Monday, 31 August 2015

వాస్తవము -- వ్యంగ్యము

వాస్తవము -- వ్యంగ్యము
స్వార్థము సర్వస్వము కానేరదు. యస్సె,యస్టీ,ఓబీసీ, బీసీ ఓసీ అని వివిధ వర్గాలుగా విభజించి బ్రిటీషు వాడు మన నాయకుల రక్తములోకెక్కించిన Devide and Rule ను పట్టుకొని వ్రేలాడుతూ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొనే మన నాయ్కులకు మనమెందుకు విన్నవించుకొని మొత్తము దేశమునే B.C. = Backward Country గా మార్చమని అర్థించకూడదు. అప్పుడు అందరికీ మనదేశములోనే కాక విదేశీయుల సానుభూతి కూడా పొందవచ్చు కదా!
యస్సి, యస్టి,బీసి యనుచు వేరుపరచి 
పంచభక్ష్యములను పంచు బదులు
అసలు భారతమ్మె అయినచో బీసీగ
తెచ్చు సుఖము మనకు, దేశమునకు.

The Truth and the Irony
yassi, yasTi,beesi yanucu vEruparaci
pancabhakshyamulanu pancu badulu
asalu bhaaratamme ayinacO beeseega
teccu sukhamu manaku, dESamunaku.
(TRANSLITERATION OF MY TELUGU POEM)
Segregating S.C., S.T.B.C. from the subjects and favoring them, better the declare the nation as BC(Backward Country) both the country along with everyone of us will get benifited.
The true followers of the British our leaders are dedicated to devide and rule the country even today. Hence they introduced the RESERVATION FORMULA more for their own benifit. If they can declare the nation itself as B.C. (Backward Country) they can muster funds for them, for the country and jobs for us anywhere in the world

Monday, 10 August 2015

జయహో భరత మాతా

జయహో భరత మాతా


వీర నారులు మరి విదుషీ లలామల 
మహిళామణులయొక్క మాన్య మాత

దేవ పుత్రులగాక దేవదూతలగాక
దేవునే కంటివి తెల్ప గీత

వేలవత్సరముల వెనుక వెలసినట్టి 
పరమ పావన కీర్తి భరిత నేత

వేద చోదితమైన విజ్ఞాన ఖనివౌత
నిష్ఠ తోజేతును నీకు జోత

విశ్వవిజ్ఞాన దాతయౌ విమల చరిత
చారు కరుణానురాగాల శాంత సరిత
దివ్య ఋషిముని శాస్త్రజ్ఞ ధీర భరిత
లేదు  కొలమానమిల  కొలువ నీదు గరిత
చెరుకు రామ మోహన్ రావు

Saturday, 8 August 2015

అమ్మ


అమ్మ
మరులుగొనిన యట్టి మగని కోరిక దీర్చి
కడుపు నందు శిశువు కనగ నెంచు

ప్రాణ సంకటమన్న భావమ్ము గల్గియు
సంతుకై తా నెెంతొ సాహసించు
గ్రహణ సమయమంత గదిని చీకటి జేసి
తిండి తీర్థము మాని యుండి పోవు

ప్రసవ కాలము నందు బరగి తా స్వర్గమ్ము
నిలుపు దానిని దెచ్చి నిండు ఇంట

అట్టి తల్లి మతల్లిని యాత్మ బూని
గుడిని కట్టించి నిలుపుచు కూర్మి తోడ
సలుప సుమభావ తతి పూజ, సంతసమ్ము
సకల సౌభాగ్యముల గూర్చు సంతతమ్ము

Thursday, 6 August 2015

ఉద్వేగము - ఉపశమనము

ఉద్వేగము - ఉపశమనము

https://cherukuramamohan.blogspot.com/2015/08/english-reaction-restraint.html

ఉద్వేగము అంటే మన English లో Reaction అని,ఉపశమనము అంటే Restraint అని 

మనము తీసుకొవచ్చు. ఉద్వేగమును Emotion గా కూడా తలువవచ్చు. . ఈ ఉద్వేగము 

అంటే ఏమిటి. కంటి ముందు కనిపించే ప్రతి విషయానికీ మనకు హృదయస్పందన 

వుంటుంది.తల్లిని కౌగలించుకొన్న శిశువు హృదయములో కలిగే స్పందన భాషకు 

అతీతము. అదే ఎలుకను నోట కరచిన పిల్లినిచూస్తే ఏడుపుతో స్పందించుతాడు 

శిశువు.  స్పందన పరిమి మీరితే ఉద్వేగమౌతుంది. ఆ ఉద్వేగము ఎక్కువగా నేటికాలములో, యువకులకు, ముఖ్యముగా కళాశాల విద్యార్థులకు ఎందుకు కలుగుతూ వుంది?వయసు పెరిగేకొద్దీ వ్యక్తి ముఖ్యంగా యువత స్పందన పై తమ అమిత ఆసక్తిని చూపుతూ భావోద్వేగాన్ని లోలోపలే అణచుకొంటారు. ఎందుకంటే తాము అమితోత్సాహముతో స్పందించేవిషయాలు తమ పెద్దలతో పంచుకొనేటంత మంచివి కాదు కాబాట్టి.ఒక మంచి పాత సినిమాకు పొతే నటుల అభినయమునకు అనుగుణముగా మనము స్పందిస్తాము. పాత సినిమా పెరు ఎందుకు వాడినానంటే అందులో భరతముని చెప్పిన నవరసాలూ వుండేవి కాబట్టి. నేడు రసాలు ఆవిరియైపోయి 'నవ' మాత్రమే మిగిలింది. . ఒక విధంగా చెప్పవలసివస్తే జీవితములో కూడా స్పందన రసానుగుణముగానే వుంటుంది. అందుకే నాట్య శాస్త్ర రచయిత భరతుడు ఈ విధముగా అంటాడు:

యః తుష్టా తుష్ట ఆప్నోతి, శొకే శోకముపైతిచ

క్రోధేకృద్ధో భయో భీరః సశ్రేష్ఠః ప్రేక్షకః స్మృతః .

ఈ మాట ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకొంటున్నారేమో! చెబుతాను. 9 చాలా 

ఎక్కువన్న ఉద్దేశ్యముతో నెమో మన సినిమా వారు వానిని ఇప్పుడు 3 గా 

వర్గీకరించినారు. గమనించితే ప్రతి సినిమాలోనూ ఈమూడు విషయాలు చూడవచ్చు. 

అవి 1. పట్టుడు 2. కొట్టుడు 3. తిట్టుడు. 4 కళ్ళు రెండయినాయి 9 రసములు 

మూడయినాయి అని మనము పాడుకోవలేనేమో!.

కథానాయికనో లేక ఒక నట్టువరాలినొ(Dancer) అవసరమున్న లేకున్నా తాకి, గోకి

కౌగలించి, పామి ఎన్నోవిధములైన జుగుప్సాకరమగు చేష్టలు చేస్తాడు నాయకుడు. 

విరిసీ విరియని , ఆ హీనమైన నీచమైన, జుగుప్సాకరమైన, హేయమైన, దరిద్రమైన సన్నివేశములు చూసే, వచ్చీరాని యవ్వనములో వున్న పిల్లల పరిస్థితి ఏమిటి? అదే విధంగా ప్రతినాయకునితో (Villon) తలపడుచున్నప్పుడు బంతిని కాలుతో తన్నినట్లు ప్రతినాయకుని అనుచరులను,ప్రతినాయకుని, తంతే కారుకు, వాని శరీరము గుద్దుకొని కారు పప్పైపోతుంది.వాడు తిరిగీ తన్నులు తినడానికి నాయకునివద్దకు వూగుతూ తూగుతూ వస్తాడు.అప్పుడు యువకుల మనస్థితి ఏమిటి. ఆ నాయకునిగా తమనూహించుకొని వూగిపోవుటయే కాక ఒక అవకాశము వస్తే ప్రయత్నము చేయవలెననే తపన వారిలో కలుగుతుంది. ప్రయత్నించి తన్నులు తిన్నవారు లెక్కకు మిక్కుటము.

ఇక హాస్యము పేరుతో పాత్రధారులు ఒకరినొకరు కించపరచుకోవడము తిట్టడ ము అతి 

సహజము. ఇవి చూసి యువతకు ఏవిధమైన స్పందన కలుగుతుంది. Punch 

Dialogues పేరుతో తమ మేధస్సు లో భద్రపరచి Theater బయటికి వచ్చిన వెంటనే వుండబట్టలేక వాడుతూ పోవడము. ఆడపిల్లలైతే ఈ 'సినీ మాయలు' చూసి ఉండబట్టలేక, వంటి పై వుండ 'బట్ట' లేక వుండటము.సినిమా హాళ్ళలో తల్లిదండ్రులతో కూర్చుని మరీ సినిమా చూస్తూవుంటారు. సినిమాలో లీనమగుట తప్పించితే ఆ దృశ్యముల ప్రభావము తమ పిల్లలపై ఎంతగా పడుతూవుందోనని ఎప్పుడైనా ఆలోచన చేసినారా!

ఇక TV ల విషయానికి వస్తాము. ఇది TV SERIALS కాలము. ఇంటిల్లపాదీ 

ముఖ్యముగాఆడవారు, త్వరత్వరగా పనిముగించుకొని TV లముందుచేరుతారు. 

వారిపిల్లలు వారితోనే ఉన్నారన్న విషము వారికిజ్ఞాపకముకూడాఉండదు.Serials, క్రికెట్టు 

ప్రసారములు,మధ్యంతర ప్రకటనల విషయానికి వస్తాము.

చదువుకొనే అమ్మాయిలు, కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు Serials ను  చూసి 

నేర్చుకొనేదేమిటంటే కట్టుకొనే బట్టలు, Hotel తిండ్లు లాంటివేకదా 

మగవానితో,మొగునితో కల సంబంధ సంపర్కాలు అన్నది. రెండు మూడు 

సంవత్సరముల నుండి కొన్ని channels పనికట్టుకొని ఈ సనాతన ధర్మము 

కుసంస్కారాల నిలయమని చెవుల్లో ear phones పెట్టి మరీ చెబుతున్నారు. 

ఆవేశముగా 

ఆస్య గ్రంధి (FB) లో వారిని దుయ్యబట్టడము తప్పితే  తమ నియోజకవర్గపు  MLA తోనో 

MP తోనో యువత ఒక ప్రభంజనములా తయారయి , కలిసి,నిలదీసి యడిగితే వారి 

స్పందన దేశము దశ దిశల మారుమ్రోగుతుంది కదా! రాజు తలచితే దెబ్బలకు కొదవా 

అన్నట్లు ఒక ముఖ్యమంత్రి గారు తలచి నండువల్లగదా ఒక channel ఒక రాష్ట్రములో 

మూత బడింది. కాబట్టి మూయించుట సాధ్యము అన్నది మనకు అవగాతమగుచున్నది 

కదా! నేడు ఒకటైతే రేపు వేరొకటి. ఇక ఈ విషయముపై విశ్లేషణ ఇంతటి తో చాలించి 

కాస్త క్రికెట్ మరియు మద్యంతర ప్రకటనలను గూర్చి తెలుసుకొందాము.

ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి 

తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా 

సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు 

విద్యార్థులు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు అన్న పేరు వచ్చింది 

కానీ అంతకు పూర్వము వీరిని నియతులు అనేవారు. అంటే వీరికి నియమ నిష్ఠలు 

ముఖ్యము. తరువాతనే చదువు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు 

అన్న పేరు వచ్చింది కానీ అంతకు పూర్వము వీరిని 'నియతులు' అనేవారు. అంటే వీరికి 

నియమ నిష్ఠలు ముఖ్యము. తరువాతనే చదువు. ఆ విద్యా విధానము వేరు. అది పూర్తిగా 

మన మెకాలే దొరగారి వల్ల వారి విధానమును దైవ వాక్కుగా భావించిన మన తండ్రి

బాబాయిలు వారి అనుయాయుల వల్ల పోగొట్టుకొని ' వాడుగొట్టె వీడు గొట్టే తాంబుర్ర-

ఉత్తబుర్ర చేతికొచ్చే తాంబుర్ర అన్నట్లు తయారయినాము.' మన విద్యా విదానమున్న 

కాలములో దేహ దార్ఢ్యము, శరీర సౌష్ఠవము క్రీదాభినివేశములు ముఖ్యమైనవి. అవి 

పిల్లల చదువుకు భంగకరముగా వుండేవికావు. Corporate Colleges వచ్చి పిల్లల 

నడ్డి విరిచినాయి. అయినా మనకు వాటిని నిర్మూలింపజేసే ఆలోచన రాదు. పూర్వపు 

గురుకులములలో రాజు రౌతు అంతా ఒకటే. పిల్లలకు ఆడుకొనే అవకాశమే లేదు. 

పిల్లకు తలనొప్పి అంటే తెలియని మా కాలమెక్కడ తలనొప్పితో తల్లడిల్లే ఈ కాలము 

పిల్లలెక్కడ. పిల్లలకు సూర్యుడు అపురూప వస్తువైపోయినాడు. అసలు కొందరు 

తల్లిదండ్రులు మా పిల్లవాడు ఎక్కువగా శ్రమ పడుతాడు కాబట్టి Migraine తోబాధ 

పడుతూ వుంటాడని గర్వంగా చెప్పుకొంటారు. నిజము చెప్పవలెనంటే పిల్లలకు 

సంస్కారము తల్లి కడుపునుడి మొదలు కావలె. ఈకాలము ప్రాధాన్యతలు 

మారిపొయినాయి. మొక్కగా ఉన్నపుడే  దేవునిపై భక్తీ, పెద్దలపై గౌరవము, విద్యపై శ్రద్ధసంఘములో నడవడిక, సంస్కృతిపై పిల్లలను అలా గోడమీద గీయము అర్థములేని అల్లరిచేయటము ఇప్పటినుండి కాస్త తగ్గించేప్రయత్నమూచేయుము' అని అంటే, ఆ తల్లియైన బిడ్డ, తన తనతల్లికి ఉపదేశ మిచ్చిందట 'అమ్మాపిల్లలను అల్లరి చేయనీకుంటే చెడిపోతారు' అని. ఇదీ నేటి తల్లుల తెలిసినతనము మరియు బాధ్యత .

మిగిలినది రేపు....... 

ఉద్వేగము – ఉపశమనము - 2

దారి తప్పినాము. వెనుదిరిగి TV --ఆటల ప్రసారణ అన్న విషయానికి వస్తాము.

ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి 

తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా 

సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు 

విద్యార్థులు. కొన్ని పదుల కొట్ల యజమానియైన BCCI నేడు కొన్ని వేలకోట్ల యజమాని. 

ఎందుకంటే వారికి విద్యార్థుల గూర్చిన చింత ఏకొంత కూడా అవసరము లేదు. వారికి 

వారి Schedules తప్ప పిల్లల పరిక్షలు పట్టవు. ఇక పిల్లలో "ఇది చాలా ముఖ్యమైన 

Match పరిక్షది ఏముంది అది మళ్ళీ అయినా వస్తుంది,Match రాదుగదా అన్న ధోరణి. 

ఇక ఉద్వేగము ఇక్కడ మొదలౌతుంది. ఒక 20/20 Match ని వూహించుకొండి. చివరి 

Over 25 Runs కొట్టాలి.   ధోని Batting చేస్తున్నాడు. రెండవ ప్రక్క ఒక 'వాలాగ్రము

వున్నాడు. అక్కడ మొదలౌతుంది ఉద్వేగమంతా! గోళ్ళు మొత్తము 10వ్రేళ్ళవి కొరికి 

ముగించి ప్రక్కవాని గోళ్ళు కొరుకుతూ వుంటాడు. ఇంతTension అవసరమా! తన 

ఆరొగ్యము పై ఆ ఉద్వేగము యొక్క ప్రభావము పడుతుందనే యోచన ఆ వ్యక్తిలోనికి ఆ 

సమయములో వస్తుందా . అనవసరమైన ఆ క్షణికమైన ఆందోళణకు ఆరోగ్యాన్నే 

బలిచేయడానికి సిద్ధపడుతున్న అతని పతనమునకు కారణమెవరు? ఇవన్నీ 

ఒకప్రక్కయితే Betting అన్న మహమ్మారి ఇంకొకపక్క !

అంతకన్నా ఘాతుకమైనవి ప్రకటనలు. 10సెకనుల సమయము తీసుకొనే ఒక్కొక్క 

Advertisement Film ఎంత హీనమైన శృంగారమును జొప్పిస్తున్నారు వానిని చూసే 

యువతీ యువకుల ,విద్యార్థుల ఆలోచనలు ఏవిధముగా వుంటాయని, వానివల్ల దేశము 

ఎంత నిర్వీర్యమైపోతుందన్న ఆలోచన ఎవరికైనా వుందా!కనీసము 80 సంవత్సరాలు 

ఆరోగ్యముగా బ్రతుకవలసిన నేటి యువకుడు 80 ఏళ్ళకు  ఈ విధమైన పరిస్థితులలో  

వుంటాడా ! వుంటే ఆరోగ్యంగా వుంటాడా !వున్నా తన దేశానికి, గ్రామానికి, కడకు తన 

తల్లిదండ్రులకు, కనీసము భార్యాబిడ్డలకు పనికి వస్తాడా! 'ఇహము పరము లేని మొగుడు 

ఇంటినిండా, రుచి పచి లేని కూర చట్టినిండా' అన్నట్లు ఉంటాడు.

కాబట్టి యువకులు తమ ఉద్వేగమును ఉపశమింపజేసుకోవలె. మరి ఏ విధంగా! 

మొదటిది విద్య . అసలు విద్యకు మంచి చెడ్డలు లేవు. ఒక వ్యక్తి నిజానికి జీవితమంతా 

విద్యార్థే ! ౘక్కెర ఇసుకతో కలిసి వున్నా మనసుంటే రెంటినీ వేరు చేయవచ్చు. నీటి 

సహాయము కావాలి అంతే! ఆ నీరే నీ సహవాసము. గుణముగల పెద్దలతో చెలిమి 

చేసుకొంటే వారిద్వారా పంచదార అన్న పవిత్ర భావాల అణువులనన్నిటిని సాధించవచ్చు. 

రామాయణ భారత, భాగవతాది కథలను విధిగా చదవాలి. సులభశైలిలో వ్రాయబడిన 

పుస్తకములు ౘాలు. నేటికాలపు మహాపురుషులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్

సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ , లాల్ బహదుర్ శాస్త్రి,అబ్దుల్ కలాం

లాంటి వారి జీవిత చరిత్రలు బాలురు,యువత తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. 

తల్లిదండ్రులకు కలకాలము  తగిన గౌరవమివ్వాలి. పెద్దలుకూడా చిన్నపిల్లలకు మన 

సంస్కృతి అందజేసిన కళ్యాణ సాహిత్యమును చిన్నవయసులోనే KG లకు పంపకుండా  

చదివించితే గొప్పవారవుతారు కాబట్టి తప్పక ౘదివించాలి. పీడలా కతీతంగా  నేడు 

నాటిన మొక్క నాడు నీడ నివ్వాలంటే  వీడకుండావారిని బాధ్యత అన్న నీరు పోసి పెద్దలు 

పెంచాలి. మొక్క మానైన పిదప నీరు పోయుట ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది 

ఆలోచిస్తే పెద్దలకు తెలియనిది కాదు.

స్వస్తి.