దారీ తెన్ను లేనేలేక ఈ
తీరాయెనా ...
Sastry KV: గురువు గారూ తెలుగు రాని తెలుగువాడిగా బాధ కలుగుతోంది.
ఇన్నాళ్లూ నాకు తెలుగు బాగానే వచ్చని, శ్రీమద్భాగవతం, శ్రీ మహా భారతం లలోని పద్యాలను అర్ధం చేసుకుని
ఆస్వాదించగలుగుతున్నానని భావిస్తున్న నాకు ఆ ప్రతిభ నాది కాదని, అంత తేలిక భాషలో రాసిన ఆ మహానుభావులదని తెలుసుకున్నాను.
ధన్యవాదములు. మరి నాలాగ ఎందరో! ఐతే దీనికి పరిష్కారం ఏంటి?
శాస్త్రి వ్రాసిన మాటలలో అంతర్లీనమైన
బాధ కనిపిస్తూ వుంది. ఎందుకో నాకు ఆ మూడు పంక్తులు చదివినందుకే మనసు ద్రవించి నాకు
తోచిన నాలుగు మాటలు వ్రాస్తున్నాను. వాస్తవానికి నేను తెలుగులో poor ఆంధ్రము లో weak . ఈ చిన్న వాక్యములో కూడా రెండు ఆంగ్ల పదాలను వాడవలసి వచ్చింది. అసలు విషయానికి
వస్తే నేను ఏ భాషా ప్రత్యేకముగా చదువలేదు. మల్లెలు కట్టిన దారానికి కూడా మంచివాసన
అబ్బినట్లు నా బాల్యములో నేనున్న వీధిలో గొప్ప పండితులు వుండేవారు. వాళ్ళు ' ఏమిరా బాగున్నావా' అన్నా నాలోపల
ఏదో ఆనందము కలిగేది. బహుశ వారి మేని నంటిన గాలి కాస్త నాకూ సోకిందేమో !
నేను 5 వ తరగతి వరకు పాఠశాలకు పోయిన పాపాన
పోలేదు. ఇంట్లో తల్లిలేని నాకు మా అమ్మమ్మే అమరము త్రికాండలలో ప్రథమ కాండ మాత్రమే, ఆంద్ర నామ సంగ్రహము చదివింప జేసేది. ఆ పునాది తప్పించి నేను ప్రత్యేకముగా ఏ
భాషా చదువలేదు. ఈ రోజు పాండిత్యము లేకపోయినా
నా ఆలోచనలకు అక్షర రూపము కల్పించే సామర్థ్యము వచ్చింది . తెలుగు కాకుండా
ఐదు భాషలు మాట్లాడ గలను. మూడు భాషలు
వ్రాయగలను, నాలుగు భాషలు చదువగలను.
ఆంగ్లములో, హిందీలో అంతో ఇంతో ఎంతో
కొంత కవిత్వము కూడా వ్రాయగలను. దయతో దీనిని స్వోత్కర్షగా భావించవద్దు. అది నా మాతృ
భాష గొప్పదనము. అంతయు పరమేశ్వరానుగ్రహము. నడవడి అన్నింటికీ ముఖ్యము. దానిని
సాధించితే దేనినైనా సాధించవచ్చు.
మన గురుకులాలలో శిక్ష, విద్య అన్న రెండు భాగాలు ఉండేవి. క్రమశిక్షణ కూడా శిక్షలో
ఒక భాగమే ! అసలివి మన దేశీయ విద్యా విధాన రథమునకు రెండు చక్రములు. T.B. మెకాలే ఇదేవిషయమే తన నివేదికలో బ్రిటీషు పార్లమెంటుకు
నివేదించినాడు. శిక్ష, విద్య, గురుకులాలను నిర్మూలించి ఆంగ్లపాఠశాలాలను ఏర్పాటు
చేయించుటలో కృతకృత్యుడైనాడు. వారికి తోడు నీడై , విలియం బెంటింక్ కు అంతే వాసియై మన రాజారామమోహన్ రాయ్ గారు కూడా నిలిచినారని
చదివియుండినాను. అటువంటి వారి యనుగ్రహముతో మన భాషకు తల్లియైన సంస్కృతాన్ని ఆనాడు , మనతల్లియైన తెలుగును ఈనాడు సజీవ సమాధి చేసి చేతులు
దులుపుకోన్నాము. ఈకాలము పిల్లలకు daddy కి good
morning చెప్పు. Aunty కి taataa చెప్పు. One, two, three చెప్పు ఉదయము
లేస్తూనే చెప్పించేవి ఇవి. ఇందులో 'చెప్పు'లు తప్ప మిగిలిన
దానిలో ఎంత తెలుగు వుందో చెప్పేవారికే తెలియాలి. మనము విచక్షణా రహితులమై ఎంత భావదాస్యానికి
లోనవుతూవున్నామో చూడండి. United States and UK are developed countries అని మనము వినియుంటాము. Past participle అయిన developed తీసుకొన్నప్పుడు, వాని ఎదుగుదల, కారణాంతరములచే
నిలిచి పోబడిన దేశములుగా భావించవలసి వస్తుంది. Put పుట్ అయితే but బట్ ఎందుకయ్యింది. నైఫ్ అని ఆంగ్లములో వ్రాస్తే knife వ్రాయవలె. మరి k ఎందుకో ! మాత, పిత శబ్దములనుండి పుట్టినవే వారి Mother, Father.
Daughter, Brother మొదలయిన పదములు కూడా సంస్కృత
జన్యములే! ఇటువంటివి ఆ భాషలో కోకొల్లలు.
దక్షిణాది భాషలకు ద్రావిడ శబ్దము
తగిలించుటే కృతకముు. ఆదికవి అని కొనియాడబడుచున్న నన్నయ, ‘కవి బ్రహ్మ’ తిక్కన, ‘ప్రబంధ
పరమేశ్వరు’డగు ఎర్రన ‘కవి సార్వభౌము’డను బిరుదు గాంచిన బృహత్ పండిత కవికుల తిలకుడు
శ్రీనాథుడు, ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అల్లసాని పెద్దన, ధూర్జటి, 'సాహితీ సమరాంగణ సార్వభౌమ' బిరుదాంకితుడు శ్రీకృష్ణదేవరాయలు
ఆంధ్రమును నెత్తికెత్తుకొన్నారు. శ్రీనాథుడు, కృష్ణరాయలు తమ పాండితీ ప్రకర్షచే
ఏకంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనియె అన్నారు. ఈ భాష తల్లి ‘సంస్కృతము’ అని
కూడా చెప్పినారు. తక్కొరులెవ్వరూ తెలుగు ద్రావిడ భాషా జన్యము అని అనలేదు. వారిమాటా
మనకు గీటురాయి, లేక ‘కాల్డువెల్లు’ మాటా! వారికంటే పండితుడా ‘కాల్డువెల్లు’ ? ‘భాషా
శాస్త్రము’ (Linguistics) స్వర లేక ధ్వని శాస్త్రము(Phonetics)
తెలియని వారు కాదు మన పూర్వులు. వేదములు సంపూర్ణముగా ధ్వనిమయములు. అందుకే వానిని
ఎన్నో లక్షల సంవత్సరములు ధ్వని రూపములోనే ఉంచినారు, కానీ లిపి తెలియక కాదు.
ప్రపంచభాష ఏదయినా సంస్కృత జన్యమేనని చంద్రశేఖరయతీంద్రులవారి
మాట. వారి పాండిత్యము అపారము. వారొక అనర్ఘ రత్నము. మరిమనము వారిని నమ్మము. తన
మాతృభాష యైన తమిళము కూడా సంస్కృతజన్యమేనని నొక్కి వక్కాణించిన మహనీయులు వారు.
వారికి స్వపర భేదములుండవుగదా! మనకు క్రిస్టియన్మిషనరీకి చెందిన ‘కాల్డ్వెల్’ మాట
శిరౌధార్యము. ఆతడు కేవలము క్రైస్తవము ప్రాకజేయుటకు సృష్టించిన పదమది. ఆర్య ద్రావిడ
సృష్టి చేసిన వారిలో వారు ప్రముఖులు. చెన్నపట్టణమునకు సెయింట్ థామస్ వచ్చినాడన్న
కల్పిత గాధను సృష్టించి, అకుంఠితమైన భారత
దేశమునుండి, తమిళులను, ద్రావిడ భాషలన్న పేరుతో దక్షిణాది భాషలను ,వానిని మాతృభాషలుగా గల్గిన దాక్షిణాత్యులను విభజించి
పుణ్యము మూట కట్టుకొన్నారు. పొరుగింటి పుల్లగూర ఎట్లయినా రుచి ఎక్కువ కదా ! వారి భావానువర్తులై దేవనాయగం వంటి అవకాశవాదులు 1969 లో క్రైస్తవము పుచ్చుకొని అసలు మన సనాతన ధర్మమే అబద్ధాల
పుట్ట అనీ, తిరువళ్వారు సెయింట్ థామస్ వద్ద
క్రైస్తవ తీర్థము పుచ్చుకోన్నాడని 'Was Tiruvalluvar A Christian' అన్న పుస్తకము రచించి పుణ్యము కట్టుకొన్నాడు. ఈ పుస్తకాన్ని
ఏకంగా నాటి DMK ముఖ్యమంత్రిగారే ఆవిష్కరించినారు. ఈ విధముగా ఒకటిగా వున్న గొలుసు
లంకెలను త్రుంచి మనలను విభజించి, ఒకవేళ మతము
మార్చలేకున్నా, మనలను తమ మతమునకు దగ్గరజేసుకొన్నారు.
ఈ విడ్డూర, విపరీత, విపత్కర పరిణామాలకు మూలము క్రైస్తవ మతవ్యాప్తికి వచ్చిన ‘కాల్డువెల్లే’
‘కారణభూతుడు’. సంస్కృతమును నిరసించిన ‘కరుణానిధి’ పేరు సంస్కృతము లోనే వున్నది.
అతని బిరుదు ‘కలైజ్ఞర్’ అన్నది సంస్కృత నామము. (కలై=కళ; జ్ఞ=క్షుణ్ణముగా
తెలిసినవాడు, రెండూ సంస్కృత పదాలే!) వారి పార్టీ (DMK) చిహ్నము ‘ఉదయ సూరియన్’ (ఉదయ
సూర్యుడు సంస్కృత పదమే!). తమిళులు వాడే ‘అపరము’ (తరువాత, మళ్ళీ అని అర్థము) ‘సంస్కృత
పదమే!
నేడు మన పరిస్థితి ఏమిటంటే మన భాష పై
మనకు గౌరవము లేదు, మన ధర్మము
గొప్పదనమేమిటో మనకు తెలియదు. మన సంస్కృతి మనకందుబాటులో లేదు. కారణం మనకు తెలుగు
రాదు. మనకు వేములవాడ భీమన లోని ఉద్దండ లీల, నన్నయలోని
ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలోని ఔచిత్య భావ పదబంధం, ఎర్రాప్రెగ్గడలోని
ఉక్తి వైచిత్రి శ్రీనాథుని
సీసపద్యములు, పోతన అనుప్రాసాయుతమైన అద్భుత కవితా
శైలి,
నాచన సోముని నవీన గుణ తత్వము అన్నీ ఈనాడు గాలికి ఎగిరిపోయిన
ఎండుటాకులే. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ వ్యూహం మనకు పరబ్రహ్మ పదార్థమే ! తెలుగంటే ఏమిటో
తెలియని తెలుగుజాతికి వారసులము మనము.
మరి ఇప్పుడు మన కర్తవ్యమేమిటి?
కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును
ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు
మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా
అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా అర్థం
చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం
కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక సంపదకి దూరం కావటమే. పునాది లేని భవనము అంటే
కేవలము రాళ్ళు సున్నమే అన్నది గ్రహించగలిగితే తెలుగునకు ఒక 100 సంవత్సరాల పిమ్మటనైనా తెలుగునకు పునర్వైభవము తేగలుగుతామేమో
!
అసలు తెలుగుకు ఉన్నంత అక్షర సంపద ఏ
నాగరిక భాషకూ లేదు. ఒక్క తెలుగు వస్తే ఏ భాషనయినా నేర్చుకోవచ్చు. ఈ విషయములను
రాహుల్ సాంకృత్సాయన్, పుట్టపర్తి నారాయణాచార్యులు మొదలగు మహనీయులు సహేతుకముగా
నిరూపించినారు.
ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ
ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ
అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల
కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా?తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే
మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది.
అందుకే 'తెనుగు తేనె ఊట తేటరా గమనించు రామమోహనుక్తి రమ్య సూక్తి' అని వ్రాసుకొన్నాను.
మనము ఇకనైనా కళ్ళు తెరిచి పిల్లలను
క్రెచ్చి,
ప్రీకేజీ, ఎల్కేజీ, యుకేజీ, అనిచదివించకుండా
ఓపికతో లేక ఓపికచేసుకొని తల్లిదండ్రులు 'అమరము' 'ఆంధ్రనామ సంగ్రహము' నేర్పించితే
ఒకఏడాది తరువాత మెల్లమెల్లగా చిన్నచిన్నశతకాలు, రుక్మిణీకల్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాద
చరిత్రము,
విదురనీతి వంటి ఘట్టాలు నేర్పించితే వారు ప్రపంచములోనిఏ
భాషనైనా నేర్వగలరు.
స్వస్తి.
Sanjeev Rao
Maanyulu maha
adbhutamgaa vivarinchaaru...
· Reply
· 6y
Sadanandeeswaraiah
Vallamkondu
'Chaalaa baaga
chepparu
Ramu garu.
Cheppagalagadam bhagavanthudu prasadenchina varam
Swayam krushi kuuda vumdi.
· Reply
· 6y
Jyothiprakasan
Sambasivapillai
Chakkati vishleshana.
Telugu baasha Ku tegulu patti konni
dasaabdhamulayinavi. Mana paalakulu vaaduka vaakhyamulane graandhikamu
chesinaaru. Assemblies LA lo baasanu tilakisthunnamuga. Maa chinnapuudu
Peddabaalasiksha chadivinchaaru kaani mana maata yevaru pattinchukonaru.