ధారా నగరం-అంతర్మథనం
ఈ క్రింది లంకెలో ధారానగరము(ధార్)ను గూర్చి కొన్ని ముఖ్య విషయములు ఓపికతో చదవండి.
https://cherukuramamohan.blogspot.com/2019/01/blog-post_19.html
దారా నగరము అంతర్మథనము
దక్షిణ
దేశము లోనివారలలో ఉత్తరాది పుణ్యక్షేత్రములకు పోయేవారు నా దృష్టిలో తక్కువే!
అందులో కూడా తర్కము జిజ్ఞాసతో అచటి పురాతన కట్టడములను చూసేవారు ఇంకా తక్కువ. గడచిన
8౦౦ సంవత్సరములలో దాక్షిణాత్యులకు, ఔత్తరాహికులతో
పోల్చితే విదేశీయులచే తిన్న ఢక్కా మక్కీలు తక్కువ. కానీ ఔత్తరాహికులు మాత్రము తమ ధన మాన
ప్రాణములనొడ్డి ఈ సంస్కృతిని రక్షించినారు. వారి అకుంఠిత ప్రయత్నములలో కొంత
పోగొట్టుకోవలసి వచ్చినది. అట్లు పొగొట్టుకొన్నవానిలొ కాశీ, మధుర,
అయోధ్య, ధార్, మెహ్రోలీ
లోని కుతుబ్ మీనార్ మొదలయినవి ఎన్నో వున్నాయి, చివరకు
ఎర్రకోట కూడా! ఈ రోజు ఆ కట్టడములన్నింటికీ ముస్లిం నామములే జతజేసి యున్నారు.
ఎంత
జరిగినా మనకు ధర్మము పైన దేశముపైన ఉన్న అభిమానమునకంటే మనపైన ఉండునది అపరిమితము.
ఎంత జరిగినా మనకు, స్వధర్మము పైకన్నా స్వదేశముపైకన్నా, మనపైన ఉండు అభిమానము అపరిమితము. అందుకే నేటికీ మన
నలందా విశ్వవిద్యాలయ గ్రందాలయమును 3 నెలలు నిర్విరామముగా కాల్చి బుగ్గి చేసిన
బర్బరుడగు భక్తియార్ ఖిల్జీ పేరుతోనే , నలందాకు
దగ్గరగా ఉండే పొగబండి స్తానకమగు (Railway Station) 'భక్తియార్పూర్' గా భాసిల్లుచున్నది. ఘజ్వా అంటే, ముస్లీములు కానివారిని చంపుట. ఆ
పేర్లతో ‘ఘజియాబాద్’ మరియు ‘ఘాజీపూర్’ విలసిల్లుచున్నవి. ‘ఘజియాబాద్’ పూర్వనామము
‘వైశాలి’. మనదేశ చరిత్రలో ప్రసిద్ధనగరము. ఆ నగరము పూర్వనామము తిరిగి పొందుటకు
ముహూర్హము ఆసన్నమైనట్లు లేదు. ‘సనాతన ధర్మ బంధువు’లంతా ఒకటైతేనే తిరిగీ మన
దేశమునకు పునఃప్రతిష్ఠ చేకూర్చగలము.
ఇప్పుడు, మనము మరువలేని భోజరాజు రాజధాని
దారానగరమును గూర్చి ఈ క్రింది లంకెలో కొన్ని ముఖ్య విషయములు విస్తారముగా చదవండి.
1947 ఆగస్టు 15 వ తేదీన స్వతంత్రమును సాధించి స్వాతంత్ర్య దినముగా జరుపుకొంటున్నాము. కానీ మనలో ఎంతమందికి ఇది
స్వతంత్రదినమా లేక కేవలము అధికార పరివర్తన దినమా! అన్న విషయము తెలుసు. స్వాతంత్రము అన్నది అధికార పరివర్తనము కానేరదు. మనకు ఆగస్టు
15, 1947
న స్వాతంత్రమే ఇచ్చియుంటే దిల్లీ లోని పురావస్తునిలయమున
భద్రపరచియున్నారు. మరి మనకు స్వాతంత్రమే ప్రకటించియుంటే ఈ బదిలీ పత్రమును భద్రపరచుట ఎందులకు?
ఇస్లాం, ఖురాన్, హదీస్, షరియ వీనిని గూర్చి కాస్త తెలుసుకొందాము. మసీదు, పై విషయములలో దేనికీ
చెందదు. మరి దేనికి చెందుతుంది అంటే కేవలము స్వార్థవాదులకు మతాశాపరులకు (Vote Mongers). ఆశ్చర్యమగు విషయమేమిటంటే మసీదుకు ఇస్లామునకు సంబంధము లేదని ఏ ఇస్లాము
మతపెద్దయూ తెలిసికూడా,
పెదవి
విప్పడు. ఖురాన్ అనుశాసనము ప్రకారము పక్కా గోరీలను నిర్మించుట నిషిద్ధము. కానీ ఏ ముఫ్తీ కానీ ఏ ముల్లా కానీ ఈ వాస్తవమును తెలుపడు. ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ గారు వెళ్ళుచుండిన
మసీదును సౌదీ అరేబియా ప్రభుత్వము పడగొట్టగాలేనిది అయోధ్య మధుర, కాశీలలో పడగొట్టుట
తప్పెందుకగును అని ఆలోచన చేస్తున్నారా ఈ దేశపు ముస్లీములు. మరి హిందూ ముస్లిం భాయి
భాయి అని అనుటలో అర్థము ఎంత ఉన్నది.
ఇక్కడ ఒక విషయమును చెప్పుకొందాము. మధ్య భారతదేశంలో 1000 మరియు 1055
మధ్య కాలంలో పాలించిన రాజు భోజుడు , దారానగరమును(నేటి ధార్)
రాజధానిగా చేసుకొని పాలించిన అసాధారణ రాజన్యులలో ఒకడు. ఆయనను గూర్చి మనము చరిత్ర పుస్తకాలలో చదువనే
చదువము. ఆయన కట్టించిన భోజ శాల ఆయన పాలనకు
సజీవదర్పణము. అది నాటి ముస్లిం పాలకుల ఇస్లాం మూఢవిశ్వాసము వల్ల మసీదుగా
మార్చబడింది. నేడు మిధ్యాలౌకికవాదులు(Pseudo Seculars) దానిని హిందు ముస్లిం ఐక్యతా చిహ్నముగా
చెప్పుకొస్తారు. ఎందుకంటే సరస్వతీ దేవికి అంకితమయిన ఆ శాల యొక్క ఒక గోడకు సంస్కృత
వ్యాకరణ సూత్రములు తాపింపబడి ఉన్నాయి. ఆ శాలను మసీదుగా మార్చిన మహనీయులు ఆ గోడను
కొట్టివేస్తే తిరిగి మిగతా మూడువైపుల గోదాలున్నంత గట్టిగా కట్టించలేమని తెలియుట
చేతనేమో అట్లే వదిలిపెట్టినారు. ఈరోజు దానిని చూపించి హిందూ ముస్లిం సఖ్యతకు
అది నిదర్శనమని చెప్పుకొస్తారు. అట్లు
చెప్పుట పుండుకు వెన్న రాచినట్లా లేక దానిపై కారము చల్లినట్లా!
ఈ పురాతన కట్టడమును 14, 15 శతాబ్దములలో కమాల్-మౌల్వీ మసీదు పేరుతో
కట్టించబడింది. అక్కడ లభించిన సరస్వతీ దేవి విగ్రహముగా చెప్పబడే విగ్రహమును British
Museum కు తరలించినారు. కట్టడము కదిలేటుగా వుంటే అదీ తరలించేవారేమో!
మధ్యే మార్గముగా భారత పురావస్తు సంరక్షణ (సర్వేక్షణ) సంస్థ (Archaeological
Survey of India) మార్గదర్శకాల ప్రకారం, శుక్రవారము
మరియు మహమ్మదీయ పండుగలలో ముస్లింలు ప్రార్ధన చేయవచ్చని హిందువులు మంగళవారము నాడు మరియు సరస్వతీ దేవి
పూజను వసంత పంచమి పండుగలో చేయవచ్చునాన్న
నిబంధనను ఏర్పరచినారు. ఈ కట్టడము ఇతర
రోజులలో సందర్శకులకు తెరువబడి ఉంటుంది.
భోజశాలను పాక్షికముగా పడగొట్టి మసీదు కట్టి ‘హిందూ ముస్లిం భాయి భాయి’ అనుటలో అసలు
ఔచిత్యము ఎక్కడున్నది ఎంత ఉన్నది అన్నది నాకు అర్థమగుట లేదు.
ఇక మరొక విషయమునకు వద్దాము. ఒక జాతీయ పార్టి ఒక దశాబ్దమో లేక ఇంకా అంతకన్నా ముందో హిందూ తీవ్రవాదము అను
ఒక క్రొత్త పేరును సృష్టించినారు. అంతకు మునుపే 1976 లో శ్రీమతి ఇందిరా గాంధీ గారి
ప్రభుత్వ హయాములో భారతీయ సంవిధానమునందు లౌకిక వాదము (Secularism) అన్న మాటను
చేర్చినారు. చేర్చకపోయినా దాదాపు 600 సంవత్సరములు మహమ్మదీయ పాలన
లోను అటుపిమ్మట ఒక 200 సంవత్సరములు ఆంగ్లేయుల పాలనలోనూ ఆ
ముసుగు లోనే కదా బ్రతికినాము. క్రొత్తగా ఆ పేరు పెట్టి హిందు మతము తప్ప మిగిలిన
రెండు విదేశీ మతములకు అల్పసంఖ్యాక వర్గ పట్టముగట్టి, వారి ఉన్నతి కోరునట్టి ఒక జాతీయ
పక్షము(National Party) లౌకిక వాద మంత్రముతో మాటలను చేతలను బంధింప ప్రయత్నించుచున్న 90% హిందువులు, ఎవరు ఎటుబోతే మనకేమిలే అని ఏమీ
పట్టనట్లున్నారు. దారి ఏదయినా ధనార్జన మన నాయకులు పూనిన వ్రతము. నేడు హిందువులమగు మన
పరిస్థితి ‘వండి వడ్డించేది రెడ్డిసాని, రెడ్డి తో వుండేది గుడ్డి పోలి’ అన్న
చందమైనది.
ఈ దేశ అధ్యక్షులు (మాన్యులు అబ్దుల్ కలాం గారు తప్పించి), సినిమా
హీరోలు, క్రికెట్ కాప్టన్లు, అత్యున్నత న్యాయస్థాన న్యాయాధీశులు, పలువిధముల ఉన్నతాధికారులయి,
మైనారిటీ వర్గము వారు ఏలినప్పటికీ వారికి రక్షణ లేదు అనుట హాస్యాస్పదము కాదా!
Of
the approximately 300,000 to 600,000
Hindus living in the Kashmir Valley in 1990 only 2,000–3,000 remain there in 2016.
According
to the Indian government, more than 62,000 families are
registered as Kashmiri refugees including some Sikh families. Most
families were resettled in Jammu, National Capital Region surrounding Delhi and
other neighbouring states.
(Exodus of Kashmiri Hindus - Wikipedia, Google)
62 వేల కుటుంబాలలో కుటుంబమునకు సగటున 4 సభ్యులు సగటున
వుంటారనుకొన్నా 2,50,000 బ్రతికి బట్ట
కట్టుకొన్నవారు. మరి మిగతవారు ఏమయినట్లు? మరి రక్షణ కావలసినది
ఎవరికీ.
తమిళనాడులో ‘మెల్ విశారం’ అన్న ఒక ఊరు వుంది. ఆ ఊరిలో హిందువులు
మహా అంటే 10% ఉంటారేమో! పెత్తనమంతా ముస్లిములదే! చివరకు అక్కడి హిందువులు తమ ఆస్తి
అమ్ముకొనవలెనన్నా ఊరిపెద్దయగు ‘భాయ్’ చెప్పినవారికి అమ్మవలసిందే! కేరళలో
మల్లప్పురం అన్న ఊరిని గూర్చి ఇదేవిధముగా శ్రీ సుబ్బ్రమనియన్ స్వామి గారు తమ
ఉపన్యాసము లో చెప్పగా వినుత జరిగినది. మరి ఈ విషములు మనదేశములో మనము మైనారిటీలమైనామని
తెలియజేయుట లేదా!
జల్లికట్టు విషయములో గానీ మన ప్రధాన న్యాయస్థానము తనకు ఉచితమన్న
న్యాయనిర్ణయము చేసినది కదా మరి 70 సంవత్సరములనుండి తన నిర్ణయమును ఎందుకు
చెప్పుటలేదు.పైన తెలిపినట్లు సౌదీ ప్రభుత్వము మహమ్మదు ప్రవక్త గారు నమాజు చదివిన
మసీదును పగులకొడుతూ అది కూడా ఖురాను వ్యతిరేకించే ఒక విగ్రహము వంటిదే అని శెలవిచ్చినారు.
మరి ముస్లిం ప్రభుత్వమే ముస్లీం ప్రవక్త నమాజు చేయుచుండిన మసీదును పగులగొట్టినపుడు
ఎప్పుడో ఎక్కడ నున్దియో వచ్చిన బాబరు కట్టించిన, ప్రార్థనలు జరుపని మశీదును గూర్చి
ఉచ్ఛన్యాయస్థానము ఇంత జాప్యము చ్యుత సబబా! ఇంతకంటే అన్యాయము ఉంటుందా! మరి ఆ
న్యాయస్థానము శబరీ మల విషయములో ఇచ్చిన తీర్పువలెనే స్త్రీలక్కు మసీదు నందు
ప్రవేశమును కలిగించగలదా!
గూగుల్ నుండి యథాతథముగా ఆంగ్లములో సేకరించిన ఈ సమాచారమును చూడండి:
దిల్లీ జామా మసీదు యొక్క
షాహి ఇమాం ను అరెస్ట్ చేయలేని దేశ పోలీసు వ్యవస్థ చేతగానితనమును ఒకసారి
పరిశీలించండి
A
criminal case was lodged against him (Ahmed Bukhari) along with Habib-ur-Rehman
and Nafisa in 2001, after an incident on 3 September
2001, when a mob, led by Bukhari assaulted on-duty police
and civic agencies officials trying to remove encroachments from near CGO
Complex in Lodhi Colony. Bailable Warrants against Bukhari
for this case have been issued over and over by the Delhi court. Delhi Police
has been unsuccessful to arrest him citing communal tension for the past 10 years. The Magistrate observed that legal provisions entailed
initiating the proceedings of declaring Bukhari a proclaimed offender, but
doing so would "undermine the authority of law." Also noted: "In
my considered opinion, declaring accused Ahmed Bukhari a proclaimed offender
would be a mockery of law and it would provide an easy escape route to the
accused. It is surprising and shocking as well to
see
the police force not be able to execute the NBW issued against Bukhari. Such
inaction by police cannot be tolerated," he said in his order in July 2012. (From Ahmed Bukhari
– Wikipedia)
మరి కంచి మఠాధీశులయిన జయేంద్ర మహాస్వాములను 11 నవంబరు 2004 దీపావళి
రోజున మన నాటి ఆంధ్రప్రదేశ్ లోనూ మరియు
విజయేంద్రుల వారిని 10 జనవరి 2005 న మఠ ప్రాంగణములోనూ arrest చేయుట జరిగింది (గూగుల్
నుండి). మరి ఈ ఉదంతము వాళ్ళ మనకు ఏమని అర్థమగుచున్నది?
సనాతన ధర్మమును పాటించు సహజన్ములారా ఇక నయినా మన ధర్మము, మన
సంస్కృతి ఈ వేదభూమిపై నిలువనీయండి. అందుకు గానూ మీకు తోచిన మంచి ఈ దేశమునకు ఒనగూర్చండి.
విదేశీయ పాలనలోనికో కబంధ హస్తాల పరిష్వంగమునకో దేశమును నెట్టక కాపాడండి. యువతయే మన
దేశపు పెట్టుబడి.
ధర్మఎవ సదా మూలం ధర్మఎవ సదా గుణం.
స్వస్తి.
No comments:
Post a Comment