కొనకుండా నవ్వుకొనండి - ఒక ఆపిల్ కథ
Saturday, 17 September 2022
కొనకుండా నవ్వుకొనండి - ఒక ఆపిల్ కథ
htthttps://cherukuramamohan.blogspot.com/2022/09/bank-interview.html
ఒక వార్దుషి(Bank) ఉద్యోగమునకు ఒక యువకుడు Interview కు పోయినాడు. Tuck చేసి Tie కట్టి Suit తో నిగనిగలాడుతున్న Interviewing Officer తానడుగాబోయే చమత్కారమైన ప్రశ్నకు ఆ ఉద్యోగార్థి ఏమి జవాబిస్తాడో చూద్దామనుకొంటూ ప్రశ్నించినాడు: “ఒక కిలో Apples 50 రూపాయలు. నీవు 100 గ్రాముల Apples కొన దలచితే దాని విలువ ఎంతవుటుంది?”
అభ్యర్థి జవాబు: “ఆ శక్తి లేకనే ఉదోగం వెదుక్కొంటూ మీ వద్దకు వచ్చినాను Sir.”
Interviewing Officer : సరే ఒక వేళ నేను కొనుటకు పోతే?
అభ్యర్థి: ఎవరంటే వారివద్ద మీరెందుకు కొంటారు సార్? మీరు Loan ఇచ్చిన కొట్టుకే పోతారు. మీరు రెండడిగినా, వాడు పంపుతాను మీరు వెళ్ళండి అని ఒక బుట్ట Apples పంపుతాడు.
Interviewing Officer: ఒకవేళ నీ శ్రీమతి పోతే?
అభ్యర్థి: తాను చాలా పొదుపు మనిషి. 100 గ్రాముల Apples ధరే అడిగి, అంతే తెస్తుంది.
Interviewing Officer: ఒకవేళ మీ అన్న బజారుకు పోయినాడని అనుకొందాము.
అభ్యర్థి: మా అన్న బజారు వెళ్ళేది నేను ఎన్నిమార్లో చూసినాను. ఎప్పుడుపోయినా జరదా పాన్ మాత్రమే కొంటాడు.
Interviewing Officer: పోనీ మీ చెల్లెలు పోతే?
అభ్యర్థి: నాకున్న ఒక్కగానొక్క చెల్లెలు పెళ్ళిచేసుకొని ముంబాయి వెళ్ళిపోయింది.
పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నాడు ఆ Interviewing Officer.
అతను అభ్యర్థిని : మీ నాన్న పోయి కొని తేవచ్చుకదా!
అభ్యర్థి: “లేదు లేదు. ఆయనకు పళ్ళే లేవు. కాబట్టితాను తినడు మేము తింటే చీదరించుకొంటాడు.”
తన మొండితనము వదలలేదు Interviewing Officer.
ఆయన: “పోనీ నీ స్నేహితుడు ఎవడోఒకడన్నా ఉంటాడు కదా! అతను Apple తింటాడా!”
అభ్యర్థి: “తింటాడండీ. నేను కొనిపెడితే! అసలు Apple పండు ప్రశ్నే మీరు పదేపదే అడుగుతున్నారంటే అసలు మీకు Apple తోట ఉందా అని నాకు అనుమానమొస్తూవుంది. నా స్నేహితుని గూర్చి అడిగినారు కాబట్టి చెబుతూవున్నాను. నేనే వానికి 5 రూపాయలిచ్చి Apples తెమ్మంటే, వాడు కొట్టుకు పోయి ఆ 5 note ఇచ్చి వచ్చినన్ని Apples ఇవ్వమంటాడు.
Interviewing Officer: సరే. ఇదంతా వదిలిపెట్టు. ఒక సాధారణ వ్యక్తి Apples కొనటానికి పోయినాడనుకో? అప్పుడు చెప్పు అతను ఎవిధంగా కొంటాడు?
అభ్యర్థి: Sir, అంతా మీ భ్రమ కానీ సాధారణ వ్యక్తి కొనే విధంగానా Apple ధరలు ఉన్నాయి? అతనికి ఆ Apples క్రింద పరచిన గడ్డి మాత్రమే తినగలిగిన యోగ్యత ఉంటుంది. అసలు ఇంకొక ముఖ్యమైన విషయము తెలుపుకొంటాను. ఆరోజు అసలు ఆదాము, హవ్వ ఆపిల్ తినకుండా వుండివుంటే ఈ రోజు మీరూ లేరు, నేనూ లేను ఈ ప్రశ్న లేదు. ఏమంటారు?
ప్రశ్న అడిగినందుకు తన తల అందుబాటులోనున్న Paper Weight తో కొట్టుకొని Hospital లో Admit అయినాడు. పోతూ పోతూ ఆ అభ్యర్థిని Field Officer గా వేసి పోయినాడు.
Tuesday, 6 September 2022
ఇది ఒక సరదా పూరణ
idi oka saradaa poorana
ఇది
ఒక సరదా పూరణ
https://cherukuramamohan.blogspot.com/2022/09/blog-post.html
జగము గజము మనము కణము... పుారించుడు
Reply3y
Cheruku
Ramamohanrao
Tumuluri
Sarma జగము గజము మనము కణము... పుారించుడు
శర్మ గారూ, నేను అవధానిని కాదు. నిదానిని. అంటే నెమ్మదిగా నాకు తోచినది వ్రాసుకొనేవాడిని. పోనీ పండితుడనా అంటే, ఆ హోదా సాధించుటకు నాకు జీవితములో వెసలుబాటు కలుగలేదు.
అయినా మీ మాట కాదనలేక నా అల్పబుద్ధికి తోచినట్లు మీరిచ్చిన పదములతో పూరించినాను. పండితులైన మీపరీక్షకు నిలచినానో లేదో తెలియదు. దోషములుంటే మన్నింప ప్రార్థన
విశాల జగము
అందున గజము
దేశము నిజము
మనమా బీజము
డబ్బును మనము
వదలము కణము
నిలువని మనము
నిజముగ మనము
విశాల జగము
మది మద గజము
నమ్మిన మనము
అగుదుము కణము
Reply3y
Murali
Thotapalle Venkata
Mee spurti
aganamu
Subscribe to:
Posts (Atom)