భూమి
- చాప చుట్ట - వరాహమూర్తి
https://cherukuramamohan.blogspot.com/2018/01/blog-post_28.html
Prathap Nyshadam
Sir in Rig-Veda earth is round it is said O.k whether Rig-Veda is Earlier to Bhagavatam or Bhagavatam earlier to Rig-Veda. When earth is so well known why Vyasa wrote that Hiranyaksha through the earth into the ocean. And Lord Vishnu in Varaha avatar brought out & saved the earth. Then earth and water are together is earth now is it not so then. We say "chatusagara paryantam" on four sides we have sea . If you know try to clarify. It is not a contradiction but to know the fact if you know give the details. You collection is good
Si Pavan Rohith Rigvedam is most early of all vedas. vedas are most powerfull thoughts of human given(prochoditam) by the god in the early stage of this earth to rishis and rishikas....but bhagavatam is just a kalpanika of some poets so those r not real.....so we have to read those books and wrote if any good message exists and leave the unnecessary matter those which make our minds confusion....
ఈ వ్యాసమును కీ.శే. ప్రతాప్ ప్రశ్నకు జవాబుగా జులై 9, 2016లో వ్రాయుట జరిగినది. తిరిగీ దీనిని నేడు మీ ముందు ఉంచుచున్నాను.
అనంతోవై
వేదాః అన్నది ఆర్యోక్తి. వేదం అపౌరుషేయం అన్నది కూడా ఆర్యోక్తి. వేదము పరమాత్మ
నిశ్వాసము అని చెప్పబడుతుంది. అందువల్ల వేదములు అనాది. వాని పునాది మనకు
తెలియనిది. వేదమన్నది గ్రంధము లేక గ్రంధముల సంకలనముకాదు. ఇవి ఎల్లపుడు
అంతరిక్షములో ఉంటాయి. (Either-
Contains Sound, as our modern scientists say which was told and demonstrated by
our sages and seers since time unknown). ఎవరైతే వేనిని
దర్శించినారో వేదములో అవి వారిచేత దర్శించినవిగా చెప్పబడినది. ఈ వేదములు
మౌఖికములు. అవి ఉదాత్త,అనుదాత్త,స్వరిత
గతిలో వేదఙ్ఞులచే ఉచ్చరించ బడుతాయి. అందుకే నాటి కాలమున లిపికి
ప్రాధాన్యతనివ్వలేదు. వేదములు బైబిల్ ఖురాన్ వంటి గ్రంధములు గావు. వేదములలో అఖండ, అనంతమైన విజ్ఞానము దాగియున్నది. అష్టాదశ పురాణములలో ఒకటి భాగవతము. పురాణములను, మహాభారతును వ్రాసిన వేదవ్యాసులవారు అసమాన ప్రతిభావంతుడు. ఆయన అపార దివ్యదృష్టి సంపన్నుడు. నీయుల జ్ఞానమును మన అత్యంత పరిమిత జ్ఞానముతో పోల్చలేము. అందుకు బదులుగా అట్టి మహనీయులు చెప్పిన మాటలలోని అంతరార్త గూఢార్థములు తెలుసుకోన ప్రయత్నించుట మంచిది. వ్యాసులవారు ఇప్పుడు జరిగే కలియుగమునకు ముందు జరిగిన ద్వాపర యుగము వాడు. దీనిని బట్టి వేదములు ఎంత పురాతనమైనవో తెలుసుకొనవచ్చును.
చలేము. .
భాగవతమును
గూర్చి : భాగవతము పురాణము
మనకున్న
ముఖ్యమైన మహా పురాణాలు 18. అవి ఏమిటంటే:
భద్వయం
మద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయం |
అనాపలింగ
కూస్కాని పురాణాని పృథక్ పృథక్ ||
రెండు
(2) పురాణాలు బ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి భాగవతము మరియు భవిష్య పురాణములు.
రెండు
(2) పురాణాలు మ అనే అక్షరంతో మొదలవుతాయి: అవి మత్స్య మరియు మార్కండేయ పురాణములు.
మూడు
(3) పురాణాలు బ్ర అనే అక్షరంతో మొదలవుతాయి. అవి బ్రహ్మ, బ్రహ్మవైవర్త
మరియు బ్రహ్మాండ పురాణములు.
నాలుగు
(4) వ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి విష్ణు, వరాహ, వామన,
మరియు వాయు పురాణాలు.
ఏడు
(7) పురాణములు ఒక్కొక్కటి (7) అవి అ, నా, ప, లిం, గ, కూ మరియు స్కా అనే
అక్షరములతో మొదలవుతాయి. అవి: అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ మరియు స్కాంద పురాణములు.
ఇవి
మొత్తము 18 పురాణాలు. ఇవిఅన్నియు మహర్షి వేదవ్యాస కృతమే.
ఏ
మహా పురాణమైన ఈ క్రింది లక్షణములు కలిగి ఉంటాయి:
సర్గశ్చ
ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం
చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము,
వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర
అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
సర్గము
- సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి
సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము
- పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము
- ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర
భాగవతంలో
పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ
విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో
వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం
పురాణం తద్విదో విదు:
అనగా
సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య,
చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి),
హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు)
అనే పది పురాణ లక్షణాలు.
భాగవత
పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. శుకుడు వ్యాసుని కుమారుడు. పుట్తుకతోడనే ఆయన బ్రహ్మజ్ఞాని. జన్మసంసారబంధనారహితుడు. భాగవతము 18,000 శ్లోకములు కలది. ఇందులో
వివిధ విధములగు విష్ణుభక్తి తత్పరులను గూర్చి తెలుసుకొంటాము. వీనికి ఒక
వరుసక్రమము లేదు. ఏది ఎప్పుడు జరిగినది అన్న విషయమును ఇదమిద్ధముగా చెప్పలేము. ఏకల్పములో, ఏ మన్వంతరములో, ఏ మహా యుగములో, ఏ యుగములో, గ్రహస్థితిని అనుసరించి ప్రభవాది 60
సంవత్సరములలోని ఏ సంవత్సరములో ఏ మాసములో ,ఏ పక్షములో, ఏ తిధి, ఏ వారము,
ఏ నక్షత్రము అన్నది చెప్పలేము. ఆగణన ఇతిహాసములకు చెల్లుతుంది.
పురాణమంటే:
"పురాపి
నవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని
భావం. ఇవి అన్నీ జరిగినవే కానీ నేటి సాంఘీక నైసర్గిక పరిస్థితులతో పోల్చి కొన్ని
నమ్మలేక పోవలసిరావచ్చు. అట్లని అవి జరుగలేదు అనుట పొరబాటు. పురాణాలలో భారతీయ ఆత్మ
ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
పురాణాలు
ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రపంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు
నడుచుకోవలసిన విధానం వరకూ ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం,
పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని
విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి.
జిజ్ఞాసువులు
ఓపికతో చదువుతారు అన్న ఉద్దేశ్యముతో మన భారతీయ కాలగణనను గూర్చి కూడా ఈ దిగువన
తెలియబరచినాను.
ఈ 60 సంవత్సరముళ కాలచాక్రమేమిటి, అన్న విషయనికి వస్తాము; భూమికి
అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత
దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు
నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది.
అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60
సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట.
ఇక
కాలగణన విషయానికొస్తే,
సూర్య సిద్ధాంతము ప్రకారము
తృటి
– వాడి సూది మొన తామరాకును
తాకేకాలం (1/33750
Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ
సాధారణ కాలగణన చేయవచ్చును.
జీవి
ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది
భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు
కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము
6
ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)
60
వినాడు లు = 1 నాడి (ఘడియ)
60
నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)
360
రోజులు (24 హోరలు) = 1 సౌర వర్షము
(దేవతలకు
) 1 దివ్య వర్షము = 360 సౌర వర్షములు
కృతయుగము
= 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)
త్రేతాయుగము
= 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)
ద్వాపరయుగము
= 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)
కలియుగము
= 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)
మహాయుగము
= 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)
ఒక
మన్వంతరము = 71 మహాయుగములు
ఈ
మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము
కల్పము
= 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6
(మహాయుగములు)=994+6=1000మహాయుగములు
15
సంధులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే
పగటికి
రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక
మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి.
వెరసి 15 మన్వంతరములు.
1
సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ. = 6 మహాయుగములు
2
కల్పములు : బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు
ఇట్టి
360 రోజులు ఒక బ్రహ్మవర్షము.
బ్రహ్మ
ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు
ఇది
సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని
ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని
గర్విద్దాం.
కావున
వేదమునకు పూర్వము ఏమీ లేదు. సృష్టి వేదోద్భావము తరువాతనే జరిగింది. కావున పైన
తెలియ బరచిన పురాణములు అందులోని కథలు ఎప్పుడు జరిగినవి అని ఇదమిద్ధముగా
చెప్పలేముకానీ జరిగినవి అన్నది వాస్తవము అని మనము గుర్తుంచుకోవలేను.
ఇక
హిరణ్యాక్షుని గూర్చి:
హిరణ్యకశిప, హిరణ్యాక్షులు
అన్నదమ్ములు అన్న విషయము మనకు తెలిసినదే. మనము పురాణములలో చసె పేర్లు
సాంకేతికమైనవి. ఉదా. హిరక్న్య కశిపుడు అంటే బంగారు మంచము పై హంసతూలికా తల్పమును
ఏర్పరచుకొని పడుకునేవాడు. అంటే తనకొరకు లోకాలనే జయించిన తమ్ముడు హిరణ్యాక్షుడు
సమర్థ వంతులైన మంత్రి సామంతాది పరివారము, శుక్రాచార్యుల వంటి
గురువు వుంటే బంగారు తల్పము కలిగి యుండుటలో ఆశ్చర్యమేమి.
ఇక
హిరణ్యాక్షుడు అంటే బంగారపు ఇరుసు(అక్షము=కన్ను, ఇరుసు) అనిగానీ లేక హిరణము అంటే
లేడి అనేఅర్థము కూడా వుంది. పరుగులో లేడికి సాటి లేదు. అందుకే లేడికి లేచిందే
పరుగు అన్న సామెత కూడా ఉన్నది. సంస్కృతములో ఒకే పదానికి ఒకటికి మించిన అర్థములు
ఎక్కువ. మనము సందర్భోచితముగా కావలసిన అర్థమును గ్రహించవలసియుంటుంది. ఒకలోకము నుండి
ఇంకొక లోకమునకు పోవుటకు దూరమును బట్టి విమానములు, అగ్నిరథములు
వాడేవారు. క్షిపణులని, ఉపగ్రహాలని, అంతరిక్ష నౌకలని నేడు మనము పిలిచే satellites
ను నాడు అగ్ని రథములని
అనేవారు. అందులో లోకాలపై దండయాత్రకు వెడలేవారు. లోకాలన్నే జయించిన తరువాత, రాక్షస బుద్ధి కదా, ధృవ నక్షత్రమును చూసే ఉత్తర ధృవ
దిశను కాస్త కదిలించి, భూభ్రమణమును వేగవంతము
చేయవలెననుకొన్నాడో ఏమో తన అగ్ని రథములో
అంతరిక్షము చేరినాడు. ఆతడు విధాత వరబల సంపన్నుడు. అందుకే భూగోళపు ఇరుసును
కదిలించినాడు. ఇపుడు మనము గుర్తుంచుకోవలసినది ఏమిటంటే భాగవతము వ్రాసిన వ్యాసులవారు
సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో పురాణములు వ్రాసినారు.
అందువల్ల శాస్త్ర సంబంధమైన విమర్శన చేయకుండా లోకిక పరమైన అవగాహన మనకు కలిగించుటకు
చాపచుట్ట అని వ్రాసినారు. అంతరిక్షములో ఎప్పుడైతే భూగ్రహాన్ని కదిపినాడో చుట్టూ
జలమయమైన భూమి సముద్రములచే కల్లోలితమైనది. ఎగసి పడే అలలను గమనించితే చాపను చుట్టే
రీతి మనకు ద్యోతకమౌతుంది. అందుచే ఆ విధముగా వ్రాయబడినది. అనటువంటి కదలిక ఎక్కడలేని
రేడియో ధార్మిక శక్తిని వేలువరించుతుంది. పంది, బొద్దెంక (పరిడె) రేడియో ధార్మిక
శక్తికి చలించనివి. అందువల్ల విష్ణుమూర్తి
వరాహావతారమును ఎత్త వలసి వచ్చింది. ఆయన స్వరూపము కోరలు మన ఊహకు అందనంత గొప్పవి
బలమైనవి. ఆ భూగోళమును ఎత్తినపుడు ఒకకోర పై భూమి బరువు ఎక్కువగా మోయవలసి వచ్చుటచే
భూమినుండి ఒక శకలము వీడి అంతరిక్షములో
భ్రమించనారంభించియుండవచ్చును. అదే మన అంగారక గ్రహము(Mars).
ఇపుడు నే సందేహము తీరియుంటుంది ప్రతాప్.
పెద్దలు ఏమి చెప్పినను పెన్నిధి ఒలేను స్వీకరించుచున్
బుద్ధిగ పండితాళి ఎడ బూనిక తోడుత జేరి నమ్రతన్