Friday, 24 May 2019

కవిత్వము - హాస్య సరళి


కవిత్వము - హాస్యసరళి

సంస్కృతము దేవవాణి. దాని పుట్టుకను గూర్చి ఎవరూ చెప్పలేరు. షడంగాలలో వ్యాకరణమున్నా మనకు పాణిని మహర్షి వ్రాసిన అష్టాధ్యాయియే ఆలంబనము. అందునుండి వెలువడిన సూత్రములనే వేరువేరు పండితులు విశ్లేషించగా మనము చదువుచున్నాము. భాషకు సాహిత్యము ఆయువు పట్టు. ఆకాలములో రాజులు కదనము, కవనము సమాంతరముగా పోషించినారు. అందుకే ఒక రాజు అన్నాడట సుకవితా యద్యస్తి రాజ్యేన కిం” అంటే మంచి కవిత్వం ఉంటే ఇక రాజ్యము ఎందులకు. సాహిత్యము అంటే “స హితస్య భావం సాహిత్యం” హితముతో కూడియున్నది సాహిత్యము. అది మనోరంజకము, మార్గ నిర్దేశకము, అజరామరము మరియు మల్లె మరువముల అనుబంధము . కనుకనే “విశ్వశ్రేయః కావ్యం” అనికూడా అన్నారు. “మానిషాద’ అన్న వాల్మీకి శోకము శ్లోకమై వెలువడినది మొదలు సాహిత్యము శ్రోతస్వినిలా నిరంతరము భువిపై ప్రవహిస్తూనే ఉంది. మనల్ని నడిపిస్తూనే ఉంది. అట్టి సాహిత్యము  మాత్రమే నిత్యము,సత్యము,శాశ్వతము. ఉదయారుణ కిరణాలలోని నులివెచ్చదనము, హిమమౌక్తికములుచే అలంకరిపబడిన సౌగంధికా కుసుమములు, మలయమారుతమునాస్వాదింప కాగడాలు పట్టుకొని దేవతలు నిలచినారా అన్నట్లున్న వెన్నెల రాత్రులు,  వసంతమందున ఝరి గమనములు, చిగురాటాకులు మేసి కూసే పిక నిస్వనములు, కరి మబ్బుల గాంచి పరవశించి నర్తించే మయూర తతులు, చెంగు చెంగున ఎగిరిదూకే లేడి పరుగుల విన్యాసాలు, పసి పాపల బోసి నవ్వులు, తొలకరి జల్లుకు పులకరించి చిలకరించే మట్టి వాసనలు, మొదలగు ప్రకృతి ప్రసాదించిన అందాలను అనుభూతులను ఆస్వాదింప చేయగలిగినది కవిత్వము. కవిత్వము అతివ అంగాంగ వర్ణనకే పరిమితము కాదు.  ప్రకృతి అందాలనే కాకుండా మానవుల నడుమ ఏర్పడే అనుబంధాలు,   అనురాగాలు, ఆత్మీయతలు, అవమానాలు, కోపాలు,తాపాలు, మానసిక సంఘర్షణలు, సుఖ దుఃఖాలవంటి అనేక భావాలను ప్రకటించి, అనుభవింప జేయించేదికూడా కవిత్వమే!
ఈ సన్నివేశము కరుణార్ద్రతల కదంబము.  ఒకపరి గమనించండి. “ ఓ వ్యక్తి కారాగారంలో శిక్ష అనుభవిస్తూ,  చివరిదశలో ఉంటాడు. అతణ్ణి చూడటానికి బాలింతరాలైన అతని కుమార్తె వస్తుంది. తాగడానికి నీళ్ళు కూడా లభించక దాహంతో అలమటించే తండ్రి దీనస్థితిని చూసి మిక్కిలి కలత చెందిన ఆమె తన  ‘స్తన్యాన్ని’ తండ్రికి ఇచ్చి అతని దాహార్తిని తీర్చి చరితార్థ అవుతుంది.” ఓ చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని వర్ణించి చెప్పే అపురూప దృశ్యం పై ఉదాహరణ. కవిత్వం నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటనీరు తెప్పిస్తుంది,  మునుముందుకు నడిపిస్తుంది. అట్టి అద్భుతమైన, అంతులేని సాహిత్య సముద్ర  జలతరంగములందు ఒకటగు చాటు సాహిత్యమునుండి ఒకటి, రెండు  పద్యములు మీకు పరిచయము చేస్తాను. పై భావమును స్ఫురింపజేస్తూ నేను వ్రాసిన పద్యమును మీముందుంచున్నాను.
చేయని తప్పు తో చెరన చేరిన తండ్రిని చూచి బాధతో 
నాయన ఏమి కావలెనొ నాదరి చెప్పమటన్న కూతుతో          
నాయన  దాహమయ్యెనన అంత తటాలున స్తన్యమిచ్చి నీ
కీయగ వేరు ఏమియును ఎంచగ లేదనె సూతికార్ద్రతన్
కూతుతో నాయన = కూతుతోన్ + ఆయన; సూతిక=బాలెంతరాలు
తండ్రి చేయని నేరానికి చెరసాల పాలయినాడు. ఒక్కగా నొక్క కూతురు. అందునా బాలింతరాలు. మనసున బాధ అనెడు మున్నీరు కనీరై ప్రవహించగా చెరసాలకు వచ్చి తండ్రిని చూసి గద్గద స్వరముతో నాన్నా నీ కేమికావలెనని అడిగింది. దప్పికగొని గొంతు ఎండిపోయిన తండ్రి దాహమన్నాడు. ఎక్కడికీ పోయి నీరు తేలేని ఆతల్లి, తండ్రికి తన స్తన్యమిచ్చి ‘తండ్రీ! ఇంతకు మించి వేరేమీ ఇవ్వలేనని కంట తడిపెట్టుకొనింది.”
పద్యము చదివితే సన్నివేశము కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.
మనము హాస్యమును గూర్చి మాట్లాడుకొన దలచి కరుణ రసమునకు పోయినాము. ఇందుకు కారణము ఉన్నది. బాగా చెమట పట్టిన తరువాత వాతానుకూల కక్ష్య లోనికి వెళితే సుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా!

హాస్యస్పోరకమైన ఈ పద్యమును చూడండి. ఈ భాష నేడు బ్రాహ్మణులలో కూడా మృగ్యము.
పూర్వము అంటే ఒక వంద సంవత్సరముల నాటి మాట. నాకు నాడు అవ్వ వరుసయ్యేవారు ఈ భాషనే  మాట్లాడేవారు.   భాష కొంత వింతగా వుండేది. ఆ భాష తీరు తెన్నూ ఈ పద్యము ద్వారా  చవి చూడండి.  
అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే?  
విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిత్సారషే !  సుఖము యొక్కసుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా! 
విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ  
ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!  
 పై  చాటు  పద్యము, నీళ్ళ కోసం వెళ్లి చెరువుకు వెళ్లి బిందెలు తోముకొంటూ బ్రాహ్మణ స్త్రీలు జరిపిన  సభాషణను వివరిస్తూవుంది. భావం వివరిస్తాను.  
ఏమే చూచినావా! అంటే ప్రక్కావిడ పలకలేదు, అందుకే వెంటనే మొదటి స్త్రీ  “ఒసే! నీకుచేముడా  ఏమి?” అంటే రెండవ ఆవిడ అయ్యో పిలిచినావా  ఏమిటి? అని అడిగింది. అందుకు మొదటి బ్రాహ్మణి “విస్సా వఝలవారి బుర్రిని అంటే అమ్మాయిని మన విస్సాయికి అంటే మన కుర్రవాడికి ఇచ్చి పెళ్లి  చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత వర్చస్సు కలిగి ఉంటాడో” అంటూ తమ సంభాషణను శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు కొనసాగించుతున్నారు.  
ఇట్టిదే ఇప్పుడొక చాటు వాక్యాన్ని చూడండి
ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరనుంఛా. చూడది ఎండిందంఛావా? లేదంఛావా?” అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే పంచటరుగు. గావంచా అంటే చిన్ని టవలు. ఇంకో చమత్కారయుతమైన ఈ పద్యము ను చూడండి.  నేను ఉన్నత పాఠశాలలో 65 సంవత్సరముల క్రితము విన్నది. ఆ చాటువు యొక్క సందర్భము, ‘చంకనాకు’ అన్న మాట మాత్రమే నాకు గుర్తు. అందువల్ల పద్యమును నేనే తయారు చేసి మీ ముందుంచుచున్నాను.
ధనవంతుల ఇండ్లలో జరిగే  పెళ్ళిళ్ళకు సదస్సు అని ఒక గొష్ఠి జరుపుతారు. అందు విద్వాంసులు, పండితులు కవులు వస్తారు. వచ్చినవారందరికీ వారి వారి శక్తిననుసరించి సంభావనలిస్తారు. కొందరు ఏమీ తెలియని నాలాంటివారుకూడావచ్చినంత దక్షిణ వస్తుందిలే అని వెళతారు. అటువంటి సదస్సులో జరిగిన సన్నివేశము మీముందు నేను వ్రాసిన చాటువును ఉంచుటకు ముందు సదస్సుకు సంబంధించిన ఒక చాటువును తెలియజేస్తాను.
లేవరు లెండులేండనిన లేచినవారయినన్ దటాలునన్
బోవరు పొండు పొండనిన పొదుము పొదుము త్రోయకుండటం
చీవరుసందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం
భావన నాడు చూడవలె బాపన సాముల సాములన్నియున్
సదస్సు ముగిసింది ఇక లేవండి అంటే లేవరు, లేచిరి పో వెంటనే పోతారా అంటే పోరు. పోతున్నాము పోతున్నాము త్రోయవద్దు అంటూ యజమానిని అనునయించుతూ నెమ్మదిగా కదులుతూ వుంటారు. ఈ విధముగా బాపన సాముల 'సాములు' పెండ్లియండలి సదస్సునందు చూడ వీలగుతుంది. అన్నది పద్యభావము. ఇందు ఒక బాధాకరమైన విషయము ఏమిటంటే నేదసదస్సులు లేవు, అసలు సదస్సు అంటేనే చాలామందికి తెలియదు. సంభావనకై ఎదురుచూసే వేదము చదువని పెదబ్రాహ్మలు మాత్రము ఉన్నారు. కూలిపనులు చేయలేరు. మంత్రాలు చదువలేరు. ఎగతాళి చేసేదానికంటే వారికి వితరణ కలిగిన ఏ ధనికుడయినా ఒక ఆధారము చూపితే ఆత్మ సంతృప్తి కలిగినవాడవుతాడు.

ఇక తిరిగీ మన చాటువును గూర్చి చెప్పుకొందాము. ఆ ధనవంతుడు వివాహానంతరముసదస్సు ముగిసిన పిదప వారివారి పాండిత్యము, కవితా శక్త్యనుసారముగా డబ్బులు ఇస్తూవున్నాడు. ముఖ్యముగా ఆ యజమాని కవులకు కొంచెము ఎక్కువ, పండితులకు కొంచెము తక్కువగా సంభావనలు ఇస్తూ వుందినాడట. ఆ గుంపులో  ఒక వ్యక్తికి తక్కువ సంభావన ఇవ్వబోయినాడు ఆ యజమాని. ఆ కవికి కోపము వచ్చి యజమానితో ఈ విధంగా అంటూవున్నాడు 
కవియా కదా అరయక
కవియనుకొని గౌరవించ తగునా మూర్ఖా!  
కవిగనుము కనులు లేవా  
కవివైతే ‘చంకనాకు’, కనబడలేదే!
ఒక కవికి తానూ చూస్తూ ఉండగానే తనకన్నా తక్కువస్థాయి కలిగిన కవి పండితులకు ఉదారముగా సంభావనలనోసగినాడు. ఈయన వంతు వచ్చుసమయానికి ఎదో చిల్లర చిలకరించినాడు, బహుశ యీతడు గర్వి, అహంభావి అని అతనికి తెలుసునేమో! కవి కోపముతో కందపద్యములోని పై మూడు పాదములు చెప్పినాడు. యజమాని ఆ పద్యమును తన చివరి పాదముతో పూర్తి చేసినాడు.
ఎవరంటే వారిని కవియా కాదా అన్న విచక్షణ లేకుండా ఇతోదికముగా పారితోషికములనిచ్చి పంపుతూ వచ్చి నావే నేను కవిని గమనించి సంభావననివ్వు అని కొత్త గర్వముతో పలికినాడు. అప్పుడు ఆ ధనికుడు ఆ కందపద్యము యొక్క నాలుగవ పాదముతో ఈ విధముగా బదులు తెల్పినాడు. నీవు కవివైతే నాకేమి కనబడలేదే అంటే కనబడుతూనే ఉందికదా, చంక నాకి పో అన్నది కొంత జుగుప్సాకరమైన బాహ్యార్థము. ఆ పాదము యొక్క అంతరార్థము ఏమిటంటే ‘మరి నీవు కవివైతే ‘చంకనాకు’ అంటే చంకలో కవిత్వము వ్రాయుటకు తాటియాకుల కట్ట లేదే అని. చూచినారుకదా ఎంత భావ గర్భితమైన పద్యమో తెలియండి.
ఇట్టి అపురూపమయిన పోకడ సంస్కృతము తరువాత ఈ భాషకే చెండుతుందేమో!
ఈ వ్యాసమును నేను నా పట్టా తలను గూర్చి వ్రాసిన పద్యముతో ముగించుచున్నాను. 

శిరము శశాంక గోళముగ చెప్పుము మారెను ఎట్లు మిత్రమా

సరసకు చేరు సుందరుల  చంద్ర ముఖమ్ముల చంద్రులందరున్

సరసర వచ్చినా శిరము చక్కగ చేరుచు కేశ యామినిన్

దొరకొని పారద్రోల తల తొంగలె సోమసుధా స్రవంతియై

స్వస్తి.

Wednesday, 22 May 2019

క్రైస్తవమా - పొంచియున్న ప్రమాదమా


క్రైస్తవమా - పొంచియున్న ప్రమాదమా

https://cherukuramamohan.blogspot.com/2019/05/blog-post_22.html

మొదట ఈ వాస్తవ గాథను గమనించేది.

For the first time in the history of Kerala, a group of nuns had defied their vows to protest against Church atrocities and the attempts by the police to hush up the incident.

 

Nun (Sister Lucy) who spoke in favour of the victim has been removed from performing church duties related to church after she joined the protest demanding the arrests of Bishop Franco Mulakkal. She has alleged that the church took revenge for participating in the protest against the Bishop -Times Now.

 

Mysterious death of Father Kuriakose who spoke out against Bishop Franco Mulakkal

On October 22, 2018, a 60-year-old priest named Father Kuriakose Kattutharaa was found dead in Bhogpur in Jalandhar. He was a vocal critic of rape accused Bishop Franco Mullakkal and had given a statement against him to the police. He worked as a priest and teacher at the Jalandhar diocese. Father Kuriakose’s untimely death fueled suspicions of foul play in a group of priests.

 

It must be mentioned the deceased had spoken out about the threats that he received by church officials for supporting the Missionaries of Jesus nun. He had stated, “The sisters had approached me complaining about Bishop Franco. They did not approach the Kerala police fearing the bishop. In fact, I fear what will happen to me for speaking out against him”

 

On January 14, 2022, the Additional Sessions Court at Kottayam acquitted Bishop Franco Mulakkal in the nun rape case. Live Law reported that the trial Court discarded the testimony of the victim completely in contravention with the well-settled principles of law.

 

https://www.opindia.com/2022/01/bishop-franco-mulakkal-a-timeline-of-the-case-from-rape-allegations-to-acquittal/

అసారాం బాపూను గానీ నిత్యానందనుగానీ లేక ఈవిధమగు పావుపభూయిష్ఠులను ఏ హైన్దవుడూ సమర్థించలేదు. అసలు మచ్చనేరుగని మహానీయులగు కంచి  పరమాచార్యులైన జయేంద్ర విజయేంద్ర సరస్వతులను కారాగారములో ఉంచినపుడు కూడా పెద్దగా స్పందించిన హైందవుడు లేడు. కారణం మనది 'అయితే అయిందిలే పోతే పోయిందిలే’ మనస్తత్వము.

శ్రీకృష్ణ పరమాత్ముడు 16వేల గోపికలను కలిగియుండినాడు కదా! ఆయన దేవుడెట్లు? అని న్తాయస్థానములో చేసిన సవాలుకు ప్రతివాది న్యాయవాది మరి అనేక లక్షల సంఖ్యలో ఉన్న మీరంతా దేవుని భర్తగా ఎంచుకొన్నారు కదా మరి ఆయన దేవుడెట్లు? అని ప్రశ్నించుటతో తమ అభియోగామును ఉపసంహరించుకొన్నారు.

ఈ విషయమును ఒకపరి ఆలోచించండి. మధ్య తరగతి కుటుంబీకులను రెండు విధములుగా విభజించినారు. అవి 1. దిగువ మధ్య తరగతి 2. ఎగువ మధ్య తరగతి. ఇక మూడవది పేదలుమరియు నిరక్షరాస్యుల తరగతి.

మొదట పేదలు మరియు నిరక్షరాస్యులను గూర్చి తెలుసుకొందాము. మంచిని మాయ చేయటానికి చెడు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందునా ఒక వ్యక్తి కష్టములో వున్నాడు, బాధపడుతున్నాడు అంటే దానిని అవకాశముగా తీసుకొంటారు స్వార్థ ప్రయోజనాలకొరకు కొందరు మతోన్మాదులు.  ఇటువంటి  వారు క్రైస్తవమున అత్యధికము. మార్టిన్ లూథర్ నాయకత్వములో 16 వ శతాబ్దమునుండి కేథలిక్స్ తో విడిపడి  ప్రొటెస్టెంట్స్ గా ముద్ర పడిన తరువాత వేరు వేరు పేర్లతో వేరు వేరు కుంపట్లు పెట్టుకొని,  బాప్టిజం, లూతరానిజం, మెథోడిజం, కల్వనిజం, పెంతెకోస్తిజం మొదలైన అనేకమగు పేర్లతో వేరువేరుగా చర్చీలు మొదలయి ఇప్పుడు పుట్టగొడుగులై ప్రపంచమున చెప్పలేనన్ని పేర్లతో క్రైస్తవము విరాజిల్లుతూ వుంది. కానీ ఇప్పటికీ వీరు ఎవరితో విడిపడినారో ఆ కేథలిక్సే ప్రపంచములో అధికముగా వున్నారు. వీరిలో వీరికి సరిపోదు. వేరే చర్చికి సంబంధించిన అమ్మాయిని తమ చర్చ్ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకొంటారుకానీ విలోమముగా మాత్రము కాదు. అంటే పెళ్ళిళ్ళువారివారి చర్చిలకు మాత్రమె పరిమితము. ఈ తేడాలు ముస్లీములలో కూడా వున్నాయి.

  ఇక ఈ క్రైస్తవులు మార్పిడుల మాయాజాలాలు ఎట్లు పన్నుతారు అన్నది చూస్తాము.  ఇప్పుడు నేను చెప్పబోయేవి అన్నీ నేను అనుభవ పూర్వకముగా చూసినవి మరియు తెలుసుకొన్నవి. ఒక కుమారుడు, ఆరోగ్యము బాగా లేని తన తల్లిని Hospital కు పిలుచుకొని పోవుటకు ఒక Auto ఎక్కినాడు. ఆమె మూలుగుతూ వుంది. Auto వాడు వెంటనే ఆ కుమారునికి సలహా ఇస్తాడు. వెంటనే మతము మారి క్రైస్తవము లో చేరుతామని మ్రొక్కుకోండి, ఆవిడకు తగ్గి పోతుంది. ఆతరువాత నన్ను పిలిస్తే నేనువచ్చి చర్చికి పిలుచుకొనిపోయి మీకు పవిత్ర తీర్థము ఇప్పించుతాను అంటాడు. డాక్టరు వ్యాధినయము చేస్తాడు కానీ వీరికి Auto Driver మాటమీద గురి ఏర్పడి అతనితో వెళ్లి మతము మారుతారు. కొందరు తమ చర్చి చేత మాటకారితనము కలిగినవారిగా గుర్తింపబడి, వారిచే ఆర్ధిక లబ్ధి పొందుతూ, తమ Cell Number ప్రకటించి Holistic Healing పేరుతో Missed Call ఇవ్వమంటారు. పెదసాదలు మన సొమ్ము పోయేదేమీ లేదుకదా Missed Call ఇద్దామన్న భ్రమలో, ఇచ్చి ఉచ్చులో తగులుకొంటారు. ఇక స్వస్థత సభలనుగూర్చి అందరికీ తెలిసిన విషయమే. ఇదికాక చర్చికి నమ్మకము కలిగిన కొందరు చురుకుదనము కలిగిన యువకులను ఎన్నుకొని వారికి సొమ్ము ఇచ్చి తమ ప్రతినిధులుగా, ప్రచ్ఛన్నముగా  ఏ బంజారాలు, (లంబాడీలు, సుగాలీలు) ఉన్న తాండాలలోకి పంపుతారు. కొత్తవారు కాబట్టి ఎన్నోవిధముల వారికి నమ్మబలికి ఆర్ధిక సహాయముతో చేరువౌతారు. అతని సాంగత్యము బలపడినతరువాత ఒక్కరొక్కరిగా మొత్తము తండాను మతమార్పిడి చేస్తాడు. ఇవన్నీ పెదసాదలను మార్చే విధానము. అసలు ఇవికాక ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమె ఉటంకించినాను. వీరికి, వారివారి చర్చీలు ఆదివారమునాడు మాంసాహార భోజనము కూడా ఉచితముగా ఏర్పాటు చేస్తారు.  ఇక మధ్య తరగతి వారి విషయానికి వస్తే, Gated Communities లో అన్ని మతాల వాళ్ళూ వుంటారు. అందులో ముఖ్యముగా వయసు మళ్ళిన క్రైస్తవ స్త్రీలు హిందూ స్త్రీలతో సహవాసము పెంచుకొని వారి కుటుంబ కష్టములకు సానుభూతిని ప్రకటించుట మొదలుపెట్టి మతము మారితే దేవుని రక్షణ నిరంతరమూ ఉంటుందని మభ్యపెట్టేవరకూ కొనసాగించి వారిని మారుస్తూ వున్నారు. కారణాలు వేరు కావచ్చు కానీ అసలు రెడ్లు మరియు కమ్మవారిలో ఈ విధముగా మారిపోయిన వారు ఎందఱో!

ప్రజలో జనరంజకుదన్న ప్రఖ్యాతిని సంపాదించిన ఒక ముఖ్యమంత్రి అసలు ఏడు కొండలకే ఎసరు పెట్టినాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిప్రాంతములో ఆలయము చుట్టూ సిలువ గుర్తులను, ముఖ్యముగా రాత్రి పూట ముమ్మరముగా చూడవచ్చును. శ్రీశైలములో కూడా అదేపరిస్థితే! ఈ విధముగా మార్పిడులకు బలియైనవారు ఎంతమందో! మార్చుటకు నియమింపబడిన కార్యకర్తలు విదేశములనుండి కూడా పుష్కలముగా చందాలు గ్రహించుతూ వున్నారు. ఇది కేవలము ధనార్జనకై చేయుచున్న పెట్టుబడిలేని వ్యాపారము. ఈ కార్యకర్తలలో ఎంతమంది అసలు బైబిల్ చదివినారో దేవునికే ఎరుక.

ఇక బైబిల్ లో ఏముందో చూద్దాము. అసలు బైబిలు రెండు భాగములుగా విభజింపబడినది. అసలు Bible అంటే Compilation of Books అని అర్థము. దైవ గ్రంధము అన్నది ప్రచారమునకు వచ్చిన పేరు. ఇందులోని కొన్ని విపరీత విపత్కర విషయాలను ఇపుడు చూద్దాము.

బైబిలు ప్రకారమూ మానవ సృష్టికి మూలము Adam and Eve. Adam, ఆదిమ యొక్క రూపాంతరము. ఆదిమ అంటే మొదటివాడు. మరి జగత్ సృష్టికి మొదటివాడు విష్ణువే కదా! మరి ఆయన భార్య లక్ష్మి కదా! Eve ఎట్లవుతుంది అని అనవచ్చు. ఏకాక్షర నిఘంటువు ప్రకారము ‘ఈ’ అంటే లక్ష్మీదేవి. మరి Adam and Eve మానవులు కదా, అంటారేమో! మనద్దేశము నుండి వలసపోయిన వారి వద్దనుండి మన పురాణ కతాకతనములను గ్రహించి వారు తమ మతములకు పునాదుల నేర్పరచుకొన్నారు.

బైబిల్ దేవునికి పరమత సహనము అంటేనే తెలియదు. ఆయన మనవలె మన దేవుని వలె కాదు. ఈ విషయమును యధాతథముగా ఆంగ్లములోనే మీ ముందు ఉంచుచున్నాను.

Biblical God says in Iramya, 19th chapter 4th line: - "I will make a terrible disaster in this region by which the ears of those who hear this will tremble. They have worshiped other gods! I will make them eat the flesh of their own sons and daughters! When their enemies and those who want to kill them, torture them, they will eat the flesh of their neighbors. I will destroy this people and this city. I will make it into a cemetery." - These are the words of Biblical God.

మనదేశము వివిద్ రేఅజపాలనములో ఉన్నపుడు చర్చిలు, మసీదులు వారే కట్టించి ఇచ్చినారు. మన పూర్వులవంటి ఉదార చరితులు వేరేచటనూ కానరారు.

ఈ మాట గమనించండి. జెహోవా విట్నెసెస్ (అతిప్రఖ్యాత క్రైస్తవ ప్రచార సమాజం) తన 8 సెప్టెంబర్ 1957 నాటి 'అవేక్‌' (AWAKE)  (మేలుకో) పత్రికలో అత్యంత సంభ్రమం కలిగించే శీర్షిక నొకదాన్ని ప్రచురించింది. ఆ శీర్షిక పేరు "50,000 ERRORS IN THE BIBLE” (బైబిల్ లో యాభై వేల తప్పులు), అన్న పై శీర్షిక కలిగిన వ్యాసము చదివితే అర్థము కాగలదు. జీసస్ ను గూర్చి, సాహిత్యములో Nobel Prize గ్రహీతయగు Bertrand Russell  ఏమి చెప్పినాడో  చూడండి:

In his essay Bertrand Russell wrote:

 

There is one very serious defect to my mind in Christ's moral character, and that is that ‘He believed in hell’. I do not myself feel that any person who is really profoundly humane can believe in everlasting punishment. Christ certainly as depicted in the Gospels did believe in everlasting punishment, and one does find repeatedly a vindictive fury against those people who would not listen to His preaching -- an attitude which is not uncommon with preachers, but which does somewhat detract from superlative excellence. You do not, for instance find that attitude in Socrates. You find him quite bland and urbane toward the people who would not listen to him; and it is, to my mind, far more worthy of a sage to take that line than to take the line of indignation.

Russell also expresses doubt over the historical existence of Jesus and questions the morality of religion: "I say quite deliberately that the Christian religion, as organized in its churches, has been and still is the principal enemy of moral progress in the world.

ఈ విధముగా ఎంతో గోప్పవారాగు పాశ్చాత్యులచేతనే తెగడబడుతూ, ఐరోపా లో మనుగడకే ముప్పు వాటిల్లబోతున్న తమ క్రైస్తవమును మనపై రుద్దమని Pope గారి ఆదేశమట. ఆ ఖండములో ఇప్పటికే Churches ను వారు అమ్ముకొన్న ఉదంతాలు ఎన్నో వున్నాయి.

ఈ విషయము చూడండి. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చెప్పినట్టే నడుచుకోవాలి అంటారు పాస్టర్ లు. దానిని ఎందరు చదివినారో తెలియదు కానీ    బైబిల్ లో ఉన్న క్రూరమైన మాటలు ఒకసారి చూస్తే మీకు అప్పుడు అర్థమౌతుంది అందులోని దేవుని గొప్పదనము. బైబిల్ లో వారి దేవుడయిన యహోవా చెప్పిన మాటలను ఒకసారి గమనించండి. అందులోని తెలుగు వాడుక భాషకు భిన్నముగా ఎదో విదేశీ భాష చదివినట్లున్తుంది కాబట్టి నిదానముగా చదవండి.

ద్వితియోపదేశకాండము 13: 6 -9

నీ తల్లి కుమారుడేగాని, నీ సహోదరుడేగాని, నీ కుమా రుడేగాని, నీ కుమార్తెయేగాని, నీ కౌగిటి భార్యయేగాని, నీ ప్రాణస్నేహితుడే గాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగానుండినను , నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును,నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. పుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. రాళ్లతో వాళ్ళని చావగొట్టవలెను.

ఈవిధముగా  భారతదేశం లో పుట్టిన ఏ మతమయినా చెప్పినదా!   హిందూ దేవతలు ఈ విధముగా చెప్పియుంటే  మన దేశం లోనికి ఈ పాశ్చాత్య క్రైస్తవులు వర్తకము పేరుతో వచ్చేవారా మత మార్పిడి చేసేవారా!

పైన తెలిపిన, వారి బైబిల్ లోని ఒక్క మాట చాలు- క్రైస్తవుల మెజారిటీ ఏర్పడిందంటే వేంకటేశ్వరుడు కూడా క్రీస్తుస్వరూపుడైపోతాడు.  ఏడుకొండలు గోవుల కాపరులకు బదులు గొర్రెలకాపరుల వశమైపోతుంది.

ఇస్లాం ఇందుకు విరుద్ధము ఏమీ కాదు.

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః

తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌

తస్మాత్ జాగ్రత

స్వస్తి.

 

Monday, 13 May 2019

రామ చిలుక


రామ చిలుక
చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు
మాటకారితనము మంచి విద్య
ఎన్నియున్ననేమి  ఈ రామ చిలుకకు
గండుబిల్లి ముందు దండుగయ్యె
ఈ పద్యము జగన్నాథ పండితరాయల సంస్కృత శ్లోకమునకు ఒక కవి చేసిన చక్కని తెలుగుసేత. చిలుక యొక్క గుణగణములను తెలియబరచే పద్యము ఇది. భావము కష్టము కాదు కానీ తెలియజేస్తాను. చక్కనిరూపము, గొప్పదగు శీలము, మాటకారితనము, మంచివిద్య వంటివి ఎన్ని ఉన్నా ఈ రామచిలుక గండుబిల్లి ముందు దండుగే!
ఈ పద్యమును ఎందుకు ఇప్పుడు తెలిపినానంటే ఒక్క చిలుకకు మాత్రమే రామ అన్న విశేషణము తగిలించుతారు. చిలుక ఆడదయినా మగదయిన ఒక్కరికి మాత్రమే మనసిస్తుంది. అది శ్రీరామ చంద్రుని లక్షణము కాబట్టి ఆ పక్షికి మాత్రమే ‘రామచిలుక’ అన్న పేరు వచ్చింది.

Monday, 6 May 2019

సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల వయస్సు (వధూవరుల వయస్సు)


సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల  వయస్సు 

https://cherukuramamohan.blogspot.com/2019/05/blog-post_6.html
వేదోక్త వివాహానికి వధువు వయసు వరునికన్నా తక్కువ వుండాలన్నది శాస్త్ర నిర్దేశము. ఎందుకు అన్నది ఒకసారి విమర్శించుకొందాము.

ముందు నేటి సమాజపు పోకడను గూర్చి కొంచెము మాట్లాడుకొందాము. మనసు పెట్టి ఆలోచిస్తే, మనకు గౌరవముంటే గురి వుంటుంది. అది వ్యక్తి కావచ్చు, శాస్త్రము కావచ్చు లేక దేవుడే కావచ్చు. అదే లేకుంటే ఏమీ లేదు. నేటి అధిక శాతము యువతకు, నా దృష్టిలో, సరియైన దిశానిర్దేశము లేదు. మన ఆచార వ్యవహార్తములగూర్చిన అవగాహనలేదు, అది గ్రహించడానికి సమయమూ లేదు. అసలు తెల్లవారినది మొదలు డబ్బు వెనుక పరిగెత్తుటకొరకే నిదుర లేస్తున్నామన్న గట్టి నమ్మకము నేటి తరము వారిది. వేరు విషయములపై ధ్యానము లేక ధ్యాస ఉండదు. 'సంపాదనే తన సర్వస్వమనుకొని శాస్త్రముల్ సమవర్తి సరస జేర్చె' సంపాదన తన సర్వస్వమనుకొన్నాడు. బాగానే ఉంది. కానీ శాస్త్రములను సమవర్తి అనగా యమధర్మరాజు వద్దకు చేర్చినాడు. యముడు ప్రాణాంతకుడే కానీ ధర్మాధర్మ విచక్షణకు ఆయన గీటురాయి. నేను చెప్పదలచినది ఏమిటంటే ధర్మస్వరూపుడైన యమధర్మరాజు వద్దకు ధర్మాన్ని చేర్చినాము అంటే తెలిసిన విషయమును, తెలిసిన వానివద్దకు చేర్చి చేతులు దులుపుకోన్నాము. ఇక మనకు తెలిసినది సున్న. తెలిసేదీ సున్నానే! ఇకనైనా ఎంతో కొంత తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము అన్నది నా ఉద్దేశ్యము.
కానీ అలసత్వము ఆపని చేయనీయదు. ఒక 3,4 సంవత్సరముల క్రితము ఆస్యగ్రంధి (Face Book) సభ్యులు తాము వ్రాయుట ద్వారాగాని, తెలిసిన వారు వ్రాసిన రచనలను పదుగురికి వ్యాప్తి (Sharing) చేయుట ద్వారాగానీ మంచిని పంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో ఎక్కడో ఏ youtube లోనో ఉంచినది, మన సంస్కృతితో ఏమాత్రము సంబంధము లేనివి, సర్కసులు, విన్యాసాలు తమ కుడ్యమునకు చేర్చుచున్నారు (Posting on their walls). దీనివల్ల ఆస్య గ్రంధి అన్న ఒక చక్కటి మాధ్యమమును నిస్సారము, నిస్తేజము, అర్థ హీనము చేయుచున్నారు అన్నది నా అభిప్రాయము. మనకు జరిగిన, జరుగుచున్న అన్యాయాలను గూర్చి తెలుసుకోనవలసినది ఎంతో వున్నది. యువతకు మన సంస్కృతి తెలుసుకొనే తపన లేకుంటే దేశమే నిర్వీర్యమౌతుంది. అసలు పాశ్చాత్యులు ప్రాగ్దేశములపై, మోసముతో, తమ బావుటాను ఎగురవేసి లోకానికి అనాగారికులైన వీరికి మేము నాగరికత నేర్పుటకు వచ్చినామని ఉద్ఘాటించినారు కానీ నిజమునకు వారిలో తెలివయిన వారు మన విజ్ఞానమును దొంగలించి తమ పేరును దానికతికించి మనచే చదివించుచున్నారు. ఇది ఎట్లాఉన్నదంటే, మన ఊరినీళ్ళలో  ప్రాణాంతకమైన రసాయనములు కలిపి 10రూపాయలకు తక్కువలేని పెప్సీ కోకులగా త్రాపించుచున్నారు. అందు గల నీటి విలువ 10పైసలు చేయదు. ఇకనైనా యువత కళ్ళు తెరుచుట మంచిది.
ఇక నేటి వివాహ వ్యవస్థ ఎంత హేయమైన స్థితికి దిగజారిందో చూచెదము. నాటి, తెనుగునాట, ప్రసిద్ధ నటియైన శ్రీదేవి భర్త కొడుకు, అంటే శ్రీదేవికి సవతి కొడుకు, మలైకా అరోరా అన్న ఆవిడను వివాహమాడ దలచినాడు. ఆయన చేసేది తప్పా ఒప్పా అన్న విషయముతో మనకు నిమిత్తము లేదు. ఒక వాస్తవాన్ని పరిశీలించుదాము.  ఆమె 45 సంవత్సరముల వయసు కలిగినది కాగా అతని వయసు 33  సంవత్సరములు. తెలిసిన పేర్లు కావున వీరిని ఉదహరించినాను. దేశములో ఇటువనివారు ఎందఱో! అయ్య కులుకు ప్రాయములో ఉండగానే అమ్మ వణుకు ప్రాయముననుభవించుతూ వుంటుంది. Expiry Date దాటిన మందు వాడుటకు పనికిరాదు కదా!

ఓహో! అందుకా, స్వార్థ పూరితుడైన మగవాడు, తనకొక ఆడబానిస, తాను  బ్రతికినంతకాలమూ ఊడిగము చేయుటకు తక్కువ వయసు స్త్రీని వివాహము చేసుకొనవలెనని శాస్త్రములో చొప్పించినాడు అని తలచుట కద్దు. ఇది వాస్తవము కాదు. భార్యకు భర్తకు మధ్యన అనుబంధము రానురానూ అభివృద్ధి అవుతుంది. సాత్వికుడగు భర్త భార్య తనకోసము చేసే పనిని కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరించుతాడు. ఆ కృతజ్ఞతను ఆమెకు ఇష్టమైన నగ నట్ర చేయించుటలో చూపించుతాడు. కాస్త వయోధికుడైన భర్త పోతే భరించలేక చనిపోయిన భార్యలు ఎందఱో ఉన్నారు. అట్లే భార్య పోతే మరణించే భర్తలు కూడా ఎందఱో వున్నారు. కావున ఊడిగము కొరకు చిన్నవయసు అమ్మాయిని పెద్దవయసు ఉన్నవానికి ఇచ్చి పెళ్ళి చేయుట లేదు. మహాభారతములో ఈవిధముగా చెప్పబడినది.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మపి సర్వతఃl
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ll
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము. ఎంత నిజమైన మాటో చూడండి.అసలు పెళ్లి మంత్రములలో భర్తను పెద్దకొడుకుగా చూచుకొమ్మని వధువుకు తెలియజేసే మంత్రములు కలవు. ఈ సందర్భములో మహాభారతము లోని మరొక మాటను గుర్తుచేసుకోవలసి వస్తుంది. అరణ్యవాసము వెళ్ళే సమయములో కుంతీదేవి ద్రౌపది తో ‘అమ్మా! నీ భర్తలలో ఒక సహదేవుని మాత్రము నీవు తల్లిలాగా చూసుకో! వానికి ఆకలి తెలియదు. అందుచే నీవే అడిగి వానికి అన్నము పెట్టు’ అని చెబుతుంది. మరి కొడుకులా చూచుట అంటే ఇదే కదా!
ఇక ఈ విషయమును కాస్త విపులముగా విమర్శించుకొందాము. స్త్రీ పురుషులకు అవయవ నిర్మాణ క్రమములోనే ఆంతర్యము అధికముగా వుంటుంది.  అవయవ విధులను ఉత్తెజితముజేసే రసాయన క్రియ (Hormonal function) ఇరువురిలో వేరువేరుగా వుంటుంది. అందుచే శిశువులగు ఆడపిల్లలు మాటలు, నడక, చెప్పినది అర్థము చేసుకొనుట మొదలగునవి శీఘ్రముగా,అంటే  మగ శిశువులకన్నా వేగముగా గ్రహించుతారు. అందుకే పెద్దలు ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం’ అన్నారు. ఈ వాస్తవాన్ని గమనించండి ఒక 10 సంవత్సరముల వయసులోనున్న పిల్లల గొంతును పరిశీలించితే ఇద్దరి స్వరమూ  ఒకేమాదిరి వున్నట్లు తెలియవస్తుంది . ఆటరువాత ఇంచుమించు 2 ఏళ్లకల్లా ఆడపిల్లలగొంతు (సాధారణముగా) శ్రావ్యమైన రీతిలో నిలచిపోగా, తరువాత ఒక 4 సంవత్సరములకు మగపిల్లవాని గొంతుక మార్పులు చెండుతూవచ్చి ఒక 16 సంవత్సరముల వయసులో ఒకస్తాయినిచేరి నిలిచి పోతుంది. అదే విధముగా అమ్మాయి దాదాపు 12 సంవత్సరముల వయసులో రజస్వల అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ‘సమర్త’ ఆడింది అని ముఖ్యముగా రాయలసీమవైపు అంటారు. నిజానికి అది సంస్కృత పదమగు ‘సమర్థ’ అంటే ఏపనికైనా సిద్ధము అని అర్థము. ఆ సమయమున అమ్మాయిని ‘పెద్దమనిషి’ అయినది అని కూడా అంటారు. అంటే మగపిల్లలతో ఆట పాటలు, అతిగా మాట్లాడటాలు నిలచిపోతాయి. కారణం అమ్మాయి పెద్దమనిషి కానీ అబ్బాయి ఇంకా పిల్లవాడే. వానికి మీసకట్టు, మొగగొంతు, శారీరిక మార్పు 16 ఏళ్లకు గాని రాదు. దీనిని బట్టి మనకు ఏమి అర్థమౌతున్నదంటే అమ్మాయి అన్నింటిలోనూ ముందుంటుంది. అందుచేత పెళ్లి విషయములో అమ్మాయి, అబ్బాయిల నడుమ వయోభేదము కనీసము 3,4 సంవత్సరాలన్నా పాటించుతారు. ఆతరువాత, ఆమె కుటుంబమునకు ఇచ్చే అతిపెద్దవరం ‘సంతానము’. రానురానూ ఆమె మన్మధ మార్గము నుండి మరలి పిల్లల రక్షణకు అంకితమై పోతుంది. మగవాడు మాత్రము కామాగ్నికి ఇంధనమై కాలుతూనే ఉంటాడు. అంటే పరిపక్వత ఆమెలో వచ్చినంత తొందరగా అతనిలో రాదు. అందుకే ‘కరణేషు మంత్రి’ ఆమె సలహాలను తీసుకో అన్నారు.
ఇది అసలు విషయము. కాబట్టి ఇందులో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అంతా మనయొక్క దురాలోచన, దూరాలోచనపై ఆధారపడియుంటుంది .
స్వస్తి.

Wednesday, 1 May 2019

జీవితం


జీవితం
చిత్ర విచిత్రం చూడు జీవితం
యోచిస్తే అది పరుగుల పందెం
గెలవాలంటే నాతోడుండరు
ఓడిపోతినో వెనక్కి చూడరు