Saturday, 17 June 2017

ఊహా విహారిణి

ఊహా విహారిణి
చల్లనివేళ రాదొడగె జారగ జొచ్చెను పూల తావులున్
మెల్లని పిల్లగాలి మెయి మీటుచు సాగెను పుల్కరించగన్
ఝల్లను మేనితో మనసు జంటగ గూడుచు  పాడె హాయిగా
యుల్లము పల్లవించ మది యూహల తేనెలు జాలువారగన్

ఎల్లలు లేని నా మనసుకెల్ల సుఖంబుల బేర్చి గూర్చ దా
పిల్లనగ్రోవియై పిలువ పేరిమి మీరిన కాంక్ష గల్గు నే
తెల్లము జేయ వెల్వడితి తేరుగ జేసి మనంబు భావముల్
తెల్లని ఆశ్వయూధముగ తెమ్మెర పగ్గముగా దనర్పగన్

బెల్లము గాగ నా మనసు బేరులు గట్టిన గండుజీమలై
గిల్లగ నీదు జ్ఞాపికలు గిచ్చుల నెల్ల భరించలేక నే
తల్లట జెందుచున్  మిగుల దైన్యము బొందుచు పుష్పవాటికల్
మొల్లల కుంజముల్ దిరుగ మోహిని కానవదేల  తెల్పుమా!

                     చెరుకు రామ మోహన్ రావు

Tuesday, 13 June 2017

108 యొక్క ఔన్నత్యము



108 యొక్క ఔన్నత్యము 

https://cherukuramamohan.blogspot.com/2017/06/108.html

నూట ఎనిమిది సంఖ్యనుగూర్చిన ఎన్నో ఆలోచనలు అనుమానములు మనలో వున్నాయి. 108 ఎందుకు మన ధర్మములో పవిత్రముగా భావించుతాము అన్నది నాకు తెలిసిన మేరకు మీకు తెలియజ్య ప్రయత్నము చేస్తున్నాను.
సూర్యుని వ్యాసము భూమివ్యాసమునకన్నా 108 రెట్లు ఎక్కువ. భూమినుండి సూర్యుని దూరము భూమి వ్యాసమునకన్నా 108 రెట్లు ఎక్కువ.
భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరము చంద్రుని వ్యాసమునకన్నా 108 రెట్లెక్కువ. ఆయుర్వేదములో జీవుల ఆరోగ్యమునకు 108 మర్మ సూత్రాలున్నాయంటారు.
శ్రీ చక్రమున 54 రేఖా ఖండనములు (Intersections of straight lines) వున్నాయి అంటారు. ఈ 54 బిందువులూ స్త్రీపురుష గుణములను సంయుక్తముగా కలిగి ఉంటాయని అంటారు. అంటే 54+54=108.మనకు 12 రాశులు 9 గ్రహాలు వుంటాయి . మనపై అనుగ్రహాలు వానివల్లనే కలుగుతాయి. వాని పౌనఃపున్యములు 12x9=108
నూట ఎనిమిది సంఖ్యనుగూర్చిన ఎన్నో ఆలోచనలు అనుమానములు మనలో వున్నాయి. 108 ఎందుకు మన ధర్మములో పవిత్రముగా భావించుతాము అన్నది నాకు తెలిసిన మేరకు మీకు తెలియజ్య ప్రయత్నము చేస్తున్నాను.
సూర్యుని వ్యాసము భూమివ్యాసమునకన్నా 108 రెట్లు ఎక్కువ. భూమినుండి సూర్యుని దూరము భూమి వ్యాసమునకన్నా 108 రెట్లు ఎక్కువ.
భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరము చంద్రుని వ్యాసమునకన్నా 108 రెట్లెక్కువ. ఆయుర్వేదములో జీవుల ఆరోగ్యమునకు 108 మర్మ సూత్రాలున్నాయంటారు.
శ్రీ చక్రమున 54 రేఖా ఖండనములు (Intersections of straight lines) వున్నాయి అంటారు. ఈ 54 బిందువులూ స్త్రీపురుష గుణములను సంయుక్తముగా కలిగి ఉంటాయని అంటారు. అంటే 54+54=108.మనకు 12 రాశులు 9 గ్రహాలు వుంటాయి . మనపై అనుగ్రహాలు వానివల్లనే కలుగుతాయి. వాని పౌనఃపున్యములు 12x9=108. భరతుని నాట్య శాస్త్రములో 108 కరణములు వున్నాయి. సంస్కృతములోని అక్షరములు 54. అవి అన్నీ స్త్రీ పురుష గుణములు కలిగి ఉంటాయట. అక్షరములు శివ శక్తి రూపములు కదా! అవి పార్వతీ పరమేశ్వరుల నాట్యావసాన సమయమున వచ్చిన 'మాహేశ్వర సూత్రా జాలము' లోనివే కదా! అందుకనే అవి రెండు లక్షణాలూ కలిగి వుంటాయి. 54+54=108.
27 నక్షత్రాలు, నక్షత్రమునకు 4 పాదములు. మొత్తము 27x4 = 108.

108 లో 1 పరమాత్ముని ఏకత్వమును తెలిపితే 0 శూన్యమును అంటే మాయ తెలుపుతుంది, 8 అనంతమును తెలుపుతుంది. మొత్తము అద్వైత వేదాంతము ఇందులోనే వుంది.

108 ని 'హర్షద సంఖ్య అంటారు. హర్షద సంఖ్య అంటే ఏమిటంటే, ఉదాహరణకు 108 నే తీసుకొందాము. 1+0+8 = 9. 108 అంటే 1,0,8 అంకెల సంకలనము 108 ని నిశ్శేషముగా భాగించుతుంది. దీనిని హర్షద సంఖ్య అంటారు.
పంచభుజి లో ప్రక్క ప్రక్కన గల సరళరేఖల మధ్య కోణము 108 డిగ్రీలు. అదృష్టమును నక్షత్రముతో పోల్చుతాము. ఒక వృత్తము పై గల 5 సమానాంతర బిందువులను తీసుకొంటే నక్షత్రమును గీయగలమ. ఆ ప్రక్క బిందువులను కలిపితే మనకు పంచభుజి వస్తుంది. ఆ ప్రక్క ప్రక్కన గల సరళరేఖల మధ్య కోణము 108 డిగ్రీలు. పై పెచ్చు 'పంచ శుభం' అని కూడా అంటారు కదా!

గంగానది యొక్క అక్షాంశ రేఖాంశములు 12 డిగ్రీలు (79 to 91 ) మరియు 9 డిగ్రీలు (22 to 31 ) వుంటాయి. 12x9= 108 డిగ్రీలు.

దైవ కైంకర్యమునకు వాడే వెండి యొక్క అణుభారము(Atomic Weight) 108.
108 లోని 1,0,8 ణి కలిపితే వచ్చే 9 మన జాతకమును నడిపే నవగ్రహములకు ప్రతీక.

స్వస్తిx9=108. భరతుని నాట్య శాస్త్రములో 108 కరణములు వున్నాయి. సంస్కృతములోని అక్షరములు 54. అవి అన్నీ స్త్రీ పురుష గుణములు కలిగి ఉంటాయట. అక్షరములు శివ శక్తి రూపములు కదా! అవి పార్వతీ పరమేశ్వరుల నాట్యావసాన సమయమున వచ్చిన 'మాహేశ్వర సూత్రా జాలము' లోనివే కదా! అందుకనే అవి రెండు లక్షణాలూ కలిగి వుంటాయి. 54+54=108.
27 నక్షత్రాలు, నక్షత్రమునకు 4 పాదములు. మొత్తము 27x4 = 108.
108 లో 1 పరమాత్ముని ఏకత్వమును తెలిపితే 0 శూన్యమును తెలుపుతుంది, 8 అనంతమును తెలుపుతుంది. మొత్తము వేదాంతము ఇందులోనే వుంది.
108 ని 'హర్షద సంఖ్య అంటారు. హర్షద సంఖ్య అంటే ఏమిటంటే, ఉదాహరణకు 108 నే తీసుకొందాము. 1+0+8 = 9. 108 అంటే 1,0,8 అంకెల సంకలనము 108 ని నిశ్శేషముగా భాగించుతుంది. దీనిని హర్షద సంఖ్య అంటారు.
పంచభుజి లో ప్రక్క ప్రక్కన గల సరలరేఖల మధ్య కోణము 108 డిగ్రీలు. అదృష్టమును నక్షత్రముతో పోల్చుతాము. ఒక వృత్తము పై గల 5 సమానాతర బిందువులను తీసుకొంటే నక్షత్రమును గీయగలము. ఆ ప్రక్క బిందువులను కలిపితే మనకు పంచభుజి వస్తుంది. ఆ ప్రక్క ప్రక్కన గల సరలరేఖల మధ్య కోణము 108 డిగ్రీలు. పై పెచ్చు 'పంచ శుభం' అని కూడా అంటారు కదా!
గంగానది యొక్క అక్షాంశ రేఖాంశములు 12 డిగ్రీలు (79 to 91 ) మరియు 9 డిగ్రీలు (22 to 31 ) వుంటాయి. 12x9= 108 డిగ్రీలు.
దైవ కైంకర్యమునకు వాడే వెండి యొక్క అణుభారము(Atomic Weight) 108.
108 లోని 1,0,8 ణి కలిపితే వచ్చే 9 మన జాతకమును నడిపే నవగ్రహములకు ప్రతీక.
నాకు తెలిసిన మేరకు తెలియజేసినాను. మన పూర్వుల గొప్పదనము ఈ విధముగా అణువణులో మనకు కనిపిస్తుంది.

స్వస్తి

Saturday, 10 June 2017

గరుడ గమన తవ చరణకమల.....జగద్గురు భారతీ తీర్థులవారి రచన

గరుడగమన తవ చరణకమల…..
రచన జగద్గురు భారతీ తీర్థ స్వాములవారు


గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్
మనసి లసతు మమ నిత్యమ్ ॥ 
మమ తాపమపాకురు దేవ-మమ పాపమపాకురు దేవ ॥
1. జలజనయన విధినముచిహరణముఖ-
విబుధవినుత-పదపద్మ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
2. భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
3. శఙ్ఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
4. అగణిత-గుణగణ అశరణశరణద-
విదలిత-సురరిపుజాల -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్-2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
ఈ పాటలో మొదటి పంక్తి భగవంతుని గుణవిశేషణాలను వర్ణించితే
రెండవ పంక్తి ఆయనకు ఆత్మ నివేదన.
ఈ పంక్తి ఈ గీతము యొక్క ఆసాంతమూ  పునరావృతమవుతూ వుంటుంది.
ఈ రచనలోని మరియొక ప్రత్యేకత ఏమిటంటే లయ. ఈ లయ సుందరము సురుచిరము, మధరము, మనోజ్ఞము, మనోహరము మరియు మహదానంద కారకము. ఒక అక్షరము ఎక్కువ కానీ ఒక అక్షరము తక్కువ కానీ ఆసాంతమూ ఈ గీతములో ఉండక మిక్కుటమగు లయబద్ధముగా వుంటుంది. మరి వ్రాసినది ఎవరు? జగద్గురువులు కదా! జగద్గురువులు భారతీ తీర్థులవారి చరణ కమలములకు త్రికరణ శుద్ధిగా మదీయ సాష్టాంగ దండప్రణామములు.
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి లసతు మమ నిత్యమ్
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి మమ నిత్యమ్ లసతు 
గరుడ గమన = ఓ గరుడ వాహనుడా
తవ చరణకమలమ్ = నీ పద కమలముల
ఇహ మమ మనసి = ఇక్కడ నా మనసులో
నిత్యం లసతు = కలకాలమూ విలసిల్లుగాక
  
మమ తాపమ్ + అపాకురు దేవ =నా తాపమును హరించు ఓ పరాత్పరా!
మమ పాపమ్ + అపాకురు దేవ = నా పాపమును హరించు పరంధామా!
(ప్రతి చరణంలోనూ ఈ పంక్తి పునరావృతమవుతుంది.)
ఇక చరణములు-
1. జలజ-నయన, విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ
జలజ-నయన = ఓ కమలాక్షా
విధి- = బ్రహ్మ
నముచి-హరణ- = నముచి ఒక రాక్షసుడు. ఈయన కశ్యపునకును ఆయన సతి
ధనువునకును జన్మించిన కుమారుడు. నముచి భార్య పేరు ప్రభ. దేవ దానవ యుద్ధంలో ఇంద్రుడు వజ్రయుధంతో కొట్టినా, బ్రహ్మ వరము వల్ల ఈయన ఇంచుక కూడా చలించలేదు. తడిసిన దానితోగానీ, తడవనిదానితో గానీ ఈతనికి చావులేదు. అయినా ఇంద్రునికి కనిపించకుండా దాగిన నముచిని కనుగొని,ఇంద్రుడు నముచితో చంపనని నమ్మించి స్నేహం చేసి పగలు రాత్రి గాని సంధ్యా సమయంలో, తడి పొడి గాని సముద్రపు అలల నురగతో తన వజ్రాయుధాన్ని ముంచి సంహరించినాడు. ఆ బ్రహ్మేన్ద్రాది
విబుధ= మహాత్ముల చేత ముఖ= ముఖమును  మరియు
పద-పద్మ = పాదపద్మములు కలిగి
వినుత = కీర్తింపబడువాడా 
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
2. భుజగ-శయన, భవ-మదన-జనక, మమ జనన-మరణ-భయ-హారీ ॥
భుజగ-శయన = శేష తల్ప గతుడా
భవ-మదన-జనక = ఇటు సంసారామునకు అటు  మన్మథునికి తండ్రి అయినవాడా
మమ జనన-మరణ-భయ-హారీ = నా జనన మరణమను భయమును సమయించువాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
3. శఙ్ఖ-చక్ర-ధర దుష్ట-దైత్య-హర సర్వ-లోక-శరణ ॥
శఙ్ఖ-చక్ర-ధర = శంఖ చక్రముల ధరించినవాడా
దుష్ట-దైత్య-హర = దుష్ట దైత్యులను దునుమాడేవాడా
సర్వ-లోక-శరణ = అన్ని లోకములకు శరణమునోసంగువాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
4. అగణిత-గుణగణ అశరణ-శరణద విదలిత-సుర-రిపు-జాల ॥
అగణిత-గుణగణ = లెక్కకు మిక్కుటమగు  గుణముల గణములు (గుంపులు) కలిగినవాడా
అశరణ-శరణద = శరణాగత రక్షకుడా (దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా!)
సుర-రిపు-జాల-విదళిత- = దేవతల విరోధులగు రాక్షస మూకలను చీల్చి చెండాడినవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
5. భక్తవర్యమ్ ఇహ భూరి కరుణయా పాహి భారతీ-తీర్థమ్ 
ఇహ భక్తవర్యమ్ భారతీ-తీర్థమ్ భూరి కరుణయా పాహి ॥
భక్తవర్యమ్ = భక్త శ్రేష్ఠుడగు  (ఈ)
భారతీ-తీర్థమ్ = భారతీ-తీర్థుని (జగద్గురువులు)
ఇహ = కోర్కెమీర ( ఇహ అన్న మాటకు కోర్కె అన్న అర్థము కూడా కలదు.)
భూరి కరుణయా = చాలా కరుణతో
పాహి = రక్షించు
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
స్వస్తి


ఋగ్వేదము - కాంతి వేగము

ఋగ్వేదము - కాంతి వేగము 
https://cherukuramamohan.blogspot.com/2017/06/blog-post.html
ఋగ్వేదముననుసరించి కాంతివేగ గణన

వేదము విద్య నిధానము
వాదము వలదయ్య వినుము వక్రత దేలా
ఖేదముల పార ద్రోలుచు
మోదము గాంచెదవు చదువ మోహన రామా!
ఇది నా అంతరాత్మ నాకు తెలిపిన మాట. ఒకసారి నేనున్న  Share Taxi లో ఒక యువకుడు ఎక్కినాడు. కొంత సమయము గడచిన తరువాత అతనితో తాను జీన్స్ ప్యాంటు వేయుటలోని ప్రాధాన్యత ఏమయినా ప్రత్యేకముగా వున్నదా అని అడిగినాను. అతను జవాబుగా 'నలుగురితోటి నారాయణ' అన్నాడు. దాని వాడకము మంచిది కాదని సహేతుకముగా తెలిపినాను.నా మాటను ఒప్పుకొని నాతో మాటా మాటా కలిపినాడు. ఆతని మాటల ద్వారా నేను తెలుసుకొనినదేమిటన ఆతడు వేదములందలి శాస్త్ర విషయ పరిశోధన చేస్తూ ఉన్నాడని. మనసుకు ఎంతో సంతోషము కలిగినది. వేదములు అజరామరములన్న నమ్మకము కలిగింది. 
ఆ నమ్మకముతోనే మీతో పంచుకొనుటకు ఈ ఋగ్వేదములోని శాస్త్ర విషయమును మీకు తెలియజేయదలచినాను.
నిజానికి ఈ కాలమునాటి యువతీ యువకులు ' వేదములలో ఎన్నో శాస్త్ర విషయములు వున్నాయి అంటే తెలుసుకోకుండానే ముందు నవ్వేస్తారు. ఐన్స్టీన్, షోపెన్ హోవర్ లాంటి అనేకులైన పాశ్చాత్య ప్రముఖ శాస్త్రజ్ఞులు ప్రముఖులు ఎంతగానో ప్రశంసించిన ఈవేదములను కన్న భూమిపై పుట్టుటకు మనము ఎంత పుణ్యము చేసుకొన్నామో! వేదములలో ఋగ్వేదము మొదటిది.
ఋగ్వేదము సూర్యుని గొప్పదనమును గూర్చి నేను చదివిన ఒక ఆంగ్ల పుస్తకములోని మాటలను యథాతథముగా మీముందు ఉంచుచున్నాను.
"This homage is to the ancient-born Seers, to the ancient makers of the Path."  - Rig Veda X. 14-15.
"Let us bring our minds to rest in
The Glory of the Divine Sun!
May He inspire our reflections!"
  - Rig Veda II. 62. 10).
"You shine, all living things emerge. You disappear, they go to rest. Recognizing our innocence, O golden-haired Sun, arise; let each day be better than the last."    Rig Veda (X, 37, 9).
The Rig Veda is the Veda par excellence, the real Veda that traces the earliest growth of religious ideas in India.

ఈ క్రింద కాంతి వేగమును గూర్చి ఋగ్వేదము ఏమి చెప్పినదో చూస్తాము.

ఈ విషయమై పరిశోధించిన యస్ యస్ డే మరియు ఫై వి వర్తక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దిగువ తత్సంబంధిత వివరములను తెలుపుచున్నాను.
14 వ శతాబ్దమున, బుక్కరాయల రాజ గురువు మరియు, వేద భాష్యమును వ్రాసిన సాయణ మాధవులు విద్యారణ్యుల వారి సహోదరులని కొందరు పండితులంటే వారే వీరని కొందరంటారు. ఏది ఏమయినా వారు ఈ భారత భూమికి 'వేద భాష్యము'ల రూపమున యొసంగిన కానుక అమూల్యము అపురూపము .
సాయణ ఋగ్వేద భాష్యానుసారము సూర్య కాంతి 2,202 యోజనములు 1\2 నిమేషము ( మనము ఇప్పుడు కాలమానములో వాడే నిమిసము కాదు.) లో పయనించుచున్నది. ఈ విషయమునే భట్ట భాస్కరుడు (భాస్కరాచార్య ll 10 వ శతాబ్దము కావచ్చు) తన తైత్తిరీయ బ్రాహ్మణక భాష్యములో వివరించినాడు.
 ఎటువంటి దూర దర్శనుల సహాయము లేకుండా, కృత్రిమ ఉపగ్రహముల ద్వారా కాకుండా, గ్రహచారము, సూర్యోదయ సమయము, సూర్యాస్తమయ కాలము, గ్రహణములు, తితివార నక్షత్ర యోగ కరణములు గల్గిన మన పంచాంగములు ఎప్పటినుండి మొదలయినాయి అన్న ప్రశ్నకు జవాబు ఎవరూ చెప్పలేరు. అంతటి విజ్ఞానమును పంచిన వేదముల తలమానికమగు ఋగ్వేద గ్రంథములోని ప్రథమ సంహిత లోని 4వ అనువాకము లోని 50 మంత్రము ఈ విధముగా వుంది:

तरणिर्विश्वदर्शतो जयोतिष्क्र्दसि सूर्य |
विश्वमा भासिरोचनम |
తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదతి సూర్యl
విశ్వమా భాసి రోచనంl

సువర్ణ సుందర సుపధగ  సూర్యా
భాస భరిత క్షితి జనగతి కార్యా (స్వేచ్ఛానువాదము)
వేగము మరియు అందమును సంతరించుకొని ఈ భూమిని వెలుగులతో నింపిన ఆర్యా సూర్యా! అన్న అర్థమును  అన్వయించుకొనవచ్చును పై శ్లోకమునకు. దీనిని సాయణ భాష్యము ఈ విధముగా వ్యాఖ్యానించుతూ వుంది.
तथा स्मरयते योजनम्.
सहस्रे शते द्वे द्वे शतेद्वे योजने एकेन निमिषार्धेन क्रममन
దీని అర్థము ఏమిటంటే 
కాంతి వేగము = 1\2 నిమేషమునకు (మనమువాడే నిముసము అంటే MINUTE కాదు.)
ఒక యోజనము = 9.09 మైళ్లు
ఇక ఈ కాల-దూర కొలమానములను పరిశీలించుదాము.

మాహాభారతములోని శాంతి పర్వమందలి మోక్షధర్మ విభాగామునందు కాల గణనను మనము ఈ విధముగా చూడవచ్చును:

15 నిమేషములు = 1 కాష్ట
30 కాష్టాలు = 1కల
30.3 కలలు = 1 ముహూర్తము
30 ముహూర్తములు = 1దివారాత్రి = 24 గంటలు
కావున ఒక దివారాత్రి = 24 గంటలు = 30 x 30.3 x 30 x 15 నిమేషములు = 409050 నిమేషములు
1 గంట = 60 x 60 = 3600 సెకనులు
24 గంటలు = 24 x 3600 సెకనులు = 409050 నిమేషములు
409050 నిమేషములు = 86,400 సెకనులు
1 నిమేషము (రెప్ప పాటు కాలము) = 0.2112 సెకనులు 
1/2 నిమేషము = 0.1056 సెకనులు

విష్ణు పురాణము నందాలి 6వ అధ్యాయములో  యోజనమును ఈ విధముగా లెక్కించుట జరిగినది.



 10 పరమాణువులు = 1 పర సూక్ష్మము 
 10 పరసూక్ష్మములు = 1 త్రసరేణువు
 10 త్రసరేణువులు =    1 మహి రజస్సు (ఒక మట్టి రేణువు)
 10 మహి రజస్సు =      1 బాలాగ్రము   (వెంట్రుక కొస)            
10 బాలాగ్రములు =      1 లిక్ష 
10 లిక్షలు = 1 యూకము
10 యూకములు = 1 యవోదరము (బార్లీ బియ్యపుగింజ యొక్క పొట్ట)
10 యవోదరములు = 1 యవ ధాన్యపు గింజ
10 యవలు = 1 అంగుళము
6 అంగుళములు = 1 పాదము
2 పాదములు = 1 వితస్థి
2 వితస్థులు = 1 హస్తము
4 హస్తములు = 1 దండము లేక పౌరుసము = 6'(feet)
2000 దండములు = 1 గౌయుతి (ఆవు రంకె వినబడు దూరము) = 12000 feet
4 గౌయుతులు = 1 యోజనము = 9.09 మైళ్లు

గణింపు:
ఇపుడు కాంతి వేగమును గణించి చూచెదము.
పైన తెలిపిన శ్లోకములను ధ్యానములోనుంచుకొనినచో మనకు కాంతి 1\2 నిమేషమునకు 2202 యోజనములు పయనించునటుల తెలియవచ్చినది.
అంటే కాంతి వేగము = 2202 x 9.09 miles per 0.1056 seconds
= 20016.18 మైళ్ళు 0.1056 సెకనులకు
= 189547 మైళ్లు ఒక సెకనునకు


ఆధునిక సైన్సు ప్రకారము కాంతివేగము = 186,28.7 మైళ్లు ఒక సెకనునకు.
దీనిని 19 వ శతాబ్దములో మాక్స్వెల్ అను సైంటిస్టు తెలియజేసినాడు.
కానీ లెక్కలకు అందని కాలములోనే ఈ విషయము ఋగ్వేదములో చెప్పబడినది. 
చూసినారుకదా మన వేదముల ఔన్నత్యము, మన పూర్వీకుల గొప్పదనము.


స్వస్తి



Sunday, 28 May 2017

మనోమంథనం

మనోమంథనం
నేను నా రచనలేవయినా ఒక లంకె లో ఉంచుతాను. అందువల్ల ఉత్సాహవంతులు ఆస్య గ్రంధ కుడ్యముపై వెదకే అవసరము లేకుండా నేను తెలిపిన లంకెను తాము గుర్తుగా కాపాడుకొంటే ఎప్పుడయినా దానిని అనావృతము (To Open) చేసి చదువుకొనే వీలుంటుంది.


నేను ముసలివాడనే కానీ నేను ముఖ్యముగా పడుచువారి కొరకే వ్రాస్తాను. వారికి మన దేశ చరిత్ర, మన పురాతన వైభవము, మన పూర్వుల ప్రాభవము,మన దేశమును లేక మనదేశములోని వివిధ ప్రాంతములను ఏలిన రాజుల దేశ భక్తి, అన్నింటికీ మించి మన మహర్షివరేణ్యుల  విజ్ఞాన యోగదానము, వారి పరిశీలనాపటిమ, ఈనాటికీ దూరేక్షణ (Telescope) సహాయముతో కనుగోనలేని విషయములను, సూక్ష్మదర్శినులకు, కనబడని విషయములను, ఊహల
కందని విషయములను, గ్రహచారము, భూగోళము, వివిధములగు ధాతువులు(Minerals)
వైద్యము, శస్త్ర చికిత్స, ఈ విధ్జముగా చెప్పుకొంటూ పోతే లెక్కకు మిక్కుటమగు ఎన్నో ఆవిష్కరణనలను, తమ తపోశక్తితో అందజేసి, పాశ్చాత్యులవలె పేరుకు తపించని వారిని గూర్చి నాకు తెలిసినది వ్రాస్తూ వున్నాను. నాకు తెలుసు ఈ పనివల్ల దమ్మిడీ ఆదాయము ఘడియ పురుసత్తు ఉండదని. ఆరెంటిని కాదని వ్రాస్తున్నానంటే మీకు తెలియజేయు ప్రయత్నము తప్ప నా మనసులో వేరు తపన లేదు. కానీ ఒక్కొక్కసారి అవి చూసే వారి సంఖ్య కేవలము నామమాత్రముగా వుంటుంది. నేను నిరాశపడుటలేదు. కారణము నేను కేవలము ఆశావాదిని కావటమే! నా సంకల్పబలము నన్ను మేడిమ త్రిప్పనీయుటలేదు.
మొన్న ఆంగ్లములో The Tyrant Diaries
(From the memoirs of a French adventurer who served at Tipu’s court)
FRANCOIS GAUTIER అను చరిత్రకారుడు మరియు ప్రముఖ పాత్రికేయుడు. పరదేశమగు France (Paris) లో పుట్టి హిందుత్వమును స్వీకరించి ఈ దేశపు యువతిని పెళ్లియాడి ఇచ్చట నిలిచిపోయి ఆధార సహితమగు చరిత్రను భారతీయులకు అందజేయ వలయునను తపనతో వ్రాస్తూవుంటే అటువంటి వ్యక్తి రచనలను తిరస్కరించినాడు ఒక పాఠకుడు.
మిగత పాఠకులు ఎవరయినా దీనిని చదివి ఖండించినారా అంటే చదివేతేనే కదా ఖండించేది అన్న జవాబు వస్తుంది. బహుశ పాఠకులలో తేలికగా వుండే విషయములకు అధికముగా స్పందించేవారు ఎక్కువగా వుంటారేమో! మనదేశమునకు పునర్వైభవము తేవలెనన్న తపనతో నా సమయమును, ముదిమికి వలయు కనీసపు సుఖమును లెక్కచేయక, నాశక్తినంతయును కూడగట్టుకొని, నా పరిధిలో నాకు చేతనయినంత పరిశోధన చేసిన పిదపనే నా వ్రాతలను మీకు పంచుచున్నాను.

చరిత్ర తెలుసుకొనుట ఎందుకు అన్న ఆలోచన కొందరిదయితే, చదివితే ఏమొస్తుంది అన్నధోరణి కొందరిది. అసలు చరిత్ర చదివితే తప్పిదములు ఎక్కడ జరిగినదీ తెలుస్తుంది. వానిని సవరించుకొనుటకు మనకు అవకాశము లభించుతుంది.
టిప్పు సుల్తాను ను గూర్చిన ఈ వివరములు చూడండి.
 టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 20న జన్మించినాడని చరిత్రకు సంబంధించిన పాఠములు మరియూ వికీపిడియా తెలుపుచున్నాయి.  కానీ ప్రభుత్వం మాత్రం ఈనెల 10న టిప్పు జయంతిని అధికారికంగా జరిపింది. నవంబర్ 10 ఒక చీకటి రోజంటున్నారు చరిత్రకారులు. బెంగళూరు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సూర్యనారాయణ రావు గారు ఏమంటున్నారో వారి మాటలోనే చదవండి.
Former Bangalore University Vice Chancellor Thimappa Manchale Suryanarayanarao called out the government’s ignorance on social media, “I just learnt from a historian that the tyrant Tipu’s birthday falls on November 20. November 10 is the day on which he hanged 700 Iyengars in Melkote.” As a result, the Melkote Iyengars do not celebrate Diwali even today. By cruel irony, that is the day the Karnataka government decided to celebrate its supposedly secular hero. How embarrassing can this get?
ఇక ఈ వాస్తవాన్ని గమనించండి (From Firstpost.com)
it’s the Coorgs, who he killed and converted, it’s the Mangalorean Catholics, whose churches he destroyed, and the Nairs of Wyanad and Malabar, who he tried to exterminate. Evidence for this comes from Tipu’s own letters and diaries. Instead, Chief Minister Siddaramaiah casually dismisses history by saying that the protests were by “communal forces”.

That’s not true, according to Coorgs. Says Coorg-born Gautham Machaiah, former executive vice-president, Zee Networks, “Coorgs are not opposed to Tipu Jayanti because he was a Muslim. He was a tyrant. He butchered thousands of Coorgs, mainly women and children, and forcibly converted innumerable people. We would have equally opposed Tipu Jayanti had he been a Hindu or a Christian.” The seething anger among Coorgs is ripe for exploitation.
భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో, వాల్మీకి,  ఆటవికుడు కానీ బ్రహ్మత్వమును పొందిన మహానుభావుడు,  ఆది కవి ఈ ప్రపంచములోనే, మరియు కనకదాసు వెనుకబడిన కురుబ గొల్ల కులస్తుడు, కానీ తన భక్తితో ఆ భగవంతుడినే తన వైపునకు తిప్పుకున్న పుణ్యమూర్తి, శ్రీ కృష్ణ దేవరాయలతోనే కనాభిషేకము చేయించుకొన్న, ఆయన గురువగు వ్యాసరాయలుకు అనుంగు శిష్యుడు, ఈ ఇరువురి జన్మ దినములను మన దేశీయ పంచాంగముననుసరించి శెలవు దినములుగా ప్రకటించినారు. అందుకు ఇది పోటీయా అన్నట్లు ఇప్పటి ప్రభుత్వము ఈపని చేసింది. మరి ఏవిధముగా ఆలోచించినా పై ఇరువురితో టిప్పుసుల్తాను పోల్చదగిన వాడా!
కర్ణాటక భగ్గుమనదా! టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుప రాష్ట్రమునకు ఇపుడు అవసరమా! ఇప్పుడు ఓ కొత్త వివాదం తెరమీదికి తెచ్చినట్లు కాదా?
మరి ఈ తప్పిదములు చరిత్రపుటలకు ఎక్కవలసిన అవసరము లేదా! ఇంతకన్నా ముఖ్యమగు సత్కార్యములు రాష్ట్రమునకు చేయవలసినవి లేవా!
ఈ వివరములు యువకులయిన మీరు గమనించిన తరువాతనయినా మంచిచెడులను అరసి చూసి మంచికి ప్రాధాన్యతనివ్వండి. చరిత్ర తెలుసుకోండి. ఇది రాజకీయము కాదు. దేశము అరాచాకీయము కాకుండా చూడండి. ఒక్కసారి మనో మంథనము చేసుకొండి. దేశమునకు అన్యాయము చేసిన వాళ్ళను మీరు పరీక్షించి తెలుసుకోండి. దేశము కొరకు ప్రాణాలను అర్పించిన మహనీయులను వెలుగులోనికి తెండి. ఎవరు వ్రాసే మాటలూ నమ్మవద్దు, నేను వ్రాసినవయినా సరే! మీరు పరిశీలించి వాస్తవమును గ్రహించి మీరు తెలుసుకొన్న వాస్తవ చరిత్రను మీ పిల్లలకందించండి.
స్వస్తి