ఒకే
వస్తువే ఒకరికి మేలు ఒకరికి కీడు
ఆయుర్వేద
వైద్యశాస్త్రమున తెల్పిన కొన్ని చెట్టు దినుసులు, కొందరికి మంచిని చేకూర్చితే
కొందరికి చెడుగును చేకూర్చుతుంది ప్రభుత్వమూ కొన్ని ప్రజోపయోగాకరమగు కార్యక్రమములు
చేపట్టితే ప్రతిపక్షములకది మింగుడు పడదు.
పూర్వము ప్రతిపక్షములు కూడా దేశ ప్రగతికి భిన్నముగా ప్రభుత్వము నడచుకొంటే తమ
సుతర్కముతో వారి ఆలోచనలను నియంత్రించేవారు. నేడు ఆ స్థితి లేదు. కరడు కప్పిన
స్వార్థమే కరాళ నృత్యము చేయుచున్నది. నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
మంచిని
ఎంచలేరు మది, మానక గాంతురు లేని తప్పులన్
కొంచెము
కూడయున్ మదిన కోరరు దేశ ప్రయోజనమ్ములన్
ముంచగా
చూచుటే తమకు ముఖ్య ప్రణాళిక యంచు ఎప్పుడున్
వంచన
తప్ప దేశమును వర్ధిల జేయరు శత్రు పక్షముల్
ఇది
నేటి రాజకీయ స్థితికి దర్పణముగా .భావించుకొనవచ్చును. అన్వయము పాఠకుల ఊహకు వదలి
పెడుతున్నాను. నాకు వలసిన మూలమును సౌమిత్రి జటప్రోలు గారు పంపిన సందేశము నుండి
గ్రహించి అందజేయుచున్నాను. వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు ఇందుమూలముగా తెలుపుకొనుచున్నాను.
ఆయుర్వేద
వైద్య శాస్త్రములో, #తేనెను ఔషధంగా భావిస్తారు. నేను సేకరించినది ఈ దిగువన మీముందు
ఉంచుచున్నాను.
అయితే
ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే #కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది!
అంటే
మనుషులకు ఔషధము అయిన తేనె కుక్కలకు విషమవుతుంది.
ఆయుర్వేద
వైద్య శాస్త్రములో స్వచ్ఛమైన #దేశీయ ఆవునెయ్యిని
ఔషధ లక్షణాల సమాహారముగా పరిగణిస్తారు!
కానీ
ఆశ్చర్యకర విషయమేమిటంటే, మురికిలో సంతోషంగా ఉండే #ఈగ ఎన్నటికీ స్వచ్ఛమైన
దేశీయ నెయ్యిని రుచి చూడదు!పొరపాటున, రుచి చూసిందా, అది వెంటనే అక్కడే ప్రాణాలను వదులుతుంది.
ఆయుర్వేదములో, #మిశ్రి అంటే కండచక్కెర ఔషధంగా మరియు
ఉత్తమ మిఠాయిగా కూడా పరిగణించబడుతుంది.
అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కండ చక్కెర #గాడిదకు తినిపిస్తే, దానికది ప్రాణాంతకమౌతుంది.
అందుకే
కండచక్కెర తినుబండారములు గాడిద ఎన్నటికీ
తినదు.
వేప చెట్టుపై గల వేప పండ్లతో అందలి విత్తనములతో అనేక
వ్యాధులను నయము చేయ వచ్చును. ఆయుర్వేదం
దీనిని ఉత్తమ ఔషధముగా పరిగణించుతారు..
అయితే వేప చెట్టు మీద నివసించే కాకి పగలయినా,
రాత్రయినా వేపపళ్ళను తింటే, దాని మరణం ఖాయం.!అంటే ఈ
భూమిపై ఒకరికి మంచి అయినది వేరొకరికి చెడుగు కావచ్చును. ఈ భూమిపై ఇలాంటివి చాలా
ఉన్నాయి. ఈ సందర్భములో ఒక 40 సంవత్సరముల క్రితము వ్రాసిన పాట గుర్తుకొస్తున్నది.
ఎవరు
నీవారు ఎవరు పెరవారు
తెలుసుకొవాలిరా
తెలిసీ మసలుకోవాలిరా
వీడన
తోడౌ నీడకు కూడా
వెలుగంటేనే
వెరపు కదా
చీకటిలో
మతుమాయము కాదా
నీచేవయె
నీ చెలువు కదా
నెత్తురు
పంచుకు పుట్టిన నలతే
చెరూపు
చేయగా నీకెపుడు
కోడల
కోణాల పండిన మాకుల
మూలికలే
నీ అండకదా
అమరుల
జేసే అమృతమే మరి
రాహువు
పాలిటి మిత్తి కదా
హాలాహలమే
ఆభారణముగా
శివుని
గళములో నిలచె కదా
స్వస్తి