గృహిణి (భార్య)
నేను వ్రాసిన
ఈ పద్యాన్ని కొంచెము మనసు పెట్టి చదవండి.
ఫ్రిజ్జి
గృహము, పవరు ప్రియమైన భార్యౌను
భర్త అందులోని
పాయసమ్ము
పవరు లేని
ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు
ఉనికినిచ్చదెట్లు
పనికి వచ్చు
పెద్దలీవిధంగా
చెప్పినారు.
పుత్రపౌత్ర
వధూ భ్రుత్యైః ఆకీర్ణ మాపి సర్వతః
భార్యాహీన
గృహస్తస్య శూన్యమెమ గృహం భవేత్ (మహా భారతము)
కొడుకులు
కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు
దుర్భరము.ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనినిపునరుద్ధరించండి.
ధర్మాన్ని
కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు.నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు
రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి పంచండి.స్త్రీ ని అర్థము చేసుకోండి.
ఇది బ్ర.
శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'
గంగా సమానః
ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం
యమునోపమశ్చ
తన్మేళనం యత్ర
తదేవ పూతం
క్షేత్రం
ప్రయాగాస్య మహో గృహేస్తి
ధర్మం అనే గంగ
,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే
ప్రయాగనే భార్య అట.ఎటువంటి సద్భావనో గమనించండి .
నీటి
శాస్త్రము నుండి మనమెప్పుడూ వినే ఈ సూక్తి ఒకసారి తిరిగీ గుర్తు తెచ్చుకోండి.
కార్యేషు దాసీ
కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా
శయానేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని
ఇన్ని గుణాలు
కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే
అర్థము చేసుకొంటారు. అహంకారానికి ఇరువురు తావివ్వకుంటే జీవితమూ పూవులబాటే.divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు.
'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే
వాభి రక్షతు' అన్న సంస్కృతి మనది.
చదువు సంధ్య లేకున్నా సంస్కారములో మిన్న
పెంపకాన మనసుంచును కలిగియున్న బుద్ధికన్న
మెతుకు గతుకునోలేదో తనకు మాత్రమె తెలుసు
బిడ్డ కంటిలో ఎపుడూ పడనీయదు నలుసు
కన్న కలలు పగలంతా రెప్పలపై
ఏర్చిపేర్చు
పనులన్నీ ముగియుదాక రేయినిదురనోదార్చు
ఇంటిబయట తనపేరును అంటించగ తా కోరదు
తన సేవాధర్మముతో ఇంటి యశము సమకూర్చు
మొగుని విసుగు నంతయును ముసినవ్వున మరుగుపరచు
మూతిని ముడిచిన మొగ్గను కుసుమముగా వ్యక్త పరచు
మానై తా నెండ నోర్చి తెరువరులకు నీడనిచ్చు
ఇంటికి తా దేవతయై స్వర్గమునే నిలిపియుంచు
స్వస్తి.
No comments:
Post a Comment