జయహో భరత మాతా
వీర నారులు మరి విదుషీ లలామల
మహిళామణులయొక్క మాన్య మాత
దేవ పుత్రులగాక దేవదూతలగాక
దేవునే కంటివి తెల్ప గీత
వేలవత్సరముల వెనుక వెలసినట్టి
పరమ పావన కీర్తి భరిత నేత
వేద చోదితమైన విజ్ఞాన ఖనివౌత
నిష్ఠ తోజేతును నీకు జోత
విశ్వవిజ్ఞాన దాతయౌ విమల చరిత
చారు కరుణానురాగాల శాంత సరిత
దివ్య ఋషిముని శాస్త్రజ్ఞ ధీర భరిత
లేదు కొలమానమిల కొలువ నీదు గరిత
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment