Wednesday 24 August 2022

కొనకుండా నవ్వుకొనండి (70సం. యువకుడు - TV యోగా తరగతులు)

 

కొనకుండా నవ్వుకొనండి

70సం. యువకుడు - TV యోగా తరగతులు

https://cherukuramamohan.blogspot.com/2022/08/70-tv.html

అది ఒక షుమారయిన ఊరిలో ఒక ఇల్లు. భార్యాభార్తలే ఉంటారు. తెలతెల వారుతూ ఉంది. మసక చీకటి. ఆయనకు కళ్ళు మసకలు. భార్య TV on చేసి పోయింది.

TV లో బొమ్మ ఆయనకు కనిపించదు. బాబా గొంతు పైనే ఆధారపడతాడు. యోగా తో ఆరోగ్యము కాపాడుకోవలేనన్నది అతని ఆశయము.

యోగాభ్యాసము మొదలు పెట్టి చేయించుటకు తగిన సూచనలు తన గంభీర స్వరముతో ఇస్తున్నాడు బాబా.

ఊపిరి గట్టిగా పీచామన్నాడు. ఉత్సాహవంతుడైన మన యువకుడు పీల్చినాడు.  బాబా ఇంకా పీల్చమన్నాడు. ఇంకా పీల్చినాడు. అంతలో కరెంటు పోయింది. అది మన యువకుడు గుర్తించలేక పోయినాడు. బాబా చెప్పే వరకూ ఊపిరి అట్లే బంధించవలేనని తలచినాడు మన యువకుడు. అంతే కాసు, అసలు బాబా అందుకే మౌనము పాటించుతున్నాడని తలచినాడు. కారణం ఆయన కళ్ళకు మసక కాబట్టి. బాబా సూచనకై అట్లే వేచియుండినాడు. 

కాసేపయిన తరువాత కరెంటు వచ్చింది. బాబా గొంతు గంభీరముగా వినిపించింది ' మీ కష్టాలు తీరి ఇక సుఖాలే అనుభవించుతారు'. 'శ్వాసకు సంబంధించిన' అన్న మాట బాబా చెప్పినపుడు కరెంటు రాలేదు.   ఆ మాట వినడానికి మన యువకుడు సిద్ధముగా లేడు. అప్పటికే రంభ తొడపై ప్రయానబదలిక తీర్చుకొంటూ వున్నాడు. 

స్వస్తి.

1 comment:

  1. చాలా చాలా హాస్య స్పోరకమైన రచన.టివిలో బాబా గారి ప్రాణాయామ సాధనల బోధన...కరెంటు పోవడం...కరెంటు రావడం...
    అదంతా ఫాలో అవుతున్న శిష్యుడి ప్రాణాయామం పరాకాష్టకు పోవడం..
    అతడు చివరికి రంభ తొడపై పరుండడం అద్భుతమైన వ్యంగ్య,హాస్య రచన చేసేరండీ...రామ మోహన రావు గారూ.మీకు అనేకానేక అభినందనలండీ.

    ReplyDelete