నేరెళ్ళ వేణుమాధవ్ గారి మానవత.
నేరెళ్ళ
వేణుమాధవ్ గారి ధ్వన్యనుకరణ కళాప్రతిభను గూర్చి నేను చెప్పుట కేవలము
చర్వితచర్వణమౌతుంది. పై పేచు ఆయనఘనత హిమాలయమునకన్నా ఎత్తయినది, సూర్యునికన్నా వేలుగైనది, సముద్రముకన్నాలోతైనది.
పైపెచ్చు ఇప్పటికే వారిని గూర్చి చెప్పియున్నారు. అందుచే వారివలన నాకు కలిగిన
అనుభవము పంచుకోదలచుకొన్నాను.
వారి
కళా ప్రదర్శన నేను కళాశాల విద్యార్థిగా ఉన్నపుడు N
T రామారావు గారితో వచ్చినపుడు చూచుట తటస్తించినది. ఆతరువాత కూడా
కడపలోనూ తిరుపతిలోనూ చూసినాను. కడపలో చంద్రశేఖర్ గారి అసమాన వైవిధ్య వేషధారణా
ప్రతిభ కూడా చూసినాను, కాలేజీ చదివే రోజులలో.
నాకు
వేణుమాధవ్ గారితో ఎటువంటి పరిచయము లేదు. నేను 1982-83 లో SBI లో
పనిచేస్తున్న
కాలములో SBI-అనంతపురము ఇంజనీరింగ్ కాలేజి
బ్రాంచి లో SAVINGS BANK ACCOUNT Tally 10 సంవత్సరములుగా
కాకుంటే నాకు జేష్ట సహోదర సమానులైన S.నాగభూషణ్ రావు గారిని,నన్ను ఆపనికి గానూ Deputation కు పంపినారు. అది
బ్రాంచ్ అగుటకు మునుపు Sub-Office గా వుండేది. దాదాపు 2 నెలల
కాలము ఆ పనిని చేయవలసి వచ్చింది.
ఒకనాడు
నేనూ, రావు గారు పనిలోబడి రాత్రి
సమయమును మరచిపోయినాము. అది రాత్రి 1 గంట సమయము. వీధి దీపములు కూడా లేవు. వూరికి
చాలా దూరము కాబట్టి వాహన సదుపాయములు లేవు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో బ్రాంచ్
తాళము వేసి బయటికి వచ్చినాము. ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్ లో రంగు రంగుల లైట్లు
వెలుగుతూ కనిపించినాయి. కాలేజీ కార్యక్రమము ఏదో ముగిసినట్లనిపించింది. ఆ రోజు COLLEGE
DAY.
మేము
ఇరువురము, వేరు దారిలేక నడుస్తూ వస్తూ
వుండినాము. అంతలో మా ప్రక్క ఒక VAN ఆగింది. వెనుక కూర్చున్న
వ్యక్తి తలుపు తెరచి లోపలి రమ్మన్నాడు. కృతజ్ఞతా పూర్వకముగా దేవునికి నమస్కరించి VAN
లో కూర్చొని చూతుముకదా ఆ తలుపు తెరిచినా వ్యక్తి వేరేవరోకాదు.
సాక్షాతూ వేణుమాధవ్ గారు. ఇద్దరమూ నమస్కారం సార్ అంటూ కృతజ్ఞతా పూర్వకముగా
నమస్కరించినాము. అనంతపురము ఇంజనీరింగ్ కాలేజీ ఊరికి దూరము. మీరు, మేమేవారము అన్న ఆలోచనే లేకుండా ఎక్కించుకొన్నారు. మీ సహృదయతకు నమస్కారము
అంటూ మాట కలిపినాము. అందుకు ఆ మహానుభావుడు 'ఇంత రాత్రి పూట
చీకటిలో మీరు నడుస్తూవుంటే, పరిచయము లేక పోనీగాక, మానవత్వము చూపించాలి కదా' అన్న ఆయన మాటలు నేను
బ్రతికినంత వరకు మరచిపోలేను. ఈ రోజులలో, ఆ మాటకొస్తే ఆ
రోజులలో కూడా అంతటి ఆదార్యము కలిగినవారు ఆరుదే! పై పెచ్చు ఆయన పేరుమోసిన వ్యక్తి
ఆయె. మావంటి అనామకులను ఎక్కించుకొని పోవలసిన అవసరము లేదుకదా!
ఆయన
మమ్ము ఒక్క క్షణము ఊరక కూర్చోనివ్వక N T
రామారావు గారిని, A. నాగేశ్వర రావు గారిని,
SVR గారిని, గుమ్మడి గారిని, భానుమతి గారిని, దిలీప్ కుమార్ గారిని, పృథ్వీరాజ్ కపూర్ గారిని, 10 కమాండ్మెంట్స్
సినిమాలోని సీన్స్ అండ్ స్పీచ్ Imitate చేసి మమ్ము ఉక్కిరి
బిక్కిరి చేసిన నిష్కల్మష మానవతా హృదయానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను.
మా మా దిగవలసిన స్థలములలో దింపి ఆరోజు వారు తమ బస
చేరుకొన్నారు. అంతటి వ్యక్తికి పరమాత్మ సాయుజ్యము లభిస్తుంది.
ఒక్క విషయము ఆలోచించండి . అంతటి పేరు ప్రతిష్ఠ
కలిగినవారు ఎవరైనా ఇంత సౌమ్యముగా వ్యవహరించ గలుగుతారా! ఒకవేళ వున్నా ఎంతో అరుదు.