స్వస్తి.
Thursday, 9 November 2017
తిరుచందూరు - కార్తికేయ లీల
స్వస్తి.
Thursday, 12 October 2017
నరక చతుర్దశి – దీపావళి
అత్యంత ఘనమైన మరియు సాంప్రదాయ బద్ధమైన ఈ పండుగను మానవద్దు
సరికదా ఎంతో ఉల్లాసము తో ఉత్సాహముతో చేసి మన సహేతుకము శాస్త్రబద్ధము అయిన మన
ధర్మమును కాపాడండి.
నరక చతుర్దశి – దీపావళి
లంకె:
https://cherukuramamohan.blogspot.com/2017/10/blog-post.html
నరక చతుర్దశి దీపావళి ప్రాధాన్యత ప్రాముఖ్యత పై లంకెలో
చదవండి.
ఎంతో ఘనంగా జరుగవలసిన దీపావళి రాను రాను కొడిగట్టి కొండ
ఎక్కుటకు సిద్ధముగా ఉన్నది. తర్కబద్ధమగు మన
పండుగలను శ్రద్ధతోను, భక్తి తోనూ, శక్తిమేరకు ఘనంగానూ ఆచరించి మన
ధర్మమును ఉద్ధరించుదాం. జనవరి 1న
ప్రపంచమంతా ఎన్నో విధములగు
పటాసులను కాలుస్తారు. అర్ధరాత్రి పండుగలు మానవేతరులు మాత్రమే చేస్తారు. మదిరా
మదమాంసభక్షణ మగువా పరిష్వంగము వారి పర్వదినపు వేడుకలు. ఆ జుజుగుప్సాకర పద్ధతులు
ఇటు వాతావరణమునే కాక అటు నైతిక కాలుష్యమును
చేయుట లేదా! మరి వానికి కాలుష్యము అంటదా! ఒక భారతదేశములో దీపావళి రోజే పటాసులు
కాల్చుటచేత వాతావరణ కాలుష్యము ఏర్పడుతుందా!
ఇది చోద్యముగా లేదా! ఇది కాకుండా, అసలు శాస్త్రపరమైన పండుగే కాని క్రిస్మస్ ను గొప్ప
పండుగగా చేసి మన
దీపావళి ఆచారములను ఇప్పటికే, పటాసులు
కాల్చుట, బంధు మిత్ర సందర్శనము, మిఠాయి
అసలు పటాసులు కాల్చుట ఆనాడే మన నుండి తస్కరించినాఋ పరమతస్తులు.
కానుకలు, పంపకములు మొదలగు విషయములను తస్కరించినారు. అసలు శాంటాక్లాస్
అన్నవ్యక్తికి ఒక చారిత్రికాధారము లేదు. అతనికీ క్రిస్మస్ కు ఏ సంబంధమూ వారి
బైబిల్ లో కనిపించదు. ధర్మాన్ని
కాపాడండి. మన ఉనికి ధర్మముతోనే ముడిపడి ఉంది. ‘వందే మాతరం’ అన్న నినాదమును మరువ
వద్దు. నరక చతుర్దశి-దీపావళిని గూర్చి ఈ దిగువ
లంకెలో సవిస్తారముగా చదవండి.
ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః l
తస్మాద్ధర్మో న హన్తవ్యో మానో ధర్మ హతో వదీత్ll మనుస్మృతి 8.15
నరక చతుర్దశి – దీపావళి
తెలుగు మాసములలో ఆశ్వయుజ
మాసము అత్యంత ప్రముఖమైనది. చైత్రాది 6 మాసములలోని మొదటిదయిన చైత్రములో మనకు వసంత
నవరాత్రులు(రామ నవరాత్రులు) వస్తాయి. మిగిలిన ఆశ్వయుజాది 6 మాసములలోని మొదటి
మాసమయిన ఆశ్వయుజములో శరన్నవరాత్రులు వస్తాయి. అసలు వసంత, శరత్ ఋతువులు ఎంతో
ఆహ్లాదమును కలిగించే ఋతువులు. ఉల్లాసము కల మనస్సును పరదైవమునకు అంకితము చేయుట ఎంతో
సులభము. అటు వసంత నవరాత్రులు ఇటు శరన్నవరాత్రులు సమశీతోష్ణ స్థితి కలిగి ప్రాణి
కోటికి ఆనందాన్ని సమకూరుస్తాయి . శరన్నవరాత్రుల తరువాత ఆ మాసపు చివరిలో వచ్చే
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి
అమావాస్య. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి.
మనము
ఎంతో వేడుకతో చేసుకొనే ఈ నరక చతుర్దశి, దీపావళి కి ఒక ప్రత్యేకమయిన ప్రాధాన్యత
వుంది. ఈ పండుగలు రెంటినీ ఒక
రాక్షసుని మరణాన్ని మనము ప్రకటించి జరుపుకొంటున్నాము. భూదేవి సత్యభామావతారమని, శ్రీ
మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారమని, నరకాసురుడు భూదేవి కుమారుడనీ అన్న కథను
ఎన్నోమార్లు మనము విన్నాము. అందువల్ల ఆ విషయము జోలికి నేను పోవుట లేదు.
ఇక్కడ ఒక్క మాట
ముఖ్యమయినది చెప్పుకొని ముందునకు సాగుదాము. ఆశ్వయుజం అనగా గుఱ్ఱముల
పూనిక. గుఱ్ఱములు అనగా మన ఇంద్రియాలు. ఆ గుఱ్ఱాలను మనస్సు అనే పగ్గాలతో కట్టి శరీర
రథాన్ని పరమాత్మ వైపు పయనింప చేయాలి. ఈ ప్రయాణంలో చీకటిని, సుదర్శనంతో అంటే
మంచినిమాత్రమే దర్శించుతూ, అనగా చక్కటి జ్ఞానంతో తొలగించడం
నరకాసురుని వధ. అమావాస్య చీకటి యొక్క పరాకాష్టతకు ప్రతీక.
అదేవిధముగా చీకటి జ్ఞానమును మన స్మృతిపథము లోనే లేకుండా చేసి, అజ్ఞాన తిమిరమును ఆవరిపంప జేస్తుంది. అజ్ఞానము ఆవహించిన వ్యక్తికి,
అంతా ఉదాసీనతే, నిర్లిప్తతే, అట్లు కాదు అంటే కుళ్ళు, కుట్ర, కుత్సితము, కుతంత్రము,క్రూరత్వము
గూడుకట్టుకొని ఉంటాయి. ఇవన్నీ దుఃఖహేతువులే! ఈ దుఃఖము తోలగాలంటే మనకు సుదర్శనము
కావాలి. దు:ఖం తొలగితే ప్రసరించేవి వెలుగురేఖలే, ప్రతి
గుమ్మంలో వెలిగే దివ్వెలు అవే! ప్రతి హృదయంలోని ఆత్మ అంటే పరమాత్మకు ఇచ్చే మంగళహారతులు
అవే! అదే దీపావళి.
మన అర్ష ధర్మములో ప్రతి
పండుగకు ఒక శాస్త్ర పరమయిన కారణము వుంటుంది. ఇతర మతములలో ఈ తర్కమునకు తావివ్వరు.
క్రైస్తవులు ఎంతో సంబరముగా జరుపుకొనే క్రిస్మస్ క్రీస్తు జన్మదినముగా చెబుతారు.
ఎన్నో మార్లు తమ కేలెండర్ ను మార్చుకొన్న వారు 25డిసెంబరు క్రీస్తు పుట్టిన రోజు
అని ఎట్లు చెబుతారు. చివరిసారిగా తమ కేలెండరును సవరించిన పోప్ గ్రెగొరీ 1582లో
అక్టోబరు నెలలో 4వ తేదీ తరువాత 14తేదీని ఏర్పరచి 10రోజులను ఇంద్రజాలములో
ఇరికించినాడు. అటువంటపుడు 25డిసెంబరు ఏవిధంగా క్రీస్తు
పుట్టిన రోజు అవుతుంది. మరి క్రీస్తు శకమునకు ప్రారంభము అదియే కావలెను కదా! అంటే
డిసెంబరు 25 ను చెరిపి దానిని తరువాతి సంవత్సరము (వారి
పద్ధతి ప్రకారము) జనవరి 1 గా చేయవలసి వస్తుంది. ఇక ముస్లీముల
పండగలు ఇంచుమించు 1500 సంవత్సరముల నాడు, అనగా వారి మతము పుట్టిన తరువాత ఇతర మతాలకు పండుగలు వుంటే అటువంటివేవో తమకూ
ఉండవలెనని ఏర్పరచుకొన్నవి. వాళ్లలో ఎక్కువమందికి ఆ పండుగ ఎందుకు జరుపుకొంటారు
అన్నది తెలియదేమో అనిపిస్తుంది. అందుకే మేకల పండగ రోజు (బక్రీద్) ఆవులను చంపుతారు,
ముఖ్యముగా మన దేశములో. రంజాన్ నెలలో పగలు ఉపవాసమువుండి రాత్రికి
వారు కోరుకొన్నవి కోరుకొన్నన్ని మార్లు తింటారు. ఇక ముహర్రము షియాలకు మాత్రమె!
సున్నీలకు లేదు. మరి మన పండుగలు అట్లు కాదు.
ఈ దీపావళి పండుగ విషయములో, ఈ పర్వమునకు - ఖగోళ సంఘటనకు
సంబంధము ఏవిధముగా ఉన్నది అన్నది ఒకసారి చూద్దాము. ఆశ్వయుజ బహుళ చతుర్దశి ఆకాశంలో రాశులస్థితిని
సూచించుతుంది. అమావాస్య తో తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి
క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే
అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ
సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి
తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత.
దాన్ని అధిష్ఠించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు సూర్యభగవానుడు ( ఇక్కడ
విశేషమేమిటంటే అత్యంత వెలుగు కల ఆపరాత్పరుని మనముచూస్తే మనకు కనిపించేది నలుపు
రంగే, అందువల్ల ఆయనను నల్లనివాడని అనుకొంటున్నాము.)
సత్యభామ చంద్రవర్ణము. (సత్యభామ భూదేవి అంశ కావున ఆమె చందన వర్ణ అంటే చంద్రవర్ణమని
తలచుకొని, ఆమెను
చంద్రునితో పోలుస్తున్నాము.) నరకుడు చనిపోగానే ఆకాశమున తారాదీపచ్ఛాయల్లో కన్యారాశి
(కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యుని అంటే కృష్ణుని
నాయకునిగా చేసుకునింది. కాల చక్రము నరక బాధలకు ప్రతీకయైన నరకుని ఖండించి, అమావాస్య
తిమిరములో పున్నమిని ప్రతిష్ఠించిన రోజు. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి
నిదర్శనము. స్త్రీలను సదా కాపాడవలేనన్న సంకేతమును మనకందజేయుటయే గాక శక్తికి
ప్రతీకయై నిలచినది. కొన్ని పురాణాలలో అసలు నరకుడు సత్యభామ చేతిలోనే మరణించినట్లు
చెప్పబడినది.
చతుర్దశ్యాం
తు యే దీపాన్
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్ స్వర్గ మాప్నుయుః ||
చతుర్దశినాడు దీపదానం
చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం
సమయంలో నూనెతో తడిపిన, రసాయన
ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి
చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.
ఈ చతుర్దశి యమునికి ఎంతో
ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానమును “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” అన్న
శ్లోకమును చెప్పుకొంటూ చేయాలి. తెల్లవారిన తరువాత చేయు స్నానము నిష్ఫలము. ఆ వేళ
నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో
గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. ఆవిషయమును పుష్ఠి చేస్తూ
పెద్దలు ఈ శ్లోకమును చెప్పినారు.
తైలే లక్ష్మీ ర్టలే గంగా
దీపావళి తిధౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం
తైలాభ్యంగో విధీయతే||
ఇది శాస్త్ర వచనము. ఈ
చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక
నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం
ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.
దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు
గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని
స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది.
యమ
ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని
విశిష్ఠంగా పెద్దలు పేర్కొంటారు. తైలాభ్యంగనము ముగిసిన పిదప యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు
తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాల్చుట మనకు
పెద్దలనుండి సంక్రమించిన ఆచారము. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు
వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని ఆర్యవాక్కు.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో ఝాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక
మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.
నరకాసుర చతుర్దశ్యాం
భానుదర్శన పూర్వచ
యామినీ పశ్చిమే భాగే
తైలాభ్యంగో విధీయతే||
సూర్యోదయానికి ముందు
రాత్రి తుదిఝాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే
ప్రభావం ఋషులు దివ్యదృష్టికి మాత్రమే గోచరింపబడి మనకు అందజేసిన రహస్యం.
అసలు
నరక చతుర్దశి తెల్లవారు ఝాము స్నానానికి ఎనలేని ప్రాముఖ్యత కలదు.'ప్రాతః స్నానం తు యః కుర్యాత్
యమలోకం నపశ్యతి' సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము
అరుణోదయము ఆలోగా చేయాలి. స్నానమధ్యంతరములో ఉత్తరేణి మొదలగు కొన్ని చిన్న చిన్న
వృక్ష జాతుల మండలను శిరసు చుట్టూ త్రిప్పి స్నానము చేయమని శాస్త్రమున వున్నది కానీ
నేటి కాల పరిస్తితులకు అది సాధ్యము కాదు.
స్నానం
చేసినవెంటనే ఈ క్రింది శ్లోకాలు చెబుతూ యమతర్పణం చేయాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యవే
చాంతకాయచ!
వైవస్వతాయ కాలాయ సర్వభూత
క్షయాయ చ||
ఔదుంబరాయ
ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|
మహోదరాయ చిత్రాయ
చిత్రగుప్తాయ తే నమః||
అవేవీ
చెప్పలేనివారు దక్షిణ దిశగా తిరిగి యమాయతర్పయామి, తర్పయామి, తర్పయామి. అని మూడుసార్లు
నువ్వులతో వదలగలిగిన చాలును.
దీపదానం
సాయంకాలం ప్రదోషసమయములో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. విష్ణు శివాలయాలలో, ఇవి పెట్టవలెను.
లక్ష్మీపూజ
దీపములు వెలిగించి అందు
లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.
అర్థరాత్రి పౌరస్త్రీలు
చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి
దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.
విష్ణుమూర్తిని, బలిచక్రవర్తి తాను ఆశ్వయుజ
బహుళ చతుర్దశి అమసవాస్య ఆ తరువాతి రోజు తాను పాతాళంనుండి వచ్చి భూలోకాధికారం
చేసేవిధముగానూ, అమావాస్య నాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట
లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ వరం కోరుకొన్నాడట.
అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు
వాయించటం, ఉల్కాదానం
వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది.
వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి
క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం
అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః l
జలే స్థలే యే నివసంతి జీవాః l
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః l
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః ll
అన్న ఈ శ్లోకమును చెప్పుకొంటూ దీపములను కార్తీక
మాసమంతా వెలిగించి పంౘల వద్ద వుంౘవలసి యుంటుంది.
'జ్ఞాత్వా
కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది.
కాని తెలిసి చేస్తే తృప్తి కూడా కలుగుతుంది.
దాసరి తప్పులు దండముతోసరి.
స్వస్తి
Saturday, 30 September 2017
ఆర్య వైశ్యులు
ఆర్య లేక ఆర్యాంబ అన్నది అమ్మవారి బహుళ నామావళిలో ఒకటి. విష్ణువర్ధనుని ఏలుబడిలోని పెనుగొండ రాజ్యమునేలిన కుసుమశ్రేష్టి కుమారితగా జన్మించి, వయోదికుడగు విష్ణువర్ధనుడు ఆమెను మోహించి వివాహము చేసుకోను ప్రస్తాపన కుసుమ శ్రేష్టి గారి ముందు ఉంచితే, వాసవి తన తండ్రితో తానూ వివాహము చేసుకోను ఉద్దేశ్యమే లేదని చెబుతుంది. రాజు ఆగ్రహోదగ్రుడై దండెత్త దలచినపుడు తనకు బాసటగా 714 గోత్రములయందలి 102 గోత్రములవారు నిలచుతారు. ఆమె జీవచ్ఛవాలుగా బ్రతికేకంటే ప్రాయోపవేశము చేయుట సముచితమని వ్గారికి తెలుపుతుంది. ఆమెను మహాత్మురాలిగా గుర్తించి కుసుమశ్రేష్ఠి మొదలగువారు ఆమెను గూర్చి ప్రశ్నించుతారు. తానూ ఆర్యామ్బానని తెలియజేస్తూ వారికి తన దివ్యదర్శనమునొసంగి తనతోబాటు అగ్నికి ఆహుతి కమ్మని చెబుతుంది. వారంతా తిరిగీ ఆర్యవైశ్యులుగా, వాసవాంబ వారి ఇలవేల్పుగా తిరిగీ భూమిపై అవతరించుతారు. ఆర్య అన్న అమ్మయొక్క నామమును ఆలంబనగా చేసుకొని వారు ఆర్యవైశ్యులైనారు. ఆర్య అన్న మాటకు శ్రేష్ఠము అన్న అర్థము ఉండుటవల్ల వారు శ్రేష్ఠి యన్న బిరుదమును వారు కలిగియున్నారు. శ్రేష్ఠి అన్న తత్సమ శబ్దమునకు వికృతే 'శెట్టి'. ఆ విధముగా ఈ శబ్దము ఎంతో గౌరవార్థమును కలిగియున్నది.
నిబద్ధతతో ఒకపనిని సదా ఆచరించుతాను అన్న భావనను వర్తన అని అనుట కద్దు. ఈ వర్తన దురాశతో ముడిపడితే దుర్వర్తన అవుతుంది. పరిమితి ఏర్పరచుకొంటే సద్వర్తన అవుతుంది. అట్టి సక్రమమైన పరిమితితో సమాజములోనికి అడుగు పెట్టినవారే వర్తకులు. అసలు శ్రేష్ఠులైనవారు కావున నాడు వారు వర్తకులైనారు.
ఇది కలికాలము. ఇది వంచన ‘కల’ కాలము. సంపదకు ‘ఆకలి’ కాలము. మోసపు మూ’కల’ కాలము. అందుచే ఎంతోమంది వ్యాపారులితే అయినారుగానీ వృత్తి పై నిష్ఠ లేదు. అట్లని అందరూ నిష్ఠ లేనివారేనా అంటే అది సమంజసము కాదు. నీతినియమములన్న పట్టాలపై నేటికి కూడా నడిచే ఆర్య వైశ్యులుండుటచే వాసవాంబ చల్లని చూపుల బాటలో పయనించుతూ, తమ లాభములో 10 శాతము నేటికినీ ప్రజా హితమునకు సంఘ సేవకు దోహదపడుచున్నారు. ఆతల్లికి కృతజ్ఞతగా దసరా ఉత్సవాలను ప్రొద్దుటూరి వైశ్యులు ఎంత ఘనంగా చేస్తారో చెప్పుట, తలకందని విషయము. అమ్మకు అంతటి కృతజ్ఞులు వారు. మైసూరు లో వలె మహారాజు జరిపించడు ఇక్కడ, వైశ్యుల కష్టార్జితముతోనే జరుపుతారు.
పేదరికపు పంచన నిలచిన నేను, మా తండ్రిగారి పట్టుదల, వితరణ పరులైన వైశ్యుల ధన సహాయము వల్ల P.U.C. నుండి P.G. వరకు చదువగలిగినాను. ప్రచారము వారి ఆచారము కాదు. నాటి దాతలకు ఈ విధముగా కృతజ్ఞత తెలుపుకొనగల్గుట నా సుకృతము. వర్ణములు వుండి కూడా ఆంగ్లేయులు రాకమునుపే కాదు వచ్చిన తరువాత కూడా, 1917 వ సంవత్సరములోRe.1= 13$ లు గా వుండినది. 1947 కు అది Re.1=$1అయినది. ఈ రోజెంత? రూపాయి విలువ అన్నది మనము చెప్పనవసరము లేదు, తెలిసినదే కాబట్టి. మన పాటికి మన ధర్మమును పాటించనివ్వకుండా చేసి మన ఐక్యతను చిన్నా భిన్నము చేయుటచే మనకీదశ దాపురించినది.
వారి దీక్షాదక్షతకు ఇవే నా నమస్సుమాంజలులు.
స్వస్తి.
Thursday, 14 September 2017
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు
Monday, 11 September 2017
అవధానం - సమస్యాపూరణం - దత్తపది
అవధానం - సమస్యాపూరణం -
దత్తపది
https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post_11.html
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక
విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు
కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ
ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ
సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ,
అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు
చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని
చేసే సాహితీ విన్యాసమే అవధానం.
ఇందులో అవధానికి అతిముఖ్యమయినవి ధార, ధారణ,చమత్కృతి,
సమయస్ఫూర్తి. ఇందులో ఏది కొరవడినా అవధానము
రక్తి కట్టదు. అందుకే
అవధానమును అసిధారా వ్రతమన్నారు.
తిరుపతి వేంకటకవులు అవధానమునకు ఆద్యులు
కాకపోయినా ఆవిద్యను
దశదిశల వ్యాపింపజేయుటకు ఆద్యులు వారే.
ముఖ్యముగా ఈ అవధాన విద్యలోని
సమస్యా పూరణములోనూ, దత్తపదిలోనూ బాహిరముగా అశ్లీలము అగుపించినా
దానిని వేటగాడు వాల్మీకియైన చందమున తమ
ప్రజ్ఞాపాటవమును జతజేసి
అవధానులు పూరించుట కద్దు. ఆశుకవితా
సంప్రదాయానికి ఇది కొత్త ఊపిరి.
తిరుపతివెంకట కవులకు ముందు
అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు
ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు
వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే
వున్నాము. వీరికి పృచ్ఛకులుగా
ఉభాయభాషలలోనూ మహా ఉద్దండులు ఉండేవారు. ఒక
అవధాన సభలో వారికి
ఇచ్చిన సమస్య: ‘సంధ్యావందనమాచరించ వలదా
చౌశీతి బంధంములన్’. ఇది
సాధారణ సమస్య కాదు. భాషా విభవము మిక్కిలి
ఎక్కువగా వున్నవారు మాత్రమే
చక్కగా పూరించగలరు, తమ సమయస్ఫూర్తిని జతజేస్తూ. లేకుంటే
సంధ్యావందనమెక్కడ చౌశీతి బంధములు (84 విధములగు బంధములు) ఎక్కడ.
వారు పూరించిన నైపుణ్యమును గమనించండి:
వింధ్యాద్రిప్రభలొప్పు బల్కుచములన్
వేపట్టి పెంపొందు కా
మాంధ్యంబార్పగలేక వేర్రివయి ఎలా మంచి ఈ
రాతిరిన్
సంధ్యన్ జేసెదు కాముకేళి యనగా సాహిత్యమా
లేక నీ
సంధ్యావందనమా! చరించ వలదా చౌశీతి
బంధంములన్
మరి ఇచట శృంగారపరముగా చెప్పుట తప్పనిసరి.
అంతమాత్రముచే వారి
పాండితీగరిమను తప్పుబట్ట వచ్చునా!
ఇక 20 వ శతాబ్దములో
అవధానమే తన వృత్తి మరియు ప్రవృత్తిగా చేసుకొని
కుటుంబ పరమైన వ్యాపారమునకు పెద్దపీటవేయక, అవధానమే ప్రధానముగా
చేసుకొనుచూ గడియారము వెంకటశేష శాస్త్రి
గారి ప్రియశిష్యుడై మహా మహా
ఉద్దండులైన నాటి పండితులను పృచ్ఛకులుగా
కలిగి లోకాన్ని ఒప్పించి మెప్పించిన
అనర్ఘ అవధాన రత్నము C.V. సుబ్బన్న శతావధాని గారు. నాటి ఆయన
పృచ్ఛకులలో గడియారము వెంకటశేష శాస్త్రి
గారు, దుర్భాక రాజశేఖర
శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యులవారు, విశ్వనాథ సత్యనారాయణ
గారు, వెంపరాల
సూర్యనారాయణ శాస్త్రిగారు, గంటి జోగి సోమయాజి
గారు, దీపాల పిచ్చయ్య
శాస్త్రిగారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తుమ్మల
సీతారామమూర్తి చౌదరి గారు, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు,
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పేరి
సూర్యనారాయణ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు, బోయి భీమన్న
గారు, దాశరథి గారు
సినారె గారు, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చేంతాడంత
పట్టిక తయారవుతుంది ఉండగా అవధానమును పండించిన
నిండుకుండ ఆయన. అన్నిటికీ మించి వీరి అవధానము శంకరాచార్య పీఠమున చంద్రశేఖర
యతీంద్రుల
వారి పనుపున జరిగినపుడు సంస్కృతి, సంస్కృత శిరోమణి యగు జయేంద్ర సరస్వతి
స్వాములవారు పృచ్ఛక స్థానమును అలంకరించి
వారికి దత్తపదిని ఇచ్చియుండినారు.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభకు
ఆదరపూర్వకముగా ఆహ్వానింబడి, అత్యున్నత,
అద్వితీయ గౌరవమును బడసిన ఆదియవధాని వీరే!
ఈ ఉపోద్ఘాతమంతా
ఎందుకంటే పైకి అశ్లీలముగా కనిపించే
దత్తపది,
సమస్యలు పైన తెలిపిన
మహామహులలో కొందరిచ్చినా సుబ్బన్న గారు ఎంత
గొప్పగా ఏమాత్రమూ
అశ్లీలమునకు తావివ్వక పూరించినారో
తెలియజేయుటకే! వీరు పూరించిన ఒక
సమస్య :’ మీనాక్షికి కుచాములారు
మీసములేడున్’
ఆనాడు ప్రోద్దువోయెను
జానయు తత్పతియుగూడి సరి క్రీడింపన్
లూన ముకురమున దోచెన్
మీనాక్షికి, కుచములారు మీసములేడున్
ఒకానొకరోజు తమకముతో తల్లడిల్లిన దంపతులు
ఒకరికొకరు తీసిపోక
పెద్దప్రోద్దు క్రీడించిరి. అద్దము
చిట్లినది (లూన ముకురము) అన్న జ్ఞాపకము కూడా
వారికి లేదాయే. అలసిన మీనాక్షి అనుకోకుండా
అద్దములో చూస్తే ఆరు
కుచములు ఏడు మీసములు కనిపించినవట.ఇక్కడ
కవి ‘మీనాక్షి’ అన్న
పదమును సాభిప్రాయ విశేషణముగా చేసినాడు.
కామోద్రిక్తయైన మగువ
తత్సమయమున మత్స్యస్ఫూర్తి పొందునన్నది శాస్త్ర వచనము.
ఆశువుగా చెబుతూ
కూడా ఎంత గొప్పగా పూరించినారో చూడండి.
ఇందులో చూడవలసినది
చమత్కారముకానీ శృంగారము కాదు.
సందర్భానుసారముగా స్పందించినవాడే
నిజమయిన శ్రోత లేక పాఠకుడు.
ఇక ఆయన అవధానము చేయు కాలములోనే మహామహులగు
పృచ్ఛకులు
ఆయనకు అలనాటి సినిమా తారామణుల పేర్లు
దత్తపదిగా ఇవ్వటము
తటస్తించినది. గమనించండి:
భానుమతి, అంజలి, జయప్రద, జమున
సీత హరించె భానుమతి శిష్ట గతిన్ జని
రావణుండు,
త
జ్ఞాతిని సంహరింప యతి సంఘము గోరగనంజలించి, దో
ర్భూతి జయప్రద ప్రథనమున్ నడిపించి
రఘుప్రవీరుడా
క్రోతి యశోక భూజమునకున్ బ్రధితత్వము
గూర్చె శూరుడై
భానుమతి = ప్రకాశవంతమైన అంటే
జ్ఞానియయ్యును సన్యాసి వేషములో సీతను
అపహరిచగా, అరాచాకములు సేయు ఆతనిని సంహరించమని ఋషిగణము
అడుగగా (ఇచ్చట జ్ఞాతి అన్న శబ్దము
ఉపయోగింపబడినది, పులస్త్యుడు బ్రహ్మ
మానస పుత్రుడు మరియు మహర్షి. బ్రహ్మ మానస
పుత్రులగు మిగత మహర్షుల
సంతతికి రావణుడు జ్ఞాతియే కదా!) భయంకర (దోర్భూతి
జయప్రద ప్రథనము =
జయప్రదమైన భయంకర యుద్ధము) చేసి కోతికీ
(హనుమంతునికి), అశోక
వృక్షమునకు యశస్సు(ప్రధితత్వము) ను
గూర్చెను.
ఆ కాలముననే ఇటువంటి దత్తపదుఇలు ఉండినవి
అని తెలుపుటకు ఈ పద్యము
ఉటంకించినాను. ఇక్కడ చూడవలసినది సినీతారల
పేర్లుకాదు. అందులోని
వరుస అక్షరములను భిన్న పాదములలో యథా తథముగా
వాడి ఎట్లు రక్తి
కట్టించినారు అన్నది గమనించవలసిన విషయము.
అసభ్యత అశ్లీలత ఆవగింజంత
కూడా కనిపించవు పూరణలో. ఆమాటకొస్తే ఆ
పద్యము కవియొక్క ఊహాశక్తికి
అద్దము పడుతుంది. ఈవిధమైన తారల పేర్లతో
నేను నింపాదిగా పూరించిన
పద్యమును ఒక పండిత పాఠకుడు (నాకు
అన్నయ్యతో సమానము) సినిమాతారల
పేర్లెందుకు అని నిరసించుతూ మీరు కూడా
అవధానియైపోయినారు అని అనటము
జరిగినది. వారి మాటను ఆశీస్సుగా తీసుకొని, పరమాత్ముని వచ్చే జన్మలో నాకూ అంతటి ధిషణ ప్రసాదించమని కోరుకొంటాను. ఈ విధమైన ప్రయత్నము చేయుట వల్ల ధీజడిమ తగ్గి ధీపటిమ పెరుగుతుంది. నేర్పుగలవారు ఇటువంటి ప్రయత్నము చేయుట మంచిది. నేను చేసినదీ అటువంటి ప్రయత్నమే . తప్పేమీ నాకు గోచరము కాలేదు.
ఇక మాడుగుల వారిని గూర్చి: ఈ కాలములో ఆయన అశేష శేముషీ దురంధరుడు, అపార పాండితీ ధిషణాలంకృతుడు. నా దృష్టిలో ఆయన వాక్పతి మరియు పుంభావ సరస్వతి.శృంగేరి పీఠాధిపతి సంస్కృతావధానము చేయించనెంచి ఆయనను పిలువనంపి ఏర్పాటు చేయించినారు. తాను తెలుగు పండితునిగా పనిజేసిన కడప రామకృష్ణ జూనియర్ కాలేజి లో పనిచేసిన కాలములో ప్రిన్సిపాల్ గా వుండిన శ్గోరీయుతులు గోపాల కృష్ణమూర్తిగారు తాను వ్రాసిన పుస్తక ఆవిష్కరణకు అధ్యక్షత వహించమని ఆహ్వానించితే తన ఖర్చులతో హైదరాబాదు నుండి కడప జిల్లాలోని బద్వేలు తాలూకాలోని బ్రాహ్మణపల్లెకు పోయి ఆపని నిర్వహించి అందరికీ ఆనందము పంచినారు. అంతటి కృతజ్ఞతామూర్తి యతడు.
ఆయన చరవాణి సంఖ్య తెలుసుకొని నేను ఆయనతో పునః
పరిచయము చేసుకొంటూ SBI-ZO-తిరుపతిలో ఆయన అవధానమును
ఏర్పాటుచేసిన విషయము గుర్తుచేస్తే కష్టకాలములో
వున్నపుడు నాలోని
ప్రత్యేకతను గుర్తించి తగువిధముగా
సన్మానించిన మీ వంటివారిని మరచిపోను
అన్నాడు. అది ఆయనలోని సద్గుణము. గుర్తింపు
దొరికిన పిమ్మట ప్రతివ్యక్తిలోనూ
మంచి చెడు చూచుట సహజము, కానీ అది సందర్భానుసారముగా ఉండుట
ఎంతో అవసరము. మనము హంసలమై క్షీరమును గ్రోలి
నీటిని విడుచుట
మంచిది. కానీ శర్మ గారు అట్లుకాదు. వారొక అన్ని పదార్తములూ వడ్డించిన ఆకు.
వారి ఆశు కవితాధారకు ప్రతీకగా ఒక శ్లోకము ఇక పద్యము మీ ముందుంచుచున్నాను.
అనుష్టుప్ ఛందో శ్లోకములో ఉండే అక్షరాల సంఖ్య 32. 14 అక్షరాలూ రూపు తేరా మస్తానా ప్యారుమేరా దీవాన రూపములో పృచ్ఛకులు ఇవ్వగా శ్రీరామ పరంగా ఆ హిందీ శబ్దములను సంస్కృత భాషానుగుణముగా కేవలము తాను స్వంతముగా వాడిన 18 అక్షరములు కలిపి ఎంత మనోజ్ఞముగా ఆశువుగా తెలిపినారో చూడండి.
నీలాభర రూపతేరామ సమస్తానాం శుభంకర
తత్తధాప్యారమే రామే నదీవానంద వర్ధన
వేరొక అవధానములో వారి పూరణ
ఒక చిన్న తేటగీతి పద్యములో ప్రళయము,రౌద్రము. భీభత్సము, వాత్సల్యము లను ఉపయోగించుతూ దఖ నిరీశ్వర యజ్ఞ ధ్వంసమును వర్ణించిన ఈ అసమాన ప్రతిభను గమనించండి.
ప్రళయ దీప్తివి అంబికా ప్రణయ మూర్తి
నిరత రౌద్రప్రసార నిర్నిద్రకీర్తి
నెరయు భీభత్స రసమెల్ల కరగి కరగి
ఒదిగి వాత్సల్య రసమౌను సదయ నిలయ
నేనసలు ఒక నాలుగు దినముల క్రితము
ప్రచురించిన దత్తపది ప్రజ్ఞ కలిగిన
యువతను ప్రోత్సహించుటకే! నేనేమీ తప్పు
చేయలేదు. అటువంటివి నాకు
తోచినపుడు ఆస్య గ్రంధి లో పెడుతూ వుంటాను, యువత స్పూర్తిని పొందుతారన్న
నమ్మకముతో! నేడు మనకూ, మన తెనుగుకూ
జగద్విఖ్యాతిని ఒనగూర్చుచున్న
మహా పండితులను, మహా అవధానులను, మహాకవులను
మనసారా గౌరవించి
మన తెలుగునకు సాతియగుభాశాలేదని జగతికి
చాటుదాం. మనది “Italian Of
The East’
కాదు, వాళ్ళది ‘Telugu of the West’ ఎందుకంటే
ఆ భాషలు
పుట్టకమునుపు వేల సంవత్సరముల క్రితము
పుట్టిన భాష మనది. చివరిగా ఒక
మాట. ఒకరినొకరు గౌరవించుకొంటే వాతావరణము
సుహృద్భావముతో నిండి
ఆహ్లాదకరముగా ఒప్పారుతుంది.
ఆదిశగా అడుగేద్దాం.
స్వస్తి.