రామచిలుక
https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_26.html
జీవితాన
ఒకరినే ప్రేమించే జీవి నీవు
అందులకే
రామచిలుకవైనావు
నీకెవరూ
సాటిరారు రామచిలుకా
నీసుగుణము
మాకేదీ నిజము పలుక llజీవితానll
చిలుకపచ్చ నీమేనికి చెదరని అందం
దొండపండురంగు ముక్కు నీకే సొంతం
నీఅందం నీచందం అలరించును మాడెందం
నీ రూపం నీ స్నేహం అపురూపం llజీవితానll
నీ తళుకు నీ
బెళుకు నీదగు కులుకు
ముచ్చటైన నీ
పలుకు ముద్దులు చిలుకు
పులుగులవి
ఎన్నున్నా పోలవులే అవినీకు
నీఎంగిలి
జామరుచులు ఎక్కడ దొరుకు llజీవితానll
ఓంకారము నందున అమ్మవు నీవే
శుకయోగికి నాసికము పలుకువు నీవే
అమ్మ కుడిభుజానికి ఆభరణము నీవే
శుకమా నీబాట మాకు కూర్చును సుఖమే
llజీవితానll