Showing posts with label ఒక యదార్థ. Show all posts
Showing posts with label ఒక యదార్థ. Show all posts

Monday, 8 March 2021

కొనకుండా నవ్వుకొనండి - Coop Tex Sales Girl

 కొనకుండా నవ్వుకొనండి - Coop Tex Sales Girl

https://cherukuramamohan.blogspot.com/2021/03/coop-tex-sales-girl.html

ఈ దిగువ నేను అందించిన పద్యానికి కారణము ఒక జరిగిన కథ. నేను మద్రాసులో ఉద్యోగము చేసే రోజులలో పెళ్ళికి గాను బట్టలు తీసుకొనుటకు ఎగ్మోర్ లో వుండే 'పట్టు మాళిగై' అన్న 'Coop Tex'(తమిళనాడు ప్రభుత్వ మలిగె} (Big Shop or Maal)కు రిబేటు ఎక్కువగా ఉండుటవల్ల వెళ్లినాము.

అది దీపావళి నెల. మేము బట్టలన్నీ కొన్న తరువాత, ఏదో పాపమని తలచి ఉంటుంది బహుశా, ఒక సేల్స్ గర్లు నా వద్దకు వచ్చి రిబేటు చాలా ఎక్కువగా ఉంది ఇంకా శారీస్ కొనండి సార్ అని అరవములో అన్నది . నేను చాలమ్మా కావలసినవన్నీ కొన్నాను అన్నాను. లేదుసార్ కొని మీకిష్టమైన వాళ్లకు gift చేయండి అనింది. తటపటాయింపు లేకుండా వెంటనే నేను "ఏమమ్మా ఇటువంటి మాటలు నా భార్య ప్రక్కనే ఉన్నపుడు చేబుతావే" అన్నాను . అంతే చుట్టూ ప్రక్కల ఉన్న కష్టమర్లతో కలిపి ఆమె కూడా పగలబడి నవ్వవలసి వచ్చింది.

ఆ ఉదంతమునకు గుర్తుగా ఈ పద్యము వ్రాసినాను.

'ఈ రిబేటు దొడ్డ దిందెన్నియో కొని

ఇష్టమైనవారికివ్వవచ్చు'

'మాటలట్టివనకుమా! భార్య ముందర

చెప్పుచుంటి నీకు సేల్సుగర్లు'