(https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post_13.html)
మన పూర్వుల ఘన చరిత్ర మట్టినంట నీకోయీ
నీ సంస్కృతి నీ జ్ఞానము నీ గౌరవ మదే నోయి
నీదేశపు గౌరవమే తెలుసుకొనుము నీ ధనము
చేయి వదిలి దానినెపుడు చేయకయ్య నిధనము
భూమి సూర్యుడు మాకు తెలుసునుగానీ ‘అభియంత’ అంటే ఏమిటి అన్నది మన
మెదడు లో ఉత్పన్నమయ్యే మొదటి ప్రశ్న. ఇది Engineer అన్న ఆంగ్లపదమునకు
సంస్కృత ప్రత్యామ్నాయము. ఇక అసలు విషయానికి వద్దాము.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
రవిర్యార్తేవంత్యం ప్రతిదినమపారస్య నభసః
(శ్లోకములోని మూడు చరణములు మాత్రమే సూర్యుని గూర్చి తెలుపుతుంది కావున అవి
మాత్రమే తీసుకొన్నాను.)
రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా
సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి
వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే
వున్నాడు/ఉంటాడు.
ఈ శ్లోకము యొక్క మూలము నాకు జ్ఞాపకము లేదు కానీ ఇది పాశ్చాత్య శాస్త్రవేత్త
కోపర్నికస్ కన్నా చాలా చాలా వేల సంవత్సరముల క్రిందటిది అన్న విషము మాత్రము బాగా గుర్తున్నది. సూర్యుడు అంతరిక్షమునందు స్థిరముగా ఉన్నాడు అనుటకు ఈ ఆధారము చాలు మన పూర్వుల పరిజ్ఞానమును తెలుపుటకు. ఆయన కిరణములు వక్రగతిన ( పగ్గములు పాములు) పయనిస్తాయని, సూర్యుని వెలుగులో 7 రంగులు వున్నాయని (7 గుర్రములు) , ఆయన నిశాలముగా ఉంటాడని ( సారధికి తొడలనుండి
పాదములములవరకు శరీరమే లేదు. పైపెచ్చు చక్రము ఒకటే. అంటే 'కదలదు మెదలదు
రథమండి కూర్చున్నాది విగ్రహమండి' అని ఎదో సినిమా పాటలో అన్నట్లు. కావున
మనవారు ఎన్నడూ సూర్యుడు భూమిచుట్టూ తిరుగుచున్నాడని చెప్పలేదు. అది కేవలము
సాపేక్ష భ్రమణమే!
ఇక్కడ ఖురాను బైబిలు లో చెప్పిన కొన్ని విషయముల సారాంశమును మీ ముందు
ఉంచుతాను..భూమి బల్లపరుపుగా ఉన్నది. సూర్యుడు తూర్పు భుజపు మధ్య బిందువు
వద్ద ఉదయించి పడమటి మధ్యబిందువు వద్ద గల జలాశాయములో క్రుంగి తరువాతి
రోజుకు మళ్ళీ తూర్పుకు వెళ్లి ఉదయించుచున్నాడు. ఇది వారికి వేవుడు చెప్పిన వాక్యము. ఖురానులో ఇంకొకమాట చెప్పబడినది. భూమికి ఆకాశము అంటుకొనియుంటే ఆ ఆకాశపు పిఒరను భూమినుండి చీల్చి వేరుచేసి పైకి విసరితే విసరితేబ్ మ్ విసరితే ఒకదానిపైనోకటిగా 7 ఖండాలయినాడట. ఆ ౭వ ఆకాశ ఖండము వారి 'అల్లా' నివాసము. ఇటువంటి ఎన్నో కట్టుకతలను మనము ఆ మత గ్రంధములలో చ్చూదవచ్చును.
ఇక విషయానికొస్తే, లక్షా ఎనభైవేల మైళ్లు ప్రతి సెకనుకు ప్రయాణిస్తూ సూర్యుని కాంతి వెలుగు భూమిని 8 నిమిషములలో చేరుతోంది. వేదం సహాయముతో ఈ విషయమును ఆవిష్సంకరించినవారు స్కృత జ్ఞానము సపూర్ణముముగా లేని ని పాశ్చాత్య వైజ్ఞానికులు అర్థము చేసుకొన్నా విషయాలస్ను తమ పేరు చేర్చుకొని తమవిగా ప్రకటించుకొన్నారు. అర్థము చెసుకొనలేనివి ఊహా జనితములని కొట్టిపారవేసినారు.
వేద సహాయమున ఖగోళాధ్యయనములో పరిశ్రమించి వక్కాణించిన విషయములు అంతకన్నా ప్రాచీనమైన మన సాహిత్యములో ఉన్నాయంటే మనకు నేడు ఆశ్చర్యముగా కనిపించవచ్చు. ప్లంకెట్ అను పాశ్చాత్య scientist అంతరిక్షమున సూర్యుని పరిశీలించి ఒక సామాన్య రైతు కూడా వర్షాగమనమును గూర్చి నిర్దుష్ఠముగా నాడు తెలుసుకొనుచుండినాడు అన్న విషయమును ఆయన మాటలలోనే 1903 లో వ్రాసిన ఆయన వ్రాసిన Ancient calendars and constellations నుండి యథాతథముగా తీసుకొనబడిన ఈ విషయమును చదవండి.
The punctuality of the rains in many parts of India is so exact that the farmer
foretells their arrival not only to the day, but to the hour. (About Rigveda
From Ancient calendars and constellations, of 1903, By Hon. EMMELINE M. PLUNKET)
గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుతున్నాయని కోపర్నికస్ 1453 ప్రకటించి, కాథలిక్ చర్చి చే వెలివేయ బడినాడు. ఆ పై రెండు శతాబ్దముల తర్వాత గెలీలియో ఆ సిద్ధాంతాన్ని
బలపర్చి చర్చి దృష్టిలో పాతకుడైనాడు. ఈ విషయమును ముందే తెలిపినాను. వారి
ప్రకటనకు ఎన్నో వేలు లేక లక్షల సంవత్సరములకు మునుపే మన వేదాలలో ఇదే
విషయాన్ని అనేక చోట్ల చెప్పి ఉన్నారు. ఉదాహరణకు కొన్ని చూద్దాం.
శ్లో: మిత్రో దాధార పృథవీముతద్యామ్| మిత్రః కృషీ||
....... కృష్ణ యజుర్వేదం - 3-4-11.16/ ఋగ్వేదం - 3-5-59 ./1
శ్లో: త్రినాభి చక్ర మజర మనవర్వం యేనేమా విశ్వాభువనాని తస్థుః|| ---
ఋగ్వేదం - 1-1-164-1 / యజుర అరణ్యక 3.28 / అథర్వవేధం: - 9-9-1 శ్లో:
హయంగౌః వృష్నిరకమీత్ అసదన్మాతరం పురః | పితరం చ ప్రయన్త్ప్వః || .....
ఋగ్వేదం - 10-189.1 - యజుర్వేదం - 1.5.3.2/ సామవేదం - 630, 2376, /
అథర్వవేదం - 6-32.1 ఇలా అనేక సందర్భాలలో అనేక శ్లోకాలలో వేదాలలో సూర్యుని చుట్టూ భూమి తిరుగు తున్నదని నిరూపించ బడింది. (యథాతథముగా గూగుల్ నుండి సంగ్రహింపబడినది.) అంతే గాక ఆర్య భట ...... గురువు చుట్టూ శిష్యులు తిరుగు చున్నట్లు సూర్యుని చుట్టూ భూమి తిరుగు చున్నదని ఉపమానంతో నిరూపించినాడు. ఆయన భూమి గమనమును గూర్చి ఈ విధముగా అంటూ వున్నాడు.
అనులోమ గతిర్నౌస్థః వశ్యత్య చలం విలోమగంl
యద్వత్ ఆచలానిభాని తద్వత్సమ పశ్చిమగానిll
అంటే ముందుకు నడిచే బస్సు లేక రైలులో నుండి భూమిని చూస్తే నిలుచున్న
చెట్టూచేమ వెనుకకు పరిగెడుతూ వున్న విధముగా భూమి పడమటి నుండి తూర్పునకు భ్రమించుతూవుంటే మనకు సూర్యుడు తూర్పునుండిపడమరకు పయనించుచున్నట్లగుపడుచున్నాడు అని పైశ్లోకము యొక్క అర్థాన్వయము.
ఈ విధంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగు తున్నదని నిరూపించగా.... తర్వాతి
కాలంలో ఈ సిద్ధాంతాన్ని తామే కనుగొన్నటు చెప్పు కోవడం..... ఎంత వరకు సబబు.
ఇక వరాహమిహిరుడు ఏమన్నాడో చూడండి:
పంచమహాభూత మయస్తారాగణ పంజరే మహీ
గోళః ఖేஉయస్కాంతలోహ ఇలా వసితో వృత్తః
రెండు ఆయస్కాతపు రాళ్ళ నడుమ ఇనుపగుండువలె ఆకాశమున చుక్కల గుంపు
నడుమ భూగోళము కలదు అని తేటతెల్లముగా తెలియజేసినాడు వరాహమిహిరుడు.
యజుర్వేదములోని ఈ మంత్రమును గమనించండి.
వరుణస్యోత్తంభనమసి వరుణస్య స్కంభసర్జనీ స్థో
వరుణస్యఋతసదన్యసి
వరుణస్యఃఋతసదనమసి వరుణస్యஉఋతసదనమాసీదll యజుర్వేదము 4-36
ఇక్కడ వరుణ అన్నది పరమాత్మునికి/సూర్యునికి అన్వర్థము.
పరమాత్మ వినా ఈ జగత్తును రచించుటకు, ధరించుటకు,
రమించుటకు,
ఎరుంగుటకు సమర్థులు కారు. అట్లే సూర్యాదులు అంటే సూర్యుని వంటి నక్షత్రములు
తమ చుట్టూ వున్నా గ్రహములకు ప్రకాశము కలిగించుటకు ధారణమొనర్చుటకు
సమర్థము కాజాలరు. కావున మానవులెల్లరూ ఈశ్వరుని ఉపాసించుచూ సూర్యుని
వెలుగు వినియోగము చేసుకొనవలెను. ఇక్కడ ధారణ ధరించుట కలిగియుండుట,
అంటే
ఆంగ్లములో Magnetic Attraction అని
చెప్పవలసియుంటుంది. పై అర్థమును పామరులకు తెలియజేసిన మహనీయులు స్వామీ
దయానంద సరస్వతి గారు.
ఇపుడు అతి సూక్ష్మముగా అధిక అనుచర గణములున్న రెండు పరమత గ్రంధములు
సూర్యగతిని గూర్చి ఏమన్నవో ఒకటి
రెండు ఉదాహరణలతో తెలియబరచుతాను.
మిగిలినది మళ్ళీ .........
భూమి-సూర్యుడు-అభియంత-2
వేదములలో ఎన్ని కోట్ల సంవత్సరముల క్రితమో చెప్పిన సత్యమును
పాశ్చాత్య Scientists
17వ శతాబ్దములో చెప్ప
ప్రయత్నించినందుకు వారు తమ చర్చి శాసనముచే దారుణ
మరణమునకు గురికావలసి
వచ్చినది.
బైబిల్ క్రానికల్స్
తెలియబరచిన అనేక విషయముల నుండి ఒకటి రెండు
యథాతథముగా ఈ క్రింద
పొందుపరచుట జరిగినది.
Bible Chronicles 16:30
Tremble before him, all
earth; yea, the world stands firm, never to be moved.
Psalms 93:1
The Lord reigns; he is
robbed in majesty; the lord is robbed, he is girded with
Strength. Yea, the world
is established; it shall never- be moved.
Job 28:24
For, he looks to the
ends of the earth, and sees everything under the
heavens.
Ecclesiastes 1:5
Sun rises and the sun
goes down, and hastens to the place where it rises.
కోపర్నికస్ ఆపై
2౦౦ సంవత్సరముల తరువాత గెలీలియో వీనిని తప్పు అని
చెప్పినదానికి
యమయాతనలనుభవించి మరణించవలసి వచ్చినది.
ఇక ఖురాన్ ఏమంటుందో
చూద్దాము.
And the Sun runs to its
resting place. That is the decree of the Almighty, the
All-Knowing. (Surah Ya
Sin, 38)
He made the Sun and Moon
subservient, each running for a specified term.
He directs the whole
affair. He makes the Signs clear so that hopefully you
will be certain about the meeting with your Lord. (Surat ar- Ra'd, 2)
ఖురాన్ లో సైతాన్ తో తలపడినపుడు జ్యోతుల వలె వెలుగు నక్షత్రములలో
ఒకటి తీసి
సైతాన్ మీదికి విసరితే
అతనికి తగిలి అనక్షత్రము పగులుటచే భూపతనమగు నక్షత్ర
శకలములుగా ఉల్కలు
తెలుపబడినవి.
పైన తెలిపిన ఖురాన్ యొక్క
ఆంగ్లానువాదాలు Miracles of The Quran
About the
Sun అన్న Google Site నుండి తీసుకొనుట
జరిగినది. ఇంకా ఎన్నో దృష్టాంతరములను
తీసుకొనవచ్చును గానీ
స్థలాభావమునకు భయపడి తీసుకొనుట లేదు. పై వాక్యాలు
ఏమి తెలుపుచున్నాయి అన్నది మీ విజ్ఞతకు
విడిచిపెట్టుచున్నాను.
నా తపన విలువకట్టలేని
కాలమునుండి వేదము ఎంతటి విజ్ఞానమును పంచుచున్నది
అన్నది తెలియబరచుట తప్ప
వేరువేరు మతగ్రంధములను వ్రేలేత్తి చూపుట కాదు.
ఇంతవరకు మనము అతి
క్లుప్తముగా సూర్యుడు, భూమి భ్రమణము ను గూర్చి
వేదవాక్కును, పరమత గ్రంధములు
తెల్పిన విషయములను చదివినాము. ఇపుడు నాటి
శాస్త్ర పరిజ్ఞానము మన
ఊహలకందని ఎంత ఎత్తులో ఉండినదో తెలుసుకొన
ప్రయత్నిద్దాము.
నాటి మన అభియంతల(Engineers) యొక్క అనుపమాన, అప్రమేయ మేధో
కౌశలమును గూర్చి తెలుసుకొన ప్రయత్నిద్దాము. మన ప్రయాణము
కాశీ నుండి ప్రారంభిద్దాము.
US Colorado University
Professor John M Melville, Astro Physicist, అంతరిక్ష భౌతిక
విజ్ఞాన శాస్త్రజ్ఞుడు, స్కాంద పురాణములోని కాశీ ఖండములో వర్ణించిన
విధముగా రేఖాగణిత సహకారముతో తాను ఎంతయో శ్రమించి, విశ్వనాథ
జ్యోతిర్లింగము కేంద్రముగా, 12 సూర్య మందిరములను ఎంతెంత దూరములో ఏ విధముగా
నిర్మింపబడినాయి అన్న ఒక పటము గీచుకొని, అందలి నిజానిజములను పరిశీలించుటకై 1994 లో
మనదేశములోని కాశీ నగరమునకు వచ్చుట తటస్తించినది. అక్కడ ఆయన వారణాశి హిందూ
విశ్వవిద్యాలయమునందలి శ్రీ P B సింగ్ అన్న ఆచార్యుని కలసి ఆయనకు విషయమంతా చెప్పి సహాయము కోరినారు.
మిగిలినది
మళ్ళీ..........