క్రైస్తవము-క్రిస్మస్ పండుగ - 1వ భాగము
https://cherukuramamohan.blogspot.com/2020/12/blog-post_20.html
సనాతన ధర్మావలంబులగు పాఠకులకొక విన్నపము. క్రిస్మస్ దగ్గరికి వస్తూవుంది. శాంటాక్లస్ పిల్లలకు ఇంకా దగ్గరికి వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చి ఉంటాడు. మీరుకూడా మీ పిల్లలుఆతని వద్దనుండి గ్రహించే బహుమతులు చూసి సంతోషించి కూడా వుంటారు. ఆవిధముగా పిల్లలుఆ బహుమతులు తీసుకొను నపుడు మీరు ఉదాసీనతతో వ్యవహరించినారంటే ఆ లేత హృదయములో ఒక ఆకర్షణను ఆ మతము పై మీరు కలిగించుచున్నట్లే! మీరు తిరుమల లడ్డు ఇచ్చినా వారు తీసుకోరు మరి మనము ఆ బహుమతులకోరకు పిల్లలను ఉసిగోల్పుట తగునా! మరి అటువంటి పెద్దలలో ఎంత
మంది శాంటాక్లాస్ కు క్రిస్మస్ కు సంబంధము ఏమిటని ఆలోచించినారోతెలియదు. అసలు మన పండుగ కాదుకదా మనకెందుకు అందులో భాగస్వామ్యమన్న దృష్టి తోఆలోచించము. మన సంక్రాంతి, మన ఉగాది, మన శ్రీరామ నవమి, శివరాత్రులలో వారు పాలు
పంచుకొంటున్నారా! మరి మీరెందుకు చేస్తున్నట్లు? వారు తెచ్చిపెట్టుకొని చేసుకొంటున్న పండుగలు రెండే. ఒకటి క్రిస్మసు రెండు New Year’s Day. రెండూ కృత్రిమమే! నేడు నేను మొదటి దానిని గూర్చి సవిస్తారముగా తెలియజేసే ప్రయత్నములో ఈ దిగువ లింకును మీ ముందు వుంచుచున్నాను. నాకు చేతనయినంత సమగ్రముగా వ్రాయుట చేత వ్యాస విస్తరించింది. అయినా ఓపిక తెచ్చుకొని చదివేది.
ఒక కట్టడమునకు పునాది ముఖ్యము. మరి ఈ మతము యొక్క పునాది ఎంత లోతు అన్నది తెలుసుకొని మీ ధర్మము యొక్క పునాదులు ఎంత గట్టివో ఎంత లోతైనవో తెలుసు కొనేది.
ధర్మఏవ హతోహంతి ధర్మోరక్షతి రక్షితః.
తస్మాధ్ధర్మోనహంతవ్యోమానో ధర్మో హతో వధీత్
ధర్మాన్ని చంపేస్తే అది మనల బతకనీదు. దానిని రక్షిస్తే అది మనల కాపాడుతుంది.
మరొక్కవిజ్ఞప్తి . సావకాశముగా చదువుతారని శ్రమకోర్చి ఈ వాస్తవాలను మీ ముందుంచుచున్నాను. ముఖ్యముగా నేటినుండి 25 వ తేదీ వరకు, ఆ తరువాత కూడా ఈ దిగువ కనబరచినలంకె లోచదువుతారని నమ్ముచున్నాను.
క్రైస్తవము-- క్రిస్మస్ పండుగ
మతము అన్న మాటకు స్థూలముగా అభిప్రాయము అని అర్థము. ఈ అభిప్రాయమును తమ విజ్ఞత ననుసరించి సామాన్యులకు దిశానిర్దేశము చేయగలిగినవారు దేవ దూతలు, ప్రవక్తలు కగలుగుతారు. ఈ విధముగా తెలియబరచిన అభిప్రాయమును హృదయపూర్వకముగా అంగీకరించి ఆ మతమును అక్కున చేర్చుకొంటేదానివల్ల వ్యక్తికి గానీ సమాజమునకు గానీ దేశమునకు గానీ ఎటువంటి నష్టము వాటిల్లదు. పై పెచ్చు ఎంతో మంచి కూడా ఒనగూరవచ్చు. అట్లు కాకుండా కత్తి యంచు కంఠానికి ఆనించి 'తాతను చూపుతావా తద్దినము పెడతావా ' అనుట వల్లనే ప్రజలలో ఎకాభిప్రాయములేక ఎవరి మతము వారిదై పోయింది . పూర్వము అంటే ఒక 50 నుండి 100 సంవత్సరాల కాలములో
ఆంగ్లములో గొప్ప చదువులు చదివిన వారు , ఆంగ్ల వైద్యమును అభ్యసించినవారు భారతీయుల నిత్య నైమిత్తిక జీవితములోని కొన్ని పద్ధతులను ఎద్దేవా జేసేవారు. అప్పటి ప్రజలు కూడా అది నిజమేనేమో అనుకొనేవారు. అసలు ఇప్పటికీ అలాంటి వారున్నారు. కానీ ఇప్పుడు మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయముల గురించి చర్చించుకుందాము. క్రైస్తవం యూదుమతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో చెప్పవలసి వస్తేయూదు మతము యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతము నుండి మత గ్రంథములను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథములతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతముల నుండి కూడా కొన్ని విషయములను తీసుకున్నారు. ఉదాహరణకు , క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం , ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి
విషయాలను ఇతరుల నుండి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం
అభివృద్దిలో మంచితో పాటు చెడు పద్దతులు కూడా పొందుపరచినారందున. నేడు ఆ
మతానుయాయులు ఎన్నో విధములగు భ్రమలు కల్పించి, వారి అధిష్టానము నుండి తాము చేయు పనులకు ఆమోదము పొందకనే ఎన్నో విధములగు ఈ సనాతన ధర్మపు
నియమములను తమవిగా చెప్పుకొని జన సముదాయములోనికి చొరబడుచున్నారు. కారణము విదేశ సంస్థ్లలనుడి వారండుకొనే ధనపు సంచులు. మరి వారిలో, వారి మతములో నీతి నిజాయితీకి స్థానము కలదో లేదో వారి ఊహకే వదలవలసిన విషయము. నా లేఖనము యొక్క ప్రధానోద్దేశ్యము క్రిస్మస్ పండుగను గూర్చి వ్రాయుటయే కానీ అన్యథా కాదు. క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి మాట్లాడుకొనుటకు ముందు క్రైస్తవులు అంటే ఒకే వర్గమా లేక వివిధ వర్గములా అన్నది ముందు చూద్దాము.
క్రైస్తవులు రెండు విధములు. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish
church), మోర్మోనులు(Mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(Russian orthodox), జెహొవా విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్ (orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), బెర్షిబాలు(Beersheba)
ప్రెస్బిటేరియనులు(Presbyterian), రోమను క్యాథలిక్కులు (Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్ ఆర్తోడాక్స్(Eastern Orthodoxy), పెంతెకోస్తు(Pentecostals). ఇవి కేవలం కొన్ని
మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. క్రీస్తు పుట్టుకకు సంబంధించిన నిజానిజాలు కూడా వేరొక పర్యాయము చర్చించుకొందాము.
క్రైస్తములోని మనకు తెలియని కొన్ని వాస్తవాలను గూర్చి తెలుసు కొందాము. క్రైస్తవము యూరపు మొత్తాన్ని దాదాపు పది శతాబ్దాలు పరిపాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవమును అధికార మతముగా ప్రకటించి దేశమును వారే ఏలేవారు, అట్లు రాజ్య పాలకులు క్రైస్తవులు కాకపోతే స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల
కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఏ
శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో కూడా ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాల మీదనే ఆధారపడి వుండినవి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్దం చేసింది. అంటే అప్పటికి వాటికన్, పొప్ ల వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇటువంటి విషయములు వాటికన్ వారు మనకు తెలియుటకు ఇష్టపడరు. ఇవి కాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ఇంక్విజిషన్ (Spanish Inquisition), క్రూసేడులు, బానిసత్వము, విచ్ హంట్(Witch
Hunt) మొదలైనవి. గోవా ఇంక్విజిషన్ ను కూడా ఇందులో చేర్చవలసి యుంటుంది.
గోవా అన్న పేరు వినగానే మనకు గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు. కానీ ఆ అందాల, ఆకర్షణల వెనుక భయంకరమైన చరిత్ర ఉంది. లక్షలాది హిందువుల జీవితములు క్రైస్తవమత ఛాందసత్వమునకు బలియైనాయి. ఈవిషయము ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు. తెలిసినవారు తక్కువ అన్న నమ్మకముతో సంక్షిప్తముగా తెలియజేయుచున్నాను.
భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన వచ్చిన క్రైస్తవులు (పోర్చుగీసువారు. ఈ దేశము సంపదలకు నిలయమని కనుగొన్నాడు వాస్కోడగామా. అందుకే అంతులేని సంపదను ఒకటి బట్టు మూడుమార్లు వచ్చి తన మాయోపాయములచే ఇచ్చటి సంపద దోచుకొన్నాడు. వీరు రానురానూ స్థానికముగా ఏలే రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకుని భారతదేశాన్ని ఆక్రమించారు. ఆవిధముగా గోవాను ఆక్రమించిన తరువాత అచ్చటి ప్రజలను క్రైస్తవము లోనికి మార్చవలెనని పొర్చీగీసు వారు గోవా ఇంక్విజిషన్ ను ప్రవేశ పెట్టినారు. ఈ విషబీజమును 1542 లో ఫ్రాన్సిస్ జేవియర్ అను పాస్టరు పోర్చుగీసు రాజు అయిన జాన్ – 3 మెదడులో నాటినాడు. 1560 – 1820 వరకు గోవాలో గోవా ఇంక్విజిషన్ అమలు అయ్యింది, అంటే దాదాపు 300సంవత్సరాలు ఇది అమలులో వుండినదన్నమాట.
ఫ్రాన్సిస్ జేవియర్ హిందువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు “హిందువులు జాతి అపవిత్రమైన జాతి. వారు నల్లగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. హిందువులు పూజించే విగ్రహాలు దెయ్యాలు. వాటినుండి నూనెతో కూడిన అసహ్యమైన వాసన వస్తుంది”. విసరి ఆంటీనియో డి నోరహ అనే పాస్టర్ ఇందులో భాగంగా ఓ కొత్త చట్టమును తెచ్చినాడు. దాని ప్రకారము హిందువుల దేవాలయాలను మూసివేయాలి. కొత్త దేవాలయాలు కట్టకూడదు. పాత దేవాలయాలకి మరమ్మతులు చేయకూడదు. అలాగే హిందు దేవాలయాల్లో వుండే బంగారము మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి రావాలి. సంస్కృతము, మరాఠి, కొంకణి భాషలో ఉన్న మన సాహిత్యాన్ని, శాస్త్ర పురాణాదులను తగులబెట్టినారు. కుటుంబములో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారి ఆ పిల్లల్ని చర్చి, పాస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్లను క్రైస్తవు లుగామార్చి వారి ఆస్తిని చర్చి జప్తు చేసుకునేవారు.! గ్రామాధికారులు అందరూ క్రైస్తవులనే ఉంచేవారు. కోర్టులో క్రైస్తవులకు మాత్రమే సాక్ష్యం చెప్పే అధికారం ఉండేది. హిందువుల మందిరాలను కూల్చి స్థానంలో చర్చిలు కట్టుకునేవారు ! హిందువులు క్రైస్తవం స్వీకరిస్తే తప్ప పెళ్లి చేసుకొనకూడదు. ఈ హింస మూడు వందల సంవత్సరములు జరిగినది. వారు ఊచకోత కోసిన లక్షలాది హిందువులలో బ్రాహ్మణుల సంఖ్య లెక్కకు మిక్కుటము. చూడండి ఎంత దయాభరితమైన మతమో అది. ఇంత జరిగినా అక్కడి హిందువులు అంతరించి పోలేదు. అది ఈ జాతి గొప్పదనము.
మనము క్రైస్తవులలో ఎన్నో వర్గాములున్నాయని ఇంతకు మునుపు చెప్పుకొన్నాము. మరి అసలుక్రీస్తు ఒకడే అయినపుడు క్రైస్తవములో ఇన్ని విభాగాలెందుకు. మొదట రోమన్ కాథలిక్కు మతము మాత్రమే వుండేది కానీ దానితో ప్రప్రథమముగా విభేదించినవాడు మార్టిన్ లూథర్ . ఇతను క్రైస్తవ సన్యాసి ,వేదాంతి , మరియు ప్రచారకుడు. ఇతను కాథలిక్కు మతముతో విభేదించి స్వంత కుంపటి లూథరన్ చర్చ్అన్న పేరుతో పెట్టుకొన్నాడు. తరువాత ఇంకా కొందరు రాను రాను తమ స్వంత కుంపట్లను రాజేసుకొన్నారు. అందులో మెథడిస్ట్ ఒకటి. దీని వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ. ఈయన ఆధ్యాత్మిక అభివృద్ధికి నిర్దుష్టమైన మార్గములు, కార్యాచరణ కలిగి యుండ వలెనని చెప్పినాడు. ఇక వేరొక ఉపమతము Presbyterians అంటే మత పెద్దలు అని అర్థము.
ఇందు పెద్దతనమునకు ప్రాముఖ్యత నొసగినట్లు తెలియవచ్చు చున్నది. అదే విధముగా
బాప్టిస్ట్ చర్చి అంటే మత తీర్థమును పుచ్చుకోన్నవారిని పునీతులను చేయుట. మంత్ర
జలమును ఆయా వ్యక్తులపై జల్లి లేక వారిని పవిత్ర జలమున ముంచి పునీతులను జేయుట. ఏ మంత్రములు జపించుటచే ఆ జలము మంత్రజలమైనదో నాకు తెలియని విషయము. పైగా మంత్రము అన్న సంస్కృత పదమునకు ‘మననేన త్రాత ఇతి మంత్రం’ అని వేదాంగ భాగమైన నిరుక్తి తెలుపుతుంది. మరి ఆ అర్థము వచ్చే ఆంగ్ల పదమే లేదుకదా! క్రైస్తవములోని శాఖలనుగూర్చిఈవిధముగా చెప్పుకొంటూపోతే ఎన్నో వర్గములు ఇంకెన్నో మార్గములు. కానీ ఈ విధముగా చేయమని లేక చేయ వచ్చని వారందరు ప్రామాణికముగా భావించే బైబిలు లో వారు చేసే చాలా విషయాలు చెప్పినట్లు ఎక్కడా కానరాదు. దీనిని చూస్తే ఈ క్రైస్తవ వర్గాలను ఐస్క్రీము సిద్ధాంతమునకు పోల్చవచ్చునేమో! ఇదేమిటి ఈ ఐస్క్రీము సిద్ధాంతమని అనుకోవద్దు. ఐస్క్రీములోఎన్నో flavor లు ఎన్నెన్నో వెరైటీలు . కానీ ఐస్క్రీము అమ్మకము మాత్రము పెరుగుతూనేఉందికదా! ఏ variety కొన్నా లేక తిన్నా ఐస్క్రీము కొన్న\తిన్నా అంటారుగానీ, ప్రత్యేకముగా అడిగితే తప్ప ఫలానా ఐస్క్రీము అని చెప్పరు కదా! బహుశ ఇదీ అంతేనేమో! ఈ విషయములను లోతుగా పరిశీలించితే క్రీస్తు అనుయాయులకు ఆధిపత్యమును గూర్చి తప్పితే ఆత్మా- పరమాత్మ లను గూర్చి తెలుసుకోవలె నన్న ఆలోచన ఉన్నట్లు అనిపించదు. నిజము వారి దేవుడెరుగు.
ఇక మనదేశానికి వస్తే, కేథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా
ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. గోవా ఇంక్విజిషన్ ను గూర్చి ముందే తెలిపినాను. ఇది కాకుండా వారు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టిన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నది ఒక అభూతకల్పన. ఈ రెంటికీ తోడు. పోర్చుగీసు ను గూర్చి GOOGLE లో నేను సేకరించిన ఈ విషయమును యథాతథముగా మీ ముందు ఉంచుచున్నాను, చదవండి :
Alliance ministry in Portugal is primarily funded through the Great Commission Fund. Help fulfill Jesus' Great Commission and make a gift to the GCF (Global Christian Forum (GCF) is a unique gathering of global Christian churches and organisations bringing together all the major streams of world Christianity. ) today.
మిగిలినది మరొకమారు.........
క్రైస్తవము-క్రిస్మస్
పండుగ - 2వ భాగము
అంటే పోర్చుగీసుకు మతాంతరీకరణలకు గానూ లోపాయకారిగా GCF నుండి
ఎంతటి మద్దత్తు లభించుతూ వుందోగమనించండి.
ఏసుక్రీస్తు అందరినీ
మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే ఏసు మాటలకు వ్యతిరేకంగా
ఉన్నట్లు కనబడుతుంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందినారు. 3వ
శతాబ్దానికి చెందిన కాన్స్టంటైన్ (Constantine I) క్రైస్తవాన్ని రోము
యొక్క అధికార మతంగా ప్రకటించిన మొదటి రాజు. ఆయన క్రైస్తవాన్ని పాటించని వారిని
తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు
Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా
ప్రవేశపెట్టినాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో
క్రైస్తవానికి ఎదురులేక పొయింది.
ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా
ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం
రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం
పాకింది. సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం
చేసినారు, కాని రెండు వందల సంవత్సరాల లోపే రోము
సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు
క్రీస్తును చంపినందుకు పగసాధించినామని. అసలు క్రీస్తు చరిత్రకు అందుతాడా అన్నది ఒక
అంతుచిక్కని ప్రశ్న. అది వేరోకసారి చర్చిన్చుకొందాము వీలును బట్టి.
క్రైస్తవం యూదు మతం నుండి
వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు
చంపించబడ్డాడని
క్రైస్తవులకు నేటికీ యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో అవకాశం దొరికిన ప్రతీ సారీ క్రైస్తవులు
యూదులను చంపుతూనే వున్నారు. క్రైస్తవులు మత గ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదు మతస్థులను చంపినారు.
హిట్లర్ పాలనలో 6 కోట్ల మంది యూదులను హతమార్చినాడని ప్రతీతి. అప్పటి జర్మనీలో ఉన్న
చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకోదగ్గ
సహాయం యూదులకు చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపినాడు. క్రైస్తవం తనకు
అన్ని ఇచ్చిన యూదుల ఋణము ఈ విధంగా తీర్చుకున్నది.
చరిత్రలోక్రైస్తవులు చేసిన
మరికొన్ని పనులు
చూద్దాం. పోప్ ఇన్నోసెంట్ iii ఆల్బిగెన్షియన్ క్రూసేడు(Albigensian
Crusade) అన్న యుద్దమును తమ క్రిస్టియను మత విభాగమైన CATHERISM పై ప్రకటించి పైశాచిక పరమైన రీతిలో చంపినారు. దీనిని ఉత్సాహవంతులు
వికీపీడియా లో చదవవచ్చు. అయ్యా అసలైన కేథలిక్కులను వారితో విభేదించిన వారిని
ప్రత్యేకముగా గుర్తించలేముు ఏమిచేయమంటారు అంటే వారి పీఠాధిపతి (Abbot)
"Kill them all for the
Lord knoweth them that are His” (2 Tim. ii. 19)
and so countless number in that town were slain."
అన్నాడట.
ఇక క్రుసేడరులు ఎంత
దారుణముగా , శాఖా భేదము కారణముగా తమవారినే ఏవిధముగా చంపినారో చూడండి.
The routiers rampaged through the streets, killing and
plundering, while those citizens who could run sought refuge in the churches — the cathedral, the churches of
St Mary Magdalene and of St.Jude. Yet the
churches did not provide safety against the raging mob of invaders. The doors of the churches were broken open, and all inside were
slaughtered.
మనదేశంలో, మన
మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని,
మహావీరుడిని కాని ఏనాడు మనం చంపదలచలేదు. రాజులూ ఒకరితో ఒకరు యుద్ధాలు
చేసినపుడు,
శరణన్నవారిని రక్షించినారుగానీ దేవాలయాలో దూరి హత్యలు చేయలేదు. ఇంకా నిజం
చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం
సిఖ్ఖుమతము కూడా ఈ
దేశములో
వర్దిల్లినాయి. శాస్త్ర
సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క
కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుట లేదని, భూమియే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని
చెప్పినందుకు గెలీలియొను చంపుతామన్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని మరి బైబిలు చెప్పినది. మరి అది ఆమతస్థుల కు
ప్రామాణికమైతే అది చెప్పినది వాస్తవము కాదు గదా ! మరి ఆ గ్రంధ వాక్యములు చెప్పినది
ఒకవేళ దేవుడే కానీ, చెప్పినది తప్పుకదా!
ఈ వాస్తవాలను ఒకసారి
గమనించండి:
1) భూమి బల్లపరపుగా
ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించినాడని
బైబిలు చెబుతోంది. అది
నమ్ముతారా?
3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు
అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
4) చర్చిలలోకి స్త్రీలను
ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు.పూర్వము రానిచ్చేవారు
కాదు).
5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి పదవులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక
పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?
ఇప్పటికీ అమెరికాలో 51%
క్రైస్తవులు, మిగతా వారిలో, ఎక్కువ మంది Atheists అని చెబుతూ వుంటారు.
యూరోపియన్ సమాజం, దేశాలు
చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టినాయో
తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాము.
1) ఒక జర్మను, బైబిలును
జర్మను భాషలోకి మార్చినందుకు 15,000మందిని చంపినారు.
2)
క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 15, 00,
000 మంది చనిపోయినారని ఒక అంచనా.
3) యూరోపియన్ దేశాలు కేవలం
ప్రజాస్వామంలోకి మారడానికి, అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసి
వచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి
వ్యతిరేకంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? ఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని
అధికారానికి చిహ్నం.కాని మన గుడి అంటే అటువంటిది ఏమీలేదు కదా. మనదేశంలో అప్పటి
ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా వారు మనలను పాలించేవరకు చదువులోను, సకల
శాస్త్ర విజ్ఞానములోనూ, అన్నింటికీ మించి, మనం మనస్సులలో వారికన్నా చాలా పెద్దవారము. మనము మన పెద్దల నుండి
గ్రహించిన సంస్కారము అవినాశము. మనము చదువులో వెనుకబడుటకు కూడా కారణము మెకాలే విలియం జోన్స్, మాక్స్ ముల్లర్ మరియు వారియొక్క , మన హిందూదేశపు
తొత్తులు. మనము మార్పును తక్కువ వ్యతిరేకతతో (Resistance)
ఆహ్వానిస్తాము. అందుకే మనము మన సాంప్రదాయాలనుండి ఇంత దూరము వచ్చివేసినాము.
ఇవిఅన్నీ మనమతంలోఉన్న Flexibility మరియు Elasticity కి నిదర్శనములు.
ఇప్పుడు క్రైస్తవం
భారతదేశంలో అడుగు పెట్టి నప్పటి నుండీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం
మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు
వినిపిస్తున్నాయి. క్రీస్తు అనుయాయి సెయింట్ థామస్ రెండువేల యేళ్ళ
క్రితం ఇక్కడకు వచ్చినాడని, అతను
క్రీస్తును గూర్చి ప్రచారము చేస్తూవుంటే , అతనిని
తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేసినారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం
చేస్తున్నారు. వాస్తవమేమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్
క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను
క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు
సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్
క్రైస్తవులు పారిపోయి
సముద్రమార్గం గూండా కేరళ వచ్చినారు. వారికి అక్కడి హిందూ
రాజు బ్రతకడానికి స్థలం
ఇవ్వటము జరిగింది. ఆవిధంగా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది.
కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండా
బ్రతికినారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది.
16వ శతాబ్దంలో మనదేశంలోకి
వచ్చిన పోర్చుగీసు వారు ఇక్కడి క్రైస్తవులు ఏసును
పూజిస్తున్నారు కాని
పూజావిధానం మొత్తం హిందూ పద్దతులలో ఉన్నది అని గమనించినారు. పోర్చుగీసు వారు మొదట
గోవాలో ప్రవేశించి వారు అక్కడ చేసిన నరమేధము ఇప్పటికీ Portuguese Inquisition అన్న పేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఆవిషయమును ముందే తెలియజేసినాను.
క్యాథలిక్కు చర్చి, భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం
జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు
చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St.Thomasను బ్రాహ్మణులు చంపినారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు (ఇక్కడ గమనించదగ్గ
విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనము పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం
చెప్పడమేలేదు పైగా ఇటీవల
సెయింట్ థామస్ హిందూదేశమునకే రాలేదు అతను రోములోనే స్వర్గస్థుడైనట్లు
నిర్దారించినారు.). మన స్వాతంత్ర్యసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్న. అది
భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.
బైబిల్ నందు యోహోవా
"తాను కేవలం ఇజ్రాయిలీ ప్రజల దేవుడను" అని చెప్పుకున్నాడు.
ఎక్కడా ఆయన తాను ప్రపంచ
ప్రజలకు ముఖ్యంగా భారతీయులకు దేవుడనని చెప్పలేదు.
ఆయన ఇజ్రాయిలీలను మాత్రమే
ప్రేమించినాడు. వారికోసం ఈజిప్ట్ వంటి ఇతర దేశాల,జాతులను
ప్రజలను శిక్షించినాడు.(బైబిలు లోని నిర్గమ కాండం, Exodus,
చూస్తే మనకు ఆ విషయము తెలియగలదు.) అలాగే ఏసు కూడా "తప్పిపోయిన ఇజ్రాయిలీ
ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్నుపంపినాడు".అని స్వయంగా చెప్పటము
జరిగింది.(మత్త 15:24) అంతేకాక ఆయన తన భోధనలు కేవలం ఇజ్రాయిలీలకే చెప్పమని,ఇతర దేశాలలో ప్రవేశించవద్దని కూడా స్వయంగా చెప్పినాడు.(మత్త10:5-6) అంటే
వీరిరువురూ ఇజ్రయిలీ ప్రజలకే రక్షకులమని తామే చెప్పుకున్నారు కానీ, మన వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో, భాగవతంలో,శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణుడే ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమని,పద్నాలుగు భువన భాండములు,అన్ని దేవతలు,ఆయన నుంచే పుట్టినాయని, చీమ నుండీ బ్రహ్మ వరకూ అన్ని
ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయనీ, ప్రాణులన్నింటికీ, తండ్రి, పోషకుడు, రక్షకుడు
శ్రీకృష్ణుడే అని తెలుపుతున్నాయి. శ్రీ కృష్ణుడు కేవలం ఒక దేశానికి,ఒక జాతికి చెందిన దేవుడు కాదు. ప్రపంచాని కంతా దేవుడు. ఇక ఈ భూమిపై పుట్టి, భగవంతునికి అంకితమైన భక్తుని ఆలోచన, ఆవేదన, ఆర్తి ఏవిధముగా వుంటుందో చూడండి.
చివరి భాగము 24వ తేదీన........
వ