Tuesday, 13 September 2016

మరచిపోవ నా తరమా

మరచిపోవ నా తరమా
సుమ బాణుని శరమా నిను మరచిపోవ నా తరమా
దివిని వీడి దిగి రావా నా చెంతకు ప్రియతరమా

గొలుసు కట్టు లిపి లోపలి తెలియరాని వివరమా
ఇచ్చితినని యా విధాత మరచినట్టి వరమా

నిదురలోన నను వీడక చూపుతావు సురవనాల
తన్మయతన విందువు నా భావ భరిత కవనాల

కనులు మూసుకొన్నపుడే కనబడుదువు నా లోపల
కనులు తెరువ నీవు లేని జగము జూతు నే వెలుపల

నా కోరిక 'రామా' నే తీర్చుకొనగ నా తరమా

సుమ బాణుని శరమా నిను మరచిపోవ నా తరమా
చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment