిగిన 'నీతే శాస్త్రమును బోధించవలసిన బాధ్యత పాఠశాల Teachers ది. మరి వారు గురువులు కాదుకదా, కేవలము Teachers మాత్రమే! పైగా వారిలో అధికాంశము ఈ విషయములను వినికూడా ఉండరు. ఇటువంటి అంశముల భోదనకు తగిన విధముగా విద్యా ప్రణాలికను మార్చుటకు స్వకీయ కుక్షింభరత్వమునకు పాటుబడు మాన్యతమ రాజకీయనాయకులకు ఇవి అన్నీ పట్టవు కారణం వారికవి గిట్టవు. 

 భక్తికి మూలము మనోనిగ్రహము . మనసు పాదరసము(Mercury). ఒక తలము పై పోసి చూస్తే వున్న చోట ఒక క్షణము నిలువదు. అందుకే ముందు, దానిని గోడలు కలిగిన పాత్రయండు ఉంచవలెను. అంటే మనము మనసులో  కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యములను 6 శత్రువులను మన దరికి రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనోనిగ్రహము దానివల్ల భక్తి ఏర్పడుతాయి.

దుష్టునికి దూరముగా ఉండుట. ఇపుడు అసలు దుష్టుని తలపులు ఎంత అనూహ్యములుగా వుంటాయి అన్నది చూడండి. ముందు ఒక శ్లోకము వినిపిస్తాను. అర్థము చెప్పిన పిదప నవ్వక మానరు, ఆశ్చర్య పడకా మానరు.

అస్త్వం భద్ర ఖలేశ్వరోహం ఇహకిం ఘోరే వనే స్తీయతే

శార్దూలాదిభిరత్ర హింస పశుభిః ఖాద్యోహమిత్యాశాయా

కస్మాద్కష్ట మిదం త్వయాద్వివసితం, మద్దేహ మాంసాశినః

ప్రత్యుత్పన్న నృమాంస భక్షణ ధియుః తేఘ్నంతు సర్వానితి

 ఒక వనవాసియైన ఋషి అడవిలో సంచరించుతూ ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని చూసినాడు. ఆయన ఆ వ్యక్తిని “అయ్యా! మీరు కౄరమృగములు సంచరించే ఈ కీకారణ్యములో ఒంటరిగా ఎందుకు కూర్చొని వున్నారు. సింహములు,పులుల వంటి భయంకర జంతువులు మిమ్ము తినివేయగలవు ” అని అడిగినాడు. అందుకు ఆ వ్యక్తి “నేను అందుకోసమే కూర్చొని వున్నాను” అన్నాడు. ఆ ఋషి “అంత ఆపద ఏమి వచ్చి పడింది నాయనా” అని అడిగినాడు. “ఆపద ఏమీ లేదు. ఆ పులియేదో వచ్చి నన్ను తిన్నదంటే అది నర మాంసమును రుచి చూచినట్లవుతుంది. అట్లు రుచి చూచుటచేత సమీపమున వున్న ఆపల్లెలోని ప్రజలందరినీ తినివేస్తుంది. నాకు కావలసినదీ అదే”నన్నాడు. చూసినారా దుష్టుడు తానూ బ్రతుకడు ఒకరిని బ్రతుకనీడు. దుర్యోధనుడు ఆవిధమగువాడగుటచేతనే కదా 18 అక్షోహిణుల సైన్యమును పొట్టన పెట్టుకున్నాడు ఒక 12 మందిని తప్ప.

 గురుత్వము ఏర్పరచుకొనుటకు తగిన వ్యక్తిని ఎన్నుకొనుట ఎంత కష్టమో చూడండి. అసలు సద్గురువును ఎన్నుకొనుటకు వినీతుడు అనగా శిష్యుడు సద్గుణ  సంపన్నుడై యుండవలెను. అదే లేకుంటే ఈ క్రింది కథలో తెలిపిన దుర్బుద్ధులగు అన్నదమ్ముల

గమ్మత్తయిన కథ వలె ముగుస్తుంది.

 ఒక వూరిలో ఇద్దరు అన్నదమ్ములు వుండేవారు. ఇద్దరిదీ కౌరవుల మనస్తత్వమే! ఒకరంటే ఒకరికి పడదు. ఒకనికన్నా మరియుకడు పై అంతస్తులోనే ఉండవలెనన్న తపన. ఒకసారి అన్న ఈ సంపాదన కొరకు ఇంత కష్టపడటమెందుకు దేవుని గూర్చి తపస్సుచేసి మంచి మంచి వరాలు పొందుతామనుకొన్నాడు. అనుకొన్నదే తడవుగా కొండ యొక్క ఒక శిఖరము చేరుకొన్నాడు. తపస్సు చేయుతకూడా వెంటనే ఆరంభించినాడు. తమ్మునికి ఈ విషయము తెలిసింది తానుకూడా అదేకొండ పైకి ఎక్కి అన్నకు దగ్గరగా వుండే వేరే శిఖరము చేరి తపస్సు ప్రారంభించినాడు. దగ్గరగా ఎందుకంటే అన్నకు దేవుడు కనబడితే తనకు తెలియటానికి. అన్న తపస్సు ఫలించింది. దేవుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. “ స్వామీ! అదో ఆ శిఖరము పై తపస్సు చేసే నా తమ్ముని కోరిక తీర్చి రండి. దానికి రెండింతలు నాకు ఇస్తే చాలు” అన్నాడు. దేవుడు ఆవిధంగానే తమ్ముని వద్దకు వెళ్లి కోరికేమితని అడిగినాడు. తమ్ముడు మూర్ఖుడు కాదు కదా! వెంటనే “స్వామీ అన్న ఏమి కోరినాడు” అని అడిగినాడు. దేవుడు ఉన్నమాట ఉన్నట్లు చెప్పినాడు. అంత తమ్ముడు బాగా అలోచించి “స్వామీ నాకు ఒక కన్ను పోగొట్టండి” అన్నాడు. ‘తథాస్తు’ అంటూ దేవుడు మాయమయినాడు. అన్న గుడ్డివాదయిపోయినాడు. దుష్ట బుద్ధి ఎట్లున్తుందో చూసినారు కదా! దీనినే ‘స్వయం నష్టయ పరాన్నాశాయతి’ అంటారు సంస్కృతములో. ఈ మాటతో నా మాటలు ముగిస్తాను.

 

గేయం గీతా నామ సహస్రం

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం||

 

శ్లోకం అర్ధం : భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ భగవంతుని రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను అని జగద్గురువులైన ఆదిశంకరుల వారి ఆదేశము.

 

స్వస్తి