నా గీతములు నా
గేయములు
వేయి దీపముల వెలుగుల తల్లీ
వెతలనెల్ల వెలార్చిన తల్లీ
నవ్వు తీగెవై నడచిన తల్లీ
వేల నవ్వు వెదజల్లుచు తల్లీ
నికేతనమ్మును నింపిన తల్లీ
తిరిగి వచ్చునా దినములు తల్లీ
దొంగ భయము నీ తోడు కూడగా
అమ్మ కొంగు నీకభయమివ్వగా
నాన్నకు భయపడు నటనామయివై
అభినయించగా ఆనందించుచు
విహంగమై వినువీధి చరించుచు
ఆనందమునకు హద్దు వెదకు నెడ
కలతది ఏదో కలిగెను మది కడ
ఎదలో బాధకు ఎదో మూలము
కలిగెనన్న కలకలమున హృదయము
చింత చేయగా చిట్టితల్లికిక
కళ్యాణపు శుభ ఘడియ చూడుమిక
అని తలపనే మది ఆర్ద్రత నిండగ
పెళ్ళి జేసితిని పేరిమి మీరగ
అనురాగముతో అమ్మనాన్నలను
గాంచ వచ్చినా కట్టుబాటులను
పొరుగింటికి తా పోయిన రీతిని
మనసా, నినునే
మసల, జూచితిని
అతివయన్నచో 'ఆడ'ది గానీ
ఇంగితమేర్పడె 'ఈడ'ది కాదని
రంగస్థలమున రంగము మారెను
పాత్ర దారినిది పాత్రయు మారెను
నాటి బిడ్డయే నేటి తల్లిగా
పొదిగిన నెనరుకు పొన్నువు కాగా
పరిణతి చెందిన పాత్రదారిణిగ
ఇంటి కాంతిగా కంటి రెప్పగా
పుచ్చుకొన్న మా పూర్తి ప్రేమమును
భర్త ఇంటిలో పంచివేయుచును
నీ తలిదండ్రుల నిజ గౌరవమును
విరుల తావులకు వీవెనవగుచును
మమ్ము ధన్యులుగ మసల జేసితివి
మంచికి మారై మరి నిలచితివి
అనురాగముతో అమ్మనాన్నలను
గాంచ వచ్చినా కట్టుబాటులను
పొరుగింటికి తా పోయిన రీతిని
మనసా, నినునే
మసల, జూచితిని
అతివయన్నచో 'ఆడ'ది గానీ
ఇంగితమేర్పడె 'ఈడ'ది కాదని
+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*
దీపావళి
పల్లవి: వచ్చేనిదే వచ్చింది దీపావళి
పేదోళ్లకు ఉన్నకాస్త ఖాళీ ఖాళీ
చరణము 1. ఇల్లేమో చూడబోతె ఈగలతో ముసురు
నూకలపై ఆశతోడ వేచియుంది ఎసరు
అన్నమడిగితే అమ్మ కోపగించి
కసురు
దొరికిన రూపాయి తోడ ఉరికిన చిన్నారివాడు
చిచ్చుబుడ్డి తెచ్చి కాల్చి కడుపు చిచ్చు మరచినాడు.
చరణము 2. ఒళ్ళు దాచుకోడానికి వల్లలేని కోకతో
కళ్ళు కాయలౌదాకా వేచియుండు ఓర్పుతో
శిశిరములో పండుటాకు
బోలియున్న మోముతో
నిలిచినా ఇల్లాలి ముందు నిలువలేక కొట్టే మందు
పండగంత ఎండగాయె మగని డబ్బు దండగాయె
చరణము 3. పొరుగునున్న డోరా తారాజువ్వ వదిలె చూడగా
రివ్వు రివ్వుమంటూ అది ఎగిరె
గువ్వ తీరుగా
పూరిగుడిసె పైన జేరి
పూర్ణాహుతి చేయగా
నిలువరించు సంసారం నెలవులేక కృంగిపోయె
దిక్కులేని దీనులుగా దీపావళి చెసిపోయె
మరువలేవదేల
నా జ్ఞాపకాలలోన నీ కంట నీరేల
మదిన చిచ్చదేల నను మరువలేవదేలా
వాడియున్న మల్లెమాల తలన వుంచనేలా
మనసులో గతాన్ని మరువలేవదేల llనా జ్ఞాపకాలలోనll
నా గమ్యమే వేరు నీ బాట వేరు
దిశలు వేరువేరింక కలుపువారు లేరు
అడవిలోన నేనుంటే నగరి నీది బాలా
మరులు గొనగనేల మరువలేవదేల llనా జ్ఞాపకాలలోనll
పిగిలియున్న నా మనసు పలికెనిట్లు లేమా
చేరలేను నీదరికి నాది ముళ్ళ సీమా
ఆకసాన నీవుంటే నాదు నెలవు నేల
కలువలేము బెలా మరువలేవదేలా llనా జ్ఞాపకాలలోనll
దైవమా చాలు ఈ
జీవితం
దైవమా చాలు ఈ జీవితం
దైవమా చాలు ఈ జీవితం
లోకమంతా ఉదాసీనమే
కలిగియుండేది
వ్యామోహమే
వెలుగు విరజిమ్మేను
చీకటులు క్రమ్మెను
ఆశ అడుగంటగా ఆశయము కృంగెను
చూపులెడబాసెను బాధలెద
నిండెను
గుండె బరువెక్కెను తెలుపుమిది
నీకు తగు కార్యమే llదైవమా ll
ఉన్న సంతోషమును నిల్పుకోనైతిని
జీవినేగాని జీవించలేనైతిని
ఊపిరులు లాగిన ఊరకెట్లుందును
ఈర్ష్యతో సుఖమును నీవు
కబళింపగా న్యాయమే ll దైవమాll
ఎద వినిచిన గానము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను
గానము
కనురెప్పల తాళము శ్వాస వాయులీనము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను
గానము
ఊహలు తేలి మబ్బులై నింగిన విహరించగా
వన మయూరి నాట్య
శాస్త్ర మెళకువ వినిపించగా
తన్మయత్వ వీచికలే
తావుల వెదజల్లగా
గళము తా విపంచి శ్రుతిని పరవశించి
సవరించగ
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను గానము
జల జల ఝరి గమనము
జలతరంగ ధ్వానము
ఇంద్ర ధనువు తోరణము
చిరుజల్లుల ప్రేరణము
నీల జలద విరిబోణికి నీరెండకు కళ్యాణము
పరిణయమది కనుదోయికి కమనీయము
రమణీయము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను
గానము
ఈ సమీర మీ సిరి
వెన్నెల
ఈ సమీరమీ సిరి వెన్నెల
ఈ రేయి నూయాల లూపెనే
ఆనందమందగా నీయక
నీ తలపు తలుపులు మూసెనే || ఈ సమీర మీ సిరివెన్నెల ||
ఆ యామిని మృదు గామిని
ప్రియ భామినిని చేరాలని
ఆశించ నీవది కాదని
అన్నావు నీ దయ రాదనీ || ఈ సమీర మీ సిరివెన్నెల ||
కను లెర్ర బడె నంగారమై
తడియారి పోయెను దాహమై
దరి దారి గానక 'మోహన'
శిలనైతి భూమికి భారమై || ఈ సమీర మీ సిరివెన్నెల ||
కలత మది లోనిది
కలత మది లోనిది మాసిపోలేనిది
ఎందుకో ఎందుకో ఆడె నాతో విధి
గతము కరుకైనది రేయి బరువైనది
అందుకే అందుకే నిదుర రాకున్నది ll కలత ll
తారకలులేని రాకా నభోవీధిలో
జాబిలే లేదు కనిపించ నా పరిధిలో
నాదు తలరాత నేనుంచి విధి చేతిలో
ఆడబడుచున్తినవలీల తన లీలలో ll కలత ll
పిలుపుకై వేచి నీనుండి నేనుండగా
గాలి రాలేదు నీ పిలుపునందివ్వగా
తలపులను వేడ పిలిపించగా మోహన
వదలి పోమంచు నాతోనే నిలచేనుగా ll కలత ll
కొనకుండా
నవ్వుకొనండి – తృప్తి చెందే నాయకుడు
ఏమండీ
ఇటు చూడండీ నా మాట మీరు విని చూడండి
ఒక్కసారి
ఒటేసితిరంటే మీ సోమ్మేమీ పోదండీ
ఓటువేయుటకు
అంతో ఇంతో ఎంతోకొంతిస్తానండి
నను
గెలిపిస్తే మళ్ళీ మళ్ళీ నిలువబోను నను నమ్మండీ
స్పాంజీ
నీరు నేను డబ్బు జిగురు దోస్తులము నిజమండి
జిగిరీ
దోస్తీ వీడను నేను సొమ్మే ప్రాణము నాకు సుమండీ
ఒక్కసారి
గెలిపించిన ఇంటిని ఇంద్రుని భవనము చేస్తానండి
కోయినిగ్
సెగ్గు లంబోర్ఘిని యను రెండే కారులు కొంటానండి
టూరులేమో
సర్కారుకారులో నెల నెల చుట్టేస్తానండి.
గాంధీ
లందరి ఫోటోలకు నా ఆఫీస్ రూమే మ్యుజియమండి
జాతి
గీతమే మొబైల్ ఫోనుకు రింగుటోను అయిపోతుందండి
చందాలను
పోగేసి కోట్లతో కాసినోలు నడిపిస్తానండి
మధ్యతరగతుల
మనుషులకంతా స్వర్గమ్మును చూపిస్తానండి
ఈ
ఐదేళ్ళూ ఖద్దరు నాతో ‘కర్ణ’ కవచమై
వుంటుందండి
మన్నూమిన్ను
ఏకం చేసి వెయ్యికోట్లు సాధిస్తానండి
ఆపై ఓటే అడుగ సుమండీ అసలు మీకు నే కనబడనండి
ఒక్కసారి
నను గెలిపించండి బాహుబలిని చూపిస్తానండి
రాతిరి తీరని కలయే ఆయె
రాతిరి తీరని కలయే ఆయె
తరగని చెరగని ఆశల మాయె
కనులు తెరువగా కల
మంచాయె
కటిక చీకటే కన నిజమాయె
భూతకాలమే భూతమ్మాయె
గతమును తవ్వే గతి వలదాయె
మరచుటయే నా అభిమతమాయె
కలతల కడలికి మది
నెలవాయె
ఎంత ఈదినా దరి రాదాయె
తీరమందినా నేను పరాయె
తండ్రి
ఎదిగే మొక్కకు ఎరువే
తండ్రి
గువ్వకు ఒదిగే గూడే
తండ్రి
ఐస్ కేండికి స్టిక్కగు
తండ్రి
తీయని భవితకు దిక్కే
తండ్రి
మేలౌ పునాది మేడకు
తండ్రి
కూడుగుడ్డగూడే తండ్రి
‘ఆడీ’ కీ యగునతడే
తండ్రి
‘రాడో’ వాచికి స్ట్రాపే
తండ్రి
ప్రొలైను బట్టల పోగే
తండ్రి
జీన్సు పేంటునకు జిప్పే తండ్రి
నాణెపు భవితకు నభమే తండ్రి
శుభకార్యములో శుభమే తండ్రి
మైలను బుచ్చే మమతల లాండ్రీ
పైడి నగలకది భేషగు ఫౌండ్రి
మైత్రి
కన్ను తనను కాపాడగ కనురెప్పను అడిగిందా
చెంప చెళ్ళుమనకుండా చేతి 'రక్ష'నడిగిందా
ఆహ్వానము కోరదురా అదే ముందు నిలచురా
హద్దు లేని ఆకాశమె ఆమైత్రికి గురుతు రా
ఆమని వచ్చే వరకూ ఆ మామిడి పూయునా
మండే వెసంగి లోనె మల్లెపూల వాసన
ప్రేమలోని సహజత్వము ప్రకృతికే తెలుసురా
ప్రపంచమే స్నేహానికి ప్రతిరూపము తెలియరా
అల కుచేలునకు
మిత్రుడు అఖిల లోకముల రాజు
సూతపుత్ర మిత్రుడైన సుయోధనుడు రాజరాజు
తరతమాల తలపులెపుడు తలపోయదు స్నేహమురా
చక్కనైన స్నేహితమే సర్వేశుని వరమురా
వెరపు చేరనీయబోక వెంటనడచు స్నేహితము
ఆపదలను బాపజేసి ఆదుకొనును సహవాసము
కలిమిలేములను చూడదు ఘడియకూడ వీడదురా
మనసు మమతలను పెంచే మైత్రీవనమదిగనరా
నా కవనము నాక వనము
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము
వివిధ వర్ణ సుమ సరసము
ఫలరసాల సాల తలము
అమలిన మాహ్లాదకరము
పూతేనెలు జాలువారు
అలిసంకులమచట తీరు
విరితావులు దిశలు జేరు
చిరుతెమ్మెర అలల బారు
చెప్ప తరము కాని సౌరు
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము
గతి మారెడు గమనమందు
తాళగతులు తరగలందు
మేళవించు సరసు ముందు
భృంగ బృంద స్వనమునందు
శ్రుతికి నతుకు గానమందు
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము
కల్పభూరుహముల వితతి
కామధేను సంతతి తతి
నిరత వసంతాకర స్థితి
సత్వసాదు జంతు సమితి
ఆనందముకది పరిమితి
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము
నాదు భాష అజంతము
దాని కీర్తి అనంతము
వ్రాస్తినందు నాసాంతము
ఆనందము అనంతము
చదివినచో నీ స్వంతము
జీవితం
చిత్రవిచిత్రం చూడ జీవితం
యోచిస్తే అది పరుగుల పందెం
గెలవాలంటే నాతోడుండరు
ఓడిపోతినో వెనక్కి చూడరు
అబద్ధాల మహాసభకు
అధ్యక్షుని సందేశం
అబద్ధాల
మహాసభకు అధ్యక్షుని సందేశం
'అబద్ధాలు ఆడరాదు' అందుకోండి ఆదేశం
మన
వృద్ధికి ధన సిద్ధికి మణిదీపం మనదేశం
బంగారపు
గుడ్ల బాతు కోయకుమని ఉపదేశం
"అబద్ధమే మన వూపిరి అబద్ధమే మన
కాపరి
అదే వెంట లేకుంటే మనకేమున్నది
ఉపరి"
"నామాటను మనసుపెట్టి ఆలకించితే
ఒకపరి
అర్థమౌను అదే మీకు నెమరు వేయగా
మరిమరి"
లోకమనే రైలు బండి పట్టాలే అబద్ధాలు
బండి
సాగవలెనంటే ఆడరాదు పట్టాలు
కదలకుండ
అవి వుంటే కానరావు కుదుపులు
అందులకే
తెలిసిందా ‘ఆడరాదు అబద్ధాలు’
‘సత్యం వధ ధర్మం చెర’ అన్న సూక్తి
మరువబోకు
చిరునవ్వులు
పెదవులపై చిరకాలం చెదరనీకు
మాటలలో
చూపబోకు మెపుడైనా చిరాకు
సంభాషణ సమయములో పనికిరాదు పరాకు
అబద్ధమే
మన ఊపిరి మన పదవులకది కాపరి
ఆడి
తప్పినట్టివారు అగచాటుల నెపుడు బడిరి
గురితప్పని
ఆయుధమది వాడితిమా మనమొకపరి
వద్దన్నా
నిన్ను విడచి పోనేరదు అది తదుపరి
అబద్ధాల మహాసభకు అధ్యక్షుని సందేశం
'అబద్ధాలు ఆడరాదు'
అందుకోండి ఆదేశం
మన వృద్ధికి ధన సిద్ధికి మణిదీపం మనదేశం
బంగారపు గుడ్ల బాతు కోయకుమని ఉపదేశం
ఆశ
బాల్యమందున అమ్మ తెలిపెను 'వేడి' 'ఉన్ని' న
వుండుననుచును
బడిన గురువులు తెలియజేసిరి వేడి 'జూను' న వుండు ననుచును
తండ్రి తెలిపెను యౌవ్వనములో వేడి రక్తము వుండుననుచును
అనుభవమ్మనె, 'ఆశ' లోనే ‘వేడి రక్తము’ వుండుననుచును
మంచిచెడు నిన్నరయనివ్వక నీతినియమము దరినిజేర్చక
‘ఆశ’
చేసే మోసములు నిన్నొత్తి పండును జేయుననుచును
Mother said in the
childhood that the warmth is in ‘Wool Rug’
Teacher said, in
school, that ‘June’ gives summer’s heat
Dad said that young
blood that keeps one in heat ever
Savoir faire, mine,
said that ‘greed’ keeps you hot ever (Savoir faire=the ability to speak out of
experience)
Never allows, it,
you to think what is bad and what good
Use the pressure and
fructifies you with ego and meanness
Season that is,
which gets the sweetness not ego and frailty
కనికరించి
జలజనేత్ర కనరావా జలద గాత్ర
నా పల్లవి చరణాలకు నర్తించగ చరణమ్ములు
నవ గీతిక నీ కొరకై నయమారగ రచియించితి
మైమరచే రాగముతో సంతరించి నేనుంచితి
కనికరించి జలజనేత్ర కనరావా జలద గాత్ర II II
నీ వ్రేళులు నీ వేణువు నీ అధరము బహు మధురము
తన్మయతను కలిగించే తత్వమెందు ఇమిడినది
దిక్కె రుగక
దిగులు చెంది దీనురాలి వేచియుంటి
గీతమొకటి చేతబూని నీ కొరకై వేదకుచుంటి II II
సందెవేళ నను రమ్మని సైగనీవు చేసితివి
నిను చేరీ చేరకనే నీవు మాయమైతివి
కమల నయన నీ కన్నుల కనికారం కనరాదా
నా వేదన నీ వీనుల
కణుమాత్రం వినరాదా II II
ఈ
నిజాన్ని మరి గమనించన్నా
ఈ
నిజాన్ని మరి గమనించన్నా
పైసామే
హై పరమాత్మా
అని
అంటావే ఇటు చూడు
అసలు
విషయమును గమనించు
నా
మాటలపై మనసుంచు
సుఖసంతోషం
కొనగాలవన్నా
మనశ్శాంతి మరి కొనగలవా?
బట్టలగుట్టల
కొనగలవన్నా
అందచందముల
కొనగలవా?
స్టారు
భోజనము కొనగలవన్నా
ఆకలినయితే
కొనగలవా?
మెత్తని
పరుపుల కొనగలవన్నా
నిద్దురనయితే
కొనగలవా?
ఆడీ కారును కొనగలవన్నా
చక్కని
రోడ్డుల కొనగలవా?
పడతులెందరినొ కొనగాలవన్నా
కమ్మని అమ్మను కొనగలవా?
దండును దండిగ కొనగలవన్నా
దగ్గరితనమును కొనగలవా?
చెబుతూబోతే చేంతాడగుమరి
నా మాటలపై ఉంచినచో గురి
మాన్యత
చేరును మరువక నీదరి
రారు ఎవ్వరూ అప్పుడు నీ సరి
ఈ
నిజాన్ని మరి గమనించన్నా
డబ్బులు
కోట్లకు నీకడనున్నా
కోరినదల్లా
పొందుట సున్నా
మానవత్వమే
అన్నిట మిన్న
అది
సాధించుము ముద్దుల కన్నా!
హృదయారుణ ఫలకము పై – నయనపాత్ర సిరా తోడ
బాధ వ్రాసేనొక గీతం – సేగాతాకిన నవనీతం
కాటుక చీకటి లోపల – కరిగిపోయె
భాస్కరుడు
వెలుగు పరుచు లోపలనే –
అమావాస్య చందురుడు II
II
నా గాధల సంద్రములో – నా బాధల కెరటమ్ములు
వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి – దరిగానక తరలిపోయె II II
శ్రీచందన గంధము, నా –
సేదతీర్చునని తలువగ
శిరీషములు
చిదిమినట్టి – తావులు నా నాసము తాకెను
II II
తలచినాను నేనోక్కటి – దైవమొసగె వేరొక్కటి
చూపు నిండె నతిచిక్కటి – కారుమబ్బు గుమి చీకటి II II
జయ
సుందర నంద బాల
జయ
గోపక జనపాలా
జయ
వంశీ రవలోలా
మ్రొక్క
నిలచినాను మ్రోల II జయ వంశీ II
జయ
దానవ దహన జ్వాల
ఫణి ఫణాళి
నాట్య హేల
మాయా
మొహాది జాల
సృష్ఠి
స్థితి విలయ లీల II జయ వంశీ II
పరమ
భక్త సుఫలసాల
ఋత
పూరిత ఋషి కల
హృదయాంతర
అణు కీల
తారామణి
గణ సుచేల II జయ వంశీ II
నాడు కళల కాసారము లో నేమో 'కలువ'నీవు
కనుల ఎదుట కనిపించీ నన్నేమో కలువనీవు
ముద్దు ముద్దు పలుకులతో మురిపించే 'చిలుక' నీవు
మోము పైన దరహాసము నను జూచిన చిలుకనీవు
నా ఊహల వయ్యారికి 'చంద్ర వంక' నగ నీవు
నీవే ఆ వయ్యారివి అందామన కనగనీవు
పూల తావి పిల్లగ్రోవి రవళిని కల, గాలి నీవు
నీదు ప్రేమ తీరానికి నను కొనిపో కలగాలి నీవు
నీకొరకై వేచినాను హృదిని జేసి నాక వనము
నీకే అంకితమైనది కలకాలము నా కవనము
హృది హ్రదమందందముగా విరిసిన చెంగలువ నీవు
'మోహనా' అని యంటూ రావా నను కలువ నీవు
కౌపీన సంరక్షణార్థం…
సంసారము ‘ఛీ’ సన్యాసము ‘సైఁ’
అని తలచుచు ఒక సంసారి
ఆలుపిల్లలను ఇంటిని
వదలి
అడవి దారి బడె
కౌపీనముతో
సగముదారి తా బోయిన
పిమ్మట
ఇంకొక గోచియు
అవసరమనుకొనె
ఇల్లుజేరి వేరొక్కటి
గైకొని
అడవి జేరె
నతడాత్రముగా
మొదటిరోజు తా గడిపిన
పిమ్మట
వలనుగ
కుటీరమవసరమనుకొని
అడవి కట్టెలకు వచ్చిన
వారిని
అడిగి సహాయము, నిర్మించె
ఏటి స్నానమును జేసిన
పిమ్మట
తడి గోచిని తన
ఇంటివద్ద తా
నారవేసి వేరొక్కటి
కట్టెను
దైనందిన సద్విధులకు
నై
ఒకనాడొక చిట్టెలుక
వచ్చి యా
కౌపీనమ్మును కోరికె
కొద్దిగా
చింతించిన యా తాపసి
యంతట
బిడాలమొక్కటి బిరబిర
తెచ్చి
పెంచగనుంచెను
పర్ణశాలలో
అప్పుడాతనికి
అర్థంబాయెను
పిల్లికి వలయును
క్షీరమటంచును
పాల కొరకు ఒక ఆవును
తెచ్చెను
ఆవు గడ్డికై భూమిని
దున్నెను
నాట్లు వేసి పంటలు
పండించెను
పిల్లి త్రాగగా
మిగిలిన పాలను
అమ్మదలచె నాసన్యాసంతట
అడవికి వచ్చిన
అబ్బాయొకనిని
ఆందుకొరకు తా
వినియోగించెను
పంటల దిగుబడి ఎక్కువ
కాగా
ధాన్యాదుల
తానమ్మసాగెను
రాను రాను వడి రాబడి
పెరుగగ
వ్యవసాయమ్మును ఇంకా
పెంచెను
సన్యాసమ్మును నదిలో
వదలుచు
సంపద మార్గముననుసరించెను
అతనిజాడ తా వెదకుచు
సతియూ
సంతానముతో అతనిని
జేరెను
బ్రహ్మచర్యమతి
దుర్భరమనుచూ
సంసారంమును చేరదీసెను
ఒకనాడంతట ఒక్క
విలేఖరి
ఆతని కడజని అడిగే
నిటు
అయ్యా నీకడ ఫ్రిజ్జీ
టీవీ
గ్యాసు గొయ్యి మరి
ఆపై పొయ్యి
భార్యాపిల్లలు సిరులూ
సంపద
కలిగినదా
సన్యాసమ్మంటే
అంతట ఆతను బదులు
పల్కెనిటు
కౌపీనార్థము
పటాటోపమిది
సంసారము సైఁయని
నేనెరిగితి
దేశమంతటిని జంటల
జేసెద
పుట్టగోచి కథ జనులకు
తెల్పగ
పుట్టించెదనొక
పార్టీనిప్పుడు
ఎన్నిక గుర్తును
పుట్టగోచిగా
ఎంచుచు నిలిచెద
నేనెన్నికలో
దేశమెల్ల సంసారుల
నింపుచు
సన్యాసుల లేకుండ
జేసెదను
గోచిపాత నా గొప్పకు
మూలము
దరిద్రానికది శివుని
త్రిశూలము
అందులకే నే
నిర్ణయించితిని
గోచిపాత నా పార్టీ
పేరు
గోచిపాత నా పార్టీ
జెండా
గోచిపాత నా పార్టి
ఎజెండా
గోచిపాత మహరాజను
పేరును
దిక్కుల చాటుచు
దేశమునేలెద
పెంచివేయుచూ నా
సిరిసంపద
ఫోర్బ్స్ లిస్టులో లో
ఫస్టున వుండెద
బిల్లు గేట్సుతో
వియ్యమునందెద
పాహి భారతీ తీర్థ
పాహి భారతీ తీర్థ - తవ చరణం – మమ శరణం
వేదవదన శ్రిత
భక్త కరుణ మమ
దురిత దమన అను నిత్యం
దురిత దమన అను నిత్యం
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
1.
జ్ఞాన కుసుమ వని శాస్త్ర దివ్య ఖని
ఆర్ద్ర హృదయ సదన
ఆర్ద్ర హృదయ సదన
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
2. రాగ నేత్ర యతి
పాణి వేత్ర ఘన
సాంప్రదాయ సూత్ర
సాంప్రదాయ సూత్ర
భవ తాపహర గురుదేవ
మమ పాపహరా గురుదేవ
3. చారుగుణగణ చపల
హారణ
శారదేందు కిరణ
శారదేందు కిరణ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
4. భస్మ ధారణ పాప
దారణ
భక్త వంద్య చరణ శరణం
భక్తవంద్య చరణ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
5. చంద్ర శీర్షధర
చారు శారద
నిత్యపూజ నిరత స్వామి
పాహి భారతీ తీర్థ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
గురుదేవ
పాదాంఘ్రి రేణువు - చెరుకు రామ మోహన్ రావు
మనసా
సతతం స్మరణీయం
మనసా
సతతం స్మరణీయం
వచసా
సతతం వదనీయం
లోకహితం
మమ కరణీయం
న భోగ భవనే రమణీయం
న చ సుఖ
శయనే శయనీయం
అహర్నిశం
జాగరణీయం
లోక హితం
మమ కరణీయం
న
జాతు దుఃఖం గణనీయం
న చ
నిజ సౌఖ్యం మననీయం
కార్యక్షేత్రే
త్వరణీయం
లోకహితం
మమ కరణీయం
దుఃఖ సాగరే తరణీయం
కష్ట
పర్వతే చరణీయం
విపత్తి
విపినే భ్రమణీయం
లోకహితం
మమ కరణీయం
గహనారణ్యే
ఘనాంధకారే
బంధుజనాః
యే స్థితా గహ్వరే
తత్ర
మయా సంచరణీయం
లోకహితం
మమ కరణీయం
సంస్కృత
గీతము
సతతము
శుభమే స్మరణీయం
వాక్కు
సదా బహు కమనీయం
పరజన
బాధలు హరణీయం
లోకహితమ్మాచరణీయం
కావు భవంతులు రమణీయం
నిదుర సుఖముపరిహరణీయం
జాగరూకతే గణనీయం
లోకహితమ్మాచరణీయం
వద్దు
క్లేశ పరిగణనీయం
సుఖాలు
కావాదరణీయం
కార్యదీక్ష
అనుసరణీయం
లోకహితమ్మాచరణీయం
దుఃఖ సంద్రములు తరణీయం
కష్ట శిఖర మధివసనీయం
విపత్కరాటవి
భ్రమణీయం
లోకహితమ్మాచరణీయం
గహనారణ్యం ఘనాంధకారం
అయ్యినదంటే స్వజనావాసం
నాకు అదే సంచరణీయం
లోకహితం మమ కరణీయం
(ఇది అనువాదము) చెరుకు రామ మోహన్ రావు