Sunday, 2 December 2018

బఫే పార్టీ

బఫే పార్టీ
మన సంస్కృతిని ఎంత పోగొట్టుకొన్నామో, ఎంత పోగొట్టుకొంటున్నామో, ఎంత పోగొట్టుకొంటామో గతము లోనికి వెళ్లి యోచిస్తే అర్థమౌతుంది. ఆర్జన తప్ప అమ్మానాన్నలకు అన్యథా అవసరమేలేదు. ఆకారణముతో అద్భుతము అనిర్వచనీయము అయిన మన సంస్కృతికి పిల్లలను తలిదండ్రులు ఎంతగా దూరము చేసినారో చెబితే మాటలకందదు.
మాతాపితరులు మాతప్పులేదని బుకాయించినా వారి ఆత్మ సాక్షి వాస్తవమేమిటో తప్పక చెబుతుంది.
మనము పోగొట్టుకొన్నది ఏమిటో ఒక్కసారి మాకాలములోని పెళ్ళిళ్ళను నేమరేసుకొంటే హృదయము ద్రవిన్చుతుంది. నాడు పెళ్ళిళ్ళు సత్రములలోనో దేవాలయములలోనో, ఇల్లు పెద్దదయితే ఇంట్లోనేనో జరిగేది. చిన్న పిల్లలది ఒప్కజట్టు, ఆడపిల్లలది ఒక జట్టు మొగపిల్లలది ఒకజత్తుఒకజత్తు,మగవాల్లది పిచ్చ్చాపాటీ జట్టు ఒకటైతే పేకాట జట్టు ఒకటి.
ఇక వంటవద్ద వంటవారికి కావలసిన పదార్థము అందించే ఒకరిద్దరు, పెళ్ళి మంతపమునకు సామాగ్రి సమకూర్చేవారు కొందరు, ముఖ్యముగా అరిటాకు భోజనము అయినవాళ్ళ వడ్డెన పోగొట్టుకొన్నాము. ఈరోజు పిల్లలూ పెద్దలలో కూడా అరిటాకులు అన్న తినేది మాకు రాదు, తట్టనే పెట్టండి అనే వాళ్ళు వున్నారు. ఇటువంటి ఇబ్బందులే లేకుండా బఫే అవతరించింది. ఇందు ఎంగిలి, మంగళము, చేయదగినది , చేయదగనిది అన్న తారతమ్యములు లేకుండా అన్నీ చేస్తున్నారు అన్నీ తింటున్నారు, అన్నే పారేస్తున్నారు.
ఇది నేటి మన సాంప్రదాయము. ఈ సందర్భములో ఒక చాటువు గుర్తుకోస్తూవుంది.
చాకివాని తోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీరగట్టె
శివుడు తోలు గప్పె చీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
ఈ ఉపోద్ఘాతముతో ఒక వ్యంగ్యాత్మకమైన గేయమును ‘Buffet Party’ ని గురించి వ్రాసినాను. అది మిమ్ము నవ్విస్తుంది మరియు ఆలోచింపజేయిస్తుంది.ఈ దిగువ లంకెలో చదివేది. 
Link: https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html
బఫే పార్టీ
https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html


రెండో తేదీ కూతురి పెళ్ళి
తప్పక రండి వెళుదురు మళ్ళీ
మూడో తేదీ వుంది రిసెప్షను
దానికి తోడుగ  బఫే ఫంగ్షను
మనవారంతా వస్తారపుడే
చెప్పితి మీకీ మాటను ఇపుడే
ఫంగ్షనుకే నే వెళ్ళితినండీ
అదే హాలు ఇక వెళ్లి ‘తినండి’
అన్నాడచ్చటి వాలంటీరు
చూపుచు నాకొక మనుషుల ఏరు
కోట్లు గడించిన కోట్లు ధరించిన
వారంతా మరి క్యూ లో నిలుచొన
చెప్పుకాళ్ళతో చేత తట్టతో
సత్తుబొచ్చెలో సన్న గులకతో
సవ్వడి జేసిన రీతిని గలగల
వింటూనే నే పోయితి వెలవెల
వీధి బిచ్చములు గురుతుకు వచ్చెను
దానిజూచి సగమాకలి జచ్చెను
అయినా అడుగును వేసితినండీ
చెప్పెదనా చోద్యాన్ని వినండి
శుచి శుభ్రతలను వేయుచు మంటల
ఎవడో చేసిన ఏవో వంటల
తెచ్చియుంచెదరు తీరుబాటుగా
యూనిఫారమున ఠాటుబాటుగా
అన్నము పప్పూ పులుసూ చారూ
మజ్జిగపులుసు కూరలు ఆరు
జీరా రైసు  వాంగీ బాతు
బిరియానీ మరి బిసిబేలె బాతు
నాను చపాతీ రోటీ పూరీ
ఉన్నాయన్నీ టేబుల్ చేరి
ఇవి కాకుండా ఎన్నో స్వీట్లు
పేర్లు తెలియుటకు ఎన్నో పాట్లు           
పొళ్ళూ రైతా పలు పచ్చళ్ళు
చూచిన చచ్చును మన ఆకళ్ళు
తిను పదార్థముల అమరిక గోళము
ఏమితినాలో గందరగోళము
అయ్యా అన్నము అని ఒకరంటే
పప్పూ పులుసు అడుగుతువుంటే
బంతి భోజనము ముగిసిన పిమ్మట
యాచకులొకరింకొకరిని కుమ్ముట
గురుతుకు వచ్చెను నాకా గతము
కనగా కాదిది నాకవగతము
ఔత్తరాహికుడు హిందీ భాషలొ
అనుచూ ఉండెను బఫే ’లొ’ బఫే ’లొ’
ఆశ్చర్యముతో చూచితి నటునిటు
దున్నలు కుమ్మును అని అనుకొంటూ
తెలిసెను అప్పుడు దున్నలు కాదని
ఆతను అన్నమును తినమన్నాడని
తట్టలు పట్టుకు తిరుగుతూ వుంటే
దేశ దరిద్రత నకలది  కంటే
గతము లోపలికి మది వెడలింది
ఆ వైభవమది ఇటు తెలిపింది
బంతి చాపలను వరుసగ పరచి
బంధుమిత్రులను కూర్చున బనిచి
అక్కా అన్నా బావా మామా
పిన్నీ చిన్నా కన్నా కుసుమా
అందరికీ అరిటాకుల యందున
పంచభక్ష్య పరమాన్నములందున
కొంటెతనానికి ప్రేమను గూర్చుచు
వేళాకోళమునెంతో జేయుచు
బావా ఇది తిను మామా ఇది తిను
అని కొసరుచు వడ్డించగ వరుసను  
వద్దంటూనే వేయించుకొనే
భోక్తల బొజ్జలు గాంచగనౌనే
ఆ మాధుర్యము ఆ మమకారము
ఆ ఆప్యాయత ఆ ఆదరము
ఎక్కడ దొరకును ఎప్పుడు దొరకును
నామది దానిని ఎన్నడు మరచును 
స్వస్తి      







No comments:

Post a Comment