Thursday, 24 September 2020

కొనకుండా నవ్వుకొనండి-రీనాల్డు బాలుపెన్ను కథ

 

కొనకుండా నవ్వుకొనండి-రీనాల్డు బాలుపెన్ను కథ

సంఘటిత సంస్థాగత సంస్కృతి(కార్పొరేట్ కల్చర్)

రీనాల్డు బాలుపెన్ను కథ

https://cherukuramamohan.blogspot.com/2020/09/40.html

అనగా అనగా ఒకదేశం, ఆ దేశంలో ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని, ఆ రాజధానిలో ఒక రాచబాట, ఆ బాటలో ఒక అతిపెద్ద  40 అంతస్తుల భవనం. అందులో ఒక అంతస్తును సొంతం చేసుకొన్న ప్రజా సంస్థ(Public Organisation). అందులో అతిశయించిన అందము గలిగిన గది ఆ గదికి అందాన్ని తెచ్చే రీతిన ఆసీనులైన అధికారి. ఆ సీను  అక్కడ ఆపితే, ఆ అధికారి ఏదో, ఒకవేళ ముఖ్యమైన స్వంత విషయమేమో, వ్రేళ్ళ మధ్య  రీనాల్డు బాలుపెన్ను సంధించి వ్రాసుకొంటున్నాడు . అప్పుడు తలుపు తెరిచి ఆ గదిలో ప్రవేశించినాడు ఆది శేషగిరి ఆక ‘ఆశే మూర్తి.

అడుగు గదిలో పెడుతూనే అత్యంత వినయ విధేయతలతో దైనందిన వందనమాచరించినాడు . 'రావయ్యా,కూర్చో' అన్నాడు అధికారి. అడుగులకు మడుగులొత్తుటలో ఆరితేరిన ‘ఆశే గిరి’ ఫరవాలేదంటూ నిలుచుకొనే ఉండిపొయినాడు . అధికారి తన అధికారములో అనురాగము రంగరించి పెన్నంటే 'రీనాల్డు పెన్నే పెన్నయ్యా' అన్నాడు. ఆయిల్ పూత లో ఆరితేరిన ‘ఆశే గిరి’ ఆలస్యం చేయకుండా అందుకొన్నాడు. 'మీ మనసుకు నచ్చబోయేది నాకు ముందుగానే తెలిసినట్లు ఏంటో భయభక్తులతో నా పూజా గదిలో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచినాను సార్' అన్నాడు‘ఆశే గిరి’. 'నా కర్థం కాలేదన్నాడు' బాసు. వెంటనే ‘ఆశే గిరి’  'ఏమిలేదుసార్, నేను మీ వద్ద ఉద్యోగము కొరకు వ్రాసిన పరీక్ష లో ఉపయోగించింది రీనాల్డు పేనానేసార్. నాకు జవాబు రాకున్నా అదే వ్రాసుకొంటూ పోయింది సార్. దానిపై కృతజ్ఞత తో ప్రతిరోజూ దానికి పూజచేసే నేను ఆఫీసుకు వస్తాను. మీకూ అదే పెన్నునచ్చడము,  నేను మీకు నచ్చినంత సంబరపడి పోతున్నాను సార్' అన్నాడు. అధికారి గర్వము, ‘ఆశే గిరి’ వినయము ప్రదర్శించుటతో

ఒకటవ వ అంకము ముగిసింది.

 రెండవ అంకము మొదలైంది. అధికారి తన పెనాతో ఏదో వ్రాయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, అంతలోనే ఆది అక్కడ ప్రత్యక్షమైనాడు ‘ఆశే గిరి’. 'నమస్తే సార్, చాలా చీకాకుగా ఉన్నట్లున్నారు'అన్నాడు. అధికారి వెంటనే ఆ రీనాల్డు బాలు పెన్నును నేలపై విసరి ఇంతకన్నా నికృష్ఠ మైన పెన్నికొకటి వుండదన్నాడు, తన చేతిలో ఉన్న రీనాల్డు పెన్నును చూపిస్తూ. వెంటనే దానిని నేలపై విసిరి, కాలితో రాచుతూ! 'నేను ఇంతకు ముందే ఇంటినుండీ బయలుదేరేటపుడు పూజగది లో వుంచిన ణా రీనాల్డుపేనా తో శుభమా అని చాలా కాలంతరువాత వ్రాయ ప్రయత్నిస్తే అది వ్రాయ మొరాయించగా దానిని బండతో నలిపి అన్నం లో కలిపి కాకులకు గద్దలకు వేసి వస్తున్నాను సార్' అన్నాడు.

ఆలోచనలో పడినాడు అధికారి. ఆతురతను అణచుకోలేక 'అదేమిటి? ఆనాడు ఆపెన్నును ఛాలా బాగా వ్రాస్తుందని అంతగా పొగిడి ఈ నాడు ఇంతగా తెగడుతూ వున్నావు' అంటే ఆది అదిరిపోయే జవాబిచ్చినాడు మన ‘ఆశే గిరి’.

"ఆ పెన్ను వ్రాస్తే నాకేమి వ్రాయకుంటే నాకేమి సార్?  మీరు నా గూర్చి బాగా వ్రాస్తునంతసేపూ మీరే నా రీనాల్డు పేనా సార్'

అధికారికి అప్పుడర్థమైంది తాను కూడా ఆది చేతిలో రీనాల్డు బాలుపెన్నేనని!

చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment