పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర
ఆస్య గ్రంధి సంబంధ ఉపోద్ఘాతము
పృథ్వీరాజ్
చౌహాన్ రాణీ సంయుక్త, రాజ జయచంద్ర రాథోడ్, షహబుద్దీన్ మహమ్మద్ గోరీ పేర్లు ఎంతమందికి
తెలుసును అన్నది నేను అంచనా వేయలేను. పృథ్వీరాజు, రాణీ
సంయుక్తలది ప్రేమవివాహము.
పృథ్వీరాజు ఆమెను తన గుఱ్ఱము మీదికి లాక్కొని తన దేశమునకు వెళ్లి పెళ్ళి
చేసుకొన్నాడు. జయచంద్రుడు గోరీ సహాయముతో పృథ్వీరాజును హతమార్చినాడు అన్నది
కొందరికి తెలిసి ఉండవచ్చు. ఇందలి నిజానిజాలు నాకు చేతనయినంత మేరకు నిగ్గు
దేల్చే ప్రయత్నమూ చేసినాను.
ఈ
విషయమై నేను వ్రాయుటకు తీసుకొన్న గడువు 10 రోజులు. ఎన్నేన్నో పుస్తకములు, E-పుస్తకములు త్రిప్పి అవసరమగు
విషయ సేకరణ గావించి దానికి నా తర్కమును జోడించి ఒక ఉపయోగకరమైన రచనా
రూపమునకు తెచ్చి మీముందు ఉంచుచున్నాను.
ఇది
ఒక Image నో
లేక Video నో లేక Photograph నో లేక Stock
YouTube Files నో
Likes కొరకు మీ ముందుంచుట కాదు. గర్వించదగిన ఈ దేశ చరిత్రను మీరు తెలుసుకొనవలెను అను
తపన ఈ కష్టమునకు నన్ను పాలుపడ జేసింది.
నాకు
తెలుసు చాలామంది ఆస్య గ్రంధిని కేవలము హాస్య గ్రంధిగా వాడుతారు. కొందరు
FB Friendship
Accept చేయుటతో సరి. మళ్ళీ తెరువరు . తెరిచిరి పో, అది Good Morning
Good
Afternoon, Good Night లకే. Video ఒకటి FB
లో చక్కర్లు కొడుతూనే వుంది. అంతంతమంది దానిని share చేయుట చేత పొందే Likes కంటే తమకు అర్థమైనది తమదైన
శైలిలో వ్రాస్తే తృప్తి ఉంటుంది. నలుగురు చదివితే ఆనందము ఉంటుంది. ఆవిధముగా Share
చేయుటచేత తామెంత తెలుసుకొన్నాము అన్నది ప్రక్కన ఉంచుతున్నారు. ఎవరికి వారు You
Tube లో Search చేస్తే చాలు ఏరోజుకారోజు You Tube లోనే గడుపవచ్చు. లేక అలాంటివి
Browse చేసి కూడా కాలము వెలిబుచ్చవచ్చు.
కొందరు
అసలు వ్యాసము దేనిని గురించి వ్రాసినారు అన్న విషయముతో సంబంధమే లేకుండా Good Morning అని Comment Box లో పెట్టేస్తారు. ఈ Good
Morning లు ఉనికిని చాటుకొనుటకా
అన్నది నాకర్థము కాని విషయము. కొందరికయితే చదవడమే బద్ధకము. ఈ మధ్య కాలములో తెలుగు సరిగా రాని, పలుకలేని పరమతస్తులు తమ Book
Shelf లలో
తెలుగులో ఎందరెందరో వ్రాసిన భగవద్గీతలను ఇంకా ముఖ్యమైన వేదాంత గ్రంధములను
పెట్టుకొని వక్రభాష్యాలు You Tube లో Load చేస్తున్నారు. అదే
నిజమనుకొనే హైందవులు ఎంతమందో! పరమతస్తులయిన వారు ఆపనయినా చేస్తున్నారు. అసలు మనకు
అవి అంటేనే Allergy.
ఈ
విషయము మీకు తెలుసునో లేదో యూరోప్ లో దినదినమునకు జనన సంఖ్య క్రైస్తవులలో
తగ్గిపోవుచున్నది. సంఖ్య పెరుగుతుంది కదా వారి శత్రు మతస్తుల రానిస్తే వారు వచ్చి
తమ జనాభా అభివృద్ధి చేసుకొంటున్నారు. ఇంకొక విషయము, London 1500 మంది Capacity
ఉన్న Church కి Professor R. వైద్యనాథన్ ఆదివారము నాడు పోతే 7గురు కూర్చొని
యున్దినారట. ఈయన 8 వ వాడు. పలు
యూరోప్ దేశాలు తమ Church లను ముస్లీములకమ్మివేస్తే వాళ్ళు ఆ స్థలములో మసీదులు
కట్టిస్తున్నారు. మన స్వామినారాయణ్ దేవస్థానము వారు, ISCON వారు, కూడా విదేశాలలో
Church లను కొని దేవాలయాలుగా మారుస్తున్నారు. Europe, Eurebia గా మారబోతూ వుందని
గగ్గోలు చెందుతున్నారు. ఇంకొక విషయము ఘజ్వా-ఏ- హింద్ హిందూ దేశమును ముస్లిం
దేశముగా మార్చే ఉద్యమము చాప క్రింద నీరులా ప్రాకుతూనే వుంది. దయతో వితండ లౌకిక వాదము విడిచిపెట్టండి.
నిజానికి
మీ ముందున్న రాక్షస సమస్య ఇది. దీనిని నివారించాలంటే ముందు మీ సనాతన ధర్మమును
గూర్చి అవగాహన ఏర్పరచుకొని తీరవలసిందే . మీ ధర్మము రాను రానూ ఎంత దిగజారుతూ
వున్నదని మీరే తెలుసుకోలేక పోతే, తెలుసుకొని
తగిన చర్యలు చేపట్టక పోతే ‘పవిత్రమైన గంగ సముద్రములో కలిసినట్లౌతుంది. దానికి
కారణమైన మీకు పరితాపమే మిగులుతుంది. చదవండి
ఆకళింపుచేసుకోండి, వ్రాయండి చదివించండి , పిల్లలకు మన ధర్మమునకు సంబంధించిన
సంస్కారములను నేర్పించండి.
అందుకే
కఠోపనిషత్తు లోని ఈ శ్లోకమును వివేకానందుడు మంత్రమువలె జపించేవాడు:
ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత
క్షురస్య ధారా
నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ
విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన
మార్గం దుర్గమమైంది. ఈ దారిన పయనించుట
అసిధారా వ్రతమే! అంటే పదునైన
కత్తి అంచుపై నడవడమే! అయితే పెద్దల మాటపై గురుత్వము, సంకల్ప బలము
ఉన్న హృదయానికి సాధ్యము కానిది ఏముంది?
స్వస్తి
మన పూర్వపు రాజుల
గొప్పదనము గ్రహించండి మీరు తెలుసుకొని మీ పిల్లలకు తెలుపండి.
No comments:
Post a Comment