మళ్ళీ కలుద్దాము.......
Monday, 26 November 2018
మేడం-ఆంటీ-అంకుల్
మళ్ళీ కలుద్దాము.......
Saturday, 3 November 2018
మదిలోని మాట
మదిలోని
మాట
https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post.html
ఒక విషయము వ్రాయవలెను అంటే
వ్రాసేవానికి ముందు అవగాహన అవసరము.
అటుపిమ్మట ఆ అవగాహనను భావము లోనికి
రూపాంతరము చెందించవలసి
యుంటుంది. ఆపై ఆ భావమును, దానికి
అనుకూలమైన భాషలోనికి మార్చవలసి
యుంటుంది. ఇవన్నీ మానసిక ప్రక్రియలే.
ఆ తరువాత అక్షరములను వ్రాత బల్లపై
వుంచవలసి యుంటుంది. ఒక వ్యక్తి ఈ
ప్రక్రియను దైవదత్తముగా భావించితే
తనకు చేతనగు రీతిలో నిస్వార్థముగా
ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుతాడు. అదే
స్వార్థబుద్ధి అయితే ధనాపేక్షతో
చేస్తాడు. కొందరు ఇంతటి గొప్పపని చేసికూడా
అయాచితముగా వచ్చిన పారితోషికమునే
గ్రహించుతారు. యాచించరు.
యాచించేవాడు స్వార్థ కవి లేక
పండితుడు. ఆ రెంటికీ దూరమున్నవాడు
పరమార్థ కవి లేక పండితుడు. అసలు తనలో
ఏమీ లేకుండా ఏదో వ్రాసేవాడు
నిరర్థ కవి లేక పండితుడు.
ఈ ఆస్య గ్రంధికి చెందిన అందరూ
నిస్వార్థులే. కానీ వీరిలో కొందరు తాను
వ్రాసినది ఎందరికి నచ్చినది అని
చూస్తారు. వీరిని కూడా రెండు తెగలుగా
విభజించవచ్చు.
మొదటి కోవకు చెందినవారు సంఖ్యను జూచి
సంతృప్తి పడిపోతారు. రెండవ
కోవకు చెందినవారు నచ్చిన వారి సంఖ్యను
ఆలంబనగా తీసుకొని తమ రచనకు
మరికాస్త పదును పెట్టి చదువరులకు తమకు
తెలిసిన విషయములను
ఉత్సాహముతో తెలియజేయ తలచుతారు.
ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తిని నేను.
తెలిసినది కొంచెమయినా,
తెలుపవలెనను తపన కలిగిన వాడను. అందుకే, ముద్రణ కష్టమయినా Likeలు లేక
పోయినా, నా ప్రయత్నమును విరమించను. వ్రాయుట దీక్షగా స్వీకరించి మాత్రమే
వ్రాస్తూ వుంటాను. ఇన్నిచెప్పినా నేనూ
మనిషినే! నాలోనూ బలహీనత ఎదో ఒకటి
ఉంటుంది.
నాలోని ఆ బలహీనత ఏమిటి అన్నదానికి ఒక
ఉదాహరణ రూపముగా
తెలియజేసుకొంటాను.
Cricket లో గొప్పగా batting చేసిన ముగ్గురూ వ్యక్తులను తీసుకొందాము.
1.
డాన్ బ్రాడ్మన్ : నాడు
టెస్ట్ క్రికెట్ మాత్రమే వుండేది. క్రీడాకారులు కూడా బంతి భూమిపై వేగముగా తమను
దాటి వెళ్ళిపోతే దానిని పొందుటకు
పరిగెత్తేవారు. లేక Ball ఒకవేళ Catch కి వస్తే పరిగెత్తి పట్టే ప్రయత్నము చేసేవారు. అంతకు మించిన
ప్రయత్నము, కష్టము నాడు కనబడదు.
2. తెండూల్కర్: ఈయన కాలానికి One Day, T20 వచ్చినాయి. ఆటలో నైపుణ్యము
పెరిగినది. బంతులను విసరు తీరుతెన్నలు ఎంతగానో మారిపొయినాయి. Batting
నైపుణ్యము పెరిగి పోయింది. Jonty Rhodes పుణ్యమా అని Fielding పద్ధతులు కూడా
మారజొచ్చినాయి. Circus Feats చేసి బంతిని పట్టుట సాధన చేసినారు. అట్టి
పరిస్తితులలో, తన శరీర ఆరోగ్యము వల్లనో, తన నైపుణ్యము వల్లనో, ఎన్నో Records ను
స్వంతము చేసుకొన్నాడు.
ధోనీ, కోహ్లీ: వరవడి పెరిగింది, నైపుణ్యము
పెరిగింది. ఆటగాళ్ళు పెరిగినారు.
అవకాశాలు తగ్గినాయి. గాయాలను సైతము లెక్కచేయక ఆడేవారు
అధికమయినారు. అన్నిటికీ మించి Matches అన్నీ Recod కావటం తో వానిని మళ్ళీ
మళ్ళీ చూసి, తమ తప్పులు సవరించుకొనుట, ఇతరుల బలహీనతలు కనుగొని వారిపై
దెబ్బకొట్టుట నేర్చుకొన్నారు. ఇవికాక Coaches ను Batting, Bouling, Fielding లకు
విడి విడిగా ఏర్పాటుచేసుకొని సామర్థ్యమును పెంచుకొన్నారు.
ఎవరి రికార్డులు వారివే! పోల్చుట, వివిధ కాలపరిస్థితులకు అనుగుణముగా మారిన
ఆటలో, నావరకు సబబు అనుపించదు. ఆ కాలములకు వారు గొప్ప. కవిత్వము,
పాండిత్యము , వ్యాసరచన కూడా ఇటువంటివేనని నా అభిప్రాయము. ఈ కాలములో
వుండే భావ ప్రసార మాధ్యమములు నాడు లేవు, అయినా మహనీయులు వ్రాసిన
గ్రంధములు అజరామరములై నిలచిపోయినాయి. నాటి మహానుభావులు, కొందరయితే
మహా పడితులై కూడా గుర్తింపునకు పాటుపడలేదు.
కాళిదాసు పేరు ప్రాచుర్యములో ఉన్నంతగా మల్లినాథసూరిని గూర్చి ఎందరికి తెలుసు.
అసలు ఆయన కాళిదాసు కావ్యములకు వ్యాఖ్యానము వ్రాసియుండి ఉండకపోతే ఆ
గ్రంథములకు ఇంత ప్రాచుర్యము వచ్చియుండెడిదా! ఈ విషయము ఎంత మందికి
తెలుసు. ఆయన ఆంధ్రుడని ఎందరికి తెలుసు.
మల్లినాథుడి ఇంటిపేరు కొలచాల. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే
వికారాలున్నాయి. కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామము తెలంగాణా రాష్ట్రము లోని,
మెదక్ జిల్లాకేంద్రమైన మెదక్ కుు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు
పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని
తెలుస్తోంది.
మహామహోపాధ్యాయుడగు జటావల్లభుల
పురోషోత్తం గారు స్వయంగా
మల్లినాథులవారిని గూర్చి చెబుతూ, ఆయనే లేకుంటే కాళిదాసునకు అంత పేరు
వచ్చేది కాదేమో అన్నారు. ఇంతటి
మహానుభావులు ఎందఱో! ఎందరెందరో!
కానీ నేటి పరిస్థితి అది కాదు. రామాయణ,
భారత భాగవత, మహాకావ్య, ప్రబంధములను
చదివేవారు కనిపించరు అనుట అతిశయోక్తి కానేరదేమో! నేడు ఆస్యగ్రంధిలో తమ
కవితలను పంచే కవులు పుంఖానుపుంఖములు. కానీ ఇందులో, గంభీరమగు భావము
కలిగియుండి కూడా, ఎక్కువమంది భాషాసంపదను సమకూర్చుకొను జిజ్ఞాస, నిబద్ధత
కలిగినవారు తక్కువ. అప్పుడు
కవిత పేలవమై తేలిపోతుంది.
సారవంతమైన రచనలను పాఠకులు చదివి అభిప్రాయములు తెలుపుతూ
ప్రోత్సహించితే మంచి రచనలు ఆస్యగ్రంధిని అలరించగలుగుతాయి.
మాటవరుసకు నేను గతము లో వ్రాసిన
సంబాజి విషయమే
తీసుకొందాము. నావంటి ఒక అనామకుడు ఆయనను
గూర్చి వ్రాసినా
వ్రాయకున్నా, చదువ వలసినవారు చదివినా చదువకున్నా ఆయన వాసికి వన్నె
తరుగదు. కానీ మనవాడయిన ఒక మహనీయుని
గూర్చి పదుగురు
తెలుసుకోవలెనని తలచినాను. కానీ నాది
వ్యర్థ ప్రయత్నమని అర్థమైపోయింది.
ఎందుకంటే, ఇందు మోడీ లేడు, రాగా లేడు, కచరా లేడు, నాచనా లేడు. పోనీ
చిరు, రాచ,
అల్లు, మబా, తారా, మొదలయిన ధనాపేక్ష కీర్తి కండూతి కలిగిన వ్యక్తి
కనబడడు. అందువల్ల చదువుటకు మనకు
నిరాసక్తి. ఇందులో మీటూ (మాంసము)
మీటూ (Me too) లేదు. ఇక చదువుట ఎందుకు అనుకొని వుంటారు.
అది నిజమని నాకు అనిపిస్తుంది. అంతటి
మహోన్నతమయిన వ్యక్తిని గూర్చి
తెలుసుకొన తలంపేలేని పాఠకులకు ఆయనను
గూర్చి తగిన విధముగా తెలుపలేక
పోయిన నేను, ఆ అమహావీరుని, చనిపోయిన
తరువాతకూడా అవమానపరచి
రెండవ ఔరంగజేబును కాలేను. అందుకై
వ్రాయుట విరమించుచున్నాను.
ఆయనను గూర్చియే కాదు. దేనిని గూర్చి
వ్రాసినా పాఠకులకు ఎందుకో మంచి
తెలుసుకొనవలెనంటే ఎదో ఉదాసీనత. అదే 'మోడీ పాలన బాగుందా లేదా అని
ఇక ప్రశ్న వేసి వదిలిపెడితే 200 మందికి తక్కువలేకుండా likes మరియు For and
Against Comments వ్రాస్తారు. దీనివల్ల మన విజ్ఞానము పెరుగుతుందని నేను
భావించను.
‘అజరామర సూక్తులు’, ‘సమస్య మనది సలహా గీతది’ మొదలగు అనేక
మంచివిషయములను, ఏ రూపములో వున్నా, ఎవరు వ్రాసినా చదువుట
అలవరచుకొండి. మీరు నేర్చినది భావితరాలకు వ్యాప్తి చేయగలరు. ఈ సనాతన ధర్మ
పరిరక్షకులు మీరే!
స్వస్తి.