Showing posts with label ఎంతో ఘనమైనదీపావళి రాను రాను కొడిగట్టి కొండ ఎక్కుటకు సిద్ధముగా ఉన్నది.. Show all posts
Showing posts with label ఎంతో ఘనమైనదీపావళి రాను రాను కొడిగట్టి కొండ ఎక్కుటకు సిద్ధముగా ఉన్నది.. Show all posts

Thursday, 12 October 2017

నరక చతుర్దశి – దీపావళి

అత్యంత ఘనమైన మరియు సాంప్రదాయ బద్ధమైన ఈ పండుగను మానవద్దు సరికదా ఎంతో ఉల్లాసము తో ఉత్సాహముతో చేసి మన సహేతుకము శాస్త్రబద్ధము అయిన మన ధర్మమును కాపాడండి.

నరక చతుర్దశి దీపావళి

లంకె: 

https://cherukuramamohan.blogspot.com/2017/10/blog-post.html

నరక చతుర్దశి దీపావళి ప్రాధాన్యత ప్రాముఖ్యత పై లంకెలో చదవండి.

ఎంతో ఘనంగా జరుగవలసిన దీపావళి రాను రాను కొడిగట్టి కొండ ఎక్కుటకు సిద్ధముగా ఉన్నది. తర్కబద్ధమగు మన పండుగలను శ్రద్ధతోను, భక్తి తోనూ, శక్తిమేరకు ఘనంగానూ ఆచరించి  మన ధర్మమును ఉద్ధరించుదాం. జనవరి 1న ప్రపంచమంతా ఎన్నో విధములగు పటాసులను కాలుస్తారు. అర్ధరాత్రి పండుగలు మానవేతరులు మాత్రమే చేస్తారు. మదిరా మదమాంసభక్షణ మగువా పరిష్వంగము వారి పర్వదినపు వేడుకలు. ఆ జుజుగుప్సాకర పద్ధతులు ఇటు వాతావరణమునే కాక అటు నైతిక కాలుష్యమును చేయుట లేదా! మరి వానికి కాలుష్యము అంటదా! ఒక భారతదేశములో దీపావళి రోజే పటాసులు కాల్చుటచేత వాతావరణ కాలుష్యము ఏర్పడుతుందా! ఇది చోద్యముగా లేదా! ఇది కాకుండా, అసలు శాస్త్రపరమైన పండుగే కాని  క్రిస్మస్ ను గొప్ప పండుగగా చేసి మన దీపావళి ఆచారములను ఇప్పటికే, పటాసులు కాల్చుట, బంధు మిత్ర సందర్శనము, మిఠాయి

అసలు పటాసులు కాల్చుట ఆనాడే మన నుండి తస్కరించినాఋ పరమతస్తులు. కానుకలు, పంపకములు మొదలగు విషయములను తస్కరించినారు. అసలు శాంటాక్లాస్ అన్నవ్యక్తికి ఒక చారిత్రికాధారము లేదు. అతనికీ క్రిస్మస్ కు ఏ సంబంధమూ వారి బైబిల్ లో కనిపించదు.  ధర్మాన్ని కాపాడండి. మన ఉనికి ధర్మముతోనే ముడిపడి ఉంది. ‘వందే మాతరం’ అన్న నినాదమును మరువ వద్దు. నరక చతుర్దశి-దీపావళిని గూర్చి ఈ దిగువ లంకెలో సవిస్తారముగా చదవండి. 

ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మానో  ధర్మ హతో వదీత్ll మనుస్మృతి 8.15

నరక చతుర్దశి  దీపావళి

తెలుగు మాసములలో ఆశ్వయుజ మాసము అత్యంత ప్రముఖమైనది. చైత్రాది 6 మాసములలోని మొదటిదయిన చైత్రములో మనకు వసంత నవరాత్రులు(రామ నవరాత్రులు) వస్తాయి. మిగిలిన ఆశ్వయుజాది 6 మాసములలోని మొదటి మాసమయిన ఆశ్వయుజములో శరన్నవరాత్రులు వస్తాయి. అసలు వసంత, శరత్ ఋతువులు ఎంతో ఆహ్లాదమును కలిగించే ఋతువులు. ఉల్లాసము కల మనస్సును పరదైవమునకు అంకితము చేయుట ఎంతో సులభము. అటు వసంత నవరాత్రులు ఇటు శరన్నవరాత్రులు సమశీతోష్ణ స్థితి కలిగి ప్రాణి కోటికి ఆనందాన్ని సమకూరుస్తాయి . శరన్నవరాత్రుల తరువాత ఆ మాసపు చివరిలో వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి అమావాస్య. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి.

 మనము ఎంతో వేడుకతో చేసుకొనే ఈ నరక చతుర్దశి, దీపావళి కి ఒక ప్రత్యేకమయిన ప్రాధాన్యత వుంది.  ఈ పండుగలు రెంటినీ  ఒక రాక్షసుని మరణాన్ని మనము ప్రకటించి జరుపుకొంటున్నాము. భూదేవి సత్యభామావతారమని, శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారమని, నరకాసురుడు భూదేవి కుమారుడనీ అన్న కథను ఎన్నోమార్లు మనము విన్నాము. అందువల్ల ఆ విషయము జోలికి నేను పోవుట లేదు.

ఇక్కడ ఒక్క మాట ముఖ్యమయినది చెప్పుకొని ముందునకు సాగుదాము. ఆశ్వయుజం అనగా గుఱ్ఱముల పూనిక. గుఱ్ఱములు అనగా మన ఇంద్రియాలు. ఆ గుఱ్ఱాలను మనస్సు అనే పగ్గాలతో కట్టి శరీర రథాన్ని పరమాత్మ వైపు పయనింప చేయాలి. ఈ ప్రయాణంలో చీకటిని, సుదర్శనంతో అంటే మంచినిమాత్రమే దర్శించుతూ, అనగా చక్కటి జ్ఞానంతో తొలగించడం నరకాసురుని వధ. అమావాస్య చీకటి యొక్క పరాకాష్టతకు  ప్రతీక. అదేవిధముగా చీకటి జ్ఞానమును మన స్మృతిపథము లోనే లేకుండా చేసి, అజ్ఞాన తిమిరమును ఆవరిపంప జేస్తుంది. అజ్ఞానము ఆవహించిన వ్యక్తికి, అంతా ఉదాసీనతే, నిర్లిప్తతే, అట్లు కాదు అంటే కుళ్ళు, కుట్ర, కుత్సితము, కుతంత్రము,క్రూరత్వము గూడుకట్టుకొని ఉంటాయి. ఇవన్నీ దుఃఖహేతువులే! ఈ దుఃఖము తోలగాలంటే మనకు సుదర్శనము కావాలి. దు:ఖం తొలగితే ప్రసరించేవి వెలుగురేఖలే, ప్రతి గుమ్మంలో వెలిగే దివ్వెలు అవే! ప్రతి హృదయంలోని ఆత్మ అంటే పరమాత్మకు ఇచ్చే  మంగళహారతులు అవే! అదే దీపావళి.
మన అర్ష ధర్మములో ప్రతి పండుగకు ఒక శాస్త్ర పరమయిన కారణము వుంటుంది. ఇతర మతములలో ఈ తర్కమునకు తావివ్వరు. క్రైస్తవులు ఎంతో సంబరముగా జరుపుకొనే క్రిస్మస్ క్రీస్తు జన్మదినముగా చెబుతారు. ఎన్నో మార్లు తమ కేలెండర్ ను మార్చుకొన్న వారు 25డిసెంబరు క్రీస్తు పుట్టిన రోజు అని ఎట్లు చెబుతారు. చివరిసారిగా తమ కేలెండరును సవరించిన పోప్ గ్రెగొరీ  1582లో అక్టోబరు నెలలో 4వ తేదీ తరువాత 14తేదీని ఏర్పరచి 10రోజులను ఇంద్రజాలములో ఇరికించినాడు. అటువంటపుడు 25డిసెంబరు ఏవిధంగా క్రీస్తు పుట్టిన రోజు అవుతుంది. మరి క్రీస్తు శకమునకు ప్రారంభము అదియే కావలెను కదా! అంటే డిసెంబరు 25 ను చెరిపి దానిని తరువాతి సంవత్సరము (వారి పద్ధతి ప్రకారము) జనవరి 1 గా చేయవలసి వస్తుంది. ఇక ముస్లీముల పండగలు ఇంచుమించు 1500 సంవత్సరముల నాడు, అనగా వారి మతము పుట్టిన తరువాత ఇతర మతాలకు పండుగలు వుంటే అటువంటివేవో  తమకూ ఉండవలెనని ఏర్పరచుకొన్నవి. వాళ్లలో ఎక్కువమందికి ఆ పండుగ ఎందుకు జరుపుకొంటారు అన్నది తెలియదేమో అనిపిస్తుంది. అందుకే మేకల పండగ రోజు (బక్రీద్) ఆవులను చంపుతారు, ముఖ్యముగా మన దేశములో. రంజాన్ నెలలో పగలు ఉపవాసమువుండి రాత్రికి వారు కోరుకొన్నవి కోరుకొన్నన్ని మార్లు తింటారు. ఇక ముహర్రము షియాలకు మాత్రమె! సున్నీలకు లేదు. మరి మన పండుగలు అట్లు కాదు.
ఈ దీపావళి పండుగ విషయములో, ఈ పర్వమునకు - ఖగోళ సంఘటనకు సంబంధము ఏవిధముగా ఉన్నది అన్నది ఒకసారి చూద్దాము.   ఆశ్వయుజ బహుళ చతుర్దశి   ఆకాశంలో రాశులస్థితిని సూచించుతుంది. అమావాస్య తో తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్ఠించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు సూర్యభగవానుడు ( ఇక్కడ విశేషమేమిటంటే అత్యంత వెలుగు కల ఆపరాత్పరుని మనముచూస్తే మనకు కనిపించేది నలుపు రంగే, అందువల్ల ఆయనను నల్లనివాడని అనుకొంటున్నాము.) సత్యభామ చంద్రవర్ణము. (సత్యభామ భూదేవి అంశ కావున ఆమె చందన వర్ణ అంటే చంద్రవర్ణమని తలచుకొని, ఆమెను చంద్రునితో పోలుస్తున్నాము.) నరకుడు చనిపోగానే ఆకాశమున తారాదీపచ్ఛాయల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యుని అంటే కృష్ణుని నాయకునిగా చేసుకునింది. కాల చక్రము నరక బాధలకు ప్రతీకయైన నరకుని  ఖండించి, అమావాస్య తిమిరములో పున్నమిని ప్రతిష్ఠించిన రోజు. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనము. స్త్రీలను సదా కాపాడవలేనన్న సంకేతమును మనకందజేయుటయే గాక శక్తికి ప్రతీకయై నిలచినది. కొన్ని పురాణాలలో అసలు నరకుడు సత్యభామ చేతిలోనే మరణించినట్లు చెప్పబడినది.

 చతుర్దశ్యాం తు యే దీపాన్‌

నరకాయ దదాతి చ|

తేషాం పితృగణా స్సర్వే

నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానమును సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” అన్న శ్లోకమును చెప్పుకొంటూ చేయాలి. తెల్లవారిన తరువాత చేయు స్నానము నిష్ఫలము. ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. ఆవిషయమును పుష్ఠి చేస్తూ పెద్దలు ఈ శ్లోకమును చెప్పినారు.

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌

అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||

ఇది శాస్త్ర వచనము. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది.

 యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్ఠంగా పెద్దలు పేర్కొంటారు. తైలాభ్యంగనము ముగిసిన పిదప యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాల్చుట మనకు పెద్దలనుండి సంక్రమించిన ఆచారము. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని ఆర్యవాక్కు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో ఝాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.

 

నరకాసుర చతుర్దశ్యాం భానుదర్శన పూర్వచ

యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||

సూర్యోదయానికి ముందు రాత్రి తుదిఝాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికి మాత్రమే గోచరింపబడి మనకు అందజేసిన రహస్యం.

 అసలు నరక చతుర్దశి తెల్లవారు ఝాము స్నానానికి ఎనలేని ప్రాముఖ్యత కలదు.'ప్రాతః స్నానం తు యః కుర్యాత్‌ యమలోకం నపశ్యతి' సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము అరుణోదయము ఆలోగా చేయాలి. స్నానమధ్యంతరములో ఉత్తరేణి మొదలగు కొన్ని చిన్న చిన్న వృక్ష జాతుల మండలను శిరసు చుట్టూ త్రిప్పి స్నానము చేయమని శాస్త్రమున వున్నది కానీ నేటి కాల పరిస్తితులకు అది సాధ్యము కాదు.

 స్నానం చేసినవెంటనే ఈ క్రింది శ్లోకాలు చెబుతూ యమతర్పణం చేయాలి.

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!

వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ||

 ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|

మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||

 అవేవీ చెప్పలేనివారు దక్షిణ దిశగా తిరిగి యమాయతర్పయామి, తర్పయామి, తర్పయామి. అని మూడుసార్లు నువ్వులతో వదలగలిగిన చాలును.

 దీపదానం

సాయంకాలం ప్రదోషసమయములో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. విష్ణు శివాలయాలలో, ఇవి పెట్టవలెను.

లక్ష్మీపూజ

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.

విష్ణుమూర్తిని, బలిచక్రవర్తి తాను ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమసవాస్య ఆ తరువాతి రోజు తాను పాతాళంనుండి వచ్చి భూలోకాధికారం చేసేవిధముగానూ, అమావాస్య నాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ వరం కోరుకొన్నాడట.

అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః l 

జలే స్థలే యే నివసంతి జీవాః l 

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః l

భవన్తి త్వం శ్వపచాహి విప్రాః ll

అన్న ఈ శ్లోకమును చెప్పుకొంటూ దీపములను కార్తీక మాసమంతా వెలిగించి పంౘ వద్ద వుంవలసి యుంటుంది.

'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసి చేస్తే తృప్తి కూడా కలుగుతుంది.

దాసరి తప్పులు దండముతోసరి.

స్వస్తి