Monday, 1 November 2021

తంబాకు – పొగాకు - Tobacco

 

తంబాకు పొగాకు -Tobacco

https://cherukuramamohan.blogspot.com/2021/11/blog-post.html

కాచే వారు కాపులు. అంటే కాపాడే వారు కాపులు. ఇది 'క్షత్రియ శబ్దమునకు తెనుగు 

అనుబంధ పదమని నా ఉద్దేశ్యము. ఈ 'కాపు' అన్నది ఒక విస్తారమైన వర్గము. 

ఇందులో 'రెడ్డి' 'కమ్మ' బలిజ' అన్న మూడు తేగలూ వస్తాయని నా ఉద్దేశ్యము. రాయలసీమలో రెడ్లను కాపులు అనుట కద్దు. 'కాపు'లనిఉత్తరాంధ్రలో 'బలిజ' అని రాయలసీమలో అనబడు తెగను 'కాపులు' అంటారు. ప్రకాశము లోని 'గుండ్లకమ్మ' మరియు గుంటూరు లోని 'పేరకమ్మ' ప్రాంతమును 'కమ్మనాడు' అన్నారు. ఇచ్చట ఎక్కువగా నివసించుచుండిన ఉన్న యుద్ధవీరులను కమ్మ వీరులు అన్నారు. కర్మ అనే సంస్కృత పదము యొక్క వికృతియే  పాళీలో కమ్మ. 'కర్మ' లేక 'కమ్మ' యనగా 'విధి' 'బాధ్యత' లేక 'కర్తవ్యము'. ప్రజారక్షణ వారి కర్తవ్యము. అందుకు కమ్మవారైనారు.  ‘కమ్మ’ అన్న పదమునకు చిన్నపాటి ఏరు’ అన్న అర్థము కూడా కలదు. అందువల్ల కూడా రెండు ‘కమ్మ’ల నడుమ ఉండుటచే కమ్మవారయినారు. అదేవిధముగా శ్రీకృష్ణదేవరాయల అత్యున్నత సైనికోద్యోగులు ‘నాయక రాజు’ లై పాలకులైనారు. 'నాయక రాజులు' రాను రానూ 'నాయుళ్ళు' అయినారు, రేనాటి చోళులుగా ప్రసిద్ధిగన్న యోధులు రాను రానూ 

'రట్టడులై' 'రెడ్లు' అయినారు. వీరందరి వృత్తి యుద్ధమే కాబట్టి, వీరు తమలో 

ఒకవిధమగు వేడి పుట్టుటకు ఆ గుణమును కలిగిన 'పొగాకును వాడ దొడగి 

యుంటారు.

భారత దేశము చంద్రగుప్త మౌర్యుడు (పాలనాకాలం 322BC - 298BC), ఆపైన విక్రమాదిత్యుడు (ఇంచుమించు క్రీ.పూ.5౦ 

క్రీశ 5౦) తరువాత అఖండముగా పాలింపబడలేదు. అన్నీ చిన్న చిన్న రాజ్యాలే! ఆ 

కారణముగా ఆధ్రదేశములోని ఈ వీరులకు తమ సంస్థానములలో పెద్ద పెద్ద 

సైనికోద్యోగులుగా ఉద్యోగములనిచ్చి రప్పించుకొని యుంటారు. ఈ విషయమై నేను 

వ్రాసిన ‘సరసరస’ అన్న వ్యాస సంపుటిలో వివరముగా చూడగలరు. ఈ విధముగా 

ఎందఱో వీరులు హిందూదేశ ఉత్తరార్ధమునకు వెడలుట జరిగినది. వారంతా నేటికీ 

ఆంధ్రుల పండగలను ఎంతో ఆరాధనతో జరుపుకొంటారు.

ఇక అసలు విషయమునకు వద్దాము.’ఆకు’ అన్నది అచ్చమైన తెలుగు పదము. తెనుగు 

నుండి అనేక పదములను అనేక భాషల వారు తీసుకొన్నా ఈ పదములు తెలుగునుండి 

తీసుకొనబడినవి అన్న కృతజ్ఞత వారు తెలియజేసిన దాఖలాలు నాకు కనిపించలేదు. 

అదే తెలుగు నిఘంటువులను పరికించితే మనము ప్రతి శబ్దము యొక్క మూలమును తెలుసుకొనవచ్చును. రెండు భిన్నప్రాంతముల ప్రజలు కలిసినపుడు తప్పక వారి వారి భాషలలో ఆదాన ప్రదానములు జరుగుతాయి. అది అందరూ జ్ఞాపకము ఉంచుకొనవలసిన విషయము.

నిజానికి ఆ పదము ‘ఆకు’ కాదు, ‘ఆఁకు’ అని వ్రాయవలెను. నేడు, తెలుగువాడయిన 

ప్రతియొకడూ ఒక భాషా నియంతయే! అందుకే మనము ఋ, , , , , , , 

అను 7 అక్షరములను శిగ్మాగుచేటనుకోకుండా, మాయము చేసినాము. ఇక్కడ ఒక్క విషయము తెలియజేస్తాను. నేటి బ్రిటిష్ ప్రధాని భారతీయ మూలములు కలిగినవాడు. ఆయన పేరును ఆంగ్లములో 'Rishi Sunak' గా వ్రాస్తారు. 'Rushi' అని వ్రాయరు. కారణం ఆ శబ్దము పలుకుటకు వ్రాయవలసిన'ఋ' అన్న అక్షరము వారికి లేదు. వారి పేరులో 'ఈ 'ఋ' నే  వాడవలెను. దీనిని పలుకునపుడు మన 'చెంపలు' లేక దవడలు' లేక గవదలు' కదిలించకుండా 'ఋ' నును పలికితే వచ్చే ధ్వనిని 'ఋ' కలిగియుంటుంది. మన కర్మ ఏమిటంటే 'RISHI  అని Type చేస్తే 'రిషి' ని వస్తుంది, నిజానికది 'ఋషి' అని రాయాలి. కన్నడములో 'ಋಷಿ(R̥ṣi)', మళయాలములో  ഋഷി( r̥ṣi) హిందీ సంస్కృతములలో ऋषि '(rishi) అని  అని సాంప్రదాయబద్ధముగా వ్రాస్తారు. ఒక 'telugu'లో మాత్రమీ ఈ 'తెగులు' కనిపించుతుంది. ఈ విధముగా telugu అపశబ్ద భూయిష్టమపోతే మనకు 'గొరగంగా మిగిలిన జుట్టే!'  దయతో నా ఆవేదన అర్థము చేసుకొండి. 

ఇక శ,ష,స ల విషయమునకు వస్తే ఆ అక్షరములన్నింటికి లుగా మనకు 

సులభముగా నోరుతిరిగే ఒక అక్షరమును పలుకుతాము, అది ఆ నాలుగింటిలో ఏదయినా కావచ్చు.

 సరే, తిరిగీ ఆఁకు వద్దకు వస్తే, ఈపదము’ఆనుకు’  నుండి పుట్టినది. ‘ఆనుకు’ ‘అంకు’ అయి ఆపై ‘ఆఁకు’ అయి అటుపిమ్మట ‘ఆకు అన్న రూపమును ధరించినది.

‘ఆనుకు’ లేక ‘ఆను’ అన్న మాటకు అర్థము, తినుట లేక త్రావుట అని. మోదుగ ఆకులు, మర్రియాకులు, బాదాము ఆకులు, తడాకులు మొదలగునవి కుట్టి, మరియు అరటి ఆకులు నేరుగానూ భుజించుటకు వాడుతాము. దాహము ఎక్కువై అందుబాటులో లోటాలు చెంబులు లేనపుడు, ఒక సెలయేటిలో నీరు ట్రావ వలసి వస్తే దగ్గరలో ఉన్న పెద్ద ఆకులు గల ఒక చెట్టుయొక్క ఆకును త్రుంచి  దానిని శంఖాకారములో మడచి దాహము తీర్చుకొంటాము. ఈవిధముగా అనుకు-ఆఁకు-ఆకు ఉత్పత్తి జరిగినది.

మరి ఇది తెలుగుపదమా కాదా అంటే ఈ పదముతో ఒక పద కుటుంబము ఏదయినా 

కలదా అన్నది చూడ వలసియుంటుంది. మొదట పరభాషలలో చూసి ఈ పద 

కుటుంబము లేదని నిర్ధారించుకొన్న పిదప తెలుగులో చూస్తె, సుమారుగానే ఉన్నాయి. 

అవి, ఆఁకు కూర, ఆఁకుటిల్లు, ఆఁకుఱాయి, ఆఁకుపచ్చ, మారాఁకు, పారుటాకు, ఉల్లాఁకు

కిల్లాఁకు, ఓలాఁకు, పరాఁకు, చిరాఁకు మొదలయినవి. అసలు అన్నీ ఉన్న ‘ఆకు’ అణిగి 

ఉంటుందన్న సామెత కూడా ఒకటి ఉన్నది. బతికి ఉంటె బలుసాకు తినవచ్చునన్న 

సామెత కూడా కద్దు. కావున వీటిని బట్టి ‘ఆకు’ అప్పటమైన ఆంధ్ర పదమని మనము 

నిర్ధారణ చేసుకొనవచ్చును.

ఇక పొగాకును గూర్చి తంబాకు ను గూర్చి ఆలోచిద్దాము. పోఆకు అనగా కాల్చితే 

పొగవచ్చు ఆకు కావున అది పొగాకు అయి ఉంటుంది. మరి అంతకు ముందు ఒక 

పేరు ఉండవలెను కదా! అది ఏమిటో చూద్దాము. పూర్వము ‘తమ్మ’ అను శబ్దమును తెలుగులో ‘ఉమ్మి’కి వాడేవారు. ఉమియుటకు వాడేవారు. ‘తమ్మలపు+ఆకు’ తమలపాకు అయినదేమో! ఇందులో పొగాకు కూడా వాడుట కద్దు. ఇదికాక తమలపాకు లేకుండానే ‘పొగాకు’ వాడుట కద్దు. అప్పుడిది ‘తమ్మ+ఆకు’=‘తమ్మాకు’ ఔతుంది. అదే కాలాంతరములో తంబాకు గా మారినది. మన వీర వర్గము ఉత్తర దేశములలో విస్తరించుట వల్ల వారి ద్వారా ఈ ‘తమ్మాకు’ తంబాకు’ యై వారి నోట నానుచున్నది. బాగా నమిలి నమిలి రసమంతా పీల్చి ఉమిసేదే కదా! ఇంతటి తో ఆగక ఇది ఐరోపాదేశములు చేరుసరికి ‘Tobaco’ అయి కూర్చున్నది. కావున ఆ పంట, ఆ పేరు తెలుగు వారిదే కానీ అన్యథా కాదు.

(ఈ వ్యాసములో భాషను గూర్చి తెలిపినాను తప్పించి పొగాకు గొప్పదనమును గూర్చి కాదు.)

స్వస్తి.