Showing posts with label నా గొప్పదనం. Show all posts
Showing posts with label నా గొప్పదనం. Show all posts

Tuesday, 29 April 2014

గోమూత్ర వాహినీ గోదావరిని గెంతి

నవ్వు మానవులకు దేవుడిచ్చిన వరము

ఈ పద్యము లోని విషయాలు వాస్తవాలు కావు. రసానుగుణముగా స్పందించినవారే నిజమైన పాఠకులు. ఇటువంటి విషయాలను పద్యములో చెబితేనే నవ్వు వస్తుంది.

గోమూత్ర వాహినీ గోదావరిని గెంతి
ధాటిగా మా తాత దాటెనంట
ఎద్దు లద్దెల పెద్ద ఎత్తైన శిఖరమ్ము
లంఘించె మా తండ్రి  లాఘవముగ
ఎరువు వాడక ఎంతొ ఏపుగా పల్లేరు
పండించి మా అన్న బడసె కీర్తి
ఆకాశ హర్మ్యాల నవలీలగా కూల్చె
నాదు తమ్ముడపాన నాదములచె

వారి ఘన కీర్తి ఈ భూమి వాడకుండ
కత్తియును కాయలే చేత కానకుండ
కోయుచును సొర్రకాయలు కోర్కె మీర
చేర్తు నాపేరు వారితో చెరగకుండ

ఇక్కడ ఒక అపాన నాదమును గూర్చి మాత్రము ఒక మాట చెబుతాను: అపాన నాదము చేతనే పెద్ద పెద్ద కట్టడాలు పడగొట్టినాడు అన్నది మీకు అర్థమై ఉంటుంది .

ఒక చాటువు మీకు ఈ సందర్భములో తెలుపుతాను .

'డర్రు బుర్రుం భయం నాస్తి కయ్ కుయ్ యంచ మధ్యమం
తుస్సాకారం మహా ఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం'

అర్థము విడమరచ నక్కరలేదు .