Saturday 8 August 2020

కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి-13

 కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి-13 

                                            (స్వకపోల కల్పితము)

https://cherukuramamohan.blogspot.com/2020/08/13-public-limited-companies-microsoft.html

ఒకసారి మహా మేధావి యగు రమణారెడ్డి అనేకానేక సార్వజనీన సంస్థలలో (Public Limited Companies) లో పని చేసిన అనుభవముతో Microsoft Corporation, USA కు ఉద్యోగమ కొరకు తన ప్రవర(Bio Data)తో దరఖాస్తు పెట్టుకొన్నాడు. కొన్ని రోజులతరువాత అతనికి ఈ విధమైన జవాబు వచ్చింది ఆంగ్లములో:

Dear Mr. Maha Pandit

You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained.

Thanks

Bill Gates.

రమణారెడ్డి ఆనందముతో అరిచి, తెలుగువాడు కాబట్టి. ప్రెస్ రిపోర్టరు అయిన తన అల్లుడు రేలంగిని పిలిచి అతనికి తెలిసిన తెలుగు పత్రికా విలేఖరులను అందరినీ పిలిపించమన్నాడు. అందరూ సమావేశమైన తరువాత ఆయన తన అల్లునితో “నేను ఈ ఉత్తరములోని ఆంగ్లమును చదువుతాను, నీవు తర్జుమాచేసేది’ అన్నాడు. ‘ఓహ్! అదెంతపని” అన్నాడు రేలంగి. రెడ్డిగారు ఉపన్యాసాన్ని ఈ విధముగా ప్రారంభించినారు.

“Dear Scribes I have received letter from Microsoft USA. I shall let you know the contents of it”. My Son-in-Law Relangi will translate the contents of the letter into Telugu, as I read out the same in English.”

రేలంగి, ఫిరంగిగా మారి తెలుగు గుండ్లను ఈవిధముగా ప్రేల్చనారంభించినాడు.

"విలే ఖరులారా (విలేఖరులారా అనుటకు బదులు) నా కాకి మెత్త (My Crow Soft) నీవౌనొక (you yes a) నుండి నాకు లేఖ అందినది. అందులోని సారాంశమును మీకు తెలుపుతాను. మీరందరూ తెలుగు విలేఖరులు కాబట్టి నేను వారు పంపిన ఉత్తరమును, ఆంగ్లములో, యథాతథముగా చదువుతాను. నా ఉభయభాషా ప్రవీణుడైన అల్లుడు రేలంగి (అంటే నేను అని గుండె చరిచి చెప్పినాడు) ఆంగ్లమునుతర్జుమా చేసిన తెలుగులో మీకు వినిపిస్తాడు.  మీరు వ్రాసుకోండి." అని తర్జుమా చేసినాడు ‘ఉభయ భాషా ప్రవీణ’ రేలంగి గారు.

ఆ ఆంగ్ల పఠనము, తెలుగు అనుసరణ ఈ విధముగా సాగినాయి.

Dear Mr. Ramana Reddy >>ప్రియమైన శ్రీ ‘రామన్నా సిద్ధం’ (Ramana Reddy కి తెలుగు తర్జుమా, Ramana అన్న మాటను రామన్నా గానూ, రేలంగి గారు, Reddy అన్నమాటను Ready గా తీసుకొన్నారు) మహాశయా

You do not meet >>మీరు కలువనే కలువరు

Our requirement >>మాకు అవసరము అంటే మీ కలయిక మాకు అవసరము అని అర్థము.

Please do not send any further correspondence >> మీరు తిరిగి జవాబు తెలిపే ప్రయత్నమూ చేయవద్దు

No phone call >>ఫోన్ లో మాట్లాడే పని కూడా చేయ వద్దు

Shall be entertained >> తప్పక రంజింపచేస్తాము అంటే మీరు వచ్చినారంటే మిమ్ము సంతోషపరుస్తాము.

Thanks >> కృతజ్ఞతలు

Bill Gates.  >> చీటీ గేట్లు

తరువాత రోజు దిన పత్రికలలో వచ్చిన ఈ వార్త చదివి నవ్వి నవ్వి Treatment కు Dr.Prabhakar Reddy వద్దకు పోయినారట.

రేలంగి రమణారెడ్డి-15

         

        😕😕😕😕😕😕😕😕రేలంగి రమణారెడ్డి మరుజన్మలో అదే పేర్లతో TEACHER మరయు STUDENT గా పుట్టినారు.తరగతి లో వారి సంభాషణ:

టీచరు రమణారెడ్డి : నేటి బాలలే భావి పౌరులు. కావున సత్ప్రవర్తన మీలో ఎంతో అవసరము.  మీరు తరగతిలోని బాలికలందరినీ సోదరీమణులుగా భావించవలె.

అలాగే సార్ అని విద్యార్థులందరూ బదులు పలికినారు. ఒక్క రేలంగి మాత్రము మిన్నకుండినాడు. రేలండీ లేచి నిలబడు అన్నాడు రమణారెడ్డి. అందరూ ‘సరే’ అన్నా నీవెందుకు నోరు మెదపలేదు.

రేలంగి: నేను అత్యంత పితృసేవా తత్పరుడను సార్. నాతండ్రికి కళంకమును ఆపాదించలేను.మీ మాటను ఔనంటే నేను దుష్ప్రవర్తకుడనే!

టీచర్ రమణ రెడ్డి : ???


రేలంగి రమణారెడ్డి-16

సన్నివేశము

Railway Station

రమణారెడ్డి పల్లెటూరివాడు.  చెరుకు నములుతూ Train ఎక్కబోతున్నాడు.

రేలంగి Ticket Examinar

రేలంగి: మీరు తినే ఆ చెరుకు కణుపు పారవేసి ఎక్కండి. ట్రైన్ లోపల చెరుకు నమల కూడదు.

రమణారెడ్డి చెరుకు నములుతూనే: ఏం! రైలు లోపలి వెళ్ళి నమిలితే చేరుకులోనుండి రసము రాదా!

రేలంగి: ???

కొనకుండా నవ్వుకొనండి-రేలంగి రమణారెడ్డి-17

రమణా రెడ్డి గారు రేలంగి గారికన్నా ఆంగ్లము

ఎక్కువగా చదివినవారు.

ఒకరోజు 'ఆయన రేలంగి గారితో " మీకు ఆంగ్లము తెలుసా?"

అని అడిగినారు.

రేలంగి 'ఓ! ఎందుకు తెలియదు" అని అన్నారు                               

వెంటనే రమణారెడ్డి గారు "అయితే ఆ స్తంభము వద్ద నిలుచున్న

చిన్నపిల్లను మీ వద్దకు రమ్మని చెప్పండి" అన్నారు.

రేలంగి వెంటనే ఆఅమ్మాయివైపు చూస్తూ "Come Here" అన్నారు.

ఆ అమ్మాయి ఆయన వద్దకు వచ్చింది. రేలంగి గారు రమణారెడ్డి గారివైపు చూసి కాలర్ ఎగురవేసినారు.

రమణారెడ్డి గారు "ఇపుడు ఆ అమ్మాయిని తిరిగీ వచ్చిన చోటికే వెళ్ళమని చెప్పండి"అన్నాడు. రేలంగి గారు వచ్చిన English అంతా వాడేసినారు. అందుచే

రేలంగి గారు "చచ్చిందిరా గుడ్డు" అని మనసులో అనుకొని, గంభీరముగా ఆలోచించి స్తంభము వద్దకు వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తూ "Come Here" అన్నారు.

తరువాత రమణారెడ్డి గారికి నోట మాట రాలేదు.

No comments:

Post a Comment