Showing posts with label సింహము చీల్చిన నుగు కుంభస్థలమునకు దానిమ్మ పండునకు పోలిక. Show all posts
Showing posts with label సింహము చీల్చిన నుగు కుంభస్థలమునకు దానిమ్మ పండునకు పోలిక. Show all posts

Thursday, 10 June 2021

సింహము చీల్చిన నుగు కుంభస్థలమునకు దానిమ్మ పండునకు పోలిక

సింహము చీల్చిన నుగు కుంభస్థలమునకు  

దానిమ్మ పండునకు పోలిక

https://cherukuramamohan.blogspot.com/2021/06/blog-post.html

కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా 

కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” 

అనగాసూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని 

ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ 

గింజలు కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి సాధారణమైనఆ 

 దానిమ్మ గింజలను కవి ఎంత అద్భుతంగా వర్ణించినాడో చూడండి. ఆ చిలుక తినే 

దానిమ్మ గింజలు. “ హరి నఖర భిన్న మత్త మాతంగ కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” అని అన్నాడు. హరి అన్న మాటకు అనెకానేకమగు అర్థములు కలవు. ఇక్కడ హరి అంటే సింహము. సింహము యొక్క నఖర=గోళ్ళతో చీల్చబడిన మదించిన ఏనుగు యొక్క

 కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన ఆ కుభస్తలములోని ముత్యాల, అంటే ఎరుపుతో కూడిన తెలుపు, వలె ఆ దానిమ్మ పండు గింజలు ఉన్నాయట. ఎంతటి ఊహాతీతమైన పోలిక చూడండి. అందుకే

అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః l

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే ll  

కవి కావ్య సృష్టి చేయటంలో బ్రహ్మను బోలినవాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించి ఉత్పత్తి చేస్తాడు. కవి నిరంకుశుడు. అతనికి ఎటువంటి అంక్షలూ ఉండవుకానీ దేశ కాల పరిస్థితులకు అనువుగా సభామర్యాదను పాటించుతూ తన మనోభావాలకు కవితా రూపములో అద్దము పట్టవలసియుంటుంది.

స్వస్తి.