Thursday, 22 December 2016

ఆకాశం గగనం శూన్యం

ఆకాశం గగనం శూన్యం -1
పై మాట నేను బాల్యము నుండి వింటూ వచ్చినాను. అది ఒక శ్లోక భాగము అని నాకు ఆ వయసులోనే అనిపించేది. కానీ ఆకాశము శూన్యము లేక గగనము శూన్యము అని ఒక పదము వాడితే చాలు కదా, రెండెందుకు అని అనిపించేది. ఆకాశము నిజానికి శూన్యమే కాబట్టి.
వయసు పెరిగేకొద్దీ ఆ శ్లోకమును పూర్తిగా తెలుసుకోనవలెనన్న తపన కూడా పెరుగుతూ వచ్చింది. ఏమయితేనేమి స్నాతకోత్తర పట్టాకై  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలమున చేరి గ్రంధాలయమునకు పోయి పుస్తకముల చదివే వెసలుబాటు దొరకిన పిమ్మట అసలు విషయము తెలిసింది.
మనపూర్వులు అంటే క్రీస్తునకు ఎన్నో వేల సంవత్సరములకు పూర్వమే మనవారు సంఖ్యాశాస్త్రమును లోకానికి అందజేయుటయే కాక '0' ను ప్రసాదించుటయేగాక 1 నుండి 10^62 వరకు సంఖ్యలకు నామకరణము చేసినారు.  10^62 ను మహౌఘ అంటారు. చాలా కాలము తరువాత అరబ్బులు దానిని అనుసరించినారు.
మనము అవసరమగు సంఖ్యలను సులభముగా గుర్తుంచుకొనుటకు గూడార్థములో శ్లోకరూపమున బంధించి యుంచినారు మన పూర్వులు. ఈ పద్ధతులు పలు విధములుగా వున్నా ముఖ్యముగా రెండు పద్ధతులకు ఎక్కడలేని ప్రాధాన్యము ఏర్పడినట్లు తెలియవస్తోంది. అవి 1. కటపయాది సంఖ్యలు 2. భూత సంఖ్యలు.

ఆకాశం గగనం శూన్యం -2
కటపయాది సంఖ్యలు: శంకరవర్మ వ్రాసిన సద్రత్నమాల లోని ఈ క్రింది శ్లోకం, ఈ పద్ధతిని వివరిస్తుంది.
నజ్ఞావచశ్చ శూన్యాని సంఖ్యా: కటపయాదయ:|
మిశ్రే తూపాన్త్యహల్ సంఖ్యా న చ చిన్త్యో హలస్వర:||
అనగా, '', '', మరియు అచ్చులకు "సున్నా" విలువ ఇవ్వబడుతుంది. కటపయ తో మొదలు అన్ని హల్లులకు 1-9 వరకూ విలువలివ్వబడినాయి. సంయుక్త అక్షరాలు (వత్తులతో సహా) వచ్చినపుడు, వెనుక వచ్చిన హల్లుని మాత్రమే లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. పొల్లు అక్షరాలను విడిచిపెట్టాలి. ''ది నవ ''ది నవ ''ది పంచక ''ద్యష్టక అన్నది సూత్రము.
ఇక రెండవ విధానము 'భూత సంఖ్య'పంచ భూతముల పేరుతో ఈ విధానము ఏర్పడింది. ఆకాశమునకు విలువ '0' లేక శూన్యము. పృథివీ=1 ఆపస్సు= నీరు=2 తేజస్సు= వెలుగు=3 వాయువు=4 ఆకాశము =0 భూతము = 5. ఈ విధముగా చక్రవర్తి అంటే శత చక్రవర్తులు= 6 ఋషి=సప్త ఋషులు= 7 ఈ విధముగా వుంటాయి.
ఇక శ్లోకమునకు వద్దాము.


ఆకాశం గగనం శూన్యం3
ఆకాశం గగనం శూన్యం ---0
దిగ్సంఙ్ఞాపంక్తిరేవచ-- (దిక్=8 పంక్తిః=2 ఆకాశము, భూమి)= 10
ఎకాదశాఖ్యా రుద్రాశ్చ= 11 (రుద్రులు 11 మంది అని వేదములలో చెప్పబడింది)
మానార్కాః ద్వాదశాహ్వాయా= 12 (సూర్యులు ౧౨గురు, ద్వాదశాదిత్యులు అంటారు)
ఈ నాలుగు పఙ్తులే ఆ శ్లోకము.
'అంకానాం వామతో గతిః' అని చేబుతూవున్నది సంఖ్యా శాస్త్రము. అంటే అంకెలను కుడినుండి ఎడమకు లెక్కించవలెను.
 విధముగా తెలుసుకోనవలేనన్న తపన వుంటే ఏమయినా తెలుసుకోవచ్చు. లేకుంటే పతనమే!
స్వస్తి

చెరుకు రామ మోహన్ రావు

3 comments:

  1. Sir excellent
    ఇప్పటికైనా మన శ్లోకాలకర్థాలు తెలుసుకుంటే
    మన గొప్పతనం తెలుస్తుంది

    ReplyDelete
  2. గురువార్య, ఇప్పుడే t.v. lo సామవేదం గారు కాళహస్తీశ్వర వైభవం ఉపన్యాసంలో ఆకాశం అంటే శూన్యం కాదని వివరించారు.
    నాకు అనుమానం వచ్చి వెతగగా ఈ వ్యాసంలో తెలిసింది ఆకాశాన్నంటే శూన్యమని.
    ధన్యవాదాలు.

    ReplyDelete