Monday, 1 February 2021

ప్రేమికుల దినము (Valentine's day)

 

ప్రేమికుల దినము (Valentine's day)

https://cherukuramamohan.blogspot.com/2021/02/valentine-day.html

ప్రేమ అన్నది ఒక అనిర్వచనీయమైన భావన. దానిని ఎక్కువగా Love అన్న ఆంగ్ల 

పదముతో పోల్చి అది కేవలము యువతీ యువకుల నడుమ ఏర్పడే ఆకర్షణగా 

భావించిన వారు అధికము. నిజానికి ప్రేమ అన్న పదమును మనము మన భారత 

దేశములోని సంస్కృతము లేక ఏ ప్రాంతీయ భాషలోనైనా భార్యా భర్తలు, అన్నాచెల్లెలు

అక్క తమ్ముడు, అమ్మ నాయన ల నడుమనుండే అనురాగామునకు అక్షర రూపము. 

పెళ్ళికాక ముందే ఏర్పడే భావనను కేవలము వాంఛ, మోహము, కోరిక, రతి

కామముగా పరిగణించవచ్చు. మన యువత ఈ విషయమును అర్థముచేసుకొనగలిగితే

ప్రేమికుల దినము (Valentine day), అన్న అనర్థము నుండి బయట పడగలుగుతారు. 

ఒక్క నిముసము ఆలోచించండి. ఈ Valentine day వచ్చిన తరువాత కూడా

Valentine's Day లేక Valentine Dday ను ఆంగ్లములో పుటక్షరాలలో వ్రాస్తే VD 

అవుతుంది. VD అంటే VENERIAL DESEASE అని కూడా అర్థము వుంది. ఇవి ఆడ మగ 

వివాహేతరములైన వివిధ విధముల స్త్రీపురుష సంగమము వల్ల వచ్చే వ్యాధులు. దీనినే 

నేటి ఆంగ్ల వైద్య పరిభాషలో SEXUALLY TRANSMITTED DESEASES అని అంటారు. 

ఒకనాటి మన దేశ ప్రధాని ఈ కారణముచే దివంగతుడైనట్లు చెబుతారు కానీ .నిజము 

దేవుడెరుగు.

మనదేశము లో Dating అన్న మహమ్మారి వ్యాపించిలేదు. ఇప్పుడు సాధారణ మధ్య 

తరగతి కుటుంబీకులలో కూడా ప్రబలుతూ వుంది.  ఈ Dating లో మిగత దాంపత్య 

జీవితములోని ముఖ్య అంశములతో బాటూ  శారీరిక వాంఛలు కూడా తీర్చుకొంటారని 

విన్నాను. మరి 6 నెలలో , సంవత్సరమో కలిసిణ తరువాత నచ్చకపోతే మరియొకరితో 

Dating. దీనిలో అర్థము ఉన్నదా అని ఆలోచించండి.

ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతుl

అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్ర తారకంll

మానవునికి జనన మరణములు సహజములు. ఆయువు అనిత్యము. అస్థిరము. 

సూర్యచంద్రులున్నంతవరకు, ఆకాశంలో తారకలు ఉన్నంతవరకు  నిత్యమైనది  

మానము. మానము అన్న మాటకు గౌరవము, కీర్తి. అన్న అర్థాలకన్నా స్త్రీ విషయములో 

స్త్రీయొక్క నడవడిక, లేక దాచుకోనవలసిన శరీరావయవములు అన్న అర్థమును 

తీసుకొనుట సముచితము. సాధ్వి ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టమును 'ద్రౌపది మాన 

సంరక్షణము' అంటారు కదా! బాల్యమున ఆడపిల్లలకు కట్టే సిగ్గు బిళ్ళను 'మానబ్బిళ్ళ

అనికూడా అంటారు. దీనివల్ల పూర్వము మానమునకు ఇంత ప్రాదాన్యమిచ్చినారు. ఇది 

నిజానికి స్త్రీపురుషులిరువురికీ అన్వయము. కానీ పురుషాధిక్య సమాజములో ఇది స్త్రీలకూ 

పరిమితమై పోయినది. నేడు స్త్రీలు కూడా దానిని ప్రతిఘటించక సామాజిక 

న్యాయముగా స్వీకరించినారు. అందువలననే కదా స్త్రీల విషయములో బలాత్కారము 

లేక Raping అన్న మాట వచ్చింది. రాబోయే కాలానికి స్త్రీలు కూడా బరితెగించి 

మగవాళ్ళను Rape చేస్తారేమో! నిన్న, ఒక పాశ్చాత్య దేశములో దైవ సమానమగు ఒక 

పాఠశాల ఉపాధ్యాయిని తన నగ్న చిత్రములను తన తరగతిలో చదివే, తనకిష్టమైన 

బాలురకు పంపి ఇంటికి రప్పించుకొని వ్యభిచరించిందట. నేను కంట తడి 

పెట్టుకొన్నాను. రేపు ఈ నీచ సాంప్రదాయము మనదేశాములోనికి అడుగుపెట్టదని 

గుండెమీద చేయి వేసి చెప్పగలమా! మనము పాశవికమగు జంతుసంస్కారములను 

అక్కున దాల్చుట లేదా! ఒక్క క్షణము ఆగండి. ఆలోచించండి. రుజుమార్గములో 

పయనించి మీకు, మీ కుటుంబమునకు, సమాజమునకు ఊరికి, దేశానికి మంచిపేరు 

తెండి. పైగా ఈడుకు వచ్చిన చిట్టి తల్లులకు ఒక  మనవి. స్త్రీ శారీరికముగా అబల. 

నలుగురు మీద పడితే ప్రతిఘటించుటకు శక్తి చాలదు. ఎందుకంటే జీవితము చలన 

చిత్రము కాదు. కావున సభ్య సమాజములో సంచరించునపుడు ప్రత్యేక ఆకర్షణలు కల 

మీ దేహమును మనదేశ సాంప్రదాయమును ప్రతిబింబించే వస్త్రధారణను తిరిగీ అలవాటుచేసుకొండి. సీత వేషధారి సంస్కారవంతమగు మాటలు మాట్లాడుతుంది. తాటకి వేషమును ధరించి కోమల భావములను ప్రతిబింబించలేదుకదా!

తిరిగీ ప్రేమ విషయానికి వస్తే, ప్రేమల పేరిట నేటి సమాజంలో జరుగుతున్న 

అఘాయిత్యాల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమలు అంతకంతకూ వెర్రితలల్ని వేస్తూనే 

ఉన్నాయి. ఇటువంటి విషమ,విపత్కర, విపరీత  పరిస్థితుల్లో విదేశాల నుండి దిగుమతి 

అయిన ‘వాలెంటైన్స్ డే’ (ప్రేమికుల రోజు) అనే పండుగ సామాజికంగా మరిన్ని 

అవకతవకలకు అవకాశాల్ని కల్పించటమే గాక పరాయి సంస్కృతి పై మన అవగాహనా 

రాహిత్యాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉందేమో!

అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... ఇదొక అంటు జాడ్యపు దండుగ  పండుగ’’.  దీనికి 

అతిచిన్న ప్రాధాన్యత కూడా ఇవ్వ కూడదు. మన దేశపు పర్వదినముల వలె అర్థవంతము

సందర్భోచితమైనవి ఇవి కావు. ఈ క్రింది విషయమును గమనించండి.

 మిగిలినది రేపు.......

2వ భాగము

 వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థు డొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధార 

పోసినాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14 గా స్థిరపరచుకుని ఆ రోజున 

అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు 

చెప్పుకుంటున్నారు. వీరు చెప్పే ఈ అంశంలో నిజము నేతి బీర లోని నెయ్యి మాత్రమే! 

చరిత్ర పుటలను తిరగివేస్తే  అసలు విషయం బయలుపడుతుంది. వాలెంటైన్ వివరాలు 

కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు. 3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో 

ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో 

వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ 

వాలెంటైన్ ఒక రోము దేశ సామాన్య పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా 

ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 చే 

వధించబడినాడు. దీనికి ఒక  కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ 

వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా 

ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన 

సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించే వాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ 

వాలెంటైన్‌ ను వధించినాడు. దీన్ని బట్టి చూస్తే, 2వ వాలెంటైన్ ఒక పెళ్ళిళ్ళ బ్రోకరు 

అని తెలుస్తుంది. ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు కాబట్టి  

ఈతని ఘనతను గూర్చి నా పరిశోధన ఫలించలేదు.

ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కడూ  అమర ప్రేమికుడు అని చెప్పుటకు అర్హత 

లేనివాడే! ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన లేక  చచ్చిన తేదీలు కావు.

ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్త్రీలకు 

ప్రాతినిధ్యము వహించే  దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో పై ఉన్న భక్తి శ్రద్ధలతో 

ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. 

ఫిబ్రవరి13 నుండి15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే 

వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఈ విధముగా 14వ తేదీకి 

ప్రాముఖ్యత వచ్చింది. క్రమేణా ఆ జాడ్యము  మన ఆధునిక సాంప్రదాయ, సాంస్కృతిక  

గురువైన అమెరికా కు ప్రాకింది. అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియ 

బరచు కొనుటకు  ఆ రోజున ప్రేమ కార్డులను పంచడము  మొదలు పెట్టినారు. 

‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో వాలెంటైన్‌ అన్న పేరును మాత్రము  

తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 

14వ తేదీకీ ముడి పెట్టి పుణ్యం కట్టుకున్నారు లోకాన్ని వెర్రివాళ్ల గా తయారు చేయగల 

ధీమంతులు. ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14... ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. 

అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన 

చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించినాయి. 

చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించినారు.

 అసలు ఇటువంటి పండుగలు ముఖ్యమగా క్రైస్తవ సాంప్రదాయమైన Greeting Cards, 

Cornations Exchange, News Paper Ads, Pubs, Clubs ను ఉద్ధరించుటకు 

తప్పించితే వేరెందుకూ కాదు.

 మిగిలినది రేపు .....

 3వ భాగము - చివరి భాగము

గోర్రెదాటుకు అలవాటుపడిన  మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ 

ముదిరి పాకాన పడుతూ వుంది. Google నుండి సేకరించిన ఈ వాస్తవాలను చదవండి.

Lupercalia was a very ancient pre-Roman pastoral festival, observed on 

February 13 through 15, to avert evil spirits and purify the city, releasing 

health and fertility. Lupercalia subsumed Februa, an earlier-origin spring 

cleansing ritual held on the same date, which gives the month of February 

(Februarius) its name. Pope Gelasius I—who was pope from March 492 to 

his death in November 496—suppressed the Pagan festival and 

Christianized it by associating it with a martyred priest Valentine of Rome 

who was said to have received a rosary from the Virgin Mary.

 In Roman mythology, Lupercus is a god sometimes identified with the 

Roman God Faunus, who is the Roman equivalent of the Greek God Pan. 

Lupercus is the god of shepherds. His festival, celebrated on the anniversary 

of the founding of his temple on February 15, was called the Lupercalia. His 

priests wore goatskins. The historian Justin mentions an image of "the 

Lycaean God, whom the Greeks call Pan and the Romans Lupercus," nude 

save for the girdle of goatskin, which stood in the Lupercal, the cave where 

Romulus and Remus were suckled by a she-wolf. There, on the Ides of 

February (in February the ides is the 13th), a goat and a dog were sacrificed, 

and salt meal cakes prepared by the Vestal Virgins were burnt.

 ప్రేమికులు అన్న పేరు వినిపిస్తూనే  ప్రతి యొక్కరూ  ‘‘లైలా మజ్ను, రోమియో 

జూలియట్’’ అని చెబుతారు. రోమియో జూలియట్ ల కథను నికోలస్ రో, చార్లెస్ 

గిల్డన్, లార్డ్ కేమ్స్ మొదలయిన వారి తీవ్ర విమర్శలకు గురియైనది. శామ్యూల్ జాన్సన్ 

అన్న విమర్శకుడు మాత్రము దీనిని పొగిడినాడు.  అసలు పొగిడినా తెగిడినా అసలా 

కథలో వాస్తవికత మృగ్యము. షేక్‌స్పియరు తన వర్ణనలతో, క్రొత్త పాత్రలతో ఆ కథకు 

నాటకీయతను ఆపాదించినాడు. ఇది అసలు మన సంస్కృతిని ప్రతిబింబించదు.

ఇక లైలా మజ్నుల కథ పర్షియాకు చెందినది. దానిని ఎంతో మంది చిలువలు పలువలు 

చేసి వ్రాసినారు. హతేఫీ అను పర్షియన్ రచయిత వ్రాసిన ప్రతిని మన దేశములో 

ప్రచురించి సర్ విలియం జోన్సు గారు దీనికి అత్యంతమైన ప్రాచుర్యము ప్రాధాన్యత 

చేకూర్చినారు.

Hatefi’s (d. 1520) version of romance of the couple became popular in 

Ottoman Turkey and India. Sir William Jones published Hatefi's romance in 

Calcutta in 1788. (Wiki)

రోమియో జూలియట్, లైలా మజ్ను లు ప్రేమకు ప్రతీకలై కూర్చొన్నారు.

మనకు పొరుగింటి పుల్లగూర రుచి కదా! అందువల్ల మన వారికి మన హిందూ 

ప్రేమికుల పేర్లేవీ మచ్చుకయినా తెలియవు. రాణీ సంయుక్త, పృథ్వీరాజుల పేర్లు ఎంత 

మందికి తెలుసునో నాకు తెలియదు. హీన స్వభావుడైన సంయుక్త తండ్రివల్ల పృథ్వీరాజు 

మరణము, దేశమునకు ముస్లీముల పరిపాలనము సంక్రమించినది. నిజమైన అమర 

ప్రేమికులు వారు. వారు తమ పవిత్ర ప్రేమను గెలిపించుకుని పెళ్ళి చేసుకుని, కాపురం 

చేశారు. కానీ వారిది Dating ప్రేమ కాదు. ఒకరిని గూర్చి ఒకరు తెలుసుకొని మనసులో 

దంపతులు కావలెనని ఏర్పరచుకొన్న ప్రేమ, రుక్మిణీ శ్రీకృష్ణుల వలె. దేశభక్తులైన 

వీరిద్దరూ విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి వీరస్వర్గం పొందటము జరిగింది.

అసలు అంతగా ‘ప్రేమికుల రోజు’ అనే పండుగ చేసుకుని తీరాలని భావిస్తే ‘న భూతో న 

భవిష్యతి’ అనే విధంగా ఎన్నో ప్రేమలను విజయవంతం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని 

జన్మదినాన్ని (శ్రీకృష్ణాష్టమిని) ‘ప్రేమికుల రోజు’గా నిర్వహించుకుంటే పుణ్యం, పురుషార్థం 

లభిస్తాయి. శ్రీ కృష్ణుడు తనను మనసారా ప్రేమించిన రుక్మిణిని వీరోచితంగా 

చేపట్టినాడు. అర్జునుణ్ణి ప్రేమించిన తన చెల్లెలు సుభద్రకు ఎదురైన అడ్డంకులను 

చాకచక్యంగా తొలగించి, విజయవంతంగా వివాహం జరిపించినాడు. కావున శ్రీ 

కృష్ణుడు ‘నిజమైన ప్రేమకు ప్రతీక!’ మనం ప్రేమికుల రోజు జరుప దలచుకుంటే ఆయన 

జన్మదినమైన కృష్ణాష్టమికి  మించిన మంచిరోజు ఉంటుందా! 16,000 వేలమంది 

గోపికలు మధురభక్తి తత్పరులు కానీ జుగుప్సాకరమగు లైంగిక సంబంధము 

కోరినవారు కాదు.

ఈ ‘ప్రేమికుల దివసము’ శుష్కము క్షణికము అయిన లైంగిక సంబంధమునకు 

ప్రాకులాట తప్పించి వేరేమీ లేదు. అందుకే  బాధ్యత గలిగిన తల్లి దండ్రులు ఈ విధముగా 

తమ పిల్లలకు అవసరము లేని స్వతంత్రమును ఇచ్చుట సమంజసమా? అని ఒక్క సారి 

ఆలోచించితే మంచిది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొనీ లాభము ఉండదు. ఈ 

వయసులో తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా తమ పిల్లలతో స్నేహితము పెంచుకుంటే 

అంత మంచిది. అసలు అటువంటి రోజున కుటుంబము అంతా కలిసి ఒక గుడికో

గోపురానికో, గురువు దగ్గరికో వెళ్ళితే పిల్లలో వుండే అనైతిక ఆలోచనలకు అడ్డుకట్ట 

వేసినట్లౌతుంది.   లైంగిక పరమైన ఉత్తేజమును కలిగించే కథలు, కవితలు వ్రాయుట

ప్రచారము చేయుట మొదలైన పనులను ప్రచార సాధనాలు నిలిపితే, నిజమునకు

దేశమున కెంతో మేలుచేసిన వారవుతారు.

ఎంతో ప్రగతిని సాధించవలసిన యువత అధికముగా గల (దాదాపు 65%) ఈ దేశమున 

ఈ విధమైన సాంప్రదాయమునకు దోహదము చేయుట దేశమును నిర్వీర్యము చేయుటే !

 మహనీయుడు వివేకానందుడు చెప్పిన Relationships are more important than 

life, but it is important for those relationships to have life in them….

అనుబంధాలు జీవితమునకు అవసరమైనవి. ఆ అనుబంధాలలో జీవము కూడా అంతే 

అవసరము. అసలు ఈ దివాసాలు పలు విధములగు Greeting Cards, Carnations 

అమ్మకములు కోట్ల రూపాయలలో జరుపుతాయి తప్ప వీనివల్ల జరిగే మంచి మృగ్యము.

ఈ మాటతో ఈ విషయాన్ని ముగిస్తున్నాను .

స్వస్తి.