https://cherukuramamohan.blogspot.com/2022/04/blog-post.html
ఏప్రిల్ 10, 2016 న, ఒక పాఠకుడు నామీద దయతో నాచిత్త
ప్రవృత్తిని విమర్శించినాడు. నాపై ఆయన
అభియోగమేమిటంటే నేను వ్రాసేది పదుగురు చూడవలెనని తలుస్తానట గానీ నేను ఇతరుల
వ్రాతలుచూడను అని. ఇది నేటికి కూడా వర్తించుతుంది కాబట్టి మీ ముందు ఉంచుచున్నాను.
1. నేను నా ఆస్యగ్రంధి, ఆననగ్రంధి
లేక face book సమయమును నా దినచర్యకు అనుకూలముగా అమర్చుకొన్నాను.
2. నేను వ్రాసే ‘వ్యాసములు\కవితలు\
మన పూర్వుల ప్రతిభ\ మన సంస్కృతి\ భగవద్భక్తి\ లౌకికము, హాస్యము మొదలగు విషయములపై’ నా రాతలు
నచ్చితేనే మీ ఆమోదమును తెలియ జేయండి. నచ్చకుంటే మీకు నచ్చేవి వుంటాయికావున మీరు
అవిచదివి మీమీ సమ్మతమును, అభిప్రాయమును ఆస్యగ్రంధిలో తెలుపుతూ ఉండండి. అప్పుడు అటుమీకుఇటునాకుఏఇబ్బందిలేదు.
నేనువ్రాసినవి చదవండి అన్న బలవంతము నా వైపు నుండి ఎప్పటికీఉండదు. నేను వ్రాసే ఎ విషయమూ నా పేరు ప్రతిభకై వ్రాయుటలేదు. మన పూర్వులు మన విజ్ఞానము, మన సంస్కృతి మొదలగు విషయములు తెలియజేయవలేనన్నది నా తపన.
ఈ సందర్భములో మహాను భావుడగు భర్తృహరి తన నీతి శృంగార వైరాగ్య శతకమునకు ముందుమాటను ఈ విధముగా తెలిపినాడు.
బోద్ధారో
మత్సరః గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాఃl
అభోధోప
హతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితంll భర్తృహరి
విద్వాంసులు
తమకన్నీ తెలుసుననే అహంకారముతో ఉన్నారు.
రాజులు విషయాలోలురయి సద్గురువులను దారిజెరానీయారు. మూర్ఖులు తమ వ్యాసంగమును
మించినది లేదు అందుచే ఏమీ విననక్కరలేదు అనుకొంటారు. మరినేను
చెప్పదలచుకొన్న
సుభాషితములు నాలోనే జీర్ణమై పోవలసినదేనా అని మాదనపడి భర్తృహరి గారు చివరకు ఒక
నిర్ణయానికికి వచ్చి, “నేనుచెప్పేది నేను చెబుతాను, వినేవాడు విని బాగుపడనీ
విననివాడు తన భవితను తానే వ్రాసుకొననీ” అనుకొంటాడు. అనుకొనుటమే గాక నీతి శృంగార
వైరాగ్య శతక రచన చేసి లోకానికి బహూకరించినాడు.
ఈ నిర్ణయము కలిగినవాడు ఎవరు చూస్తున్నారు ఎవరు చూచుటలేదు అన్నది పట్టించుకోడు.
ఇక ఒకరు వ్రాసిన విషయములు చదువుటను గూర్చి, చదువుకొనుటకు వ్రాయుటకే సమయము సరిపోయే నాకు వేరు ఎవిధముగానూ సమయమును వినియోగింప అవకాశము దొరుకదు. ఇక నా సద్గుణ్య వ్యాసములను తెలిసిన వారు చదువరు, తెలియని వారు చదువలేరు, తెలిసీ తెలియనివారు చదివినా ప్రయోజనములేదు. కావున నిజమైన జిజ్ఞాసువులు తమ ఇష్టాయిష్టముల ననుసరించి చదువుకొంటారు. వారికి నేను ఇతరుల ప్రచురణలు చదువుతున్నానా లేదా అన్నది పట్టదు.
3. మీ రచనలు నేను చూడ గలిగి నచ్చినపుడే స్పందించ గలను.
4. నాతోమాట్లాడే చాలామంది మీరు వ్రాసేవి
ఇష్టముగాచదువుతాము గానీ స్పందిచ లేము. స్పందించలేదని వ్రాయుట ఆపవద్దు అన్నవారికి
నాధన్యవాదములు, పై వ్యక్తి దయవల్ల ఈ విషయమును గూర్చి తెలుసుకోనూగలిగినాను, నా అభిప్రాయమును తెలుపనూ గలిగినాను.
5. ఇటువంటి అభిప్రాయములను అటువంటి వ్యక్తులు తమతోనే
ఉంచుకొనుటమంచిది. ఇందులో' 'ఇచ్చుకుంటివాయనం - పుచ్చుకుంటి
వాయనం' ఉండదు.
ఎంతో అభిమానముతో ఈ దిగువ తమ అభిప్రాయములను తెలిపిన అభిమాన వర్గముయొక్క
సంస్కారమునకు శిరసు వంచి నమస్కారము చేయుచున్నాను.
14 Comments
Raghavendra Kumar
Me postlu baguntayi meru vere valla matalu pattinchukovakkara ledhu
Reply6y
Kolluru Vijaya Sarma
మీ రచనలని ఆస్వాదించేవారిలో ఎప్పుడూ మేమున్నాం, అటువటివంటి
వ్యాఖ్యలని దయచేసి పట్టించుకోవద్దని మా ప్రార్ధన
Reply6yEdited
Sudha Jandhyala
Evaraina manam vrasinavi chadavaalane vuddeshamthone vrastaamu. Ala
anukovatamlo atishayokti kaani ahamkaaram kaani. Vundadu. Teliyani vishayaalu
(Oka Vela telisina anta deepga aalochincham) teliyani cheyyatam chaala
abhinandinchadagina vishayam
ReplySee Translation6y
G A Kumar
Sir, please continue your postings. Ignore silly comments. We like
your literature.
Reply6y
Surabhi G Sriram
Asalu alaantivi pattinchukokandi sir..... Mee maatalu andarikee
spoorthini ichheve......meeru manchi ne cheputhunnaru...
ReplySee Translation6y
Arya Arya
Ramamohana aryottama ...Anya vishayamulanu pattinchukonaka meeru
vyasamulanu vrayudu....
Reply6y
Kilambi Gopal
Guruvugaariki abhivaadamulu. Tuchula vaakkulu pattinchukonavaladu. Mee
rachanalu maaku enno vishayamulu telupuchunnavi. Meeru rachinchina grandhamulu
ichata ponduparachavalenani maa abhilaasha
Reply6y
Jyothiprakasan Sambasivapillai
Yevaru vraasina adhi vaari vaari samayamunu shraddhaga vaadukonuta
korake. Mukhyamuga Indhulo Aathma thrupthi vuntunnadhi. Yevaro yedho annaarani
chinthincha valadhu. Manam yedhi chesina adhi manakorake. Avasaramunna vaallu
grahistharu. Kaanicha nastamemi ledhu.
ReplySee Translation6y
Ramachandra Murty Vithala
Mee rachanalannee samaajaaniki upayogincheve.
ReplySee Translation6y
Venugopal Rao Vinukonda
Sthayini batti avagahana kani avagahana rahityam kani.
ReplySee Translation5y
Bhanu Gouda
Ignore sir. Folks are nuts, sometimes.
Reply5y
Rishignanam Surya
U continue your mission sir. U r sharing information of rare nature. Opposition out of jealous is common
Ignore them. Sanatandharm ki jaiho
Reply5y
Sastry Kv
We heart fully welcome and enjoy your writings whether they are
poetic or commentary or otherwise. I personally get enlightened. Pl keep going.
Reply5y
Kaki Chandrasekhar
లోకులతోటి మీకెందుకు
No comments:
Post a Comment