Wednesday, 5 July 2023

పాఠక జన గణ మణులకు నాదొక చిన్న విన్నపము

 

పాఠక జన గణ మణులకు నాదొక చిన్న విన్నపము

https://cherukuramamohan.blogspot.com/2023/07/blog-post.html

ఇది జూలై6,2017న నేను మొదటిసారిగా ప్రకటించిన వ్యాసము.  

నాకున్న సముదాయములో నాదయిన మేధో పరిధిలో, ఒకవేళ మీరు వుంది అనుకొంటే, తెలుగులోనూ ఆంగ్లములోనూ పాటో, పద్యమో, వ్యాసమో, హాస్యోక్తులో, పెద్దల నీతి వాక్యములో, సాహిత్య సాంఘీక \విశ్లేషణలో, నా కుడ్యము పై ప్రచురించుతూ వుంటాను.  పద్య గీత హాస్యాదులను కొంత కష్టమున్నా వర్ణములతో వర్ణచిత్రములతో వర్ణనాతీతము చేయ ప్రయత్నిస్తుంటాను. వ్యాసములను సామాన్యముగా లంకెను జతజేసి గోడకు చేరవేస్తాను. ఏది ఏమయినా ప్రోద్దుబోని కబుర్లు ఉండకుండా వుండే ప్రయత్నము మాత్రము మనఃపూర్వకముగా చేస్తాను.

ఏతావాతా నేను మీనుండి కోరేది ఒకటే! నా ప్రచురణలకు, నాకు ఏదో ప్రాచుర్యము రావలేనని ఈపని చేయుట లేదు. నాది, కేవలము మన పూర్వ వైభవమును గూర్చి, నాకు తెలిసినది తెలియజేయవలేనను తపన మాత్రమే! అందువల్ల నేను మిమ్ము కోరేది ఒకటే.  మీరు వానిని విరివిగా చదవండి. అభిప్రాయ విభాగము (Comment Box) లో మీ అభిప్రాయమును తెలిపి, నచ్చినది అయితే పదుగురికి పంచండి.

మనకు తెలియని ముప్పు మన మధ్యనే వుంది. ఒక 800 సంవత్సరములకు పూర్వము, మనలో వర్ణాశ్రమ ధర్మములున్నా వానిని వక్రీకరించుకొనక సహజీవనము గడిపినాము. అందుకు మన దేశ ప్రగతియే సాక్ష్యము. ఒక ప్రక్క తురుష్కులు వేరొక ప్రక్క  అప్రాచ్యులు సామదానభేదదండోపాయాలతో, కట్టి కంఠముపై నుంచియో, కాదు పున్యవతుల చేరపట్టియో, బాలబాలికలనపహరించి చెరచి లేక మతివిభ్రమమునకు గురిచేసి,  మనలోని బలహీనతలను అందిపుచ్చుకొని తమ తమ మతములలో మన సహోదరుల నెందరినో చేర్చుకొన్నారు. ఆరోజు మనవారే, కానీ ఈ రోజు మనపై శత్రుత్వమును పూని ఎన్నో దారుణమగు అభియోగములను మనపైన మన సనాతన ధర్మము పైన మోపుచున్నారు. అసలు DNA TEST ప్రకారము హిందువులలో వర్ణ విచక్షణగానీ ఆర్యద్రావిడ విభేదాలుగానీ లేవని, ఆసేతు సీతానగ పర్యంతము అంతా ఒకటేనని శాస్త్రీయముగా నేడు నిరూపింపబడినది. ఈ ఒరవడిని నిలువరించుటకు మనము తప్పక వారి మత గ్రంధములను చదివి తీరవలసినదే! ఒక పరమతస్థుడు సంస్కృతము రాకున్నా వేదములను దాశరథివారి భాష్యముతో చదివి, వేదములు ఏసుక్రీస్తును ప్రతిపాదించినవని ఏకంగా, తాను ప్రామాణికమని తలచే  గ్రంధమునే వ్రాసినాడు. మనలో సాంప్రదాయ, సంస్కార పరిధులను దాటకుండా దానిని ఖండించగలిగేవారు ఎందరున్నారు. అదేవిధముగా వేరొక మతమువారు 'అల్లోపనిషత్తు' అన్న ఉపనిషత్తునే మన ధర్మమున జొనిపి మనల వెర్రిగొర్రెలుగా చేయ ప్రయత్నించుచున్నారు.  ఇంత ఘోరమునకు వడిగట్టిన వారితో మరి మనము వాదించుటకు వారి లోతుపాతులు తెలుసుకొననవసరములేదా! కుమారిలభట్టు బౌద్ధులతో వాదించుటకు మారువేషమున వారి గురుకులమున చదువలేదా!

తపన లేకుంటే పతనమే! ఈ విషయమును మరువకుండుట మరీ ముఖ్యము.

అందువల్ల చదివి నచ్చితే నచ్చినదని మీ అభిప్రాయమును తెలుపండి లేక ఇంకా నాకు తెలియని, నేను తెలుపని విషయములుంటే తెలియజేసి పుణ్యము కట్టుకొండి. మన ధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే!

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। భగవద్గీత ౩-35ll

ఇతరుల ధర్మాన్ని అవలంబించుటకన్నా, లోపాలతో కూడి ఉన్నా, మన ధర్మమును పాటించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గమును  అనుసరించటం అత్యంత ప్రమాదభరితము. (భగవద్గీత 3 - 35)

స్వస్తి.

 

1 comment: