ఆడపడుచులు
ఆడపడుచులను
గూర్చి మనువు ఈ విధంగా చెబుతాడు
“శోచంతి జామయో యత్ర వినశ్వత్యాశు తత్కులం
నశోచంతితు
యత్రైతావర్ధితే తద్ది సర్వదా ”
అనగా
ఆడపడుచులు ఏయింట అన్నదమ్ములచే ఆదరించ బడతారో
ఆయింట
వంశం వర్ధిల్లుతుంది. అట్లు కాదేని ఆ వంశం నశిస్తుంది.
“తస్మానేతాన్ సదా పూజ్యాః భూషణాచ్చాద నాశనై
భూతికామైర్నరైర్నిత్యంసత్కారేషూత్సవేషుచ.”
తమ
ఇంట పండుగలు పబ్బాలు మొదలగు శుభకార్యములు జరుపుకోనేటపుడు
ఆడపడుచులను
పిలచి మంచి భోజనము పెట్టి,
వస్త్ర భూషణాదులనిచ్చి సంతృప్తి పరచి పంపాలని మనువు చెబుతాడు.
కనుకనే పండగ రోజులలో కూతుళ్ళను అల్లుళ్ళను పిలిచి ఉన్నంతలో వారికి ఉచిత సత్కారము
చేసే సాంప్రదాయము మనకు కలిగినది.
మన వేద పురాణేతిహాస గ్రంథాలలో స్త్రీలకు ఎంత
ప్రాధాన్యత ఇచ్చినారో చూడండి.
మూడు
నాలుగు పెళ్ళిళ్ళు వివాహ ఐతరేయ సంబంధములు గల్గిన మతములలో తోబుట్టువుకు ఉచిత
మర్యాదనిచ్చుట చూడగలరా!
No comments:
Post a Comment