Friday, 5 August 2016

కుక్క పిల్ల (కథ )


కుక్క పిల్ల (కథ )
అది ఒక మహా నగరం. అందులో ఒక ప్రాంతము. ఆ ప్రాంతము ధనికుల మరియు అత్యంత ప్రముఖ ప్రభుత్వభృత్యుల కావాసము. అందులో వున్నది వైయక్తిక సేవల కంకితమైన,అతిపెద్ద వార్దుషీ శాఖ(A Big Bank's branch, వార్దుషి=Bank అన్నది నాకు నచ్చిన సంస్కృత సమానాంతరపదము.) ఆ బ్యాంకికి ఉన్న నలుగురు కాపులలో (Security,  అసలు COP అన్న పదము 'కాపు' నుండి వచ్చిందేమో!) మన కథానాయకుడు ఒకడు. కథానాయకునికి మరి పెరుండవద్దూ!  'శూలపాణి' అన్నది అతని. పేరు తగినదా కాదా నెమ్మదిగా చూస్తాము. మరి నాయకుడుంటే ఖల నాయకుడు (ఖలుడు=దుర్మార్గుడు) వుండవలె కదా! అవునవును వుండాలి, కాబట్టి అతని పేరు మన్మద్ (manmad, man తరువాత ఒక space ఇచ్చి చదువుకోండి, పైగా ఈయనది'ద' కారమె గానీ  పొక్కిలి లేదు.) ఈ మన్మధుని మనోభావాలేమిటో తెలుసుకొందాము. ఆయన ఆ శాఖకు Cash Officer(CO). అంతే కాక కొన్నికొన్ని వున్నవి లేనివీ పనులను నెత్తికెత్తుకొని తనవల్లనే ఆ శాఖ నడుచుచున్నదన్న భావము Branch Manager (BM)లో కలుగవలెనని తపించేవాడు. 'శాఖ' అంటే ఒక branch manager, ఒక Accounts' Manager (AM) కూడా వుండాలి కాబట్టి వుంచుకొందాము. మేనేజరు ఒక 'స్త్రీ' ఆమె పేరు 'మోహిని', Accounts Manager ఈ కథలో అంత ప్రముఖుడు కాకున్నా పేరుండాలి కాబట్టి అతని పేరు 'యుగంధర్’ అనుకొందాము. మోహిని నిజముగానే సార్థక నామదేయురాలు. ఆమె ముఖము అందమునందేగాక దానిని కలిగిన తల  కౄర మైన తెలివితేటలకునిలయము. తనచేతికి మట్టి అంటకుండా చేయించగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి. ఆమె విధవరాలు. పరిచయాలు ముగిసినవి కదా ఇక కథ లోనికి నడుస్తాము.

ఆ ప్రాంతము అంతా ధనికులు , ప్రభుత్వ హోదాలు, గొప్పగొప్ప ఉద్యోగాలు, చేసే సంసారాల నెలవు కావడముతో, వారికి కుక్కలపై మక్కువ ఎక్కువ కావడంతో, వేల ఖరీదు చేసే పెంపుడు కుక్కలు అక్కడ వెలసినాయి. ఒక శుక్ర వారము రోజు ఒక అతిముచ్చట గొలిపే కుక్కపిల్ల బేంకు సమయము ముగిసిన పిదప శులపాణి డ్యూటీ లో వున్నపుడు బ్యాంకు గృహప్రవేశము చేసింది. అది తిరిగి బయటికి పోకుండా వుంటే, చూద్దాం ఎవరన్నా అడిగితే ఇస్తాం లేకుంటే ఇంటికి తీసుక పోతామని అనుకొన్నాడు శూలపాణి. వెంటనే కుక్కను ఒక మూల గది వద్ద, కష్టమర్లకు సులువుగా కనిపించని రీతిలో, కష్టపడి ఒక తాడు వెదకి తెచ్చి కట్టినాడు. తెల్ల వారింది. శనివారము కావున, ఆరోజులలో  1/2 రోజే బ్యాంకి. మొదట CashOfficer వచ్చి అక్కడ కుక్కపిల్లను చూసినాడు. అప్పుడు డ్యూటీ లో వున్న Security ని అడిగితే దానిని శూలపాణి కట్టి అక్కడ వుంచినాడని చెప్పినాడు. ఆ కుక్కపిల్ల తనవంటి వాని వద్ద వుండాలనుకొన్నాడు మన్మద్. ఇంతలో యుగంధర్ వచ్చినాడు కానీ ఆ విషయము తెలిసినా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక BM మోహిని గారు రంగ ప్రవేశము చేసినారు. ఆమె పేరుకు తగ్గ అందము చందము, తెలివితేటలు కలిగిన వ్యక్తి అని ముందే చెప్పుకొన్నాము. కుక్కపిల్ల మోజులో ఆమె కూడా పడిపోయింది.
Branch లో ఇంకా కొంతమంది స్త్రీలు కూడా పనిచేసేవారు. మన man mad (మన్మద్) కు మనసులో ఎప్పుడూ అక్కడ పనిచేసే ఆడవారందరూ తన ఆకర్షణకు లోనయినవాళ్ళే అన్న భ్రమ. అందుకు తగినట్లుగానే, వారి కళ్ళలోని జుగుప్స గమనించకుండా, అనవసరముగా రాచుకొంటూ పూసుకొంటూ  తిరిగేవాడు. అతని పై గల అసహ్యమంతా మనసులోనే దాచుకొని పనిచేసేవాళ్ళు ఆ ఇల్లాళ్ళు. క్రింద చెప్పబోయేది కథకు సంబంధము నేరుగా వున్నట్లు కనిపించకున్నా అంతర్లీనంగా అతని మూర్ఖత్వమును తెలియబరచుతుంది కాబట్టి మీరు చదువుటకు వ్రాస్తూ వున్నాను.
ఆ మహిళలు, మన మన్మధుడు చేసే అసహ్యపు పనులను గూర్చి యుగంధర్ తో ఏకరువు పెట్టినారు. Lunch Time లో మన్మద్ కంటే ముందు Luch ముగించి తనతో మాట్లాడుతూ ఉన్నట్లు వారి వారి కుర్చీలు తనకెదురుగా తిప్పుకొని తమతమ స్థలములలో కూర్చొని ఎదో బాతాఖానీ చేస్తూ ఉండమని చెప్పినాడు. వాళ్ళంతా అట్లే చేసినారు.
మన్మద్ మధ్యాహ్నము తెచ్చుకొన్న లంచ్ బాక్స్ లోని Lunch ముగించిన వెంటనే పురీషమునకు(toilet) పోవలసిదే. అది అతని దినచర్య. కాని అది అక్కడ ఆగలేదు . అతను ఈ Accounts Manager  వద్దకు వచ్చి తన చేతి గుడ్డతో మూతి తుడుచుకోవడము తో ఆపని ముగుస్తుంది. యుగంధర్ తన లంచి ముగించి సమయము కొరకు వేచుయుండినాడు. CO తనను దాటి టాయిలెట్ కు పోవుట చూసి, అతను కనుమరుగైన తరువాత కూర్చున్న Lady Staff ను Alert గా ఉండమన్నాడు యుగంధర్. అసలు సమయము రానే వచ్చింది. మన్మద్ రావటము మూతి తుడుచుకో బోవటము, భోజనమైనదా అని యుగంధర్ అడగటము, జరిగిపోయినాయి. మన్మద్ వెంటనే మూతి తుడుచుకొంటూ ఇప్పుడే అయిపొయింది అని అన్నాడు. అక్కడ ఉన్న ఆడవారంత చాలా బిగ్గరగా నవ్వసాగినారు. ఎందుకంటే ఆ ప్రశ్న అడుగబోతున్నట్లు వారికి ముందు యుగంధర్ చెప్పలేదు. మన్మద్ బిక్క  మొగము వేసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగినా, నవ్వుతూనే ఉండిపోయిన వారినుండి జవాబు రాకపోతే యుగంధరే కలుగజేసుకొని ఎదో జవాబు చెప్పబోతున్నా  వినిపించుకోకుండా విసుగ్గా  వెళ్లి పోయినాడు. ఈ అవమానము జరిగిన రెండు రోజులకే ఒక పెద్ద ఉదంతము జరిగినది.

ఇక కథలోకి వస్తే కుక్కపిల్ల పై శూలపాణికి, మన్మద్ కు, మోహినికి కళ్ళు పడినాయి అని ముందే చెప్పుకొన్నాము.
అవకాశము ఎక్కువగా వున్న శూలపాణి అదను చూసి శునకాన్ని ఇల్లు చేర్చుకొన్నాడు. ఆదివారమైనా ఎదో పని ఉంటుంది ఆఫీసర్లకు కాబట్టి అందులో మేనేజరు , అందులోనూ స్త్రీ , మరి మన mad రాకుండా ఉంటాడా! వచ్చినాడు. Good morning మేడం అంటూ ఆవిడ కేబిన్ లో ప్రవేశించినాడు. ఆమాట ఈమాట ముగిసిన తరువాత  మోహిని ఆ కుక్క పిల్ల పై తన మనసు పార వేసుకొన్న విషయము మన్మద్ తో చెప్పింది. మన్మద్ కు గొంతులో పచ్చి వెలగకాయ పడింది.
అప్పుడు డ్యూటీ లో వున్న Security ని అడిగితే 'ఎవరూ అడుగనందువల్ల శూలపాణి నగరానికి దూరంగా వుండే పల్లె లో తన ఇంటికి తీసుకపోయినాడు' అని చెప్పినాడు.  ఆమె వెంటనే అతని ఇంటికి పోదామంటూ,ఈ రోజు నేను కారు తేలేదు కాబట్టి ఆటోలో పోదామన్నది. కుంచించుకు పోయిన మన్మద్(Man Mad) మోము వికసించింది. తన పూలు పుటికె లో పడినట్లై నది. వెంటనే  ఆటో తెస్తానన్నాడు. ఆతను ఎదో ప్రయాణములో పదనిసలతో శూలపాణి వూరువెళ్ళవచ్చునని ఎంతో సంతోషముతో మురిసి పోయినాడు. ఎట్టకేలకు తుట్టతుదకు, కట్ట కడపటికి,చిట్టచివరికి అతని ఇల్లు తెలుసుకొన్నారు. మోహిని తెలివిగా తాను రిక్షాలోనే ఉంటూ మన్మద్ ను వెళ్ళి విచారించమన్నది. ఆమె తానంటే తపించి పోవుట చేత ఈ పనులన్నీ చెబుతూవున్నదని తలచినాడు ఆ మూర్ఖుడు.
శూలపాణి ఇంటి తలుపు తట్టగానే ఒక అందమైన అమ్మాయి తలుపు తెరిచింది. మన్మద్ దుర్బుద్ధి కూడా తలుపు తెరిచింది. ఇంట్లో ఎవరైనా వున్నారా అని అడిగినాడు. వాకిలికి అడ్డం గానే నిలబడి ఆ అమ్మాయి 'ఎవరూ లేరు ' అని బదులు చెప్పింది. 'నేను బ్యాంకి CO ని. మీ నాయనకు బాస్ ను' అంటూ విసురుగా ఆ అమ్మాయి చేతిని త్రోసి ఇంటిలోనికి ప్రవేశించినాడు. 'ఏడీ మీ నాన్న, కుక్క పిల్ల ఎక్కడ' అని మొదలు బెట్టి ప్రకోపించిన పైత్య కారుని వలె మాట్లాడుతూ ఆ అమ్మాయి సౌందర్య వర్ణన లోనికి దిగి ఆ అమ్మాయిని బలవంత పరుప మొదలు పెట్టినాడు.' ఆ అమ్మాయి అతనిని విదిలించుకొని తెరిచిన తలుపు గుండా వీధిలోనికి వచ్చేసింది. తిరిగి బయటికి వచ్చుట తప్ప వేరు గత్యంతరములేని మన్మద్ మూలన వున్న కుక్క పిల్లను చూసి దానిని తీసుకొని, తన తలపులకు  తలుపులు మూతబడిన తన దురదృష్టానికి చింతిస్తూ వెళ్లి ఆటో ఎక్కినాడు. 'వినాశ కాలే విపరీత బుద్ధి ' అంటే ఇదేనేమో!
ఆటోలో అమ్మ గారితో మన అయ్య గారు శ్వాన (కుక్క) సమేతంగా బ్యాంకి చేరినారు. అప్పటికే అక్కడ నిలిచియుండిన ఆ కుక్క స్వంతదారురాలైన యువతీయువకులు, ఇరువురికి thanks చెప్పి కుక్కపిల్లను తీసుకొని వెళ్లిపోయినారు. ఎదో బ్యాంకి పని చూసుకొని మోహిని వెళ్లిపోగా , తన దురదృష్టాన్ని దూరుతూ (తిడుతూ) మన్మద్ (Man Mad) కూడా ఇంటి దారి పట్టినాడు. ఇంతసేపూ మన్మద్ వయసు చెప్పలేదు కదా. అప్పటికతని వయసు 48. ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు.
సోమవారము గడిచింది. పండుగ అగుటతోమంగళవారము బెంకికి శెలవు అయినది. ఆరోజు security సరిగా పనిచేస్తున్నారా లేదా అని తనిఖీ చేయుట CO బాధ్యత. శెలవు దినములలో అతను రాక తప్పదు. ఆ సమయములో శూలపాణి డ్యూటీ లో వున్నాడు . వీరిద్దరూ తప్ప వేరెవ్వరూ లేరు. ఇంకా లోపలి సరిగా అడుగు పెట్టకుండానే ప్రశ్నించాడు మన్మద్.
మన్మద్ : "ఏమి? Shoes వేసుకు రాలేదే?"
శూలపాణి : "ఆఫీసుకు ఆలస్యమౌతుందని సార్. మీకన్నా ముందు వుంటేనే  కదా మీ సేవ చేసుకోగలుగుతాను. రేపటినుండి మరచిపోకుండా వేసుకు వస్తాను సార్."
శూలపాణి సింహద్వారము మూస్తూవుంటే "ఎందుకు తలుపు వేస్తున్నావు" అని అడిగినాడు మన్మద్. " సార్ మీరు check చేసేటపుడు మీతోటే వుండవలె" నన్నది కదా మీ ఆదేశము. మరి లోనికి ఎవరైనా వస్తే తెలియదు కదా ! అందుకని సార్" అన్నాడు.
మన్మద్ : "సరే సరే""
ఇరువురూ currency chest వుండే గది లోనికి ప్రవేశించినారు. శూలపాణి ఆ తలుపులు వేస్తుంటే 'ఎందుకు' అన్నాడు మన్మద్. 'ఇప్పుడే చెబుతాను సార్' అన్నాడు శూలపాణి.
విస విసా అతని వద్దకు వెళ్ళి తిట్టిన తిట్టు తిట్టకుండా, నోటిని మూత పెట్టకుండా తిడుతూ (అత్యంత చెడ్డ తిట్లను మీకు తెలిసిన రీతిలో ఊహించుకోండి) కాలికి వున్న పాదరక్షను తీసి తన శక్తి ఉన్నంత వరకు , కాదు కాదు, శక్తి సన్నగిలినా చెప్పు తెగేవరకు పదే  పదే తనకు ఇష్టమైన చోట్ల ,ఇష్టమైన రీతిలో మన్మద్ శరీరము పై వడ్డించినాడు.
శూలపాణి : "నీకీ శాస్తి ఎందుకు చేసినానో తెలుసు కదా. ఇప్పటికైనా పరాయి ఆడపిల్లలను గౌరవించడము నేర్చుకో. నా మీద కోపముంటే దిక్కున్న చోట చెప్పుకో."అని వెళ్ళి తలుపులు అన్నీ తెరచినాడు. మన్మద్ , శెలవు దినము కాబట్టి, ఏమీ చేయలేక ఈడుపు కాళ్ళతో ఏడుపు మొగముతో ఇల్లు చేరుకొన్నాడు. తరువాత రోజు మోహినితో మాట్లాడి, అసలు కారణము చెప్పకుండా, శెలవు పెట్టి అటు management, ఇటు Association చుట్టూ తిరిగి వాళ్లకు మౌఖికముగా లిఖితముగా విన్నపములు సమర్పించుకొని ఇల్లు చేరినాడు.
మేనేజ్ మెంట్  Staff Union తోను, Officers Association తోనూ కలిపి ఒక కమిటీని వేసి branch కి పంపింది. అంతవరకు అసలేమి జరిగినది అన్న విషయము మోహినికి తెలియదు. కమిటీ ద్వారా, ఏక పక్ష విషయము (అంటే ఇంకా శూలపాణి నోరు విప్పలేదు కదా!) విని, నిట్టుర్చి వారికి Branch మేడపైన ఒక గది ఖాళీ చేయించి యిచ్చింది. ఇక అక్కడ విషయ సేకరణలు, వాద ప్రతివాదాలు మొదలైనాయి.
కమిటీ సభ్యుల పేర్లను C1, C2, C3 గా పెట్టుకొందాము.
C1: 'నీ పేరేనా శూలపాణి'.
శూలపాణి : అవును సార్ మా తల్లిదండ్రులు బ్రతికినంతవరకు అట్లే పిలిచేవారు సార్
C2: ‘ఈయన ఎవరో తెలుసునా?’ మన్మద్ ను చూపిస్తూ
శూలపాణి : ఒక Watch Man తన పై అధికారి ఎవరో తెలియకుండా ఎట్లు ఉద్యోగము చేస్తాడు సార్?
మన్మద్ తో C2 : "మీ పేరు?"
మన్మద్ : "మన్మద్ సార్."
 C3: “ఎంత కాలమైంది మీరీ బ్రాంచి లో పని చేయబట్టి?”
మన్మద్ : " సంవత్సరము పైనే అయ్యింది సార్ "
ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత అదేవిధమైన ప్రశ్నలు శూలపాణి ని కూడా అడిగి, తరువాత అసలేమి జరిగింది అని మన్మద్ ను అడిగినాడు C1. మన్మద్ ఉద్వేగ పూరితంగా జరిగినదంతా ఏకరువు పెట్టినాడు. ఇక శూలపాణిని అడగటము మొదలైనది.
C1: “CC గారు చెప్పినది నిజమేనా?”
శూలపాణి : సార్ CC గారు  మా పై అధికారి. మేమంతా వా వారి క్రింద పనిచేసే వాళ్లము. ఆయన మాకు దేవునితో సమానము. దేవుడిని ఎవరైనా కోడతారాసార్? అట్లని ఆయన అబద్ధాలు చెబుతారా సార్?
అయినా మీరు ఆయనకు పై అధికారులు. ఆయన చెప్పే మాటలోని నిజానిజాలు తెల్చేదానికే గదా సార్ మీరు వచ్చింది. మీరే చూసుకోండి సార్. ఆ దుర్మార్గము నేను చేసియుంటే తప్పక నన్ను శిక్షించండి.
C2: ఆయన, మీ ఇంటికొచ్చినపుడు ఏమేమి జరిగినదని మీ కుమార్తె మీతో చెప్పింది.
శూలపాణి : "ప్రత్యేకముగా ఏమీ జరిగినట్లు చెప్పలేదు సార్. సారెంతో మంచివారని ,ఎంతో అభిమానముగా మాట్లాడినారని, నా పై అధికారి కాబట్టి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ తయారుచేసి ఇచ్చింనానని" చెప్పింది సార్.
పై పెచ్చు అధికారులలో అంత మంచివాళ్ళు కూడా ఉంటారా నాన్నా అని నన్నడిగింది సార్. వెళ్ళేటపుడు కూడా ఆయన ఎంతో మర్యాదగా "అమ్మా! నాన్న వస్తే నేను వచ్చి కుక్కపిల్లను తీసుకు వెళ్ళినానని చెప్పు అని కూడా చెప్పిపోయినారట సార్."
3: "మరి నీవాయనను కొట్టనేలేదా?"
శూలపాణి :"ఇటువంటి ఒక మాట నా జీవితములో వినవలసి వస్తుందనుకోలేదు సార్. ఈ రోజు ఆయనను కొట్టి రేపు ఆయన వద్ద పని చేయగలుగుతానా సార్? అసలు ఆయనవంటి ఉత్తముడు ఎంతో అరుదుగా ఉంటారు Sir. వారి కింద పనిచేయుట నా అదృష్టము Sir".
అంతా విన్న తరువాత కమిటీ, అంతటితో విడువక Branch Staff ను కూడా విచారించి, మోహిని గారి అభిప్రాయమును తెలుసుకొని,  బ్యాంకికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. బ్యాంకి శూలపాణి తప్పు చేయలేదని నిర్ధారిస్తూ , అనవసరంగా బ్యాంకి  సమయాన్ని వృధా పుచ్చినందుకు,శూలపాణి అతనికి వ్యక్తిగతముగా సరిపోని కారణముచేత Complaint ఇచ్చినాదని నిర్ధారణ చేస్తూ, మన్మద్ ను త్రవ్వినా నీరు దొరకని ఎడారి ప్రాంతానికి బ్యాంకి యాజమాన్యము transfer చేసిది. ఆతను వెళ్ళిన తరువాత బ్రాంచి లోని స్త్రీలు శూలపాణిని సన్మానించినట్లు సమాచారం.

నీతి : సమయానుసారముగా కట్టుకొన్న భార్యలో కూడా తల్లిని చూడమని ఆదేశించిన భూమి మనది. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః' అన్న వేదవాక్కు వినిపించిన భూమి మనది.
స్వస్తి





భార్య-గృహిణి-ఇల్లాలు

భార్య-గృహిణి-ఇల్లాలు

https://cherukuramamohan.blogspot.com/2016/08/blog-post_93.html

నేను వ్రాసిన ఈ పద్యాన్ని కొంచెము మనసు పెట్టి చదవండి.

ఫ్రిజ్జి గృహము, పవరు ప్రియమైన ఇల్లాలు

భర్త అందులోని పాయసమ్ము

పవరు లేని ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు

ఉనికినిచ్చదెట్లు పనికి వచ్చు

పెద్దలీవిధంగా చెప్పినారు.

పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మపి సర్వతః

భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ (మహా భారతము)

 కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము. ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనిని పునరుద్ధరించండి.

ధర్మాన్ని కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు. నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి పంచండి. స్త్రీ ని అర్థము చేసుకోండి.

ఇది బ్ర. శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'

గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః

సత్ కామ ఏవం యమునోపమశ్చ

తన్మేళనం యత్ర తదేవ పూతం

క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట. ఎటువంటి సద్భావనో గమనించండి . 

శ్లో: నగృహం గృహమిత్యాహుః, గృహిణీ గృహ ముచ్యతే;

    గృహంతు గృహిణీ హీనం,అరణ్య సదృశమ్ మతమ్; 

        అందరూ నివసించినంత మాత్రంతో, ప్రతీయింటినీ గృహమనరాదు. ఏ ఇంటిలో గృహిణి ఉంటుందో దానినే  గృహమనాలి. గృహిణి లేని గృహము అరణ్యంతో సమానమే! ఇంటి బాగోగులను చూసుకునేది గృహిణియే. అసలు ఆవిడ ఇంటికి రాణి. భర్త తెచ్చే సంపాదన, సరుకులను సక్రమంగా కాపాడుతూ, భర్తకు,బిడ్డలకు కడుపు నిండుగా  మమతను కలిపి భోజనము పెడుతూ నిరంతరం వారిని కంటికి రెప్పలా కాపాడేది ఇల్లాలు. అసలు ఇంటికి LAW MAKER ఆమెనే! అందుకే ఇల్లు +LAW ఇల్లాలైనదేమో! (ఇల్లు+ఆలు) ఆమె బాధ్యతలలో బంధుమిత్రుల నాదరించటం, అనువైన ఆతిధ్యము నిచ్చి వారిని యలరించటం, మామూలు విషయం గాదు . ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇంటిని చూడడము  అంటే ఇంటి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలూ అని అర్థము. ఇంతటి గురుతర బాధ్యతలలోను, తన భర్త ,తన పిల్లలు, తన అత్తా మామలను ఏమరదు. అందుకే ఆమెకంత ప్రాధాన్యం. అటువంటి గృహిణి లేని యిల్లు అరణ్యము గాక, మరేమౌతుంది?

నీతి శాస్త్రము నుండి మనమెప్పుడూ వినే ఈ సూక్తి ఒకసారి తిరిగీ గుర్తు తెచ్చుకోండి.

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి

భోజ్యేషు మాతా శయనేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని

 

ఇన్ని గుణాలు కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే అర్థము చేసుకొంటారు. అహంకారానికి ఇరువురు తావివ్వకుంటే జీవితమూ పూవుల బాటే. Divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు.

'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే వాభి రక్షతు' అన్న సంస్కృతి మనది. ఒక్కసారి ఆ మహనీయ సంస్కృతిని గూర్చి పునశ్చరణ చేసుకొందాము.

ప్రపంచంలో ఏ మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నో సార్లు చాటి చెప్పింది ఈ ధర్మం, ఈ దేశం. ఒక అపప్రథ ఈ అత్యాధునిక కాలం లో ప్రాచుర్యములో వుంది నేను క్రింద పొందుపరచే ఈ మనుస్మృతిలోని శ్లోకము మీద:

 ‘’పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే 

రక్షంతి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ (మనుస్మృతి-9-3) 

బాల్యంలో తండ్రి స్త్రీలను రక్షిస్తాడు.  యౌవనంలో మగడు రక్షిస్తాడు.  ముసలితనంలో పుత్రులు రక్షిస్తారు.  కావున స్త్రీలు స్వతంత్రులు కారు అని ప్రకటించింది మనుస్మృతి.  కావున స్త్రీ స్వతంత్రురాలిగా ఉండటానికి వీల్లేదు.  

ఈ మాటను నేడు విపరీతార్థములో వాడుచున్నారు. ఒకసారి ఆలోచించండి మీ బిడ్డ, మీ భార్య, మీ తల్లి , మీ చెల్లి ఒంటరిగా పోతూ వుంటే తోడు పోవాలని మీకనిపించదా! ఈ నాడు పాశ్చాత్య వ్యామోహము వెర్రితలలు వేయుటతో ఈ సాంప్రదాయము మందగించినది గానీ ఒక 30 సంవత్సరముల క్రితము కూడా ఈ సాంప్రదాయము పాటింపబడేది. దానిని వదిలి ఈనాడు మన ఆడుబిడ్డలు సమాజములో ఎన్ని విధములగు కడగళ్ళకు గురియౌతున్నారో వారి యాత్మలకే తెలుసు. నాడు మనకు మంచిచెడ్డలు చెప్పిన మహనీయులు ద్రష్టలు. నోటికి వచ్చినది చెప్పే తత్త్వము కాదు వారిధి. సాంప్రదాయ బద్ధమైన వారి మాటలు సవినయముగా స్వీకరించితే జీవితమును స్వర్గధామము చేసుకొనవచ్చును.

 

ఒక్క భారతదేశంలోనే, ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాము, 

ఏమమ్మా అని పలకరిస్తాము. ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, 

పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపి గౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయ జాతికి మాత్రమే తెలుసు.

ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాల పూజ చేసినా ఆమెకే.

ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం, భార్యాభర్తలు ఇద్దరూ సమం, అసలు ఆమెయే 

ఎక్కువ కూడా, మన వేదాలు, శాస్త్రాలు,ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పినవి. 

ఆమెయే గృహము, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళయిన వెంటనే, ఆ వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ 

ఆమె  యజమానురాలు.  అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడము, ఆపిదప ఆమెను వదిలేయడము అవైదికమూ, అనాగారీకము అన్యాయము. ఈ సనాతన ధర్మమును పాటించని  అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, 

పాఖండ మతస్తుతలు.

 

రాజ‌కీయ‌ములైన అనేక దండ‌యాత్రల వ‌ల‌న స్త్రీ యొక్క యునికి మ‌ధ్యయుగ‌మున క్షీణించిన‌ద‌ని చెప్పక త‌ప్పదు. స‌మాజ‌మున స్త్రీ పురుషు లిరువురు స‌మానులే. ఒకరి యెక్కువ‌గాని మ‌రియెక‌రి త‌క్కువ‌గాని యుండ‌దు.

 

భార‌త‌దేశ‌మున మ‌హిళ‌కు ల‌భించినంత గౌర‌వ‌ము ప్రపంచ‌ములో మ‌రియే యిత‌ర దేశ‌మునందున‌ లేద‌ని ప్రఖ్యాతిగాంచిన అనిబిసెంటు గారు తమ అభిప్రాయ‌మును వెలిబుచ్చి యున్నారు. సాహిత్య ప్రపంచ‌మున‌ కూడ నింత‌టి గౌర‌వ‌ము స్త్రీల‌కు ల‌భించిన‌ది. ప్రపంచ సాహిత్యం యావ‌త్తూ ప‌రికించి చూస్తే భార‌తీయ సాహిత్యంలో క‌న‌బ‌డే స్త్రీత్వం మ‌రెక్కడా క‌న‌బ‌డ‌దు అని అనిబిసెంటు వ్యక్తముముచేసిన భావ‌మును విజ్ఞాన‌వంతులెవ్వరును ఖండింప సాహ‌సింప‌రు.

 

భార‌తీయ సాహిత్యము వేద‌ముల‌తో ప్రారంభ‌మ‌యిన‌ది క‌నుక వేద‌కాల‌ము యొక్క స్త్రీ ప‌రిస్థితి యెట్లుండినదో తెలిసికొన‌వ‌ల‌సి యుండును. కొన్ని ధ‌ర్మములు, కొన్ని నీతులు, కొన్ని క‌ట్టుబాట్లు, కాలానుగుణమగు పరిస్థితులనుబట్టి మారుచుండును. మార‌వ‌లెను కూడా. ఇట్లు మారుట కాల ప్రభావ‌ము వ‌ల‌న జ‌రుగుతూ వస్తుంది. యుగ‌యుగ‌మునకు ధ‌ర్మము కొన్నికొన్ని మార్పుల‌కు లోన‌గుతూ యుండుట చేత‌నే యుగ‌ధ‌ర్మమ‌న్న మాట ప్రభ‌వించిన‌ది. భార‌తీయుల హృద‌య‌వాదులు, ఆత్మవాదులు

న‌గుట‌చేత స్త్రీల‌ను ఒక విధ‌ముగ పురుషులను ఒక విధ‌ముగ చూడ‌లేద‌నియే చెప్పవ‌లెను. మిగిలిన ప్రపంచ సంస్కృతికిని భార‌తీయ సంస్కృతికినిగ‌ల ముఖ్య భేద‌మిచ్చట‌నే కనిపించును. పాశ్చాత్యులకు ప్లాటో మాట వేదము. ఆయన ఏకంగా స్త్రీలలో ఆత్మ ఉండదు, ఆమె మగవాని ఆనందమునకే సృష్టింపబడినదని చెప్పినారు. అందుకు నిదర్శనమే ఆమెరికా నేటి వరకు ఆడ ప్రెసిడెంటుకు నోచుకోలేదు. ఎట్టకేలకు  హిలరి రోధం క్లింటన్  పోటీ అయితే చేసింది కానీ గెలువలేదు.  శ్రీ ఖండ‌వ‌ల్లి ల‌క్ష్మీరంజ‌న‌ము భార‌తీయ, పాశ్చాత్య భావ‌ముల‌ లోని భేద‌మునిట్లు చెప్పియున్నారు. ‘భార‌తీయుల ఎక్కువ‌గా హృద‌య‌వాదులు. పాశ్చాత్యులు బుద్ధిప‌రులు. మన వారు క‌ర్మబుద్ధులు. దైవ‌మునే బ‌ల‌ముగా నెంచువారు. పాశ్చాత్యులు క‌ర్మసిద్ధాంత‌ము నొప్పుకొన‌రు. పునర్జన్మను వారంగీక‌రింప‌రు. భార‌తీయ‌మైన స‌మ‌స్త క‌ళ‌లును పైన తెలిపిన  భారతీయ సిద్ధాంత‌ము నాధార‌ముగ జేసికొని పాలింప‌బడిన‌వే. భార‌తీయ సిద్ధాంత‌ము ప్రకార‌ము మాన‌వులు శాంతియుత‌ముగ జీవించుట‌కు ఒక చక్కని ప్రణాళిక‌ వంటిది ఏర్పదియున్నది. సుఖ‌దుఃఖ‌ముల‌ను ఒక్క ర‌క‌ముగ చూచుచు క‌ర్తృత్వమును దైవ‌ముపై వ‌ద‌లి క‌ర్మను చేయుట‌యే వ్యక్తి యొక్క విధిగ చెప్పబ‌డిన‌ది. మోక్ష ప్రాప్తికై భ‌క్తి, జ్ఞాన‌, క‌ర్మయోగ  మార్గముల‌లో నొక‌దానిని నిర్ణయించుకొని త‌న్మార్గగామి య‌గుట‌యే భార‌తీయ జీవ‌న విధాన‌ములోని ముఖ్యాంశ‌ము. ఈ విధాన‌మున స్త్రీ పురుష విభేద‌ము చెప్పబ‌డ‌లేదు. ఆత్మయ‌నున‌ది యిరువురికి నొక్కటియే. కాని యిరువురకును కొన్నికొన్ని హద్దులు ఋషుల‌చే నిర్ణయింప‌బడియున్నవి.

 

బృహ‌దార‌ణ్యకోప‌నిషత్తులో పురుషుడు త‌న ఏకాకి త‌న‌మును చూచి భ‌య‌ముచెంది ఆనంద‌ముకొర‌కు భ‌య‌నివార‌ణ‌ము కొర‌కు స్త్రీని సృష్టించెన‌ని యున్నది. ‘ఏకాకీ న‌వైర‌మ‌తా’ అన్నది అతని అభిప్రాయము. ప్రకృతి పురుషులే స్త్రీ పురుషులు రాముడు, దివి నుండి దిగి వచ్చి సూర్యవంశ‌మున‌ను, సీత పృధ్వి నుండియు జ‌నించి జనక తనయ అయినది. ఇచ‌ట రాముడు ఆకాశ‌త‌త్వముగ‌ను సీత పృధ్వీత‌త్వముగ‌ను భావింప‌బడిరి. క‌ర్తృత్వ భ‌ర్తృత్వముల‌లో మార్పులున్నను విధి నిర్వహ‌ణ‌మున స్త్రీ పురుషులిరువురును స‌మానులేయై యుండిరి.

భార‌తీయ త‌త్వమున‌కు అర్ధనారీశ్వర భావ‌ము ముఖ్యాధార‌మైన విష‌య‌ము. ప్రకృతి పురుషుల స‌మాన‌త్వ మిచ‌ట నిరూపింప‌బ‌డిన‌ది. ప్రాచీన కాల‌ములో మాతృస్వామ్యముండెడిద‌ని చ‌రిత్రకారులు చెప్పుచున్నారు. మాతృస్వామ్యమున్నను పితృస్వామ్యమున్నను మాతృదేశ‌ము అన‌గా మాతృదేవ‌త‌కు ప్రథ‌మ స్థాన‌మీయ‌బ‌డుట మాత్రము స‌ర్వకాల‌ముల‌లోను వ్యక్తమ‌గుచున్న విష‌య‌ము. ఇది నేటికినీ  అవిచ్ఛిన్నముగ పాలింప‌బడుచునే యున్నద‌నుట నిస్సంశ‌య‌ము. ధ‌ర్మప‌త్ని భావ‌మును యజుర్వేద‌ములోని శ్లోక‌ము ఇట్లు తెలుపుచున్న‌ది.

సురీయో దేవీయుష‌స‌గ్ం

యోచ‌మునా మ‌రీయః

న‌యోషా య‌భ్యేతు ప‌శ్చాత్‌

సూర్యుడు ఉషాదేవిని ఎలా అనుస‌రిస్తున్నాడో అలాగే పురుషుడు స్త్రీని అనుస‌రిస్తున్నాడ‌ని భావ‌న. స్త్రీ పురుషు లొక‌రికొక‌రు స‌హ‌క‌రించుకొనుట ఇట్లు వెల్లడియ‌గుచున్నది. భార్యను త‌న‌క‌న్ని కార్యములలోను స‌హ‌క‌రింప‌వ‌ల‌సిన‌దిగ అభ్యర్ధించు వివాహ మంత్రములున్నవ‌ని శకుంత‌లారావుగారు వ్రాసియున్నారు. అవి లేనందున హృద‌య బుద్ధుల‌కు ప్రాముఖ్యమీయ‌బ‌డిన‌ద‌ని తెలియుచున్నది. మ‌రియును శ‌రీర‌ము అశాశ్వత‌మైన‌ద‌ని గ్రహించిన ఋషులు శాశ్వత‌మైన మోక్షసాధ‌న‌కు శ‌రీర‌మునే ప‌రిక‌ర‌ము గావించుట‌కు మార్గము న‌న్వేషించిరేగాని ఇంద్రియ‌లోల‌ల‌త్వమును ప్రోత్సహింప‌లేదు. శ‌రీర ధ‌ర్మములైన వాంఛ‌ల‌ను ధ‌ర్మబ‌ద్ధముగ పొందుచుండ‌వ‌లెన‌ని మాత్రమే ఆదేశించియున్నారు. ధ‌ర్మార్ధ కామ‌మోక్షముల‌ను, పురుషార్థముల‌నియందురు. ధ‌ర్మకామ‌ముతో కూడిన అర్థకామము, ఆపై మోక్షకామ‌ము,  ఇట్లొకదానికొక‌టి ముడిప‌డియున్నవి. ధ‌ర్మమును మోక్షమును ప‌ర‌మున‌కును అర్థమును కామ‌మును ఇహ‌మున‌కును నిర్ణయించిరి. అన్ని అర్థముల‌కును ధ‌ర్మమే ప‌ర‌మార్థమైయున్నది.

‘పాతివ్రత్యము’ అన్న విష‌య‌ము మ‌న దేశ‌మున ప్రస్తుతింప‌బ‌డుచు, న‌నూచాన‌ముగ వ‌చ్చుచున్న విష‌య‌ము. పాతివ్రత్యమన‌గా ప‌తి చేయు ధ‌ర్మ కార్యముల‌లో, దైవ‌కార్యముల‌లో తోడ్పడుట‌యేగాని,

మూర్ఖముగ నేడు భావించుచున్నట్లు క‌నులు మూసికొని దుర్మార్గుడైన భ‌ర్తతో కాల‌ము గ‌డుపుట‌ కాదు. ఇది వేదములందెక్కడా చెప్పియుండబడలేదు. భర్త దుర్మార్గుడైతే భ‌ర్తతోపాటుగ నామె బ్రతుకుకూడ న‌ర‌క‌ప్రాయ‌ము అగుట సంభ‌వింప‌వ‌చ్చును. స్వజనమును ఆశ్రయించియైనా తన సంసారమును చక్కదిద్దుకొనవలసిన బాధ్యత ఆమెపై ఉంది. ఇద్దరూ ఎడముఖము పెడముఖమైనారంటే కళకళలాడవలసిన సంసారము కాటికి చేరే అవకాశము మెండుగా ఉంటుంది.  భ‌క్త జ్ఞాన‌దేవ్ వ్రాసిన జ్ఞానేశ్వ‌రియను గ్రంథ‌మున పాతివ్రత్యమ‌న‌నేమో తెలియ‌జేయుచు నిట్లు వ్రాయ‌బ‌డిన‌ది. ‘ప‌తిబియామ‌తా అనుస‌రోనీ’ అని యున్నది. అన‌గా ప‌తి యొక్క అభిప్రాయ‌ము న‌నుస‌రించుట‌లో ప‌తివ్రత‌య‌గు స్త్రీకి శుభ‌ముగ‌ల‌దు. ఇది బాధ్యతాయుతుడైన భర్తతో నడుచుకొనవలసిన విషయము. ప‌తి యొక్క వ్రత‌మున‌కు పోష‌ణ యిచ్చున‌ది ప‌తివ్రత ఇచ‌ట వ్రత‌మున‌కు బ‌దులు అభిమ‌త‌మున‌కు ప్రాధాన్యమీయ‌బ‌డిన‌దని వినోబా భావించుచున్నారు. నిజ‌మున‌కు ‘వ్రత‌’యే స‌రియైన‌ది. ఎందుచేత‌న‌న‌గా య‌జ్ఞయాగాది క్రతువుల స‌మ‌య‌మున భార్యలేనివాడు వానిని చేయుటకు అన‌ర్హుడు. కర్మచేయున‌ప్పుడు భార్య య‌త‌ని ప్రక్కనే యుండ‌వ‌ల‌యును. ఇదియే ధ‌ర్మప‌త్ని భావ‌మున‌కు మూలాధార‌ము. ఈ విష‌య‌ముతోడ‌నే ప‌తివ్రత‌య‌నున‌ది వ‌చ్చియుండ‌వ‌చ్చును. ప‌తితోగూడి వ్రత‌ములు చేయున‌ది గావున ప‌తినే దైవ‌ముగ న‌మ్ముకొనుట‌వ‌ల‌న ప‌తివ్రత‌య‌న్న ప‌ద‌ము పుట్టిన‌ది. అట్లని భర్త వంగమంటే వంగుట లేయమంటే లేచుట అన్నది దీని అర్థము కాదు. పెద్దలు ‘కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...’ అన్నారు కదా!

 

సంస్కృత భాష‌లో ఏ ప‌ద‌ము వ్యుత్పత్యర్థము లేక యుండ‌దు. స్త్రీ య‌న‌గా గ‌ర్భమును ధ‌రించున‌ది అని అర్థము. మ‌హిళ య‌న‌గా మహీమ్ లాతీతి మ‌హిళా. మ‌హియ‌న‌గా భూమి (పృధ్వీత్వము) క్షేత్ర స్థాన‌మందున్నది.  రాముడు దివి నుండి భువికి దిగి సూర్యవంశ‌మున‌ను, సీత పృధ్వి నుండియు జ‌నించిరి. ఇచ‌ట రాముడు ఆకాశ‌త‌త్వముగ‌ను సీత పృధ్వీత‌త్వముగ‌ను భావింప‌బడిరి, అని ముందే పైన చెప్పుకొన్నాము. క‌ర్తృత్వ భ‌ర్తృత్వముల‌లో మార్పులున్నను విధి నిర్వహ‌ణ‌మున స్త్రీ పురుషులిరువురును స‌మానులేయై యుండిరి. ఈ విషయాన్ని గ్రహించి భార్యాభర్తలు ఒకరికొకరుగా వుంటే కుటుంబమునకంతకన్నా కావలసినది వేరేమైనా వుంటుందా!

అతిముఖ్యమగు విషయము ఇంటికి లోపల ఇల్లాలే రాణి. ఈ భావము మనసున పెట్టుకొని భర్త నడచుకొని సమన్వయము సాధించుకొంటే ఇల్లు స్వర్గమే!

అందుకే స్వర్గమన్న వేరే కలదా! శాంతి వెలయు గృహమే కాదా! అన్నారు పెద్దలు.

చదువు సంధ్య లేకున్నా సంస్కారములో మిన్న

పెంపకాన మనసుంచును కలిగియున్న బుద్ధికన్న

మెతుకు గతుకునోలేదో తనకు మాత్రమె తెలుసు

బిడ్డ కంటిలో ఎపుడూ పడనీయదు నలుసు

కన్న కలలు పగలంతా రెప్పలపై ఏర్చిపేర్చు

పనులన్నీ ముగియుదాక రేయినిదురనోదార్చు

ఇంటిబయట తనపేరును అంటించగ తా కోరదు

తన సేవాధర్మముతో ఇంటి యశము సమకూర్చు

మొగుని విసుగు నంతయును ముసినవ్వున మరుగుపరచు

మూతిని ముడిచిన మొగ్గను కుసుమముగా వ్యక్త పరచు

మానై తా నెండ నోర్చి తెరువరులకు నీడనిచ్చు

ఇంటికి తా దేవతయై స్వర్గమునే నిలిపియుంచు

స్వస్తి.

 

 

 

ఓం గం గణపతయే నమః

ఓం గం గణపతయే నమః


 'ఎవరు ప్రకృతిని ప్రేమిస్తారో, పర్యావరణాన్ని రక్షిస్తారో, వారిని దీవిస్తాడు విఘ్ననాయకుడు'. వినాయకపూజ 

ప్రకృతికి (పార్వతీ దేవి) హాని కలిగిచని రీతలో, వినాయకుడికి నచ్చే రీతిలో, గణపతి మెచ్చే రీతిలో జరుపుకోవాలి. 

భూమి/మట్టి శివస్వరూపం. ప్రకృతి పార్వతీ స్వరూపం. మట్టితో చేసిన గణపతిని పూజించడమే శ్రేష్టం. అందుకే 

గణపతి సంకటహర చవితి పూజకు తదియతో కూడిన చవితే చాలా శ్రేష్టం అని చెప్తారు. తదియ అంటే పార్వతీ 

దేవి/ గౌరీమాత. చవితి అంటే గణపతి. #గౌరీగణేశుడికి ప్రతీక సంకటహర చవితి. అలాగే మట్టి గణపతి కూడా 

గౌరీగణపతికి ప్రతీక. 

వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి. మనం ప్రకృతిని పేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు. మనం 

ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.మిత్రులారా! వినాయక చవితి సమీపిస్తున్నందున వినాయక 

చవితికి సంబంధించి మట్టి గణపతినే పూజించడం ఎందుకు? గణపతి నిమజ్జనం ఎందుకు? పత్రిపూజ 

ఎందుకు? గణపతి తత్వం ఏమిటి? వినాయకచవితి నివేదనలోని ఆయుర్వేద రహస్యాలు ఏమిటి? మొదలైన 

అంశాలను గణపతి అనుగ్రహంతో రోజు అందించే ప్రయత్నం చేస్తాను. - 1

ఓం గం గణపతయే నమః

అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ

వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం

వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది

పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క

విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము

కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని

నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే 

లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు 

పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు 

(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే 

పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా 

వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. 

సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే 

చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి 

పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ 

సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు 

సూతుడు.
- © మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే

కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః


ఓం గం గణపతయే నమః - 2

మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో 'మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు?' అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.

వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్రజలమందుగానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే" అని వివరించాడి సూతమహర్షి.

సేకరణ : © మహాగణపతి పురాణం - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. కాలుష్యాన్ని నివారించండి. 

ఓం గం గణపతయే నమః

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. అసలేంటీ #పంచీకరణం అంటే? 

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం అంటే భూమికి సంకేతం. కనుక #వినాయకుణ్ణి మన్నుతోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్ని ఒక్కడినే చేరుతాయి. వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. #పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలు, విగ్రహంతో పాటూ నీళ్ళలో కలపడం వలన ఆ నీళ్ళలో కాలుష్యం హరించబడుతుంది. రోగకారక క్రిములు నశిస్తాయి. 

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వశుభప్రదం, మంగళప్రదం.

వివాహ పద్ధతులు ఎన్ని, అవి ఏవి?

వివాహ పద్ధతులు ఎన్ని, అవి ఏవి?

కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం, యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా ఇవ్వడం దైవవివాహం, ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం, మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణి గ ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం ప్రాజాపత్య వివాహం, తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం గాంధర్వ వివాహము, షరతు పెట్టి వివాహం చేసుకోవడం అసుర వివాహం, కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం, కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు చేసుకున్న వివాహం పైశాచిక వివాహం. 

పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?

మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని. జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెల్లయిపోయినట్టు.

తలంబ్రాలు పోసుకునేదేందుకు? 

ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ….ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.

సప్తపది అనగా ఏంటి?

వరుడు వధువుని ఏడడుగులు నడిపిస్తూ…. నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి. ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.

పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి?

పెల్లికోడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను, నా, నీ జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు. పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ, పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం. 

పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు? 

ఓ పెండ్లి కూమారుడా పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని, ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను….
“ఓ వరుడా……నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి, నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను” అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి, శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.

నల్ల పూసలు ధరించేది ఎందుకు?

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భర్త, భార్యను ఎప్పుడు తాకాలి?

వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి బట్టలివాలి. అన్ని వైపులా నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి. అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.

భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి?

సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు
కుడి వైపున ఉండాలి. 
బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి. శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు
Ghorakavi Sreenivasa Venkata Subbarao commented on your post.
Ghorakavi Sreenivasa Venkata wrote: "dear ramamohan thank you very much. i have been going through your contributions. you are one who is very active on face book enlightening on so many subjects. your transliteration of a stranza of siva thandava strothram is very lucid. i performed rudra yagam at rama thirtham temple on 3rd aug which is incidentally my birthday as per thithi. it is one of the oldest temples where lord parasurma did the prathisshta of lord siva near ongole. i am not well versed in telugu lipi. i will try. god bless you."
Reply to this email to comment on this post.