యువత - భవిత - బాధ్యత
https://cherukuramamohan.blogspot.com/2018/08/blog-post.html
ఈ వ్యాసము యొక్క ప్రారంభమే ఒక విచిత్రము మరియు జుగుప్సాకరమైన విషయముతో
ప్రారంభించుచున్నాను. ఈ ఆస్య గ్రంధిలో 'సాన్నిహిత్య అభ్యర్థనలు (Friendship
Requests)' ఒక రెండు సంవత్సరముల క్రితము కొంతమంది స్వలింగ సంపర్కముపై
మక్కువ ఎక్కువగా కలిగిన యువకులు, వయసుమీరిన వారుకూడా అభ్యర్థనలు
పంపేవారు . వారి అభ్యర్ధన మన్నించే విషయములో నాదయిన శైలిలో స్పందించి
మొక్కలోనే త్రుంచివేసే వాడిని. ఇంచుమించు ఒక 100 అభ్యర్థనలు ఆవిధమైనవి నాకు
వచ్చి వుంటాయి. నేను ఒక నాలుగయిదుకు మించి పొరబాటు పడలేదు. అవికూడా ఒక
5, 6, రోజులలోనే తెలిసిపోతుంది కాబట్టి వానిని విసర్జించటం జరిగి పోయింది. ఈ
అభ్యర్థనలో భాగముగా ఒక కాలేజీ ప్రొఫెసర్ గా తన పరిచయ వాక్యములను ఆస్య
గ్రంధిలో వ్రాసుకొన్న వ్యక్తి తన అభ్యర్థనను నాకు పంపినాడు. అతని ఛాయాచిత్రము
కాలరేఖ పై లేదు. నేనతని పిచ్చాపాటి బల్ల(Chatting Board) పై, అంత చదివికూడా,
ఛాయాచిత్రమును పెట్టే సభ్యత లేదా అని నిర్మొహమాటముగా అడిగినాను. దానికి ఉత్తర
ప్రత్యుత్తరాలలో అతను తాను స్వలింగ సంపర్కమునకు అలవాటు పడిన వ్యక్తినని,
అందువల్ల తాను ఛాయాచిత్రమును పెట్టలేదని, తాను ఆ దురలవాటునకు దాసుడగు
కాలములో నావంటివారు తటస్తపడలేదని, ఆవిషయమును అశ్రునయనాలతో
చెబుతున్నానని చెబుతూ తాను నా సహవాసమునకు తగనని తన అభ్యర్ధన వెనుకకు
తీసుకొన్నాడు. ఇక్కడ నేను చెప్పదలచినది నా గొప్పదనమును గూర్చిగాదు. తన పెద్దలచే
అంత సంస్కారము అందకపోయినా, తన నైసర్గికములో అటువంటి ఉపదేశములు
పొందకపోయినా, అంతర్లీనముగా అతనిలోని పూర్వజన్మ వాసన అతని బుద్ధిని
జాగృతము చేయగలిగింది. ఒక 7,8, నెలలు జరిగిన తరువాత తనకు నాకు మధ్యన
జరిగిన సంభాషణను గుర్తుచేస్తూ తాను దానిని సంపూర్ణముగా విడిచిపెట్టినట్లు నాకు
ధన్యవాదములు తెలుపుతూ తన అభ్యర్థనను అంగీకరించమన్నాడు. ఇక్కడ మనము
చేసిందెల్లా అతని ఆంతర్యము లోని పూర్వజన్మవాసనాను జాగృతము చేయడమే!
అందరూ ఇట్లే ఉండకపోయినా 'అనగననగ రాగామతిశయిల్లుచు నుండు.....’అని
అంటారు కదా పెద్దలు. కావున వయసులో పెద్దలమైన మనము మన బాధ్యత నిర్వర్తించితే
వారి బాధ్యతను వారికి గుర్తుచేసినవారమౌతాము. అందరిదీ ఒకేవిధమగు మనస్తత్వము
ఉండదు. అరటి, బత్తాయి , పనస మూడూ ఎంతో రుచికరమగు ఫలితములను
అందిస్తాయి. కానీ దానిని వేలికితీయుటకు ఒకే మార్గము అనుసరించుట కుదరదు.
వ్యక్తిని బట్టి సలహా వుండవలె. అంతే కాకుండా ఆ ఫలము కూడా పక్వత
గాంచియుండవలె దానిని బోధకుడు కూడా గ్రహించి యుండవలె. లేకుంటే 'ఉభయ
భ్రష్టుత్వము ఉపరి సన్యాసము' అన్నట్లవుతుంది.
ప్రారంభించుచున్నాను. ఈ ఆస్య గ్రంధిలో 'సాన్నిహిత్య అభ్యర్థనలు (Friendship
Requests)' ఒక రెండు సంవత్సరముల క్రితము కొంతమంది స్వలింగ సంపర్కముపై
మక్కువ ఎక్కువగా కలిగిన యువకులు, వయసుమీరిన వారుకూడా అభ్యర్థనలు
పంపేవారు . వారి అభ్యర్ధన మన్నించే విషయములో నాదయిన శైలిలో స్పందించి
మొక్కలోనే త్రుంచివేసే వాడిని. ఇంచుమించు ఒక 100 అభ్యర్థనలు ఆవిధమైనవి నాకు
వచ్చి వుంటాయి. నేను ఒక నాలుగయిదుకు మించి పొరబాటు పడలేదు. అవికూడా ఒక
5, 6, రోజులలోనే తెలిసిపోతుంది కాబట్టి వానిని విసర్జించటం జరిగి పోయింది. ఈ
అభ్యర్థనలో భాగముగా ఒక కాలేజీ ప్రొఫెసర్ గా తన పరిచయ వాక్యములను ఆస్య
గ్రంధిలో వ్రాసుకొన్న వ్యక్తి తన అభ్యర్థనను నాకు పంపినాడు. అతని ఛాయాచిత్రము
కాలరేఖ పై లేదు. నేనతని పిచ్చాపాటి బల్ల(Chatting Board) పై, అంత చదివికూడా,
ఛాయాచిత్రమును పెట్టే సభ్యత లేదా అని నిర్మొహమాటముగా అడిగినాను. దానికి ఉత్తర
ప్రత్యుత్తరాలలో అతను తాను స్వలింగ సంపర్కమునకు అలవాటు పడిన వ్యక్తినని,
అందువల్ల తాను ఛాయాచిత్రమును పెట్టలేదని, తాను ఆ దురలవాటునకు దాసుడగు
కాలములో నావంటివారు తటస్తపడలేదని, ఆవిషయమును అశ్రునయనాలతో
చెబుతున్నానని చెబుతూ తాను నా సహవాసమునకు తగనని తన అభ్యర్ధన వెనుకకు
తీసుకొన్నాడు. ఇక్కడ నేను చెప్పదలచినది నా గొప్పదనమును గూర్చిగాదు. తన పెద్దలచే
అంత సంస్కారము అందకపోయినా, తన నైసర్గికములో అటువంటి ఉపదేశములు
పొందకపోయినా, అంతర్లీనముగా అతనిలోని పూర్వజన్మ వాసన అతని బుద్ధిని
జాగృతము చేయగలిగింది. ఒక 7,8, నెలలు జరిగిన తరువాత తనకు నాకు మధ్యన
జరిగిన సంభాషణను గుర్తుచేస్తూ తాను దానిని సంపూర్ణముగా విడిచిపెట్టినట్లు నాకు
ధన్యవాదములు తెలుపుతూ తన అభ్యర్థనను అంగీకరించమన్నాడు. ఇక్కడ మనము
చేసిందెల్లా అతని ఆంతర్యము లోని పూర్వజన్మవాసనాను జాగృతము చేయడమే!
అందరూ ఇట్లే ఉండకపోయినా 'అనగననగ రాగామతిశయిల్లుచు నుండు.....’అని
అంటారు కదా పెద్దలు. కావున వయసులో పెద్దలమైన మనము మన బాధ్యత నిర్వర్తించితే
వారి బాధ్యతను వారికి గుర్తుచేసినవారమౌతాము. అందరిదీ ఒకేవిధమగు మనస్తత్వము
ఉండదు. అరటి, బత్తాయి , పనస మూడూ ఎంతో రుచికరమగు ఫలితములను
అందిస్తాయి. కానీ దానిని వేలికితీయుటకు ఒకే మార్గము అనుసరించుట కుదరదు.
వ్యక్తిని బట్టి సలహా వుండవలె. అంతే కాకుండా ఆ ఫలము కూడా పక్వత
గాంచియుండవలె దానిని బోధకుడు కూడా గ్రహించి యుండవలె. లేకుంటే 'ఉభయ
భ్రష్టుత్వము ఉపరి సన్యాసము' అన్నట్లవుతుంది.
ఒక వ్యక్తి సంఘమునకు ఉపయోగకారిగా ఎదగాలంటే దానికి ముఖ్య హేతువు అతని
జనన ప్రస్థానములు. పేదరికమునకు సంస్కారమునకు సంబంధము లేదన్నది మనకు
తెలిసినదే! సంస్కారమును బట్టి మాత్రమే ఒక వ్యక్తి ఆదర్శవంతుడౌతాడు, అందుకే కదా
జగద్గురువు శంకరాచార్యులవారు 'చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ'
అన్నారు. బాలుడు అటువంటి ఒక సంస్కారమును మొదట పొందవలసినది తలిదండ్రుల
ద్వారానే! ఒక 3 సంవత్సరముల వయసులో బాలుడు తన తల్లి జారిణి అని
గమనించినాడనుకొందాము, ఆ వయసులో మనోవికారము ఏర్పడదుగానీ ఆ దృశ్యము
అతని స్మృతిపథమునుండి దూరము కాదు. యుక్తవయస్కుడయిన తరువాత బాల్యములో
నాట బడిన బీజము అప్పటికి వృక్షమై వుంటుంది. 'విత్తొకటి వేస్తే చెట్టొకటి
మొలవదుకదా!' ఆ తల్లి ఆ యువకుని చెడుగునకు కారణము తానేనని తెలిసి
కుమిలిపోవలసిందే కానీ ఆతనికి ఉపదేశమునిచ్చే యోగ్యతకు దూరమైనది. తండ్రి
విషయములో కూడా అంతే. పిల్లలు సూక్ష్మగ్రాహులు. మనపనిలో మనముండి వారి
ఉనికిని మరచిపోతే ఆతరువాత వారి విషయములో 'చేతులు కాలిన పిదప ఆకులు
పట్టుకునుట’యే ఔతుంది.
ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతాను. ఒక రాజుకు తన పట్టపు రాణి ద్వారా కలిగిన ఇద్దరు కొడుకులు వుండేవారు. రెండవవాడు జన్మించగానే రాణి కాలమైంది. రాజు వ్యసనాలకు బానిసయైపోయినాడు. రాజ్యానికంటే మిన్నగా మగువ, మదిరలకు దాసోహమైనాడు. వసతులన్నీ రాకుమారులకు తగినట్లు వున్నా సరియైన సంరక్షణ లేని పిల్లలిరువురూ తండ్రిని గమనించుతూనే వున్నారు. తండ్రికి వృద్ధాప్యము పుత్రులకు యౌవ్వనము రావటం జరిగింది. రాజు తాను ఎక్కువకాలము బ్రతకడని తెలిసిపోయింది. వేరువేరు అంతఃపురములలోనున్న పుత్రులను పరీక్షించి యోగ్యుని ఎన్నమని రాజు తన ముఖ్యమంత్రికి ఆదేశమిచ్చినాడు.
మంత్రి రాజుగారి ఆనతి మేరకు మొదటి కుమారుని అంతఃపురమునకు పోయి చూస్తే అతడు అన్నివిషయములలోనూ రాజును అనుకరించుచున్నట్లు అర్థము చేసుకొని ఆ రాకుమారుని ఇట్లు అడిగినాడు "యువరాజా మీ తండ్రి మీకు పట్టము కట్టవలెనని చూస్తూవుంటే మీరేమి ఈవిధముగా తయారయినారే!" అందుకు ఆ రాకుమారుడు " తప్పేముంది. తండ్రిని మించిన తనయుడను కావలెనన్న తపనతో నేను ఆయన అడుగుజాడలోనే నడచి ఆయనను అధిగమించవలెనని అనుకొంటున్నాను." అని అన్నాడు.
హతాశుడైన మంత్రి మార్గాంతరములేక రెండవ రాకుమారుని అంతఃపురమునకు పోయినాడు. అచ్చటి వాతావరణమును చూసి విస్మితుడైనాడు. ప్రతి పని సక్రమముగా జరుగుతూ వుండి. నియమ పాలన, బాధ్యత ఇత్యాది విషయములలో ఎంతో జాగరూకుడై మసలుచున్నాడు రాకుమారుడు. ఆయన పరివారము కూడా సుశిక్షితులై బాధ్యతనెరిగి పనిచేయుచున్నారు. మంత్రివర్యుడు ఆయన వద్దకు వెళ్లి" యువరాజా మీరు ఇంత క్రమశిక్షణ ఎట్లు అలవరచుకొన్నారు?" అని అడిగినాడు. అందుకు రాకుమారుడు"మాతండిగారినిచూసే! ఆయన నుండి, అతి జాగ్రత్తగా పరిశీలించి, ఏవేవి చేయకూడదో నేర్చుకొన్నాను" ఇక ఎవరు రాజయి వుంటారు అన్నది మీ విచక్షణకే వదలిపెడుతున్నాను. ఈ కథను బట్టి మనకు తెలియవచ్చేది ఏమిటంటే .......
(మిగిలనది తరువాత చదువుదాం)
(మిగిలనది తరువాత చదువుదాం)
యువత - భవిత - బాధ్యత-2
ఈ కాలము పూర్వము వలె కాదు. ఏపనీ తొందరే! అందువల్ల విచక్షణ కొరవడుతుంది. కావున తల్లిదండ్రులు తగినవిధముగా పిల్లల విషయములో జాగరూకత వహించి ఒక విషయము యొక్క గుణ దోషముల గూర్చి చెప్పకపోతే పర్యవసానము ఏమయినా కావచ్చు.
ఈ కథలోకూడా పెద్దకుమారుడు తండ్రివలె పతనమై రాజ్యాధికారాన్ని పోగొట్టుకొన్నాడు. మరి చిన్నవాడు రాజయితే అయినాడుకానీ మంచివానిగా మసలుకొని ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోన్నాడో లేదో! స్వార్థముచేత తాను రాజయిన పిదప, బాల్యములో మమతానురాగాములకు నోచుకోలేదు కాబట్టి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోలేక పోయినాడేమో!
ఈ కథలోకూడా పెద్దకుమారుడు తండ్రివలె పతనమై రాజ్యాధికారాన్ని పోగొట్టుకొన్నాడు. మరి చిన్నవాడు రాజయితే అయినాడుకానీ మంచివానిగా మసలుకొని ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోన్నాడో లేదో! స్వార్థముచేత తాను రాజయిన పిదప, బాల్యములో మమతానురాగాములకు నోచుకోలేదు కాబట్టి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకోలేక పోయినాడేమో!
కావున పిల్లల పెంపకము పై తల్లిదండ్రుల శ్రద్ధ మిక్కిలి అవసరము. అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత, అంతఃకరణ, ఆరక్షణ కలిగియుంటేనే అది సుఖవంతమైన సంసారమౌతుంది. నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ వుంది.
రాజవత్ పంచావర్షాణి దశ వర్షాణి తాడవత్l
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ll
5 సంవత్సరములవరకు శిశువును రాజు/రాణి లాగా చూచుకోనవలెనట. తరువాత 10 సంవత్సరములు కొట్టి తిట్టి ఎట్లయినా సరే దారిలో పిల్లలను ఉంచాలట. 16 వ సంవత్సరమునుండి స్నేహితునిగా చూసుకొనవలెనట. మరి మనమట్లు చేస్తున్నామా, మనకంత సమయము చేతిలో ఉందా! అన్నది మన ఆత్మ విమర్శకు సంబంధించిన విషయము. తల్లిదండ్రి పిల్లలు కలిసి ఒకసారిగా భోజనము ఎంతమంది ఇళ్ళలో జరుగుతూవుందో నేటి కాలములో? WEEK END అని ఏ హోటలుకో పోయేదానికంటే ఇంట్లో ఆరోజు తల్లి చేసిపెడితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో. క్రింద కూర్చుని తట్టలో అన్నము అనుపానమును చేతితో కలుపుకొని తినుట ఎంతో ఆరోగ్యకరమని ఇంతకాలానికి science కూడా తెలియజేస్తూవుంది. మరి మనమెందుకు పాటించుట లేదు. ప్రొద్దుటే అంటే కనీసము ఒక 5.30 కన్నా లేచి కాలకృత్యములు స్నానాదులు ముగింపజేయించి దేవునికి చేతులు జోడించి పిల్లలచే ప్రతిదినమూ నమస్కరింపజేసే తల్లిదండ్రులు ఎంతమంది? అసలు తెల్లవారుఝాము, ఇంచుమించు 4.30 గం.ల సమయాన్ని బ్రాహ్మీ ముహుర్తమంటారు. 5, 5.30 సమయాన్ని గోవుషస్కాలమంటారు. ఉదయము 7 లోపు స్నానము చేయవలెనన్నది పెద్దల మాట. తరువాత చేసేదానిని రాక్షస స్నానమంటారట. మరి ఎంతో ప్రశస్తమైన సమయమును పెద్దలు మనకు నిర్దేశించితే ఆ సమయమునకు తల్లిదండ్రులే లేచుట లేదు మరి పిల్లలు లేచుటను గూర్చి ఎట్లు ఆలోచించగలము.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపుచేటు (భాగవతము)
ఇది భాగవత వాక్యము. వ్యాసులవారు, పోతన వంటి పరమాత్మ స్వరూపులు చెప్పిన మాట.
మనమెందుకు పాటించ కూడదు.
కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతిl
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనంll
అన్న శ్లోకమును పిల్లలకు చెప్పించి కుడి అరచేతిని చూచుకొనే అలవాటును ఎందుకు
చేయించకూడదు. ఋగ్వేదములోని శాంతి మంత్రములలో ప్రముఖమైనది ఈ విధంగా
చెబుతుంది. అసలు ఈ శ్లోకానికి ఒక గమ్మత్తయిన మరియు స్వాభావికమైన అర్థము
చెబుతాను. కరాగ్రము అంటే చేతి వ్రేళ్ళు.ఏ పనిని పట్టుకోదలచినా చేతివ్రేళ్ళు ఉండవలసిందే.
పట్టుదలతో పని పూర్తి చేస్తే ఫలితము దానంతకదే చేతికి వస్తుంది. అదే నీకు ప్రాప్తించిన
సిరి సంపద. దాని అధిదేవతయే లక్ష్మి. అదీ ‘కరాగ్రే వస్తే లక్ష్మి’ అంటే. అసలు డబ్కబును
అందుకోనేది సాధారణముగా కుడిచేతి వ్రేళ్ళతోనే కదా! ఇక 'కరమధ్యే సరస్వతి'.
అంటే పుస్తకమును అరచేత్తోనే పట్టుకొంటాము. మనకు విజ్ఞానదాయకమగు
పుస్తకములను కరమధ్యమున ధరించుటచే చదువుపైన శ్రద్ధ కలిగి, మనఃపూర్వకముగా
చదువుటచే జ్ఞాపకము ఉంచుకొని విజ్ఞానవంతులమౌతాము. 'కరమూలె స్థితా గౌరీ' అంటే
ఆ కరమూలముననే మన శక్తి కేంద్రీకృతమై వుంటుంది, మంచికయినా, చెడ్డకయినా! అట్టి
కరమూలమే మూలము. మనము ఈ కరమూలమును మంచికి వాడితే శక్తి
స్వరూపిణియగు గౌరీదేవి ఆశీస్సు మనపై వుంటుంది. చెడుపునకు కూడా ఆమె
సహకారము ఉంటుంది, అడి క్షణిక్యము. మిమ్మత ఆ దుష్కర్మ ఫలము తప్పక అనుభవించి
తీరుతాము. అందుకే ఉదయముననే ఆ మూడుతల్లుల నిలయమైన అరచేతిని మనము
చూచుకొనవలెను. ఇక పిల్లలకు ఈ శ్లోకమును బాల్యమునుండి నేర్పించి కంఠస్తము
చేయించుట మంచిది.
ఆనోభాద్రాః క్రతవోయంతు విశ్వతః తదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃl
దేవా నోయథా సదమిద్ వృధే అసన్నప్రాయువో రక్షితారో దివే దివేll
దశదిశలనుండి మంగళమయమగు మాటలే మా చెవులను సోకుగాక! అవి ఏ విధమగు
వత్తిడికి, ఎటువంటి అడ్డంకులకూ లోనుగాక ఎన్నో అజ్ఞాత విషయములను
మాకందించుగాక! మాగతి ప్రగతి వైపునకు మరలించి మమ్ము రక్షించే
దేవతలు కలకాలమూ మా వృద్ధినే కాంక్షించెదరు గాక!
ఎంత గొప్ప మాటనో చూడండి. హరిహర సుభాషితము పిల్లలగూర్చి ఏమంటున్నదో
గమనించండి.
అనిచ్ఛంతో పి వినయం విద్యాభ్యాసేన బాలకాః |
భేషజేనేవ నైరుజ్యం ప్రాపణీయాః ప్రయత్నతః || - హరిహర సుభాషితము
ఇష్టమున్నా లేకున్నా పిల్లలకు విద్యావినయములను ప్రాప్తింప జేయవలసిందే. ఆ బాధ్యత తల్లిదండ్రులదే. ఔషధముు యొక్క ప్రశస్తి దాని చేదుతనమునకు తెలియదు కదా!
ఇక భర్తృహరి సుభాషితము ఏమి చెబుతూ వుందో గమనించండి.
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు
సాదు సంగంబు సకలార్థ సాధకంబు
సత్యము, పలుకుట నేర్పించుతుందట, బుద్ధిమాన్ద్యమును మాన్పుతుందట, పరస్పర
గౌరవమును గూర్చి తెలుపుతుందట, మనలోని చెడును తుడిచివేస్తుందట, కీర్తిని
వ్యాపింపజేస్తుందట, మనోవికాసమునకు మందుగా పనిచేస్తుందట, ఇంతటి బహుళార్థ
ప్రయోజనకారి ఏదయ్యా అంటే ‘సజ్జన సాంగత్యము’.
తెలుగు, సంఈ స్కృతము పిల్లలకు బాల్యములో ఆంగ్లముతో బాటూ నేర్పించండి. సంస్కృతము
ప్రారంభించు టకుముందుగా అమరము నేర్పించండి. అది ఒక నిఘంటువు. దానిని వ్రాసిన
మహానీయుడగు అమరసింహుడు బౌద్ధుడు. ఆ కాలములో బౌద్ధ హైందవ ద్వేషము
విపరీతముగా ఉండేది. అయినా క్రీస్తుకు పూర్వము రచించబడిన 'అమరము' అమరమై
విరాజిల్లుచున్నది. దానివల్ల ఎంత క్లిష్టమయిన పదాలను కూడా చక్కగా పలికే తీరు
అలవడుతుంది. వీలయినంతవరకూ ఇంటిలోనే, తల్లి వద్దే లేకుంటే ఇంటి పెద్దల వద్ద.
ప్రాణాలు, మహా ప్రాణాలు, ద్విత్వాక్షరములు, సంయుక్తాక్షరాలు, శ ష స ల వ్యత్యాసాలు
స్పుటముగా పలికించుటకు నేర్పించండి. . ఆ సమయయములో వారి మేధస్సు ఎంతో
పదును గానూ ఖాళీగానూ వుంటుంది కాబట్టి మంచితో దానిని ఎంత ఎక్కువగా వీలయితే
అంత ఎక్కువగా నింపండి. నేటి దంపతులకు ముఖ్యమయిన విన్నపము.: మీ తల్లిదండ్రులను
వృద్ధాశ్రమమునుకు పంపించుట వృధా శ్రమ అని తెలుసుకొండి. మీరు మీ ఉద్యోగాలకు
పోయినా ఎంతో లాలనతో మంచి బుద్ధి మంచి మాట మంచి చదువుకు వారు నాంది
యౌతారు. దానితో సంఘమే మంచివాయిపునకు అడుగు వేస్తుంది.
ముఖ్యముగా అమరము ఆంధ్రనామ సంగ్రహము, పెద్దబాలశిక్ష ఈ మూడు పుస్తకములు
ఇంటిలో తప్పక వుంచండి. పెద్దబాలశిక్ష అయితే అత్యంత అవసరము. అసలిది పెద్దలకు
బాలలకు శిక్షణా, లేక బాలలకు ఆవయసులో ఇవ్వవలసిన పెద్ద శిక్షణా, లేక పెద్దలకిది
బాలశిక్షణా, అసలు ఇది ఒకే పదము కాదుఅసలు పెద్ద+బాల సంధి లేక సమాసము
కుదరదని నా తలంపు. ఈ విషయమును వయ్యాకరుణులకు వదలిపెడతాను. కానీ ఈ
పుస్తకములోని పద్యములను, శ్లోకములను, రామాయణ భారత ఇతిహాసములను, పౌరాణిక
గాధలను, చారిత్రిక సామాజిక విషయములను, గణితమును, అసలు అవి ఇవి అననేలా
నేటి తరానికి కావలసిన ఆంగ్లమును కంప్యూటరును గూర్చి కూడా తెలుపుతుంది. ఇది
తెలుగువారికి సరస్వతీ దేవి ఇచ్చిన వరము. ఇకనైనా ఉపయోగించుకొండి.
ఇక నేటి కాలములో పిల్లల పీడ వదలించుకొనుటకుగాను Creche, Convent అని
పంపుచున్నారు కదా! Creche అనే మాటకు Cambridge Dictionary లో ఈ
అర్థములను చూడ వచ్చు.........
తరువాత చూద్దాము............
యువత - భవిత - బాధ్యత- 3
Creche అనే మాటకు Cambridge Dictionary లో ఈ అర్థములను చూడ వచ్చు.........
UK: a place where young children are cared for during the day while their parents do something else, especially work, study, or shop:
us uk crib a model of the people and animals present at the birth of Jesus, used as a decoration at Christmas
అదేవిధముగా Convent అంటే Cambridge Dictionary లో a building in which nuns (= members of a female religious order) live అన్న అర్థమును చూడవచ్చు. ఇక Convent School అంటే Dictionary ఈ విధముగా చెబుతుంది. A convent school is a school where many of the teachers are nuns. ఇప్పుడు అసలు మీరు పంపేది Convent కాదు లేక Convent School కూడా కాదు. అక్కడ అంటే ఈ కాలపు Convent Schools లో ఉండే ఉపాధ్యాయినులు సత్ప్రవర్తన కలిగియున్నారా, వారికి పిల్లలకు నేరిపించే విధానము తెలుసునా! పుస్తకములలో వుండే విషయములను వల్లెవేయించుట తప్ప. చిన్న పిల్లలలో జిజ్ఞాస ఎక్కువ. ఒక ప్లాస్టిక్ బొమ్మ చిన్న పాపాయి చేతికిస్తే తాను దానిని అటు పీకి ఇటు పీకి నేలకేసి కొడుతుంది. కారణము ఏమిటంటే లోపల ఏముందో చూడవలెనన్న జిజ్ఞాస. మనము అరచి ఆపనిని ఆపితే ఇక ఆ పాపాయి ఏడుపే చూడగలము. ఆ స్వతంత్రము వాళ్లకు ఆ వయసులో ఎంతో అవసరము. ఒకవేళ భార్యా భర్తలు ఉద్యోగాలకు పోయినా పెద్దలు ఇంటిపట్టున వుంటే ఎన్నో విషయములను లాలించి పాలించి నేర్పించగలుగుతారు. వయసుతో బాటు పదాలు నేర్పించే తీరు తెన్నూ కూడా మారుతూ వుంటుంది. కొట్టుట, కోపగించుకొనుట, బుజ్జగించుట అన్నీ వారయితే మనసారా చేస్తారు. కోప పడినా కొట్టినా వెంటనే చేరదీసి బుజ్జగించుతారు. ఎంతయినా రక్త సంబంధము కదా! నేను వ్రాసిన పద్యము ఇచట సందర్భోచితమని తలుస్తాను.
ధగ ధగ నగ చేయించగ
శెగ, సమ్మెట, చేవ యున్న, చెప్పిన రీతిన్
నగ చేయగల్గ వచ్చును
దిగులన్నది కల్గబోక ధీమణి రామా!
19, 20 శతాబ్దులకు చెందిన మన దేశపు శాస్త్రజ్ఞులు మరియు సాంకేతిక నిపుణులు అగు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, C.V. రామన్, వెంకట్రామన్ రాధాకృష్ణన్, S.చంద్రశేఖర్, మేఘనాథ్ సహా, సత్యేంద్రనాథ్ బోస్, జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్, మొదలగువారు Creche, Convent లలో చదువలేదు. ఇక మన పురాతన శాస్త్రజ్ఞులగు బోధాయన, బ్రహ్మగుప్త, కణాద, చరక, శుశ్రుత, ఆర్యభట్ట, వరాహమిహిర, పింగళ, భాస్కర, నాగార్జున ఇత్యాదులకు ఎవ్వరికీ అసలు ఆంగ్లమంటే ఏమో తెలియదు. ఇక Creche, Convent ల మాట అసలు వారి విషయములో రానే రాదు కదా! వారి ఆవిష్కరణలను తమ పేరుతో నమోదు చేసుకొన్న పాశ్చాత్య సైంటిస్టులను మనము మహాపురుషులుగా భావించి పూజించు చున్నాము. మరి మన పిల్లలకు మాతృభాషనే పణముగా పెట్టి ఆంగ్లము అభ్యసింప జేయుట అవసరమా! మన తెలుగు ప్రాశస్త్యము ప్రాధాన్యత ముందే వివరణాత్మకముగా మనవి చేసుకొన్నాను.
మాత, గోమాతక్షీరములు సమీకృత ఆహారములు అయినపుడు ఇక హార్లిక్సులు, బోర్న్విటాలు, కాంప్లానులు మొదలగునవి పిల్లలకు అవసరమా! ఈ కృత్రిమ ఆహారముల శక్తి కేవలము కాగితములో అంటే ప్రకటనలలో మాత్రమే వుంటుంది. ఆ కృత్రిమ ఆహారములలో కాదు. పాలు యథాతథముగా త్రాగాలేనివారికి ఒక చిన్న పలుకు పచ్చకర్పూరముగానీ నాలుగు లేక ఐదు ఏలక గింజలుగానీ కొట్టివేస్తే ఎంతో రుచికరముగా వుంటాయి కావున ఇబ్బంది పడకుండా త్రాగివేస్తారు. తినగలిగే వయసు వచ్చినపుడు పిల్లలకు సేనగ, పెసర, అలసంద (బబ్బర్లు) బియ్యము, జొన్న, సొజ్జ మొదలగు పలువిధపు ధాన్యముల పిండ్లతో ఎన్నో తీపి మరియు కారపు పదార్థములు పిల్లకు చేసి పెట్టవచ్చును. మీకు చేత కాకుంటే చేయించి పెట్టండి. వాళ్ళ ఆరోగ్యమును మీరు కాపాడితే దేశ భవితను కాపాడినవారవుతారు. కృత్రిమపు ప్రేమతో పస లేని ఆహారము మెసవనీయకండి. Kill the junk it's not to drink. That shows hell and will never go well.
ఇక మీరు ఎంతో మోజు పడే English Rhymes ను గూర్చి ఒక మాట చెబుతాను.
ఈ విషయము తరువాత ప్రస్తావించుకొందాము.........
యువత - భవిత - బాధ్యత - 4
ఈ Rhyme తీసుకోండి:
Rain, rain go away
Rain, rain go away
Come again another day
Little Johnny wants to play
Rain, rain go away
ఇది ఎలిజబెత్-1 (1533-1603) రాణి పాలించే రోజుల్లో వ్రాసినది. ఇంగ్లిషు వారు స్పానిష్ ఆర్మడాపై యుద్ధం చేస్తున్నప్పుడు తుఫానులో చిక్కుకున్న సైనికులు భయంతో వర్షాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మంటూ పాడుకున్న పాట ఇది. తరువాతి కాలములో వారు తమ పిల్లలకు నేర్పించ దొడగినారు. వారిని చూచి మనము కూడా ఎన్నో నీతి శతకములను విస్మరించి పిల్లలకు ఈ rhymesనేర్పించుచున్నాము. చిన్న పిల్లలకు ఇది ఇప్పుడు అవసరమా ! 'వానా వానా వల్లప్ప చేతులు దాచు చెల్లప్ప' అని వానలో ఆడుకొంటూ వానను ఆహ్వానించుట ఎట్లున్నది, Rain, rain go away అనుట ఎట్లున్నది. 'Johnny Johnny yes papa' అన్న rhyme పిల్లలకు అబద్ధాలు నేర్చుకోండి అన్న సందేశమిస్తుంది. ‘మాటకు ప్రాణము సత్యము’ ‘చేత వెన్నముద్ద’ ‘ఉప్పు కప్పురంబు’ మొదలగు నీతి పద్యములు బాల్యములో నేర్పించితే వారవి తమ అనుభవమునకు తెచ్చుకోనూ గల్గుతారు, తరువాతి తరమునకు అందజేయనూగలుగుతారు. సంస్కారము లేని చదువు Toilet Room లో ఎదమచేయ్యే!
ఇక యువతనుగూర్చి వారి విధి బాధ్యత కర్తవ్యములను గూర్చి కాస్త మాట్లాడుకొందాము.
అన్నా విను సంస్కారము
అన్నది గౌరవము గూర్చు ఆలోచింపన్
ఎన్నెన్నొ విద్యలెరిగియు
సన్నుతి తా పొందగలుగ సాధ్యంబౌనే
నేను ముందుగానే పైన చెప్పినాను ‘ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్’ అని. ఇది ఏముందిలె అని తాత్సారము చేయవద్దు. మీరు మీ పిల్లలతో ఆ వయసులో కనుక స్నేహితులవలె సంచరించితే వారి మనసును తెలుసుకొనే అవకాశము వుంటుంది. అది తెలిస్తే చాలు వారు దారి తప్పకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ దారి తప్పినా ఒక స్నేహితునిగా లేక స్నేహితురాలిగా తగిన సలహా ఇచ్చి తమ దారికి తెచ్చుకోనవచ్చు. అసలు ఆవయసులోనే పిల్లలకు స్వతంత్రభావాలు మొదలౌతాయి. తాము తప్ప లోకమంతా, ముఖ్యముగా తల్లిదండ్రులకు ఆలోచించే పరిజ్ఞానము లేదు అని తలచే వయసది. సాన్నిహిత్యము ఎంతో అవసరము.
యౌవ్వనములో ప్రవేశించబోయే బాలునికి అనుసరణీయమైన అలవాట్లు ఏవిధముగా ఉండవలెను అన్న విషయాన్ని విమర్శ చేయుటకు గానూ భారతములోని ఒక కథ తెలియజేస్తాను. ఇది ఎఱ్ఱాప్రగ్గడ పూర్తిచేసిన అరణ్య పర్వము లోని శేష భాగములో వస్తుంది. ఇందులో ధుంధుమారుడు అన్న ఒక యువరాజు ఒక సారి వేటకు రాజధానికి దగ్గరగా వున్న అడవికి పోతాడు. అతనికి కొలనిలో నీరు తాగే శబ్దము వినిపించుతుంది. అతడు ఆ శబ్దమును ఓకే జంతువుడిగా భ్రమించుతాడు. ఆదిశగా బాణము వదులుతాడు. మనిషి అరచిన శబ్దము వచ్చుటతో ఆ చోటునకు పరుగెత్తి తక్షణము చేరుకొంటాడు. కదలికలేని ఒక బ్రాహ్మణ బాలకుని జూచి మరణించినాడని తలచి వ్యాకులచిత్తుడై రాజధానికి వెళ్లి అంతఃపురము ప్రవేశించి తలిదండ్రులతో జరిగినది చెప్పి తన పశ్చాత్తాపమును ప్రకటించుకొంటాడు. అప్పుడు తండ్రి నీవు చేసినది తప్పు. ఆదర్శప్రాయుడైన రాజు తప్పుచేసి చెప్పుకోనుటకు వెనుకాడకూడదు అని చెప్పి పుత్రుని పిలుచుకొని ఆ ఉదంతము జరిగిన స్థలమునకు వెళ్లి చూడగా బాలుడు కనిపించడు.
ఇరువురూ ఆ బాలుని అంతర్దానమునకు ఆశ్చర్యమునొంది చుట్టూ ప్రక్కల ఏవయినా ఆశ్రమములు వున్నాయేమో, ఆ బాలుడు ఆ ఆశ్రమాలకు చెందినవాడేమోనని వెదకుతూ బయలుదేరుతారు. చివరకు ఒక పర్ణశాల చేరుతారు. అది ఒక చిన్నపాటి గురుకులము. ఆ గురువు పేరు తార్క్ష్యుడు.
ఆయనకు జరిగిన ఉదంతమును సవినయముగా మనవి చేయగా ఆయన మా గురుకులములో ఎవరూ మరణించలేదంటూ తన ఛాత్రులను వారిముందుంచుతాడు. అప్పుడు యువరాజు ఆ బాలకుని గుర్తించి గురువుకు తెలిపితే, నీబాణానికి ఆ బాలుడు మూర్ఛపోయి తేరుకొని ఆశ్రమము చేరినాడని గురువు చెప్పుటతో దిగ్భ్రాంతికి గురియై యువరాజు ఆ బాలుడు మరణించకుండుట తన కోల లో దోషమా లేక తన ధనుర్విద్యలో లోపమా అని సంశయాత్మకముగా అడిగినాడు. అప్పుడు ఆ మునిపుంగవుడు యువరాజుతో నాయనా నా శిష్యులు ఋజువర్తనము కలిగినవారు. వారు ఎప్పటికీ అకాలమరణమునకు ఆహుతి కారు అని చెబుతాడు. అట్లు కాకుండుటకు కావలసిన నియమనిష్ఠలగూర్చి యువరాజు అడుగగా మునీశ్వరుడు ఈ విధముగా చెబుతాడు:
విద్యార్థి దశలో ప్రతియోక్కరూ ఈ నియమములను పాటించవలెను. అట్టివారు అకాలమృత్యువు వాత పడరు అని తెలుపుతూ ఈ క్రింది సూత్రములను తెలుపుతాడు.
1. పని తలపెట్టిన పిదప ఆలస్యము చేయకూడదు.
2. శుభ్రమైన ఆహారము తినాలి.
3. ఏ రోజు పని ఆ రోజే పూర్తిచేయాలి.
4. ఇంటిఇకకి వచ్చినవారికి సగౌరవముగా అతిథి మర్యాద చేయాలి.
5. కలకాలము సత్యవ్రతమును పాటించాలి.
6. ఎప్పుడూ శాంతిని అవలంబించి యుండాలి.
7. అత్యంత ముఖ్యమయినది బ్రహ్మచర్యమును పాటించాలి.
రాజు, యువరాజు గురువుగారికి నమస్కరించి రాజధానికి తరలినారు.
ఈ కథలో చెప్పిన అతి ముఖ్యమయిన ఈ 7 సూత్రములనూ ఎంతమంది పెద్దలు తమ యౌవ్వనములో పాటించినారు, ఎంత మంది తమ పిల్లల చేత పాటింప జేయించినారు, చేయించుతూ వున్నారు. ఈ ఏడు సూత్రాలనూ విశ్లేషించుతూ పోతే ఈ వ్యాసము చాలా పెద్దదవుతుంది. పైగా వీనిని మీ స్వానుభావాలతో అన్వయించుకొంటే చక్కని ఫలితము మీకుమీకే లభించుతుంది.
ఈ విషయము ఒకసారి చూడండి. ఆంగ్లములో A B C D E అన్న వరుసాక్షరాలు A తో మొదలవుతాయి . వారి మతములో, మత గ్రంధములో, ఆత్మ లేదు కాబట్టి దానిని అంటే ATMA ను యథాతథముగా తీసుకొందాము. ఇక B అంటే BIRTH, C అంటే CHOICE, D అంటే DEATH, E అంటే ETERNITY. పాండవులలో అర్జునుడు పాండు మధ్యముడు. శ్రీకృష్ణుని సఖుడు మరియు భారత యుద్ధ విజయ కారకుడు. అది గుర్తుంచుకొని మొదట A ను గూర్చి తెలుసుకొందాము. ఆత్మకు చావులేదు. ఇది భగవద్గీత చదివిన, ఆకళింపుచేసుకొన్న, కనీసము విన్న వారందరికీ తెలిసిన విషయమే. ఈ ఆత్మ తల్లి గర్భమున ప్రవేశించితే BIRTH, అంటే పుట్టుక ఏర్పడుతుంది. ఇప్పుడు 3 వ అక్షరమును దాటవేసి 4వ అక్షరమునకు వస్తాము. D అంటే DEATH అంటే ఆత్మ కట్టె నుండి విడిపడింది. అది శాశ్వతత్వము చేరాలి. మరి వెంటనే చేరుతుందో, పిత్రులోకములో విడిది చేస్తుందో మన ఊహకు అందనిది. కర్మ బంధములను తెన్చుకొంటే మాత్రము పరమాత్మను చేరుకొంటుంది అంటే దాని గమ్యము, లక్ష్యము పరమాత్మ. ఆ గమ్యము లక్ష్యమును సాధించవలేనంటే అది తప్పక C మీద అంటే CHOICE అంటే నీవు ఎన్నుకొనే మార్గము మీద ఆధారపడివుంటుంది. చూచినారా ఈ C కి ఎంత ప్రాధాన్యత వుందో!
స్థూలముగా ఈ CHOICE అంటే ఇచ్ఛ, ఇష్టము, కోరిక రెండే రెండు విషయములపై ఆధార పడుతుంది. 1. మంచి 2. చెడు. అదే విధముగా మనలో రెండు తెగలు. 1. నేను 2. వాడు (అతడు). పై రెండు ఈ రెంటికి సంధించితే పౌనఃపున్య క్రమము (Permutations and Combinations) ప్రకారము 4 అగుతాయి. అవి 1. మంచి మంచి 2. చెడ్డ మంచి 3. మంచి చెడ్డ 4. చెడ్డ చెడ్డ .
ఇపుడు మంచి మంచి యన్న మొదటి వర్గమును తీసుకొందాము.
మొదటి వర్గములో అంతా మంచే! వానికీ మంచే నాకూ మంచే. ఆ వర్గము లోని వ్యక్తులకు పైన తెలిపిన 7 సూత్రములూ యథాతథముగా వర్తిస్తాయి. వారికి ఆయుస్సు, ఆరోగ్యము ఆనందమునకు కొదవ ఉండదు.
నీవు చేసే ప్రతి పనివల్లా నీకు మంచి జరుగుతుంది. వానికీ మంచి జరుగుతుంది. అంటే నీవు పైన చెప్పిన 7 గుణములనూ తూచ తప్పకపాటించేవానివన్న మాట. దీనిని ఆంగ్లములో WIN-WIN SITUATION అంటారు. ఎవరికీ ఎటువంటి చెడుపు లేదు. ఈ మార్గము ఎంతో శ్రేయో దాయకము.
ఇక రెండవది: చెడ్డ-మంచి, అంటే నీకు చెడుపు, లేక ఇబ్బంది కలుగుచున్నా ఎదుటివానికి సాయపడే ఆలోచన. ఒక ఎల్లలను కాపాడే భారతీయ సిపాయికి ఎంత జీతము ఇచ్చినా ఆయన ప్రాణము పోగొట్టుకొనుటచే తనకు ఒరిగినది ఏమీలేదు. నిండు జీవితాన్ని దేశానికి బలి ఇచ్చినాడు. ఒకవేళ ఆయన ఇంటివారికి ఎదో ధనసహాయము లభించుతుంది అన్నాకూడా ఆయన ప్రాణము తిరిగి రాదు కదా! ఒక మంటలో చిక్కుకొన్న పసిబాలుని రక్షించుటకు ఒక యువకుడు తన ప్రాణమును లెక్కచేయక ఆ బాలుని కాపాడినాడు అనుకొందాము. ఆపనిలో అతని వంటికి ప్రమాదము కొంత వాటిల్లినది అనుకొంటే, ఆయన చేసిన పని మాత్రం స్వార్థ రహితమైనది కదా! ఇక పురాణాలలోకూడా ఇటువంటి ఉదాహరణ మనము దధీచి మహర్షి విషయములో చూడవచ్చు. ఆయనను స్వయంగా ఇంద్రుడు వచ్చి మహర్షీ తమరు ప్రాణత్యాగము చేస్తే మీవెన్నెముకతో తయారుచేసిన ఆయుధముతోనే అత్యంత దుర్మార్గుడగు వృత్రాసురుడు సంహరింపబడుతాడు అంటే, ఇంద్రుడు చేసిన ప్రార్థన మన్నించి దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయి లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేసి తన వెన్నెముకతో వజ్రాయుధాన్ని చేయించుకొనే అవకాశమును కలిగించి లోకభీకరుడైన వృత్ర సంహారానికి దోహదపడుతాడు. మహనీయులకు దేహము తృణప్రాయము. ఇటువంటి త్యాగధనులు అజరామరులు. అసలు మన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరాం బోస్ ఇంకా ఎందఱో, ఎందరెందరో ! దీనిని Lose-Win SITUATION అంటారు. మనము వారి బాటలో నడవకున్నా వారిని ఆదర్శముగా పెట్టుకొని మనలను మనము కాపాడుకొంటూ కూడా ఒక ఉత్తమ పౌరునిగా జీవించవచ్చును. చక్కని జీవితము కోరుకొనే వారికి ఒకటవది అతి చక్కని మార్గము. దేశ శ్రేయస్సుకు, దేశ పురోభివృద్ధికి కూడా అది ఎంతో దోహదకారి. కానీ రెండవది ఆదర్శ ప్రాయము. కానీ ఇందులో ఎదుటివాని పాత్రతనెరిగి మసలుకోవలసి వుంటుంది.
ఇప్పుడు మూడవ వర్గమును గూర్చి చర్చించుదాము. వీడు తాను బాగుంటే చాలు వాడేమయిపోయినా ఫరవాలేదనుకోనేవాడు. అంటే ఎప్పుడూ 'చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష' అని తలచుతాడు. అవసరమైతే 'వాని' కింద గోతులు త్రవ్వుటకు వెనుకాడడు. 'పయోముఖ విషకుంభము గాను' 'గోముఖ వ్యాఘ్రముగాను' ఉంటూ 'గోరీవద్ద గుంటనక్క వలె' అవకాశము కొరకు అర్రులు సాచుతూ ఉంటాడు. ఆ క్షణానికి కోరిన ఫలితము వచ్చినా చేసిన పాపానికి ఫలితము మాత్రము తర్వాత నయినా అనుభవించి తీరవలసి వస్తుందన్న ఆలోచన లేనివాడు. ఇది ప్రముఖులైన మన రాజకీయ నాయకులలోనూ సినిమా నటులలోనూ జాగ్రత్తగా గమనించితే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. ఒక కథ చెబుతాను, ఒక విధముగా ఇది వాస్తవమే! ఒక పంచర్లువేసే దుకాణాదారుడు తన షాపునకు ఎదురుగా వున్న రోడ్డుపై అటు అర కిలోమీటరు ఇటు అర కిలోమీటరు వద్ద 4,5 మేకులు చల్లి ఉంచేవాడు. అటువైపు నుండి ఇటువైపు నుండి తమ ప్రమేయము లేని తప్పుకు శిక్షను అనుభవించుతూ, పంచరు వేయించుకొనుటకు బండ్లను తీసుకొని అతని వద్దకు వచ్చేవారు. అతడు పంచర్లతోనే డబ్బు గడించినాడు. అయ్యో వాళ్ళు ఎంత ముఖ్యమయిన పనిమీద పోతున్నారో అన్న ఆలోచన అతనికి ఎ రోజూ వచ్చింది కాదు. ఒకనాడు అతనికి తన ఇంటివద్దనుండి Cell Phone లో తన అమ్మకు serious గా వుందని ఎవరో తెలిపినారు. ముందు వెనుక ఆలోచించకుండా వద్దనున్న సైకిల్ మోటార్ లో బయలు దేరిన వ్యక్తి తన పరధ్యానము కారణంగా ఎదురుగా వచ్చే లారీని ఢీకొని అక్కడికక్కడే అసువులు బాసినాడు. కావున మన కర్మకు వెంటనే కాకపోయినా ఫలితము మాత్రము అనుభవింపక తప్పదు. కావున ‘ చెరపకురా చెడేవు’ అన్న నీతి వాక్యమును ‘చీకట్లో అగ్గిపెట్టె చెంతనుంచుకొన్నట్లు ఏపని చేసే సమయముననైనా ‘ఈ వాక్యమును’ మనసులో ఉంచుకొనుట ఎంతో మంచిది.
ఇక 4 వ వర్గమును గూర్చి కాస్త చర్చించుదాము. ఇది Lose—Lose Situation అంటే అమ్మాపెట్టదు అడుక్కోనీ తిననివ్వదు అన్నట్లు. తాను బాగు పడదు ఇతరులను బాగుపరచడు. ఈ కథను ఒకసారి గమనించుదాము.
మిగిలినది మరోమారు.......
Ram mohan garu...Evaru touch cheyaalanukoni topic ni touch chesaaru...nenu eppudu expect cheyaledu ala...Hatsoff...Alanti paristhithi mee lanti vaarikey vasthey verey vaari paristhithi enti...
ReplyDeleteఇది లోకం అమ్మా! మామిడి వనములో మామిడి చెట్లకన్నా కలుపు మొక్కలు ఎక్కువగా వుంటాయి. వాటిని ఏరి పారవేసితీరవలసిందే. అప్పుడే మామిడి పంటకు విలువ, రుచి.
Deleteఅమ్మా సంస్కారవంతులగు నీలాంటి వాళ్ళు చదివితే ఎదో ఒకరోజుకు ఈ సమాజము మంచివైపునకు పయనిస్తుందని నమ్ముతున్నాను.
great info for the present parents.Pedda balasiksha,Amarakosamu must be taught at the home by elders.like the word vrudhasrama/Vrudhaasrama.
ReplyDeleteవాస్తవాన్ని గ్రహించి నాకు చేయూతనిచ్చినారు ధన్యవాదములు. అసలు, వాస్తవములు తెలుసుకొని పెద్దలు ఎవరెవరి ఇండ్లలో వారు తమ పిల్లను సరియైన దారిలో ఉంచితే దేశమే బాగుపడుతుంది.
DeleteVery good information with a neat presentation
ReplyDelete