Thursday, 10 November 2022

Dr. శ్రీ పి వి అరుణాచలం గారు

 

Dr. శ్రీ పి వి అరుణాచలం గారు

https://cherukuramamohan.blogspot.com/2022/11/dr_10.html

కళ్ళు మసక గొన్న, కంటియద్దమతడు

జ్ఞానవని యతండు జ్ఞాన ఖనియు

దారి గనని వాని దైవమే యాతండు

గురుతునుంచుకొనుము గురువతండు

అట్టి గురువు నాకు శ్రీయుతులు అరుణాచలం గారు. వీరు M.A. Ph.D, Dip in German, FNA Sc., Founder Vice Chancellor నేను M.Sc., చదివేటప్పుడు మా Mathematics Professor. వారి కళ్ళలో కాంతి, కంటియద్దముల వాడి, మోములో నిర్మలత్వము, వ్యక్తిలో గాంభీర్యము, నేను మనో ఫలకమునందు చూచే ఆయన రూపము. నేటికీ ఎంత ఆవ్యాజ ప్రేమ, వాత్సల్యము కలిగిన వారిని హృదయములో ఆరాధించుట తప్ప నేనేమి ఇచ్చుకోగలను . ఆయన అటు గణితము లోనూ, ఒక మహోన్నత అధికారి గాను (కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయపు మొదటి వైస్ – ఛాన్సలర్), వాటిని మించి ఆంధ్రములోను అసమాన పాండిత్యము గలిగిన ఆయన చేత బూనిన ప్రతి పనిలోనూ అగ్రగణ్యుడు. నా చదువు ముగిసి, ఉద్యోగము ముగిసి, నాకు 65 సంవత్సరములు వచ్చిన పిదప వారిని తిరిగి కలియుట జరిగింది. ఎంతటి అభిమానము ఎంతటి వాత్సల్యము. ఆయన నా పాలిట గతి మారని చెట్టు నీడ ఆయన అండ నేనెన్నటికీ వీడ.

పి’ వివరమెరుగ ప్రొఫెసరు

వి’ విషయము తెలుసుకొన్న వీసీయగు నీ

పివీ’ ని ముందు గల్గిన

పీవీ అరుణాచలార్యు ప్రీతిగ కొలుతున్

నా శతకమునకు అడిగిన వెంటనే తమకెంత కార్య భారమున్నా నా పై వాత్సల్యముతో వ్రాసి పంపిన వారి మంచి మనసుకు శతకోటి దండ ప్రణామములు.

వీరు తెలుగులో అనేక పద్యకావ్యములు వ్రాసిన కవి పుంగవులు. ఆయన ఎంత గొప్పవాడో అంత నిగర్వి. ఆయన గూర్చి అత్యంత మేధో వర్గములలో తప్ప అన్యులకు తెలిసే అవకాశము తక్కువ. అటువంటి ఒక మేధావికి, మహానుభావునికి నేను శిష్యుడనగుటయే నేను జన్మ జన్మాంతరమున చేసుకొన్న మహాపుణ్య ప్రతిఫలము. ఆయనను గుర్తు చేసుకొన్నపుడల్లా ఆంద్ర మహాభారతము లోని విదుర నీతి లోని “ధనమును విద్యయు వంశంబును.. సజ్జనులైన వారి కడకువ యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా ! “అన్న పద్యమే గుర్తుకు వస్తుంది. అన్ని విధములా భగవంతుని అనుగ్రహము పొందిన వారిని గూర్చి సవినయముగా పది మందికి తెలుపుట తప్ప వారికి నేనేమి సమర్పించుకొన గలను. అందుకే వారిని గూర్చిన ఈ క్రింది వివరములు :

Prof. P.V. Arunachalam Garu (Bio-Data in Brief)

Puduru Viswanatha Arunachalam was born at Karvetinagaram, Chittoor District Andhra Pradesh in 1935. After schooling at Karvetnagar, he did intermediate course (1951-53) and B.A. (Mathematics) (1953-55) in Sri Venkateswara College, Tirupati. Later he joined Department of Mathematics headed by Prof. R. Vaidyanatha Swamy, Sri Venkateswara University, Tirupati, in 1955, and got M.A. degree, securing first class with first rank in the year 1957.

He was Lecturer in Mathematics in A.M Jain College, Madras and Pachaiyappa’s College, Kanchipuram, Tamilnadu, before joining Sri Venkateswara University as Lecturer, 1960.

During 1966-68 he was a research scholar in I.I.T. Madras, for Doctoral Degree under the guidance of Prof. S.D. Nigam. During 1969-77 he was Reader and later got promoted as Professor of Applied Mathematics. He specialized in Applied Mathematics, trained many research scholars and a few are still working. He has published several research papers. He has authored/edited several text books for School, College and University students of Mathematics. He published more than 145 popular articles on Mathematics, Science and Education. His hobbies are poetry writing in Telugu and other literary activities.

Besides teaching and research, he served the University in various capacities, till he retired as Principal of S.V.University college of Arts, Science & Commerce- May 1995. He was Controller of examinations; Local Sectional Secretary, ISCA; Dean, School of Mathematical and Physical Sciences; Dean, Faculty of Science; Warden S.V.University college for men, Secretary, World University Service; Member, Board of Management; Principal, University College; Member, Board of Governors, Member, Executive Council, Sri Venkateswara University and so on.

He got several awards and honors:

1 He was a Fulbright Scholar, University of Wisconsin, Madison, USA.

2 He got elected as a Fellow of the National Academy of Sciences, Allahabad.

3 He got Best Teacher Award (University level) (1987) Government of AP

4 Telugu Academy Award (1988)

5 Achievement Award from US based TANA-New York (1993).

6 He received Kuppam Reddemma Leterary Award – 2000

7 He got Telugu Jati Ratnam Award 2000 from the Andhra Kesari Tanguturi Prakasam Institute, Hyderabad.

8 Visvodaya Fellowship – Kavali

9 Vocational Excellency Award – Rotary Club, Sri Kalahasthi,

10 Vocational Excellency Award – Silver Beach Rotary Club, Chennai

11 District Governor’s Recognition Award ( Rotary International District-3190) 2008-2009

12 Sanjeeva Raya Sarma Award (Mathematics) – 1998, Ramachandra Puram E.Godavari District

13 Best Teacher Award from District Educational Officer – Chittoor

14 He is elected president of Purvanchal Academy of Sciences 19th annual conference February 2010.

15 The Hon’ble Prime Minister Dr. Manmohan Singh honored him by presenting Prof. P.C. Mahalanobis Birth Centenary Gold Medal in January 2008 at Visakhapatnam (ISCA Annual meet)

16 Fellowship of the Andhra Pradesh Akademy of Sciences- 2014

17 Vidyashiromani Award from Academy of Grassroots Studies and research of India – 2016

18 Kavikokila Award 2016 from Universal Peace Cross, Chittoor

He is/ was associated with Professional bodies: like

1 ISCA,

2 Ramanujan Mathematics Society,

3 A.P. Society for Mathematical Sciences,

4 Indian Society for History of Mathematics,

5 New York Academy of Sciences,

6 Research Board of American Biography,

7 NCERT, and SCERT

8 Association for Improvement of Mathematics Education Vijayawada AP,

9 AP Association of Mathematics Teachers Hyderabad

10 Association for Improvement of mathematics teaching – Kolkata

11 Association of Mathematics teachers of India – Chennai

12 Ramanujan Mathematics Academy – Ramachandrapuram, E G Dsit.

13 Wrote/ Edited several Books on mathematics under the auspices of Telugu Akademy, Hyderabad

14 Academic Consultant to Educational Institutions in Andhra Pradesh

He was Visiting Professor in the University of Florida, USA and first Vice-Chancellor, Dravidian University, Kuppam, Andhra Pradesh. He was Vice-Chancellor in Charge of Sri Krishnadevaraya University. He was holding additional charge of Vice-Chancellor of Sri Padmavathi Mahila University. He was Sectional President, Mathematics for the 87th Session of Indian Science Congress – 2000. . He became Life Member of Association for Improvement of Mathematics Teaching- Kolkata and was its vice president for three terms He was nominated as Member, UGC Advisory Committee of the DSA (Mathematics) Programme, Jadavpur University- Calcutta. Elected President of the Indian Mathematical Society for the year 2001-2002. He is one of the Founding Members of the Gandhi Bhavan Trust, Tirupati.

Got elected as Council Member once and Executive Committee Member twice of the Indian Science Congress Association, during the year 2005- 2008. Prof. P.V. Arunachalam is presently the Charter President of the Greater Tirupati Rotary Club and is associated with several educational institutions as Consultant, Advisor, and Committee Member and so on. As one of the editors he took active part in the preparation of Text Books in Mathematics for the Junior Colleges in the State of Andhra Pradesh (during 2007-2009). He edited besides contributing an article “The book – The Great Philosophers of India” Published by the Authors House USA.

The Friendship Forum of India, New Delhi felicitated and presented him the Certificate of Excellence during June 2007.

Prof. P.V. Arunachalam Published:

1. Research Papers – 45

2. General Papers (Science, Education, Mathematics, literature, social service and Philosophy) ¬– 100

3. Prefaces/Introductions to Books of others – 65

4. Convocation addresses, Invited talks at Conferences National/International – 25

Present Interests

• Research in Ancient Indian Mathematics:- Edited Telugu version the Sanskrit texts of Mahavir Acharya & Bhaskaracharya (9th & 12th century AD)

• Working on Pavuluri Mallana’s Ganita Sangraha saramu (11th century AD)

• Edited a Book on Introduction to Pavuluri Mallana

• Mathematics in Tantra Sastra

• Teaching Vedic Mathematics (Rashtryiya Sanskrit Vidyapeeth, Tiruapati, S.V.Vedic University Tirupati)

• Designing Mathematics Laboratory

• Quality Initiatives in Higher Education

• Organising conferences and workshops for Mathematics teachers

• Writing text books (Telugu & English media) for courses from K.G to P.G levels

• Giving training in ABACUS(speed mathematics) to school children

• Chief Editor – Proceedings of the Euler’s Tercentenary conference(2009)-Organised by Dept. of Mathematics, S.V.Arts College, Tirupati

• Chief Editor – Proceedings of DST sponsored 5 day national workshop on Ancient Indian Mathematics(2010)-Organised Dept. of Mathematics, R.S.Vidyapeetha, Central Deemed University, Tirupati

• Mathematical Curios – Book being published by Nilkamal Publishers, Hyderabad – 2012

• Translating Robert Kanigel Book –Biography of Srinivasa Ramanujan –Titled ‘THE MAN WHO KNEW INFINITY’

Editing 6 Journal in Mathematics (2 International & 4 Local)

Professor PV Arunachalam

Founder Vice Chancellor, Dravidian University, Kuppam Andhra Pradesh

Former President, Indian Mathematical Society

Former Professor of Mathematics, SV University,

Formerly Visiting Professor, University of Florida, Gainesville USA,

Former Fulbright Scholar, University of Wisconsin, Madison USA

President, Andhra Pradesh Association of Mathematics Teachers, Hyderabad

ఇంత ప్రతిభా పాటవము గలిగిన యా గురుమూర్తికి నమస్కరిస్తూ, వారి శిష్యుడనైనందుకు పరమేశ్వరునికి కృతజ్ఞత తెలుపుకుంటూ శెలవు తీసుకొంటాను.



 



 

https://www.blogger.com/img/img-grey-rectangle.png

53Srinivasa Subrahmanya Sai Bhagavatula, Srinatha Babu and 51 others

27 Comments

18 Shares

Share

 

Monday, 7 November 2022

అవధాన సహస్ర ఫణి వే. నాగపణి శర్మ గారు

 

అవధాన సహస్ర ఫణి వే. నాగపణి శర్మ గారు

Dr. మాడుగుల నాగఫణి శర్మ గారు

https://cherukuramamohan.blogspot.com/2022/11/blog-post_7.html

దేశాధ్యక్షుడు వే. శంకర్ దయాళ్ శర్మ, దేశ ప్రధాని మహా పండితుడు శ్రీయుతులు P,V నరసింహారావు గారు, సంయుక్త ఆంద్ర ప్రదేశపు ముఖ్యమంత్రి శ్రీ N.T రామారావు గార్ల చేతనే గాకుండా శృంగేరి, కంచి కామకోటి పీఠములందు, పీఠాధిపతుల  ఆజన మేరకు సంస్కృతమున అవధానములు సలిపి ఆ మహానీయులచే గౌరవము పొంది ఆశీర్వదించబడిన పండిత మేరువు. నిజమునకు ఈ జగమెరిగిన బ్రాహ్మణునికి నా ఉపోద్ఘాతము హింబ్డూ మహా సముద్రపు ఒడ్డున ఇసుక రేణువు. అయినా రెండు మాటలు చెప్పవలెనను ఆశతో ఈఅవకాశమును విడుచుకోలేక చెప్పుచున్నాను.

బ్ర.శ్రీ.వే. గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు శతావధాని. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసినారు. మా చిన్నాన్న అంటే నా భార్యకు స్వంత మేనమామ యైన వే. సాంబ మూర్తిగారికి బాల్య స్నేహితులు అనేకంటే గోచిపాత స్నేహితులు అంటే ఇంకా బాగుంటుందేమో!. బాల్యములో కోతికొమ్మంచి ఆడుకొనేవారు. నా కుమార్తె నామకరణము వారిచే జరుగుట నా పూర్వజన్మ సుకృతము. నా ఇరువురు కుమార్తెల జాతకమును గూడా శ్రీ గౌరిపెద్దివారే వ్రాసినారు. అన్నమయ్య సంకీర్తనల పరిష్కర్తలలో వీరు ఒకరు. శ్రీదేవీమాహాత్మ్యము అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించినారు. ప్రముఖ అవధానులు గండ్లూరి దత్తాత్రేయశర్మ, నరాల రామారెడ్డి మొదలైనవారు వీరి శిష్యులు. వీరికన్నా వేదమూర్తులైన మాడుగుల నాగ ఫణి శర్మ గారు వీరికి అత్యంత ప్రియతమ శిష్యులు. వారున్నంతకాలము వారి ఇంట్లో వారి ఆసనమునకు ఎదురుగా గోడకు వ్రేలాడదీసిన, తమ గురువైన గౌరిపెద్ది వారిని గూర్చి వ్రాసిన, మాడుగుల వారి పద్యము కనిపించేది. గురుభక్తి శిష్య వాత్సల్యము అంటే అదే కదా! మాడుగుల వారిని గూర్చి చెప్ప బూనటము హిమాలయానికి మంచు ముక్క మోసినట్లే! 1985 లో మిత్రులు బాల కృష్ణా రెడ్డి, TG రామకృష్ణ గార్ల ద్వారా శర్మ గారితో నాకు తిరుపతిలో పరిచయము ఏర్పడినది. వారి యవధానములో నేను అప్రస్తుత ప్రశంస నిర్వహించినాను, ఆ కాలంలో . మళ్ళీ మా పునఃసమ్మేళనము 2014లో జరిగింది. సాహితీ మేరువైనా సామాన్యుడైన నన్ను మరువలేదు. అదే అభిమానము. అడిగినదే తడవుగా, నేను వ్రాసిన 'శంకరదాస అష్టోత్తర శతికి, ఆసాంతమూ చదివి తన అమూల్యాభిప్రాయమును తెలిపిన వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు తెలుపకుండా ఎటుల ఉండగలను.

ఆయన వేద విజ్ఞాన నిఘంటువు. షడంగ షడ్దర్శన నిధానము ఆత్మీయతతో పరిశోధనాత్మకమైన వివరణమును ప్రతి పద్యమునకును వ్రాసి నాకు బహూకరించిన, ధూర్జటి మహా కవిగారి, 'కాళహస్తీశ్వర శతక వ్యాఖ్యానము' నా పుస్తక భండారములో నొక అనర్ఘ రత్నము. బృహద్విసహస్రావధాని ,పాండిత్య చక్రవర్తి అయిన వారిని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాన తిమిరాంధక ద్యుమణి నాగఫణి.

 

సంస్కృతాంధ్రమునందు సవ్యసాచియతండు

దేవగురుని, ధాత్రి, దీటతండు

ప్రావాణి మెడలోని ప్రాలంబ మాతండు

కచ్ఛ పీరవయుక్త కంఠుడతడు

పృచ్ఛక కల్హార పృశ్నిపూషుడతండు

విద్వరేణ్య వ్యాళ వెట్టమతడు

శత సహస్రవధాన జగతి ప్రఖ్యాతుండు

తెలుగు తల్లి మకుట తేజమతడు

మాడుగుల వంశ మణి స్వర్ణ మాల యతడు

మంచియను మాటకవనిలో మారతండు

గతము మరువక దలపోయు ఘనుడతండు

నాగ ఫణి శర్మ పాండితీ నగమతండు

 [ధాత్రి=భూమి;ప్రావాణి=సరస్వతి; ప్రాలంబము=హారము; కఛ్ఛపి =వాణీ వీణ; కల్హారము= కలువపువ్వు , పృశ్ని=కిరణము, పూషుడు= సూర్యుడు (సూర్యుని చూస్తే కలువ ముడుచుకొంటుంది); విద్వ రేణ్యవ్యాళ వెట్టము = మదగజములవంటి మహాపండితులకు శత్రువు.

రసాలసాలము=మధుర ఫల వృక్షము.

స్వస్తి. 

Tuesday, 1 November 2022

కీ. శే. శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

 

 

  కీ. శే. శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

https://cherukuramamohan.blogspot.com/2022/11/blog-post.html

శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిజమునకు ఒక అరుదైన వ్యక్తి వారి పరిచయ భాగ్యము నా పూర్వ జన్మ సుకృతము. ఆయన మహోన్నత వ్యక్తి. వందకు పైచిలుకు కావ్యములు వ్రాసినా పేరుకు ప్రాకులాడని మహా కవి, పండితుడు. వీరు విశ్రాంత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాల లో నివసించుచున్నారు. ఆయన నంద్యాల లోని ఏ పాఠశాలలోనైతే విద్యార్ధియో అదే పాఠశాలలో ఉన్నతాంధ్ర పండితునిగా ఉపాధ్యాయ వృత్తి నెరపి పదవి నుండి విశ్రాంతి పొందినా అవిశ్రాంతముగా సాహితీ సాగుబడి చేయుచునే యున్నారు. వారి వద్ద చదివిన మాజీ విద్యార్ధులంతా కలిసి వయసులో ఇపుడు వారెంత పెద్దవారైయున్నా కుడా శాస్త్రిగారెంత వారించినా వినకుండా వారికి మహాగురు సన్మానము నెరపినారు. ఇది ఆయన శిష్యవాత్సల్యమునకు, విద్యార్ధులపై ఆయన వేసిన చెరగని ముద్రకు తార్కాణము. ఈయన సంస్కృతాంధ్రాంగ్ల కన్నడ భాషా ప్రవీణులు. ఈయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. నాయకురాలు (నాగమ్మ) కార్యసిద్ధి, కథామాల ఇత్యాది బాల సాహిత్యము, మహా నందీశ్వర సుప్రభాతము, జగజ్జననీ సుప్రభాతము, అష్టదిక్పాలక స్తోత్రము మొదలగు సంస్కృత రచనలు, జనారణ్యం, ఒక హృదయం మీటితే, ప్రణయతంత్రం (జ్యోతిలో ప్రచురింపబడినది) మొదలైన నవలలు, శ్రీనివాస ప్రభువు శతకం, జీవన శతకం ఇత్యాది శతకములు నవప్రణవ, శ్రీనివాసాక్షర కావ్యం, శ్రీనివాసస్తోత్రమంజరి (ద్విపద), శ్రీనివాసోదహరణము, వెంగళరెడ్డీయము, కవితా సామ్రాజ్యము (వాసికెక్కిన రచన, ముద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి – వావిళ్ళ వారి ఆస్థాన పండితుడు).

ఇటువంటి బృహత్కావ్యముల నెన్నింటినో వ్రాసినారు. సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి వంటి లబ్ధప్రతిష్ఠులు శాస్త్రి గారిని గూర్చి ‘ వీరు కవివతంసులు విపశ్చిదగ్రగణ్యులు అనుటలో సందేహము లేదు అన్నారు. వీరు ఇన్ని పుస్తకములు వ్రాసినా అన్నీ ఆయనే అచ్చొతించి పంచినారు. అమూల్యమైన ఆ పుస్తకములను అమూల్యముగానే పంచినారు. వారికి డాక్టరేట్ లేకున్నా వారి నేతృత్వములో ఎందరో ఆంధ్రమున డాక్టరేట్లను సంపాదించినారు.

ఇక నా విషయమునకు వస్తే పరిచయమైనది మొదలు, నాకు ఏవిధమైన సందేహము కలిగినా ఆయన ఎప్పుడూ నవ్వుతూనే దానిని నివృత్తి చేసేవారు. ఆయన పరిచయ భాగ్యము నిజముగా నా పూర్వజన్మ సుకృతము.

 

మహనందీశ మహా కృపాబ్ధిగతమౌ మాణిక్య మీరీతిగా

మహానీయంబగు గొట్టిముక్కల మహా మన్యంపు వంశంబునన్

మహదానందము గూర్చగా తెలుగుకున్ మహాత్మ్యమున్ చేర్చగా

మహ దేవాంకిత సుబ్రమణ్య కవిగా మాన్యుండు గల్గెన్ ధరన్.

స్వస్తి.