Saturday, 8 August 2015

అమ్మ


అమ్మ
మరులుగొనిన యట్టి మగని కోరిక దీర్చి
కడుపు నందు శిశువు కనగ నెంచు

ప్రాణ సంకటమన్న భావమ్ము గల్గియు
సంతుకై తా నెెంతొ సాహసించు
గ్రహణ సమయమంత గదిని చీకటి జేసి
తిండి తీర్థము మాని యుండి పోవు

ప్రసవ కాలము నందు బరగి తా స్వర్గమ్ము
నిలుపు దానిని దెచ్చి నిండు ఇంట

అట్టి తల్లి మతల్లిని యాత్మ బూని
గుడిని కట్టించి నిలుపుచు కూర్మి తోడ
సలుప సుమభావ తతి పూజ, సంతసమ్ము
సకల సౌభాగ్యముల గూర్చు సంతతమ్ము

No comments:

Post a Comment