Friday, 24 May 2019

కవిత్వము - హాస్య సరళి


కవిత్వము - హాస్యసరళి

సంస్కృతము దేవవాణి. దాని పుట్టుకను గూర్చి ఎవరూ చెప్పలేరు. షడంగాలలో వ్యాకరణమున్నా మనకు పాణిని మహర్షి వ్రాసిన అష్టాధ్యాయియే ఆలంబనము. అందునుండి వెలువడిన సూత్రములనే వేరువేరు పండితులు విశ్లేషించగా మనము చదువుచున్నాము. భాషకు సాహిత్యము ఆయువు పట్టు. ఆకాలములో రాజులు కదనము, కవనము సమాంతరముగా పోషించినారు. అందుకే ఒక రాజు అన్నాడట “సుకవితా యద్యస్తి రాజ్యేన కిం” అంటే మంచి కవిత్వం ఉంటే ఇక రాజ్యము ఎందులకు. సాహిత్యము అంటే “స హితస్య భావం సాహిత్యం” హితముతో కూడియున్నది సాహిత్యము. అది మనోరంజకము, మార్గ నిర్దేశకము, అజరామరము మరియు మల్లె మరువముల అనుబంధము . కనుకనే “విశ్వశ్రేయః కావ్యం” అనికూడా అన్నారు. “మానిషాద’ అన్న వాల్మీకి శోకము శ్లోకమై వెలువడినది మొదలు సాహిత్యము శ్రోతస్వినిలా నిరంతరము భువిపై ప్రవహిస్తూనే ఉంది. మనల్ని నడిపిస్తూనే ఉంది. అట్టి సాహిత్యము  మాత్రమే నిత్యము,సత్యము,శాశ్వతము. ఉదయారుణ కిరణాలలోని నులివెచ్చదనము, హిమమౌక్తికములుచే అలంకరిపబడిన సౌగంధికా కుసుమములు, మలయమారుతమునాస్వాదింప కాగడాలు పట్టుకొని దేవతలు నిలచినారా అన్నట్లున్న వెన్నెల రాత్రులు,  వసంతమందున ఝరి గమనములు, చిగురాటాకులు మేసి కూసే పిక నిస్వనములు, కరి మబ్బుల గాంచి పరవశించి నర్తించే మయూర తతులు, చెంగు చెంగున ఎగిరిదూకే లేడి పరుగుల విన్యాసాలు, పసి పాపల బోసి నవ్వులు, తొలకరి జల్లుకు పులకరించి చిలకరించే మట్టి వాసనలు, మొదలగు ప్రకృతి ప్రసాదించిన అందాలను అనుభూతులను ఆస్వాదింప చేయగలిగినది కవిత్వము. కవిత్వము అతివ అంగాంగ వర్ణనకే పరిమితము కాదు.  ప్రకృతి అందాలనే కాకుండా మానవుల నడుమ ఏర్పడే అనుబంధాలు,   అనురాగాలు, ఆత్మీయతలు, అవమానాలు, కోపాలు,తాపాలు, మానసిక సంఘర్షణలు, సుఖ దుఃఖాలవంటి అనేక భావాలను ప్రకటించి, అనుభవింప జేయించేదికూడా కవిత్వమే!
ఈ సన్నివేశము కరుణార్ద్రతల కదంబము.  ఒకపరి గమనించండి. “ ఓ వ్యక్తి కారాగారంలో శిక్ష అనుభవిస్తూ,  చివరిదశలో ఉంటాడు. అతణ్ణి చూడటానికి బాలింతరాలైన అతని కుమార్తె వస్తుంది. తాగడానికి నీళ్ళు కూడా లభించక దాహంతో అలమటించే తండ్రి దీనస్థితిని చూసి మిక్కిలి కలత చెందిన ఆమె తన  ‘స్తన్యాన్ని’ తండ్రికి ఇచ్చి అతని దాహార్తిని తీర్చి చరితార్థ అవుతుంది.” ఓ చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని వర్ణించి చెప్పే అపురూప దృశ్యం పై ఉదాహరణ. కవిత్వం నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటనీరు తెప్పిస్తుంది,  మునుముందుకు నడిపిస్తుంది. అట్టి అద్భుతమైన, అంతులేని సాహిత్య సముద్ర  జలతరంగములందు ఒకటగు చాటు సాహిత్యమునుండి ఒకటి, రెండు  పద్యములు మీకు పరిచయము చేస్తాను. పై భావమును స్ఫురింపజేస్తూ నేను వ్రాసిన పద్యమును మీముందుంచున్నాను.
చేయని తప్పు తో చెరన చేరిన తండ్రిని చూచి బాధతో 
నాయన ఏమి కావలెనొ నాదరి చెప్పమటన్న కూతుతో          
నాయన  దాహమయ్యెనన అంత తటాలున స్తన్యమిచ్చి నీ
కీయగ వేరు ఏమియును ఎంచగ లేదనె సూతికార్ద్రతన్
కూతుతో నాయన = కూతుతోన్ + ఆయన; సూతిక=బాలెంతరాలు
తండ్రి చేయని నేరానికి చెరసాల పాలయినాడు. ఒక్కగా నొక్క కూతురు. అందునా బాలింతరాలు. మనసున బాధ అనెడు మున్నీరు కనీరై ప్రవహించగా చెరసాలకు వచ్చి తండ్రిని చూసి గద్గద స్వరముతో నాన్నా నీ కేమికావలెనని అడిగింది. దప్పికగొని గొంతు ఎండిపోయిన తండ్రి దాహమన్నాడు. ఎక్కడికీ పోయి నీరు తేలేని ఆతల్లి, తండ్రికి తన స్తన్యమిచ్చి ‘తండ్రీ! ఇంతకు మించి వేరేమీ ఇవ్వలేనని కంట తడిపెట్టుకొనింది.”
పద్యము చదివితే సన్నివేశము కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.
మనము హాస్యమును గూర్చి మాట్లాడుకొన దలచి కరుణ రసమునకు పోయినాము. ఇందుకు కారణము ఉన్నది. బాగా చెమట పట్టిన తరువాత వాతానుకూల కక్ష్య లోనికి వెళితే సుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా!

హాస్యస్పోరకమైన ఈ పద్యమును చూడండి. ఈ భాష నేడు బ్రాహ్మణులలో కూడా మృగ్యము.
పూర్వము అంటే ఒక వంద సంవత్సరముల నాటి మాట. నాకు నాడు అవ్వ వరుసయ్యేవారు ఈ భాషనే  మాట్లాడేవారు.  ఈ  భాష కొంత వింతగా వుండేది. ఆ భాష తీరు తెన్నూ ఈ పద్యము ద్వారా  చవి చూడండి.  
అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే?  
విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిత్సారషే !  సుఖము యొక్కసుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా! 
విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ  
ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!  
 పై  చాటు  పద్యము, నీళ్ళ కోసం వెళ్లి చెరువుకు వెళ్లి బిందెలు తోముకొంటూ బ్రాహ్మణ స్త్రీలు జరిపిన  సభాషణను వివరిస్తూవుంది. భావం వివరిస్తాను.  
“ఏమే చూచినావా! అంటే ప్రక్కావిడ పలకలేదు, అందుకే వెంటనే మొదటి స్త్రీ  “ఒసే! నీకుచేముడా  ఏమి?” అంటే రెండవ ఆవిడ అయ్యో పిలిచినావా  ఏమిటి? అని అడిగింది. అందుకు మొదటి బ్రాహ్మణి “విస్సా వఝలవారి బుర్రిని అంటే అమ్మాయిని మన విస్సాయికి అంటే మన కుర్రవాడికి ఇచ్చి పెళ్లి  చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత వర్చస్సు కలిగి ఉంటాడో” అంటూ తమ సంభాషణను శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు కొనసాగించుతున్నారు.  
ఇట్టిదే ఇప్పుడొక చాటు వాక్యాన్ని చూడండి
“ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరనుంఛా. చూడది ఎండిందంఛావా? లేదంఛావా?” అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే పంచటరుగు. గావంచా అంటే చిన్ని టవలు. ఇంకో చమత్కారయుతమైన ఈ పద్యము ను చూడండి.  నేను ఉన్నత పాఠశాలలో 65 సంవత్సరముల క్రితము విన్నది. ఆ చాటువు యొక్క సందర్భము, ‘చంకనాకు’ అన్న మాట మాత్రమే నాకు గుర్తు. అందువల్ల పద్యమును నేనే తయారు చేసి మీ ముందుంచుచున్నాను.
ధనవంతుల ఇండ్లలో జరిగే  పెళ్ళిళ్ళకు సదస్సు అని ఒక గొష్ఠి జరుపుతారు. అందు విద్వాంసులు, పండితులు కవులు వస్తారు. వచ్చినవారందరికీ వారి వారి శక్తిననుసరించి సంభావనలిస్తారు. కొందరు ఏమీ తెలియని నాలాంటివారుకూడావచ్చినంత దక్షిణ వస్తుందిలే అని వెళతారు. అటువంటి సదస్సులో జరిగిన సన్నివేశము మీముందు నేను వ్రాసిన చాటువును ఉంచుటకు ముందు సదస్సుకు సంబంధించిన ఒక చాటువును తెలియజేస్తాను.
లేవరు లెండులేండనిన లేచినవారయినన్ దటాలునన్
బోవరు పొండు పొండనిన పొదుము పొదుము త్రోయకుండటం
చీవరుసందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం
భావన నాడు చూడవలె బాపన సాముల సాములన్నియున్
సదస్సు ముగిసింది ఇక లేవండి అంటే లేవరు, లేచిరి పో వెంటనే పోతారా అంటే పోరు. పోతున్నాము పోతున్నాము త్రోయవద్దు అంటూ యజమానిని అనునయించుతూ నెమ్మదిగా కదులుతూ వుంటారు. ఈ విధముగా బాపన సాముల 'సాములు' పెండ్లియండలి సదస్సునందు చూడ వీలగుతుంది. అన్నది పద్యభావము. ఇందు ఒక బాధాకరమైన విషయము ఏమిటంటే నేదసదస్సులు లేవు, అసలు సదస్సు అంటేనే చాలామందికి తెలియదు. సంభావనకై ఎదురుచూసే వేదము చదువని పెదబ్రాహ్మలు మాత్రము ఉన్నారు. కూలిపనులు చేయలేరు. మంత్రాలు చదువలేరు. ఎగతాళి చేసేదానికంటే వారికి వితరణ కలిగిన ఏ ధనికుడయినా ఒక ఆధారము చూపితే ఆత్మ సంతృప్తి కలిగినవాడవుతాడు.

ఇక తిరిగీ మన చాటువును గూర్చి చెప్పుకొందాము. ఆ ధనవంతుడు వివాహానంతరముసదస్సు ముగిసిన పిదప వారివారి పాండిత్యము, కవితా శక్త్యనుసారముగా డబ్బులు ఇస్తూవున్నాడు. ముఖ్యముగా ఆ యజమాని కవులకు కొంచెము ఎక్కువ, పండితులకు కొంచెము తక్కువగా సంభావనలు ఇస్తూ వుందినాడట. ఆ గుంపులో  ఒక వ్యక్తికి తక్కువ సంభావన ఇవ్వబోయినాడు ఆ యజమాని. ఆ కవికి కోపము వచ్చి యజమానితో ఈ విధంగా అంటూవున్నాడు 
కవియా కదా అరయక
కవియనుకొని గౌరవించ తగునా మూర్ఖా!  
కవిగనుము కనులు లేవా  
కవివైతే ‘చంకనాకు’, కనబడలేదే!
ఒక కవికి తానూ చూస్తూ ఉండగానే తనకన్నా తక్కువస్థాయి కలిగిన కవి పండితులకు ఉదారముగా సంభావనలనోసగినాడు. ఈయన వంతు వచ్చుసమయానికి ఎదో చిల్లర చిలకరించినాడు, బహుశ యీతడు గర్వి, అహంభావి అని అతనికి తెలుసునేమో! కవి కోపముతో కందపద్యములోని పై మూడు పాదములు చెప్పినాడు. యజమాని ఆ పద్యమును తన చివరి పాదముతో పూర్తి చేసినాడు.
ఎవరంటే వారిని కవియా కాదా అన్న విచక్షణ లేకుండా ఇతోదికముగా పారితోషికములనిచ్చి పంపుతూ వచ్చి నావే నేను కవిని గమనించి సంభావననివ్వు అని కొత్త గర్వముతో పలికినాడు. అప్పుడు ఆ ధనికుడు ఆ కందపద్యము యొక్క నాలుగవ పాదముతో ఈ విధముగా బదులు తెల్పినాడు. నీవు కవివైతే నాకేమి కనబడలేదే అంటే కనబడుతూనే ఉందికదా, చంక నాకి పో అన్నది కొంత జుగుప్సాకరమైన బాహ్యార్థము. ఆ పాదము యొక్క అంతరార్థము ఏమిటంటే ‘మరి నీవు కవివైతే ‘చంకనాకు’ అంటే చంకలో కవిత్వము వ్రాయుటకు తాటియాకుల కట్ట లేదే అని. చూచినారుకదా ఎంత భావ గర్భితమైన పద్యమో తెలియండి.
ఇట్టి అపురూపమయిన పోకడ సంస్కృతము తరువాత ఈ భాషకే చెండుతుందేమో!
ఈ వ్యాసమును నేను నా పట్టా తలను గూర్చి వ్రాసిన పద్యముతో ముగించుచున్నాను. 

శిరము శశాంక గోళముగ చెప్పుము మారెను ఎట్లు మిత్రమా

సరసకు చేరు సుందరుల  చంద్ర ముఖమ్ముల చంద్రులందరున్

సరసర వచ్చినా శిరము చక్కగ చేరుచు కేశ యామినిన్

దొరకొని పారద్రోల తల తొంగలె సోమసుధా స్రవంతియై

స్వస్తి.

Wednesday, 22 May 2019

క్రైస్తవమా - పొంచియున్న ప్రమాదమా


క్రైస్తవమా - పొంచియున్న ప్రమాదమా

https://cherukuramamohan.blogspot.com/2019/05/blog-post_22.html

మొదట ఈ వాస్తవ గాథను గమనించేది.

For the first time in the history of Kerala, a group of nuns had defied their vows to protest against Church atrocities and the attempts by the police to hush up the incident.

 

Nun (Sister Lucy) who spoke in favour of the victim has been removed from performing church duties related to church after she joined the protest demanding the arrests of Bishop Franco Mulakkal. She has alleged that the church took revenge for participating in the protest against the Bishop -Times Now.

 

Mysterious death of Father Kuriakose who spoke out against Bishop Franco Mulakkal

On October 22, 2018, a 60-year-old priest named Father Kuriakose Kattutharaa was found dead in Bhogpur in Jalandhar. He was a vocal critic of rape accused Bishop Franco Mullakkal and had given a statement against him to the police. He worked as a priest and teacher at the Jalandhar diocese. Father Kuriakose’s untimely death fueled suspicions of foul play in a group of priests.

 

It must be mentioned the deceased had spoken out about the threats that he received by church officials for supporting the Missionaries of Jesus nun. He had stated, “The sisters had approached me complaining about Bishop Franco. They did not approach the Kerala police fearing the bishop. In fact, I fear what will happen to me for speaking out against him”

 

On January 14, 2022, the Additional Sessions Court at Kottayam acquitted Bishop Franco Mulakkal in the nun rape case. Live Law reported that the trial Court discarded the testimony of the victim completely in contravention with the well-settled principles of law.

 

https://www.opindia.com/2022/01/bishop-franco-mulakkal-a-timeline-of-the-case-from-rape-allegations-to-acquittal/

అసారాం బాపూను గానీ నిత్యానందనుగానీ లేక ఈవిధమగు పావుపభూయిష్ఠులను ఏ హైన్దవుడూ సమర్థించలేదు. అసలు మచ్చనేరుగని మహానీయులగు కంచి  పరమాచార్యులైన జయేంద్ర విజయేంద్ర సరస్వతులను కారాగారములో ఉంచినపుడు కూడా పెద్దగా స్పందించిన హైందవుడు లేడు. కారణం మనది 'అయితే అయిందిలే పోతే పోయిందిలే’ మనస్తత్వము.

శ్రీకృష్ణ పరమాత్ముడు 16వేల గోపికలను కలిగియుండినాడు కదా! ఆయన దేవుడెట్లు? అని న్తాయస్థానములో చేసిన సవాలుకు ప్రతివాది న్యాయవాది మరి అనేక లక్షల సంఖ్యలో ఉన్న మీరంతా దేవుని భర్తగా ఎంచుకొన్నారు కదా మరి ఆయన దేవుడెట్లు? అని ప్రశ్నించుటతో తమ అభియోగామును ఉపసంహరించుకొన్నారు.

ఈ విషయమును ఒకపరి ఆలోచించండి. మధ్య తరగతి కుటుంబీకులను రెండు విధములుగా విభజించినారు. అవి 1. దిగువ మధ్య తరగతి 2. ఎగువ మధ్య తరగతి. ఇక మూడవది పేదలుమరియు నిరక్షరాస్యుల తరగతి.

మొదట పేదలు మరియు నిరక్షరాస్యులను గూర్చి తెలుసుకొందాము. మంచిని మాయ చేయటానికి చెడు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందునా ఒక వ్యక్తి కష్టములో వున్నాడు, బాధపడుతున్నాడు అంటే దానిని అవకాశముగా తీసుకొంటారు స్వార్థ ప్రయోజనాలకొరకు కొందరు మతోన్మాదులు.  ఇటువంటి  వారు క్రైస్తవమున అత్యధికము. మార్టిన్ లూథర్ నాయకత్వములో 16 వ శతాబ్దమునుండి కేథలిక్స్ తో విడిపడి  ప్రొటెస్టెంట్స్ గా ముద్ర పడిన తరువాత వేరు వేరు పేర్లతో వేరు వేరు కుంపట్లు పెట్టుకొని,  బాప్టిజం, లూతరానిజం, మెథోడిజం, కల్వనిజం, పెంతెకోస్తిజం మొదలైన అనేకమగు పేర్లతో వేరువేరుగా చర్చీలు మొదలయి ఇప్పుడు పుట్టగొడుగులై ప్రపంచమున చెప్పలేనన్ని పేర్లతో క్రైస్తవము విరాజిల్లుతూ వుంది. కానీ ఇప్పటికీ వీరు ఎవరితో విడిపడినారో ఆ కేథలిక్సే ప్రపంచములో అధికముగా వున్నారు. వీరిలో వీరికి సరిపోదు. వేరే చర్చికి సంబంధించిన అమ్మాయిని తమ చర్చ్ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకొంటారుకానీ విలోమముగా మాత్రము కాదు. అంటే పెళ్ళిళ్ళువారివారి చర్చిలకు మాత్రమె పరిమితము. ఈ తేడాలు ముస్లీములలో కూడా వున్నాయి.

  ఇక ఈ క్రైస్తవులు మార్పిడుల మాయాజాలాలు ఎట్లు పన్నుతారు అన్నది చూస్తాము.  ఇప్పుడు నేను చెప్పబోయేవి అన్నీ నేను అనుభవ పూర్వకముగా చూసినవి మరియు తెలుసుకొన్నవి. ఒక కుమారుడు, ఆరోగ్యము బాగా లేని తన తల్లిని Hospital కు పిలుచుకొని పోవుటకు ఒక Auto ఎక్కినాడు. ఆమె మూలుగుతూ వుంది. Auto వాడు వెంటనే ఆ కుమారునికి సలహా ఇస్తాడు. వెంటనే మతము మారి క్రైస్తవము లో చేరుతామని మ్రొక్కుకోండి, ఆవిడకు తగ్గి పోతుంది. ఆతరువాత నన్ను పిలిస్తే నేనువచ్చి చర్చికి పిలుచుకొనిపోయి మీకు పవిత్ర తీర్థము ఇప్పించుతాను అంటాడు. డాక్టరు వ్యాధినయము చేస్తాడు కానీ వీరికి Auto Driver మాటమీద గురి ఏర్పడి అతనితో వెళ్లి మతము మారుతారు. కొందరు తమ చర్చి చేత మాటకారితనము కలిగినవారిగా గుర్తింపబడి, వారిచే ఆర్ధిక లబ్ధి పొందుతూ, తమ Cell Number ప్రకటించి Holistic Healing పేరుతో Missed Call ఇవ్వమంటారు. పెదసాదలు మన సొమ్ము పోయేదేమీ లేదుకదా Missed Call ఇద్దామన్న భ్రమలో, ఇచ్చి ఉచ్చులో తగులుకొంటారు. ఇక స్వస్థత సభలనుగూర్చి అందరికీ తెలిసిన విషయమే. ఇదికాక చర్చికి నమ్మకము కలిగిన కొందరు చురుకుదనము కలిగిన యువకులను ఎన్నుకొని వారికి సొమ్ము ఇచ్చి తమ ప్రతినిధులుగా, ప్రచ్ఛన్నముగా  ఏ బంజారాలు, (లంబాడీలు, సుగాలీలు) ఉన్న తాండాలలోకి పంపుతారు. కొత్తవారు కాబట్టి ఎన్నోవిధముల వారికి నమ్మబలికి ఆర్ధిక సహాయముతో చేరువౌతారు. అతని సాంగత్యము బలపడినతరువాత ఒక్కరొక్కరిగా మొత్తము తండాను మతమార్పిడి చేస్తాడు. ఇవన్నీ పెదసాదలను మార్చే విధానము. అసలు ఇవికాక ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమె ఉటంకించినాను. వీరికి, వారివారి చర్చీలు ఆదివారమునాడు మాంసాహార భోజనము కూడా ఉచితముగా ఏర్పాటు చేస్తారు.  ఇక మధ్య తరగతి వారి విషయానికి వస్తే, Gated Communities లో అన్ని మతాల వాళ్ళూ వుంటారు. అందులో ముఖ్యముగా వయసు మళ్ళిన క్రైస్తవ స్త్రీలు హిందూ స్త్రీలతో సహవాసము పెంచుకొని వారి కుటుంబ కష్టములకు సానుభూతిని ప్రకటించుట మొదలుపెట్టి మతము మారితే దేవుని రక్షణ నిరంతరమూ ఉంటుందని మభ్యపెట్టేవరకూ కొనసాగించి వారిని మారుస్తూ వున్నారు. కారణాలు వేరు కావచ్చు కానీ అసలు రెడ్లు మరియు కమ్మవారిలో ఈ విధముగా మారిపోయిన వారు ఎందఱో!

ప్రజలో జనరంజకుదన్న ప్రఖ్యాతిని సంపాదించిన ఒక ముఖ్యమంత్రి అసలు ఏడు కొండలకే ఎసరు పెట్టినాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిప్రాంతములో ఆలయము చుట్టూ సిలువ గుర్తులను, ముఖ్యముగా రాత్రి పూట ముమ్మరముగా చూడవచ్చును. శ్రీశైలములో కూడా అదేపరిస్థితే! ఈ విధముగా మార్పిడులకు బలియైనవారు ఎంతమందో! మార్చుటకు నియమింపబడిన కార్యకర్తలు విదేశములనుండి కూడా పుష్కలముగా చందాలు గ్రహించుతూ వున్నారు. ఇది కేవలము ధనార్జనకై చేయుచున్న పెట్టుబడిలేని వ్యాపారము. ఈ కార్యకర్తలలో ఎంతమంది అసలు బైబిల్ చదివినారో దేవునికే ఎరుక.

ఇక బైబిల్ లో ఏముందో చూద్దాము. అసలు బైబిలు రెండు భాగములుగా విభజింపబడినది. అసలు Bible అంటే Compilation of Books అని అర్థము. దైవ గ్రంధము అన్నది ప్రచారమునకు వచ్చిన పేరు. ఇందులోని కొన్ని విపరీత విపత్కర విషయాలను ఇపుడు చూద్దాము.

బైబిలు ప్రకారమూ మానవ సృష్టికి మూలము Adam and Eve. Adam, ఆదిమ యొక్క రూపాంతరము. ఆదిమ అంటే మొదటివాడు. మరి జగత్ సృష్టికి మొదటివాడు విష్ణువే కదా! మరి ఆయన భార్య లక్ష్మి కదా! Eve ఎట్లవుతుంది అని అనవచ్చు. ఏకాక్షర నిఘంటువు ప్రకారము ‘ఈ’ అంటే లక్ష్మీదేవి. మరి Adam and Eve మానవులు కదా, అంటారేమో! మనద్దేశము నుండి వలసపోయిన వారి వద్దనుండి మన పురాణ కతాకతనములను గ్రహించి వారు తమ మతములకు పునాదుల నేర్పరచుకొన్నారు.

బైబిల్ దేవునికి పరమత సహనము అంటేనే తెలియదు. ఆయన మనవలె మన దేవుని వలె కాదు. ఈ విషయమును యధాతథముగా ఆంగ్లములోనే మీ ముందు ఉంచుచున్నాను.

Biblical God says in Iramya, 19th chapter 4th line: - "I will make a terrible disaster in this region by which the ears of those who hear this will tremble. They have worshiped other gods! I will make them eat the flesh of their own sons and daughters! When their enemies and those who want to kill them, torture them, they will eat the flesh of their neighbors. I will destroy this people and this city. I will make it into a cemetery." - These are the words of Biblical God.

మనదేశము వివిద్ రేఅజపాలనములో ఉన్నపుడు చర్చిలు, మసీదులు వారే కట్టించి ఇచ్చినారు. మన పూర్వులవంటి ఉదార చరితులు వేరేచటనూ కానరారు.

ఈ మాట గమనించండి. జెహోవా విట్నెసెస్ (అతిప్రఖ్యాత క్రైస్తవ ప్రచార సమాజం) తన 8 సెప్టెంబర్ 1957 నాటి 'అవేక్‌' (AWAKE)  (మేలుకో) పత్రికలో అత్యంత సంభ్రమం కలిగించే శీర్షిక నొకదాన్ని ప్రచురించింది. ఆ శీర్షిక పేరు "50,000 ERRORS IN THE BIBLE” (బైబిల్ లో యాభై వేల తప్పులు), అన్న పై శీర్షిక కలిగిన వ్యాసము చదివితే అర్థము కాగలదు. జీసస్ ను గూర్చి, సాహిత్యములో Nobel Prize గ్రహీతయగు Bertrand Russell  ఏమి చెప్పినాడో  చూడండి:

In his essay Bertrand Russell wrote:

 

There is one very serious defect to my mind in Christ's moral character, and that is that ‘He believed in hell’. I do not myself feel that any person who is really profoundly humane can believe in everlasting punishment. Christ certainly as depicted in the Gospels did believe in everlasting punishment, and one does find repeatedly a vindictive fury against those people who would not listen to His preaching -- an attitude which is not uncommon with preachers, but which does somewhat detract from superlative excellence. You do not, for instance find that attitude in Socrates. You find him quite bland and urbane toward the people who would not listen to him; and it is, to my mind, far more worthy of a sage to take that line than to take the line of indignation.

Russell also expresses doubt over the historical existence of Jesus and questions the morality of religion: "I say quite deliberately that the Christian religion, as organized in its churches, has been and still is the principal enemy of moral progress in the world.

ఈ విధముగా ఎంతో గోప్పవారాగు పాశ్చాత్యులచేతనే తెగడబడుతూ, ఐరోపా లో మనుగడకే ముప్పు వాటిల్లబోతున్న తమ క్రైస్తవమును మనపై రుద్దమని Pope గారి ఆదేశమట. ఆ ఖండములో ఇప్పటికే Churches ను వారు అమ్ముకొన్న ఉదంతాలు ఎన్నో వున్నాయి.

ఈ విషయము చూడండి. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చెప్పినట్టే నడుచుకోవాలి అంటారు పాస్టర్ లు. దానిని ఎందరు చదివినారో తెలియదు కానీ  ఆ  బైబిల్ లో ఉన్న క్రూరమైన మాటలు ఒకసారి చూస్తే మీకు అప్పుడు అర్థమౌతుంది అందులోని దేవుని గొప్పదనము. బైబిల్ లో వారి దేవుడయిన యహోవా చెప్పిన మాటలను ఒకసారి గమనించండి. అందులోని తెలుగు వాడుక భాషకు భిన్నముగా ఎదో విదేశీ భాష చదివినట్లున్తుంది కాబట్టి నిదానముగా చదవండి.

ద్వితియోపదేశకాండము 13: 6 -9

నీ తల్లి కుమారుడేగాని, నీ సహోదరుడేగాని, నీ కుమా రుడేగాని, నీ కుమార్తెయేగాని, నీ కౌగిటి భార్యయేగాని, నీ ప్రాణస్నేహితుడే గాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగానుండినను , నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును,నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. పుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. రాళ్లతో వాళ్ళని చావగొట్టవలెను.

ఈవిధముగా  భారతదేశం లో పుట్టిన ఏ మతమయినా చెప్పినదా!   హిందూ దేవతలు ఈ విధముగా చెప్పియుంటే  మన దేశం లోనికి ఈ పాశ్చాత్య క్రైస్తవులు వర్తకము పేరుతో వచ్చేవారా మత మార్పిడి చేసేవారా!

పైన తెలిపిన, వారి బైబిల్ లోని ఒక్క మాట చాలు- క్రైస్తవుల మెజారిటీ ఏర్పడిందంటే వేంకటేశ్వరుడు కూడా క్రీస్తుస్వరూపుడైపోతాడు.  ఏడుకొండలు గోవుల కాపరులకు బదులు గొర్రెలకాపరుల వశమైపోతుంది.

ఇస్లాం ఇందుకు విరుద్ధము ఏమీ కాదు.

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః

తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌

తస్మాత్ జాగ్రత

స్వస్తి.

 

Monday, 13 May 2019

రామ చిలుక


రామ చిలుక
చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు
మాటకారితనము మంచి విద్య
ఎన్నియున్ననేమి  ఈ రామ చిలుకకు
గండుబిల్లి ముందు దండుగయ్యె
ఈ పద్యము జగన్నాథ పండితరాయల సంస్కృత శ్లోకమునకు ఒక కవి చేసిన చక్కని తెలుగుసేత. చిలుక యొక్క గుణగణములను తెలియబరచే పద్యము ఇది. భావము కష్టము కాదు కానీ తెలియజేస్తాను. చక్కనిరూపము, గొప్పదగు శీలము, మాటకారితనము, మంచివిద్య వంటివి ఎన్ని ఉన్నా ఈ రామచిలుక గండుబిల్లి ముందు దండుగే!
ఈ పద్యమును ఎందుకు ఇప్పుడు తెలిపినానంటే ఒక్క చిలుకకు మాత్రమే రామ అన్న విశేషణము తగిలించుతారు. చిలుక ఆడదయినా మగదయిన ఒక్కరికి మాత్రమే మనసిస్తుంది. అది శ్రీరామ చంద్రుని లక్షణము కాబట్టి ఆ పక్షికి మాత్రమే ‘రామచిలుక’ అన్న పేరు వచ్చింది.

Monday, 6 May 2019

సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల వయస్సు (వధూవరుల వయస్సు)


సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల  వయస్సు 

https://cherukuramamohan.blogspot.com/2019/05/blog-post_6.html
వేదోక్త వివాహానికి వధువు వయసు వరునికన్నా తక్కువ వుండాలన్నది శాస్త్ర నిర్దేశము. ఎందుకు అన్నది ఒకసారి విమర్శించుకొందాము.

ముందు నేటి సమాజపు పోకడను గూర్చి కొంచెము మాట్లాడుకొందాము. మనసు పెట్టి ఆలోచిస్తే, మనకు గౌరవముంటే గురి వుంటుంది. అది వ్యక్తి కావచ్చు, శాస్త్రము కావచ్చు లేక దేవుడే కావచ్చు. అదే లేకుంటే ఏమీ లేదు. నేటి అధిక శాతము యువతకు, నా దృష్టిలో, సరియైన దిశానిర్దేశము లేదు. మన ఆచార వ్యవహార్తములగూర్చిన అవగాహనలేదు, అది గ్రహించడానికి సమయమూ లేదు. అసలు తెల్లవారినది మొదలు డబ్బు వెనుక పరిగెత్తుటకొరకే నిదుర లేస్తున్నామన్న గట్టి నమ్మకము నేటి తరము వారిది. వేరు విషయములపై ధ్యానము లేక ధ్యాస ఉండదు. 'సంపాదనే తన సర్వస్వమనుకొని శాస్త్రముల్ సమవర్తి సరస జేర్చె' సంపాదన తన సర్వస్వమనుకొన్నాడు. బాగానే ఉంది. కానీ శాస్త్రములను సమవర్తి అనగా యమధర్మరాజు వద్దకు చేర్చినాడు. యముడు ప్రాణాంతకుడే కానీ ధర్మాధర్మ విచక్షణకు ఆయన గీటురాయి. నేను చెప్పదలచినది ఏమిటంటే ధర్మస్వరూపుడైన యమధర్మరాజు వద్దకు ధర్మాన్ని చేర్చినాము అంటే తెలిసిన విషయమును, తెలిసిన వానివద్దకు చేర్చి చేతులు దులుపుకోన్నాము. ఇక మనకు తెలిసినది సున్న. తెలిసేదీ సున్నానే! ఇకనైనా ఎంతో కొంత తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము అన్నది నా ఉద్దేశ్యము.
కానీ అలసత్వము ఆపని చేయనీయదు. ఒక 3,4 సంవత్సరముల క్రితము ఆస్యగ్రంధి (Face Book) సభ్యులు తాము వ్రాయుట ద్వారాగాని, తెలిసిన వారు వ్రాసిన రచనలను పదుగురికి వ్యాప్తి (Sharing) చేయుట ద్వారాగానీ మంచిని పంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో ఎక్కడో ఏ youtube లోనో ఉంచినది, మన సంస్కృతితో ఏమాత్రము సంబంధము లేనివి, సర్కసులు, విన్యాసాలు తమ కుడ్యమునకు చేర్చుచున్నారు (Posting on their walls). దీనివల్ల ఆస్య గ్రంధి అన్న ఒక చక్కటి మాధ్యమమును నిస్సారము, నిస్తేజము, అర్థ హీనము చేయుచున్నారు అన్నది నా అభిప్రాయము. మనకు జరిగిన, జరుగుచున్న అన్యాయాలను గూర్చి తెలుసుకోనవలసినది ఎంతో వున్నది. యువతకు మన సంస్కృతి తెలుసుకొనే తపన లేకుంటే దేశమే నిర్వీర్యమౌతుంది. అసలు పాశ్చాత్యులు ప్రాగ్దేశములపై, మోసముతో, తమ బావుటాను ఎగురవేసి లోకానికి అనాగారికులైన వీరికి మేము నాగరికత నేర్పుటకు వచ్చినామని ఉద్ఘాటించినారు కానీ నిజమునకు వారిలో తెలివయిన వారు మన విజ్ఞానమును దొంగలించి తమ పేరును దానికతికించి మనచే చదివించుచున్నారు. ఇది ఎట్లాఉన్నదంటే, మన ఊరినీళ్ళలో  ప్రాణాంతకమైన రసాయనములు కలిపి 10రూపాయలకు తక్కువలేని పెప్సీ కోకులగా త్రాపించుచున్నారు. అందు గల నీటి విలువ 10పైసలు చేయదు. ఇకనైనా యువత కళ్ళు తెరుచుట మంచిది.
ఇక నేటి వివాహ వ్యవస్థ ఎంత హేయమైన స్థితికి దిగజారిందో చూచెదము. నాటి, తెనుగునాట, ప్రసిద్ధ నటియైన శ్రీదేవి భర్త కొడుకు, అంటే శ్రీదేవికి సవతి కొడుకు, మలైకా అరోరా అన్న ఆవిడను వివాహమాడ దలచినాడు. ఆయన చేసేది తప్పా ఒప్పా అన్న విషయముతో మనకు నిమిత్తము లేదు. ఒక వాస్తవాన్ని పరిశీలించుదాము.  ఆమె 45 సంవత్సరముల వయసు కలిగినది కాగా అతని వయసు 33  సంవత్సరములు. తెలిసిన పేర్లు కావున వీరిని ఉదహరించినాను. దేశములో ఇటువనివారు ఎందఱో! అయ్య కులుకు ప్రాయములో ఉండగానే అమ్మ వణుకు ప్రాయముననుభవించుతూ వుంటుంది. Expiry Date దాటిన మందు వాడుటకు పనికిరాదు కదా!

ఓహో! అందుకా, స్వార్థ పూరితుడైన మగవాడు, తనకొక ఆడబానిస, తాను  బ్రతికినంతకాలమూ ఊడిగము చేయుటకు తక్కువ వయసు స్త్రీని వివాహము చేసుకొనవలెనని శాస్త్రములో చొప్పించినాడు అని తలచుట కద్దు. ఇది వాస్తవము కాదు. భార్యకు భర్తకు మధ్యన అనుబంధము రానురానూ అభివృద్ధి అవుతుంది. సాత్వికుడగు భర్త భార్య తనకోసము చేసే పనిని కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరించుతాడు. ఆ కృతజ్ఞతను ఆమెకు ఇష్టమైన నగ నట్ర చేయించుటలో చూపించుతాడు. కాస్త వయోధికుడైన భర్త పోతే భరించలేక చనిపోయిన భార్యలు ఎందఱో ఉన్నారు. అట్లే భార్య పోతే మరణించే భర్తలు కూడా ఎందఱో వున్నారు. కావున ఊడిగము కొరకు చిన్నవయసు అమ్మాయిని పెద్దవయసు ఉన్నవానికి ఇచ్చి పెళ్ళి చేయుట లేదు. మహాభారతములో ఈవిధముగా చెప్పబడినది.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మపి సర్వతఃl
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ll
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము. ఎంత నిజమైన మాటో చూడండి.అసలు పెళ్లి మంత్రములలో భర్తను పెద్దకొడుకుగా చూచుకొమ్మని వధువుకు తెలియజేసే మంత్రములు కలవు. ఈ సందర్భములో మహాభారతము లోని మరొక మాటను గుర్తుచేసుకోవలసి వస్తుంది. అరణ్యవాసము వెళ్ళే సమయములో కుంతీదేవి ద్రౌపది తో ‘అమ్మా! నీ భర్తలలో ఒక సహదేవుని మాత్రము నీవు తల్లిలాగా చూసుకో! వానికి ఆకలి తెలియదు. అందుచే నీవే అడిగి వానికి అన్నము పెట్టు’ అని చెబుతుంది. మరి కొడుకులా చూచుట అంటే ఇదే కదా!
ఇక ఈ విషయమును కాస్త విపులముగా విమర్శించుకొందాము. స్త్రీ పురుషులకు అవయవ నిర్మాణ క్రమములోనే ఆంతర్యము అధికముగా వుంటుంది.  అవయవ విధులను ఉత్తెజితముజేసే రసాయన క్రియ (Hormonal function) ఇరువురిలో వేరువేరుగా వుంటుంది. అందుచే శిశువులగు ఆడపిల్లలు మాటలు, నడక, చెప్పినది అర్థము చేసుకొనుట మొదలగునవి శీఘ్రముగా,అంటే  మగ శిశువులకన్నా వేగముగా గ్రహించుతారు. అందుకే పెద్దలు ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం’ అన్నారు. ఈ వాస్తవాన్ని గమనించండి ఒక 10 సంవత్సరముల వయసులోనున్న పిల్లల గొంతును పరిశీలించితే ఇద్దరి స్వరమూ  ఒకేమాదిరి వున్నట్లు తెలియవస్తుంది . ఆటరువాత ఇంచుమించు 2 ఏళ్లకల్లా ఆడపిల్లలగొంతు (సాధారణముగా) శ్రావ్యమైన రీతిలో నిలచిపోగా, తరువాత ఒక 4 సంవత్సరములకు మగపిల్లవాని గొంతుక మార్పులు చెండుతూవచ్చి ఒక 16 సంవత్సరముల వయసులో ఒకస్తాయినిచేరి నిలిచి పోతుంది. అదే విధముగా అమ్మాయి దాదాపు 12 సంవత్సరముల వయసులో రజస్వల అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ‘సమర్త’ ఆడింది అని ముఖ్యముగా రాయలసీమవైపు అంటారు. నిజానికి అది సంస్కృత పదమగు ‘సమర్థ’ అంటే ఏపనికైనా సిద్ధము అని అర్థము. ఆ సమయమున అమ్మాయిని ‘పెద్దమనిషి’ అయినది అని కూడా అంటారు. అంటే మగపిల్లలతో ఆట పాటలు, అతిగా మాట్లాడటాలు నిలచిపోతాయి. కారణం అమ్మాయి పెద్దమనిషి కానీ అబ్బాయి ఇంకా పిల్లవాడే. వానికి మీసకట్టు, మొగగొంతు, శారీరిక మార్పు 16 ఏళ్లకు గాని రాదు. దీనిని బట్టి మనకు ఏమి అర్థమౌతున్నదంటే అమ్మాయి అన్నింటిలోనూ ముందుంటుంది. అందుచేత పెళ్లి విషయములో అమ్మాయి, అబ్బాయిల నడుమ వయోభేదము కనీసము 3,4 సంవత్సరాలన్నా పాటించుతారు. ఆతరువాత, ఆమె కుటుంబమునకు ఇచ్చే అతిపెద్దవరం ‘సంతానము’. రానురానూ ఆమె మన్మధ మార్గము నుండి మరలి పిల్లల రక్షణకు అంకితమై పోతుంది. మగవాడు మాత్రము కామాగ్నికి ఇంధనమై కాలుతూనే ఉంటాడు. అంటే పరిపక్వత ఆమెలో వచ్చినంత తొందరగా అతనిలో రాదు. అందుకే ‘కరణేషు మంత్రి’ ఆమె సలహాలను తీసుకో అన్నారు.
ఇది అసలు విషయము. కాబట్టి ఇందులో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అంతా మనయొక్క దురాలోచన, దూరాలోచనపై ఆధారపడియుంటుంది .
స్వస్తి.

Wednesday, 1 May 2019

జీవితం


జీవితం
చిత్ర విచిత్రం చూడు జీవితం
యోచిస్తే అది పరుగుల పందెం
గెలవాలంటే నాతోడుండరు
ఓడిపోతినో వెనక్కి చూడరు

Friday, 19 April 2019

పృథ్వీరాజ్ చౌహాన్

పృథ్వీ రాజ్ చౌహాన్
https://cherukuramamohan.blogspot.com/2019/04/blog-post_19.html
ప్రాయము మానవాళికగు ప్రాయికలక్షణమంచు నమ్ముచున్
న్యాయము దాన ధర్మములు నర్తిల రాజ్యమునందు నిత్యమున్
శ్రేయము కూర్చి తప్తులకు శీతల శీకరమై చెలంగుచున్   
కాయము మాయమౌ వరకు కాచిరి దేశము నాటి వల్లభుల్  
అట్టి ప్రజారంజకుల కోవకు చెందినవారే పృథ్వీరాజ్ చౌహాన్ మరియు జయచంద్ర ఘడ్వాల్. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినదని కాదు.
అంతమాత్రాన అన్నీ కల్పితాలు, అతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్ర, కల్పన, అతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి.
వీరత్వం, ధీరత్వం ఉన్నవారు ప్రేమకు బానిసలే. 12 వ శతాబ్దమునందు రాథోడ్ వంశీయుడగు జయచంద్రుడు కనౌజ్ (కాన్యకుబ్జ) రాజ్యమును, చౌహాణ (చౌహాన్) వంశొద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలించు చుండిరి. ఇరువురూ అసామాన్య పరాక్రమవంతులు. ఇరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురును, పృథివీరాజునకు భార్యయు అయినది.
జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతురగుట వలన, జయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచినాడు. రూప లావణ్య విద్యా వినయ సంయుక్త యగు సంయుక్తకు, యుక్తవయసు రాగానే  బిడ్డకు దగినవరు డెవరాయని జయచంద్రుడు చింతింపసాగినాడు. పుష్పగంధము వనమునకే పరిమితము కానట్లు సంయుక్త గుణగణములు లోకమంతటికీ వ్యాపింపగా,  పృథివీరాజు కూడా యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించినాడు. సంయుక్తకూడా  అనేకపర్యాయములు పృథివీరాజు పరాక్రమమ రూపముల గూర్చి వినియున్నందువలన నాతనినే వరించెదనని మనంబున నిశ్చయించుకొనింది.
పృథ్వీరాజ్ చౌహాన్ (యీతడు నిజానికి పృథ్వీరాజు-3) (1168-1192 క్రీ.శ ) సోమేశ్వర చౌహాన్, రాణి కర్పూరాదేవిల కుమారుడు. పృథ్వీరాజ విజయ ప్రకారం పృథ్వీరాజ్ జ్యేష్ట ద్వాదశిన జన్మించినట్లు చెప్పబడింది. కానీ  పుట్టిన సంవత్సరాన్ని ప్రస్తావించలేదు. అయినాకూడా జన్మ సమయంలో జ్యోతిషశాస్త్ర అనుబంధ జాతకచక్ర ఆధారంగా దశరథ శర్మ అను ప్రఖ్యాత జ్యోతిషి, పృథ్వీరాజు జనన కాలాన్ని గణించి ఆయన పృథ్వీరాజు పుట్టిన సంవత్సరం  విక్రమ సంవత్సరం 1223 (క్రీ.శ. 1166)   గా నిర్ణయించినాడు.
పృథ్వీరాజ్ రాసో 14 భాషలను నేర్చుకున్నాడని పృథ్వీరాజ విజయము 6 భాషలను చక్కగా ఎరిగినవాడని వివరిస్తున్నాయి. ఆయన 14 భాషలు నేర్చినాడన్న మాటను కొందరు చరిత్రకారులు అతిశయోక్తి అని అన్నట్లు పెద్దల ద్వారా విన్నాను. మరి అదే అతిశయోక్తి అయితే శ్రీమాన్ పుతపర్తి నారాయనాచార్యులవారు 14 భాషలలో పాండిత్యమును బడసినారన్నది. నేను ప్రత్యక్షముగా వారి ముఖతః విన్న విషయము. రష్యన్ కాన్సలేట్ జెనరల్ ఆయనను సన్మానింప పిలిచినప్పుడు అనర్గళముగా అయన 1 గంట 30 నిముసములు రష్యన్ భాషలో అనర్గళలముగా మాట్లాడినట్లు ఆధారమున్నది. కావున మనకు తెలియపోతే ఇంకెవరికీ తెలియదు అన్న మాట భావ సంకుచితత్వాన్ని తెలుపుతుందేమో నన్న విషయమును గూర్చి ఆలోచింపవిజ్ఞులకే విడిచి పెడుతున్నాను.చరిత్ర, గణితము, ఆయుర్వేదము, యుద్ధతంత్రము,
చిత్రకళ, తత్వశాస్త్రము (మీమాంస) వంటి అనేక విషయములలో అతను బాగా ప్రావీణ్యం పొందినాడని రాసోలో  తెలియజేసినాడు చంద్ర వరదాయి. పై రెండు రచనలూ ఆయన విలువిద్యలో ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి యుండినాడని పేర్కొన్నాయి.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయమును గూర్చి చెప్పుకొనవలసియున్నది.జయపూర్ పట్టణమున ప్రసిద్ధ పత్రకారునిగా, సాహిత్యకారునిగా, చరిత్రకారునిగా ఖ్యాతిగాంచిన ఆనంద్ శర్మ గారు, మన పూర్వ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ గారికి తానువ్రాసిన 'అమృత్ పుత్రి' అన్న చారిత్రిక నవలను అంకితమిచ్చినపుడు, తత్కారణములను వివరించుతూ, పుస్తకము యొక్క భూమిక యందు జయచంద్రుని గూర్చిన తన పరిశోధనలో  జయచంద్రుడు  దేశద్రోహమును చేసినట్లు ఒక సందర్భము కూడా తనకగుపించలేదన్నాడు. దీనికి కారణము, ఒకానొక సందర్భములో భైరాన్ సింగ్ షెకావత్ గారు ఆనంద్ శర్మ గారికి ఆయన నవల  'నరవద్ సుప్యావదే' చదివిన తరువాత జయచంద్రుని గూర్చి మాట్లాడుతూ, జయచంద్రుడు మీరన్నట్లు దేశద్రోహి అయిఉండడు. మీరు పరిశోధన చేసి అభిప్రాయమును తెలుపండి అన్నాడట. షెకావత్ గారి మనస్తత్వము తెలిసినవాడగుటచే శర్మ గారు వారి మాటను శిరస్సున దాల్చి ఆదిశగా తన పరిశోధన మొదలు పెట్టినారట.
తన పరిశోధనా పరిశ్రమ ఎంత అకుంఠిత దీక్షతో చేసినా కూడా సంయుక్త ఆనవాలే ఆయన
పరిశోధనలలో దొరకలేదట. కావున సంయుక్త వారిరువురి వైరమునకు కారణము కాదు
అన్న నిర్ణయమునకు వచ్చినాడు. మరి వారి శత్రుత్వమునకు కారణము ఏమయి ఉండవచ్చు
అన్న తలంపు ఆయనను ఇంకా గాఢముగా పరిశోధనచేయ పురిగొల్పింది. ఆయనకు వారి
మనస్పర్ధకు కారణము భవిష్య పురాణములో దొరకినది. ఆ కథనము ఈ విధముగా వుంది.
మిగిలినది మరొకసారి........


ఆ కథనము ఈ విధముగా వుంది.

దిల్లీ రాజగు అనంగ పాలునికి ఇరువురు కుమార్తెలు. వారిలో 'చంద్రకాంతి' పెద్దది, 'కీర్తిమాలిని' చిన్నది. చంద్రకాంతి వివాహము కన్నౌజ్ రాజయిన దేవపాల్(విజయపాల్) తో జరిగింది. కీర్తిమాలిని వివాహము ఆజ్మేరు రాజగు సోమేశ్వరునితో జరిగింది. అజ్మేరు కన్నౌజ్ తో పోలిస్తే చిన్న రాజ్యము. ఇది ఇలాగా ఉంటే సోమేశ్వర కీర్తిమాలినులకు పృథ్వీరాజు తరువాత కొంతకాలానికి హరిరాజు జన్మించినారు. దిల్లీ రాజయిన అనంగపాలుడు పుత్రహీనుడగుటచే, పెద్ద కుమార్తె కుమారుడు పృథ్వీరాజుకన్నా పెద్దవాడు మరియు అజ్మేరుకన్నా విశాలసామ్రాజ్యము కలిగినవాడునగు జయచంద్రుని కోరుకొనక చిన్న కుమార్తె ద్వారా కలిగిన దౌహిత్రునే భావి దిల్లీకి భావి రాజుగా ఎంచుకొన్నాడు. ఇది జయచంద్ర పృథ్వీరాజు వైషమ్యములకు మూల కారణము. ఈ విషయము భవిష్య పురాణములో ఉన్నట్లు

ఆనంద్ శర్మ గారు చెప్పుట జరిగింది. కానీ మహమ్మదీయ రచయితలు మరియు పాశ్చాత్య కుహనా పండితులు వారి దేశీయ అనుచరులు, ఈ పురాణమున మున ఎన్నో ప్రక్షిప్తములను చేర్చి అపభ్రంశము చేసినారని మనకు తెలుసు. అల్లోపనిషత్తు, ఏసు, మహమ్మదు ప్రవక్తలను ఇందులో చేర్చడము ఇత్యాదులు ప్రక్షిప్తములే కదా!.

ఇదే కాకుండా అనంగపాలుని కుమార్తెలుగా చెప్పబడిన ‘చంద్రకాంతి’ ‘కీర్తిమాలిని’ అన్న పేర్లను దిగువ కనబరచిన పృథ్వీరాజు చరిత్రలలో ఎవరూ తెలియబరచలేదు. కొన్ని హిందీలోని చారిత్రిక గ్రంధములను పరిశీలించినతరువాత నా మనసుకు ఈ విధముగా తోచినది.

అపరాగంగాయ్ లేక అపర గాంగేయ గా ఉండవచ్చునేమో ,పృథ్వీరాజు -2, సోమేశ్వరుడు, ఈ మువ్వురు అర్ణోరాజ్ పుత్రులు. అపర గాంగేయ సింహాసనము కొరకు తన తండ్రిని సంహరిస్తాడు. కానీ పృథ్వీరాజ్ -2 అతనిని యమసదనమునకు అంపుతాడు. ఈ గృహ కలహములవల్ల సోమేశ్వరుడు తన తాత గారయిన సిద్ధరాజ్ వద్దనే గుజరాత్ లోనే ఉండిపొయినాడు. ఆయన వివాహము హేహయ వంశ కన్యక, చేది రాకుమారి యగు కర్పూరీ దేవితో తన తాత గారి ఇంట్లోనే జరిగింది.
పృథ్వీరాజ్-2 అజ్మేరు పై ముస్లిం దండయాత్రలను నిలువరించుతూ మరణించిన తరువాత సోమేశ్వరుడు అజ్మేర్ రాజవుతాడు. డిల్లీ అప్పటికే విగ్రహరాజ్ ఏలుబడిలో వుండినది కాబట్టి సోమేశ్వరుడు దిల్లీని కూడా తన ఏలుబడిలోనే ఉంచుకొంటాడు. (ఈ వాస్తవాన్ని నేటికికూడా ఫిరోజ్ షా కోట్లా లోని, అశోకుడు ఏర్పాటుచేసిన బ్బౌద ప్రతిమ పైభాగమున స్థంభముపై  చూడవచ్చును.) ఆవిద్ఫ్హముగా సోమేశ్వరుడు ఆయన తరువాత పృథ్వీరాజు దిల్లీ సింహాసనమునకు కూడా వారసులైనారు. కావున వీరు పుట్టుటకు ఎంతోకాలము పూర్వము రాజ్యము పోగొట్టుకొన్న అనంగపాలునికి సోమేశ్వర, పృథ్వీరాజులకు, ఎటువంటి సంబంధమూ లేదు. అంతేకాక జయచంద్రుడు, పృథ్వీరాజు విషయములో, పరస్పరము వైషమ్యము ఉన్నా, ఏనాడు గోరీని పృథ్వీరాజు పై దండెత్తుటకు ఆహ్వానించలేదు.  ఈవిషయములను స్పస్టముగా ఇతిహాసకారులైన రతన్ లాల్ వర్మ, అలీ హసన్ చౌహాన్(పాకిస్తానీయుడు), ఫరిస్తా, తజ్కాయీ నస్రీ మరియు జైన కవి నయన చంద్ సూరి, కాయం రాసో(పృథ్వీరాజు వంశజుడేకానీ ఇస్లాం పుచ్చుకొన్నాడు.) తమ రచనలలో పుష్టి చేసినారు.

తిరిగీ పృథ్వీరాజు విషయమునకు వస్తే, సోమేశ్వరుడు పృథ్వీరాజు 11 సంవత్సరముల బాలునిగా ఉండగానే తండ్రి మరణించుటచేత అజ్మేరు సింహాసనమును అధిష్ఠించినాడు. తల్లి కర్పూరీదేవి కొడుకునకు సామ్రాజ్య పాలనమున తోడుగా నిలిచి సమర్తవంతులు నమ్మకస్తులు అని తలచిన కైమాస్ మరియు కదంబవాస్ అన్న ఇరువురు మంత్రుల సహకారముతో రాజ్యమును పాలింపజేయ ప్రారంభించినది. పృథ్వీరాజు ఒక సంవత్సర కాలములో పాలనాదక్షతను అలవరచుకొన్నాడు. చంద్ర వరదాయి(ఈయనకు పృథ్వీ భట్ అన్న పేరు కూడా ఉన్నట్లు తెలియవస్తూవున్నది) అన్న కవి పృథ్వీరాజు కు సమవయస్కుడు మరియు ఆతని ప్రాణమిత్రుడు. పృథ్వీరాజ్ రాసో కావ్య రచయిత ఈయన. C.V. వైద్య, Dr. గోపీనాథ్ శర్మ, Dr. దశరథ్ శర్మ ఆదిగాగల చరిత్రకారులు పృథ్వీరాజ సంయుక్తల పరిణయమును చరిత్రలోని భాగముగా గుర్తించినారు.

తిరిగీ విషయానికి వస్తే, రాను రానూ తనపై కదంబవాస్ పెత్తనము ఎక్కువగుచున్నది మరియు పాలనా విషయమున  తాను స్వతంత్ర నిర్ణయము తీసుకొనుటకు అడ్డుతగులుచున్నాడని తలపోసి ఆతనిని నిర్మూలింపజేసినాడు పృథ్వీరాజని కొందరంటే యౌవ్వనములోనున్న ఆయన ఉంపుడుకత్తె క్రాంతి అన్న ఆమెను బలాత్కరించుట జూసి, (ఇది పృథ్వీరాజ్ రాసో లో చెప్పినమాట), పృథ్వీరాజ్ ప్రబంధము లో ప్రతాపసింహుడనువాడు పృథ్వీరాజును తరచుగా వచ్చుచున్న ముస్లిం దండయాత్రలకు కారణము కదంబవాస్ అని నమ్మించి ఆయనను చంపించినట్లు చెప్పబడింది. ఈవిధముగా పృథ్వీరాజు చరిత్రము ఎవరికి తోచిన విధముగా వారు వ్రాసి నిజమగు ఇతిహాసము మనకు అందకుండాజేసినారు. అయినా మన చేతనయినంతవరకూ తర్కమునుపయోగించి నిజము తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము. మేరునగధీరుడైనట్టి పృథ్వీరాజు పై కథలను కల్పించి వాస్తవ చరిత్రను వక్రీకరించిన వక్ర బుద్ధులను మహానీయులని అనుటకు మాటలు వచ్చుట లేదు.
ఇక కాస్త రాణీ సంయుక్తను గూర్చి మరొక పర్యాయము తెలుసుకొందాము........
ఇక సంయుక్తను గూర్చి తెలుసుకొందాము. సంయుక్తను గూర్చి తెలుసుకొనే ముందు, పైన చెప్పుకొన్న విధముగా, జయచంద్ర పృథ్వీరాజుల బాంధవ్యము ప్రకారము సంయుక్త పృథ్వీరాజునకు వరుస ఎట్లవుతుంది అన్నది కాస్త విమర్శించుకొందాము. నిజానికి సంయుక్తకు  పృథ్వీరాజు చిన్నాన్న అవుతాడు. అటువంటప్పుడు పృథ్వీరాజు సంయుక్తకు హైందవ ధర్మములో వరుస కాడు. పైన మనము విశధముగా పృథ్వీరాజునకు జయచంద్రునకు కుటుంబపరమైన బంధుత్వము లేదని నిర్ణయించినాము. ఇరువురూ శౌర్యవంతులే ఆత్మా గౌరవము కలవారే! సామ్రాజ్య విస్తరణాభిలాష కలిగినవారే! అందుకే ఒకరంటే ఒకరికి న్స్దరిపోకుండా వున్దిపోయినారు.
మరి పృథ్వీరాజు గుణగణములు రూపలావణ్యములు సంయుక్తకు ఎట్లు తెలిసినది అనుటకు ఈ విషయమును గూర్చి నేను ‘దైనిక్ భాస్కర్’ అన్న హిందీ పత్రిక నుండి నేను తెలుసుకొన్నాను.(DAINIK BHASKAR . COM) యుక్త వయసుకు వచ్చిన రాకుమారికి, బహుశ రాజు ఆదేశముతో, రాజకుమారుల చిత్ర పటములు చూపుటకు పన్నారాయ్ అన్న ఒక చిత్రకారుడు వచ్చినాడు. రాకుమారి మందిరములో అందరికళ్ళూ పృథ్వీరాజు చిత్రము పైనే! మరి నవయౌవ్వనవతి యైన సంయుక్త మనసును వేరేవారికి అంకితము చేయగలదు. ప్రేమకు ఆవిధముగా అంకురార్పణము జరిగినది. అదేపని పన్నారాయ్ సంయుక్త ప్రతిరూపమును పృథ్వీరాజుకు చూపి అతనిలోకూడా ఆమెపై ప్రేమను అంకురింపజేసినాడు. ఇది ఇలా ఉండగా రాజసూయము చేయనెంచి దానితోబాటూ సంయుక్త స్వయంవరమును కూడా చాటించినాడు జయచంద్రుడు. ఆరోజు రానే వచ్చింది. పృథ్వీరాజుకు ఆహ్వానము పంపనందున ఆయన రాలేదు. కానీ సభాద్వారమువద్ద ఆయన మూర్తిని ద్వారపాలకునివలె ఏర్పాటు చేయించినాడు. త్రికరణ శుద్ధితో పృథ్వీరాజును ప్రేమించిన సంయుక్త ఆ మూర్తి మెడలోనే మాల వేసినది. ఆక్షణమే అచటికి వచ్చిన పృథ్వీరాజు సంయుక్తను అందుకొని గుర్రముపై గూర్చుండ బెట్టుకొని తన రాజధానివైపు దౌడు తీసినాడు జయచంద్రుని సైన్యమునకు అందకుండా! ఆ తరువాత జయచంద్రుడు మహమ్మద్ గోరీ సహాయముతో యుద్దముచేసి పృథ్వీరాజును బంధించి కన్నులుపీకించి చెరలో బంధించగా ఆతడు తన మిత్రుడు చంద్ర వరదాయీ సాయముతో శబ్దవేది విద్యతో ఘోరీని చంపినట్లు చెప్పబడినది. ఇది ‘దైనిక్ భాస్కర్’ లో తెలిపిన మాట. మొత్తమునంతా వాస్తవముగా గైకొనుటకు నా తర్కము అంగీకరించలేదు. అందుచేత నా ఆతురత సహాయముతో అడుగు ముందుకు వేసినాను.
నా ఉత్సుకత నన్ను తర్కమునకు దగ్గరగా వున్న ఈ విషయము వద్దకు చేర్చినది.
జయచంద్రుడు అవమానమును సహింపజాలక కోపావేశపరవశుడై కుమార్తెను కారాగారామున యుంచమని యాజ్ఞాపించినాడు. రాజులందరు నిరాశనుబొంది తమతమ నగరములకు వెడలిపోయినారు. దీనిని యీ దేశమున జరిగిన కడపటి స్వయంవరముగా చెప్పుకొంటారు.
ఈ సంగతి యంతయు విని, పృథివీరాజు సంయుక్తకు తనపై గల ప్రేమకు  పరమానంద భరితుడయ్యెను. జయచంద్రుడు తనకు చేసిన అవమానముమరియు సంయుక్తకు తనయందు గల ప్రేమ త్వరపెట్ట పృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతో కనోజ్ పట్టణము సమీపమున విడిదిచేసెను. అచటనున్న కాలముననే యొక రాత్రి మిగుల రహస్యముగా పృథివీరాజు సంయుక్తను గలిసి గాంధర్వ విధిచే నామెను వివాహమాడినాడు.
వీరి వివాహవార్త యొకరిద్దరు దాసీలకు దప్ప నితరుల కెంతమాత్రము దెలియదు, పృథివీరాజు వచ్చి తన నగరము పొలిమేరల బైట విడిడి చేసియుండుట విని యాతనినిబట్టి తెండని జయచంద్రుడు మూడువేల సైన్యము నంపెను. కహరకంఠీరుడను వాని నేతృత్వమున  శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుట గని పృథ్వీరాజును వారితోబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిందాకి మిగుల ఘోరంబుగా బోరసాగెను. అందు పృథివీరాజు సేనానియగు ఆతతాయికిని, జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వంద్వయుద్ధము జరుగజొచ్చెను. అట్టి సమయమున కహరకంఠీరుడు రెట్టించిన రోషముతో ఆతతాయిని తన ఖడ్గమునకు బలియిచ్చి పృథివీరాజు కంఠము తెగవేయ నుంకించెను. అట్టి సమయమున ఆకస్మికముగా నొక వీరుని  కరవాలము పృథివీరాజు కంఠముపైబడనున్న ఖడ్గమును దునియలుచేసి కరకంఠీరుని దునిమెను. పృథివీరాజును ఆవిధముగా కాపాడినది వేరెవరోకాదు ఆతని పత్ని సంయుక్తయే! ఆమె తన భర్తను చేరి యాతనితో వెళ్ళవలయునని బహు ప్రయాసతో గారాగృహము నుండి తప్పించుకొని యుద్ధప్రాంతమునస్కు వచ్చి పృథ్వీరాజును వెన్నంటియుండెను. ఖడ్గాచాలనమును బాల్యముననే అభ్యసించిన సంయుక్త తన విద్యను ప్రదర్శించి  యుద్ధముచేసి తన భర్తప్రాణముల గాపాడగలిగింది. ఇక యుద్ధము చేయనవసరము కనిపించని పృథ్వీరాజు సంయుక్తా సంయుక్తుడై తన రాజధానిని చేరుకొన్నాడు. 
వచ్చేసారి గోరీని గూర్చి తెలుసుకొందాము..........
పృథ్వీరాజ్ చౌహాన్ -- 4 
 ఇక గోరీని గూర్చి......
ఇక షహబుద్దీన్ గోరీ లేక మహమ్మద్ గోరీని (వ్యాసములో ఇకపై గోరీ అని వ్రాస్తాను)  గూర్చి కొంత తెలుసుకొందాము. గోరీ, గజనీ సామ్రాజ్యములోని గోర్ ప్రాంతపు శాసకుడు.(1173-1206 క్రీ.శ.) మన దేశ సంపద కొల్లగొట్టుటయేగాక ఇచట ముస్లీం సామ్రాజ్యమును స్థాపించవలెనన్నది అతని సునిశ్చితాశయము. అందుకు గానూ తనతమ్ముడు ఘియాజుద్దీన్ గోరీకి పరిపాలనను అప్పజెప్పి తన యుద్ధపిపాస తీర్చుకొన దలచినాడు. ఆ తపనతో  క్రీ.శ. 1178 లో రెండవ భీమ చాళుక్యునిపై యుద్ధము ప్రకటించి పరాజితుడై వెనుదిరిగినాడు. కాల క్రమమున పశ్చిమ పంజాబువరకు ఉత్తరమున సింద్ మరియు ముల్తాన్ వరకు గోరీ పాలన లోనికి వచ్చినది. క్రీ.శ.1181 లో సియాల్ కోట్ కట్టించినాడు. లాహోర్ ను క్రీ.శ.1186 లో మాలిక్ ఖుస్రో ను జయించి ఆ కోటను హస్తగతము చేసుకొన్నాడు.

పైన తెలిపిన అదే భీమచాళుక్యుడు-2 పృథ్వీరాజుతో యుద్ధము చేసి  సంధి చేసుకొన్నాడు. ఈ విషయము ఖరతర గచ్ఛ పట్టాలి అన్న కావ్యములో ఈ విధముగా వున్నది. ‘చాళుక్య భీముడు-2 కు పృథ్వీరాజు -3 కు  క్రీ.శ. 1184 - 87 మధ్యన జరిగిన యుద్ధములో పృథ్వీరాజు భీముని ఓడించుటచే, భీమునిమహాఁమంత్రి జగదేవ్ ప్రతీహార్ ఎంతో ప్రయాసతో ఇరువురికీ షరతులతో కూడిన సంధి కుదిర్చినాడు.’ ‘పృథ్వీరాజ్ రాసో’ లో భీముని పృథ్వీరాజు చంపినట్లు ఉన్నది కానీ ఇది ప్రక్షిప్తమై ఉండనోపును. అదేవిధముగా పృథ్వీరాజు భండాణకులను నాగులను చందేల్ రాజులను ఓడించి తన రాజ్యమును గుజరాత్ వరకు విస్తరించినాడు. కన్నౌజ్ కు చెందిన జయచంద్ర ఘడ్వాల్ తో బహుశ మామయైన కారణముతో నేమో యుద్ధము చేయలేదు. కానీ వారి నడుమ సత్సంబంధము లేవీ చదువుటకు దొరుకలేదు.
గోరీ తన రాజ్య కాంక్ష మరియు భారతీయ సంపదలపై వెర్రి వ్యామోహమును ఏర్పరచుకొన్న గోరీ ఎన్నో మార్లు తన సరిహద్దులకావలనున్న హిందూ రాజ్యములపై దండయాత్ర సలిపినాడు. వానిలో దిల్లీ ముఖ్యమైనది. అతను దండయాత్ర చేసినపుడల్లా దేశమును మిగుల నాశనము చేసినాడు. అనేక దేవాలయముల బడగొట్టియు, సాదుజనుల నన్యాయంబుగా జంపియు, స్త్రీల పాతివ్రత్యంబుల జెరిచియు, అటు ఆడువారిని ఇటు మగవారిని  అదిరించి బెదిరించి మతమార్పిడులు చేసియు, మహాకౄరుడై మెలగెను. కాన వాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృథివీరాజు గోరీని శిక్షింప వెడలెను. పృథ్వీరాజు ఎవరినీ యుద్ధము కొరకు ఏవిధమైన సహాయమూ అడిగినట్లు కావ్యములలో గానరాదు. కోపమే ప్రధానముగా గల జయచంద్రుడు దేశక్షేమముగోరి పృథివీరాజునకు దోడుపడకున్నను, గోరికి సాహాయము చేయక తటస్థముగా నుండిపోయెను.
ఈ దండయాత్రల గూర్చి పృథ్వీరాజును గూర్చి వ్రాసిన ఒక్కొక్క కావ్యము ఒక్కొక్క విధముగా తెల్పినది. ఆవిషయమును ఈ దిగువన గమనించగలరు.
కావ్యము పేరు ----------రచయిత-----------గోరీ దండయాత్రల సంఖ్య
పృథ్వీరాజ్ రాసో ------చంద్ర వరదాయి -------------21 మార్లు
సుర్జన్ చరిత్ర ---------చంద్రశేఖర్------------------21 మార్లు
హామీర్ మహాకావ్యము-----నయన చంద్ర సూరి---------7 మార్లు
ప్రబంధ కోశము---------రాజశేఖర్----------------20 మార్లు
ప్రబంధ చింతామణి-------ఆచార్య మేరుతుంగ-------- 23 మార్లు
ఒక్క సర్జన్ చరిత్ర మాత్రము రాసో తో ఎకీభవించుచున్నది.
ఇంకా కొన్ని కావ్యములు కూడా ఈ విషయమై వివిధ అభిప్రాయములను ప్రకటించినా అందరి ఒప్పు దలనూ పొందినవి రెండు యుద్ధములు. అవి స్థానేశ్వరమునకు చేరువలో ఉన్న తరాయిన్ యుద్ధములు.
మొదటి తరాయిన్ లేక తారావాడీ యుద్ధము --- క్రీ.శ. 1191
రెండవ తరాయిన్ లేక తారావాడీ యుద్ధము --- క్రీ.శ. 1192
మిగతవి కేవలము సరిహద్దు తగాదాలుగా ప్రముఖ చరిత్రకారులచే భావింపబడినవి. క్రీ.శ. 1191 లో జరిగిన యుద్ధములో పృథ్వీరాజు సేనానాయకుడు గోవిందరాజ్ తో తలపదినపుడు గోరీ విసరిన బల్లెము తగిలి ఆయన ముందరి పళ్ళు రెండు ఊడినాయట. కృద్ధుడైన గోవిందరాజ్ విసిరిన బల్లెము గోరీకి కడుపు పై భాగములో పెద్దగాయము అయినదట. అప్పటికే విపరీతమైన సైన్యనష్టము కలిగిన గోరీ పలాయన మంత్రము పఠించినాడట. మొదటి తరాయన్ యుద్ధము ఆవిధముగా ముగిసింది.
అవమాన దావానల తప్తుడగు గోరీ ఓటమిని అరిగించుకోలేక సంవత్సరము ముగిసీ ముగియగనే 1192 లో ఒక లక్షా ఇరవై వేల సైన్యముతో తిరిగీ పృథ్వీరాజు పై దండెత్తినాడట. ఈ పర్యాయము పోయిన యుద్ధము వలె గాక ముందు పృథ్వీరాజు శత్రువుల వివరములు సేకరించి వారికి తన వైపు నుండి లేఖలను పంపినాడు. జయచంద్రునికి పంపినా తటస్తముగానే ఉండిపోయినాడు కానీ మాత్సర్య మత్తులైన ఇతర, పృథ్వీరాజుకు, సామంత రాజులు గోరీతో చేతులు కలిపినారు.
బలము కూడినదని గ్రహించి లాహోరు చేరుతూనే  పృథ్వీరాజుకు గోరీ ‘ఇస్లాం స్వీకరించి లొంగిపోతావా లేక యుద్ధమునకు సిద్ధమౌతావా?’ అని. అందుకు పృథ్వీరాజు ‘ఎల్లలు దాటి పోతే సరి లేకుంటే మనకలయిక రణరంగములోనే’ అని ప్రత్యుత్తరము పంపినాడు. దీనితో గోరీ తన యుద్ధప్రణాలిక మార్చుకొన్నాడు. పృథ్వీరాజు లేఖకు బదులుగా ‘యుద్ధము ఇద్దరికీ నష్టము కావున సందిచేసుకొందాము. నేను క్రొత్తగా  జయించిన పంజాబ్ ముల్తాన్, సర్ హింద్ లతో సరిపుచ్చుకుంటాను. కానీ ఈ విషయమును గజనీని ఏలుచున్న నా తమ్మునికి తెలియజేసి తన నుండి వర్తమానము అందిన వెంటనే వెనుదిరిగి పోతానన్నాడు. ఈ విషయములను హసన్ నిజామీ వ్రాసిన తాజ్-ఉల్-మాసిర్ లో చూడవచ్చు.

దీనిని గుడ్డిగా నమ్మడమే పృథ్వీరాజు చేసిన పెద్ద తప్పు. దానికి తోడుగా పృథ్వీరాజు 23, 24 సంవత్సరముల నిండు యౌవ్వనము, ఆక్రోశము, పౌరుషము కట్టలు తెంచుకొని దేహము నిండిపోగా తనపై నమ్మకమును ఉంచుకొనుట తప్ప మంత్రాంగమునకుగానీ ఆలోచనకు గానీ తావునివ్వలేదు. ఇరుగుపొరుగు రాజ్కులను గానీ తనతో కలుపుకొనలేదు. గోరీ తానాశించిన విధముగా తన మిత్రరాజ్యములనుండి జవాబు అందిన పిదప పృథ్వీరాజు పై దండెత్తి ఆతనిని చక్రబంధములో బంధించినాడు. ఎంతపోరినా శత్రుబలాలు శక్తికి మించినపుడు వేరుమార్గములేక ఏనుగును దిగి గుర్రమునెక్కి పారిపోవు చుండాగా సిర్సా వద్ద ఆ మహావీరుని చంపినట్లు హసన్ నిజామీ వ్రాసినాడు. ఆయన పృథ్వీరాజ్ కాలమునాటి వాడు కాదు. అందుచేత ఇదే వాస్తవమని మనము తలువనక్కరలేదు.
పృథ్వీరాజు మరణమును గూర్చి, ఆయన చరిత్రను వ్రాసిన ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వ్రాసినారు. ఆ వివరములు చూసిన తరువాత ఒక నిర్ణయానికి వద్దాము.
పృథ్వీరాజు మరణించిన పిదప కూడా గోరీ జీవించియుండినాడు. అతను క్రీ.శ. 1206 లో చనిపోయినాడు.
ఇక పృథ్వీరాజు మరణమును గూర్చి ఏ ఏ రచయిత ఏమన్నాడో కాస్త వివవివరాలలోకి పోదాము.
ఆ వివరములు వేరొకమారు తెలుసుకొందాము......

పృథ్వీరాజ్ చౌహాన్ – 5
 హసన్ నిజామీ తప్ప తక్కిన రచయితలు గోరీ పృథ్వీరాజును బంధించినట్లు, గుడ్లు పీకించినట్లు ఆతరువాత కొంత కాలమునకు చంపినట్లు వ్రాసినారు. కానీ ఏవిధముగా, ఏపరిస్థితులలో అన్నది వ్రాయుటలో ఐక్యత లేదు. చంద్ర వరదాయి పృథ్వీరాజుకు సమకాలీనుడు మరియు ప్రాణస్నేహితుడు. కానీ నేటి చరిత్రకారులు ఆయన రచనను పృథ్వీరాజు జీవితమునకు సాక్షిగా తీసుకోలేదు. మరి అందులో తీసుకోనవలసినది అసలేమీ లేదా అన్నది చివరిగా విశ్లేషించుకొందాము.
హమ్మీర్ మహాకావ్యములో నయన చంద్ర సూరి పృథ్వీరాజును కారాగారములో బంధించి ఆ తరువాత ఆయనను హత్య చేసినట్లు వ్రాసినాడు. ప్రబల శత్రువు చేతికే చిక్కినపుడు వెంటనే చంపక వేరేపుడో చంప పనియేమి?
లక్ష్మీధరుడు వ్రాసిన ‘విరుద్ధ విధి విధ్వంసము’ ప్రకారము పృథ్వీరాజు గోరీ తో యుద్ధములోనే మరణించినాడు. ఇంకొక కావ్యము ముని జనవిజయ్ అను వ్యక్తికి భారతీయ విద్యాభవన్ ముంబాయి (జైన పుస్తక భాండాగారము) లో లభించిన ‘పురాతన ప్రబంధ సంగ్రహ్’ లోని పృథ్వీరాజ్ ప్రబంధ్’ లో ఘోరీ పృథ్వీరాజును ఖైదు చేసి కళ్ళు పీకించి , అతని రాజధానియైన ఆజ్మేరులోనే చెరలో బంధించి, సభ జరుగు సమయమున గతములో తాను కూర్చున్న సింహాసనముపై గోరీ కూర్చొని సభాసదులకు ఆజ్ఞల నొసంగుట చూచి సహించలేక తన పూర్వ మంత్రి ప్రతాప్ సింగ్ అనువానితో ధనుర్బాణములను తెప్పించుకొని సముచిత సమయము కొరకై ఎదురుచూస్తూ వుండినాడట. కానీ ఆ ద్రోహి ఆ విషయమును గోరీతో చెప్పుటచే, గోరీ పృథ్వీరాజును ఒక కందకము త్రవ్వించి ప్రుత్వీరాజును అందులో త్రోసి పైన నుండి కొండరాల్లను త్రోయించి సంహరించినాడట. గోపీనాథ్ శర్మ అన్న ప్రసిద్ధ చరిత్రకారుడు తన రాజస్థాన్ క ఇతిహాస్ లో హసన్ నిజామీ (కుతుబుద్దీన్ వద్ద ఆస్తాన పండితునిగా కూడా ఉండినాడు, పృథ్వీరాజు మరణించిన తరువాతి కాలము అంటే 12-13 శతాబ్ద  సంధి ) వ్రాసిన తాజుల్ మాసిర్ లో గోరీ ప్రుత్వీరాజును చెరలో బంధించి తరువాత చంపినట్లు వ్రాసిన విషయమును గ్రహించినాడు. ఈయన పృథ్వీరాజ్ ప్రబంధ్ ను కూడా తన పరిశోధనకు వాడుకొన్నాడు. ఈ విధముగా ఒక్కొక్క కావ్యములో ఒక్కొక్కరీతిగా ఉండుటచే వాస్తవికతను గ్రహించుట జటిలమై పోయినది.
     ఇక ఇపుడు ‘పృథ్వీరాజ్ రాసో’ లో చంద్ర వరదాయి పృథ్వీరాజు మరణమును గూర్చి ఏమి తెలిపినాడో, అతనికీ పృథ్వీరాజుకు గల సంబంధము ఇత్యాది విషయములను పరిశీలించుదాము.
ఈ గ్రంధము నిజామునకు వాసిలోనూ రాశిలోనూ చాలపెద్దది. ఈ రోజు ఇదే పుస్తకము, బృహత్, లఘు, లఘుతర రీతులలో మూడు భిన్న పుస్తకములుగా కన్పట్టుచున్నది. ఈ మూడింటిలోనూ సమానత చాలా అంశములలో లేదు. ఒక్క పృథ్వీరాజు మరణ విషయములో మాత్రము అభేదముగా కన్పట్టుచున్నది. దీనిని బట్టి మొదట వ్రాసిన కావ్యములో అనేక ప్రక్షిప్తములు చోటు చేసుకొన్నట్లు మనకు తెలియవస్తూవున్నది.
ఇక అసలు విషయమునకు వస్తే చంద్ర వరదాయి పృథ్వీరాజుకు బాల్య స్నేహితుడు, అత్యంత ఆప్తుడు ప్రాణసమానుడు గొప్ప విద్వాంసుడు మహాకవి. కవి కావున జరిగిన సంఘటనలకు అలంకారములు అక్కడక్కడ అతిశ్యోక్తులను కూడా అద్ది అతి రమ్యమగు కావ్యమును మనకొసంగినాడు. ఈయన కుమారుడు జల్హణుడు. ‘పృథ్వీరాజ్ రాసో’ ప్రకారము పృథ్వీరాజు రెండవ తరాయిన్ (క్రీ.శ.1192) యూద్ధములో ఓడిపోయిన పిదప తన ఘనతను చాటుకొనుటకు, ఆయనను బంధించి గజినీ తీసుకొని పోయినాడు గోరీ. ఆయనను గుడ్డివానిని చేసి చెరలో బంధించియుంచినాడు. విషయము తెలిసిన వరదాయి సమయము కొరకు వేచియుండి, సరయిన సమయము వచ్చినంతనే, తన కుమారుని చేతికి తాను వ్రాయుచుండిన  ‘పృథ్వీరాజ్ రాసో’ కావ్యమునిచ్చి తన తదనంతరము జరిగిన విషయములతో పూరించమని చెప్పినాడు. ఇందుకు సంబంధించిన, ఆయన వ్రాసిన త్రిపద ( మనకు పద్యము వంటిది) ఈ విధముగా వుంది.
పుస్తక్ జల్హణ హత్థ దై చలి గజ్జన్ నృపకాజ్l
రఘునాథన చరిత హనుమంతకృత్ భూప భోజ ఉద్ధరియ జిమిl
పృథిరాజసుజస్ కవి చంద కృత చంద నంద ఉద్ధరియ తిమి ll
పైపద్య భావము ఈ విధముగా చెప్పుకొనవచ్చును. పుస్తకమును కుమారుడగు జల్హణుని చేతికిచ్చి, నేను రాచకార్యము మీద గజినీ వెళ్ళుచున్నాను. శ్రీరామచంద్రుని చరిత్ర హనుమంతుడు వ్రాసిన రీతి నేను నా ప్రభువగు పృథ్వీరాజు చరిత్ర వ్రాయుచూ దీనిని పూరించే బసధ్యత నీకొసగుచున్నాను అన్నాడు.
ఒక్కడే పోదు కాబట్టి వెంట ఒక నమ్మకస్తుడగు అనుచరుని తొడుకొని పోయివుంటాడు. అక్కడికి వెళ్ళిన తరువాత గోరీ నమ్మకము సంపాదించి, పృథ్వీరాజు యొక్క ఒక ముఖ్యమయిన ఘనతను గూర్చి అతని చెవిన వేసినాడు. గోరీతో “పృథ్వీరాజు కు ‘శబ్దభేది’ విద్య తెలుసు, ఆయన గ్రుడ్డియయినాకూడా శబ్దము విని లక్ష్యము ఛేదించగలడు” అని. ఆతురత కలిగినవాడైన గోరి ఆ పాటవ పరీక్షకు తగిన సమయమును నిర్ణయించి సంసిద్దుడై విషయమును తన సైనికులచే పృథ్వీరాజునకు చెప్పించి విల్లంబులనందించి వేడుక చూచుటకు వేదికనెక్కి కూర్చున్నాడు. గోరీ ఎప్పుడయితే తన ప్రతిపాదనకు ఒప్పుకొని రోజును నిర్ణయించినాడో వరదాయి పృథ్వీరాజు నిలువబడబోవు బోను, గోరీ కూర్చొనబోవు వేదిక ఎత్తు, బోను వేదికల మధ్యదూరము అన్నీ లెక్కించి పెట్టుకొన్నాడు వరదాయి. రంగము సిద్ధమైనది.   ఆ సమయములో, గట్టిగా చంద్ర వరదాయి గొంతు పృథ్వీరాజుకు వినబడింది. శరీరములో ఆనందము ఉత్సాహము పెల్లుబికింది. మస్తిష్కము పదునెక్కింది. గోరీ వరదాయికి అనుజ్ఞనొసగి పృథ్వీరాజుకు తెలియజేయమన్నాడు. అప్పుడు బిగ్గరగా చంద్ర వరదాయి ఈ దోహా అనగా ద్విపద  ఆశువుగా చెప్పినాడు.

చార్ బాఁస్ చౌబీస్ గజ్ అంగుల్ అష్ట ప్రమాణ్
తా ఊపర్ సుల్తాన్ హై మత్ చూకె చౌహాన్
అంటూ గోరీ దిశగా శబ్దము చేయుట జరిగింది. అంతే ఆలస్యము లేకుండా బాణము గోరీకి తగిలి గద్దె మీదినుండి పడిపోయినాడు. హాహాకారాలతో రాజోద్యోగులు రాజును చుట్టుకొన్నారు. ఇదే సమయమని ఎంచి చంద్ర వరదాయి తన ఛురికను బలముగా పృథ్వీరాజు గుండెలలో దింపి బయటకు తీసి దానితోనే తానూ పొడుచుకొని మరణించినాడు. ఇది మైత్రి అంటే!
    ఉత్సవే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే l
    రాజద్వారే శ్మశానేచ య తిష్ఠతి స బాంధవః ll
ఆనందములోన ఆపత్తులోనూ దుర్భిక్షము లోనూ దుష్ట బాధలందును మహారాజు ఆస్థానములోనైనా మరుభూమియందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. ఆతడే చంద్ర వరదాయీ.
పృథ్వీరాజ్ రాసో లోని మూల కథకు నా తర్కము జోడించి మరీ మీముందు ఉంచినాను. మిగత కావ్యాలలో ఏవిధముగా పృథ్వీరాజు మరణించినదీ మీకు ముందే తెలియజేసినాను.
ఇక ఇప్పుడు ఈ విషయమును ఎందువల్ల నమ్మవచ్చును అన్నది హేతువునకు దగ్గరగా వుండు విధమున మీకు తెలియజేస్తాను.
పృథ్వీరాజు గోరీ పైకి బాణము విడిచిన తరువాత ఏమిజరగినది అని తెలుసుకొనుటకు చంద్ర వరదాయి బ్రతికి లేడు. బాణము తగిలినవెంటనే మరణించి ఉంటాడు అన్నది ఒక ఊహ. వరదాయితో వచ్చిన వాడు వార్తను తిరిగీ కనౌజ్ కు చేరవేయవలె కాబట్టి గోరీ మరణించియే ఉంటాడని నమ్మి వెనుదిరిగిపోయి తాను వాస్తవమని నమ్మినది వరదాయి కుమారుడు జల్హణునికి చెప్పి తాను గుప్తముగా వ్రాసుకొన్న దోహాను అందివ్వడముతో జల్హణుడు కావ్యమును పూర్తిచేసియుంటాడు.
ఇక్కడ గోరీకి బాణమైతే బలంగానే తగిలింది కానీ ఆఘమేఘాలపై ఆతని సేవక బృందము తగిన వైద్య చికిత్స చేయించి అతనిని కాపాడి ఉంటారు. అది చంద్ర వరదాయికి తెలిసే అవకాశము లేదు కారణం ఆయన బ్రతికిలేదు కాబట్టి. అతని వెంట వచ్చిన అనుచరుడు తనను కాపాడుకొని చివరి ‘దోహా’ జల్హణునకు ఇచ్చుటకు ఆజ్మీర్ వెళ్ళి ఉంటాడు. విషయము తెలుసుకొన్న జల్హణుడు ఆవిధంగానే కావ్యమును ముగించియుంటాడు. ఇక గోరీ వైపు ఆలోచించితే అతను పూర్తిగా కోలుకున్నతరువాత తిరిగీ ఆజ్మేరు దిల్లీలపై దండయాత్ర సాగించి అప్పటి పాలకుడైన పృథ్వీరాజ్ కుమారుడు, చిరువయస్కుడు అయిన గోవిందరాజ్ ను సామంతుని చేసియుంచినాడు. అజ్మేరు లో దొరకిన కొన్ని నాణేలపై ఒక ప్రక్క గోరీ పేరు ఒక ప్రక్క పృథ్వీరాజు పేరు ఉండుటవల్ల పృథ్వీరాజు యుద్ధములో వోడి సామంతుడై నాణెములను ఆ విధముగా ముద్రింపజేయించి ఉంటాడని కొందరు చరిత్రకారులు అభిప్రాయ పడినారు.
అజ్మేరు నాణేలపై ఒక ప్రక్క తన పేరును ముహమ్మద్ బిన్ సాం (అంటే శాహబుద్దిన్ గోరీ ) వేయించుకొని రెండవవైపున పృథ్వీరాజు పేరును అట్లే వుంచినాడు. దీనికి కారణము చలామణిలో నున్న అన్ని నాణెములను వెనుకకు తెప్పించలేక రాజ కోశములో ఉన్న నాణెములపై ఈ విధముగా మార్పించియుండవచ్చు. ఇవి 20 వ శతాబ్దములో లభించినవి. వీనిని బట్టి కొందరు చరిత్రకారులు పృథ్వీరాజు శౌర్యమునే శంకించి ఆయన గోరీ సామంతునిగా కూడా ఉండియుండవచ్చునని తెలిపినారు.
ప్రాణం వాపి పరిత్యజ్యా మాన మే వాభి రక్షతుl
అనిత్యో భవతిః ప్రాణం మానమాచంద్ర తారకంll
అన్న నీతికి కట్టుబడినవారు. प्राण जाय पर आन शान और वचन न जाय అని నమ్మిన శౌర్య వంతులగు రాజపుత్రులు ప్రాణమిచ్చుటకే సిద్ధపడుతారు కానీ ప్రతిష్ఠ కు మచ్చ తెచ్చిపెట్టారు. గోరీని పృథ్వీరాజు శబ్దభేది తో చంపినాడు అని నేను హిందీలో వ్రాయబడిన చరిత్ర పుస్తకము ‘క్షత్రియ గౌరవ గాథ’ లో ఈ విధముగా చదివినాను. అందుచేత ఈ ముఖ్యమైన విషయమును  ప్రస్తావించుతాను. 'క్షత్రియ గౌరవ గాథా' ప్రకారము నిశ్చితముగా శబ్దభేదివిద్య ద్వారా పృథ్వీరాజు గోరీని చంపినట్లు తెలియవస్తూవుంది. అటుపై అతని సహోదరుడు ఘియాత్ అల్ దిన్ ముహమ్మద్ భారత దేశముపై దండయాత్రకు వచ్చినట్లుకూడా చదివినాను. ప్రజల ఆమోదము కొనసాగించుటకు నాణెములపై ఒక ప్రక్క పృథ్వీరాజు మరియొక ప్రక్క షహబుద్దీన్ చిత్రమును వుంచినాడు అని తెలుసుకొన్నాను.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు 'గురుదేవ్' అన్న గౌరవనీయుడైన ఒక ప్రముఖుడు 'క్షత్రియ గౌరవ గాథా' లో విస్తృతముగా వ్రాయబోవు చున్నారని తెలియజేయబడింది. దానిని నేను ఇంకా చూచుట తటస్థించలేదు.
నిర్ద్వంద్వముగా పృథ్వీరాజు సుతుడు చిన్నవయసు కావచ్చు, అంతేవాసుల సలహాలు తీసుకొని యుండవచ్చు, అయినా ఆ కళంకమును కోరి తెచ్చుకొన్నాడు. అందుకు ప్రతిగా అమూల్య అపూర్వ సంపదలను గోరీకి కానుకగా సమర్పించుకొన్నాడు. పద్మము వున్నచోట బురుద కూడా ఉంటుందికదా!
ఇంతకూ పృథ్వీరాజు జీవించినది 24 సంవత్సరాలే! తానూ రాజ సింహాసనమును అధిష్ఠించినది 11 సంవత్సరాల వయసులో! ఒక సంవత్సరము తల్లిచాటునే ఉండినాడు. కాబట్టి ఆయన రాజ్యమేలిన కాలము కేవలము 12 సంవత్సరాలు. అంత తక్కువకాలము ఏలి కూడా ఎంత గొప్ప పేరు సంపాదించినాడో ఆ అసహాయ శూరుడు. పృథ్వీరాజు ఎక్కువకాలము బ్రతికినట్లు కూడా కొందరు వ్రాసినారు కానీ ఎక్కువమంది ఏకీభవించిన విషయమును నేను గ్రహించినాను. ప్రుత్వీరజును గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే:
సుగుణవంతుడైన సుతుడు ఒక్కడు చాలు
గుణములేని వేల  కొడుకులేల 
చుక్కలెట్లు సురుచి సూతికి సరిసాటి
రామమోహనుక్తి రమ్యసూక్తి!
ఇక జయచంద్రుని గూర్చిన అపప్రథ ఎంతవరకు నిజము అన్నది నిగ్గుదేల్చవలసి యుంటుంది. ఈయనను గూర్చి భవిష్య పురాణము ఏమి చెబుతున్నదో చూస్తాము.
త్యక్త్వా దేహం సంశుద్ధాచంద్రకాన్త్యాం సుతో భవత్l
జయచంద్ర ఇతిఖ్యాతో బాహుశ్జాలీ జితేంద్రియాll
ఈ శ్లోకము వల్ల జయచంద్రుడు అమిత బలశాలి, జితేంద్రియుడే కాక క్షీర సదృశుడైన స్వచ్ఛ మనస్కుడు అని మనకు అర్థమౌతూవుంది. అతని తమ్ముడు రత్నభానుడు అన్నకు లక్ష్మణుడై, గోడ,మరు మర్తియు వంగ దేశాలను జయించి అన్నగారి సామ్రాజ్యమును విస్తరించినాడు. ఇదికూడా భవిష్య పురాణము లోని మాటే! (ప్రతిసర్గ పర్వము 3.5.1.4) దీనినిబట్టి జయచంద్ర పృథ్వీరాజులకు దేశము మొత్తము పై తమ సార్వభౌమాధికారము స్థాపించుటలో, అహము తోడై  వైరము ప్రబలి బద్ధశాత్రువులైనారని తెలియవస్తూవున్నది. అయినాకూడా వారిరువురూ నీతిమార్గమును విడువలేదు. పృథ్వీరాజ్ రాసోలో రచనా విధానమును బట్టి, జయచంద్రుడు గోరీ సహాయము కోరినది ముస్లిం మరియు పాశ్చాత్య ప్రముఖుల నిర్వాకము ఈ ప్రక్షిప్త కార్యము అని తెలియుచున్నది. 12వ శతాబ్దములో వ్రాసిన పృథ్వీరాజ్ రాసోలో తైమూరు చంగేజ్ ఖాన్, మేవార్ రాజు రావాల్ రతన్ సింగ్ పద్మావతిల ప్రస్తాపన వుంది. వారు 13,14 శాతాబ్దములవారు. మరి వారిని గూర్చి చంద్ర వరదాయి వ్రాయలేడు కదా!
  ధర్మమునకు కట్టుబడిన రాజులు ఎప్పుడూ నీచమైన తుచ్ఛమైన అసహ్యం,ఐన ఆలోచనలకు తావివ్వరు. ధర్మమునకు కట్టుబడిన రాజులలో ఒకడే జయచంద్రుడు. చాలా క్లుప్తముగా చెప్పవలసివస్తే ఆయన దేశ విద్రోహి మరియు పృథ్వీరాజును చంపుటకై గోరీని దండయాత్రకై పురికోల్పినాడు అన్నది శుద్ధ అబద్ధమని సులభముగా నిర్ణయించగలిగినాము కదా! ఆయన పృథ్వీరాజు పైకి గోరీని దండయాత్రకు రమ్మన్నట్లు, పృథ్వీరాజ్ విజయ్ లోగానీ, హంమీర్ మహాకావ్య లోగానీ, రంభా మంజరి లోగానీ, ప్రబంద్ కోశ్ లోగానీ, ఇవియే కాక ఇంకా ఎన్నో ఈ కథకు సంబంధించిన కావ్యములలో లేదు. ఆయన మాన ధనుడు కావున అల్లుడైనా పిలువని పేరంటము కావున పోలేదు. గోరీ తన నమ్మకమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్ ను దిల్లీ గద్దెపై కూర్చుండజేసి తానూ గజనీ కి వెళ్ళిపొయినాడు. కానీ 1194 లో కుతుబుద్దీన్ తో కలిసి రాజ్యవిస్తరణ కై అమిత బలగముతో గోరీ వచ్చి   జయచంద్రునితో యుద్దముచేసి ఆయనను సంహరించినాడు. ఇది చందవార్ లో జరిగిన యుద్ధము. ఇబ్న్ నసీర్ అన్న ముస్లిం చరిత్రకారుడు కూడా తన కామిల్-ఉల్-తవారీ లో ఎదే విషయమును పుష్ఠిచేసినాడు. ఎందులోనూ పృథ్వీరాజుపై దండెత్తామని గోరీని జయచంద్రుడు కోరినట్లు కనిపించదు.
ఇక గోరీ కూడా 1206 లో జీలం నది ఒడ్డున విడిది చేసి నిదురించు సమయములో, తమ వారిని చంపినాదన్న పగతో గోరీని హత్య చేసినారు.
భోజులు విక్రమార్కులును భూరి యశస్వులు శాతవాహనుల్
భ్రాజిత క్షాత్ర వంశజులు భాసిలు కాలము లంతరించగా
ఓజము తేజమంతయును ఓర్పుయు నేర్పుయు మట్టికాగ సా
మ్రాజ్యములుండె స్వార్థపర  రాక్షస మూకల పట్టుకొమ్మలై

స్వస్తి