Thursday, 13 December 2018

భూమి – సూర్యుడు – అభియంత


 భూమి సూర్యుడు అభియంత

(https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post_13.html)

మన పూర్వుల ఘన చరిత్ర మట్టినంట నీకోయీ

నీ సంస్కృతి నీ జ్ఞానము నీ గౌరవ మదే నోయి

నీదేశపు గౌరవమే తెలుసుకొనుము నీ ధనము

చేయి వదిలి దానినెపుడు చేయకయ్య నిధనము

భూమి సూర్యుడు మాకు తెలుసునుగానీ ‘అభియంత’ అంటే ఏమిటి అన్నది మన 

మెదడు లో ఉత్పన్నమయ్యే మొదటి ప్రశ్న. ఇది Engineer అన్న ఆంగ్లపదమునకు 

సంస్కృత ప్రత్యామ్నాయము. ఇక అసలు విషయానికి వద్దాము.

రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః

నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.

 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినమపారస్య నభసః

(శ్లోకములోని మూడు చరణములు మాత్రమే సూర్యుని గూర్చి తెలుపుతుంది కావున అవి 

మాత్రమే తీసుకొన్నాను.)

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా 

సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి 

వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు.  

ఈ శ్లోకము యొక్క మూలము నాకు జ్ఞాపకము లేదు కానీ ఇది పాశ్చాత్య శాస్త్రవేత్త 

కోపర్నికస్ కన్నా చాలా చాలా వేల సంవత్సరముల క్రిందటిది అన్న విషము మాత్రము బాగా గుర్తున్నది. సూర్యుడు అంతరిక్షమునందు స్థిరముగా ఉన్నాడు అనుటకు ఈ ఆధారము చాలు మన పూర్వుల పరిజ్ఞానమును తెలుపుటకు. ఆయన కిరణములు వక్రగతిన ( పగ్గములు పాములు) పయనిస్తాయని, సూర్యుని వెలుగులో 7 రంగులు వున్నాయని (7 గుర్రములు) , ఆయన నిశాలముగా ఉంటాడని ( సారధికి తొడలనుండి 

పాదములములవరకు శరీరమే లేదు. పైపెచ్చు చక్రము ఒకటే. అంటే 'కదలదు మెదలదు 

రథమండి కూర్చున్నాది విగ్రహమండి' అని ఎదో సినిమా పాటలో అన్నట్లు. కావున 

మనవారు ఎన్నడూ సూర్యుడు భూమిచుట్టూ తిరుగుచున్నాడని చెప్పలేదు. అది కేవలము 

సాపేక్ష భ్రమణమే!

ఇక్కడ ఖురాను బైబిలు లో చెప్పిన కొన్ని విషయముల సారాంశమును మీ ముందు 

ఉంచుతాను..భూమి బల్లపరుపుగా ఉన్నది. సూర్యుడు తూర్పు భుజపు మధ్య బిందువు 

వద్ద ఉదయించి పడమటి మధ్యబిందువు వద్ద గల జలాశాయములో క్రుంగి తరువాతి 

రోజుకు మళ్ళీ తూర్పుకు వెళ్లి ఉదయించుచున్నాడు. ఇది వారికి వేవుడు చెప్పిన వాక్యము. ఖురానులో ఇంకొకమాట చెప్పబడినది. భూమికి ఆకాశము అంటుకొనియుంటే ఆ ఆకాశపు పిఒరను భూమినుండి చీల్చి వేరుచేసి పైకి విసరితే   విసరితేబ్ మ్  విసరితే ఒకదానిపైనోకటిగా 7 ఖండాలయినాడట. ఆ ౭వ ఆకాశ ఖండము వారి 'అల్లా' నివాసము. ఇటువంటి ఎన్నో కట్టుకతలను మనము ఆ మత గ్రంధములలో చ్చూదవచ్చును.

ఇక విషయానికొస్తే, లక్షా ఎనభైవేల మైళ్లు ప్రతి సెకనుకు ప్రయాణిస్తూ సూర్యుని కాంతి వెలుగు భూమిని 8 నిమిషములలో చేరుతోంది. వేదం సహాయముతో ఈ విషయమును ఆవిష్సంకరించినవారు స్కృత జ్ఞానము సపూర్ణముముగా లేని ని పాశ్చాత్య వైజ్ఞానికులు అర్థము చేసుకొన్నా విషయాలస్ను తమ పేరు చేర్చుకొని తమవిగా ప్రకటించుకొన్నారు. అర్థము చెసుకొనలేనివి ఊహా జనితములని కొట్టిపారవేసినారు. 

వేద సహాయమున ఖగోళాధ్యయనములో పరిశ్రమించి వక్కాణించిన విషయములు అంతకన్నా ప్రాచీనమైన మన సాహిత్యములో ఉన్నాయంటే మనకు నేడు ఆశ్చర్యముగా కనిపించవచ్చు. ప్లంకెట్ అను పాశ్చాత్య scientist అంతరిక్షమున సూర్యుని పరిశీలించి ఒక సామాన్య రైతు కూడా వర్షాగమనమును గూర్చి నిర్దుష్ఠముగా నాడు తెలుసుకొనుచుండినాడు అన్న విషయమును ఆయన మాటలలోనే 1903 లో వ్రాసిన ఆయన వ్రాసిన Ancient calendars and constellations నుండి యథాతథముగా తీసుకొనబడిన ఈ విషయమును చదవండి.

The punctuality of the rains in many parts of India is so exact that the farmer 

foretells their arrival not only to the day, but to the hour. (About Rigveda 

From Ancient calendars and constellations, of 1903, By Hon. EMMELINE M. PLUNKET)

గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుతున్నాయని కోపర్నికస్ 1453 ప్రకటించి, కాథలిక్ చర్చి చే వెలివేయ బడినాడు. ఆ పై రెండు శతాబ్దముల తర్వాత గెలీలియో ఆ సిద్ధాంతాన్ని 

బలపర్చి చర్చి దృష్టిలో పాతకుడైనాడు. ఈ విషయమును ముందే తెలిపినాను.  వారి 

ప్రకటనకు ఎన్నో వేలు లేక లక్షల సంవత్సరములకు మునుపే  మన వేదాలలో ఇదే 

విషయాన్ని అనేక చోట్ల చెప్పి ఉన్నారు. ఉదాహరణకు కొన్ని చూద్దాం. 

శ్లో: మిత్రో దాధార పృథవీముతద్యామ్| మిత్రః కృషీ||

....... కృష్ణ యజుర్వేదం - 3-4-11.16/ ఋగ్వేదం - 3-5-59 ./1 

శ్లో: త్రినాభి చక్ర మజర మనవర్వం యేనేమా విశ్వాభువనాని తస్థుః|| --- 

ఋగ్వేదం - 1-1-164-1 / యజుర అరణ్యక 3.28 / అథర్వవేధం: - 9-9-1 శ్లో: 

హయంగౌః వృష్నిరకమీత్ అసదన్మాతరం పురః | పితరం చ ప్రయన్త్ప్వః || ..... 

ఋగ్వేదం - 10-189.1 - యజుర్వేదం - 1.5.3.2/ సామవేదం - 630, 2376, / 

అథర్వవేదం - 6-32.1 ఇలా అనేక సందర్భాలలో అనేక శ్లోకాలలో వేదాలలో సూర్యుని చుట్టూ భూమి తిరుగు తున్నదని నిరూపించ బడింది. (యథాతథముగా గూగుల్ నుండి సంగ్రహింపబడినది.) అంతే గాక ఆర్య భట ...... గురువు చుట్టూ శిష్యులు తిరుగు చున్నట్లు సూర్యుని చుట్టూ భూమి తిరుగు చున్నదని ఉపమానంతో నిరూపించినాడు. ఆయన భూమి గమనమును గూర్చి ఈ విధముగా అంటూ వున్నాడు.

అనులోమ గతిర్నౌస్థః వశ్యత్య చలం విలోమగంl

యద్వత్ ఆచలానిభాని తద్వత్సమ పశ్చిమగానిll

అంటే ముందుకు నడిచే బస్సు లేక రైలులో నుండి  భూమిని చూస్తే నిలుచున్న 

చెట్టూచేమ వెనుకకు పరిగెడుతూ వున్న విధముగా భూమి పడమటి నుండి తూర్పునకు భ్రమించుతూవుంటే మనకు సూర్యుడు తూర్పునుండిపడమరకు పయనించుచున్నట్లగుపడుచున్నాడు అని పైశ్లోకము యొక్క అర్థాన్వయము.

ఈ విధంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగు తున్నదని నిరూపించగా.... తర్వాతి 

కాలంలో ఈ సిద్ధాంతాన్ని తామే కనుగొన్నటు చెప్పు కోవడం..... ఎంత వరకు సబబు. 

ఇక వరాహమిహిరుడు ఏమన్నాడో చూడండి:

పంచమహాభూత మయస్తారాగణ పంజరే మహీ

గోళః ఖేయస్కాంతలోహ ఇలా వసితో వృత్తః

రెండు ఆయస్కాతపు రాళ్ళ నడుమ ఇనుపగుండువలె ఆకాశమున చుక్కల గుంపు 

నడుమ భూగోళము కలదు అని తేటతెల్లముగా తెలియజేసినాడు వరాహమిహిరుడు.

యజుర్వేదములోని ఈ మంత్రమును గమనించండి.

వరుణస్యోత్తంభనమసి వరుణస్య స్కంభసర్జనీ స్థో వరుణస్యఋతసదన్యసి

వరుణస్యఃఋతసదనమసి వరుణస్య‌ఋతసదనమాసీదll యజుర్వేదము 4-36

ఇక్కడ వరుణ అన్నది పరమాత్మునికి/సూర్యునికి అన్వర్థము.

పరమాత్మ వినా ఈ జగత్తును రచించుటకు, ధరించుటకు, రమించుటకు,

ఎరుంగుటకు సమర్థులు కారు. అట్లే సూర్యాదులు అంటే సూర్యుని వంటి నక్షత్రములు 

తమ చుట్టూ వున్నా గ్రహములకు ప్రకాశము కలిగించుటకు ధారణమొనర్చుటకు 

సమర్థము కాజాలరు. కావున మానవులెల్లరూ ఈశ్వరుని ఉపాసించుచూ సూర్యుని 

వెలుగు వినియోగము చేసుకొనవలెను. ఇక్కడ ధారణ ధరించుట కలిగియుండుట

అంటే ఆంగ్లములో Magnetic Attraction అని

చెప్పవలసియుంటుంది. పై అర్థమును పామరులకు తెలియజేసిన మహనీయులు స్వామీ 

దయానంద సరస్వతి గారు.

ఇపుడు అతి సూక్ష్మముగా  అధిక అనుచర గణములున్న రెండు పరమత గ్రంధములు 

సూర్యగతిని గూర్చి ఏమన్నవో ఒకటి రెండు ఉదాహరణలతో తెలియబరచుతాను. 

మిగిలినది మళ్ళీ .........

భూమి-సూర్యుడు-అభియంత-2

వేదములలో  ఎన్ని కోట్ల సంవత్సరముల క్రితమో చెప్పిన సత్యమును పాశ్చాత్య Scientists 

17వ శతాబ్దములో చెప్ప ప్రయత్నించినందుకు వారు తమ చర్చి శాసనముచే దారుణ 

మరణమునకు గురికావలసి వచ్చినది.

బైబిల్ క్రానికల్స్ తెలియబరచిన అనేక విషయముల నుండి ఒకటి రెండు  

యథాతథముగా ఈ క్రింద పొందుపరచుట జరిగినది.

 Bible Chronicles 16:30

Tremble before him, all earth; yea, the world stands firm, never to be moved.

Psalms 93:1

The Lord reigns; he is robbed in majesty; the lord is robbed, he is girded with 

Strength. Yea, the world is established; it shall never- be moved.

Job 28:24

For, he looks to the ends of the earth, and sees everything under the 

heavens.

Ecclesiastes 1:5

Sun rises and the sun goes down, and hastens to the place where it rises.

 కోపర్నికస్ ఆపై 2౦౦ సంవత్సరముల తరువాత గెలీలియో వీనిని తప్పు అని 

చెప్పినదానికి యమయాతనలనుభవించి మరణించవలసి వచ్చినది.

ఇక ఖురాన్ ఏమంటుందో చూద్దాము.

And the Sun runs to its resting place. That is the decree of the Almighty, the 

All-Knowing. (Surah Ya Sin, 38)

He made the Sun and Moon subservient, each running for a specified term. 

He directs the whole affair. He makes the Signs clear so that hopefully you 

will be certain about the meeting with your Lord. (Surat ar- Ra'd, 2)

ఖురాన్ లో సైతాన్  తో తలపడినపుడు జ్యోతుల వలె వెలుగు నక్షత్రములలో ఒకటి తీసి 

సైతాన్ మీదికి విసరితే అతనికి తగిలి అనక్షత్రము పగులుటచే  భూపతనమగు నక్షత్ర 

శకలములుగా ఉల్కలు తెలుపబడినవి.

పైన తెలిపిన ఖురాన్ యొక్క ఆంగ్లానువాదాలు Miracles of The Quran About the 

Sun అన్న Google Site నుండి తీసుకొనుట జరిగినది. ఇంకా ఎన్నో దృష్టాంతరములను 

తీసుకొనవచ్చును గానీ స్థలాభావమునకు భయపడి తీసుకొనుట లేదు. పై వాక్యాలు 

ఏమి తెలుపుచున్నాయి అన్నది మీ విజ్ఞతకు విడిచిపెట్టుచున్నాను.

నా తపన విలువకట్టలేని కాలమునుండి వేదము ఎంతటి విజ్ఞానమును పంచుచున్నది 

అన్నది తెలియబరచుట తప్ప వేరువేరు మతగ్రంధములను వ్రేలేత్తి చూపుట కాదు.

ఇంతవరకు మనము అతి క్లుప్తముగా సూర్యుడు, భూమి భ్రమణము ను గూర్చి 

వేదవాక్కును, పరమత గ్రంధములు తెల్పిన విషయములను చదివినాము. ఇపుడు నాటి 

శాస్త్ర పరిజ్ఞానము మన ఊహలకందని ఎంత ఎత్తులో ఉండినదో తెలుసుకొన 

ప్రయత్నిద్దాము.

నాటి మన అభియంతల(Engineers) యొక్క అనుపమాన, అప్రమేయ మేధో 

కౌశలమును గూర్చి తెలుసుకొన ప్రయత్నిద్దాము. మన ప్రయాణము కాశీ నుండి ప్రారంభిద్దాము.

US Colorado University Professor John M Melville, Astro Physicist, అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు, స్కాంద పురాణములోని కాశీ ఖండములో వర్ణించిన విధముగా రేఖాగణిత సహకారముతో తాను ఎంతయో శ్రమించి, విశ్వనాథ జ్యోతిర్లింగము కేంద్రముగా, 12 సూర్య మందిరములను ఎంతెంత దూరములో ఏ విధముగా నిర్మింపబడినాయి అన్న ఒక పటము గీచుకొని, అందలి నిజానిజములను పరిశీలించుటకై 1994 లో మనదేశములోని కాశీ నగరమునకు వచ్చుట తటస్తించినది. అక్కడ ఆయన వారణాశి హిందూ విశ్వవిద్యాలయమునందలి శ్రీ P B సింగ్ అన్న ఆచార్యుని కలసి ఆయనకు విషయమంతా చెప్పి  సహాయము కోరినారు.

మిగిలినది మళ్ళీ..........

    

Sunday, 2 December 2018

బఫే పార్టీ

బఫే పార్టీ
మన సంస్కృతిని ఎంత పోగొట్టుకొన్నామో, ఎంత పోగొట్టుకొంటున్నామో, ఎంత పోగొట్టుకొంటామో గతము లోనికి వెళ్లి యోచిస్తే అర్థమౌతుంది. ఆర్జన తప్ప అమ్మానాన్నలకు అన్యథా అవసరమేలేదు. ఆకారణముతో అద్భుతము అనిర్వచనీయము అయిన మన సంస్కృతికి పిల్లలను తలిదండ్రులు ఎంతగా దూరము చేసినారో చెబితే మాటలకందదు.
మాతాపితరులు మాతప్పులేదని బుకాయించినా వారి ఆత్మ సాక్షి వాస్తవమేమిటో తప్పక చెబుతుంది.
మనము పోగొట్టుకొన్నది ఏమిటో ఒక్కసారి మాకాలములోని పెళ్ళిళ్ళను నేమరేసుకొంటే హృదయము ద్రవిన్చుతుంది. నాడు పెళ్ళిళ్ళు సత్రములలోనో దేవాలయములలోనో, ఇల్లు పెద్దదయితే ఇంట్లోనేనో జరిగేది. చిన్న పిల్లలది ఒప్కజట్టు, ఆడపిల్లలది ఒక జట్టు మొగపిల్లలది ఒకజత్తుఒకజత్తు,మగవాల్లది పిచ్చ్చాపాటీ జట్టు ఒకటైతే పేకాట జట్టు ఒకటి.
ఇక వంటవద్ద వంటవారికి కావలసిన పదార్థము అందించే ఒకరిద్దరు, పెళ్ళి మంతపమునకు సామాగ్రి సమకూర్చేవారు కొందరు, ముఖ్యముగా అరిటాకు భోజనము అయినవాళ్ళ వడ్డెన పోగొట్టుకొన్నాము. ఈరోజు పిల్లలూ పెద్దలలో కూడా అరిటాకులు అన్న తినేది మాకు రాదు, తట్టనే పెట్టండి అనే వాళ్ళు వున్నారు. ఇటువంటి ఇబ్బందులే లేకుండా బఫే అవతరించింది. ఇందు ఎంగిలి, మంగళము, చేయదగినది , చేయదగనిది అన్న తారతమ్యములు లేకుండా అన్నీ చేస్తున్నారు అన్నీ తింటున్నారు, అన్నే పారేస్తున్నారు.
ఇది నేటి మన సాంప్రదాయము. ఈ సందర్భములో ఒక చాటువు గుర్తుకోస్తూవుంది.
చాకివాని తోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీరగట్టె
శివుడు తోలు గప్పె చీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
ఈ ఉపోద్ఘాతముతో ఒక వ్యంగ్యాత్మకమైన గేయమును ‘Buffet Party’ ని గురించి వ్రాసినాను. అది మిమ్ము నవ్విస్తుంది మరియు ఆలోచింపజేయిస్తుంది.ఈ దిగువ లంకెలో చదివేది. 
Link: https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html
బఫే పార్టీ
https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html


రెండో తేదీ కూతురి పెళ్ళి
తప్పక రండి వెళుదురు మళ్ళీ
మూడో తేదీ వుంది రిసెప్షను
దానికి తోడుగ  బఫే ఫంగ్షను
మనవారంతా వస్తారపుడే
చెప్పితి మీకీ మాటను ఇపుడే
ఫంగ్షనుకే నే వెళ్ళితినండీ
అదే హాలు ఇక వెళ్లి ‘తినండి’
అన్నాడచ్చటి వాలంటీరు
చూపుచు నాకొక మనుషుల ఏరు
కోట్లు గడించిన కోట్లు ధరించిన
వారంతా మరి క్యూ లో నిలుచొన
చెప్పుకాళ్ళతో చేత తట్టతో
సత్తుబొచ్చెలో సన్న గులకతో
సవ్వడి జేసిన రీతిని గలగల
వింటూనే నే పోయితి వెలవెల
వీధి బిచ్చములు గురుతుకు వచ్చెను
దానిజూచి సగమాకలి జచ్చెను
అయినా అడుగును వేసితినండీ
చెప్పెదనా చోద్యాన్ని వినండి
శుచి శుభ్రతలను వేయుచు మంటల
ఎవడో చేసిన ఏవో వంటల
తెచ్చియుంచెదరు తీరుబాటుగా
యూనిఫారమున ఠాటుబాటుగా
అన్నము పప్పూ పులుసూ చారూ
మజ్జిగపులుసు కూరలు ఆరు
జీరా రైసు  వాంగీ బాతు
బిరియానీ మరి బిసిబేలె బాతు
నాను చపాతీ రోటీ పూరీ
ఉన్నాయన్నీ టేబుల్ చేరి
ఇవి కాకుండా ఎన్నో స్వీట్లు
పేర్లు తెలియుటకు ఎన్నో పాట్లు           
పొళ్ళూ రైతా పలు పచ్చళ్ళు
చూచిన చచ్చును మన ఆకళ్ళు
తిను పదార్థముల అమరిక గోళము
ఏమితినాలో గందరగోళము
అయ్యా అన్నము అని ఒకరంటే
పప్పూ పులుసు అడుగుతువుంటే
బంతి భోజనము ముగిసిన పిమ్మట
యాచకులొకరింకొకరిని కుమ్ముట
గురుతుకు వచ్చెను నాకా గతము
కనగా కాదిది నాకవగతము
ఔత్తరాహికుడు హిందీ భాషలొ
అనుచూ ఉండెను బఫే ’లొ’ బఫే ’లొ’
ఆశ్చర్యముతో చూచితి నటునిటు
దున్నలు కుమ్మును అని అనుకొంటూ
తెలిసెను అప్పుడు దున్నలు కాదని
ఆతను అన్నమును తినమన్నాడని
తట్టలు పట్టుకు తిరుగుతూ వుంటే
దేశ దరిద్రత నకలది  కంటే
గతము లోపలికి మది వెడలింది
ఆ వైభవమది ఇటు తెలిపింది
బంతి చాపలను వరుసగ పరచి
బంధుమిత్రులను కూర్చున బనిచి
అక్కా అన్నా బావా మామా
పిన్నీ చిన్నా కన్నా కుసుమా
అందరికీ అరిటాకుల యందున
పంచభక్ష్య పరమాన్నములందున
కొంటెతనానికి ప్రేమను గూర్చుచు
వేళాకోళమునెంతో జేయుచు
బావా ఇది తిను మామా ఇది తిను
అని కొసరుచు వడ్డించగ వరుసను  
వద్దంటూనే వేయించుకొనే
భోక్తల బొజ్జలు గాంచగనౌనే
ఆ మాధుర్యము ఆ మమకారము
ఆ ఆప్యాయత ఆ ఆదరము
ఎక్కడ దొరకును ఎప్పుడు దొరకును
నామది దానిని ఎన్నడు మరచును 
స్వస్తి      







Monday, 26 November 2018

మేడం-ఆంటీ-అంకుల్


మేడం-ఆంటీ-అంకుల్
https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post_26.html
‘Baba Black sheep.....’ అన్న Rhyme మనకు సుపరిచితమే! ఇందులో Sheep ఏమని జవాబు చెబుతుందంటే ‘One for my Master one for my DAME..’
‘My Dame’ రానురానూ Madam అయినది. అది గొర్రె కాబట్టి My Dame (Madam) అంటే చెల్లినది. నాస్త్రీ, నా ఆడది, అన్న అర్థములో వచ్చే ఈ పదము తప్ప మన సంస్కృతిలో మన భాషలో వేరు పదములేదా! అసలు Dame అన్నది French శబ్దము వాళ్ళు ఇంటి యజమానియగు స్త్రీని Dame అంటారు.
మరి ఈ మాటకు ప్రత్యామ్నాయము లేదా అంటే ఉంది. అదే  అమ్మ . అమ్మ అన్నది అత్యుత్తమమైన పదము. పదము అన్న మాటకు రెండు అర్థములు. ఒకటి ‘అర్థమును కూర్చెడి అక్షరముల కలయిక.’ వేరొక అర్థము ‘ఉన్నత స్థానము’. నకోక అర్థము 'పాదము'. మరి అమ్మ అన్న పదము’ పలికి అమ్మ’ పాదము’ పట్టితే అదియే స్వర్గ పదము’ .
అమ్మ అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ , దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ, ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.

అమ్మ, తల్లి, మాత,జనని, అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము. సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే  అమ్మ అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని  matter, మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత గా చేప్పుకునే  గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter   మొదలగునవి. మాత అన్న శబ్దము ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము . దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే   మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
ఇక  Madam అన్న పదము యొక్క మూలమును తెలుసుకొందాము. ఫ్రెంచ్ భాషనుండి లాటి, తద్వారా ఆగ్లమునకు వచ్చింది ఈ Madam అన్న పదము వచ్చింది. ఈ క్రింద Google నుండి ‘Madam’ యొక్క పుట్టుకకు సంబంధించి గ్రహించిన విషయమును మీ ముందుంచుచున్నాను.
‘Madam /ˈmædəm/, or, as French, madame /ˈmædəm/ or /məˈdɑːm/,[1] is a polite form of address for women, often contracted to ma'am /ˈmæm/ in American English and /ˈmɑːm/ in British English. The abbreviation is "Mme" or "Mme" or "Mdm" and the plural is Mesdames (abbreviated "Mmes" or "Mmes" or "Mdms"). The term was borrowed from the French Madame (French pronunciation: [maˈdam]), which means "my lady". (Courtesy: Google)’
కావున “Madam” కన్నా ‘అమ్మ’ అని పిలుచుట చేత స్త్రీలను అత్యున్నతముగా గౌరవించిన వారలమగుచున్నాము అన్నది నిర్వివాదాంశము.
ఇక ‘ఆంటీ అంకుల్’ అన్న పదములకు అర్థములేమిటి అన్నది ఆలోచించుతాము.
మళ్ళీ కలుద్దాము.......


ఇక ఆంటీ అంకుల్ ను గురించి
వెస్టు కల్చరెపుడు వేడి కాఫీ యాయె
వారి రీతి నీతి పాలు చీని
అందుచేత ఆంటి అంకులు మనకొచ్చె
మామ అత్త పిన్ని మాయామాయె
 నిరంతరమూ సువాసన వెదజల్లే శ్రీగంధపు వృక్షమును మొదలంట నరికి కొని తెచ్చుకొని గంధపు అగరుబత్తీ వెలిగించినట్లు వుంది మన వరుస. పాశ్చాత్య సంస్కృతి అగరుబత్త్హీ వంటిది. భారతీయ సంస్కృతియగు చందన సాలము నేటిది కాదు తరతరములనుండి వస్తూ వున్నది. ఆ మరులుగొల్పు మంచి గాలిని మనము పీల్చుచూ మనము మన వారసులు ఆరోగ్యముగా హాయిగా ఉండవలెనని ఏర్పాటు  చేసినారుచేసినారు మన పూర్వులు. అచెట్టును నిర్దాక్షిణ్యముగా నేటి తరము కొట్టివేస్తూ వుంటే బరువెక్కిన మనసుతో ఎవరయినా బాధ వెలిబుచ్చితే నీకెందుకు నాయిష్టం అంటున్నారు. ఈ విధముగా ఆలోచనలు వెర్రితలలు వేస్తూ పోతే స్వంత ఇంటికి న్నిప్పుపెట్టుకొని ‘నాయిష్టం నాయిల్లు’ అంటారేమో!
పాశ్చాత్య సంస్కృతిని గూర్చి ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నము చేయుటకు నేను తెలియజేయుచున్నది ఒకసారి, మనసు పెట్టిచదవండి.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మ లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు, ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. మొదటిసారిగా హిలరీ క్లింటన్ నిలచినా ఓడిపొయినది.

ఇంచుమించు13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ పాశ్చాత్య జాతికి పెళ్లి అన్నది తెలియదు. నేటికి కూడా, అది ఆడామగ సంబంధము. అదే మన సాంప్రదాయములో  రెండు కుటుంబాల అనుబంధము. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే, రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు  అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ  ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్న ఆ పాశ్చాత్యదంపతులు అదృష్ట వశాన రెండు  మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే  వ్రాసుకొంటారు అట్లు కాకుంటే వడంబడిక చేసుకొంటారు. అది లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె  పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. అదే విధముగా అతని పిల్లలు, తమ తండ్రి క్రొత్తగా పెళ్ళిచేసుకొన్న యువతిని ‘ఆంటీ’ అంటారు. మరి అటువంటి సంబోధనలు చెడ్డవి కాదా! ఒకపరి ఆలోచించండి. చైనా, జపాను, మలేషియా,నేపాల్, భూటాన్ ఇత్యాది అనేక దేశములు తమ తమ సంస్కృతిని సజావుగా కాపాడుకొంటూ వస్తూవున్నాయి. ఒకనాటి మన దేశములో భాగమయిన పాకిస్తాన్ తమ మతము తమ సంస్కృతికి అడ్డువస్తాయని హైందవ సంస్కృ తినేకాక హిందువులనే పొట్టన పెట్టుకొంది. వారివలె దుర్మార్గమునకు పాలుపడండి, అని నేను చెప్పుటలేదు. నేను కేవలము మన ఆచారవ్యవహారములు ఎంతో సనాతనమైనవి. ద్రష్టలయిన మహాఋషి  మునులు మనకు ఏర్పరచిన మానవ సంబంధముల బాటలో నడుద్దాము అని మాత్రమె చెబుతున్నాను.
పాశ్చాత్యులు ఈ విధముగా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day, Father’s day (mothers' day, Father’s day ని గూర్చి విస్తృతముగా ఇదివరలో వ్రాసినాను.) రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ నాన్నను వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది.
అందుకే Uncle, Aunt అన్న పదములకు శబ్ద కోశము లో చిన్నాన్న లేక మామ అన్న అర్థమును, పిన్ని లేక అత్త అన్న అర్థములను చూస్తాము. మనకున్నన్ని వావి వరుసలు వారికి లేవు. అందుకే వారు 'పిండికీ పిడుక్కూ ఒకే మంత్రము'ను వాడుతారు. దయవుంచి ఆ విధముగా సంబోధించి మన తలిదండ్రులకు అవమానమును కోరి తేవద్దు. పైపెచ్చు కొత్తవారిని సంబోధించునపుడు ఏమండి, పెద్దవాలయితే గురువు గారు, అయ్యా, అమ్మా, అంతగా ఆంగ్లమే కావాలన్నా 'సార్' అని వాడితే మన వాసి తగ్గేది ఏమీ లేదు.
 క్రొత్తవాళ్ళతో ఎంతో అనుబంధమున్నట్లు బంధుత్వమును అంటగట్టి పిలుచుట మన సాంప్రదాయము కాదు అని తెలియజేస్తూ నా ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్నాను.

స్వస్తి.

Saturday, 3 November 2018

మదిలోని మాట














మదిలోని మాట

https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post.html

ఒక విషయము వ్రాయవలెను అంటే వ్రాసేవానికి ముందు అవగాహన అవసరము.

అటుపిమ్మట ఆ అవగాహనను భావము లోనికి రూపాంతరము చెందించవలసి

యుంటుంది. ఆపై  ఆ భావమును, దానికి అనుకూలమైన భాషలోనికి మార్చవలసి

యుంటుంది. ఇవన్నీ మానసిక ప్రక్రియలే. ఆ తరువాత అక్షరములను వ్రాత బల్లపై

వుంచవలసి యుంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రక్రియను దైవదత్తముగా భావించితే

తనకు చేతనగు రీతిలో నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుతాడు. అదే

స్వార్థబుద్ధి అయితే ధనాపేక్షతో చేస్తాడు. కొందరు ఇంతటి గొప్పపని చేసికూడా

అయాచితముగా వచ్చిన పారితోషికమునే గ్రహించుతారు. యాచించరు.

యాచించేవాడు స్వార్థ కవి లేక పండితుడు.  ఆ రెంటికీ దూరమున్నవాడు

పరమార్థ కవి లేక పండితుడు. అసలు తనలో ఏమీ లేకుండా ఏదో వ్రాసేవాడు

నిరర్థ కవి లేక పండితుడు.

ఈ ఆస్య గ్రంధికి చెందిన అందరూ నిస్వార్థులే. కానీ వీరిలో కొందరు తాను

వ్రాసినది ఎందరికి నచ్చినది అని చూస్తారు. వీరిని కూడా రెండు తెగలుగా

విభజించవచ్చు.

మొదటి కోవకు చెందినవారు సంఖ్యను జూచి సంతృప్తి పడిపోతారు. రెండవ

కోవకు చెందినవారు నచ్చిన వారి సంఖ్యను ఆలంబనగా తీసుకొని తమ రచనకు

మరికాస్త పదును పెట్టి చదువరులకు తమకు తెలిసిన విషయములను

ఉత్సాహముతో తెలియజేయ తలచుతారు.

ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తిని నేను. తెలిసినది కొంచెమయినా,

తెలుపవలెనను తపన కలిగిన వాడను. అందుకే, ముద్రణ కష్టమయినా Likeలు లేక

పోయినా, నా ప్రయత్నమును విరమించను. వ్రాయుట దీక్షగా స్వీకరించి మాత్రమే

వ్రాస్తూ వుంటాను. ఇన్నిచెప్పినా నేనూ మనిషినే! నాలోనూ బలహీనత ఎదో ఒకటి

ఉంటుంది.

నాలోని ఆ బలహీనత ఏమిటి అన్నదానికి ఒక ఉదాహరణ రూపముగా

తెలియజేసుకొంటాను.

Cricket లో గొప్పగా batting చేసిన ముగ్గురూ వ్యక్తులను తీసుకొందాము.

1.                   డాన్ బ్రాడ్మన్ : నాడు టెస్ట్ క్రికెట్ మాత్రమే వుండేది. క్రీడాకారులు కూడా బంతి భూమిపై వేగముగా తమను దాటి వెళ్ళిపోతే  దానిని పొందుటకు పరిగెత్తేవారు. లేక Ball ఒకవేళ Catch కి వస్తే పరిగెత్తి పట్టే ప్రయత్నము చేసేవారు. అంతకు మించిన ప్రయత్నము, కష్టము నాడు కనబడదు.

2.                తెండూల్కర్: ఈయన కాలానికి One Day, T20 వచ్చినాయి. ఆటలో నైపుణ్యము 

పెరిగినది. బంతులను విసరు తీరుతెన్నలు ఎంతగానో మారిపొయినాయి. Batting 

నైపుణ్యము పెరిగి పోయింది. Jonty Rhodes పుణ్యమా అని Fielding పద్ధతులు కూడా 

మారజొచ్చినాయి. Circus Feats చేసి బంతిని పట్టుట సాధన చేసినారు. అట్టి 

పరిస్తితులలో, తన శరీర ఆరోగ్యము వల్లనో, తన నైపుణ్యము వల్లనో, ఎన్నో Records ను 

స్వంతము చేసుకొన్నాడు.


ధోనీ, కోహ్లీ: వరవడి పెరిగింది, నైపుణ్యము పెరిగింది. ఆటగాళ్ళు పెరిగినారు.

అవకాశాలు తగ్గినాయి. గాయాలను సైతము లెక్కచేయక ఆడేవారు

అధికమయినారు. అన్నిటికీ మించి Matches అన్నీ Recod కావటం తో వానిని మళ్ళీ 

మళ్ళీ చూసి, తమ తప్పులు సవరించుకొనుట, ఇతరుల బలహీనతలు కనుగొని వారిపై 

దెబ్బకొట్టుట నేర్చుకొన్నారు. ఇవికాక Coaches ను Batting, Bouling, Fielding లకు 

విడి విడిగా ఏర్పాటుచేసుకొని సామర్థ్యమును పెంచుకొన్నారు.

ఎవరి రికార్డులు వారివే! పోల్చుట, వివిధ కాలపరిస్థితులకు అనుగుణముగా మారిన 

ఆటలో,   నావరకు సబబు అనుపించదు. ఆ కాలములకు వారు గొప్ప. కవిత్వము

పాండిత్యము , వ్యాసరచన కూడా ఇటువంటివేనని నా అభిప్రాయము. ఈ కాలములో 

వుండే భావ ప్రసార మాధ్యమములు నాడు లేవు, అయినా మహనీయులు వ్రాసిన 

గ్రంధములు అజరామరములై నిలచిపోయినాయి. నాటి మహానుభావులు, కొందరయితే 

మహా పడితులై కూడా గుర్తింపునకు పాటుపడలేదు.

కాళిదాసు పేరు ప్రాచుర్యములో ఉన్నంతగా మల్లినాథసూరిని గూర్చి ఎందరికి తెలుసు. 

అసలు ఆయన కాళిదాసు కావ్యములకు వ్యాఖ్యానము వ్రాసియుండి ఉండకపోతే ఆ 

గ్రంథములకు ఇంత ప్రాచుర్యము వచ్చియుండెడిదా! ఈ విషయము ఎంత మందికి 

తెలుసు. ఆయన ఆంధ్రుడని ఎందరికి తెలుసు.

మల్లినాథుడి ఇంటిపేరు కొలచాల. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే 

వికారాలున్నాయి. కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామము తెలంగాణా రాష్ట్రము లోని, 

మెదక్ జిల్లాకేంద్రమైన మెదక్ కుు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు 

పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని 

తెలుస్తోంది.

మహామహోపాధ్యాయుడగు జటావల్లభుల పురోషోత్తం గారు స్వయంగా

మల్లినాథులవారిని గూర్చి చెబుతూ, ఆయనే లేకుంటే కాళిదాసునకు అంత పేరు

వచ్చేది కాదేమో అన్నారు. ఇంతటి మహానుభావులు ఎందఱో! ఎందరెందరో!

కానీ నేటి పరిస్థితి అది కాదు. రామాయణ, భారత భాగవత, మహాకావ్య, ప్రబంధములను

చదివేవారు కనిపించరు అనుట అతిశయోక్తి కానేరదేమో! నేడు ఆస్యగ్రంధిలో తమ 

కవితలను పంచే కవులు పుంఖానుపుంఖములు. కానీ ఇందులో, గంభీరమగు భావము 

కలిగియుండి కూడా, ఎక్కువమంది భాషాసంపదను సమకూర్చుకొను  జిజ్ఞాస, నిబద్ధత 

కలిగినవారు తక్కువ. అప్పుడు కవిత పేలవమై తేలిపోతుంది.

 సారవంతమైన రచనలను పాఠకులు చదివి అభిప్రాయములు తెలుపుతూ 

ప్రోత్సహించితే మంచి రచనలు ఆస్యగ్రంధిని అలరించగలుగుతాయి.

 

మాటవరుసకు నేను గతము లో వ్రాసిన సంబాజి విషయమే

తీసుకొందాము. నావంటి ఒక అనామకుడు ఆయనను గూర్చి వ్రాసినా

వ్రాయకున్నా, చదువ వలసినవారు చదివినా చదువకున్నా ఆయన వాసికి వన్నె

తరుగదు. కానీ మనవాడయిన ఒక మహనీయుని గూర్చి పదుగురు

తెలుసుకోవలెనని తలచినాను. కానీ నాది వ్యర్థ ప్రయత్నమని అర్థమైపోయింది.

ఎందుకంటే, ఇందు మోడీ లేడు, రాగా లేడు, కచరా లేడు, నాచనా లేడు. పోనీ

చిరు, రాచ, అల్లు, మబాతారా, మొదలయిన ధనాపేక్ష కీర్తి కండూతి కలిగిన వ్యక్తి

కనబడడు. అందువల్ల చదువుటకు మనకు నిరాసక్తి. ఇందులో మీటూ (మాంసము)

మీటూ (Me too) లేదు. ఇక చదువుట ఎందుకు అనుకొని వుంటారు.

అది నిజమని నాకు అనిపిస్తుంది. అంతటి మహోన్నతమయిన వ్యక్తిని గూర్చి

తెలుసుకొన తలంపేలేని పాఠకులకు ఆయనను గూర్చి తగిన విధముగా తెలుపలేక

పోయిన నేను, ఆ అమహావీరుని, చనిపోయిన తరువాతకూడా అవమానపరచి

రెండవ ఔరంగజేబును కాలేను. అందుకై వ్రాయుట విరమించుచున్నాను.

ఆయనను గూర్చియే కాదు. దేనిని గూర్చి వ్రాసినా పాఠకులకు ఎందుకో మంచి

తెలుసుకొనవలెనంటే ఎదో ఉదాసీనత. అదే 'మోడీ పాలన బాగుందా లేదా అని

ఇక ప్రశ్న వేసి వదిలిపెడితే 200 మందికి తక్కువలేకుండా likes మరియు For and 

Against Comments వ్రాస్తారు. దీనివల్ల మన విజ్ఞానము పెరుగుతుందని నేను 

భావించను.

‘అజరామర సూక్తులు’, ‘సమస్య మనది సలహా గీతది’ మొదలగు అనేక 

మంచివిషయములను,  ఏ రూపములో వున్నా, ఎవరు వ్రాసినా చదువుట 

అలవరచుకొండి. మీరు నేర్చినది భావితరాలకు వ్యాప్తి చేయగలరు. ఈ సనాతన ధర్మ 

పరిరక్షకులు మీరే!

స్వస్తి.