లౌకిక వాదము (Secularism)
http://cherukuramamohan.blogspot.com/2016/09/secularism.html
లౌకికము అంటే లోకమునకు సంబంధించినది అని నాకు తెలిసిన అర్థము. మన వేదశాస్త్రపురాణేతిహాసాల ప్రకారము మనకు భూలోకముతో కలిపి 14 లోకములున్నాయి. అందులో 7 అధోలోకములు. మనమున్న భూలోకమునకు పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు, భూలోకముతో చేర్చి సప్త (7) లోకములౌతాయి. అదేవిధముగా భూలోకమునకు క్రింద అతలలోకము, వితలలోకము, సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, మహాతలలోకము, పాతాళములని సప్త (7) అధో లోకములు వున్నాయి. ఇవి కాక లోకము యొక్క దక్షిణ దిశలో మృత్యు (యమ) లోకము, ప్రేతలోకము, నరకలోకము, పిత్రులోకములనే 4 భాగములు వున్నాయని శాస్త్ర వచనము.
అసలు ఈ మాట ఎందుకు చెప్ప వలసి వచ్చినదంటే ఇవి కూడా లోకములే కాబట్టి. మన పురాణాలలో మన పూర్వులు ఇక్కడకు గూడా పోయి వచ్చిన దాఖలాలున్నాయి కాబట్టి. ఇప్పుడిప్పుడే ఈ విషయములను మనము నమ్ముతున్నాము కూడా కాబట్టి. ఇప్పుడు విషయానికొస్తే మన భూలోకమున తప్పించి ఈ లౌకిక వాదము వేరు లోకాలలో వున్నట్లు మన పురాణాలలో చదువము. మన భూలోకమున వున్న ఈ వాదము దేశాలను బట్టి మారుతూ వుంటుంది, పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి అన్నట్లు.
ప్రపంచములో అతి పెద్దవయిన రెండు మతములున్నాయి. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క సృష్టికర్త ఉన్నారు. ఇటు మన ధర్మము నందు గానీ అటు వారి మతములందు గానీ ఈన లౌకిక వాదము యొక్క ప్రస్తాపన రాలేదు. మనది ధర్మము వారిది మతము. పైపెచ్చు ఇది ఎంతో పురాతనమైనది కావున మన పూర్వులు లోకహితమును ఆదర్శముగా గొని ఏ పనినైనా ఏ నియమమునైనా తలపెట్టే వారు. ఈ ధర్మమునందు వెలసిన నీతి మార్గములను తెలిపే ఇన్ని శాస్త్రములు వేరు ఏ దేశములోనూ 20౦౦ సంవత్సరముల క్రితము నుండి ఏర్పడిన మతములలోనూ లేవు. వారి మత గ్రంధమే వారి సర్వస్వము. అందులోని ఏ విషయమును కూడా ఎవరూ ఎదిరించరాదు. మనది ధర్మము అని చెప్పుకొన్నాము కదా! మరి ధర్మమూ అంటే ఏమిటి? ధర్మము అన్న మాటకు ఈ సందర్భమున ఆచరించు విధానము అన్న అర్థమును తీసుకొనవచ్చును. ఈ ఆచరణ ఒక వ్యక్తి దర్శకత్వములో నడుపబడుతూ లేదు. మిగత రెండు మతములలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త వున్నాడు. వారి నిర్దేశమే వీరికి ఆదేశము. మరి మన ధర్మములో దేవుడే భూమి పైకి దిగి వచ్చి చెప్పిన భగవద్గీతలో ఈ లౌకిక వాదము లేదు. ఆ రెండు మతములలోనూ వారి, వారి ప్రవక్తలు చెప్పలేదు. వారి ఉపదేశ సారము ఒకటే. దయతో నైనా, ధనముతో దానముతో నైనా సాధ్యము కాకుంటే లాగున నిర్దాక్షిణ్యముగా వారిని నిర్మూలించు. ఏది ఎట్లయితేనేమి ఈ లౌకిక వాదమును గూర్చి మాత్రము వారు చెప్పలేదు. మరి ఎవరు చెప్పినట్లు?
పై ప్రశ్నకు జవాబు చెప్పుటకు ముందు అసలు SECULAR అంటే అర్థమేమిటో తెలుసుకొందాము. ఈ పదము SAECULUM అన్న LATIN పద జన్యము. ఈ లాటిన్ మాటకు అర్థము ఏమిటంటే ‘ ఒక నిర్ణీత లేక నిర్దేశిత సమయము’ అని అర్థము. కాలాంతరమున దీనిని పారమార్థిక మరియు ప్రాపంచిక తారతమ్యముగా ఒక నూతన నిర్వచనమును ఇచ్చినారు అప్రాచ్యులు. అంటే చర్చికి సంబంధించిన విధివిధానముల నుండి ప్రజా కార్యకలాపములను
వేరుపరచి, ఈ ప్రజలు కొనసాగించే ప్రవృత్తి పరమైన విధులను SECULAR అన్నారు. 19 వ శతాబ్దములో ఈ శబ్దము యొక్క అర్థమును, పాశ్చాత్య విజ్ఞులు మార్చి ధనిక శ్రామిక వర్గ సమన్వయముగా ఒక క్రొత్త భాష్యమును చెప్పినారు. రానురాను ఈ పదము యొక్క అర్థము దేశమును బట్టి, దేశ నాయకుల నిర్దేశమును బట్టి మారిపోతూ వచ్చింది. ఆ విధముగా మన దేశపు ప్రప్రధమ ప్రధాన మంత్రి యగు , మన ప్రియతమ జవాహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు అల్ప సంఖ్యాకులకు అందులోనూ ముఖ్యముగా క్రైస్తవ ముస్లిం వర్గీయులకు అతిథి సత్కారముల చేయుట అన్న అంతర్లీనమైన భావన మన మనసులలో పాదుకొనునట్లు ఒక నిర్వచనమునిచ్చి, ఒక క్రొత్త అర్థమును ఏర్పరచి, తాను మనకు చేసిన మేలును కలకాలమూ గుర్తుంచుకొను లాగున చేసి పోయినారు. బహుశా వారిలో వైదిక రక్తము లేదేమో! నిజము దేవునికి ఎరుక. పైన తెలిపిన పదమునకు మన ప్రియతమ ప్రధాని నెహ్రూ గారు ఆచరణలో చూపించిన అన్వయమునకు ‘అబ్దుల్ ఖాదరు కు అమావాస్య కు’ మరియు ‘తాతాచార్లకు పీర్ల పండుగకు’ ఉన్న సంబంధము వంటిదే!. అంటే సంబంధము లేదు అని అంతరార్థము.
నెహ్రూ గారు ప్రధానిగా వున్నా కాలములో వారిది అంతరంగిక లౌకికము అంటే అది అపారదర్శకము.. అంటే లౌకికము అన్న ముసుగులోపల వారికున్న ఆలోచనలు. అప్పటి దేశ ఉపప్రధాని గృహ మంత్రి అయిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారిది బహిరంగ లౌకికము అంటే పారదర్శక లౌకికము. అందుకే జమ్మూ కాశ్మీరుకు Article 370 పటేలుగారు ఎంత ప్రతిఘటించినా నెహ్రు గారు అమలు పరిపించటము.
అందుకే 1950 లో కాంగ్రెస్ అధ్యక్షా పదవికి పటేల్ పురుషోత్తం దాస్ టాండన్ గారిని నిలబెడితే నెహ్రూ గారు వారికి పోటీగా ఆచార్య కృపలానీ గారిని నిలబెట్టినారు. నెహ్రూ గారు విశ్వ ప్రయత్నము చేసినా టాండన్ గారే గెలిచినారు .భారతీయ సంస్కారము కలిగిన వారు కావున వారు కార్యవర్గములో నెహ్రూ గారికి కమిటీ సభ్యునిగా స్థానమిచ్చినారు. అటు పిదప ౩ సంవత్సరములకే పటేలుగారు మరణించుటతో నెహ్రూ గారు తమ మానసిక మంత్రం దండము త్రిప్పి టాండన్ వర్గము చేత తమ, తమ పదవులకు రాజీనామా ఇప్పించ గలిగినారు.
ఆంగ్లములోని ఈ వ్యాఖ్యను గమనించండి.
Nehru was considered by the international media as a person who, to quote the words of the Gettysburg Times, “suffered from a monumental inferiority complex.” This resulted in Nehru claiming he was an Englishman, and he displayed the same kind of disdain towards Indian people and culture that the English rulers had displayed.
‘ఏకమేవాద్వితీయంబ్రహ్మ’ అన్న సిద్ధాంతమునకు కట్టుబడి ఇటలీ లోనే సచ్చితానంద మిషన్ స్థాపించిన Father Anthony Elenjimittam గారు, 1951లో Libertarian అన్న పత్రికకు editor గా పని చేస్తూ వుండిన వారు తాము 1951లో తాము వ్రాసిన పుస్తకములో ఏమి వ్రాసినారో చూడండి.
Elenjimittam also decried the hypocrisy of Nehru when he wrote that “the veteran Congress leaders, with Pandit Nehru at the top, continue to shout from the housetops in and out of time about their new fad of pseudo-secularism.” This was possibly the first usage of the term ‘pseudo-secularism’ in the context of Indian politics.
1962 చైనా యుద్ధములో భయంకర ఓటమిని మన దేశము చవిజూచుటకు వారు, వారి అనుచరుడు, అంతేవాసి మరియు నాటి రక్షణ శాఖ మంత్రి కృష్ణమీనన్ గారలు కాదా!
ఈనాటికీ దేశము దరిద్ర రేఖ వద్ద కొట్టుమిట్టాడుట వారి ఆంతరంగిక అపారదర్శక (అపార+దర్శక అని విడదీయవద్దు,) విధానములవల్ల కాదా!
(ఈ విషయములను అరవింద కుమార్ గారి రచనల నుండి సేకరించినాను.)
స్వతంత్రము వచ్చి 70 సంవత్సరములు కావచ్చినవి. 1947 నాటి నుండి నేటి వరకు ఈ సనాతన ధర్మావలంబుల జననములు ఎంత శాతము తగ్గినవి అల్పసంఖ్యాకుల జననములు ఎంత శాతము పెరిగినవి ఒకసారి గణనాంకములను పరిశీలించితే అర్థమౌతుంది. మరి అల్పసంఖ్యాకులకు ఇచ్చే వసతులు వారి జనాభా పెరుగుదల కోసమా! మరి పేదరికము కోసము అనుకొంటే ఈ దేశమును, ఈదేశ ధర్మమును, ఈ దేశపు మహనీయులను వారి ఆవిష్కరణలను నమ్ముకొని యున్న వారిలో పేదలు లేరా! మరి ఈ వివక్ష లౌకికమా లేక మాయాలౌకికమా?
తమ పుణ్య క్షేత్రములకు ఆ మతస్తులు పోవుటకు, ఇప్పటి వరకు ముస్లీములకు మాత్రమె వుంది, రాయితీలున్నాయి మరి అత్యంత నిరుపేదలైన మన వారికి ఏ కేదారనాథ్ ,బదరీనాథ్ యాత్రలకు అటువంటి రాయితీలివ్వవచ్చు కదా!
క్రైస్తవులకు వాటికన్, ముస్లీములకు మక్కా వున్నవి కదా! మరి ఆ స్థలములకు హిందువుల ప్రవేశమును అనుమతిస్తారా! అటువంటప్పుడు తిరుమల కొండపై అన్యమతస్థులు ఏ విధముగా ప్రవేశించ గలుగుతూ వున్నారు? కారణము నేను చెప్పగలను. ఆ పోయే వారి పూర్వులు ఈ భూమి పై జన్మించిన వారే! ఈ వైదిక మతమును అవలంబించిన వారే! అందువల్ల వారి సంతతిని పరమతస్తులు అని గుర్తించుట కష్టము. అబద్ధములు చెప్పి నమ్మించి, వారు సులభముగా తిరుమల చేరనూవచ్చును. తలచినది చేయనూ వచ్చును.
ఇక ఈ దేశము SECULAR దేశము అని అంటారు. అది ఆవిధముగా ఒకరి చేత ఏదో విధముగా చేయబడినది కానీ ప్రజల అభిమతముతో కాదు. సహనానికి ప్రతీకలైన ఈ సనాతన ధర్మపరులు పోనీ పాపమని అనుకొన్నారు కానీ, తమ చాప క్రిందికే నీళ్ళు వస్తాయని ఊహించనే లేదు.
మిగిలినది రేపు......
లౌకిక వాదము-2వ భాగము
‘కులము’ అన్న మాట ఉపయోగించుట నేటి కాలమున వేదికలెక్కి మాట్లాడే పెద్దలకు, పెద్ద నేరమైపోయింది. అది ‘అలౌకికమైన’ మాట అయిపోయినది. దీనికన్నా ముందు ఈ విషయము, క్రైస్తవ, ఇస్లాం మతములందు అసలు వున్నదా లేదా చూద్దాము. నేను Google search లో చదివి తెలుసుకొన్న మేరకు క్రైస్తవములో 30,000 కు మించిన వర్గములున్నవి. నిర్దారిత సంఖ్యా మనకవసరము లేదు కానీ వారిలోని విభాగములు మాత్రము ఇంతకన్నా కొంచెము ఎక్కువే వుంటాయి. వీరిలో చాలా వర్గములు, ఒక వర్గము వేరొక వర్గములో వారిని పెళ్లి చేసుకొనరు. ఒక క్యాథలిక్ అమ్మాయి ( Syro Malabar Church Kerala, India ) ఒక Malankara orthodox చర్చి అబ్బాయిని ప్రేమించింది. రెండు కుటుంబముల మధ్య చర్చల తరువాత ఇరు వర్గాలూ పెళ్ళికి ఒప్పుకొనుట జరిగింది. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన క్యాథలిక్ చర్చ్ వారు దీనికి ఒప్పుకోలేదు. వారు ఏమన్నారు అన్నది ఆ అమ్మాయి మాటలలోనే చదవండి: “The catholic church (my parish) intervenes and says 'we will not allow this" as in they can’t allow their sheep to be stolen by other churches.” మరి మిగతా 30,000 పై చిలుకు చర్చిల మాటేమిటి? మరి వీరిలో ‘Sheep Stealing’ కు ఒప్పుకొనేవెన్ని? ఒప్పుకొననివెన్ని?
ఇక ఇస్లాం విషయానికి వస్తే అక్కడి పరిస్థితి ఒక్క సారి చూడండి : (గూగుల్ సౌజన్యము)
The fact that the Ashraf belonged to the dominant political elites, while the bulk of the
Ajlaf remained associated with ancestral professions as artisans and peasants who were looked down upon as inferior and demeaning.
మరి ఈ మతాలలో లౌకికత ఎంత మాత్రము వుంది. వీరి చర్చిలకు మసీదులకు డబ్బు వరద లాగా ప్రవహించుతూ వుంటుంది. మరి ప్రభుత్వమునకు ఈ నిధుల పై నియంత్రణ వున్నదా! మరి మన ధర్మము పైనే ఎందుకు? ఇది ఏ విధమైన లౌకిక వాదము.
జన బాహుళ్యములో విరివిగా ‘కుల ప్రస్తాపన’ ఎక్కువగా వస్తుంది.సనాతన ధర్మావలంబులగు వారు ఎవరైనా శ్రీకృష్ణుని పరమాత్మ గానూ జగద్గురువుగాను, ఆయన చెప్పిన గీతను శిరౌదార్యముగానూ ఎంచుకొంటాము. మన గుణ కర్మలనుబట్టి, మన తరువాతి జన్మను ఆ పరమాత్ముడే నిర్ణయించుతూ వున్నాడు. మనము దానిని కాదని కొత్త పోకడలపోతే ఆకర్మ యొక్క పర్యవసానమును మనము తిరిగీ అనుభవించవలసి వస్తుంది కదా మరుజన్మలో! పరమాత్ముడే గీతలో ఈ విధముగా చెప్పుచున్నాడు:
చాతుర్వర్ణ్యం – మయా – సృష్టం – గుణకర్మవిభాగశః – తస్య – కర్తారం – అపి – మాం – విద్ధి – అకర్తారం – అవ్యయం
భగవాన్ ఉవాచ: ‘బ్రాహ్మణ’,‘క్షత్రియ’,‘వైశ్య’,‘శూద్రులు’ … అనే నాలుగు వర్ణాల సముదాయము గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత’ సృష్టించబడింది. ఈ విధమైన సృష్టి రచనకు కర్తను ‘నేనే’ అయినప్పటికీ ,నాశరహితమైన ‘నన్ను’‘ అకర్త ’ గానే నువ్వు తెలుసుకో.
ఇక్కడ గుణ కర్మల చేతనే పై నాలుగు వర్ణములలోని ఎదో ఒక వర్ణములో మానవుడు పుట్టుట జరుగుతూ వుంది. మరి ఇది దేనిననుసరించి జరుగుతూ వుంది. ‘గుణ కర్మ విభాగశః’ వారి, వారి గుణ కర్మల ననుసరించి ఈ విభాగము జరుగుతూ వుందని పరమాత్ముడే చేబుతున్నాడు. చాలామంది పుట్టినంత మాత్రాన ఎవడూ బ్రాహ్మణుడైపోడు అంటూ వుంటారు. ఇది ఎట్లు సమంజసము? ఒక వ్యక్తి యొక్క పుట్టుక పూర్వజన్మ కర్మఫలానుసారముగా జరుగుతూవుంది అని పరమాత్మనే చెప్పినాడు. మరి ఏ వర్ణములో పుట్టినవారు ఆ వర్ణస్తులు ఎట్లు కాకుండా పోతారు. కానీ వారు ఈ జన్మలో తమ కర్మ విధి విధాన రహితముగా చేస్తే మరు జన్మలో ఏ పేడ పురుగు నైనా కూడా పుట్టవచ్చు. ఈ జన్మలో శూద్రునిగా పుట్టిన వ్యక్తి తన విధి విధానమును పాటించుతూ పరమేశ్వరారాధన చేస్తే ఈ జన్మ లోనే బ్రహ్మత్వమును పొందవచ్చు. మాతా నామదేవ, భక్త కుమ్భార్, భక్త నందనార్, అమృతానందమయి, సత్యసాయిబాబా మొదలయిన వారెందరో, బ్రాహ్మణత్వమును పొంది ప్రపంచముచేత ఆరాధింప బడలేదా!
ఒక ఆచార్యుడు(Professor), కొన్ని వేదికలు ముఖ్యముగా బ్రాహ్మణుల పైన ఈ ప్రశ్న ఎక్కువగా సంధిస్తుంటారు.
‘ఈ బ్రాహ్మలు’ హరిజనుల ఇండ్లలో భోంచేస్తారా!’ అని. నేటి కాలానుగుణముగా బ్రాహ్మణులు హోటళ్ళలో భోజనము చేస్తూ వున్నారు. శాఖాహార మాంసాహార సంయుక్త భోజన శాలలలో! అసలు శాఖాహారపు హోటలులోనే ఒక బ్రాహ్మణుడు ఒకవేళ భోజనము చేసినాడు అనుకొన్నా ఆ వడ్డించినవాడు హరిజనుడు కాదు అని చెప్పగలరా! భోజనము చేయ ఆ హోటలుకు పోయిన బ్రాహ్మణుడు ఇటువంటి అనుమానములు తనకు కలిగినా పోవుట లేదా! ఇక్కడ, తినుటకు వెళ్ళేవాడు శుభ్రత చూస్తున్నాడు కానీ కులము కాదు. అసలు చేసేవాడు హరిజనుడైనా తినబోయే వాడు అభ్యంతరముగా భావించుట లేదు. నేను చూసిన ఒక వాస్తవమును తెలుపుకుంటున్నాను. ఇది చాలా కాలము క్రిందటి మాట. తన కర్మను నమ్మిన ఒక చర్మకారుడు తన కొడుకును B.Tech, చదివించినాడు. భార్యతో గూడా తానుండేది ఒక గుడిశె లో. కొడుకు US వెళ్లి ఒక విదేశీ యువతినే, తల్లిదండ్రులను తలపోయకనే కట్టుకొని అక్కడే వుండిపోయినాడు. భార్య బలవంతము పై ఒక సారి తల్లిదండ్రుల చూడ తన వూరికి వచ్చినాడు. అమ్మ అన్నము తినండి అని ఆప్యాయముగా అడిగితే వద్దు మేము హోటల్లో తింటామని చెప్పినాడట. ఇది ఆ తండ్రి నాతో చెప్పిన మాట. ఛత్రపతి శివాజీ కుమారునితో బాటూ, ఆ బాలుని ఎంగిలి తిని ఔరంగజేబు బారినుండి ఆ బాలుని ప్రాణములు రక్షించినాడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవము. మరి ఈ ఉదాహరణలు ఏవిధమైన లౌకిక వాదమును బలపరుస్తున్నాయి? లోక రక్షణకు కావలసినది ఆప్యాయత అనురాగము ఐకమత్యము, అంతేకానీ అన్నము తినుట కాదు. ఇక అన్య వర్ణస్థులను పౌరోహితులుగా మార్చుట. ఆంగ్లేయుల ఆగమనముతో అన్నీ తలక్రిందులైనాయి గానీ అంతకు మునుపు బ్రాహ్మణులు తమ వృత్తిని నియమ నిష్ఠలతో చేసేవారు. వేదాధ్యయనము, నియమ నిష్ఠల పాలనము, మంత్రోచ్ఛారణ సులభమైన పనులు కావు. వారికి నియమము ఎంత ముఖ్యమో సంఘ శ్రేయస్సు అంతకన్నా ముఖ్యము. ఇక ఖ్యాతికి కులముతో సంబంధము లేదు. నిజానికి బాబాసాహేబ్ భీమ్ రావు అమబెవాడేకర్ అన్నది అంబేద్కర్ అసలు పేరు. ఆయనను చేరదీసి తన ఇంటి పేరిచ్చిన వాడు మహదేవ్ అంబేద్కర్ బ్రాహ్మణుడు. ఆయన చదువుకు సాయపడినది అప్పటి బరోడా మహారాజయిన సాయాజీ రావు గైక్వాడ్. ఈ విషయాల ప్రస్తాపన ఈ కుహనా లౌకిక వాదులు ఎప్పుడూ తెలియజేయరు కదా! ఇక Reservations ను గూర్చి ఒక్క మాట:
మిగిలినది రేపు....
లౌకిక వాదము-3వ భాగము
Reservations ను గూర్చి ఒక్క మాట:
When the constitution was first introduced on 26th November 1949, article 334 titled “Reservation of seats and special representation to cease after twenty years” stated
“Notwithstanding anything in the foregoing provisions of this Part, the provisions of this Constitution relating to—
(a) The reservation of seats for the Scheduled Castes and the Scheduled Tribes in the House of the People and in the Legislative Assemblies of the States.
This meant that, reservation of SC/STs in House of the People and in Legislative Assemblies of the states should not be in effect post 1970.
ఇవి కొనసాగునట్లు సంవిధానమును మారుస్తూ వస్తూనే వున్నారు. ఇప్పటికి 2020 వరకు ఈ విధానము కొనసాగుతుంది. అంటే సంవిధాన కర్త గా చెప్పబడే అంబేద్కర్ గారు నిజానికి Drafting Committee Chairman మాత్రమే!
Committee on the Rules of Rajendra Prasad
Procedure
Steering Committee Rajendra Prasad
Finance and Staff Committee Rajendra Prasad
Credential Committee Alladi Krishnaswami Aiyar
House Committee B. Pattabhi Sitaramayya
Order of Business Committee K.M. Munshi
Ad hoc Committee on the Rajendra Prasad
National Flag
Committee on the Functions of G.V. Mavalankar
The Constituent Assembly
States Committee Jawaharlal Nehru
Advisory Committee on Vallabhbhai Patel
Fundamental Rights, Minorities
And Tribal and Excluded Areas
Minorities Sub-Committee H.C. Mukherjee
Fundamental Rights J.B. Kripalani
Sub-Committee
North-East Frontier Tribal Areas Gopinath Bardoloi
And Assam Excluded & Partially
Excluded Areas Sub-Committee
Excluded and Partially Excluded A.V. Thakkar
Areas (Other than those in Assam)
Sub-Committee
Union Powers Committee Jawaharlal Nehru
Union Constitution Committee Jawaharlal Nehru
Drafting Committee B.R. Ambedkar
Sir Benegal Narsing Rau was appointed as the constitutional advisor. He later became First Indian Judge in International Court of Justice in 1950.
In Ambedkar’s own words
The Draft Constitution as prepared by the Constitutional Adviser as a text for the Drafting Committee to work upon, consisted of 243 articles and 13 Schedules. The first Draft Constitution as presented by the Drafting Committee to the Constituent Assembly contained 315 articles and 8 Schedules.
మరి నల్ల సూట్ తో నల్ల రాజ్యాంగ పొత్తమును బట్టి నిలచిన అంబేద్కర్ గారి విగ్రహములకు అర్థమేమి?
The Assembly then appointed the Drafting Committee which worked on the original draft prepared by Mr. B. N. Rau and produced the Draft Constitution which was considered by the Assembly at great length at the second reading stage.”
http://parliamentofindia.nic.in/ls/debates/vol11p12.html
Gandhiji never believed in superficial measures – Reservations being one of them. Some of his views are: –
“So far, as the Reservation in Government Departments is concerned, I think, it will be fatal to a good Government, if we introduce there the communal spirit. For administration to be efficient, it must be always in the hands of the fittest. There should certainly be no favoritism…. If we want five engineers, we must not take one from each community, but we must take the fittest of five, even if they were all Muslims or all Parsis. The lowest poor must, if need be, filled by examination by an impartial board consisting of men belonging to different communities.” (Google Search)
నిజానికి ఇప్పుడు ఏ వెసలుబాటు ఉన్నదో అది కొన్ని రూపాంతరములు చెందిన బెనెగళ్ళ నరసింగ్ రావు గారి చిత్తజము(Brain Child) గానీ అంబేద్కర్ గారిది కాదు. గాంధీజీ గారితో బాటూ ఈ సూత్రమును అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకించినారు. ఈ విషయమై గాంధీ గారు నిరాహార దీక్ష కూడా చేసినారు.
ఇంకొక విషయమేమిటంటే దళిత వర్గముల నాయికునిగా ఎవరిని చేస్తే బాగుంటుందన్న మీమాంస వచ్చినపుడు దేశ నేతల మదిన మెదలిన రెండు పేర్లు అంబేద్కర్ మరియు జగ్ జీవన్ రాం. జగ్ జీవన్ రాం గారు, ఆదాయపు పన్ను ఎందు కట్టలేదంటే మరచిపోయినానని కొంత అపఖ్యాతి మూట కట్టుకొనుటవల్ల అంబేద్కర్ గారికివ్వటము జరిగింది. ఇదంతా నేతలాడిన నాటకము ప్రజకు జూపిన బూటకము. ఇదియంతా కుటిల లౌకిక వాదమే! ఈ నిమ్న జాతి అన్న పేరుతో చేయుచున్న ఆరక్షణవల్ల మనలో ఒకరి మధ్య నొకరికి అగాథము పెరుగుటయే తప్ప తరిగినది తరుగునది లేదు. మానసిక యోగ్యత ను బట్టి విద్యాఉద్యోగావకాశములు వుంటే దేశము ప్రగతి సాధించగలదు కానీ అన్యథా కాదు.
ఇక వర్ణము, కులము ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.
మిగిలినది రేపు........
లౌకిక వాదము-చివరి భాగము
ఇక వర్ణము, కులము ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.
కులము అన్న మాటకు అర్థము కొరకు నేను 3 భాషా నిఘంటువు లను పరిశీలించితే మూడింటి లోనూ ఈ విధమైన అన్వయము చూచుట జరిగినది .
[తెలుఁగు]వంశము, జాతి, తెగ, ఇల్లు, శరీరము, అంతఃపురము
[తమిళము]కులమ్, వంశమ్, జాతి, ఇనం, ఉడల్, వీడు, అరమనై, కుడి.
[కన్నడము]వంశము, మనె, తెగె, వంగడ, శరీర.
ఈ మూడింటి లోనూ వంశము జాతి తెగ అని చెప్పినారే గానీ వేరేమీ తెలుపలేదు. ఇప్పుడు కులము అన్నది చెడ్డ మాట అనుకొందాము,అప్పుడు వంశము ,తెగ , జాతి అన్న మాటలు కూడా తప్పే కదా! కులము సంస్కృత పదమే అయినా వర్ణం అన్న పదాన్ని నాకు తెలిసినంత వరకూ ఆ భాషా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినారు. గీతాచార్యులు కూడా 'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః
తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' అని చెప్పినారు. అంటే వారి, వారి గుణాలు కర్మల ననుసరించి తగిన విధంగా నేనే ఈ నాల్గు వర్ణములను సృజించినాను అని అన్నారు. వర్ణము అన్న మాటకు బంగారు అన్న అర్థము కూడా వుంది. మరి నాల్గు వర్ణములలో ఏది మేలిమి బంగారము, ఏది కాదు అని మనము నిర్ణయించ గలమా ! ఈ విషయమై సమగ్రముగా చదువ వలెనంటే ఈ దిగువ లంకె లో చదువవచ్చు.
http://cherukurammohan.blogspot.in/
'క్యాస్ట్' అనేది ఆంగ్ల పదము కాదు అది 'పుర్తగల్లు' పదము. (From Portuguese Casta meaning race, breed, ancestry). Breed అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ’A group of organisms having common ancestors and certain distinguishable characteristics, especially a group within a species developed by artificial selection and maintained by controlled propagation.' అని యున్నది. అదే విధముగా Race అంటే 'A local geographic or global human population distinguished as a more or less distinct group by genetically transmitted physical characteristics.' అని వుంది. మరి మన 'వర్ణం' 'కులం' అన్న మాటలకివి సమానార్థకాలౌతాయా? ఇక 'ancestry' అన్న పదాన్ని మన 'కులము' నకు జత కలుపలేము. కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి (మంగళకరమైన ప్రతి పనికీ ముందుండేవాడు) అని వాడితే తప్పా.
క్రైస్తవములో ఈ విచక్షణ లేదా. వాళ్ళూ 'బ్లాక్ స్మిత్' 'పోట్టరర్' 'వీవెర్' మొదలగు పదాలను వాడుతారు కదా. అదేవిధంగా అరబ్బీ,ఫార్సీ, గ్రీకు, లాటిన్లలో కూడా ఆయా పనులకు సంబంధించిన పేర్లు ఆయా పనులు చేసే వారికున్నాయి. ఈ నాటికీ బ్రిటీషు పార్లమెంటు లోని విభాగాలను 'హౌస్ ఆఫ్ లార్డ్స్' హౌస్ ఆఫ్ కామన్స్' అంటారు. 'లార్డు' 'కామన్' అన్న అంతరాలు వాళ్ళలో ఈ నాటికీ లేవా! మనమెంత కాదనుకొన్నా ఇవి ప్రకృతి జన్యములు. ఇది భగవత్ సృష్టి. మనము లేదనుకొన్నంత మాత్రాన అవి లేకుండా పోవు. కులాన్ని గురించి మాట్లాడే గుణవంతుని ఇంట్లో పని మనుషు లెందుకు. అంతా సమమే అయితే ఎవరి పని వారే చేసుకోవచ్చు కదా.
స్థావరముల విషయానికొస్తే వెంపలి మఱ్ఱి రెండూ చెట్లే. ఏ జాతి చెట్టును ఆ పేరు తోనే పిలుస్తాము. కానీ దేని విలువ దానిదే. భగవంతుని సృష్టి లో ఏదీ ఎక్కువ కాదు ఏదీ తక్కువ కాదు. రెండూ పండ్లే యని 'మామిడి పండుకు' బదులు 'ఊస్తిపండు' ను తినగల్గుతామా! అట్లని అమిత చేదైన ఊస్తిని వాడనే వాడమా! మధు మేహమునకది అత్త్యుత్తమ ఔషధము. ఆకాశములో ఎగిరేవి అన్నీ పక్షులే. గండభేరుండాలు గ్రద్దలు కాకులు పిచ్చుకలు రామ చిలుకలు, దేని ప్రత్యేకత దానిదే. అట్లే జలచరాలలో గూడా. భగవంతుని సృష్టి అంతా 'భిన్నత్వములో ఏకత్వమే. '
ఇది మరి లౌకిక వాదమా లేక కుహనా లౌకిక వాదమా! పూర్వులు చెప్పినది అనుసరించి ఆచరించే వారు కొందరైతే అవమాన పరచి అగౌరవ పరచే వారు కొందఱు. మహమ్మదీయ దండయాత్రలకు పూర్వము వరకు సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో భాసించిన ఈ దేశమునకు హీనత దీనత నాపాదించిన వారు ముస్లిములు క్రైస్తవులు కాదా! మరి వారిని ద్వేషించుటకు బదులు మనలను మనమే ఎందుకు ద్వేషించుకొంటున్నాము. ఆధునికుడు మహనీయుడైన వివేకానందులవారు తమ భాషణలలో ఎప్పుడూ కుల దూషణ చేసియుండుట నేను వారి రచనలలో చదువుట తటస్థించలేదు.
వర్ణ వ్యవస్థను పాటించని వారి వలె పాటించే వారు కూడా వుంటారు. ఈ వాస్తవాన్ని గమనించండి. హిందు ముస్లిం సిఖ్ ఈసాయి అంటే అందరూ భాయీ, భాయీ అనేవారే! మరి అదే విధముగా కుల వ్యవస్థను పాటించే వారు పాటించని వారూ విద్వేషములు లేకుండా ఎవరి దారి వారిది గా వుంచుకొంటూ కూడా కలిసి మెలిసి ఉండవచ్చు కదా! తమ పంథా మాత్రమే సరియైనదనుట పిడి వాదము కాదా!
దేశమంతా కొనియాడిన సింధు అనబడు పూసర్ల వెంకట సింధు బాడ్మింటన్ రజతము Olimpics లో గెలిస్తే వైశ్య వర్గము తమ వర్గపు ఆడపడచు అన్న మాటలో తప్పేమిటో నాకు తెలిసి రాలేదు. వేరొక వర్గము వారు కూడా తమ ఆడుబిడ్డ అన్నారు. బహుశ అది అంత ప్రాచుర్యమునకు వచ్చినట్లు లేదు. అసలు వైదిక వ్యవస్థకు పట్టుగొమ్మలు వైశ్యులు. భగవంతునిచే ఆర్ధిక శక్తి వారికి నిర్దేశింపబడినది. నిజమైన వైశ్యధర్మావలంబి తన ఆదాయమునందు కొంత శాతము ప్రజా ప్రయోజనములకే ఖర్చు పెడతాడు. ఇది కూడా శాస్త్ర నిర్ణయము. తమ వర్ణము కాని వాడినైన నా చదువుకు ధన సహాయము వారు చేసియుండి యుండకపోతే నేను ఈ మాత్రము చదువగలిగే వాడినే కాదు. అంతటి వదాన్యులు, ఏ రోజూ తమ గొప్ప తాము ప్రకటించుకొననివారు ప్రపంచమునకు తమ వర్గమునుండి వచ్చిన ఒక ఆడుబిడ్డ దేశమునకు ఇంత ఎనలేని ఖ్యాతి తెస్తే మా బిడ్డ అనుట అంత తప్పయిన విషయమా! తమ బిడ్డ అని వారు చెప్పుకొన్నంత మాత్రాన ఆమె ఈ దేశపు బిడ్డ, మన అందరి బిడ్డ కాకపోతుందా! ఎక్కడో అక్కగారి ఆడుబిడ్డ కొడుకు కు 1st. Class వస్తే ఫోటోలు పెట్టి అటు వార్తాపత్రికలలో ఇటు గ్రంధముఖి లేక ఆస్య గ్రంధి లో (Facebook) ప్రచారము చేసుకొనుట లేదా! ఎవరి సంతోషము వారిది. పైగా అది అభ్యంతరకరమైనది కాదు. మరి ఎందుకీ విద్వేషము.
ఆనోభద్రాః క్రతవో యత్ను విశ్వతో వి దభ్దాసో అపరితాస ఉద్బితఃl
దేవానో యథా సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దివేదివేll ఋగ్వేదము25-14.
దశ దిశలనుండి ఉదాత్త భావములే ప్రసరించు గాక అన్న ఇంతటి ఉదాత్తములగు ఆలోచనములు వేదములు, ఉపనిషత్తులు, భారత సాహిత్యముకాక వేరు ఏ సాహిత్యమున కూడా ఆలోచనకే అందని విషయము.
ఇక మన దేవాలయములు మాత్రమే ప్రభుత్వపు అదుపాజ్ఞలలో పనిచేస్తాయి. పైగా దేవాలయముల నుండి వారి రాబడి రెండు విధములు. 1. దేవాదాయము 2. ధర్మాదాయము. ఈ రెండు సమాసములకూ విగ్రహము దేవుని వలన ఆదాయము, ధర్మమూ వలన ఆదాయము అని చెప్పుకోవలసి వస్తుంది. అంటే పంచమీ తత్పురుష సమామౌతుంది. వెనకటి కొక ఇల్లాలు చనిపోయిన తన సవతి పిల్లలతో ‘ప్రేమ మీయమ్మ వలె, పెట్టుబడి పిన్నమ్మవలె చూపిస్తాను’ అన్నదట. అది నేటి పరిస్థితి. ఈ కుహనా లౌకిక వాదులు మనలను దైవసమానులను చేసి ‘చూపు మనది, మేపు వారిది’ చేసినారు. మసీదులను చర్చిలను ఈ ఆదాయపు పరిధి లోనికి ఎందుకు తెచ్చుట లేదు. మరి వేలాంగణ్ణి గుడి కదా! అక్కడి ఆదాయమునకు ఎందుకు పరిధి లేదు. నాగూర్ దర్గా ఎందుకు ప్రభుత్వపు పరిధి లోనికి వచ్చుట లేదు.
ఈ నాడు ముద్రణా మాధ్యమము (Print Media), ప్రసార మాధ్యమములు (Broadcast and Telecast Media) హిందువుల చేయి దాటినాయన్నది ఒక కనిపించని యథార్థము. Steering చేతిలో వున్నవాడు తన ఇష్ట ప్రకారమే కదా బండి నడుపుతాడు. అందుకే తప్పు ఉన్నదా లేదా అన్నది పూర్తిగా తెలుసుకోకనే హిందూ గురువులను దుయ్యబడతారు బాబాలను మాటల తూటాలతో చిత్రహింస చేస్తారు. నా ఉద్దేశ్యము బాబాలలో చెడ్డ వాళ్ళు లేరని కాదు. మరి మిగతా రెండు మతాలలో మాట పెద్దలు లేక కుహనా బాబాలు, లేక Holistic Healings పేర్లతో ఎంత విపరీతముగా మభ్యపెడుతున్నారో? మరి అటువంటి వారిని వలసిన మేరకు ఎండగడుతూ వున్నారా! మరి దీనిని లౌకిక వాదము అనగలుగుతామా!
ఈ విధముగా చెప్పుకొంటూ పోతే ఎంతయినా చెప్పవచ్చు. నేను ఎంతో విధేయతతో మీకు విన్నవించుకొనేది ఏమిటంటే దయతో సనాతన ధర్మ పారాయణులైన మీరు సక్రమమైన రీతిలో ఆలోచించి ఈ Secularism పేరుతో జరుగుతూ వుండే వాస్తవాలను ఎండగట్టి, మన దేశములోనే మనము రెండవ తరగతి పౌరులుగా జీవించే ఈ దౌర్భాగ్యము నుండి విముక్తి పొందె మార్గమును మనసారా యోచించి తగిన ప్రణాళికను అనుసరించి ఈ ధర్మమునకు ఈ ధర్మావలముబులకు కుహనా లోకిక వాదము నుండి విముక్తి లభింపజేస్తారని ఆశిస్తూ శెలవు తీసుకొను చున్నాను.
స్వస్తి.
No comments:
Post a Comment