బాలయేసు అచ్యుత Cheruku Ramamohanrao I may not be as intelligent/experienced as
you.But I have some doubts regarding so called hinduism.1. Is it any where mentioned in
any of the vedic scripts or upanisads,that Hinduism only belongs to people of India? 2. Is it
any where mentioned that saffron is belongs to hindus and it should not be used by any of
the other religions /people following those? 3. Hinduism is a religion or darma? 4. Why dint
you mentioned about the people in hinduism spoiling by wrong practices.Is it some kind of
having or showing bais.Or you think all the hindus in India are following it in a proper
way(Mainly about babas)?.For your information I am an agnostic.I wish you could clarify
my doubts.Please dont mind.I always have respect towards elders. Thank you sir.
బాల యేసు అచ్యుత: పెద్దల పైన నీకు గౌరవమున్నది అని తెలిపినందుకు చాలా సంతోషము. నాయనా! ఇట్లు సంబోధించుచున్నందుకు నన్ను అన్యధా భావించవద్దు. ఇది చిన్నవారిని పెద్దవారు అభిమానముతో సంబోధించే
పధ్ధతి. తెలివితేటలూ అనుభవము ఒకటి కావు . పైగా ఎవరి తెలివితేటలూ వారివి, ఎవరి అనుభవము వారిది.
ఇక నీ సందేహాల విషయానికి వస్తే, నీకు నచ్చినా నచ్చకున్నా, నాకు తెలిసిన కొంచెము తెలియబరచే ప్రయత్నము చేస్తాను. ఆపై తర్జన భర్జనలు వద్దు.
1. నీ మొదటి ప్రశ్నయే నాకు పూర్తిగా అర్థము కాలేదు. నాకు అర్థమైనంత వరకు జవాబు తెలుపుతాను . hiduism అన్న పదమును హిందూ మతమునకు ప్రత్యామ్నాయముగా వాడుతారు పాశ్చాత్యులు. అది సరికాదు. ఇది ఇతరముల వలె మతము కాదు,ధర్మము(A Way Of Life). మతము అనేది ఒక ప్రవక్త ప్రవచించినది. ఆతని బుధ్యనుసారము, లేక అతని మతానుసారము (మతము అన్న మాటకు అభిప్రాయము అని అర్థము ) ఆతని అనుయాయులు నడచుకొంటారు.వారికి ఒక గ్రంథము అచరణీయమై వుంటుంది. అందులో వున్నది మాత్రమె వారు పాటించవలెను. అదే వారి ప్రార్థనా మందిరములలో కూడా చదువుతారు. కానీ ధర్మము అట్లు కాదు. దేశ కాలానుగుణముగా అది మారుతూ వుంటుంది.
ఇక వేదమును గూర్చి ప్రస్తావించినావు. ' వదతి ఇతి వేదం' అన్నారు. చెప్పుట అన్నది వినుట వల్ల జరుగుతుంది .
అందుకే వేదాన్ని' శృతి ' అని కూడా అన్నారు.(శృతి అనే మాటకు వినుత అని అర్థము.) ఇది అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా Ether(the clear sky; the upper regions of air beyond the clouds.) లో వుంటుంది.
దీనికి పలికే తీరు ప్రధానము. పలుకు మారితే ,కొన్ని పదముల అర్థములు మారుతాయి. అర్థములు మారి
అనర్థములకు గురియైనవారెందరో వున్నారు. వీటికి నాశము లేదు. గ్రంధములైతే కాల్చివేయ వచ్చు.
ఆమాటకొస్తే ఈ ప్రపంచము లోనే మొదటి విశ్వ విద్యాలయములలోని గ్రంథాలయముల యందుగల అనర్ఘ
సంపద మత సహనము తెలియని పరమతస్తులు కాల్చివేసినారు.నలందా విశ్వ విద్యాలయములోని పుస్తక
సంపద మూడు నెలలు అఖండముగా కాలి పోయినదట.అయినా భారతీయులు తెలివిలో ఎవరికీ తీసిపోరు.
ఇక ఉపనిషత్తులు . ఇవి అనేకము. ఇవి ఎన్నో తత్వ (తత్ + త్వం అంటే that is you అని అర్థము. అసలు ఈ
that అన్న శబ్దము తత్ నుండి పుట్టినదే ) రహస్యములను లౌకిక పారలౌకిక విషయాలను తెలుపుతాయి.
వీటిలో కూడా తాము వ్రాసిన ఉపనిషత్తులను కొందరు అన్య మతస్థులు జోప్పించినారు.
కావున వేదములు ఉపనిషత్తులు అన్యమత గ్రంథములవలె చేయ తగినవి,చేయ తగనివి అని చెప్పవు. ఇట్లు
చేయవచ్చు అని ఒక మార్గమును చూపుతాయి .
ఇక భారతీయుల గొప్పదనము 'india in greece' అన్న 'Pococke, E. (Edward)' గారి రచన చదివితే
అర్థమౌతుంది. అది ఈ జాతి ఒకానొక కాలము లో ఎంతవరకు విస్తరించి యుండినది ఈ వేదవిజ్ఞానమును తమ తమ శక్తి మేరకు విదేశీయులు ఎంతవరకు స్వంతము చేసుకొన్నారు అన్న వాస్తవానికి అద్దం పడుతుంది.
అసలు pythagoras theorem మన 'శుల్బ సూత్రముల' నుండి సంగ్రహించి తన పేరు పైన
నిలుపుకొన్నాడు.ఈ భూమి పై వెలసిన మహనీయులు, ఎన్నో విషయాలు కనుగొన్నా, తమ పేరుకు
అనుసంధించుకోలేదు . "In praise of Hindu thought and astronomy" Jean-Sylvain Baily (1736–
93), Marquis Pierre Simon de Laplace ( 1749-1827),Carl Sagan మొదలైన వారి రచనలు చదివేది.
భారత ఇతిహాస మును రచించిన వేద వ్యాసులవారు
धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ
yadihaasti tadanyatra yanneyhaasti na tat kkachit
dharmey, artey, kaamey, mokshey – the Purushaarthas (goals) of Dharma, Wealth, Desire and Liberation, ca – and, bharatarshaba- bull among Bharatas, yadi ha asthi – whatever is here, tad anyatra- is elsewhere, yadi na asti – whatever is not here, na tat - is not, kkachit – anywhere
O Bull among Bharatas (as said by Vaisampayana to Janamejaya), everything related to the four Purusharthas of Dharma, Artha, Kama and Moksha, that is found in the epic can also be found elsewhere. But what is not here (in Mahabharata) is nowhere else.
(Source: Adi Parva, Chapter 62, Verse 53)
ఇందులో వున్నది వేరెందులోనైనా ఉండవచ్చును ఇందులో లేనిది ఎదునా ఉండదు . అసలటువంటిరచన , ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు కలుపుకొని, కొన్ని వేల పాత్రలు కలిగిన గ్రంథము ప్రపంచములోని ఏ భాషలోనూ వ్రాయబడి ఉండలేదు.
ఈ భారతీయులు ఈజిప్టు,సిరియ,గ్రీసు మొదలగు అన్ని ప్రపంచ దేశములలో వున్నట్లు ఆధారాలున్నవి. వారిని pagons అని అన్నారు. old testament చదివితే కొంత అర్థము కావచ్చునేమో .
మతము పేరున మారణ హోమములు ఈ భూమి పై సృష్టింప బడలేదు.
2. కషాయము పవిత్ర మైన రంగు .మహర్షులు ద్రష్టలు కాబట్టి ఉదయాస్తమయములలోను రాత్రి యందును సూర్యుడు, అగ్ని ఇదే రంగులో కనిపించుతారు. ఈ అగ్నికి హీనాధికములు లేవు. అందరినీ దహించుతుంది.
అదేవిధంగా సన్యసించిన వాడు కూడా తన కోరికలను దహించవలయునని చెప్పుచున్నది. ఇది వేద వాక్కు.
ఈ రంగు ప్రాముఖ్యత, ప్రాధాన్యత వేరు ఏ మత గ్రంధములలోనూ కాన రాదు. అసలు పర'మత గ్రంథముల'లో ప్రక్షిప్తములు అనేకములని పాస్చ్యాత్యులే అనేకులు నిరూపించినారు.
3. హిందు అనే మాట 'స' పలుకలేని అరబ్బులు ఉపయోగించిన మాట. మనము భారతీయులము. 'భ' అంటే అభివృద్ధి. 'రతము' అంటే ఇష్ట పడుట కోరిక అని అర్థము.
4. ఇక బాబా లను గురించి క్రీస్తుకు పూర్వమే 509 వ సంవత్సరములో జన్మించిన మహనీయులైన ఆదిశంకరులవారు ఆకాలానికే ఈ మాట చెప్పినారు:
జటిలోముండీ లున్చిత కేశః కాషాయాంబర బహుకృత వేషః
పస్యన్నపిచన పశ్యతి మూఢో ఉదరనిమిత్తం బహుకృత వేషః
ఇదే మాటను తన రీతిలో 17వ శతాబ్దము వాడైన యోగి వేమన ఇట్లు చెప్పినాడు.
కసువు కాయ దినుచు కాషాయములు గట్టి
బోడి నెత్తులు గలిగి బోరయుచుండ్రు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ
అంటే మోసగాళ్ళు అన్ని కాలాలలోనూ ఉంటారని అర్థమౌతున్నది కదా.
ఒక శంకరులవారిని గానీ,రామానుజులవారినిగానీమధ్వాచార్యులవారినిగానీ,రాఘవేంద్రులనుగానీ,
రామకృష్ణులనుగానీ, వివేకానందుని గానీ,రమణులవారిని గానీ,నడిచే దైవమని నేటికీ కొనియాడబడుచున్న చంద్రశేఖర భారతీ స్వామివారుగానీ, షిర్డీ సాయిబాబాను గానీ, ఇంకా అనేకులైన హిమాలయ యోగులను గూర్చి గానీ పొరబాటున కూడా ఎవరూ నోరెత్త లేరు . వారంతటి మహనీయులు మహానుభావులు.
ఒకసారి
http://www.truthbeknown.com/victims.htm చదివితే కొన్ని వాస్తవాలు అవగతమౌతాయి .
Dr. Paul Brunton వ్రాసిన 'A SEARCH IN SECRET INDIA' చదివితే ఈ దేశ ఔన్నత్యము అవగతమౌతుంది.
ఈ ధర్మమును గూర్చి తెలిసినవాడెవ్వడు ఇంకొక మతము జోలికి పోడు. అసలు ఇప్పుడు ఆవిధముగా పోయినవారు, లేక వారి పూర్వీకులు ఎదో ప్రలోభములకు గురియై తప్ప ఈ ధర్మము వదిలి ఎవ్వరు పోరు. ఈ విషయము తెలుసుకొంటే అట్లు పోయినవారు కూడా తిరిగి వస్తారు. మత ప్రచారాలు, మతాంతరీకరణలు, ప్రలోభాలు మొదలగునవి పరమత ప్రణాళికలు. అవి ఈ ధర్మములో అగుపించవు. చార్వాకులు (agnostics) ఎందరో ఈ ధర్మాన్ని వరించి తరించిన వాళ్ళున్నారు.
'ధీయోయోనః ప్రచోదయాత్' (Oh God deploy our intellect on the right path.)(పరమాత్మా! మా జ్ఞానము ఋజు మార్గము లో పయనింపనిమ్ము)
నీ పేరులోని 'అచ్యుత' అన్న పదము అనేకానేకములైన భగవన్నామములలో అత్యంత శ్రేష్ఠమైనది. 'చ్యుతి' అంటే
నాశము.అచ్యుతుడు అంటే నాశము లేనివాడు, అంటే ఆంగ్లములో సరిగా సరిపోయే సమానార్థకము లేదు కానీ 'eternal' గా తీసుకొనవచ్చు .
ఏ కాసింత నీ సందేహ నివృత్తి జరిగినా సంతోషించుతాను.
శుభం భూయాత్.
Vasudevarao Konduru అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి
ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక
దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేముడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు
దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో
తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా
విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం
ఎందుకు? రోజు చేసే 5 ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు గుంపుగా ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు
కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక
విధానమే గాని, ఒక మతం కాదు. మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో
ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి
ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే
పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో
మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు.
ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం
ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి
అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు.
అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు , పూజిస్తాడు.

यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्कचित्
dharmey ca artey ca kaamey ca mokshey ca bharatarshabhayadihaasti tadanyatra yanneyhaasti na tat kkachit

No comments:
Post a Comment