Tuesday, 31 January 2017
రాభణ
Wednesday, 25 January 2017
కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరాఅందుకు వలయు ఉపకరణములు కూడావ్ ముఖ్యము.
కళ్ళు తెరచి కనరా--ఒళ్ళు మరచి వినరా –2
ఇది ఇప్పటి మన తెలుగు
పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మా తరము వారి ప్రతీక అని
ఉహించుకొంటే, అతను పాలు త్రాగుటకు ఏర్పడిన వివిధ విధములగు ఆలస్యములు వారి జీవితములో
ఏర్పడిన అడ్డంకులు అనగా ఉద్యోగమూ, సంపాదన, సంసారము, సంఘ గౌరవము, బంధుమిత్ర
సంబంధములు మొదలగు ఎన్నో విషయములుండేవి. మా తరములో కొన్ని అత్యంత అవసరాలకు
సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగము కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు
ముగియగానే ఉద్యోగము. ఉద్యోగము లేకుంటే కుటుంబము గడుచుట కష్టమైపోయేది. ఉద్యోగము
పెద్దదైతే పదవీ వ్యామోహము, చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి
చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క , శృంగార సాహిత్యమను పేరుతో అసభ్య
అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు వేరొక ప్రక్క, మాసపత్రికలు మరొక ప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలు
తలకెక్క, ఇక గ్రంథములు చదువుటకు
వేసలుబాటేదీ!
ఒక అదృష్టమేమిటిటంటే
ఉత్సాహమున్న వారికి చెప్పేవారు మా కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే
వారూ కూడా కను మరుగే.
ఒక వాహనచోదకుడు తాను బండి నడిపినంతకాలమూ
ఒకే ధ్యేయమే! తన గమ్యమును ఎటువంటి వడి-దుడుకు లేకుండా తన దృష్టిని మరల్చకుండా
సజావుగా పోతూ ఉండుట. ఆ వాహన చోదకునిగా మనల నూహించుకొంటే మన జీయిత గమ్యము వరకూ బండి
నడచినంతకాలమూ దృష్టి సంపాదనపైనే! అప్పుడు ఏమీ చేయలేని స్థితి వచ్చినపుడు చేతలుడిగి
మూలాన కూర్చుంటాము. అదే మనము ఒక పూలతోటకు మాలి అయితే రోజుకునొక పూల చెట్టువద్ద
దాని సౌరభామును ఆస్వాదిన్చుతూ ఆనందముగా గడుపవచ్చును. అందుచేత నేను
చెప్పవచ్చేదేమిటంటే డబ్బుగాక ప్రపంచములో భక్తీ జ్ఞానము వైరాగ్యము (సన్యాసము కాదు)
కూడా ముఖ్యము.
.......౩
కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా –౩
ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠనమో అవధానమో (అవధానము,కవి
సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి
సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఇప్పుడు
ఇంకా కొద్దిగా అవధానములను నిర్వహించేవారు వున్నారు. వారికి ధనము, పేరు, పలుకబడి పై
మక్కువ ఎక్కువ. వినేవారు మాత్రము తప్పక కొదవయిపోయినారు. ఏతా వాతా ఎవరయినా వచ్చి
కూర్చున్నా వారి అర్థమయ్యేది సున్న. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై
తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయ. వారిలో సంస్కారము మాయ. ఇవి
స్పీకింగ్లీష్ వాకింగ్లీష్ ఈటింగ్లీష్ రోజులాయె. దీనికి తోడు పిల్లలకు వెబ్బు లో
దొరికే గబ్బు మీద మోజెక్కువాయె. మా కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక
వారి పిల్లల కెంతెంత.
ఇది కాక కొందరు మహా
పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక నాటి ఆంగ్లేయాధికారుల మెప్పుకై
వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి
పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.
భాష వుంటే గ్రంధాలుంటాయి.
గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా లేక
ఆంధ్రులుగా గుర్తింపు వుంటుంది. లేకుంటే గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే
!
మోహము వీడి సంపదల, మొత్తము జీవితమంత
డబ్బుకై
దాహము చెందబోక తన దారిన దేహము
పోక ముందరే
ఈహను వీడుచున్ ఇహము ఈ క్షణమే
నిను వీడునంచు, దా
సోహము ఆ పరేశుడగు సుందరమూర్తికి
యంచు కొల్వరే!
స్వస్తి.
Monday, 23 January 2017
బాలుడైన గోపాలుని పాదాలకు అంకితం భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం
Friday, 13 January 2017
దాయం- దానం
***********************************************************************************************************************
విమర్శ, ఆక్షేపణ, నింద, ఖండన, సమీక్ష , అనంగీగారం, అభిశంసన, గద్దించు, దూషించు, అసమ్మతి; ఈ పదాల్లో సునిశితమైన అంతరాన్ని గుర్తించడానికి కూడా ఒక స్థాయి కావాలి.
వాతాపి గణపతిం భజే -- ముత్తుస్వామి దీక్షితులవారు
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నది బాదామి. బాదామి గుహాలయములకు ప్రసిద్ధి.
ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు,
బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో నిర్మింపబడిన, 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వము వాతాపి
అనే ప్రాంతము బాదామిగా సుపరిచితము. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ
శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా
ఉండేది.
బాదామి క్షేత్రం బీజాపూర్ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక బాదామి విశిష్ఠత గురించి
చెప్పవలెనంటే ఇచ్చటి గుహాలయాలు మనదేశములో మాత్రమే కాదు, ప్రపంచంలోనే
ప్రసిద్ధమయినవి. ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ
పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం.
చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. గణపతి, నటరాజస్వామి,
మహిషాసుర మర్దిని, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా
ఉంటాయి. ఈ వాతాపి గణపతిని గూర్చిన ముత్తుస్వామి దీక్షితులవారి ‘వాతాపి గణపతిం
భజే’ అన్న ‘హంసధ్వని రాగము’ లోని కీర్తన అత్యంత లోకఖ్యాతి గాంచినది.
1835 దీపావళి దినమున సంధ్యావందన పూజాదికములను ముగించి తన శిష్యులతో
లో చూడవచ్చు. ఇది కోయిల్పట్టి టూటికోరిన్ ల నడుమ వుంది.
స్వస్తి.