Showing posts with label కలిగిన కోడూరు కాదేని గూడూరు భయమేలననువారు బలసినారు. Show all posts
Showing posts with label కలిగిన కోడూరు కాదేని గూడూరు భయమేలననువారు బలసినారు. Show all posts

Thursday, 3 April 2014

నేటి నేతలు

నేటి నేతలు

కలిగిన కోడూరు కాదేని గూడూరు
భయమేలననువారు బలసినారు
అబ్బినచో జుట్టు అబ్బకుండిన కాళ్ళు
పట్టెడు పనివారు ప్రబలినారు
చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్షంచు
చింతించు వారలు చెలగినారు
పదవికి నొకప్రక్క ఫలితానికొక ప్రక్క
నిలిచేటి వైనాలు నేర్చినారు

తనదు సొత్తును పొన్ను గా తలచుతారు
మన్నుగా పరసొత్తును మార్చుతారు
తటపటలు లేక దేశాన్ని తార్చుతారు
వేడెదను పోయ వారిపై వేడి తారు

చెరుకు రామ మోహన్ రావు
17 ఫిబ్రవరి 2015