కుమ్మరికొక
ఏడు గుదె కొకనాడు
https://cherukuramamohan.blogspot.com/2024/03/blog-post.html
పూర్వము
కుమ్మరివారు పలు విధములగు అమ్ముటకు యోగ్యమైన కుండలు చేయుటకు ఒక ఏడాది కాలమును
తీసుకొనే వారు. గుదె అన్నది అవి చేయుటకు ఉపయోగపడే కొరముట్టు లేక పనిముట్టు. అది
పట్టుకొనుటకు వీలు కలిగిన పిడితో ఉన్న దీర్ఘ ఘనపు దిమ్మె. దానితో ఎంతో ఎట్టయినా
దొంతరగా పేర్చిన నేలను తాకియుండు కొత్త
కుండల వరుసను కొట్టినట్లయితే మొత్తము సంవత్సరపు కృషీ నేలపాలే!
అదేవిధముగా
ఎంతో శ్రమకోర్చి వ్రాసే వ్యాసములను ఒక EMOJI తో కొట్టి వేయకుండా చదవండి. మన
పూర్వుల ఔన్నత్యమును గ్రహించండి.చేతనైన నాలుగు మంచిమాటలు వ్రాయండి. ఒక్క మల్లె పూల
సారము తన సౌరభామును ఎంతో దూరము వ్యాపిమ్పజేస్తుంది కదా! ఇది ముఖ్యముగా యువతకు నా
మనవి.
మనవి,మన్నింప
దగినవి, మరువలేనివి,మరువకూడనివి,మనశ్శాంతి కూర్చేవి ఈ విధంగా మనము తప్పకుండా తలపోస్తాము . కానీ ఈ
అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఏ వ్యాసమునైనా ఒకసారి చదివితే మీకే అవగతమౌతుంది. పై
విభాగములలో,దేనికైనా ,మీరు చదివిన
వ్యాసము చెందేతుగా వుంటే మీ అనుభూతి తెలుపండి. అట్లు చేయుటకూడా నా దృష్టిలో రచయిత
కొరకు గాదు. సాటి పాఠకుల కోసం. అది చూసి ఇంకా కొందరు చదువవచ్చు. ముఖ్యంగా మన
సంస్కృతి , మన భాష, తపోధనులైన మన మునుల
గూర్చిన విషయాలు చదివినప్పుడు అవి ఇంకా పదిమందికి పంచండి. ప్రవచనములలో లోకమాన్యత
పొందిన మాడుగులవారు,సామవేదం వారు, చాగంటివారు,
గరికపాటి వారి అత్యుత్తమ ప్రవచనములు ఎన్నియో, ఎంతమందో
వినివుంటారు. వారి పై ఎంతో ఆరాధనా భావమును పెంచుకొని వుంటారు. మరి అంతటి
గౌరవనీయులు,పుంభావ సరస్వతులు చెప్పిన విషయాలను ఎంతవరకు
గ్రహించుతున్నాము, ఎంతవరకు పాటించుచున్నాము అన్నది సమస్య.
చెప్పునపుడు,ఎంత వినవలెనని వున్నా మనసు తప్పుదారి
పట్టవచ్చునేమోగానీ వ్రాసినది చదివేటపుడు ఆ వీలు లేదు . ఎందుకంటే ఎక్కడైనా మనసు
ఒకవేళ చెదిరినా,తిరిగీ ఆ భాగము చదివే అవకాశము వుంటుంది .
విన్నది నచ్చవచ్చు గానీ, నచ్చినదంతా చెప్పలేము. వినే వ్యక్తీ
కూడా దొరకవలె . రచన ఐతే వీలు దొరికినపుడే చదవ వచ్చు . అందువల్ల నేను కోరేదేమిటంటే
మంచి వ్యాసము ఎవరు వ్రాసినవైనా నచ్చితే చదివి, బాగుంది
నలుగురూ చదవవలసినది అని నాలుగు మాటలు వ్రాయండి. బాగున్న వ్యాసాలు పదిమందికి
పంచండి. ఇది దయవుంచి నా వ్రాతలకు 'ప్రకటనగా' దీనిని భావించవద్దు. ఈ ముఖపుస్తకపు గోడపై ఎందరో పండితులు,అనుభవజ్ఞులు,విద్వాంసులు, ఎన్నో
మంచి విషయాలు , తమ వయును కష్టాన్ని లక్క చేయకుండా మంచిని
పంచావలెనను ఒకే ధ్యేయముతో వ్రాస్తున్నారు. మీరు చదివి ,పంచి,
సహకరించి అటువంటి వ్యక్తులను ఉత్తేజపరచితే తమ గ్లానిని కూడా మరచి
ఇంకా మంచి విషయాలు చెబుతారు .
మంచిని
పంచుదాం. మంచినిపెంచుదాం.
స్వస్తి.