చక్కనైన
చాటువు
కవులు
నిరంకుశులు. తమ గొప్పదనాన్ని గుర్తించకుంటే వారు తిట్టటం లోకూడా
చమత్కారాన్ని రంగరిస్తూ ఉంటారు . బయటివారికి ఆలోచిస్తేనేగాని ,అర్ధము బోధపడకుండా
జాగ్రత్త లు తీసికుంటారు. ఒక్కోసారి ఆలోచిచినా అర్థము కాదు. ఈ పద్యం ఒక పర్యాయము
గమనించండి. -
కం:-
నగపగతు పగతు పగతుని
పగతుండగు
మగధరాజు బరిమార్చిన యా
జగజెట్టి
యన్న తండ్రికి
దగువాహనమైనయట్టి
ధన్యుడితడే!
వివరణ:-
నగపగతుడు- పర్వతవిరోధి,
దేవేంద్రుడు; అతని పగతుడు- నరకుడు;
అతనిపగతుడు - శ్రీకృష్ణుడు; అతనివిరోధి - మగధరాజు
జరాసంధుడు; అతనిపరిమార్చన
జగజెట్టి - భీముడు; అతనియన్న- ధర్మరాజు; అతనితండ్రి- యమధర్మరాజు;
అతనివాహనము
- దున్నపోతు;
చూచినారు
కదా! అసలది తిట్టా,
పొగడ్తా! తెలియకుండా ఎంతచక్కగా ఒరే దున్నపోతా!
అంటూ ఎంత ఇంపుగా
చెప్పినాడో!
No comments:
Post a Comment