Saturday, 28 December 2019

అప్రాచ్య కాలగణనము

అప్రాచ్య కాలగణన

ప్రాచ్యులు అంటే తూర్పు దిశలో వుండేవారు. అప్రాచ్యులు అంటే తద్విరుద్ధముగా పశ్చిమ దిశలో ఉండేవారు, అంటే పాశ్చాత్యులు అని అర్థము. ఇందులో చెడు అర్థము లేదు.
      క్రిస్మస్ ను గూర్చి వ్రాసిన వ్యాసానికి లభించిన ఆదరణకు పాఠకులకందరకూ  ఇందుమూలముగా ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను.. ఇపుడు పాశ్చాత్య  నూతన సవత్సరము సమీపించినది. మరి దానిని గూర్చికూడా  చదివి అందున్న లొసుగులు గ్రహించవలెనని నా ఆకాంక్ష. నిజమునకు నాకు ఈ పనులు నా వయసుతో పోలిస్తే శ్రమతో కూడినవే. కానీ నాలో వున్న, తెలియజెప్పవలెనను తపన నాతో ఈ పని చేయిస్తూ వుంది. చాలా మంది యువకులకు ఇందు నేను పొందు పరచిన వాస్తవాలను చదివిన తరువాతనైన మన పూర్వుల శాస్త్ర పరిజ్ఞానమును, జగతికి వారు చేసిన నిస్వార్థ సేవను గుర్తించండి. శాస్త్రీయ దృక్పథములేని పరమత పర్వదినముల జోలికి పోవద్దండి. మన ఉగాదిని తెలుగు సంవత్సరాది అనంటారు. అంటే తెలుగు వారి పండగ అనేకదా! మన రాష్ట్రములో ఉండే పరమతస్తులు కూడా వారి తాత ముత్తాతల కాలమునుండి తెలుగువారే కదా! మరి, ప్రత్యేకముగా ఏ దేవునికీ సంబంధించని , తెలుగు పండగను ఎందుకో జరుపుకోరు.  మనమెందుకు January 1st ఒక పండుగ కంటే ఎక్కువగా జరుపుకొంటూ వున్నాము. ఒక్క సారి ఈ క్రింది లంకెలో 'ప్రాచ్యా ప్రాచ్య కాలమానము'ను గూర్చి చదవండి. వాస్తవమును  గ్రహించండి.
ఈ వైదిక దేశము భూలోకములోనే మొదట పుట్టినది. భారత దేశము అన్నపేరు పెట్టుటకు మునుపు ఈ దేశము పేరు అజనాభము. అజుడు అంటే పరబ్రహ్మ. ఆయన నుండినే బ్రహ్మ,విష్ణు మహేశ్వరులుద్భవించినారు. నాభి అంటే బొడ్డు(Center Of Gravity) . ఈ భూమి మేధస్సుకు నిలయము. తురుష్కులు, పాశాత్యులు మన జ్ఞాన సంపదలగు పుస్తక భాండాగారములను అగ్నికి ఆహుతి చేసి, తస్కరించి, నయానో భయానో మనలను మభ్యపెట్టి సంస్కృతమునకు దూరముగానూ ఆంగ్లమునకు చేరువగానూ చేసి నిష్ప్రయోజకులను చేసినారు. కనులు తెరిచి ఇకనైనా వారి విషపుకోరలనుండి బయటపడుదాము.
కాలగణన (పాశ్చాత్య శైలి)
అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు.  అయినా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించినారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.
క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది.  ఇచ్చిన అప్పులు సంవత్సరము మొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది.  తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప  బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanac   అని గూడా అన్నారు. నిజానికి దీనిని Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును.  ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.
నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక.  రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి.  సంవత్సరానికి 10 నెలలుండేవి.  మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు.
పంపీలయస్  చక్రవర్తి క్రీ llపూll 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిది కాదనుకొని 355 రోజులు చేసినారు.  క్రీ ll పూll 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది.
అంటే ప్రపంచమంతటా నూతన సంవత్సరము  వసంత ఋతువు(spring) లో, మార్చ్ నెల ‘spring’ లో నె వస్తుంది, మొదలయ్యేది.  తరువులు చివురులు తొడుగును.  అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా!  పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా!  కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ మొదలిడినారు.
తరువాత  క్రీ ll పూll 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి  29 రోజులు చేసి, సంవత్సరమును జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది.  దీనిని leap year  అన్నారు.
సీజరు మేనల్లుని కొడుకైన ఆక్తెవియస్ సీజర్ ఆగస్టస్ సీజరు అన్న పేరుతొ 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్  అను నెలకు (సెక్స్ట్=6) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩ సంవత్సరములకు మార్పు చేసి ,  ఒక రోజును ఫిబ్రవరి కి కలిపేవారు.
తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము  పెరిగి  సంవత్సరానికి 365.242199  రోజులు చేసినారు.  ఇందువల్ల ఏడాదికి 11 నిll 14సెll తేడావస్తుంది.  దీనిని 13 వ పోపు గ్రెగొరీ VIII క్రీ llశll 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో ప్రవేశ పెడుతూ లీపియర్ ను  తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ  ఫిబ్రవరి కి 1 రోజును కలిపేవారు.  అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు  400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమే లీప్ ఇయర్స్ గా తీసుకొన్నారు. 4 చేత భాగింపబడేవి తీసుకోలేదు.  ఏ, ఏ మార్పును చెయుటకుగానూ October 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు బలియై పోయినాయి.  అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకోను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వక్కాణించుచున్నారు.
జనవరి:      జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూ ఉంటాడట.  ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది.  29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నెలగా జూలియస్ సీజరు  చేసినాడు.
ఫిబ్రవరి:      రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో మతముపై నమ్మకము కలిగినవాడు
 పునీతుడగుటకు (To get purified) జరుపుకుంటారు.  దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి.  తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్టస్ సీజరు ల వల్ల  28 రోజులై కూర్చుంది.
మార్చి: మార్స్  రోమనుల యుద్ధ దేవత.  ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో  డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు.  ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.
ఏప్రిల్:        రోమన్ల వసంత దేవత అమ్నియో ఏప్రిట్ ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.
మే:    భూగోళాన్ని తన భుజస్కంధాలపై  మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి.  అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి  మండలం) దీనిని అంటే ఈ నెలను పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.
జూన్: జూపిటర్ భార్య జూనో  ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది.  వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది.  దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.
తరువాత నెలల పేర్లు పెంటలిస్,  సేక్స్టలిస్, సెప్టంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి.  5, 6 నెలలైన  పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము.  7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.
సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్త 7వ నెల
అక్టోబర్ – అక్ట్ అంటే అష్ట 8వ నెల
నవంబర్ – నవ అంటే నవ 9వ నెల
డిసెంబర్ – డెస్సి అంటే దశ 10వ నెల
 దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.
 మిగిలినది  2 వ భాగములో.. 

అప్రాచ్య కాలగణన - 2 
ఇక వారములైన సండే, మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి భాషలలోనికి మర్చుకొన్నావే. అసలు ఒక వారములోని దినములు ఆదివారముతోనే  ఎందుకు మొదలు కావలెనంటే వారు చెప్పలేరు. అడి ఎట్లు అని మనము చెప్పగలముజ్యొతిశ్శాసత్రములోని ఈ శ్లోకమును గమనించండి.
అర్కశుక్ర   బుధః చంద్ర మండో జీవ కుజః పుమాన్  l 
సారధ్య ద్వి ఘటికా హోరాః  ఇత్యేతత్  హోరా లక్షణం ll 
ఘటిక అంటే ఘడియ. 1ఘడియ=24 ని.సార్ధ దవిఘటిక అంటే 2  1/2  ఘడియాలి. ఒక ఘడియకు 24 నిముసములు అప్పుడు 2  1/2=24+24+12+60 నిముసములు, పై శ్లోకములోని గ్రహములను యథాతతముగా వ్రాసుకొని, అరక అంటే ఆదిత్య అంటే ఆది హోర(Hour) తొ వారము లోని మొదటి రోజు మొదలవుతూ వుంది. హొరనే పాశ్చాత్యులు Hour గా మార్చుకొన్నారు. 24 గంటలు ఒక రోజు కదా! అరక నుండి వరుసగా 24 ఎంచితే అడి 'సోమ' వద్దనిలుస్తుంది/ 'సోమ' నుండి 24 ఎంచితే kuj
అ అనగా అంగారకుడు అనగా 'మంగళ' వద్దనిలుస్తుంది. ఆవిధముగా వారముల వరుస ఏర్పడినది,
పైపెచ్చు వారిలోని ఒక వర్గమునకు  ఆదివార్తము వారాంతము. ఎందుకంటే వారమురోజులు ఈ లోకమును సృష్టించి అలసిపోయిన వారి దేవుడు తరువాతి రోజు శెలవు తీసుకొన్నాడు. ఆరోజును వారు  ఆదివారముగా భావించి చర్చికి పోతారు. అంతకు మించి తర్కమునకు నిలిచే జవాబు వారివద్ద లేదు.
ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము  భూభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది.  దానిని ఆ సంవత్సరము లోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో)  కలుపుకొనవలసి వస్తుంది.
వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ రోమన్ క్యాలెండరు తప్ప ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు కొన్ని పాశ్చాత్య దేశములు వారి, వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి.  మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా! పాశ్చాత్యులది శాసనము. మనది నిర్దుష్టమైన శాస్త్రీయ గణనము.
మన కాలగణను గూర్చి మన ఉగాదికి తెలియజేస్తాను.
ఇది మన సాంప్రదాయమా!
అది ప్రభుత్వ ఉత్తరువై,ఆంగ్లేయ కేలెండరును పాటించినంత మాత్రాన వారి ఆచార వ్యహారాలు పాటించ నవసరము లేదన్నది నా అభిప్రాయము. మతముల పేరుతో వ్యవహరించే రెండు సమాజములు అన్యులను తమ మతములో కలుపుకొనుటకు ఎన్నో ప్రలోభములను చూపుతూ వుంటే, మన ధర్మము మనది అని నాబోంట్లు చెప్పినా , వినక ఆచరించే వారు ఆచరించగా, అది సరియైనదే అని అనవసర సానుభూతి చూపే స్వధర్మానుచారులు ఎందఱో వున్నారు. అట్టి ఉదార చరితులకు ఈ పద్యములు అంకితము
అరుపులు కేకలున్ మరియు నర్థము పర్థములేని వాగుడున్
తురగమునెక్కి తూలుచును దూరుచునన్యుల నర్ధరాత్రమున్
మెరుపులవోలు భామినులు మేనికి వస్త్రము లేక చిందులన్
పరువును వీడి త్రొక్క బహు బాగని మెచ్చుటె న్యూయియర్సుడే!
మీటింగొక్కటి వేసి సేవకులతో మిత్తెంతొ జాగ్రత్తతో  

చాటింగన్నది కట్టిపెట్టి సరిగా సారా  సమూహాల, కం

పీటింగ్ బైకుల రోడ్లపైన మరియున్ పిక్చర్లు క్లబ్ పబ్బులన్

హీటింగ్ ఫైటుల కేజువాలిటి తతిన్ హెల్ చేర్చ ఉత్తర్విడెన్

స్వస్తి.

1 comment: