Saturday, 28 December 2019

అప్రాచ్య కాలగణనము

అప్రాచ్య కాలగణన

ప్రాచ్యులు అంటే తూర్పు దిశలో వుండేవారు. అప్రాచ్యులు అంటే తద్విరుద్ధముగా పశ్చిమ దిశలో ఉండేవారు, అంటే పాశ్చాత్యులు అని అర్థము. ఇందులో చెడు అర్థము లేదు.
      క్రిస్మస్ ను గూర్చి వ్రాసిన వ్యాసానికి లభించిన ఆదరణకు పాఠకులకందరకూ  ఇందుమూలముగా ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను.. ఇపుడు పాశ్చాత్య  నూతన సవత్సరము సమీపించినది. మరి దానిని గూర్చికూడా  చదివి అందున్న లొసుగులు గ్రహించవలెనని నా ఆకాంక్ష. నిజమునకు నాకు ఈ పనులు నా వయసుతో పోలిస్తే శ్రమతో కూడినవే. కానీ నాలో వున్న, తెలియజెప్పవలెనను తపన నాతో ఈ పని చేయిస్తూ వుంది. చాలా మంది యువకులకు ఇందు నేను పొందు పరచిన వాస్తవాలను చదివిన తరువాతనైన మన పూర్వుల శాస్త్ర పరిజ్ఞానమును, జగతికి వారు చేసిన నిస్వార్థ సేవను గుర్తించండి. శాస్త్రీయ దృక్పథములేని పరమత పర్వదినముల జోలికి పోవద్దండి. మన ఉగాదిని తెలుగు సంవత్సరాది అనంటారు. అంటే తెలుగు వారి పండగ అనేకదా! మన రాష్ట్రములో ఉండే పరమతస్తులు కూడా వారి తాత ముత్తాతల కాలమునుండి తెలుగువారే కదా! మరి, ప్రత్యేకముగా ఏ దేవునికీ సంబంధించని , తెలుగు పండగను ఎందుకో జరుపుకోరు.  మనమెందుకు January 1st ఒక పండుగ కంటే ఎక్కువగా జరుపుకొంటూ వున్నాము. ఒక్క సారి ఈ క్రింది లంకెలో 'ప్రాచ్యా ప్రాచ్య కాలమానము'ను గూర్చి చదవండి. వాస్తవమును  గ్రహించండి.
ఈ వైదిక దేశము భూలోకములోనే మొదట పుట్టినది. భారత దేశము అన్నపేరు పెట్టుటకు మునుపు ఈ దేశము పేరు అజనాభము. అజుడు అంటే పరబ్రహ్మ. ఆయన నుండినే బ్రహ్మ,విష్ణు మహేశ్వరులుద్భవించినారు. నాభి అంటే బొడ్డు(Center Of Gravity) . ఈ భూమి మేధస్సుకు నిలయము. తురుష్కులు, పాశాత్యులు మన జ్ఞాన సంపదలగు పుస్తక భాండాగారములను అగ్నికి ఆహుతి చేసి, తస్కరించి, నయానో భయానో మనలను మభ్యపెట్టి సంస్కృతమునకు దూరముగానూ ఆంగ్లమునకు చేరువగానూ చేసి నిష్ప్రయోజకులను చేసినారు. కనులు తెరిచి ఇకనైనా వారి విషపుకోరలనుండి బయటపడుదాము.
కాలగణన (పాశ్చాత్య శైలి)
అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు.  అయినా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించినారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.
క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది.  ఇచ్చిన అప్పులు సంవత్సరము మొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది.  తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప  బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanac   అని గూడా అన్నారు. నిజానికి దీనిని Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును.  ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.
నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక.  రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి.  సంవత్సరానికి 10 నెలలుండేవి.  మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు.
పంపీలయస్  చక్రవర్తి క్రీ llపూll 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిది కాదనుకొని 355 రోజులు చేసినారు.  క్రీ ll పూll 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది.
అంటే ప్రపంచమంతటా నూతన సంవత్సరము  వసంత ఋతువు(spring) లో, మార్చ్ నెల ‘spring’ లో నె వస్తుంది, మొదలయ్యేది.  తరువులు చివురులు తొడుగును.  అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా!  పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా!  కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ మొదలిడినారు.
తరువాత  క్రీ ll పూll 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి  29 రోజులు చేసి, సంవత్సరమును జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది.  దీనిని leap year  అన్నారు.
సీజరు మేనల్లుని కొడుకైన ఆక్తెవియస్ సీజర్ ఆగస్టస్ సీజరు అన్న పేరుతొ 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్  అను నెలకు (సెక్స్ట్=6) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩ సంవత్సరములకు మార్పు చేసి ,  ఒక రోజును ఫిబ్రవరి కి కలిపేవారు.
తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము  పెరిగి  సంవత్సరానికి 365.242199  రోజులు చేసినారు.  ఇందువల్ల ఏడాదికి 11 నిll 14సెll తేడావస్తుంది.  దీనిని 13 వ పోపు గ్రెగొరీ VIII క్రీ llశll 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో ప్రవేశ పెడుతూ లీపియర్ ను  తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ  ఫిబ్రవరి కి 1 రోజును కలిపేవారు.  అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు  400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమే లీప్ ఇయర్స్ గా తీసుకొన్నారు. 4 చేత భాగింపబడేవి తీసుకోలేదు.  ఏ, ఏ మార్పును చెయుటకుగానూ October 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు బలియై పోయినాయి.  అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకోను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వక్కాణించుచున్నారు.
జనవరి:      జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూ ఉంటాడట.  ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది.  29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నెలగా జూలియస్ సీజరు  చేసినాడు.
ఫిబ్రవరి:      రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో మతముపై నమ్మకము కలిగినవాడు
 పునీతుడగుటకు (To get purified) జరుపుకుంటారు.  దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి.  తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్టస్ సీజరు ల వల్ల  28 రోజులై కూర్చుంది.
మార్చి: మార్స్  రోమనుల యుద్ధ దేవత.  ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో  డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు.  ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.
ఏప్రిల్:        రోమన్ల వసంత దేవత అమ్నియో ఏప్రిట్ ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.
మే:    భూగోళాన్ని తన భుజస్కంధాలపై  మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి.  అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి  మండలం) దీనిని అంటే ఈ నెలను పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.
జూన్: జూపిటర్ భార్య జూనో  ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది.  వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది.  దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.
తరువాత నెలల పేర్లు పెంటలిస్,  సేక్స్టలిస్, సెప్టంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి.  5, 6 నెలలైన  పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము.  7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.
సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్త 7వ నెల
అక్టోబర్ – అక్ట్ అంటే అష్ట 8వ నెల
నవంబర్ – నవ అంటే నవ 9వ నెల
డిసెంబర్ – డెస్సి అంటే దశ 10వ నెల
 దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.
 మిగిలినది  2 వ భాగములో.. 

అప్రాచ్య కాలగణన - 2 
ఇక వారములైన సండే, మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి భాషలలోనికి మర్చుకొన్నావే. అసలు ఒక వారములోని దినములు ఆదివారముతోనే  ఎందుకు మొదలు కావలెనంటే వారు చెప్పలేరు. అడి ఎట్లు అని మనము చెప్పగలముజ్యొతిశ్శాసత్రములోని ఈ శ్లోకమును గమనించండి.
అర్కశుక్ర   బుధః చంద్ర మండో జీవ కుజః పుమాన్  l 
సారధ్య ద్వి ఘటికా హోరాః  ఇత్యేతత్  హోరా లక్షణం ll 
ఘటిక అంటే ఘడియ. 1ఘడియ=24 ని.సార్ధ దవిఘటిక అంటే 2  1/2  ఘడియాలి. ఒక ఘడియకు 24 నిముసములు అప్పుడు 2  1/2=24+24+12+60 నిముసములు, పై శ్లోకములోని గ్రహములను యథాతతముగా వ్రాసుకొని, అరక అంటే ఆదిత్య అంటే ఆది హోర(Hour) తొ వారము లోని మొదటి రోజు మొదలవుతూ వుంది. హొరనే పాశ్చాత్యులు Hour గా మార్చుకొన్నారు. 24 గంటలు ఒక రోజు కదా! అరక నుండి వరుసగా 24 ఎంచితే అడి 'సోమ' వద్దనిలుస్తుంది/ 'సోమ' నుండి 24 ఎంచితే kuj
అ అనగా అంగారకుడు అనగా 'మంగళ' వద్దనిలుస్తుంది. ఆవిధముగా వారముల వరుస ఏర్పడినది,
పైపెచ్చు వారిలోని ఒక వర్గమునకు  ఆదివార్తము వారాంతము. ఎందుకంటే వారమురోజులు ఈ లోకమును సృష్టించి అలసిపోయిన వారి దేవుడు తరువాతి రోజు శెలవు తీసుకొన్నాడు. ఆరోజును వారు  ఆదివారముగా భావించి చర్చికి పోతారు. అంతకు మించి తర్కమునకు నిలిచే జవాబు వారివద్ద లేదు.
ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము  భూభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది.  దానిని ఆ సంవత్సరము లోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో)  కలుపుకొనవలసి వస్తుంది.
వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ రోమన్ క్యాలెండరు తప్ప ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు కొన్ని పాశ్చాత్య దేశములు వారి, వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి.  మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా! పాశ్చాత్యులది శాసనము. మనది నిర్దుష్టమైన శాస్త్రీయ గణనము.
మన కాలగణను గూర్చి మన ఉగాదికి తెలియజేస్తాను.
ఇది మన సాంప్రదాయమా!
అది ప్రభుత్వ ఉత్తరువై,ఆంగ్లేయ కేలెండరును పాటించినంత మాత్రాన వారి ఆచార వ్యహారాలు పాటించ నవసరము లేదన్నది నా అభిప్రాయము. మతముల పేరుతో వ్యవహరించే రెండు సమాజములు అన్యులను తమ మతములో కలుపుకొనుటకు ఎన్నో ప్రలోభములను చూపుతూ వుంటే, మన ధర్మము మనది అని నాబోంట్లు చెప్పినా , వినక ఆచరించే వారు ఆచరించగా, అది సరియైనదే అని అనవసర సానుభూతి చూపే స్వధర్మానుచారులు ఎందఱో వున్నారు. అట్టి ఉదార చరితులకు ఈ పద్యములు అంకితము
అరుపులు కేకలున్ మరియు నర్థము పర్థములేని వాగుడున్
తురగమునెక్కి తూలుచును దూరుచునన్యుల నర్ధరాత్రమున్
మెరుపులవోలు భామినులు మేనికి వస్త్రము లేక చిందులన్
పరువును వీడి త్రొక్క బహు బాగని మెచ్చుటె న్యూయియర్సుడే!
మీటింగొక్కటి వేసి సేవకులతో మిత్తెంతొ జాగ్రత్తతో  

చాటింగన్నది కట్టిపెట్టి సరిగా సారా  సమూహాల, కం

పీటింగ్ బైకుల రోడ్లపైన మరియున్ పిక్చర్లు క్లబ్ పబ్బులన్

హీటింగ్ ఫైటుల కేజువాలిటి తతిన్ హెల్ చేర్చ ఉత్తర్విడెన్

స్వస్తి.

Thursday, 19 December 2019

క్రైస్తవము-క్రిస్మస్ పండుగ

క్రైస్తవము-క్రిస్మస్ పండుగ
https://cherukuramamohan.blogspot.com/2019/12/blog-post_19.html

సనాతన ధర్మావలంబులగు పాఠకులకొక విన్నపము. క్రిస్మస్ దగ్గరికి వస్తూవుంది. శాంటాక్లస్ పిల్లలకు ఇంకా దగ్గరికి వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చి ఉంటాడు. మీరుకూడా మీ పిల్లలుఆతని వద్దనుండి గ్రహించే బహుమతులు చూసి సంతోషించి కూడా వుంటారు. ఆవిధముగా పిల్లలుఆ బహుమతులు తీసుకొను నపుడు మీరు ఉదాసీనతతో వ్యవహరించినారంటే ఆ లేత హృదయములో ఒక ఆకర్షణను ఆ మతము పై మీరు కలిగించుచున్నట్లే! మీరు తిరుమల లడ్డు ఇచ్చినా వారు తీసుకోరు మరి మనము ఆ బహుమతులకోరకు పిల్లలను ఉసిగోల్పుట తగునా! మరి అటువంటి పెద్దలలో ఎంత
మంది శాంటాక్లాస్ కు క్రిస్మస్ కు సంబంధము ఏమిటని ఆలోచించినారోతెలియదు. అసలు మన పండుగ కాదుకదా మనకెందుకు అందులో భాగస్వామ్యమన్న దృష్టి తోఆలోచించము. మన సంక్రాంతి, మన ఉగాది, మన శ్రీరామ నవమి, శివరాత్రులలో వారు పాలు పంచుకొంటున్నారా! మరి మీరెందుకు చేస్తున్నట్లు? వారు తెచ్చిపెట్టుకొని చేసుకొంటున్న పండుగలు రెండే. ఒకటి క్రిస్మసు రెండు New Years Day. రెండూ కృత్రిమమే! నేడు నేను మొదటి దానిని గూర్చి సవిస్తారముగా తెలియజేసే ప్రయత్నములో ఈ దిగువ లింకును మీ ముందు వుంచుచున్నాను. నాకు చేతనయినంత సమగ్రముగా వ్రాయుట చేత వ్యాస విస్తరించింది. అయినా ఓపిక తెచ్చుకొని చదివేది.
ఒక కట్టడమునకు పునాది ముఖ్యము. మరి ఈ మతము యొక్క పునాది ఎంత లోతు అన్నది తెలుసుకొని మీ ధర్మము యొక్క పునాదులు ఎంత గట్టివో ఎంత లోతైనవో తెలుసు కొనేది.
ధర్మఏవ హతోహంతి ధర్మోరక్షతి రక్షితః.
తస్మాధ్ధర్మోనహంతవ్యోమానో ధర్మో హతో వధీత్
ధర్మాన్ని చంపేస్తే అది మనల బతకనీదు. దానిని రక్షిస్తే అది మనల కాపాడుతుంది.
మరొక్కవిజ్ఞప్తి . సావకాశముగా చదువుతారని శ్రమకోర్చి ఈ వాస్తవాలను మీ ముందుంచుచున్నాను. ముఖ్యముగా నేటినుండి 25 వ తేదీ వరకు, ఆ తరువాత కూడా ఈ దిగువ కనబరచినలంకె లోచదువుతారని నమ్ముచున్నాను.
http://cherukurammohan.blogspot.in/2015/12/blog-post.html

  క్రైస్తవము-- క్రిస్మస్ పండుగ

మతము అన్న మాటకు స్థూలముగా అభిప్రాయము అని అర్థము. ఈ అభిప్రాయమును తమ విజ్ఞత ననుసరించి సామాన్యులకు దిశానిర్దేశము చేయగలిగినవారు దేవ దూతలు, ప్రవక్తలు కగలుగుతారు. ఈ విధముగా తెలియబరచిన అభిప్రాయమును హృదయపూర్వకముగా అంగీకరించి ఆ మతమును అక్కున చేర్చుకొంటేదానివల్ల వ్యక్తికి గానీ సమాజమునకు గానీ దేశమునకు గానీ ఎటువంటి నష్టము వాటిల్లదు. పై పెచ్చు ఎంతో మంచి కూడా ఒనగూరవచ్చు. అట్లు కాకుండా కత్తి యంచు కంఠానికి ఆనించి 'తాతను చూపుతావా తద్దినము పెడతావా ' అనుట వల్లనే ప్రజలలో ఎకాభిప్రాయములేక ఎవరి మతము వారిదై పోయింది . పూర్వము అంటే ఒక 50 నుండి 100 సంవత్సరాల  కాలములో
ఆంగ్లములో గొప్ప చదువులు చదివిన వారు , ఆంగ్ల వైద్యమును అభ్యసించినవారు భారతీయుల నిత్య నైమిత్తిక జీవితములోని కొన్ని పద్ధతులను ఎద్దేవా జేసేవారు. అప్పటి ప్రజలు కూడా అది నిజమేనేమో అనుకొనేవారు. అసలు ఇప్పటికీ అలాంటి వారున్నారు. కానీ ఇప్పుడు మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయముల గురించి చర్చించుకుందాము. క్రైస్తవం యూదుమతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో చెప్పవలసి వస్తేయూదు మతము యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతము నుండి మత గ్రంథములను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథములతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతముల నుండి కూడా కొన్ని విషయములను తీసుకున్నారు. ఉదాహరణకు , క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం , ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి విషయాలను ఇతరుల నుండి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం అభివృద్దిలో మంచితో పాటు  చెడు పద్దతులు కూడా పొందుపరచినారందున.  నేడు ఆ మతానుయాయులు ఎన్నో విధములగు భ్రమలు కల్పించి, వారి అధిష్టానము నుండి తాము చేయు పనులకు ఆమోదము పొందకనే ఎన్నో విధములగు ఈ సనాతన ధర్మపు నియమములను తమవిగా చెప్పుకొని జన సముదాయములోనికి చొరబడుచున్నారు. కారణము విదేశ సంస్థ్లలనుడి వారండుకొనే ధనపు సంచులు.  మరి వారిలో, వారి మతములో నీతి నిజాయితీకి స్థానము కలదో లేదో వారి ఊహకే వదలవలసిన విషయము. నా లేఖనము యొక్క ప్రధానోద్దేశ్యము క్రిస్మస్ పండుగను గూర్చి వ్రాయుటయే కానీ అన్యథా కాదు.  క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి మాట్లాడుకొనుటకు ముందు క్రైస్తవులు అంటే ఒకే వర్గమా లేక వివిధ వర్గములా అన్నది ముందు చూద్దాము.

క్రైస్తవులు రెండు విధములు. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish church), మోర్మోనులు(Mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(Russian orthodox), జెహొవా విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్ (orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), బెర్షిబాలు(Beersheba)
ప్రెస్బిటేరియనులు(Presbyterian), రోమను క్యాథలిక్కులు (Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్  ఆర్తోడాక్స్(Eastern Orthodoxy), పెంతెకోస్తు(Pentecostals). ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. క్రీస్తు పుట్టుకకు సంబంధించిన నిజానిజాలు కూడా వేరొక పర్యాయము చర్చించుకొందాము.
క్రైస్తములోని మనకు తెలియని కొన్ని వాస్తవాలను గూర్చి తెలుసు కొందాము. క్రైస్తవము  యూరపు మొత్తాన్ని దాదాపు పది శతాబ్దాలు పరిపాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవమును అధికార మతముగా ప్రకటించి దేశమును వారే ఏలేవారు, అట్లు రాజ్య పాలకులు క్రైస్తవులు కాకపోతే  స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల
కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఏ శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో కూడా ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాల మీదనే ఆధారపడి వుండినవి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్దం చేసింది. అంటే అప్పటికి వాటికన్, పొప్ ల వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇటువంటి విషయములు వాటికన్ వారు మనకు తెలియుటకు ఇష్టపడరు. ఇవి కాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ఇంక్విజిషన్ (Spanish Inquisition), క్రూసేడులు, బానిసత్వము, విచ్ హంట్(Witch Hunt) మొదలైనవి. గోవా ఇంక్విజిషన్ ను  కూడా ఇందులో చేర్చవలసి యుంటుంది.
గోవా అన్న పేరు వినగానే మనకు గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు. కానీ ఆ అందాల, ఆకర్షణల  వెనుక భయంకరమైన చరిత్ర ఉంది. లక్షలాది హిందువుల జీవితములు క్రైస్తవమత ఛాందసత్వమునకు బలియైనాయి. ఈవిషయము ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు. తెలిసినవారు తక్కువ అన్న నమ్మకముతో సంక్షిప్తముగా తెలియజేయుచున్నాను.
భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన వచ్చిన క్రైస్తవులు (పోర్చుగీసువారు. ఈ దేశము సంపదలకు నిలయమని కనుగొన్నాడు వాస్కోడగామా. అందుకే అంతులేని సంపదను ఒకటి బట్టు మూడుమార్లు వచ్చి తన మాయోపాయములచే ఇచ్చటి సంపద దోచుకొన్నాడు. వీరు రానురానూ స్థానికముగా ఏలే  రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకుని భారతదేశాన్ని ఆక్రమించారు. ఆవిధముగా గోవాను ఆక్రమించిన తరువాత అచ్చటి ప్రజలను క్రైస్తవము లోనికి మార్చవలెనని  పొర్చీగీసు వారు గోవా ఇంక్విజిషన్ ను ప్రవేశ పెట్టినారు. ఈ విషబీజమును 1542 లో ఫ్రాన్సిస్ జేవియర్ అను పాస్టరు  పోర్చుగీసు రాజు అయిన జాన్ – 3 మెదడులో నాటినాడు. 1560 – 1820 వరకు గోవాలో గోవా ఇంక్విజిషన్ అమలు అయ్యింది, అంటే దాదాపు 300సంవత్సరాలు ఇది అమలులో వుండినదన్నమాట.
ఫ్రాన్సిస్ జేవియర్ హిందువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు హిందువులు జాతి అపవిత్రమైన జాతి. వారు నల్లగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. హిందువులు పూజించే విగ్రహాలు దెయ్యాలు. వాటినుండి నూనెతో కూడిన అసహ్యమైన వాసన వస్తుంది. విసరి ఆంటీనియో డి నోరహ అనే పాస్టర్ ఇందులో భాగంగా ఓ కొత్త చట్టమును తెచ్చినాడు. దాని ప్రకారము హిందువుల దేవాలయాలను మూసివేయాలి. కొత్త దేవాలయాలు కట్టకూడదు. పాత దేవాలయాలకి మరమ్మతులు చేయకూడదు. అలాగే హిందు దేవాలయాల్లో వుండే బంగారము మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి రావాలి. సంస్కృతము, మరాఠి, కొంకణి భాషలో ఉన్న మన సాహిత్యాన్ని, శాస్త్ర పురాణాదులను తగులబెట్టినారు. కుటుంబములో తల్లి కానీ తండ్రి కానీ  చనిపోతే వారి ఆ పిల్లల్ని  చర్చి, పాస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్లను క్రైస్తవు లుగామార్చి వారి ఆస్తిని  చర్చి జప్తు చేసుకునేవారు.! గ్రామాధికారులు అందరూ క్రైస్తవులనే ఉంచేవారు. కోర్టులో క్రైస్తవులకు మాత్రమే సాక్ష్యం చెప్పే అధికారం ఉండేది. హిందువుల మందిరాలను కూల్చి  స్థానంలో చర్చిలు కట్టుకునేవారు ! హిందువులు  క్రైస్తవం స్వీకరిస్తే తప్ప పెళ్లి చేసుకొనకూడదు.  ఈ హింస మూడు వందల సంవత్సరములు జరిగినది. వారు ఊచకోత కోసిన లక్షలాది హిందువులలో బ్రాహ్మణుల సంఖ్య లెక్కకు మిక్కుటము.  చూడండి ఎంత దయాభరితమైన మతమో అది. ఇంత జరిగినా అక్కడి హిందువులు అంతరించి పోలేదు. అది ఈ జాతి గొప్పదనము.
మనము క్రైస్తవులలో ఎన్నో వర్గాములున్నాయని ఇంతకు మునుపు చెప్పుకొన్నాము. మరి అసలుక్రీస్తు ఒకడే అయినపుడు క్రైస్తవములో ఇన్ని విభాగాలెందుకు. మొదట రోమన్ కాథలిక్కు మతము మాత్రమే వుండేది కానీ దానితో ప్రప్రథమముగా విభేదించినవాడు  మార్టిన్ లూథర్ . ఇతను క్రైస్తవ సన్యాసి ,వేదాంతి , మరియు ప్రచారకుడు. ఇతను కాథలిక్కు మతముతో విభేదించి స్వంత కుంపటి లూథరన్ చర్చ్అన్న పేరుతో పెట్టుకొన్నాడు. తరువాత ఇంకా కొందరు రాను రాను తమ స్వంత కుంపట్లను రాజేసుకొన్నారు. అందులో మెథడిస్ట్ ఒకటి. దీని వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ. ఈయన ఆధ్యాత్మిక అభివృద్ధికి నిర్దుష్టమైన మార్గములు, కార్యాచరణ కలిగి యుండ వలెనని చెప్పినాడు. ఇక వేరొక ఉపమతము Presbyterians  అంటే మత పెద్దలు అని అర్థము.
ఇందు పెద్దతనమునకు ప్రాముఖ్యత నొసగినట్లు తెలియవచ్చు చున్నది. అదే విధముగా బాప్టిస్ట్ చర్చి అంటే మత తీర్థమును పుచ్చుకోన్నవారిని పునీతులను చేయుట. మంత్ర జలమును  ఆయా వ్యక్తులపై జల్లి లేక వారిని పవిత్ర జలమున ముంచి పునీతులను జేయుట. ఏ మంత్రములు జపించుటచే ఆ జలము మంత్రజలమైనదో నాకు తెలియని విషయము. పైగా మంత్రము అన్న సంస్కృత పదమునకు మననేన త్రాత ఇతి మంత్రం అని వేదాంగ భాగమైన నిరుక్తి తెలుపుతుంది. మరి ఆ అర్థము వచ్చే ఆంగ్ల పదమే లేదుకదా! క్రైస్తవములోని శాఖలనుగూర్చిఈవిధముగా చెప్పుకొంటూపోతే ఎన్నో వర్గములు ఇంకెన్నో మార్గములు. కానీ ఈ విధముగా చేయమని లేక చేయ వచ్చని వారందరు ప్రామాణికముగా భావించే బైబిలు లో వారు చేసే చాలా విషయాలు  చెప్పినట్లు ఎక్కడా కానరాదు. దీనిని చూస్తే ఈ క్రైస్తవ వర్గాలను ఐస్క్రీము సిద్ధాంతమునకు పోల్చవచ్చునేమో! ఇదేమిటి ఈ ఐస్క్రీము సిద్ధాంతమని అనుకోవద్దు. ఐస్క్రీములోఎన్నో flavor లు ఎన్నెన్నో వెరైటీలు . కానీ ఐస్క్రీము అమ్మకము మాత్రము పెరుగుతూనేఉందికదా! ఏ variety కొన్నా లేక తిన్నా ఐస్క్రీము కొన్న\తిన్నా అంటారుగానీ, ప్రత్యేకముగా అడిగితే తప్ప ఫలానా ఐస్క్రీము అని చెప్పరు కదా! బహుశ ఇదీ అంతేనేమో! ఈ విషయములను లోతుగా పరిశీలించితే క్రీస్తు అనుయాయులకు ఆధిపత్యమును గూర్చి తప్పితే ఆత్మా- పరమాత్మ లను గూర్చి తెలుసుకోవలె నన్న ఆలోచన ఉన్నట్లు అనిపించదు. నిజము వారి దేవుడెరుగు.
ఇక మనదేశానికి వస్తే, కేథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. గోవా ఇంక్విజిషన్ ను గూర్చి ముందే తెలిపినాను.  ఇది కాకుండా వారు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టిన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నది ఒక అభూతకల్పన. ఈ రెంటికీ తోడు. పోర్చుగీసు ను గూర్చి  GOOGLE లో నేను సేకరించిన ఈ విషయమును యథాతథముగా మీ ముందు ఉంచుచున్నాను, చదవండి :
Alliance ministry in Portugal is primarily funded through the Great Commission Fund. Help fulfill Jesus' Great Commission and make a gift to the GCF (Global Christian Forum (GCF) is a unique gathering of global Christian churches and organisations bringing together all the major streams of world Christianity. ) today.
2వ భాగము అంటే పోర్చుగీసుకు మతాంతరీకరణలకు గానూ లోపాయకారిగా GCF నుండి ఎంతటి మద్దత్తు లభించుతూ వుందోగమనించండి.
ఏసుక్రీస్తు అందరినీ మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే ఏసు మాటలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడుతుంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందినారు. 3వ శతాబ్దానికి చెందిన కాన్స్టంటైన్ (Constantine I) క్రైస్తవాన్ని రోము యొక్క అధికార మతంగా ప్రకటించిన మొదటి రాజు. ఆయన క్రైస్తవాన్ని పాటించని వారిని తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా ప్రవేశపెట్టినాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో క్రైస్తవానికి ఎదురులేక పొయింది.
ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం పాకింది.  సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం చేసినారు, కాని రెండు వందల సంవత్సరాల లోపే రోము సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు క్రీస్తును చంపినందుకు పగసాధించినామని. అసలు క్రీస్తు చరిత్రకు అందుతాడా అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్న. అది వేరోకసారి చర్చిన్చుకొందాము వీలును బట్టి.
క్రైస్తవం యూదు మతం నుండి వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు
చంపించబడ్డాడని క్రైస్తవులకు నేటికీ యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో  అవకాశం దొరికిన ప్రతీ సారీ క్రైస్తవులు యూదులను చంపుతూనే వున్నారు.  క్రైస్తవులు మత గ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదు మతస్థులను చంపినారు. హిట్లర్ పాలనలో 6 కోట్ల మంది యూదులను హతమార్చినాడని ప్రతీతి. అప్పటి జర్మనీలో ఉన్న చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకోదగ్గ సహాయం యూదులకు చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపినాడు. క్రైస్తవం తనకు అన్ని ఇచ్చిన యూదుల  ఋణము  ఈ విధంగా తీర్చుకున్నది.
చరిత్రలోక్రైస్తవులు చేసిన మరికొన్ని  పనులు చూద్దాం. పోప్ ఇన్నోసెంట్ iii ఆల్బిగెన్షియన్ క్రూసేడు(Albigensian Crusade) అన్న యుద్దమును తమ క్రిస్టియను మత విభాగమైన CATHERISM పై ప్రకటించి పైశాచిక పరమైన రీతిలో చంపినారు. దీనిని ఉత్సాహవంతులు వికీపీడియా లో చదవవచ్చు. అయ్యా అసలైన కేథలిక్కులను వారితో విభేదించిన వారిని ప్రత్యేకముగా గుర్తించలేముు ఏమిచేయమంటారు అంటే వారి పీఠాధిపతి (Abbot)
"Kill them all for the Lord knoweth them that are His (2 Tim. ii. 19) and so countless number in that town were slain." అన్నాడట.
ఇక క్రుసేడరులు ఎంత దారుణముగా , శాఖా భేదము కారణముగా తమవారినే ఏవిధముగా చంపినారో చూడండి.
The routiers rampaged through the streets, killing and plundering, while those citizens who could run sought refuge in the churches — the cathedral, the churches of St Mary Magdalene and of St.Jude. Yet the churches did not provide safety against the raging mob of invaders. The doors of the churches were broken open, and all inside were slaughtered.
మనదేశంలో, మన మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని, మహావీరుడిని కాని ఏనాడు మనం చంపదలచలేదు. రాజులూ ఒకరితో ఒకరు యుద్ధాలు చేసినపుడు, శరణన్నవారిని రక్షించినారుగానీ దేవాలయాలో దూరి హత్యలు చేయలేదు. ఇంకా నిజం చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం సిఖ్ఖుమతము  కూడా ఈ దేశములో
వర్దిల్లినాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుట లేదని, భూమియే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు గెలీలియొను చంపుతామన్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని  మరి బైబిలు చెప్పినది. మరి అది ఆమతస్థుల కు ప్రామాణికమైతే అది చెప్పినది వాస్తవము కాదు గదా ! మరి ఆ గ్రంధ వాక్యములు చెప్పినది ఒకవేళ దేవుడే కానీ, చెప్పినది తప్పుకదా!
ఈ వాస్తవాలను ఒకసారి గమనించండి:
1) భూమి బల్లపరపుగా ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించినాడని
బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
4) చర్చిలలోకి స్త్రీలను ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు.పూర్వము రానిచ్చేవారు
కాదు).
5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి పదవులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?
ఇప్పటికీ అమెరికాలో 51% క్రైస్తవులు, మిగతా వారిలో, ఎక్కువ మంది Atheists అని చెబుతూ వుంటారు.
యూరోపియన్ సమాజం, దేశాలు చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టినాయో తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాము.
1) ఒక జర్మను, బైబిలును జర్మను భాషలోకి మార్చినందుకు 15,000మందిని చంపినారు.
2) క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 15, 00, 000 మంది చనిపోయినారని ఒక అంచనా.
3) యూరోపియన్ దేశాలు కేవలం ప్రజాస్వామంలోకి మారడానికి, అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసి వచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారుఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని అధికారానికి చిహ్నం. కానీ మన గుడి అంటే అటువంటిది కాదు కదా. మనదేశంలో అప్పటి ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా వారు మనలను పాలించేవరకు చదువులోను, సకల శాస్త్ర విజ్ఞానములోనూ, అన్నింటికీ మించి, మనం మనస్సులలో వారికన్నా చాలా పెద్దవారము. మనము మన పెద్దల నుండి గ్రహించిన సంస్కారము అవినాశము. మనము  చదువులో వెనుకబడుటకు కూడా కారణము మెకాలే విలియం జోన్స్, మాక్స్ ముల్లర్ మరియు వారియొక్క , మన హిందూదేశపు తొత్తులు. మనము మార్పును తక్కువ వ్యతిరేకతతో (Resistance) ఆహ్వానిస్తాము. అందుకే మనము మన సాంప్రదాయాలనుండి ఇంత దూరము వచ్చివేసినాము. ఇవిఅన్నీ మనమతంలోఉన్న Flexibility మరియు Elasticity కి నిదర్శనములు.
ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో అడుగు పెట్టి నప్పటి నుండీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు వినిపిస్తున్నాయి. క్రీస్తు అనుయాయి సెయింట్ థామస్ రెండువేల యేళ్ళ క్రితం ఇక్కడకు వచ్చినాడని, అతను క్రీస్తును గూర్చి ప్రచారము చేస్తూవుంటే , అతనిని తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేసినారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవమేమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్ క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్
క్రైస్తవులు పారిపోయి సముద్రమార్గం గూండా కేరళ వచ్చినారు. వారికి అక్కడి హిందూ
రాజు బ్రతకడానికి స్థలం ఇవ్వటము జరిగింది. ఆవిధంగా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి
ఇబ్బందులు కలిగించకుండా తాము బ్రతుకుతూ మనలను బ్రతికించినారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది.
16వ శతాబ్దంలో మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు వారు ఇక్కడి క్రైస్తవులు ఏసును
పూజిస్తున్నారు కాని పూజావిధానం మొత్తం హిందూ పద్దతులలో ఉన్నది అని గమనించినారు. పోర్చుగీసు వారు మొదట గోవాలో ప్రవేశించి వారు అక్కడ చేసిన నరమేధము ఇప్పటికీ Portuguese Inquisition అన్న పేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఆవిషయమును ముందే తెలియజేసినాను. క్యాథలిక్కు చర్చి, భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St.Thomasను బ్రాహ్మణులు చంపినారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు (ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనము పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం చెప్పడమేలేదు పైగా ఇటీవల సెయింట్ థామస్ హిందూదేశమునకే రాలేదు అతను రోములోనే స్వర్గస్థుడైనట్లు నిర్దారించినారు). మన స్వాతంత్ర్యసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్న. అది భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.
బైబిల్ నందు యోహోవా "తాను కేవలం ఇజ్రాయిలీ ప్రజల దేవుడను" అని చెప్పుకున్నాడు. ఎక్కడా ఆయన తాను ప్రపంచ ప్రజలకు ముఖ్యంగా భారతీయులకు దేవుడనని చెప్పలేదు.
ఆయన ఇజ్రాయిలీలను మాత్రమే ప్రేమించినాడు. వారికోసం ఈజిప్ట్ వంటి ఇతర దేశాల,జాతులను ప్రజలను శిక్షించినాడు.(బైబిలు లోని నిర్గమ కాండం, Exodus, చూస్తే మనకు ఆ విషయము తెలియగలదు.) అలాగే ఏసు కూడా "తప్పిపోయిన ఇజ్రాయిలీ ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్నుపంపినాడు".అని స్వయంగా చెప్పటము జరిగింది.(మత్త 15:24) అంతేకాక ఆయన తన భోధనలు కేవలం ఇజ్రాయిలీలకే చెప్పమని,ఇతర దేశాలలో ప్రవేశించవద్దని కూడా స్వయంగా చెప్పినాడు.(మత్త10:5-6) అంటే వీరిరువురూ ఇజ్రయిలీ ప్రజలకే రక్షకులమని తామే చెప్పుకున్నారు కానీ, మన  వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో, భాగవతంలో,శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణుడే ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమని పదునాలుగు భువన భాండములు,అన్ని దేవతలు,ఆయన నుంచే పుట్టినాయని, చీమ నుండీ బ్రహ్మ వరకూ అన్ని ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయనీ, ప్రాణులన్నింటికీ, తండ్రి, పోషకుడు, రక్షకుడు శ్రీకృష్ణుడే అని తెలుపుతున్నాయి. శ్రీ కృష్ణుడు కేవలం ఒక దేశానికి,ఒక జాతికి చెందిన దేవుడు కాదు. ప్రపంచాని కంతా దేవుడు. ఇక ఈ భూమిపై పుట్టి, భగవంతునికి అంకితమైన భక్తుని ఆలోచన, ఆవేదన, ఆర్తి ఏవిధముగా వుంటుందో చూడండి.
రేపు మూడవ భాగము.....
3
భాగవత పురాణములోని నవమ స్కందములో రంతిదేవుని చరిత్రము చదివితే ఈ క్రింది విషయము తెలియవస్తుంది :
నత్వహం కామయే రాజ్యం స్వర్గం, న పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశనం.
నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును. సకల ప్రాణులూ సర్వ ప్రపంచమూ సుఖముగా సుభిక్షముగా ఉండవలెనని భక్తుని వేడికోలు భగవంతునితో. ఇదీ మనదేశము మన ధర్మము.
ఇప్పుడు క్రైస్తవం పేరు మీద జరుగుతున్న అనేక పండుగలకు క్రైస్తవానికి ఏ రకంగానూ సంబంధం లేదు. క్రైస్తవులకు ముఖ్య పండుగైన Christmas క్రైస్తవం పుట్టుకకు ముందు నుంచి జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు Dec-25 నాడు పుట్టలేదు. అందుకు
కావలసిన సమాచారం బైబిలులోనే దొరుకుతుంది. మనకు మేరీ ఏసుక్రీస్తును ఒక
గొర్రెల ranchలో కన్నదని చెబుతారు. మేరీ మరియు జోసెఫ్ అప్పుడు పన్నులు కట్టడానికి వెళ్ళేదారిలో మేరీకి కాన్పు అయ్యింది. అందువల్లనే ఆమె ఆ సమయంలో తన స్వగృహంలో కాకుండా మరెక్కడో ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఇస్రాయీలు ఆ చుట్టుప్రక్క November – March విపరీతమైన చలి అసలు జంతువులు కూడా బయటికి రాలేనంత చలి. అంటే మానవమాత్రులు అసలు బయటికి కదలలేరు. అలాంటిది ఎవరైనా పన్నులు వసూలు చేసుకోవడానికి March – October లో ఆసక్తి చూపుతారు కదా.(నిజం చెప్పాలంటే ఆ వ్యవస్థ వల్లనే ఇప్పటి USAలో April లో Tax payments ఉన్నాయి) దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ఖచ్చితంగా Dec-25 నాడు పుట్టలేదని చెప్పవచ్చు. కానీ Dec-25 నాడు Christmas ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అని అనుకొంటున్నాము. క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ కారణం ఆరోజు  ఏసుక్రీస్తు పుట్టిన రోజు అను భ్రమలోఈ రోజును జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం ఏసుక్రీస్తు డిసెంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్స్ టైస్ అయినందునోక్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు (వికీపీడియా). కారణం ఆరోజయితే ముందునుండే క్రైస్తవులు కానివారు జరుపుకొంటూవుండినారు కాబట్టి నలుగురితోబాటు నారాయణ అన్నట్లు వీరు కూడా కలిస్తే ఆ రోజుకు ప్రాచుర్యము అధికముగా వస్తుందని చర్చి వారి నమ్మకము. డిసెంబరు 25 క్రీస్తు పుట్టినరోజు కాదనటానికి ఇంకొక విషయము తెలియజేస్తాను.
పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచిన కేలెండరు కాబట్టి  ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. అంటే ఈ సవరణ జరిగినది 16వ శతాబ్దములో. అంతవరకూ వున్న కేలెండరు తప్పుల తడికయే కదా! మరి అటువంటి కేలెండరులో క్రీస్తు పుట్టినరోజు ఎంతవరకు నిర్దుష్టముగా వుంటుంది. అదే సంవత్సరములోని అక్టోబరు నెలను వారు సవరించి ఆనెల 4 తరువాత 15 వ తేదీని ప్రకటించినారు. మరి ఈ మార్పు జరిగిన తరువాత ముందు క్రిస్మస్  జరుపుతూవచ్చిన రోజు యొక్క తేదీ మారిపోతుంది కదా! మరి డిసెంబర్ 25 ఏవిధముగా క్రీస్తు పుట్టిన రోజుగా చెప్పుటకు వీలౌతుంది.
కానీ ఈ రోజు ఒక అవాస్తవము వాస్తవముగా పరిణమించినది. మనదేశములో ముఖ్యముగా తెలుగు రాష్ట్రములలో, హైందవులయ్యివుండికూడా సంక్రాంతికన్నా క్రిస్మస్ కే ప్రాధాన్యత ఇస్తూవున్నారు. అసలు పాఠశాలలలో సంక్రాంతి సెలవుల మాటే మరచినారు. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు మాత్రమే!
సామాన్యముగా 'పోనీలే' అన్నది మన మనస్తత్వము. ఒకసారి సింహావలోకనము చేస్తే
ఏమేమి పోగొట్టుకొన్నామో అన్నది, తెలియలేనంత పోగొట్టుకొన్నాము అని మన కవగతము కాగలదు. ఈ దేశపు విజ్ఞానము అపారము కావున పోయినది పట్టించుకోకుండా వున్నది పట్టుకొని ప్రాకులాడుచున్నాము. ఇప్పుడు 'ముదిమి మీదపడినది 'అని అనుకొనే వాళ్లయినా ఆలోచించకుంటే తదుపరి తరానికి యిచ్చుటకు ఏమీ మిగులదు. ఇక వారు వారి తరువాత తరానికి ఏమివ్వగలరు అన్నది విజ్ఞులు ఊహించగలరు.
క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25, మరికొంత మంది ఆర్థడాక్స్
చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7 న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చరిత్రకు  సందర్భోచిత ఆధారాలేవీ ఏసుక్రీస్తు డిసెంబరులో గానీ లేక జనవరిలో గానీ  పుట్టి ఉండవచ్చునన్న వాదమునకు పుష్టిని చేకూర్చటము లేదు అన్నది పైన చర్చిచుకొన్నాము. ఇక ఈ విషయమును ఒకసారి గమనించండి.
4వ భాగముతో రేపు కలుద్దాము.....
4.
పూర్వము.ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సొల్స్ టైస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు. డిసెంబర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తున్నారు. శక్తిమంతుడైన దేవుడు క్రిస్మస్ అను పండుగను ఆచరించమని ఆజ్ఞాపించినాడా? మరి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?
సత్యం ఏమిటంటే మొట్టమొదటి క్రైస్తవులు(ఏసుక్రీస్తు యొక్క శిష్యులు) పుట్టినరోజు పండుగ లను పాటించలేదు. దాదాపు ౩వ శతాబ్దము వరకు వారికి ఈ ఆలోచనే లేదు. క్రైస్తవ శాస్త్రం క్రీ.శ. 185-232 ప్రకారం "పాపాత్ములు మాత్రమే జన్మదినాన్ని పండుగలాగా ఆచరించినట్లు దేవుని వాక్యంలో ఉంది". క్రీస్తు జన్మించినప్పుడు కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో తమ మందను కాచుకొనుచున్నట్లు( లూకా 2:8) దేవుని వాక్యం చెపుతుంది. ఇశ్రాయేల్  దేశంలో  చలికాలంలో అక్కడ విపరీతమైనచలితోబాటూ బాగా వర్షాలు కురుస్తాయి. ఆ సమయములో ఏ ప్రాణీ గూడు వదలి బయటికి వచ్చుటకు సాహసించదు. కనుక క్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదని తెలుస్తూనే వుంది. ఇది కాక పోప్ గ్రెగొరీ కాలము వరకు వారి క్యాలాండరు ఎన్నెన్నో మార్పులకు చేర్పులకు, కూర్పులకు
ఎన్నోమార్లు గురియైనది. అసలు రోమన్ చర్చి మొన్న మొన్నటి వరకూ ఈ పండుగను ఆచరించేది కాదు. క్రీస్తు పుట్టుకకు డిసెంబర్ 25 అని నిర్దుష్టముగా ఎట్లు నిర్ధారించగలరు.
చరిత్ర ప్రకారం క్రీస్తు మరణించిన తరువాత 300 సంవత్సరాల వరకు అసలు క్రైస్తవులు
క్రిస్మస్అన్న పండుగను జరుపుకొన్న దాఖలాలు లేవు. అయితే క్రీ.శ. 313 లో "కాన్ స్టాన్ టైన్" అనే రోమను చక్రవర్తి క్రైస్తవ మతమును పుచ్చుకొని ఆ మత ప్రచారమును విరివిగా గావించినాడు. క్రైస్తవము ఎన్నో దేశములకు ప్రాకినది. నయము, భయముల సమన్వయముతో, స్థిరపడి పోయింది. "కాన్ స్టాన్ టైన్" కు ముందు ఎన్నో వందల సంవత్సరాల క్రితము వరకు గ్రీకు రోమను  సామ్రాజ్యములలో, స్థానికులు pagan లగా పిలువబడే వారు. ఈ పాగాన్లు ఎవరో కాదు. మనవారి హస్తకళల కొరకో లేక గణిత ఖగోళాది శాస్త్రముల కొరకో మన విజ్ఞులను  వారి దేశమునకు పిలుచుకోని పోవుట జరిగినది. ఇది  మనము పోకాక్ అన్న ప్రసిద్ధ ఆంగ్లేయ చరిత్రకారుడు వ్రాసిన 'India In Greece' అన్న  గ్రంథములో సహేతుకముగా నిరూపింపబడినది. వీరు మనము ' సంక్రాంతి సంబరాలు జరుపుకొను రీతిలో ఈ పండుగను 'మిత్ర' అన్న దేవుని ప్రీత్యర్థము  డిసెంబరు 25 న జపుకొనేవారు. అసలు సంస్కృతములో మిత్రఅంటే సూర్యుడు అని అర్థము. మనము కూడా హేమంతరుతువులో వచ్చే పుష్యమాసమున మకర సంక్రాంతికి సూర్యునే కదా కొలిచేది. వారు డిసెంబర్ 17-23 వరకు సాటర్నలియా(SATURNALIA) అనే పండుగను ఆచరించేవారు.ఈ పండుగలో ఒకరికొకరు కానుకలు(గిఫ్టులు) ఇచ్చుకొని సంతోషించేవారు. అది కూడా ఎందుకంటే  పంటలు చేతికొచ్చి అందరిలో ఆనందము వేల్లివిరిసేది ఆ సమయములోనే కదా! ucg.org గూగుల్ సెర్చ్, లో మనము ఈ విధముగా చూడగలము:
Although it is difficult to determine the first time anyone celebrated December 25 as Christmas Day, historians are in general agreement that it was sometime during the fourth century. This is an amazingly late date. Christmas was not observed in Rome, the capital of the Roman Empire, until about 300 years after Christs death. Its origins cannot be traced back to either the teachings or practices of the earliest Christians.
 క్రీస్తు డిసెంబర్ 25న జన్మించినాడని దేవుని వాక్యంలో ఎక్కడ చెప్పబడలేదు అన్నది నిర్దారిత మైనట్లే కదా! మరి శాంటాక్లస్ లేదా St. నికోలస్ లేదా క్రిస్మస్ తాత మాటేమిటి? క్రిస్మస్ తాత రోమను మతంలో ఉన్న నిమ్రోదు అనే వ్యక్తి. ఇతని గూర్చి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నయి. "నికోలాయితుల బోధను క్రీస్తు ద్వేషించినాడు"(ప్రకటన 2:15). 'అన్న, ఆ బోధ క్రిస్మస్ తాత అంటే సాంటాక్లస్ కు సంభందించిన బోధ.
క్రిస్మస్ పండుగను ఆచరించువారు ఎన్నో రకరకాల కారణాలు చెపుతారు. " మేము డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినాన్ని గుర్తుచేసుకొని ఆరాధిస్తున్నాం" అని కొందరంటే " క్రీస్తు సువార్త ప్రకటించటానికి ఈ రోజును ఉపయోగిస్తున్నాం. మేము కేవలం క్రీస్తు జన్మదినాన్ని గౌరవిస్తున్నాం "మరికొందరు చెపుతారు. అంటే ఈ పండుగ జరుపుకొనుటలో వారి నడుమనే ఎటువంటి ఏకాభిప్రాయము లేదు.
యేసుక్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించ లేదు అన్నది మనకిపుడు అవగతమైనది. అసలు ఏ రోజున జన్మించినాడో దేవుని వాక్యములో లేదు. చరిత్రలో కూడా లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. యేసుక్రీస్తు తన జన్మదినమును పండుగ లాగా ఆచరించమని ఆజ్ఞాపించనూ లేదు. ఏసు క్రీస్తు మొదటి శిష్యులు ఆచరించినట్లు దేవుని వాక్యంలో లేదు. క్రీస్తు తన మరణ దినాన్ని జ్ఞాపకం(1 కొరింథీ 11:24-27) చేసుకోమన్నాడు
(ఇది ఈస్టర్ పండుగ కాదు) కాని, జన్మదినాన్ని కాదు.
క్రైస్తవులు ఏసు క్రీస్తు నియమించిన మరియు ఆచరించమనిన ఆజ్ఞలు, పండుగలు విస్మరించి దేవుడు ఆజ్ఞాపిచని  పనులను ఆచరించుచున్నారు. "మనుష్యలు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్దముగా ఆరాధించు చున్నారు (మత్తయి15:9)". మరియు యేసు ఇలా చెప్పెను "ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును (మత్తయు 7:21)". కాబట్టి సత్యమును గ్రహించి నిజ దేవుని వైపు తిరిగి సత్యముతో దేవుని ఆరాధించవలెను. ఇది క్రీస్తు చెప్పిన మాట.
ఈ వాస్తవాలను గమనించండి: 
The Gregorian calendar was first introduced in 1582 in some European countries. However, many countries used the Julian calendar much longer. Turkey was the last country to officially switch to the new system on January 1, 1927. The Switch around the World to Gregorian calendar introduction & days dropped Year Country and Days Removed are given here under.
1582 France (most areas), Italy, Poland,
Portugal, Spain, 10 days
1583 Austria, Germany (Catholic states), 10 days
1587 Hungary, 10 days
1610 Germany (Prussia), 10 days
1752 Canada (most areas), United Kingdom
(And colonies), United States (most areas), 11 days
1872/1873 Japan, 12 days
1916 Bulgaria, 13 days
1918 Estonia, Russia, 13 days

1923 Greece, 13 days
1926/1927 Turkey, 13 days
మరి క్రైస్తవమును పాటించే దేశములలోనే వారి పండుగల గూర్చిన ఏకాభిప్రాయము లేకపోతే పరాయి దేశస్తులమైన మనము దేనిని నమ్మవలసియుంటుంది.
ముగింపు రేపు........
చివరి భాగము
డిసెంబరు 25 గడచిన ఒక వారమునకు వెంటనే జనవరి 1 వస్తుంది. మరి క్రీస్తు జననముతో మొదలయినట్లు చెప్పబడుతున్న కేలెండరు, జనవరి 1వ తేదీని క్రిస్మస్ గా ఎందుకు ప్రకటించలేదు. జనవరి 1న చేసే యాగి ఇంతా అంతా అని చెప్పవీలుకాదు అన్నది నేను ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు.
తప్పుగా తలవకపోతే Enjoymentకు ఏమని అర్థము చెప్పుకొందాము.
త్రాగడమా, అన్యస్త్రీల పొందును అభిలషించడమా, మై మరచి గంతులు వేయడమా, దీపాలనార్పడమా. తన, పర అన్న విచక్షణ లేని క్లబ్బు పబ్బు గబ్బులలో అర్ధరాత్రి అరుపులతో కేరింతలతో మసలడమా ఏమిటి? దాదాపు రెండు పదుల సంవత్సరాల క్రితము వరకు ఈ దినము సెలవు దినముగా కూడా వుండేది. ఆంగ్లేయుల అధిపత్యముండినది కావున అది తప్పుల పట్టికయైనా మనపై రుద్దినారు. ప్రపంచ పటములోని ఏదేశమునకు కూడా మన దెశమున కున్నంత పూర్వీక సంస్కృతి లేదు . వారికి ఆంగ్లేయుల ననుసరింపక తప్పదు. నా బాల్యమున కూడా ఇంగ్లిషు కేలెండర్ వుండేది. నాడు అది ప్రభుత్వ కార్యాలయములకు మాత్రమే పరిమితము . నాగరీకులు మన పంచాంగమునే అనుసరిచేవారు. డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టలేదని ఎందఱో పాశ్చాత్యులు నిరూపించినారు అని  మనము ముందేచెప్పుకొన్నాము. అసలు ఈ విషయములో విలియం జె థిగె గారు ఏమంటున్నారో వినండి. ఆయన గూర్చి ఈ నాలుగు మాటలు చదవండి ఆ తరువాత ఆయన ఏమిచేప్పినాడని చదువవచ్చు.
William J.Tighe is Associate Professor of History at Muhlenberg College in Allentown, Pennsylvania, and a faculty adviser to the Catholic Campus Ministry. He is a Member of St. Josaphat Ukrainian Catholic Church in Bethlehem, Pennsylvania. He is a contributing editor for Touchstone.
ఇక విలియమ్ తిఘే గారి మాటలలో December 25th ను గూర్చి వినండి.
It is true that the first evidence of Christians celebrating December 25th as the date of the Lords nativity comes from Rome some years after Aurelian,
in A.D. 336, but there is evidence from both the Greek East and the Latin West that Christians attempted to figure out the date of Christs birth long before they began to celebrate it liturgically, even in the second and third centuries. The evidence indicates, in fact, that the attribution of the date of December 25th was a by-product of attempts to determine when to celebrate his death and resurrection. How did this happen? There is a seeming contradiction between the date of the Lords death as given in the synoptic Gospels and in Johns Gospel. The synoptics would appear to place it on Passover Day (after the Lord had celebrated the Passover Meal on the preceding evening), and John on the Eve of Passover, just when the Passover lambs were being slaughtered in the Jerusalem Temple for the feast that was to ensue after sunset on that day. Solving this problem involves answering the question of whether the Lords Last Supper was a Passover Meal, or a meal celebrated a day earlier, which we cannot enter into here. Suffice it to say that the early Church followed John rather than the synoptics, and thus believed that Christs death would have taken place on 14 Nisan, according to the Jewish lunar calendar. (Modern scholars agree, by the way, that the death of Christ could have taken place only in A.D. 30 or 33, as those two are the only years of that time when the eve of Passover could have fallen on a Friday, the possibilities being either 7 April 30 or 3 April 33.) Clemens Alexandrines, Origen, Tertullian, Julius Africanus, tantius, Jerome, St.Austin, Sulpicius Severus, Prosper, and as many as place the death of Christ in the 15th or 16th year of Tiberius, make Christ to have preached but one year, or at most but two.
మరి వాస్తవికతయే లేకుండా పుర్రెకు తోచినట్లు ఏర్పాటు చేసిన పండుగకు మనము ప్రాధాన్యత ఇచ్చుట చిన్నబుచ్చు కోవలసిన విషయము కాదా! ఇక సాంటాక్లాస్ ఒక అభూత కల్పన. సాంటాక్లాస్లు చరిత్ర వెదకితే ముగ్గురు కనిపిస్తారు. వీరంతా క్రీస్తుకు పూర్వము వారే! ఎందుకు మనము వెర్రి గా సాంటాక్లాస్ gifts లను బట్టుకొని మన పిల్లలతో వ్రేలాడ దీయించుచున్నామో తెలియదు. మనకు చెప్పని క్రైస్తవం యొక్క ఘనమైన చరిత్ర ఇది. స్థూలంగా చెప్పాలంటే, క్రైస్తవులు తమకు దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను ఇచ్చిన యూదులను చంపినారు, తమ మతాన్ని అధికార మతంగా చేసి వ్యాప్తికి కృషి చేసిన రోమను సామ్రాజ్యాన్ని కూలదోసినారు, మన దేశంలో ఆశ్రయం ఇచ్చినప్పుడు దానిని  తీసుకుని మన శత్రువులకు సాయం చేసినారు. దీనిని బట్టి క్రైస్తవం గురించి ఏమి అనుకోవాలో పాఠకుల ఆలోచనకే వదలి వేయుట మంచిదని తలుస్తున్నాను.
భగవంతుని చేరుటకు అనేక మార్గములను చూపి మన ఇష్టమునకు వదిలిన ఈ సనాతన ధర్మమును వదలి అన్యమతములను ఆశ్రయించ పనిలేదు. ఏ మతమున కైన ఆధారము మన ధర్మమే. ఎందులో వుండే విషయమైనా  ఇందులో వుంటుంది. కానీ ఇందులో ఉండేవి అన్నీ మాత్రము ఎందులోనూ వుండవు. అనంత కాలములో ఎప్పటి నుండి ఉన్నదో తెలియని ఈ ధర్మమును కాదని 2000, 15౦౦ సంవత్సరముల వయసు కలిగిన ఇతర మతములకు వలస పోవలసిన అవసరము మనకు లేదు. వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త అయితే ఈ దేశములో పుట్టిన పుట్టుచున్న మహానుభావులెందరో! మంచి ఉన్న చోట చెడుగు వున్నట్లు ధర్మము పేరుతో మోసగించే సాదువులు కూడా వున్నారు. దేవుడు మనకు ఇచ్చిన బుద్ధిని సక్రమముగా వాడుకొంటే మన ధర్మ మార్గము అచంచలమై నిలుస్తుంది.
ఆఒక్క వాస్తవమును మనము గుర్తించితే ఈ దేశమునకు ఈ సంస్కృతికి తిరుగే లేదు.
స్వస్తి.
సాంటాక్లాస్ చారిత్రికఆధారములులేని ఒకఊహాజనితపాత్ర.

గూగుల్ నుండి గ్రహించినఈ క్రింది లంకెలో ఏమి చెప్పబదినదో యథాతథముగా ఆంగ్ల భాషలోనే చూడండి.

https://www.aplustopper.com/10-lines-on-santa-claus/

The brand statement of Coca Cola Company is happiness and joy and this coincided with what Santa Claus represented which was happiness and joy and that is the reason Coca Cola Company is created the modern Santa Claus.


Friday, 6 December 2019

ఆడపడుచులు


ఆడపడుచులు
ఆడపడుచులను గూర్చి మనువు ఈ విధంగా చెబుతాడు
శోచంతి జామయో యత్ర వినశ్వత్యాశు తత్కులం
నశోచంతితు యత్రైతావర్ధితే తద్ది సర్వదా ”
అనగా ఆడపడుచులు ఏయింట అన్నదమ్ములచే ఆదరించ బడతారో
ఆయింట వంశం వర్ధిల్లుతుంది. అట్లు కాదేని ఆ వంశం నశిస్తుంది.
తస్మానేతాన్ సదా పూజ్యాః భూషణాచ్చాద నాశనై
భూతికామైర్నరైర్నిత్యంసత్కారేషూత్సవేషుచ.”
తమ ఇంట పండుగలు పబ్బాలు మొదలగు శుభకార్యములు జరుపుకోనేటపుడు
ఆడపడుచులను పిలచి మంచి భోజనము పెట్టి, వస్త్ర భూషణాదులనిచ్చి సంతృప్తి పరచి పంపాలని మనువు చెబుతాడు. కనుకనే పండగ రోజులలో కూతుళ్ళను అల్లుళ్ళను పిలిచి ఉన్నంతలో వారికి ఉచిత సత్కారము చేసే సాంప్రదాయము మనకు కలిగినది.

 మన వేద పురాణేతిహాస గ్రంథాలలో స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో చూడండి.
మూడు నాలుగు పెళ్ళిళ్ళు వివాహ ఐతరేయ సంబంధములు గల్గిన మతములలో తోబుట్టువుకు ఉచిత మర్యాదనిచ్చుట చూడగలరా!